1, మే 2017, సోమవారం

మామూలేగా ...

మామూలేగా ...
ఉదారవాద ప్రదర్శన పై
మనుషులకెందుకో వ్యామోహం
క్షణానికో సారి చచ్చి మరుక్షణమే
మళ్ళీ పుడుతుండగా
నడకలోనూ నడతలోనూ నటనే
జీవితమంతా రంగులరాట్నమే
అని వక్కాణిస్తూ..
ఎవరిదో ఒక పాదం క్రింద
ఆలోచనలని అణగద్రొక్కడం
జీవితం ఖల్లాస్ అనుకోవడం
మామూలేగా ..