9, మే 2014, శుక్రవారం

ఈ నెల "భూమిక" లో నా కథ

మితృలకి నమస్కారం  అందరూ బావున్నారా ?

వ్రాయాలన్న ఉత్సాహం తగ్గిపోయింది , వ్రాయడమంటే  విముఖత కల్గింది  అలాంటి తరుణంలో  నాకు కొంత ఉత్సాహాన్ని పెంచుతూ .... నేను వ్రాసిన కథ "భూమిక" స్త్రీ వాద పత్రికలో ప్రచురితమైనది.
ఈ కథ అచ్చంగా స్త్రీ వాద కథే అనుకోకండి . స్త్రీల  శ్రమ శక్తి ని దోచుకుంటూ,  మనః శరీరాన్ని యదేచ్చగా వాడుకుంటూ ఆర్ధికంగా  కూడా  మోసగించి  పరారై పోయే పురుషుల కథకి  ఈ కథ ఒక తార్కాణం. అయితే అన్ని కాలాలు ఒకేలా ఉండవు . స్త్రీలకి చైతన్యం వస్తుంది  ఆ చైతన్యమే ఈ కథ ..

ఆ కథ ని చదివి మీ సూచనలు,సలహాలు అందించ మనవి .

ఆ కథ ని ఈ లింక్ లో చూడవచ్చు


1, మే 2014, గురువారం

మధుర భక్తి


"నేను" అన్న అహం నశించి నేనొక వెదురు బొంగునయ్యాను......
వనమాలీ... నీ పెదవుల వేణువునయ్యాను
అందరూ నేను పాడుతున్నాననుకుంటున్నారు కానీ నేనొక వాహికని మాత్రమే!
మురళీ మోహనా ! నా నుండి నీ మధురగానం సాగుతూ  ఎల్లెడలా దైవత్వం నిండుకుంటుంది నీ ఉనికిని చాటుతూ ....
                    ఓషో కథలు స్పూర్తితో ..