27, అక్టోబర్ 2017, శుక్రవారం

మరుగేల మబ్బు ముసుగేల

నాకిష్టమైనపాట


ముగ్గురి హృదయాల సున్నితమైన  అలజడి అద్భుతమైన బాణి  సుతిమెత్తగా కోసేస్తుంది. ప్రతిరోజూ విన్నా .. విసుగువేయని పాట. "అల్లుడు గారొచ్చారు " చిత్రంలో "హరిహరన్ " పాడినపాట. ఇదే చిత్రంలో .. రంగు రంగురెక్కల సీతాకోక చిలుక పాట కీరవాణి కూడా చాలా బాగుంటుంది. 


పాట సాహిత్యం :


మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమామా ఓ చందమామా

మనసున మల్లెలు విరిసిన వేళ

మమతల పల్లవి పలికిన వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమా..మా ఓ చందమా..మా


కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా

కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా

ఉలి తాకిన శిల మాదిరి ఉలికులికి పడుతోంది ఎదలో సడి

చలి చాటున మరుమల్లెకి మారాకు పుడుతోందో ఏమో మరి

చెంతకు చేరే సుముహుర్తాన ఆశలు తీరే ఆనందాన

మౌనమే మోహన రాగమయే వేళ


మరుగేల మబ్బు ముసుగేలమాటకు అందని ఊసులు లేవా చూపులలోనా

చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా

కనుచూపులో చిగురాశలు బరువైన రెప్పల్లో బంధించకు

మది వీధిలో స్వప్నాలకి సంకెళ్ళు వేసేటి జంకెందుకు

ఊయలలూపే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

మరుగేల మబ్బు ముసుగేల


మనం చూసే వీడియో పాటకి వినే ఆడియో పాటకి తేడా ఉంటుంది . 

చరణాలు అటుదిటు  మారిపోయి ఉంటాయి.


ఈ పాటకు మా నాన్న గారి అవార్డ్ లభించింది అని కీరవాణి గారు "స్వరాభిషేకం " కార్యక్రమంలో చెప్పారు . శ్రోతలకు వీనులువిందు చేసినపాట  కీరవాణి గళంలో కూడా వినడం బాగుంటుంది. మరకతమణి కీరవాణి గారి స్వరకల్పన అంటే నాకు చాలా ఇష్టం . ఏ పాటకు ఆ పాటే బాగుంటుంది. కొన్ని నాసిరకం పాటలు పాటలు కూడా ఉన్నాయేమో .. ఆ పాటలను వెదికి వినడం నాకు సరదానే కానీ .. పాటలన్నింటిలో 90% సాహిత్యపరంగా సంగీతపరంగా ఆకట్టుకున్నవే !

ఆ పాటలన్నింటిలోనూ నాకు చాలా ఇష్టమైన పాట యిది.


కామెంట్‌లు లేవు: