తెలుగు కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మార్చి 2023, శనివారం

దృశ్య భూతం

దృశ్య భూతం _వనజ తాతినేని


ఉయ్యాల బల్లపై కూర్చుని  మొబైల్ ఫోన్ తో తీసిన చిత్రాలను చూసుకుంటూ.. ఆహా ఏమి రంగులు ఎంత సౌందర్యం. మంచు తెరలు మధ్య విలాసంగా తలలూపే విరిసి విరియని తులిప్స్ రంగు రంగులలో విరిసిన క్రోకస్ లు డెఫోడిల్స్ తో బేక్ యార్డ్ కళ కళ లాడిపోతుంది. ఈ పూల రంగులను చూస్తూ ఆకలి దప్పికలు  మరచిపోవచ్చు… అని నేను సౌందర్య లాలసలో మునిగిపోతున్న వేళ.. డోర్ తెరుచుకుని నాయనమ్మ నాయనమ్మ అంటూ నా దగ్గరకు వచ్చింది మనుమరాలు. రావడం రావడంతోటే  నా చేతిలో వున్న ఫోన్ ని అధికారంగా లాక్కుని యూ ట్యూబ్ ఓపెన్ చేసి బొటనవేలితో వేగంగా స్క్రోల్ చేస్తుంది. వెంటనే నేను లోపలికి వెళ్ళి బొమ్మల పుస్తకం తీసుకువచ్చి.. ఉయ్యాల బల్లపై కూర్చుని పేజీ తెరిచి అనగనగా..అనగనగా అనగానే ఫోన్ నా పక్కన పడేసి ఒళ్ళో కెక్కి కూర్చుంది. నేను నవ్వుకుని ఫోన్ దాచేసి పుస్తకం మనుమరాలి చేతికిచ్చి ఆలోచనలో పడ్డాను. ఈ తరం పిల్లలు పుస్తకాలు చదువుతారా.. !? నేనే చదవడం లేదు.


ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఓటిటి లు జీవితంలో ఒక భాగంగా మారాక వాటికి దూరంగా బతకడం చాలా కష్టమనిపిస్తుంది.  ఇటీవలకాలంలో అప్పుడప్పుడు వాటిని రహస్యంగా చూడాల్సివస్తుంది.  దీనినే చిత్తచాపల్యం అంటారు కాబోలు అనుకుంటూ పెద్దగా నవ్వుకున్నాను. వీటన్నింటికి కారణం నా మనమరాలు.


 మనుమరాలు కోవిడ్ ప్రారంభంలో పుట్టింది. ఆ కోవిడ్ పుణ్యమా అని  తనకు రెండేళ్ళు నిండుతున్నా ఇరుగుపొరుగు సంబంధమే లేకపోయింది. ప్రతి యిల్లు తాళాలు లేని జైలు వార్డును తలపిస్తుంది. ఇక పాపకు స్నేహితులెవరిని పరిచయం చేయాలి. పెద్దవారి ముద్దు మురిపాలు వెగటు కొట్టి తెరపై కదిలే బొమ్మలను చూస్తూ మైమరచిపోతుంది. మూడు పూటలా ఆమ్ తినేటప్పుడు మొదలైన రైమ్స్ పర్వం నిద్రపోయాక కానీ తెరిపివ్వడం లేదు. చిన్ను పప్పు జె జె రైనీ బింగో డోరా వీరంతా పాపకు స్నేహితులై పోయాక ఇంటిల్లిపాదికి స్నేహితులవక తప్పలేదు. ప్రపంచ సమాచారం కోసం ఛానల్ మార్చామా గే బీ..కేకల పర్వమే!


 అయితే  రెండేళ్ళు కూడా నిండని పసిపాప చాలా చురుకైనది. సంవత్సరంన్నర వచ్చేసరికే అమ్మ ఫోన్ నాన్న ఫోన్ లతోపాటు ఇంట్లో వున్న అందరి మొబైల్ ఫోన్ లను చేతిలోకి తీసుకొంటుంది. ఇవ్వకపోతే ఏడ్చి రాగాలు తీసి పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తుదకు ఫోన్ చేజిక్కించుకుని విజయదరహాసం ఒలికిస్తూ టకటకామని పాస్ వర్డ్ ని నొక్కి ఫోన్ ఓపెన్ చేయడం యూ ట్యూబ్ ఆప్ ని  తెరిచి తనకిష్టమైన రైమ్స్ ని సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఆనందించడం. అవి నచ్చకపోతే ఫోటో గేలరీ లోకి వెళ్ళి ఫోటోలు చూసుకోవడం అనేది కరతలామలకం  అయిపోయింది. మొదటసారి అలా చేయడాన్ని ఇంట్లో అందరితో పాటు నేనూ చూసి ఒకింత ఆశ్చర్యచకితరాల్ని అయిపోయాను. ఈ తరం పిల్లలు పుట్టుకతోనే టెక్నాలజీ నేర్చుకుని దానికి బానిసలై పోతున్నారనిపించింది. 


ఇలా ఏమాత్రం మంచిది కాదని అందరం కలసి మాట్లాడుకుని మొబైల్ ఫోన్స్ పాస్వర్డ్ మార్చేసి టివి పెట్టడం తగ్గించేసాం. నేనైతే పసిదాన్ని చలి మంచు వాన లేని సమయాలు చూసుకుని ఆరుబయలు ను పరిచయం చేస్తూ తన విభ్రమఆశ్చర్య ఆనందాలను చూస్తూ మురిసి పోతున్నాను.అలా బయట తిప్పినంతసేపూ తిప్పి లోపలికి రాగానే టివి రిమోట్ కోసం వెతుక్కొంటుంది పాప. నాయనమ్మ టివి టివి అంటూ కాళ్ళకు చుట్టుకుంటుంది.ఏదో మాయ మాటలు చెప్పి దృష్టి మరల్చి బొమ్మల ముందు కూర్చోబెట్టడానికి దశాబ్దాల అనుభవం సరిపోవటంలేదు కదే కుంకా అని మురిపెంగా హత్తుకోవడం.. చంకనేసుకుని గోరు ముద్దలు తినిపించడం   రైమ్స్ నే కథలుగా మార్చి  చెబుతూ నిద్ర పుచ్చడంలో బాగానే  ఆరితేరాననుకుంటున్నాను కానీ.. లోలోపల ఓ భూతం గురించి భయంగానే వుంది. దాని పేరు గాడ్జెట్స్ భూతం.నా మనుమరాలనే కాదు ఏ ఇంట్లో పిల్లలను చూసినా నా మనుమరాలి లాగే వున్నారని వారి వారి ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చెపుతుంటే ఆ భయం కొండలా పెరిగిపోతుంది కొండచిలువలా చుట్టేస్తుంది. ఆ భూతం ప్రతి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో వున్న మూడొంతుల మందిని  పట్టి పీడిస్తుంది. సోమరిపోతుల్లా మారిపోయి రోగగ్రస్త శరీరాలతో అతి తెలివితో వికృత ఆలోచనలతో పిచ్చి గంతులతో వెర్రిపుట్టిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఏవేవో భయాలు మనసును నిలకడగా వుండనీయడంలేదు. ప్రక్కనే పడుకుని అమాయకంగా నిద్రిస్తున్న మనుమరాలి ముఖంలోకి చూస్తూ వుంటే అంతే అమాయకత్వం నిండిన అరుణ్ గుర్తుకు వచ్చాడు. 


ఎందుకో ఈ మధ్య పదే పదే ఆ పిల్లవాడే గుర్తుకొస్తున్నాడు అనుకుంటూ నాలుగు నెలల గతంలోకి వెళ్ళాను.  


*********

కొన్ని నెలల క్రితం ఇండియాలో అమ్మాయింట్లో వున్నప్పుడు ఒక ఐదారేళ్ళ పిల్లవాడి తండ్రి ఆదివారం పూట అమ్మాయితో మాట్లాడానికి వచ్చేవాడు. అది చూసి నాకు  చిరాకు వచ్చి..


“హాస్పిటల్ లో విన్నది చాల్లేదా ఇంటికి కూడా రావడానికి పర్మిషన్ ఇస్తున్నావ్,  అతను మరీ నిద్రమంచాలు దిగి కాఫీ కూడా తాగకముందే గుమ్మం ముందు ప్రత్యక్షం అవుతున్నాడు”అని విసుక్కుంటే.. “ఆ బాబు ది ఓ ప్రత్యేకమైన కేసు లే అమ్మా! ఆ తల్లి తండ్రి బాధ చూడలేక నేనే ఇంటికి రండి మాట్లాడదాం అని చెప్పాను. విసుక్కోకుండా నాకూ అతనికి కూడా కాఫీ తీసుకుని రా”.. అని చెప్పి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళింది కరుణ. 


తన భర్త కూతురికి కరుణ అన్న పేరు ఎందుకు పెట్టారో కానీ పేరుకు తగ్గట్టు మానవ సహజమైన జాలి సానుభూతి ప్రేమ స్థాయిని దాటి అందరి యెడల  కరుణ ను మాత్రమే కురిపిస్తూవుంటుంది. తన మనస్తత్వానికి తగినట్లు పీడియాట్రిక్స్  చేసింది.  కొన్నేళ్ళుగా కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తుంది. 


ఫిల్టర్ లో డికాషన్ కి వేసి పాలు గిన్నెలో పోస్తూ యదాలాపంగా హాల్లో కూర్చునివున్న వారిరువురి సంభాషణ వింటున్నాను.


“కూర్చోండి. బాబు ఎలా వున్నాడు? ఇక్కడికి తీసుకురావాల్సింది. మా పిల్లలతో కలసి ఆడుకునేవాడు”


“ తీసుకురావాలనే అనుకున్నాను. కానీ మీరేమి అనుకుంటారోనని ఆగిపోయాను మేడమ్”


“పర్వాలేదు తీసుకురండి, పిల్లలతో కలిస్తే ఆ జఢత్వం మొండితనం అన్నీ పోతాయి. మందులు వేయకూడదు.అసలు మందులేవీ అవసరంలేని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీ భార్యాభర్తలిరువురు ఓపికగా మరింత ప్రేమగా అవసరమైనపుడు కాస్త కఠినంగా వుంటే చాలు. మీ అబ్బాయి అందరి పిల్లలు లాగానే వుంటాడు.”


“మీరు ఇలా చెబుతుంటే చాలా ధైర్యంగా వుంటుందండీ.. కానీ ఇంట్లో కళ్ళెదురుగా బాబును చూస్తుంటే దిగులు ముంచుకొస్తుంది. నిన్న సాయంత్రం నేను బజారుకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని టివి చూస్తున్నాడండీ. నా భార్య వంటింట్లో పని చేసుకుంటుంది. నేను వాడిని ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. అసలు బాహ్య సృహ కూడా లేదు. నోట్లో వేలు, పెదాల చివరినుండి ధారగా కారిపోతున్న సొంగ. కోపంతో గట్టిగా అరిచాను.ఉలికిపడి గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. సోఫా తడిపేసాడు. నా భార్య కంగారుగా హాల్లోకి వచ్చింది. వాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. అరగంటకు కానీ ఏడుపు ఆపలేదు. తర్వాత నేను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా నా దగ్గరకు రాలేదు. ఇంట్లో ఫోన్ లు లాప్ టాప్ లు వాడికి కనబడకుండా చేయాలంటే కష్టంగా వుంది. ఒక బెడ్ రూమ్ లో వాటిని వుంచి మరొక బెడ్ రూమ్ లోనూ.. హాల్లోనూ వాడిని తిప్పుతున్నాం. వంతులు వారిగా ఒకరు వర్క్ చేస్తుంటే మరొకరు వాడిని అటెండ్ అవుతూ పెంచుతున్నాం. తల ప్రాణం తోకకు వస్తుందంటే నమ్మండి.” వేదన వినబడుతుంది అతని స్వరంలో. 


“కొన్నాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు జాబ్ మానేయండి. పిల్లవాడి కన్నా ఎక్కువ కాదు కదా జాబ్” అంది కరుణ. 


నేను కాఫీ తీసుకువెళ్ళి అతనికి కరుణ కి ఇచ్చి..” మా కరుణ కు హాస్పిటల్ కు వెళ్ళకపోతే వీలవదు కాబట్టి మా అల్లుడే జాబ్ మానేసి పిల్లలను పెంచుకున్నాడు.అలా ఒక ఏడు రెండేళ్ళు కూడా కాదు ఏకంగా ఎనిమిదేళ్ళపాటు. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా పెరగాలంటే ఆ మాత్రం శ్రద్ధ తప్పదు. ఇదేమైనా వెనకటి కాలమా.. ఎలాగోలా పెరుగుతారు అనుకోవటానికి” అన్నాను నేను. ఈ విషయాలన్నీ మాట్లాడతావెందుకమ్మా అన్నట్లు వారింపుగా చూసింది కరుణ. 


“పెళ్ళయ్యేటప్పటికి ఇద్దరం బెంగుళూరులో సాప్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నామండీ, ఇంటి అద్దెలకు సంపాదనలో నాలుగవ వంతు ఖర్చు అవుతుందని ఆలోచించి రెండు జీతాలున్నాయి కదా అనే దైర్యంతో గేటెడ్ కమ్యూనిటీ లో విల్లా హౌస్ తీసుకున్నాం. ఒక సంవత్సరానికి తల్లితండ్రి అయ్యాం.ఇఎమ్ఐ లు కట్టాలంటే జాబ్ మానేయడం కుదరదు. మా అమ్మ నాన్నలకు పాడి వ్యవసాయం. వాళ్ళు పదిరోజులు కూడా మా దగ్గర వుండటానికి వీలుకాదు. ఇక మా అత్త గారు వచ్చి సాయంగా రెండేళ్ళు వున్నారన్న మాటే కానీ ఆమె వల్లనే బాబు ఇలా తయారయ్యాడు. ఆమెకు మోకాళ్ళ నొప్పి ఆయాసం వల్ల వాడిని సరిగ్గా పెంచలేక  వాడి వెంటబడి తిరగలేక మొబైల్ లోనూ ఐ పాడ్ ల లోనూ రైమ్స్ చూపిస్తూ వాటిని  బాగా అలవాటు చేసారు. మేము ఫోన్ లాక్కుంటే ఏడ్చి గీ పెట్టేవాడు. స్కూల్ కి వెళితే వాడే మానేస్తాడులే..అని నేను నా భార్య కూడా చూసి చూడనట్టు వుండిపోయే వారిమి. 

 ప్లే స్కూల్  కు వెళ్ళినా ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ ఐ పాడ్ కావాలనే పేచీ పెడతాడు. ఇవ్వకపోతే అన్నం తినడూ పాలు తాగడూ.. ఇదొక నరకం అనుకోండి”


“మీ అబ్బాయి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యాడు.మీరు ఒకేసారి వాటిని దూరం చేయడానికి ప్రయత్నించకూడదు.నిదానంగా తగ్గించుకుంటూ రావాలి. ఉదయం సాయంత్రం రోజూ ఆడుకోవడానికి ఇక్కడికి తీసుకురండి. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే క్రమేపి అవన్నీ తగ్గుతాయి” అని లేచి నిలబడింది కరుణ. టైమ్ సెన్స్ తెలుసుకున్న అతనూ లేచి నిలబడి.. థాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాడు.


అతను వెళ్ళాక  కరుణతో అన్నాను. ప్రతి ఇంట్లోనూ ఇదే సమస్య. పసిపాప నుండి ముదుసలి వారి వరకూ.. తెరపై తలదూర్చడమే. ఏదో కాసేపు కూసేపో అయితే అనుకోవచ్చు..పొద్దు పొడిచింది మొదలు వేగు చుక్క కనబడే వరకూ ఆ హస్త భూషణం వదిలితే కదా! ఆరోగ్యాలు మానసిక ఆరోగ్యాలు పాడవుతుంది ఇందుకు కాదూ” అన్నాను. 


“మానవజాతే కంట్రోల్ తప్పిపోతుంది. ఉన్నంతలో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా.టెక్నాలజీ పదునంచు కత్తి.అది ఎవరినైనా గాయపరుస్తుంది తప్పదు” అంటూ తన మొబైల్ లో ఏదో చూస్తున్న కూతురు గ్రీష్మను సున్నితంగా మందలించి ఆడుకోవడానికి క్రిందకు పంపింది కరుణ. 


మరొక ఆదివారం వచ్చేసరికి ప్రొద్దుటే మళ్ళీ అరుణ్ అనే పిల్లవాడి తండ్రి నుండి కాల్. ఈ రోజు బాబును తీసుకుని నేను నా భార్య కూడా రావాలనుకుంటున్నామండీ.. రావచ్చా.. అని రిక్వెస్ట్. 


ఫ్యామిలీ అంతా కలిసి అత్త గారింటికి బయలుదేరబోతున్న కరుణ వెళ్ళకుండా ఆగిపోయి భర్తను పిల్లలనూ పంపాలనుకుంది. సాయంత్రం రమ్మనకూడదూ,బయలుదేరి ఆగిపోవడం ఎందుకు అంటే.. అల్లుడు జోక్యం చేసుకుని “పర్వాలేదు లెండి. ఆ పిల్లవాడి పేరెంట్స్ వర్రీ గా వున్నారు. వాళ్ళను రానివ్వండి. ఆ పిల్లాడు కూడా మన పిల్లలతో కాసేపు ఆడుకుంటాడు” అని పిల్లలను తీసుకుని క్రిందకు వెళ్ళిపోయాడు.  అల్లుడు అర్థం చేసుకునే తత్వం కలవాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎన్ని గొడవలు వచ్చేవి భార్యాభర్తల మధ్య ఇగోల సమస్యలు వచ్చివుండేవి అనుకున్నాను స్వగతంలో. 


అరగంట తర్వాత ఆ పిల్లవాడు అరుణ్ అతని తల్లిదండ్రులు వచ్చారు. వారికి తాగడానికి నీళ్ళు యిస్తూ అరుణ్ ని చూసాను. ముద్దుగా పాలుకారే బుగ్గలు ఉంగరాల జుట్టుతో బెరుకు బెరుకుగా చూస్తూ తల్లిని కరిచి పెట్టుకుని వున్నాడు. కరుణ  గ్లౌస్ మాస్క్ ధరించి వచ్చి అరుణ్ ని చూస్తూ చాక్లెట్ ఇస్తాను రమ్మని పిలిచింది. తల్లిని మరింత హత్తుకుని పోయి ఆమె దుప్పటాలో ముఖం దాచుకున్నాడు.  కరుణ అరుణ్ తండ్రి వంక చూసి.. “మా పిల్లలు మిగతా ప్లాట్ లలో వున్న పిల్లలందరూ క్రింద ఆడుకుంటున్నారు. మీరు కూడా అరుణ్ ని తీసుకువెళ్ళి వారిని చూపించండి. పిల్లలతో కలుస్తాడేమో చూద్దాం” అని అంది.


అలాగే మేడమ్! అంటూ భార్య ముఖంలోకి చూసి ఏదో సంజ్ఞ చేసి అరుణ్ ని తీసుకుని క్రిందకు వెళ్ళాడతను. 


“మీరు అనవసర భయాలు పెట్టుకోకండి.. అన్నీ మెల్లగా సర్దుకుంటాయి” అంది అరుణ్ తల్లితో. ఆ మాత్రం అనునయానికే ఆ తల్లి కళ్ళు చెరువులయ్యాయి.


“అసలు మా బిడ్డను సరిగ్గా పెంచగలమా అని భయం వేస్తుంది డాక్టర్. అసలు నాకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అస్తమానం  నోట్లో వేలు కాళ్ళ మధ్య చేయి పెట్టుకుంటాడు. మనం తీసేసినా మళ్ళీ వెంటనే అదే పని చేస్తాడు.ఆ అలవాటు మాన్పలేక పోతున్నాను” అంది నిసృహగా. 


“అదేమంత పెద్ద విషయం కాదు. పిల్లల్లో  లైంగిక ఆసక్తి పసితనం నుండే మొదలవుతుంది. మరికొన్ని అసంకల్పిత చర్యలు జీన్స్ నుండి సంక్రమిస్తాయి.మా అబ్బాయి చరణ్ కూడా ఆడవారిని చూడగానే చేయి రెండు కాళ్ళ మధ్య పెట్టుకుంటాడు.అది నాభర్త నుంచి వచ్చింది.  అతనికి అతని తండ్రి నుండి వచ్చిన అనువంశిక లక్షణం. మనమేమి చేయలేం. సభ్యత కాదని తెలిసినపుడు వాళ్ళంతట వాళ్ళే కంట్రోలు చేసుకుంటారు అని విపులీకరించి చెప్పింది కరుణ. 


“ఇదంతా.. మీ అమ్మ చేసింది.. నా బుజ్జి బంగారమే అంటూ.. వాడి బెల్లం పట్టుకుని ముద్దు చేసేది.అప్పుడే నేర్చుకున్నాడు వాడు అని షంట్ తున్నారు మా వారు.  రెండేళ్ళు మాతోనే వుంది అమ్మ. తర్వాత నాన్నకు అనారోగ్యంగా వుందని ఇక పిల్లాడ్ని ఎలాగోలా మీరే పెంచుకోండి అని  అమ్మ వెళ్ళిపోయింతర్వాత బాబు సంరక్షణ కొరకు మా వారికి అక్క  వరుసయ్యే ఆమెను తీసుకొచ్చుకున్నాం. ఆమె పేరు నాగమణి. భర్త చనిపోయి తిండి బట్టా లోటుతో  ఒంటరిగా బ్రతుకీదుతూ వుంది ఆమెకు ఆధారం కల్పించినట్టు వుంటుంది అని బెంగుళూరు తీసుకొచ్చాం. అడగకుండానే నెలకు పదివేలు ఆమె అకౌంట్ లో వేసేసే వారిమి. ఆమె కూడా ఇంటి పని వంట పని బాబు సంరక్షణ అన్నీ బాగా చూసుకునేది. కానీ తను పని చేసుకునేటపుడు బాబుకు మొబైల్ ఫోన్ ఇవ్వడం టివి పెట్టి వదిలేయడం చేసేది. మేమిద్దరం ఉదయం ఎనిమిదిన్నరకు ఇల్లొదిలి ఆఫీస్ కు వెళితే.. తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడు గంటలయ్యేది. మా ఇరువురికి ఓపికలు లేక గంటో రెండు గంటలో ముద్దుచేసి ఆమెకు ఇచ్చేసేవారిమి. బాబు కూడా ఆమెకు బాగా మాలిమి అవుతున్నాడని మనసులో కలుక్కుమన్నా కనబడకుండా సరిపెట్టుకునేదాన్ని.బాబు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నాడు అది చాల్లే అనుకుని సంతృప్తి పడేదాన్ని.నాలుగవ సంవత్సరం వచ్చాక ప్లే స్కూల్ కి వెళ్ళివస్తున్నాడు ఇక  స్కూల్ లో జాయిన్ చేద్దాం అనుకుంటూ వుండగా.. కోవిడ్-19 మొదలైంది. మొదటి వేవ్ లోనే ఆమెకు మాకు కోవిడ్ సోకింది. ట్రీట్మెంట్ కు కూడా బాగా ఖర్చైంది కూడా. ఆమెకు  నెగిటివ్ వచ్చిన తర్వాత ఇక ఉండలేనంటూ ఊరికి వెళ్ళిపోయింది. అప్పటినుండి మాకు కష్టాలు మొదలయ్యాయి. లాక్ డవున్  వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ చేసుకుంటూ ఇద్దరం కలసి పిల్లాడిని పెంచడానికి అవస్థపడి పోతున్నాం. పాలు త్రాగడు అన్నం తినడు.నిద్రపోడు. రైమ్స్ చూస్తూ వున్నప్పుడు మాయ చేసి నోట్లో కుక్కడమే. ఇక రాత్రుళ్ళు నిద్రపోడు. అత్త అత్త అంటూ ఆమె వున్న గది వైపు చేయి చూపుతాడు. ఆమె మీద బెంగతో చిక్కిపోతున్నాడని మళ్ళీ రమ్మని పిలిచాం. ఇంకో రెండు వేలు ఎక్కువ ఇస్తామని అన్నాం కూడా. కానీ ఆమె రాలేదు. ఆమె వల్ల వచ్చిన పర్యవసానం మాత్రం ఇంతా అంతా కాదు.బాబును గాడ్జెట్స్ కి అలవాటు చేయడంతో పాటు ఆమె వికృత ఆనందానికి బాబును బలి చేసిందని ఆలస్యంగా అర్థమైంది. చెప్పాలంటే నాకు సిగ్గుగా వుంది మేడమ్ అని చెప్పడానికి విరామం తీసుకుంది. అవతల గదిలో కూర్చుని వింటున్న నేను ఉలికిపడ్డాను. నాలుగేళ్ళ పసివాడిని ఏమి చూసి వుంటుందో అని గుండె గుబగుబలాడింది కూడా. 


కరుణ మాట్లాడలేదు. ఆమె బిడియాన్ని వదిలించుకుని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోయింది. కరుణ అనునయంగా నన్ను డాక్టర్ గా కాదు ఒక అక్క అనుకుని చెప్పండి మీ బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యం  మీ ఆనందం మీకు ముఖ్యం కదా అని మెత్తగా అనునయిస్తూనే హెచ్చరించింది. 


ఆమె కాసేపు తటపటాయించింది. కరుణ ఓపికగా ఎదురుచూస్తుంది.వినడానికి టెన్షన్ గా ఎదురుచూస్తూ నేను.


 “రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోడు డాక్టర్. విసిగించేస్తాడు. చిరాకుతో నాలుగు తగిలిస్తాను కూడా. ఏడుస్తూ అతుక్కుపోతాడు. చాలారోజుల పాటు నా గుండెలపై కూర్చుని ముందుకు ముందుకు జరుగుతూ వచ్చి నా ముఖంపై కూర్చోవడం. అర్థం కాని భాషలో ఏదో చెప్పడం. వెంటనే నేను వాడిని పక్కన పడుకోబెట్టుకుని చిచ్చు కొట్టడం. ఎప్పటికోగాని నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు టబ్ లో నిలబెట్టి స్నానం చేయిస్తూవుంటే తన శిశ్నాన్ని తీసుకొచ్చి నా నోటి దగ్గర పెట్టినపుడు నాకు అర్థమైంది. కోపంతో అసహ్యంతో వణికిపోయాను. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఒక్కదాన్నే వున్నాను కాబట్టి  సరిపోయింది అనుకుంటూ గబుక్కున కింద కూర్చోపెట్టి ఎక్కడ చూసావు ఎవరు నేర్పారు రా నీకు అంటూ గట్టిగానే నాలుగు తగిలించాను. కోపం తగ్గాక ఆలోచిస్తే అర్థమైంది. ఆ ముదనష్టపుది పోర్న్ మూవీస్ చూసి చూసి తన వికృతాన్ని పసిబిడ్డపై చూపించింది అని. బిడ్డలు లేని ఆడది కదా! మా బిడ్డలో తనకు కల్గని కడుపుపంట భాగ్యాన్ని  చూసుకుని మురిసిపోతుంటుందని భావించి కాస్త ఏమరుపాటుగా వుంటే బిడ్డను అలా వాడుకుంది. చాలారోజులు నా భర్తతో చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ.. ఆ అలవాటు మాన్పాలని అడిగినప్పుడల్లా గాడ్జెట్స్ ను ఇచ్చేదాన్ని. రాత్రిళ్ళు నిద్ర పోకుండా విసిగిస్తున్నాడని మా వారు విసుక్కుని వేరే గదిలోకి మారిపోయాడు. ఈ భయంకర సత్యాన్ని ఎక్కువ కాలం మోయలేక నా భర్తకు చెప్పేసాను. విభ్రాంతి చెందాడు. మొదట నమ్మలేదు. ఒకటి రెండుసార్లు బాబు ప్రవర్తన చూసాక ఇక తన పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు. ఆమె వెళ్ళిపోయి ఏడాది దాటినా ఇంకా ఆమె కోసం వెదుక్కుంటాడు బాబు. నోట్లో వేలు కాళ్ళ మధ్య చేయి.. టాయ్లెట్ హాబిట్స్ అలవాటు పడలేదు. గట్టిగా మాట్లాడితే చాలు పేంట్ తడిపేసుకుంటాడు.  ఎవరితోనూ కలవడు. నాలుగుసార్లు పిలిచినా పలకడు. విపరీతమైన అల్లరి చేస్తాడు.ఎవరికీ చెప్పుకోలేము. స్థలం మారితే బాగుంటాడని ఇక్కడకు షిప్ట్ అయ్యాం. ఇప్పటికే అయినవాళ్ళందరూ ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే మందకొడిగా మాటలు రాకుండా తయారవుతారు మానేయరాదు అనే హితోక్తులు. కోవిడ్ మూలంగా ఎవరింటికీ ఎవరం వెళ్ళడం లేదు కాబట్టి శాంతిగా సంతోషంగా లేకపోయినా గుట్టుగా నెట్టుకొస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను బాగా పెంచుకోగల్గడం ఎలా అనే చింత. ఏం చేయాలి.. చెప్పండి డాక్టర్” అని అడుగుతుంది. 


వింటున్న నేను షాక్ తిన్నాను. ఏకకాలంలో వెగటు జుగుప్స  అసహ్యం. పసి ఆడపిల్లలనే కాదు మగ పిల్లలను కూడా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన ముదనష్టపు మనుషుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గు భయం. అమ్మమ్మలు మేనత్తలు మగ పిల్లల లైంగిక అవయవాన్ని తాకి ముద్దులాడటం కొత్తేమికాకపోవచ్చు కానీ ఆ చర్య అభ్యంతరకరమే. ఆ చర్య వెనుక లిబిడో దాగివుంటుంది అని వయస్సుతో సంబంధం లేకుండా ప్రేరేపించినట్లవుతుందని వారికి కూడా తెలియదేమో!


కరుణ.. ఆ తల్లిని అడుగుతుంది.. “మీరు ఫ్రాయిడ్ ని చదివారా!?  పిల్లల్లో కూడా లైంగిక ఆసక్తి సహజం అంటారు. మన భారతీయ సంస్కృతిలో అవన్నీ సహజంగా అంగీకరించడం కష్టం. పువ్వులను నేల రాసినట్టు పద ఘట్టనల క్రింద నలిపేసినట్లే కసుకాయలను తెంపి కొరికి అవతల పడేసేవారు వుంటారు. తల్లిదండ్రులు తప్ప ఎవరి సంరక్షణలోనూ పిల్లలను వదలడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆలోచనలు భయాలు నాకర్థం అవుతున్నాయి.మీరు శ్రద్ధ తీసుకుంటే అన్నీ చక్కబడతాయి. భయపడవద్దు.ముందు పిల్లాడి తల్లిదండ్రులుగా  మీరేదో  తప్పు చేసేసారనే గిల్టీ కాన్షియస్ లో నుండి బయటకు రండి.ఇదో చిన్న సమస్యగా చూడండి అప్పుడే మీ ఒత్తిడి తగ్గి చక్కగా ఆలోచించగల్గుతారు. అని చెప్పి లోపలికి వచ్చి అమ్మా.. కొద్దిగా కాఫీ కలుపు. ఆ మూడ్ లో నుండి ఆమెను బయటపడేయాలి అంటూ బుక్ రాక్ లో    అనేక పుస్తకాల మధ్య వున్న ఒక పుస్తకాన్ని వెతికి పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్ళింది. 


“మీరు ఎ. ఎస్. నీల్  సమ్మర్ హిల్  బుక్ చదివారా!? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కరదీపిక లాంటిది ఈపుస్తకం.  ఇది తీసుకువెళ్ళి మీ ఇద్దరూ చదవండి. మీ భయాలు పోగొట్టుకోండి. మీ  ప్రశ్నలన్నింటికి సమాధానం చెపుతుంది  ఈ పుస్తకం. క్రమం తప్పకుండా బాబును బయటకు తీసుకువెళ్ళి తన వయస్సు పిల్లలతో కలపండి. పార్క్ లో  తిప్పండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ  నాయనమ్మ తాతయ్యలకు అమ్మమ్మకు దగ్గర చేయండి. అత్యవసరం అయితేనే స్మార్ట్ ఫోన్ లను బయటకు తీయండి.  పుస్తకాలను ప్రకృతిని పరిచయం చేయండి. ఇవే అసలైన మందు” అని వివరించి చెప్పింది. 


కాఫీ ఇస్తూ చూసాను.ఆ తల్లి ముఖంలో  చిన్న చిరునవ్వు . ముఖం తేటగా వుంది. “థాంక్యూ సో మచ్ డాక్టర్. నేను జాబ్ కు రిజైన్ చేయాలనుకుంటున్నాను. నాకు బాబు కన్నా ఏదీ ముఖ్యం కాదు”.. అంది. 


చిరునవ్వుతో  ఆమెను సాగనంపాక “అమ్మా!  అసలు తప్పంతా పెద్దలిది కాదూ.. పుట్టి పుట్టగానే నాలుగు నెలలన్నా నిండకుండా వీడియో కాల్ లో మనుషులను పరిచయం చేస్తున్నాం. ఎత్తుకుని తిప్పే ఓపికలు లేక తీరిక లేక స్క్రీన్ ను అలవాటు చేస్తున్నాం. పెద్దలకు ఎలాగూ కంట్రోల్ లేదు. పిల్లలను పసివయసు నుండే చెడగొడుతున్నాం. ఈ హస్త భూతం దృశ్య భూతం వదిలితే కానీ మనుషులు బాగుపడరు. నువ్వు కూడా మనుమరాలితో గంటల కొద్ది వీడియో చాట్ లు ఆపు.యంత్ర దృశ్య సాన్నిహిత్యం కన్నా ఆరోగ్యకరమైన ఆలోచనలున్న మానవ స్పర్శ సాన్నిహిత్యం పిల్లలకు అవసరం.చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు” అని హెచ్చరించింది. 


 ************

ఇప్పుడు అవన్నీ గుర్తుచేసుకుంటే ఏదో తెలియని భయం అలుముకుంది నాకు. అరుణ్ ఎలాగున్నాడో! కరుణ కు ఫోన్ చేసినప్పుడు మర్చిపోకుండా కనుక్కోవాలి.పిల్లల మనసులు ఎంత స్వచ్ఛమైనవి. పెద్దలను అనుకరించే అనుసరించే వయసులో వున్నప్పుడు వారికి మంచి వాతావరణాన్ని పరిచయం చేయాలి. లేకపోతే ముమ్మాటికి అది పెద్దల తప్పిదమే!


మనుమరాలితో కాలం గడుపుతూ నా అపరిమితమైన ప్రేమ ప్రకటనతో తనలో  నాకే మాత్రం తెలియని జ్ఞాపకం లేని నా పసితనాన్ని ఆస్వాదిస్తూ ఆనందం అనుభవిస్తున్నప్పుడు ఆ బిడ్డకు ఏది మంచిదో అది మాత్రం అందించవద్దూ ! గాడ్జెట్స్ తన చేతికి అందనివ్వకూడదు. పుస్తక పఠనం కూడా పూర్తిగా మూలన పడింది.అంతకు ముందే నయం. పాత వాసనలు పోనీయకుండా ఎప్పుడో ఒకప్పుడు తనివితీరా చదువుకునేదాన్ని. ఆ అలవాటును పునరుద్దించుకోవాలి. వెధవ ఫేస్ బుక్  వాట్సాఫ్  తదితర  దరిద్రాలన్నింటిని వదిలేయాలి.మనుమరాలి కోసమైనా సరే పుస్తకాలు పట్టుకోవాలి అని అనుకుంటే రిలీఫ్ గా అనిపించింది.


నిద్ర లేచిన పాప మళ్ళీ టివి పెట్టమని అడిగింది. ఇంతకు ముందెన్నడూ బూచి అనే పదాన్ని వినిపించని నేను అందులో బూచి వుందని చెప్పి పాపను భయపెట్టాను. భయంగా నన్ను అల్లుకుంది. విరబోసుకున్న జట్టుకు రబ్బర్ బేండ్ వేస్తాను అంటే ముఖం ముందుకు చేతిని చాచి చూపుడు వేలును అటు ఇటూ ఊపుతూ నో.. నో.. అంది నన్ను అనుకరిస్తూ. పాలు త్రాగాక ఒద్దికగా నా వొళ్ళో కూర్చుని ముక్కులో వేలు పెట్టుకుంది. పెదాలపై వేలుంచి తప్పమ్మా అంటే తీసేసింది కానీ మళ్ళీ పెట్టుకునే ప్రయత్నం చేసింది. నేను వారించే ప్రయత్నం చేయలేదు. సమ్మర్ హిల్ పుస్తకం నేను చదివిన తర్వాతనే నా పిల్లలు కూడా చదివారని మర్చిపోను నేను. ఒళ్ళో కూర్చున్న పాపను ఎత్తుకుని బయటకు వచ్చాను. ఇద్దరం షూస్ ధరిస్తుంటే కోడలు అడిగింది తన కూతురిని ఎక్కడికి వెళుతున్నావు అమ్ములూ అని. తన చిన్ని చిన్ని చేతులతో ముఖం మీద పడే జుట్టును ఎగద్రోసుకుంటూ “వాక్” కి అంది. 

అవునా అంటే .. హా..అని ఓ వింతైన హావభావాలు ప్రదర్శించి అక్క చెల్లి అన్న పాప అనుకుంటూ ముందుకు పరుగుపెట్టింది. 


పాప వెనుక అడుగులు వేస్తూ పిల్లలకు రుచి చూపించడమే మన వంతు, వారికి ఏది ఇష్టమైతే దానినే ఆస్వాదిస్తారని మనం వదిలేయకూడదు. ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో దానినే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. పిల్లలే కాదు మనమూ నో అని చెప్పగల్గేంత కఠినం అలవర్చుకోవాలి.అప్పుడే మన నట్టింటి నుండి దృశ్య భూతాలు పరార్ అవుతాయి అనుకుంటూ పరిసరాలను గమనిస్తూ వున్నాను.


కమ్యూనిటీ పార్క్ లో లేత పచ్చ లాన్ పై  రకరకాల పువ్వుల్లా దరహాసాలు వెదజల్లే పిల్లలు వాళ్ళను ఓ కంట  కనిపెట్టుకుని వుంటూనే కబుర్లాడుకునే పెద్దలు.ఆన్లైన్ క్లాసుల బెడద తగ్గి ఎగరేసిన బెలూన్ వలే స్వేఛ్ఛగా ఎగురుతూ తుళ్లింతలు పెట్టే కొంచెం పెద్ద పిల్లలూ వర్క్ ఫ్రమ్ తీసేస్తే బాగుండు ఆ బండచాకిరీతో పాటు ఖైదీల్లా ఇంటికి అతుక్కునే బాధ తగ్గుతుందని చెప్పుకునే సాప్ట్వేర్ జీవులు వెరసీ అక్కడంతా వసంతమాసానికి ముందే వచ్చే ఫాల్గుణశోభలా కళకళ లాడుతూ వుంది. పెద్దల నోళ్ళు మాట్లాడుతూనే వున్నా ధ్యాస మాత్రం అరచేతిలో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పైనే వుంది. అప్పుడప్పడూ తల క్రిందకి దించి బొటనవేలితో స్క్రీన్ ను స్క్రోల్ చేస్తూనే వున్నారు.భూత వైద్యం ముందుగా ఇప్పించాల్సింది పిల్లలకు కాదు పెద్దలకు తప్పనిసరేమో అనుకున్నాను సాలోచనగా.


**************౦****************


#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.



13, మార్చి 2022, ఆదివారం

బంగారు భూమి

పళ్ళు తోముకుంటూ పై  అంతస్తులో నుండి కిందకి చూసింది లావణ్య. అత్త వర్ధనమ్మ  పశువుల శాల పక్కనున్న ఇనుప జల్లెడ కోళ్ళ గూడును తెరిచింది. కోళ్ళన్నీ బిల బిల బయటకు పరిగెత్తాయి. చద్దన్నంలో ఆవకాయ కారం కలిపి తీసుకొచ్చిన గిన్నె చేతిలోకి తీసుకుని అన్నాన్ని నలువైపులా వెదజల్లింది. అవి తింటూ వుంటే  ఆమె తదేకంగా వాటినే చూస్తూంటే “ అవి ఒట్టి అన్నం తినవా నాయనమ్మా! వాటికి కూర కలపకుండా కారం యెందుకు కలిపావు? పాపం కోడిపిల్లలకు మంట పుట్టదూ, రేపు నెయ్యేయి” అన్నాడు చిన్న మనుమడు కార్తీక్. ఆమె నవ్వుకుని మనుమడిని యెత్తుకుని ముద్దు పెట్టుకుంది.  ఇదిగో యీ మాయ ప్రేమలు కురిపించే ఆమె పిల్లలనూ తన పిల్లలనూ కూడా జారిపోనీయకుండా  భద్రంగా గుప్పిట్లో పెట్టుకుంటుందని పళ్ళు నూరుకుంది లావణ్య. “తెల్లారిందా గొడ్ల చావిట్లో తిరగడానికి. పైకి రా, బ్రష్ చేసుకుందువుగాని” అని  కొడుకుని గట్టిగా పిలిచింది.


పాలేరు షెడ్ శుభ్రం చేస్తుంటే గేదెలకు చిక్కని కుడితి తాపించింది వర్ధనమ్మ.  పాలు పిండి ముందు పాలని ఒక కేన్లో  పోసిచ్చి అమ్మకు యిచ్చిరా అని  కార్తీక్ కి యిచ్చి పైకి పంపింది. ఎనక తీసిన పాలను ఇంకో కేన్లో పోసింది. పాలేరొచ్చి యింకో గేదె పాలను తీసి కేన్ లో పోసాడు. నువ్వు టీ తాగి పొలమెళ్ళు.  కేంద్రానికి పాలు వంశీ బాబు తీసుకెళుతాడు లే అని అతన్ని తొందరజేసింది. తర్వాత ఆవుపాలు తీసుకుని పైకొస్తుంటే కొడుకు నరేష్ పాలేరు కలసి పొలానికి వెళ్ళడానికి కిందకి వస్తూ ‘’అమ్మా..  వూర్లో వాళ్ళు బీర గింజలకు వస్తారు మానిక పదిహేను వందల లెక్కన యిచ్చేయి‘’ అన్నాడు. అంత తక్కువకా అన్నట్టు ఆశ్చర్యంగా ముఖం పెట్టింది. మరో మాట మాట్టాడే అవకాశం లేకుండా మోటర్ సైకిల్ పై పాలేరుని యెక్కించుకుని వెళ్ళిపోయాడతను. 


వంటగట్టుపై పాల తపాళ పెట్టి.. “మానిక మూడు వేలు లెక్కన కొనుక్కొచ్చి అందులో సగం రేటుకు యివ్వమంటాడు వీడికేమైనా పిచ్చి పట్టిందా యేంటి” అంది కోడలితో. 


కోడలు ఆ మాటకు యేమి మాట్లాడకుండా “పాలు పాలేరు యిచ్చి వచ్చేవాడు కదా’’ అంది. “పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్పాలి. వాళ్ళు పని నేర్చుకుంటారు. పాలు కొలవడం పోసుకొనేటపుడు లెక్కపెట్టడం రీడింగ్ చూసుకోవడం ఇవి మాత్రం చదువు కాదేంటి’’ అంది.అసంతృప్తిగా ముఖం పెట్టి ఆమెకు మామగారికి కాఫీ కలిపిచ్చి పిల్లలకు పాలు కలిపి తను గ్రీన్ టీ తీసుకుని హాలులోకి వచ్చింది లావణ్య.


వంశీ తాతతో కలిసి డాబాపై ఎండబోసి పెట్టిన బీర గింజలు తీసుకొచ్చి వరండాలో గుమ్మరించి చచ్చు గింజలను సన్న గింజలను యేరిపారేస్తూ కనిపించాడు. పిల్లలిద్దరికీ పాలు తాగించి వారికి పాల కేన్ యిచ్చి పాలకేంద్రానికి పంపింది వర్ధనమ్మ.


 మామగారు టిఫిన్ బాక్స్ లు తీసుకుని చేలోకి వెళుతుంటే నేనూ వెళతానని బయలుదేరుతున్న కొడుకుతో.. “ అబ్బాయ్ వంశీ! నువ్వు కూడా మీ నాన్నలా తయారైతావా యేమిటి? పుస్తకాలు అంటుకోకుండా చేను చెట్టు గొడ్డు గ్రాసం ట్రాక్టర్ దుక్కి సాళ్ళు అంటూ తెగదిరుగుతున్నావ్. మీ పెదనాన్నలా అమెరికా వెళ్ళి వుద్యోగం చేయవా” అనడిగింది లావణ్య. 


‘’అమ్మా! నువ్వసలు ఆ మాటన్నావంటే వూరుకోను. నేను అసలు ఆ అమెరికా వెళ్ళే చదువులు చదవను ఆ వుద్యోగం చేయను. రోజూ చేలోకెళ్ళి వ్యవసాయం నేర్చుకుంటా. నాకిదే బాగుంది. నువ్వు రోజూ యిదే మాటంటే నేనసలు బుక్ పట్టుకోను నన్ను కొట్టినా సరే’’ అని విసురుగా వెళ్ళిపోయాడు వంశీ. ఆ మాటలు చెప్పిన కొడుకు తీరుకు విస్తుపోయింది లావణ్య.


వీడికి రోజు రోజుకు తిక్క పెరిగిపోతుంది ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవకపోతే యెలా అనుకుంది. ‘’మీ అబ్బాయికి సబ్జెక్టు కంప్లీట్ అవదు. నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ చెయ్యలేం. ఇప్పటికే మీ అబ్బాయి స్టడీస్ లో చాలా డల్’’ ఓపికగా చెప్పింది టీచరు.కొడుకు బదులు క్లాస్ కు తెర మీద ప్రత్యక్షమైన లావణ్యను చూసి. 


‘’ఈ వొక్కరోజుకే లెండి. రేపటికి యెలాగోలా బుజ్జగించి క్లాస్ కి కూర్చోబెడతాను. ఏ లెసన్ చెబుతున్నారో చెపితే నేను సాయంత్రం చదివిస్తాను’’ అన్న లావణ్యను చూసి మనసులో విసుక్కుని లెసన్ నెంబర్ చెప్పింది టీచర్. 


సాయంత్రం చేను నుండి వచ్చిన వంశీకి స్నానం చేయించి  అత్తమామలతో పాటు ఛానల్స్ ముందు కూర్చోనీయకుండా పుస్తకాల ముందు కూర్చోబెట్టే ప్రయత్నాలన్నీ వీగిపోయాయి లావణ్యకు. మనుమడు చెబుతున్న పొలం కబుర్లన్నీ విని మురిసిపోతూ మరిన్ని విషయాలను వాడి బుర్ర కెక్కిస్తుంటే వుడికిపోయింది. 


“ఎపుడూ యివే ముచ్చట్లా మీకు. కొడుకును యిట్టా తయారుచేసింది గాక మళ్ళీ వీడినికూడా అట్టాగే తయారు చేయడానికి చూస్తున్నారు. అసలీ మట్టి పిసుక్కోవడంలో అంత ఆనందం యేముందండీ? ఎకరాలు వున్నాయని చెప్పుకోవడమే కానీ పొదస్తమానూ కష్టపడటమే గాని యిందులో మిగిలేదమన్నా వుందా చచ్చిందా? ఎపుడూ తవ్వుకోవడం పూడ్చుకోవడం. పిల్లలకు బాగా చదువుకోవాలని చెప్పడం పోయి ఆ పొలం అట్టా ఈ పొలం ఇట్టా అని చెప్పి వ్యవసాయం నూరిపోస్తున్నారు. వీళ్ళను తీసుకెళ్ళి హాస్టల్ లో పడేస్తేకానీ మాట వినరు “ అని వంశీకి రెండు తగిలించి బరబరా వేరే గదిలోకి లాక్కుపోయింది. 


“వాడు చదువుకుంటానంటే మేము వద్దన్నామా, అయినా వాడేమన్నా అయ్యేయస్ లు అయ్పీయస్ లు చదువుతున్నాడా? చిన్న పిల్లాడు, చదివేనాటికి వాడే చదువుతాడు.మా పిల్లలిద్దరూ అట్టా చదివినోళ్ళు కాదూ “అంది అత్త గారు.


నరేష్ ట్రాక్టర్ పనిచేసిన లెక్కలు రాసుకుని విత్తనాల సేకరణ గురించి మాట్టాడి ఇరుగుపొరుగు రైతులతో ముచ్చట్లు రాజకీయాలు అన్నీ ముగించుకుని ఇంట్లోకి వచ్చేటప్పటికి తొమ్మిది దాటిపోయింది. స్నానం భోజనం ముగిసేటప్పటికి మరో అరగంట. అప్పటిదాకా ఓపిక పట్టిన లావణ్య నోరు విప్పి భర్త ముందు గట్టు తెగిన ప్రవాహమే అయింది. 


‘’మీరు పిల్లలను రోజూ యిలా వెంటేసుకుని తిప్పితే వారికి అక్షరం ముక్క రాదు.  ఇప్పటికే వచ్చిందంతా మర్చిపోతున్నారు. ఒక్క పదం కరెక్ట్ గా రాయలేరు చదవలేరు. అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్ లే! అసలు చదువు మీద శ్రద్ధ లేదు. ఈ సంవత్సరం కూడా స్కూల్ మాములుగా నడవకపోతే వాళ్ళకు ఫీజులు కట్టడం కూడా దండగ. పిల్లలను పొలాలెంట తిప్పొద్దు అంటే మీరు వినరు.తొమ్మిదేళ్ళ పిల్లాడు రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు. ఇట్టా వుంటే నేను అస్సలు ఊరుకోలేను. సిటీలో కాపురం పెట్టి చదివిచ్చుకోవాలి లేదా పిల్లలను  హాస్టల్ లోనైనా వెయ్యాల్సిందే ‘’ అంది. 


నరేష్ యేమి మాట్లాడలేదు. అతనంతే! ఎక్కువ మాట్లాడడు. చెప్పాల్సింది వొక్కసారే చెబుతాడని లావణ్య కు తెలుసు కాబట్టి  అంతకుముందొకసారి చెప్పినదానిని మరొకసారి గుర్తు చేసుకుంది.


 ‘’పిల్లలు చదివి ఉద్యోగాలు చేయకపోతే వాళ్ళు బతకలేరా. ఏం మనం బాగా బతకడం లేదా? ఎపుడూ సిటీ సిటీ అని మోజు పడతావ్. ఏం తక్కువైంది నీకు? పట్టణంలో వుండే సౌకర్యాలతో అంత కన్నా ధీటుగా అరవై లక్షలతో కట్టిన యిల్లు నౌకరులు పాడి పంట ధనం ధాన్యం అన్నీ వున్నా యేదో లోటు వున్నట్టు ముటముట లాడిపోతావు. పిల్లలు ప్రకృతిలో పెరగాలి. పొలాల్లో తిరగడం వ్యవసాయపు పనులు యెలా చేస్తున్నారో చూడటం నేర్చుకోవటం కూడా విద్యే. నేచులర్ సైన్స్ అది. ఇక ఇంగ్లీష్ చదువులంటావా? ఏం మా అన్న నేను పదవతరగతి వరకూ తెలుగు మీడియంలో చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదివి వాడు సాప్ట్వేర్ ఇంజినీర్ అవలేదా నేను ఎమ్ పార్మసీ చెయ్యలేదా. నువ్వు ఊగినట్టు నేనూ ఊగి అమ్మ నాన్నలను వొదిలేసి పొలం కౌలుకిచ్చేసి ఏ హైదరాబాద్ లోను ఉద్యోగం చేసుకుని బతకొచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు యింతకన్నా యేం బావుకుని తింటున్నారు. నాణ్యమైన పాలు దొరకక కూరగాయలు దొరకక దోమలతో కుట్టిచ్చుకుంటూ అగ్గిపెట్టెలాంటి గదుల్లో బతకడమేగా. ఇక్కడున్న గౌరవం తృప్తి అక్కడ వుంటాయా? ఆలోచించుకుని అసంతృప్తిని తగ్గించుకుంటే యిల్లు ప్రశాంతంగా వుంటుంది అని.  అతని మాట అప్పుడేనా  యెప్పుడైనా అదేనని ఆ మౌనానికి అర్థం అదేనని అర్దమై నిట్టూర్చింది.


లావణ్యకు  జీవితం పట్ల అసంతృప్తి పేరుకుపోతుంది.  రేపుదయం అత్త తో మాట్లాడాలి అనుకుంది. లావణ్య మేనత్త హేమ ఇంటి విషయాల నుండి అంతర్జాతీయ విషయాల దాకా అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్టు మంచి చెడూ విశదీకరించి చెబుతుంది. పిల్లల చదువుల విషయంలో అత్త సలహా తీసుకోవాలి అనుకుని నిద్రకు ఉపక్రమించింది. 


మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మేనత్త హేమకు ఫోన్ చేసింది లావణ్య. కుశల ప్రశ్నలయ్యాక ఆటోమేటిక్ గా వ్యవసాయం వైపు మళ్ళాయి కబుర్లు. 


పట్టిసీమ నీళ్ళు పక్కనే పుష్కలంగా పారుతూ ఉన్నాయి అని సంబరపడ్డాము. రెండు పంటలూ పండితే పంటసిరి దంతసిరి వున్నట్టే అనుకున్నాం.  నాలుగేళ్ళకే వరి పండించడం అనేది బుద్ధి తక్కువ పనని తెలిసొచ్చింది మాకు. ఖర్చులు చూస్తే తడిసి మోపెడు చేతికొచ్చేది చింకి చాటెడు. అందుకే  ఈ సంవత్సరం రైతులందరూ కలసి చేపల చెరువులకు లీజుకు యిస్తున్నారు. ఎకరానికి నలభై వేలు అంట. నాలుగు సంవత్సరాలకు బాండ్ రాయించుకుని నాలుగోవంతు అడ్వాన్స్ తీసుకుని యిచ్చేస్తున్నారు అని చెప్పింది లావణ్య.


“అది యెట్టాగమ్మా!?  బంగారం పండే పొలాల్లో చేపల చెరువులా?ప్రభుత్వం అనుమతి యివ్వొద్దూ, అయినా ఆ తర్వాత  పంటలు పండవు పొలాలు చవకేసి పోతాయి. ఎందుకట్టా బంగారంలాంటి మాగాణి గడ్డనంతా పాడు చేసుకుంటున్నారు ఇంకోసారి ఆలోచించుకోండి.” అంది హేమ.


“ అసలు  రైతుకు యేం మిగులుతుందత్తా? మగకూలీలకు రోజుకు ఎనిమిది వందలు ఆడకూలీలకు ఆరొందలు అంట. ధాన్యం తోలిన నాలుగు నెలలకు కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోయే. వ్యవసాయం చేసి చేతి చమురు వదిలిచ్చుకునే కంటే చెరువులకీయడమే నయం అంటున్నారు నరేష్.  మేము నాలుగు యెకరాలిచ్చాం. అవి పిల్లల ఫీజులకి సరిపోతాయి. ఇంకా రెండు యెకరాల్లో ఆర్గానిక్ పద్దతిలో తినడానికి వరి వేస్తున్నాడు. ఎకరానికి యెనిమిది బస్తాలు లెక్కన పండుతున్నాయి.  అవి యింట్లోకి సరిపోతాయి. ఈ వేసవికి రెండు యెకరాల్లో బీర వేసాము. పూత వచ్చిన దగ్గర్నుండి మందు కొట్టడమే. లేకపోతే పువ్వు పిందె అవకుండా రాలిపోవడమే. మందు రెండువేల ఐదొందలు మందు కొట్టిన కూలీకి ఐదొందలూ మొత్తం మూడువేలు. రోజు మార్చి రోజు మందు కొట్టాల్సిందే. రెండు లక్షలు వచ్చాయి. ఖర్చులకు లక్షా నలభై వేలు పోనూ  మిగిలింది అరవై వేలు. రెండెకరాలలో అన్ని రకాల విత్తనాల పంట పెడుతున్నారు.పదెకరాల మిరప చేను పదెకరాల మొక్కజొన్న. మిరపలో మిగలడం అనేది లాటరీ తగిలినట్టే అనుకో. కాస్త పరవాలేనిది మొక్కజొన్న వొక్కటే. పాలేరుకు రెండు పూటలా భోజనం టిఫిన్ టీ లు, నెలకు ఇరవై వేలు జీతం. పనికి రానిరోజు కి జీతం యివ్వాల్సిందే. ట్రాక్టర్ డ్రైవర్ కు పద్దెనిమిది వేలు అదనంగా బేటాలు. వీళ్ళందరికీ వంట మనిషిలా వంట చేయాలి నేను అంది విసుగ్గా.


‘’అవునా.. పెద్ద కమతం అమ్మా మీది. ఖర్చులు కూడా యెక్కువే “  అని ఆశ్చర్యపోయింది హేమ.


‘’చూడటానికి ముఫ్పై యెకరాల జరీబు,పెద్ద యిల్లు, కారూ, బుల్లెట్, ట్రాక్టరూ మందీ మార్బలం. అత్తగారిని హాస్పిటల్ కు తీసుకెళ్లాలన్నా పిల్లలను హాస్పిటల్ కు తీసుకెళ్ళాలన్నా ఆయనకు  యేనాడు తీరిక వుండదు.ఎప్పుడూ పనుల ఒత్తిడి! బస్సుల్లో ఆటోల్లో పడి  నేను పోవాల్సిందే.  పిల్లలు పొద్దున్నే ఏడింటికి స్కూల్ బస్ యెక్కితే సాయంత్రం పావు తక్కువ ఐదింటికి వచ్చేది.  తీసుకెళ్ళేటపుడు తీసుకొచ్చేటపుడు  బస్ లో పడి యెన్ని వూళ్ళు తిరుగుతారో. మొదట యెక్కి చివర దిగేది మా పిల్లలే. ఈ కోవిడ్ లాక్ డవున్ వల్ల పిల్లల చదువులు చట్టుబండలయ్యాయి. పుస్తకం అంటుకునే పని లేదు. పొద్దస్తమాను చేలల్లోనే.ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను బోలెడు డబ్బులు వస్తాయి అంటాడు పెద్దాడు. ఏటి ఈత లంక మేత చందాన. తల బొప్పి కట్టి పోతుంది పిల్లలతో. నాకు  ఇంత సుఖం లేదూ సరదాలు అసలే లేవు’’ అని అన్ని విషయాలు కలగాపులగంగా కలిపి చెప్పేసింది లావణ్య.


మేనత్త హేమ అంతా  విని అనునయంగా మందలించింది “ఎందుకమ్మా అంత నిరాశ. భవిష్యత్ ను కలగనాలి. భవిష్యత్ లో నీ కొడుకు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త అవుతాడేమో, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కాగలడమో! పిల్లలకు ఆసక్తి వున్న పనులలోనైతేనే రాణించగలరు.  చదువులలో వెనకబాటు అంటావా! చిన్న తరగతులే కదా,ట్యూషన్ పెట్టించి శ్రద్ధ పెడితే త్వరగానే దారిలో పడిపోతారు. స్వతహాగా నీ పిల్లలు తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళూనూ. దిగులుపడకు”అని మంచి మాటలు చెప్పింది. 


‘’ఎంత కష్టపడ్డా యెప్పటికైనా వున్న పొలంలో సగమే కదత్తా మాకు వచ్చేది. మా బావగారు వాటా పంచుకోకుండా యెందుకు వూరుకుంటారు. ఏ రెండేళ్ళకో చుట్టం చూపుగా వచ్చిపోతారు. ఇక్కడ పెద్దవాళ్ళ అనారోగ్యాలు చూసుకోవాలి  వ్యవసాయపు యిబ్బందులు పడాలి పెద్దవాళ్ళ పెత్తనాలు భరించాలి. అసలు యెన్ని వుంటయ్యో!  వాళ్ళకు అన్ని కరెక్ట్ సమయాలకు జరిగిపోవాలి ఐదు నిమిషాలు ఆలస్యం అవకూడదు. ప్రతి దానికి వొంకలు పెట్టుద్ది మా అత్త గారు’’ అంది లావణ్య.


‘’అమెరికా వాళ్ళు ఆస్థుల్లో వాటాలకు రారని చెప్పలేం. వస్తే వచ్చారులే. మనిషికి తృప్తి వుండాలమ్మా. నరేష్ కు పుట్టిన వూరు కన్న తల్లిదండ్రులు భూమి సెంటిమెంట్. అతనికి అందులో తృప్తి వుంది. కష్టమైనా నష్టమైనా వ్యవసాయం చేయడంలో అతనికి ఆనందముంది. ఇప్పుడు భూములకు రేట్లు పెరుగుతున్నాయి. వున్నదాంట్లో సగం వచ్చినా నీకు తక్కువేముందమ్మా. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఆ వాటాల గురించి ఆలోచించకు. ఇక పెద్దవాళ్ళంటావా, వాళ్ళు అలాగే వుంటారు లేమ్మా. మన అమ్మ నాన్నలను బాగా చూసుకోవడం లేదని తమ్ముడు మీద మనకు కినుక వుండదూ! అత్తమామలనే అమ్మనాన్న అనుకో. నరేష్ మంచోడు.వివేకం కలవాడు.తల్లిదండ్రులను నొప్పించలేక మౌనంగా వుంటాడు కానీ నిన్ను కష్టపెడతాడా చెప్పు.బట్టలుతకడానికి మనిషి ఇంటి పని చేయడానికి సహాయానికి మనిషి వుంటారు కదా. వంట చేసేసి నీకిష్టమైన పుస్తకాలు చదువుకో, టీవి చూడు. పైన రూఫ్ గార్డెన్ పెంచుకో. అసంతృప్తి పెట్టుకోబాకు. జీవితంలో బోలెడు కష్టాలున్నవాళ్ళున్నారు వాళ్ళతో పోల్చుకుని సంతోషపడు. నువ్వు కూడా టూ వీలర్ నడపడం నేర్చుకో. చేనుకు వెళ్ళు లేదా విటిపియస్ దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్  అమ్మే షాపు పెట్టుకో. కూరగాయలూ పాలూ పెట్టవచ్చు. కారం పేకింగ్ లు చేసి ఆర్డర్ యిచ్చిన వాళ్ళకు పంపడం లాంటి పనులు చేసుకో. ఉత్సాహంగా వుంటుంది’’ అని సర్ది చెప్పి అనుకూలమైన సూచనలు చేసింది. 


“అంతేలే అత్తా! నువ్వు చెప్పింది కూడా బాగానే వుంది. నీతో మాట్లాడితే మనసు తేలికపడుద్ది ప్రశాంతంగా వుంటది. థాంక్యూ అత్తా”అంది. 


నవ్వుకున్న హేమ “అసలు మీకున్న వసతి పొలం అండ దండ వుంటే మా అబ్బాయిని అమెరికా పంపేవాళ్ళం కాదు. పిల్లలను పంపి మేమెలా అలమటించి పోతున్నామో నన్ను మీ అత్తగారిని చూస్తూ కూడా నువ్వు అమెరికా అమెరికా అని కలవరిస్తావు యెందుకమ్మా. భూమిని నమ్ముకుని కష్టపడాలి ప్రయోగాలు చేయాలి. ఏ రంగంలో సవాళ్ళు లేవు చెప్పు? పట్టణాలలో ఎంత సంపాదించినా తినే తిండి పీల్చే గాలి  అన్నీ కల్తీలై అనారోగ్యాలతో జనం అలమటిస్తున్నారు. పల్లెల స్వచ్ఛతను కాపాడుకుంటూ ఆధునిక వ్యవసాయం చేసుకోవాలి. అవన్నీ చేయలేకపోయినా స్వంతానికైనా పండించుకుని  మంచి ఆహారం తినగల్గాలి. ముందు ముందు రైతే రాజు, అది మర్చిపోకు” అని తీపి ఆశ కల్గించింది. 


మేనకోడలు తేలికైన హృదయంతో ఫోన్ పెట్టేసాక ఆలోచనలలో మునిగింది హేమ. 


ఆర్గానిక్ ఫార్మింగ్ అని పలవరిస్తున్నారందరూ. అసలీ భూములను కాలుష్య రహితం చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇన్నేళ్ళు విచ్చలవిడిగా రసాయన ఎరువులు కుమ్మరించి పురుగుమందులు వెదజల్లి కలుషితం అయిన నేలను శుద్ధి చేయడం అంత సులువైన పనా? ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఎకరాకు ఏడెనిమిది బస్తాలకు మించి పండటం లేదని యిపుడేగా చెప్పింది మేనకోడలు. పెద్ద రైతులు యేదో విధంగా వొక దాంట్లో పోయినా మరొకదాంట్లో సరిజేసుకుంటారు. చిన్నా చితక రైతు నిలబడేది యెట్టా? వాళ్ళు అప్పుల ఊబి నుండి బయట పడటం సాధ్యమేనా? అసలు ఆర్గానిక్ ఉత్పత్తులు అని అమ్మేవాటిలో నిజమెంత!?


ఇందాక తను చెప్పినట్టు నిజంగా రైతు రాజయ్యే రోజు వస్తుందా? కూలీ అయ్యే రోజు  లేదా కార్పొరేట్ ఫ్యాక్టరీలలో దినసరి కూలీ అయ్యే రోజు వస్తుందా!? అసలు విచ్చలవిడిగా రసాయన ఎరువులు పురుగు మందులు చల్లిన పంటలు తిని మనుషులకు యెన్నెన్ని రోగాలు. ఆ విపత్తును తలుచుకుంటే వణికిపోయింది. దాని కన్నా కోవిడ్ 19 విపత్తు చాలా చిన్నది.పంచభూతాలను పిడికిట బిగించి వికృతంగా నవ్వుకుంటున్న మనిషి.ప్రపంచాన్ని అదుపులో పెట్టి మొట్టమొదట స్థానంలో వుండాలనుకున్న దేశం కుట్రో తప్పిదమో వైరస్ బారినపడిన పడి విలవిలలాడే మనుషులు. ఏముందీ,యెక్కడుంది వికాసం!?  ఉత్థాన పతనాలలో మానవజాతి. విచారంతో ఆ రాత్రంతా హేమకు కంటి మీద కునుకే లేదు. 


మర్నాడు సాయంత్రం వేళ పక్కింటి శాంతితో కలసి కూరగాయల దుకాణంకి వెళ్ళింది హేమ. అది హోల్సేల్ దుకాణం. ఆ ఊరులోనూ చుట్టు ప్రక్కల ఊర్లలోనూ పండించిన కూరగాయలను రైతులు అక్కడ ఎక్కువగా అమ్ముతుండటం వల్ల ఎప్పుడు చూసినా నవ నవలాడే కూరగాయలే వుంటాయి. 


శాంతి వంకాయలు బెండకాయలు బీరకాయలు క్యాలీఫ్లవర్ క్యాబేజీ చిక్కుడుకాయలు పచ్చి మిరపకాయలు టమాటాలు కొంటూ వుంటే నాణ్యమైనవి ఎంచి తూకం గిన్నెలో వేయడానికి సాయపడింది కానీ హేమ తీసుకోలేదు. ఆఖరికి ఆకు కూరలు కూడా తీసుకోలేదు. 


అది గమనించిన శాంతి “మీరేమీ తీసుకోవడంలేదు.. అన్నీ నేనే తీసుకుంటున్నాను. తీసుకోండి మీరు కూడా “ అంది. 


మీరు తీసుకున్న కూరగాయలన్నింటికి విత్తు నాటినప్పటినుండి ఎరువులు క్రిమి సంహారక మందులు  వాడుతుంటారు.పిందె నిలవడానికి పుచ్చుపట్టకుండా  పురుగు రాకుండా వుండటానికి విపరీతమైన పురుగుమందులు పిచికారీ చేస్తారు. ఇక రసాయన ఎరువులు సంగతైతే చెప్పనవసరమే లేదు. ఈ కూరగాయలు తింటే పోషక ఆహారం సంగతి అటుంచి కాలక్రమేణా వ్యాధుల బారిన పడతాం. మీకు తెలుసు కదా, నేను అల్సర్ తో ఎంత ఇబ్బంది పడుతున్నాను.

అందుకే వీలైనంత తక్కువ పురుగు మందులు చల్లి పండించిన కూరగాయలు తీసుకుంటాను.. అవి ఏమిటంటే .. రండి నేను కొనేటపుడు చూద్దురు గాని.. అంటూ తన వెంట తిప్పింది.


దొండకాయలు, మునక్కాయలు, దోసకాయలు, పచ్చి అరటికాయలు, కేరెట్, సొరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ గోరుచిక్కుడు కాయలు చిలకడ దుంపలు తీసుకుంది. 


శాంతి ఆసక్తిగా చూస్తూ వుంది.తిరిగి వస్తూ మరిన్ని విషయాలు ముచ్చటించుకుంటూ నడక సాగించారు.


“ శాంతీ! నేను ఏ కూరగాయను ముట్టుకున్నా మొక్క, చెట్టు, తీగ మొదళ్ళలో రసాయన ఎరువులు కుమ్మరిస్తున్నట్లూ పైన పురుగు మందులు పిచికారీ చేస్తున్నట్లూ  అన్పిస్తూ వుంటుంది. కంచంలో అన్నం వడ్డించుకుని  కూర్చుని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటేనూ అదే ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. అందుకే ఆచీ తూచీ కూరగాయలు తీసుకుంటాను. నగరంలో పుట్టి పెరిగి నగరాల్లోనే వుంటున్న మీరెప్పుడూ కూరగాయలు పండించే పొలాల్లోకి వెళ్ళి చూడలేదేమో! నేను అపుడపుడు చూస్తుంటాను కాబట్టి ఇవ్వన్నీ నాకు తెలుసు” అంది హేమ. 


“ఈ ఊరు పాడిపంటలకు కూరగాయలకు ప్రసిద్ది కాబట్టి అన్నీ ప్రెష్ గా చీప్ గా దొరుకుతాయి, పల్లెటూరి వాతావరణం ప్రశాంతంగా వుంటుందని ఇక్కడ ఇల్లు కొనుక్కొన్నాం అండీ. మీరేమో ఇలా వుంటుందని చెబుతుంటే భయమేస్తుందండీ”.


చిన్నగా నవ్వింది హేమ  “ఈ ఊరు ఇప్పుడున్న ఊరిలో పావువంతు వుండేది అదివరకు. మూడొంతులు మీలా ఆశించి వచ్చి స్థిరపడినవారే! పంట పొలాలన్నీ కాలనీలుగా మారిపోయాయి. మనదేశ జనాభాకి సరిపడ ఆహారం పండించాలంటే సేంద్రియ వ్యవసాయంలో కుదరదు. అందుకే సంకరజాతి విత్తనాలు వాడి అధిక దిగుబడి సాధించడం అవసరమైపోయింది. వ్యవసాయం అధిక ఖర్చుతో కూడిన పని అవడం వల్ల అధిక దిగుబడుల కోసం ఎరువులు గుమ్మరిస్తున్నారు. మన పెద్దల తరానికి మన తరానికి ఆరోగ్యాలలో మార్పు ఆహారం వలనే శాంతి. మీరు కూడా రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని వారానికి నాలుగు రోజులైనా సహజంగా పండించిన కూరగాయలు తినే ప్రయత్నం చేయండి అని సలహా యిచ్చింది.


“రూఫ్ గార్డెన్ చేయాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళ సహకారం లేదండీ.”అని వాపోయింది శాంతి. 


నిన్న మా మేనకోడలు ఫోన్ చేసింది. వాళ్ళు పండించిన బీర తోటకు చల్లిన పురుగు మందుల గురించి చెబుతుంటే వణుకు వచ్చింది.రాత్రంతా నిద్రపట్టలేదనుకోండి. మనం తిండి కాదు రసాయనాలు తింటున్నాం అనిపించింది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే మన భావితరాల వారు నిత్య అనారోగ్యం పాలవుతారు. అంది ఒకింత దిగులుతో.


“మనమొక్కరమే ఏం చేయగలం చెప్పండి!? నలుగురితో పాటు నారాయణా అనుకోవడమే”


“లేదు శాంతి నాకొక ఆలోచన వుంది. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అదీ కుటుంబ ఆరోగ్యం కోసం. కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కోసం మా భూమిని సిద్ధం చేయాలనుకుంటున్నాను. సొంత స్థలం లేని వారందరూ తలాకొంత భూమిని కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయ పద్దతిలో కూరలు పండించుకోవడానికి అవకాశం కల్గించాలని అనుకుంటున్నాను.నాతో కలిసి నడిచే వారి కోసం ప్రయత్నిస్తున్నాను. ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా వున్నారు.

మా అందరి ముందున్నదీ వున్నది వొకటే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టనష్టాలుంటాయి.అయినా సరే సిద్దపడుతున్నాము.మీరు కూడా మాతో కలిసి పనిచేయవచ్చు అని ఆహ్వానించింది.


“అలాగేనండీ! ఇంట్లో వొప్పుకుంటే అలాగే చేద్దాం. మీరు చెప్పేది వింటుంటే నాకు ఉత్సాహంగా వుంది ”.


ముందు మనమంతా ఈ కోవిడ్ మహమ్మారిని జయించాలి.మనందరికీ రేపటి గురించి ఆశ వుండాలి. ఫలవంతమైన జీవితాల కోసం కమ్మని కలలతో  తీపి ఆశతో రేపును ఆహ్వానిద్దాం. సరేమరి. ఇకవుండనా మరి అని లోపలికి వచ్చింది హేమ. 


కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వచ్చి టేబుల్ పై వదిలి వెళ్లిన మొబైల్ ఫోన్ తీసుకుని చెక్ చేసింది.  కాల్ లిస్ట్ లో మేనకోడలు లావణ్య నెంబరు కనబడింది. నీళ్లసీసా తీసుకుని బాల్కనీలోకి వచ్చి కాల్ చేసింది. 


అత్తా! నీకొక  స్టన్నింగ్ అండ్ గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. మా బావగారూ తోడికోడలు పిల్లలూ అందరూ ఇండియా వచ్చేస్తారు అంట.ఈ సంవత్సరం అంతా కూడా రిమోట్ వర్కే కదా! అది చేసుకుంటూనే ఇక్కడ డైరీ ఫామ్ పెట్టడానికి పనులు మొదలు పెడతారంట. అక్కడ సంపాదించిన డబ్బంతా ఇక్కడ పెట్టుబడి పెడతారంట. తమ్ముడిని కూడా పార్టనర్ ని చేస్తాను అని చెబుతున్నారు మా బావగారు. ఇక మా భూములన్నీ ప్రయోగశాలగా మారిపోనున్నాయి”


“మంచి విషయమే! మీ వాళ్ళకు అక్కడ జీవితం నచ్చలేదేమో,ఇక్కడికి  తిరిగిరావడం కూడా అంతకన్నా మంచి అవకాశాలు లభిస్తాయనేమో! ఏదైతేనేం తెలివి తక్కువ ఆలోచన మాత్రం కాదు. ఎంతోమంది యువత కూడా ఇక్కడ వారికి వున్న వనరులను సద్వినియోగం చేసుకోగలమని నమ్మకంతో తిరిగి వస్తున్నారు.సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. అదే కొన్ని విదేశాలకు కడుపుకూటికి వెళ్ళిన వాళ్ళు అంతో ఇంతో ఇంటికి పంపుదామనే ఆశతో వెళ్ళిన వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరుగా.

వారివి బాధలైతే వీరివి అవకాశాలు.అవకాశాలు సృష్టించుకునే వారికి చేజిక్కించుకునే వారికి కొదవేముంది? అందులో మీకు రాజకీయ పలుకుబడి కూడా వుంది కదా” అంది హేమ.


ఈ మాటా నిజమే అత్తా! అక్కడ పదిహేనేళ్ళపాటు పెరిగిన పిల్లలు ఇక్కడెలా అడ్జెస్ట్ అవుతారో ఏమిటో! సడన్ గా ఈ నిర్ణయాలు ఏమిటో!  ఆ పిల్లలే ఇక్కడ వుండటానికి వస్తుంటే నా పిల్లల గురించి నాకు బాధ ఎందుకు!? వారి ఉద్దేశ్యాలు మంచివైతే  ఉమ్మడి కుటుంబంగా కలిసి వుంటాం. లేకపోతే విడిపోతాం. ఏదైనా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు అని సంతోషపడుతుంది మా అత్తగారు. చూద్దాం ఏం జరగనుందో!  


లావణ్య మాటలలో ఎన్ని అనుమానాలు సంశయాలు వున్నప్పటికీ పాజిటివ్ థింకింగ్ తో స్పందించడం చాలా పాజిటివ్ గా అనిపించింది హేమకు. మేనకోడలి సంతోషంలో తన సంతోషం కలగలిపి “వలస వెళ్ళిన ఏ భారతీయుడు తిరిగి వచ్చేసేడన్న మాట విన్నా అనావృష్టికి ఎండిపోయిన ఊరి చెరువు తొలకరికే నిండి తొణికిసలాడుతున్నట్లు వుంటుంది. ఊరంతా పచ్చదనం పగిలినట్టువుంటుంది. మనసులో ఏదో తీపి ఆశ ఆకాశమంత ఆవరిస్తుంది” అంది కవితాత్మకంగా. అప్రయత్నంగా ఓ సినీగీతం అందుకుని “పాడిపంటలకు పసిడి రాసులకు కళకళలాడే భూమి.. మన జన్మభూమి బంగారు భూమి ఇక్కడ ఏం తక్కువ అనుకుంటాను” అంది పాటా మాటా కలిపేసి ఒకింత గర్వంగానూ అతిశయంగాను. 


“నీకు మరీ అంత దేశభక్తి పనికిరాదు. జాగ్రత్త అత్తా! ఈ సారి నేను ఫోన్ చేసేటప్పటికి నీ ఆలోచనలు మారిపోయి నిసృహగా ఏముంది ఈ దేశంలో కులం మతం అవినీతి తప్ప అంటావ్ చూడు” అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది లావణ్య.


మేనకోడలి మాటల్లో సత్యం చురుక్కుమనిపించింది హేమకు. “తలదాచుకోవడానికి ఇంత నీడ కూడు గుడ్డ లేని నిరుపేదలు ఎన్ని కోట్లమంది ఈ దేశంలో. వారి గురించి ఆలోచించే వారెవరూ!? వారి బతుకులతో కూడా వ్యాపారం చేయాలని చూసేవారు తప్ప అన్న చింత తరచూ ఆమె మెదడును తొలుస్తూనే వుంటుంది.ఐదు వేళ్ళు ఎప్పటికీ సమానం కాలేకపోతే మాన్లే కానీ ప్రతి పూటా ప్రజలందరికీ ఐదు వేళ్లు తినే కంచంలో పెట్టగల్గే భాగ్యం వుంటే బాగుండును కదా! అదే కదా అసలు సిసలైన బంగారు భూమి.ఈ బంగారు భూమిలో మనుషుల మనస్సులో కల్మషం భూమిలో విషం పండించకుండా వుంటే అంతే చాలు అనుకుంది భారంగా నిట్టూర్చి.


••••••••••••0••••••••••••••••••


(బహుళ త్రైమాసిక అంతర్జాతీయ పత్రిక మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితం)

10, జనవరి 2021, ఆదివారం

గీటురాయి

 వాచ్మెన్..వాచ్మెన్.. ఫస్ట్ ప్లోర్ నుండి ఒక గృహిణి కేకలు.కలుపు మొక్కలు ఏరుతూ మొక్కలకు నీళ్ళు పెడుతున్న వాచ్మెన్ పైపు వదిలేసి పరిగెత్తుకువచ్చాడు.  “ఏంటమ్మా పిలిచారు” అన్నాడు అరిచారని అనలేడు ఎంతైనా బక్కోడు కదా, పిలిచినావిడేమో రెండు కార్లున్న ఇంటావిడ. "ఎన్నిసార్లు చెప్పాలయ్యా.. పైనుండి  జుట్టును తోరణాల్లా కిందకి వదిలేస్తున్నారు.కనీసం వుండలు చుట్టి వేయాలనో డస్ట్ బిన్ లోనో వేయాలనే ఇంగితం లేకపోతే ఎట్లా..బెండకాయ ముక్కలు ఎండకు పెట్టి  లోపలకు తీసుకెళ్ళి మూకుట్లో వేయబోతే వేళ్ళకు చుట్టుకున్న పొడవాటి వెంట్రుకలుఎంత కంపరమేసిందో.ఇపుడా మూకుడు తీసుకెళ్ళి డస్ట్ బిన్ లో గుమ్మరించాల్సిందేపైకి వెళ్ళి ఒక్కొక్కరికి చెప్పిరాఇలా చేస్తే నేనూరుకోను" అంది గట్టిగా. "అలాగేనమ్మా.. మోటరు ఆపేసి తర్వాత చెప్పేసి వస్తా."  

భారతి అప్రయత్నంగా తన తల తడుముకుంది.తనది మూడంగుళాల జుట్టు కాబట్టి తనపై పడే నెపాన్ని తప్పించుకున్నానని అనుకుందిఆమెకీ అనుభవమేచాలాసార్లు బాల్కనీలో పప్పులు బియ్యం వడియాలు లాంటివి ఎండబోసినప్పుడు శుభ్రంగా వుండేవిడబ్బాలో పోయబోయేటపటికి వేళ్ళకు చుట్టుకునే జట్టుచెట్టుపైనుండి ఆకులు రాలినట్టు గాలికి వచ్చిపడే వెంట్రుకలు మనిషి తలనుండి రాలిపడవు కదా దువ్వి వదిలితే తప్ప అని  గౌరవంగా  అపార్ట్మెంట్ మెయింటెనర్ కి విన్నమించి వచ్చిందిఆమె విన్నపాలు కూడా గాలికి కొట్టుకొని వెళ్ళే ఎండుటాకులు అని ఇలా ఇంకెవరన్నా గట్టిగా అరిచినపుడు తెలుస్తూండేవి.

అప్పటివరకూ మౌనంగా ఉన్న పరిసరాలను బద్దలు కొడుతూ సవరాలు అమ్ముతాం వెంట్రుకలు కొంటాంఅని ఒకసారి “వెంట్రుకలు కొంటాం సవరాలు అమ్ముతాముఅని ఇంకొకసారి మార్చి మార్చి  అనౌన్స్ చేసుకుంటూ ప్రకటన కర్తలా విషయాన్ని    చేరవేస్తూ  మలుపు తిరిగి మట్టిరోడ్డుపై ప్రవేశింది ఒక ఆడ గొంతు.  మాటలనే పాటగా మార్చే సహజవిద్య తనకు తెలినట్లుగా రిధమిక్ గా వినిపిస్తున్న  ఆ స్వరజ్ఞానానికి ముచ్చటపడి  ఆమెనే చూస్తూ వుంది భారతి.  ఈమెను చూస్తే మొన్న సిమెంటు రోడ్డులో తచ్చాడుతూ అనుమానస్పందంగా తిరిగిన స్త్రీలలో ఒకామె లాగా వుంది. ఇందాక ఇంకొకామె పాత బట్టలకు స్టీల్ సామాను అమ్ముతామని కేకలు పెట్టుకుంటూ తిరిగిందిఈవాళ ఇంకెంత మందివున్నారోఇందాక ఒకతను పట్టుచీరలు జరీ చీరలు కొంటామని మూడు బ్లాక్ లమధ్య వెహికల్ వేసుకుని తిరుగుతుంటే మగవాళ్ళెవరో  వాచ్మెన్ని మందలించారు ఎవరిని బడితే వాళ్ళను లోపలికి  రానిస్తున్నావనిఏమైనా ఇక్కడ సెక్యూరిటీ తక్కువుంది అనుకుంటూ కొన్నాళ్ళ క్రితం  జరిగిన విషయాన్ని మరొకసారి గుర్తుచేసుకుంది భారతి.   

ఆ రోజు ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయాక కిటికీ ఎదురుగా వున్న సిమెంట్ రోడ్ సద్దుమణిగిందిరోడ్డుపై ఒక్క పురుగూ లేరుఇద్దరు స్త్రీలు ఆ రోడ్డుపై అటూ ఇటూ చూసుకుంటూ ఒకో ఇంటిముందు కాసేపు ఆగి పరీక్షగా చూస్తూ  వీధి మొదలుకు చివరకు రెండుసార్లు తిరిగారుపోనీ గ్రామ సచివాలయ సిబ్బంది అనుకుందామా అంటే అలా లేదు వాళ్ళ ఆహార్యంచూస్తే మొరటుగా వున్నారు.చీర కుచ్చిళ్ళుబొడ్డు దగ్గర దోపి జుట్టు ముడిపేసుకుని చెప్పుల్లేని కాళ్ళతో ఆ ఇళ్ళ మధ్య తిరిగేవాళ్ళకు విరుద్దంగా అనుమానస్పదంగా కనిపించారుకుర్చీలో వెనక్కివాలి కూర్చున్న ఆమె తనకి తెలియకుండానే నిటారుగై కిటికీ ముందుకు జరిగి వారిని నిశితంగా పరిశీలించింది  ఇద్దరిలోవున్న ఒకామె వెనక్కి వెళ్ళి కరంటు స్తంభంపై బొగ్గు ముక్కతో ఏదో రాసి వచ్చిందిఇంకొక ఆమె పూల మొక్కల మధ్య నుండి కాస్త ముందుకు నడిచి వెళ్ళి అక్కడే నిలబడింది

అయ్యోవీళ్ళేదో పట్టపగలే ఇళ్ళను దోచుకునే వారిలాగా వున్నారు.కొద్దిసేపటి క్రిత్రమే ఆ ఇంట్లో  వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారుఇపుడేమిటీ చేయడం అనుకుంటూ  కుర్చీలో నుండి లేచింది భారతిదూరంగా వెళ్ళిన స్త్రీ ముందుకు నడిచొచ్చి లోపలికి వెళ్ళిన స్త్రీ కనబడేటట్లు దూరంగా నిలబడి ఏదో చెప్పిందిఆమె వెనక్కి రాగానే ఇద్దరూ రోడ్డు మీద నిలబడే కట్టుకున్నచీరను ఎత్తి లోపలి లంగాను పరీక్షించుకుని నాలుగడుగులు
ముందుకేసారు.అంతలోకి బయటకు వెళ్ళిన ఇంటివాళ్ళు స్కూటర్ దిగడం చూసి తారురోడ్డు మీదకు నడుచుకుంటూ వచ్చారుఇలాంటి వాళ్ళే పగలు రెకీ నిర్వహించి టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడతారని చదివింది కొన్ని సినిమాల్లో చూసి వణికిపోయింది

ఆదేమాట వాచ్మెన్ భార్యతో అంటే “డబ్బులెక్కువ వున్నోళ్ళకు భయమెక్కువ.మీలాగే  ఎవరితోనూ కలవకుండా మాటామంతీ లేకుండా తాళాలేసుకుని ఇళ్ళ లోపలే వుండిపోతారుకాసేపు బయటకొచ్చి తిరగొచ్చు కదా,కాస్త మనుషుల గాలి పోసుకుంటారుఅందిభారతి మౌనంగా వుండేసరికి  "అయినా రోజులు కూడా అట్టాగే వుండయి లెండి.ఎవరినీ నమ్మడానికి లేదుసొమ్ము ఎంత పనైనా చేయిస్తుంది” అని వెళ్లిపోయిందిఎవరితోబడితే వాళ్ళతో మాట్లాడటానికి వీలులేదు.మాట్లిడితే ముంచుకొచ్చే ప్రమాదాలు మాట్లాడకపోయినా  ఎదురయ్యే ప్రమాదాలు మొత్తానికి మనుషుల జీవితాల్లో కనీకనబడని అభద్రతఒంటరితనం చిలకొయ్యకు వేలాడుతున్న అయిదు దశబ్ధాలకే వ్యర్దమైన వృద్ద జీవితాలివి అని నిట్టూర్చింది.

మరో రెండురోజుల తర్వాత  ఆ సిమెంట్ రోడ్డులో పట్టపగలు తాళాలు పగులగొట్టి దోచుకుని వెళ్ళారు అని తెలిసాక కొత్తగా వచ్చే ప్రతివారిని అనుమానంగా చూడటం అలవాటైపోతున్నట్లు వుండటం సిగ్గుగా ఉన్నా  జాగ్రత్త తప్పదేమో అనుకుంటూనే మళ్ళీ అంతలోనే తనను తానే మందలించుకుని సవరాలమ్మే ఆమె వైపు యధాలాపంగా చూసింది

ఆ నిర్మానుష్యవీధిలో తననొకరు గమనిస్తున్నారని తెలుసుకున్న సవరాల మనిషి మళ్ళీ తను ఏమిటీ ఎందుకొచ్చానన్న విషయాన్నిమరింత రాగయుక్తంగా వినిపించిందిదరహాసవదనంతో ఆమెనే చూస్తూ వుండగా..అమ్మా వెంట్రుకలు కొంటాం అందితల అడ్డంగా ఊపింది భారతిఆమె సంజ్ఞను అర్దం చేసుకుని ముందుకు సాగిన ఆమె ఓ గంట తర్వాత వెనక్కి తిరిగి వచ్చి వీధి మలుపులో  వున్న కానుగ చెట్టు నీడ క్రింద  ఆగి తనభుజానికి తగిలించుకున్న అల్యూమినియం సామానున్న వల సంచీని  దించి అందులో ఉన్న ఒక పెద్ద పాత్రను బోర్లించి ఆసనంగా మార్చుకుందివాషింగ్ ఏరియాలో కూర్చుని ఎండుమిరపకాయల తొడిమలు తీసుకుంటున్న భారతికి ఆమెని  పరిశీలనగా చూడటం బాగుందివల సంచీలో నుండి కూర వొండుకునే చట్టిని తీసి  ఒకదాంట్లోనుండి మరొకటి తీస్తూ ఆరు అంకె దగ్గర ఆగి అందులో నుండి స్టీల్ బాక్స్  తీసి భద్రంగా వొళ్ళో పెట్టుకుందిసంచీలో  నీళ్ళసీసా  తీసి చేయి కడుక్కుని  నాలుగు ముద్దలు తిని మళ్ళీ చేయి కడిగి స్టీల్ బాక్స్ ను మునపటిలానే సర్దిందితర్వాత చేతిసంచీలో  వున్న సవరాలను నేల తగలకుండా చెయ్యిఎత్తి పెట్టి నున్నగా దువ్వింది.  పనిలో పనిగా తన తలను కూడా దువ్వుకుని పైట చెంగుతో ముఖం తుడుచుకుని దువ్వెన దాచి  బులుగు రంగు కేరీ బేగ్ తీసి ఆరోజు తన సేకరణను తడిమి చూసుకుని నాణ్యతను పరిశీలించుకుంది.  ఇదంతాచూస్తున్న భారతి ప్చ్ మని నిట్టూర్చిందిచిన్న చితక పనులు చేసుకుంటూ చాలీచాలని సంపాదనతో రోజులెల్లబెట్టుకుంటూ బ్రతుకు పోరాటం చేస్తున్న వారిపట్ల సానుభూతి పెరిగిందిరోజంతా తిరిగినా వారికి గిట్టుబాటు అవుతుందో లేదో.. ఇలా వీళ్ళు కొనుక్కుని తీసుకువెళ్ళిన వెంట్రుకులకు మంచి ధర వస్తుందని విగ్గులుతయారు చేసే వారికి అమ్ముతారని వింది.  సవరాలామె మెల్లగా లేచి భుజానికి సామానున్న వల సంచీని చేతి సంచీని తగిలించుకుని గొంతు విప్పిముందుకు నడుస్తుండగా పక్క నున్న బ్లాక్ లో మూడో అంతస్తులో ఒక ప్లాట్ తలుపు భళ్ళున తెరుచుకున్నాయి.

"ఇదిగో.. సవరాలమ్మాయ్.. ఇటు..ఇటు రా" అని కంచు కంఠంతో పిలిచింది పొడుగు జడావిడఆమె పెద్ద ఆఫీసర్ భార్య అని చీటికిమాటికి కిరణా షాపుల చుట్టూ తిప్పుతుంది అని గతంలో పనిచేసి వెళ్ళిపోయిన వాచ్మెన్ భార్య చెపితే విందిపిడచ చుట్టుకున్న తలతో హడావుడిగా పూలను తుంచుతూ సగం తెగినపూలను పసి మొగ్గలనూ నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తూ  భక్తురాలిగా రోజూ గుడుల చుట్టూతిరుగుతూండే ఆమెతో పెద్దగా పరిచయం లేదు ఏదో రెండు మొహమాటపు ప్లాస్టిక్ నవ్వులు తప్ప.

ధర ఎంత“ అడుగుతుంది పొడుగు జడావిడ. “వంద గ్రాములు నూట యాబై రూపాయలమ్మా” “పోయినేడాదిలోనే అంత తక్కువ ధరకు అమ్మలేదు.మూడందలుకి ఇచ్చాను” 
అంత రేటుకు మా దగ్గర కొనే వాళ్ళు లేరు.నాకు గిట్టదుఅంది అంది సవరాలావిడ
తన బారుజడను ముందుకు వేసి చూపించి “ఇంత పొడుగున్న జుట్టుకు వంద గ్రాములకు అయిదొందలు ఇస్తారు.ఇచ్చేటట్టైయితే లోపలికి రా“ అంది బెట్టుగా.
మూడొందల యాబైకి ఇవ్వండి.ఇక అంతకన్నా ఎక్కువ రాదు మాక్కూడాఅని అక్కడే నిలబడింది సవరాలావిడ తన బెట్టుపోకుండా
‘తల జట్టేనాఇంకేదైన జుట్టుకూడా కొంటావా’’వెకిలిగా అడిగింది పొడవు జడావిడఆ మాటల్లో అశ్లీలం అర్దమైన భారతి ఆమె వైపు  ముఖం చిట్లించి అసహ్యంగా చూస్తే సవరాలావిడ చేత్తో నోరు మూసుకుని ఛీ అన్నట్టు చూపులతో మాటాడి నోటితో మాత్రం మేమెరికి అమ్ముకోము,మా దగ్గర ఎవరూ కొనరమ్మామీకు చేతైతే ఆ పని చేసుకోండి” అంది. “ ఏదో హాస్యానికి అన్నాలేలోపలకిరా” అని పిలిచింది

సవరాలావిడ గేటుదాటి లోపలకు వచ్చిందిరెండు బ్లాక్ ల మధ్య తన సరంజామా దించి నేల మీద కష్టంగా కూర్చుంది.పొడవు జడావిడ పనిమనిషి తెల్లటి క్యేరీ బేగ్ తీసుకొనివచ్చి సవరాలామెకి ఇచ్చి నిన్ను జుట్టు చూసుకోమన్నారు నాలుగొందలకు తక్కువ ఇవ్వనని చెప్పమన్నారుమీరు తూకం వేసుకోనే తక్కెడ కూడా కుదరదన్నారు.ఆమే తూకం మిషన్ తెస్తారంట అని చెబుతుంటే “భలే బేరంతగిలిందిఇట్టాంటి మనిషిని నేనెక్కడా చూడలేదువిసుగు చూపించింది సవరాలామె.  

పనామె సవరాలు చూసుకునే పనిలో వుంటే సవరాలామె పనామె తెచ్చిచ్చిన తెల్ల క్యేరీ బేగ్ లో జుట్టనుతీసి దువ్వెనతో దువ్వి నాణ్యతను పొడవును పరీక్షించుకుని అందులోకే నెట్టేసి తన దగ్గరున్నక్యేరీ బేగ్ లో స్టీల్ గిన్నెల త్రాసును బయటకు తీసి నేలపై పెట్టిందిపనావిడ సవరం పట్టుకుని వాచ్మెన్ భార్యతో  ఎంతకు తీసుకోవచ్చనే సలహా అడుగుతూ వేరే కబుర్లలో మునిగిపోయింది

కాసేపటిక పొడవుజడావిడ తూకం మిషన్ తీసుకుని వచ్చి చూపించి  దీనితో తూకమెయ్యి అంది. "వెంట్రుకలు ఎంత బరువుంటాయమ్మా.. దీనితో తూకం ఎట్టా ఏస్తారుమా దగ్గర మోసం వుండదు.  బంగారం తూకమేసుకునే త్రాసు ఇదికావాలంటే నువ్వే పరీక్షించుకో" అని పొడుగు జడావిడకు ఇచ్చిందిచూసిన తర్వాతకూడా  ఏదో అనుమానం ఆమెకు. "ముందు మా మిషన్ మీద తూకమేసి తర్వాత నీ దాంట్లో చూద్దాం "అందిసవరాలామె కోపాన్ని అణుచుకుంటూ క్యారీ బేగ్ లో వెంట్రుకలు తీసి తూకం మిషన్ పై పెట్టింది."వంద గ్రాములు వుండయి అమ్మా".."వందేమిటి నూటయైబై దగ్గరగా వుంది ముల్లునూట యైబై గ్రాములకు  ఆరొందలువస్తాయిఆ లెక్కన ఇచ్చి తీసుకెళ్ళు “ అంది పొడుగుజడావిడసవరాలామె తన త్రాసులో వెంట్రుకలు తూసింది. "నూట పాతిక గ్రాములుఅయిదొందలొస్తాయి" అని గిన్నెలో నుండి తుట్టులు తుట్టులుగా వున్న జుట్టును తీసి కిందబెట్టి తన బులుగు క్యేరీబేగ్ ను త్రాసును తీసి సంచిలో పెట్టుకుంటుంటే .. "ఆ బ్లూక్యేరీ బేగ్ లో వుందేమిటీ" అని అడిగింది ఆరాగా. "మునుపు బేరం చేసిన జుట్టు" అని లోపలికి సర్దుకుంది

పొడవజడామె తన పని మనిషి వైపు తిరిగి “ లక్ష్మీ నీ సవరం కొనే మురిపంలోబడి నేనిచ్చిన బేగ్ ఆమెకిచ్చేసావ్తూకం వేసినపుడే నాకనుమానం వచ్చింది తక్కువుందేమిటా అని.పావుకిలో అవుతుందనే  అంచనా నాకు. జుట్టు చూసుకుంటున్నట్టు నటించి నువ్వు చూడకుండా  నొక్కేసిందిఅంది

"తల్లీ మాటలు మర్యాదగా ఉంటే బాగుంటదికావాలంటే చూసుకోమీ జట్టువేరు ఈ జుట్టు వేరు “ సంచీలో క్యేరీ బేగ్ తీసి బయట పడేసింది.పనావిడ కిందకి వొంగి తీసి పొడవు జడావిడకు ఇస్తే ఇదిగో మా అమ్మాయి జుట్టే ఇదిసైలెంట్ గా నొక్కేసింది అంటుంటే సవరాలామె కింద నుండి విసురుగా లేచి నించుని "ఆపమ్మా.. ఊరుకుంటే మరీ ఇదిగా మాట్టాడతన్నావ్,లోకంలో నీకేనా జుట్టు వుండేదిఅందరి జూట్టూ నాదే అంటే ఎట్టా జ్ఞానంతో మాట్టాడాలి” అంది కోపంగా.

"బద్మాష్దొంగతనం చేసిందికాక  మళ్ళీ కాదని వొటవరిస్తున్నావునా జుట్టును ఎంత జాగ్రత్తగా వుండజుట్టి  దాచివుంచానో.  ఎవరు చూడటల్లేదు కదా అని  ఆ సంచీలో కలిపేసుకుని నాటకాలు ఆడతన్నావునువ్వు బాగు పడవు మట్టి గొట్టుకు పోతావ్." ఆవేశంతో మాటలు జారింది.  సవరాలామె తర్జనగా వేలు చూపించిఅమ్మా ఇంకొక్క మాటంటే బాగోదు” అంటూ తన చేతిలోని బులుగు క్యేరీ బేగ్ ని పొడవు జడావిడ మీదకు విసిరేసి గేటునుండి బయటకు నడిచింది

పై నుంచి మొదటి నుండి ఇదంతా చూస్తున్న భారతి పెదవులపై నవ్వు తన్నుకు వచ్చింది. చాలా సందర్భాలలో  సత్యానికి ధర్మానికి కట్టుబడి నడుచుకుంటూ ఇతరులలో అవి లోపించినప్పుడు నష్టపోయి మనసు కష్టపడినపుడు నీతి నిజాయితీకి విలువలేదని వాపోతూ ఉంటాం. కానీ అసలైన మనిషితనాన్ని మనిషి సహజగుణాలనో ఆత్మాభిమానాన్నో  రుజువుచేసుకునేది మాత్రం అవమాన పడినప్పుడు నష్టపోయినప్పటి  ప్రవర్తనే కదాఎంత గొప్పగా స్పందించింది  సవరాలామె, ఎంత అభిమానంగా  ప్రవర్తించింది  అని ఆశ్చర్యపోయి తెగ మెచ్చుకుంటూ  "శెభాష్ శెబాష్" అని  లోలోపల అనుకుంటున్నానని పొరబడి పైకే అంటూ అప్రయత్నంగా చప్పట్లుకొట్టిందిఅవమానభారంతో జేవురించిన ముఖంతో కోపంగా పైకి చూసింది పొడుగు జడావిడఆమె చూపుకందకుండా క్షణంలో వెనక్కి జరిగింది

ఇవేమి తెలియని ఆమె కూతురు లిప్ట్లో నుండి క్రిందకు దిగి తల్లి  దగ్గరకొచ్చి “ అమ్మా..ఇదిగో  డ్రెసింగ్ టేబుల్ అరలో వుంచిన నా  జుట్టు“ అంటూ పొడవు జడావిడకు అందించిందిఅదఃపాతాళానికి కుంచించుకు పోవాల్సిన ఆమె  ఇంకా తనను తాను నిలబెట్టుకుంటూ ఇది  మీ పిన్ని పంపిన జుట్టుఅసలు నిన్నెవరు తెమ్మన్నారిక్కడికిఅంటూ తనంత ఎదిగిన పిల్లను ఒక్క  చరుపు చరిచిందిఆ శబ్దానికి అప్రయత్నంగా ముందుకడుగు వేసిన భారతి “అయ్యో!ఎందుకలా తొందర పడుతున్నారుకాస్త కూల్ గాఆలోచించండి” అంది

అంతా తననే  చూస్తున్నారనే  అవమాన భారంతో గేటు దగ్గరకు విసవిస నడుస్తూ “గట్టిగా అడిగేసరికి తప్పు ఒప్పుకుని జుట్టంతా వదిలేసిపోయిందిదొంగమందకి అన్నీ దొంగబుద్దులుఅందుకే మీ బతుకులు ఎప్పుడూ రోడ్డు మీద అడుక్కుతినే బతుకులే.మంచిరాత రమ్మంటే ఎక్కడినుంచి వస్తుంది.అహంకారం తలకెక్కిన మాటలు అక్కడితో ఆగడం లేదు.  దాష్టీకంలో కొంత  అక్కడ చూస్తున్న వారి మీదకు మళ్ళించి "చూసేవాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారు తప్ప బయటమనిషిని నిలబెట్టి అడగడం మానుకున్నారుఅనగానే  తొంగిచూస్తున్న తలలు  మనకెందుకులే అని గబుక్కున  లోపలికి లాక్కున్నారు

ముందుకు నడుస్తున్న సవరాలామె ఆగి వెనక్కి తిరిగి పొడుగు జడావిడ వైపు నిమ్మళంగా ఓ చూపు చూసి గట్ఖిగా ఖాండ్రించి ఉమ్మేసి వడివడిగా సాగిపోయింది. వెళుతూన్న సవారాలమెను చూస్తూ "బంగారం పరీక్షించడానికి  గీటురాయి ఉన్నట్లు మనిషి నైజం తెలియడానికి ప్రవర్తనే కదా గీటు రాయి" అనుకుంది భారతి సాలోచనగా.