మరకతమణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరకతమణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, నవంబర్ 2018, గురువారం

సుర్ (సంగీత్)

ఈ సినిమా వచ్చినప్పటి నుండీ వింటూనే వుంటాను. 

ఈ పాట గురించి నేనొక అమ్మాయికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయింది .. యెలా తెలుసు మీకివన్నీ అని. 

నేనేమో ఆమెనవ్వు కథలో కృష్ణ లా .. కొన్ని అట్టాగే తెలుస్తుంటాయి అన్నాను. :)

నాకెలా తెలుసా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే మరకతమణి కీరవాణి M M Kreem పేరుతో అందించిన స్వరాలు కదా అని తట్టింది. 

కొన్నాళ్ళు నా కాలర్ ట్యూన్ గా వూరేగిన పాట. 

మళ్ళీ వింటున్నా .. రాత్రి నుండి. మెలుకువ వచ్చినప్పుడల్లా. ఎవరు పాడినా , వాయించినా వింటూనే వున్నాను. 

అన్నింటి కన్నా యిదిగో .. ఇదే బాగా యిష్టం.మంచి సంగీతమే కాదు సాహిత్యం కూడా.

చదివి చదివి యాంత్రికమైపోయినప్పుడు యిలా సంగీత సాగరంలోకి దూకేస్తా.. :) <3 <3


  


27, అక్టోబర్ 2017, శుక్రవారం

మరుగేల మబ్బు ముసుగేల

నాకిష్టమైనపాట


ముగ్గురి హృదయాల సున్నితమైన  అలజడి అద్భుతమైన బాణి  సుతిమెత్తగా కోసేస్తుంది. ప్రతిరోజూ విన్నా .. విసుగువేయని పాట. "అల్లుడు గారొచ్చారు " చిత్రంలో "హరిహరన్ " పాడినపాట. ఇదే చిత్రంలో .. రంగు రంగురెక్కల సీతాకోక చిలుక పాట కీరవాణి కూడా చాలా బాగుంటుంది. 


పాట సాహిత్యం :


మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమామా ఓ చందమామా

మనసున మల్లెలు విరిసిన వేళ

మమతల పల్లవి పలికిన వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమా..మా ఓ చందమా..మా


కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా

కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా

ఉలి తాకిన శిల మాదిరి ఉలికులికి పడుతోంది ఎదలో సడి

చలి చాటున మరుమల్లెకి మారాకు పుడుతోందో ఏమో మరి

చెంతకు చేరే సుముహుర్తాన ఆశలు తీరే ఆనందాన

మౌనమే మోహన రాగమయే వేళ


మరుగేల మబ్బు ముసుగేల



మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా

చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా

కనుచూపులో చిగురాశలు బరువైన రెప్పల్లో బంధించకు

మది వీధిలో స్వప్నాలకి సంకెళ్ళు వేసేటి జంకెందుకు

ఊయలలూపే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

మరుగేల మబ్బు ముసుగేల


మనం చూసే వీడియో పాటకి వినే ఆడియో పాటకి తేడా ఉంటుంది . 

చరణాలు అటుదిటు  మారిపోయి ఉంటాయి.


ఈ పాటకు మా నాన్న గారి అవార్డ్ లభించింది అని కీరవాణి గారు "స్వరాభిషేకం " కార్యక్రమంలో చెప్పారు . శ్రోతలకు వీనులువిందు చేసినపాట  కీరవాణి గళంలో కూడా వినడం బాగుంటుంది. మరకతమణి కీరవాణి గారి స్వరకల్పన అంటే నాకు చాలా ఇష్టం . ఏ పాటకు ఆ పాటే బాగుంటుంది. కొన్ని నాసిరకం పాటలు పాటలు కూడా ఉన్నాయేమో .. ఆ పాటలను వెదికి వినడం నాకు సరదానే కానీ .. పాటలన్నింటిలో 90% సాహిత్యపరంగా సంగీతపరంగా ఆకట్టుకున్నవే !

ఆ పాటలన్నింటిలోనూ నాకు చాలా ఇష్టమైన పాట యిది.






21, అక్టోబర్ 2011, శుక్రవారం

స్వీట్ మెలోడి

చిత్ర సీమ సాక్షిగా ఎన్నో పాటలు మన మనసుని రంజిపజేస్తూనే ఉంటాయి.మరి కొన్ని పాటలుమనసుని కసకస రంపంతో కోసేస్తున్నట్లు  భాదను పెంచుతాయి. ఇదొక స్వీట్ మెలోడి.

తను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మనసులో తనకొక సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆ ప్రియురాలి ప్రేమలో కరిగి పోవాలని తన చెంత ఆమె ఒదిగిపోవాలని మనసారా తలపోస్తూ ఉండే యువ ప్రేమికుడికి తన ప్రేయసి తన ప్రేమని తిరస్కరిస్తే కలిగే భాద జీరించుకోలేనిది.అయినప్పటికీ ఏనాటికైనా ఆమె ప్రేమని గెలుచుకోగలను  అనే నమ్మకంతో..తన వేదనని పాటగా మలచి వినిపిస్తున్నాడు ఆ ప్రేమికుడు.

నువ్వు చూసినా చూడకపోయినా .మాట్లాడినా మాట్లాడక పోయినా తనని ప్రేమిస్తూనే ఉంటానంటున్నాడు. ఆమె తిడితే తన  పేరు ఆమె పెదవులపై నిలిచిందని సంతోషపడతాను.ఒక వేల కోపంతో ద్వేషం తో కొట్టినా తన చెంప పై ఆ తీయని గుర్తులు మిగిలిపోతాయని ఆనందంగా పాడుకుంటూ  ప్రేమని ప్రేమతోనే జయించాలి తప్ప ప్రేమించలేదని ద్వేషంతో.. కత్తులతో దాడులు చేయడం, యాసిడ్ దాడులు చేయడం చేస్తున్న యువతకి.. ఓ..మంచి సందేశం ఇస్తున్నాట్లు ఉన్న ఈ పాట "ఒకటో.నంబర్ కుర్రాడు" చిత్రానికి "చంద్రబోసు" సాహిత్యం అందిస్తే.. మంచి పాటని పాడే అవకాశం ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టు   ఎమ్.ఎమ్.కీరవాణి  స్వీయ సంగీతంలో.. ఎంత చక్కగా పాడి..పరవశింపజేసారో! 

ఈ పాటలో..విశాఖ సాగర తీరం,కైలాసగిరి చూడవచ్చు. 

ప్రేమికుల్లారా! ప్రేమించండి.ప్రేమని జయించండి. కానీ ప్రేమిస్తున్నట్లు   నటించకండి . నిజమైన ప్రేమ కి.. నిరీక్షణ అవసరం.



     

7, సెప్టెంబర్ 2011, బుధవారం

మరకత మణి స్వరాల హరివిల్లు

మరకత మణి  కీరవాణి.. స్వరాల హరివిల్లు.. లో.. ఒకే  చిత్రం రెండు భాషల్లో.. వైవిద్యభరితమైన గాయనీగాయకుల గళాలలో  వినండీ.. 

అలాగే  శ్రీ దేవి అరవింద స్వామి లను  చూడండీ.












  

4, ఆగస్టు 2011, గురువారం

హరిపాదం లేని చోటు

మురళీ మోహన రాగం 
వెన్నుడొచ్చెవేళ   
దీప స్వాగతాలు 


పాండురంగడు చిత్రంలో మరకతమణి  కీరవాణి స్వరకల్పనలో..ఒక అపురూప మైన గీతం ..

 ఈ... రోజు పరిచయం చేయబోయే.. గీతం.. గోవిందుడే  కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ..

.

నాకు  చాలా చాలా  బాగా నచ్చిన పాట. ఎందుకు నచ్చిందంటే నేపద్యం, పాట సాహిత్యం,ముఖ్యంగా..అద్భుతమైన సంగీతం,చిత్రీకరణ..సునీత ,కీరవాణి,మధు బాలకృష్ణ గళములు తేనేలూరుతాయి.

పాట సాహిత్యం:

గోవిందుడే కోక చుట్టి 
గోపెమ్మ వేషం కట్టి 
మున్గోల చేత చుట్టి వచ్చెన్నమ్మా (గో)
నవ మోహన జీవన వరమిచ్చేనమ్మా 
ఇకపై ఇంకెప్పుడు నీ చెయివిడిచి వెళ్లనని 
చేతిలో చెయ్యేసి ఒట్టే సేనమ్మా

ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు (ఎ) 
వెన్నుడొచ్చేనమ్మా . 
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చేనమ్మా 
వెన్న పాలు ఆరగించి
విన్నపాలు మన్నించి (వె)
వెండివేన్నెల్లో ముద్దులిచ్చినమ్మా
కష్టాల కడలి పసిడి  పడవాయెనమ్మా
కళ్యాణ రాగ మురళి కళలు చిలికినమ్మా
మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా 
వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా (గో)

తప్పటడుగు తాండవాలు చేసెనాడమ్మా 
హరి పాదం
తన అడుగుల ముగ్గులు చూసి మురిసి నాడమ్మా 
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి (మన)
మన తప్పటడుగులు సరి దిద్దినాడమ్మా   
కమసారి సంసారి కలిసిమేలిసేనమ్మా 
కలకాల భాగ్యాలు కలిసోచ్చేనమ్మా 
హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా  
శ్రీ పాదం ఉన్నచోట సిరులు విరుయునమ్మా   (గో)     

3, జులై 2011, ఆదివారం

స్వరాలతో. "ప్రియరాగాలు"మీటిన మరకతమణి.

మరకతమణి కీరవాణి గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. వారు స్వరపరచిన ప్రతి పాటా నాకు ఇష్టమే.

ప్రతి పూటా.. ఒక పాటైనా విననిదే.. మనసు ఆహ్లాదకరం గ ఉండదు. కీరవాణి రాగం పేరు పెట్టుకున్న "రాజమణి" వయోలిన్,వేణువు,గజ్జెలు,డ్రమ్స్..అన్నీ ఆయన కీ బోర్డ్ పై..నాట్యాలు చేసి..మన మససుని ఆనందగోలికల్లో..ఊగిస్తాయి.

కీరవాణి గారి పుట్టిన రోజు..జూలై 4 సందర్భంగా.. వారికీ..జన్మదిన శుభాకాంక్షలు..అందిస్తూ..
అందరికి..తెలిసినవే..అయినా మరొకసారి వారి గురించి..ఈ..మాటలు.
కీరవాణి స్వరాలు గత ఇరవై సంవత్సరాలుగా తెలుగునాట మారుమ్రోగు తున్నాయి. కీరవాణి స్వరాలూ ఉంటె..ఆ చిత్రం ఆడియో పరంగా సగం విజయం సాధించినట్లే..అని..నమ్మకం కూడా.. మనసు-మమత మొదలు.. నేటి బద్రీనాద్ వరకు.. కీరవాణి స్వరాలకు..పరవశించని వారు వుండరు.

తెలుగు,తమిల్,కన్నడ,మళయాళ,హింది మొదలగు బాషా చిత్రాలకు..గాను..అయన సంగీత దర్శకత్వం వహించారు.అన్నమయ్య చిత్రం కి..సంగీతం అందించి..జాతీయ పురస్కారం అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు ని ఆరుసార్లు అందుకున్నారు. కీరవాణి చాలా పాటలు కూడా పాడారు.

ఆయన పాడిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాట ..జాతీయ ఉత్తమ గీతంగా అవార్డుని అందించిన పాట వేటూరి గారి కవి కలానికే..ప్రాణం పోసిన పాట. కీరవాణి గారు గీత రచయిత కూడా.. చాలా పాటలు మనం వింటున్నా ..మనకి ఆ సంగతి తెలియదు.

కీరవాణి గారు లిరిక్స్ అందించిన ఈ పాట .. "ప్రియరాగాలు" చిత్రం లో.. పాట.

రాయభారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపినదేవరే పూల తోటలలో..
కోకిల్లమ్మని కూయమంటూ.. పల్లె వీణను మీటమంటూ
కల్యాణి రాగాల వర్ణాలతో..
నీ..పా..ట తేట తెలుగు వెలుగు పాట
చల్లన్నమ్మ చద్దిమూట
అన్నమయ్య కీర్తనల ఆనంద కేళిలా
నీ బా ..ట గడుసుపిల్ల జారు పైట గండు మల్లె పూలతోట
పల్లెటూరి బృందావనాల సారంగలీలగా
చిరుమబ్బుల దుప్పటిలో..ముసుగు పెట్టిన జాబిలిలా
నునువెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా
కోడి కూసే వేళ దాక ఉండి పోతే మేలు అంటూ..
గారాలు బేరాలు కానిమ్మంటూ .. (రా)
ఉయ్యా ...ల ఊపి చూడు సందెవేళ పిల్లగాలి శోభనాల
కొండనుంచి కోనఒడికి జారేటి వాగులా..
జంపా..ల జమురాతిరైన వేళ
జాజిపూల జవ్వనాల జంటకోరి జాణ పాడే జావళీ పాటలా
గోపెమ్మలు కలలు కనే గోవిందుని అందములా..
రేపల్లెకు ఊపిరిగా రవళిన్చిన వేణువు చందం లా..
హాయిరాగం తీయమంటూ
మాయచేసి వెళ్ళమంటూ .
నాదాల తానాలు . కానిమ్మంటూ.. (రా)

ఈ పాట సాహిత్యం చేయి తిరిగిన కవి కలం ని తలపిస్తుంది... సాహిత్యం ని ఇంకో పోస్ట్ లో..వివరిస్తాను. ఈ చిత్రంలో.. కూనలమ్మ కూనలమ్మ ,చిన్నా.. చిరు చిరు నవ్వుల కన్నా .. పాటలు హిట్ సాంగ్స్ ..ఎందుకో..ఈ పాట మాత్రం నాకు ఇష్టం. ఈ పాటని ఎస్.పి బాలు, చిత్ర పాడారు.
కీరవాణి గారు ఈ సాహిత్యాన్ని చాలా ఇష్టం గా రాశాననీ ఒక ఇంటర్ వ్యూ లో..చెప్పారు.
వారికి..జన్మ శుభాకాంక్షలు అందిస్తూ..ఈ పాట పరిచయం ద్వారా.. కీరవాణి గారిని.. మరో కొత్త కోణంలో.. చూడటానికి..వీలుగా.. ఈ..పోస్ట్.

మధుర స్వరాలతో.. రాగాలు మీటిన మరకతమణి కి జన్మదిన శుభాకాంక్షలతో ..
మరిన్ని పాటలకి..మధుర సంగీతం అందిస్తూ.. వీనులవిందు చేయాలని.. సంగీత వినీలాకాశంలో.. కీరవాణి గా.. యశస్వి భవగా.. ఉండాలని కోరుకుంటూ..
ఇక్కడ వినేయండి.