జీవితం అనేది
అనుభూతుల పుష్పగుచ్చం.
రోజు మారితే పువ్వులు వాడినట్లు
అనుభూతులు వాడిపోతే
మనం నిత్యం మరణిచినట్లే!!
అందుకే నిత్యనూతనంగా
అనుభూతులను ప్రోది చేసుకుంటూ
వాడని వసంతరాగం ఆలపిస్తూ
ఆనందంగా..గడిపేయడం నాకు ఇష్టం.
ఈ చిన్ని జీవితంలో
మనకంటూ..ఒక ముద్ర
మనమే వేసుకుని
ఉత్తేజంగా బ్రతికేద్దాం బ్రతికిద్దాం
ఇదే నేను మనసా తలపోసేది
వాచా వ్యక్తీకరించేది
కర్మణా ఆచరించి చూపేది ఇదే ఇదే..!! ఇలాగే!!!
బ్లాగ్ లోకంలోకి..
కొత్తగా అడుగిడి
వనజవనమాలి


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి