29, నవంబర్ 2019, శుక్రవారం

Affectionate Touch



ఆంగ్ల అనువాదంలో నేను వ్రాసిన కథ ..

Affectionate Touch

It was summer. No matter how soft the pillow is, I was getting messed up under it.
If she is not there, I cannot even feel like doing something even for a minute, why doesn’t she understand? Hope she removes it and throws it outside.  I can atleast see everyone and relax. I feel irritated to sit like this with nobody greeting me and unable to move.

Just like everyday, she didn’t take me in her arms and turned me either side , touching me softly and seeing me with a laugh and not talking like usual.  Though I was in her hands, her look was on the clock . Happiness was dancing on her face for minute by minute.  It made me tearful,  the smile on lips,  and the heart which was beating fastly.

Son called after getting down the flight. Thank god! I got some movement.  He asked me where I was.  When I said I am not coming to the airport,  he was disappointed.  But he immediately relaxed and said its okay.  Your father in law is coming to receive you, that’s why I am not coming I said.  Your luggage is too big for one car isn’t it, that’s why I arranged another car , she said.

“where is the car driver who came for me mom? Send me his number.” She gave the driver’s number.

The driver is a fast driving guy.  His name is Stalin.  She was surprised to hear his name for the first time.  My Dad is a fan of Stalin ma’am, that’s why he kept that name for me. He said.“See Stalin, you should bring my son carefully. Don’t drive rash”, she warned the driver and also said to the father in law, “The driver is too rash, you please tell him to reduce the speed in between.  She told precautions and kept me away again.

Since the car started, her eyes were on the clock.  Mango dal, potato fry,  bhendi coconut fry,  and gongura pickle was made by her. These are the favorite dishes of her son it seems.  The moment he comes, she was saying she will feed the son.  The old woman was murmuring why can’t the latter cook the same way for her son.  She extracted the mango juice and kept it in fridge for coolness. No matter how much work she did, the time was 10:30, she was irritated to see the time go so slowly!
From Shamshabad airport to Vijayawada.  289 plus six is equal to 295 kilometers will take four and half hours.  She was estimating that they might have come till Suryapet.  She tried to get a nap in between and suddenly got up to see the clock. Maybe she remembered my use then,  she took me to hands and said, “ Dear, till where did you come up! Did the kids eat anything? Stop in between and eat something!”. She greeted. And again slept.

When she needs to do wedding arrangements,  invite the relatives and friends and to buy things, she remembers me well.  She might take me for granted now but she is really nice.  She has reserved nature , by bearing  things on her shoulder,  accumulating energy,  looking after financial matters,  facing some dissatisfaction and waits for the day when her dream to come true.  In fact, she really talks to people only through me but never face to face.

After some time, I got relief from silence again.  Words flew through me. “Brother, till where did you come?”, she asked.  We came off , we are near auto nagar he said and she immediately took me in her hands and ran towards outside. The snoring sound of her son, father in law, mother in law . None of them were waiting the arrival.  She was irritated seeing what sort of persons they are.  Love, hatred or anything comes only after sleep! She was murmuring this and went to open the gate lock . She came down three floors not to disturb the sleeping people with the lift sound. The watchman was sleeping with mosquito nets.  Not to disturb his sleep, she came out of the gate and stood on the road.

She never lets her legs be idle even for a minute.  She was moving here and there and was eagerly looking at the edge of the street. She was seeing if any car is coming from the Machilipatnam road. Car wasn’t coming but police patrol van came. Seeing her on road, the van slowed down.  She walked near them and said ,” Sir, my son is coming from abroad that’s why I am waiting here!”, they said okay and went ahead.

After two minutes of their departure, an innova car came.  She was searching for her son in the car wondering which side he is sitting.  These people have so much love for children  and for the first time she felt bad that her mother was not there. When the car stopped , and she put the hand on the car handle to open the back door,  the son opened the door from inside and greeted her.

When she saw her son standing in front of her, inexplicable sadness crept her. She hugged him saying my darling,  She flooded him with tears of happiness.  She became like a tiny bird in the hands of her son. “I don’t know how I lived these four years my darling.  I was constantly praying god to keep you safe  and your mom lived only for you my dear!”, she was extremely moved.

“Mom, please don’t cry. I cannot bear if you cry like this.  I came off now right? Silly mom!”, he cried with tears in eyes.  Yet she was crying.  Why are you crying mom? See? I am good only.  You only see how I have become. “, he said by patting her head.

She thought of many things in her mind before.  As she is used to secure all her words within me,  I know all those words long back.  She writes stories and poems isn’t it? As she saved all those with me, I got them by heart.

Darling...Before every meeting, the sadness of estrangement keeps beside it,do you know? Shall I say that this mother hid the sea of sadness within her and stayed calm outside?

The would be daughter in law was shocked looking at the love between mother and son.Immediately she realized that the daughter in law might be feeling bad for not greeting her, and said ”Dear, how are you?”, by taking her closer. Don’t worry aunty, we all will be together from now, she consoled.  This girl knows the art of consoling.  She got the luggage from the car.  She gave the backpack and the wallet having passport to the son. My would be daughter in law is a girl of fortune.  Thinking she will look after the son quite well, the mother said, “Okay ma, we will meet tomorrow.  “ while both were taking the luggage towards the lift,  the son said he will bring the luggage and asked her to stay put.  I felt how much of love son has for her.  The watchman said he will bring all the luggage.

With the sound of suitcase, people in the house started yawning and getting up and said Chinni already has come.  Everybody was happy.  Looking at all of them being happy, even I felt very happy.  She switched on the geyser for him to have bath.  He was saying what’s the necessity of hot water in summer.  She said that’s how it is, and asked him to have bath and went off to bring food.  She was waiting eagerly to feed her son by going near the table with curry vessels, ghee, curd,  rice vessel, plate,  and water.

By shining once you make use of me everyday but today you are not bothering me I said angrily.  She smiled and said please wait, you will get answer soon.

By feeding the son with food and controlling the tears, she said Dear, even if you didn’t like I requested you and sent to abroad. You went abroad, studied well, doing a great job , and we could buy plots, car and house. Though we are happy financially some void was there.  I wanted some security and peace which all these couldn’t give.  I didn’t laugh wholeheartedly , didn’t eat fully,  didn’t sleep peacefully.  Every minute I felt some anxiety. In every relationship there was some unrest.

Her tears continued flowing. He remembers the days when she fed her son with the manual stove food. She remembers the mirchi powder rice to be considered as a delicious sweet also. Remembers the struggle of mother when he was 7 years old.  He remembers father’s disinterest also.  I used to feel that he was a missed goat. Despite being with relatives you still faced loneliness, mom!”, he said.

Dear, in the affectionate greetings of relatives, I saw insults and jealousies. Doing a small help, they assume that without them we cannot do anything.  By identifying a small weakness, they think they are the greatest people.  These people are around us.  I am eagerly waiting for love filled affection.  I am waiting for the affectionate touch since years  my dear.  When I was hospitalized two years go, I wanted to make sure you would not be knowing about it dear.  I was confident that I can overcome the disease by myself. “, she kept on crying saying this.

“See, this- she took my by her left hand and kept me away.  With touch, you can play any game. In a split second, we can see each other and talk to each other. We can share long write ups, whether it will rain, or it is sunny,  and it will tell us where we are going.  But can this give me an affectionate touch? Can it relive me of my sadness with a touch? Hoping that the son’s future is good,  financial problems will go, and sending the children to abroad- all such parents lose this affectionate touch.

They neither can go there or those people can come here- as a result ,they live like living dead bodies.  They wait eagerly for the day when the distance comes to an end.  Don’t know what is found there, but this worth of crores can be found here.  I have been dying for this touch my dear”, she said.

I felt ashamed then. People like me might be in crores.  With us, the human’s external needs might be met.  But we cannot give the lively touch between two humans.  Any love can go off between two people but the love between mother and son can never melt or reduce. I thought.  Why did god didn’t give us touch who made us? Maybe touch is that great.  Some things perhaps cannot be made.  Damn, my lifeless living is wasted! I felt and saw them.

The son took his mom to his arms and by caressing her head, he said, “ Silly mom!”, out of love.  She was lost in the affection of her son and in the midst of her tears, and her husband also held his head in shame like me seeing this.


ఆత్మీయస్పర్శ- కథానువాదం.. డా।। కంపల్లె రవిచంద్రన్

28, నవంబర్ 2019, గురువారం

సంఘసంస్కరణలు చేసినంత గొప్పగా ...

ప్రస్తుత ప్రభుత్వం చేతివృత్తులవారికి ఆర్ధిక భరోసా కల్గించే పధకం ఒకటి అనౌన్స్ చేసిందట. రేపటితో ఆఖరి రోజు అని చెప్పుకుంటుంటే విన్నాను.దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా కావలిసినవి .. లేబర్ సర్టిఫికెట్ ,కులధ్రువీకరణ పత్రం , అఫ్లికేషన్ పెట్టుకున్నందుకు మొత్తం కలిపి Rs / 610.
ఈ సేవ కేంద్రాలవద్ద జనం బారులు తీరి ఉన్నారు.

గ్రామాలలో వాలెంటీర్స్ డోర్ టు డోర్ వెళ్లి అప్లై చేసుకోమని చెపుతున్నారట . పెడదాము పోయేది ఏముంది ? అంతకన్నా ఇరవై రెట్లు ఇస్తాడట . అని చెప్పుకుంటున్నారు.
వాలెంటీర్స్ కి జీతం .. ముందు రెండు నెలలు అయిదు వేలు లెక్కన చెల్లించారట . ఈ నెల నుండి ఎనిమిది వేలు జీత వస్తుందట . వాళ్ళ పని ... డోర్ టు డోర్ ప్రచారం చేయడం ..అదేలేండి .. ప్రభుత్వ పధకాల గురించి ప్రజలకు అవగాహన కల్గించడం ..ప్రజలకు లబ్ది చేకూర్చడం.
అందుకేనేమో ... తెల్ల చీరలు కట్టుకున్న వాలంటీర్ .. బెల్ కొట్టి మరీ "స్వస్తత సభ "లకు రమ్మని ప్రకటన - ఆహ్వాన పత్రం చేతిలో పెడుతుంది బలవంతంగా ..అని చెప్పింది నా ఫ్రెండ్ .  
నేను .. ఆ మతం కాదన్నా వినలేదు. ఒకసారి వచ్చి చూడండి అంటూ బలవంతం చేస్తుంటే విసుక్కున్నాను. తల్లీ..  నీకు ఈ పని చేసినందుకు జీతం భత్యం ఉంటాయేమో కానీ నీతో వాగడానికి నేను శేరు బియ్యం అన్నం తినాలి. పైగా నేను వైట్ హోల్డర్ ని కూడా కాదు. వితంతు పెన్షన్ బాపతు కూడా కాదు ..నన్ను విసిగించక వెళ్ళమ్మా ... అని బలవంతంగా నెట్టాల్సి వచ్చింది. 
చాలా ఊర్లలో ..వాలంటీర్లు చేసే ఉద్యోగం ఇదేనని చెపుతుంటే ..ఆశ్చర్యపోలేదు ఆలోచన చేస్తున్నా. 

స్కాలర్షిప్ ల పేరిట కు ధ్రువీకరణ పత్రం, పేదవారికి వృత్తి భరోసా పధకం దానికి కుల ధ్రువీకరణ ..ఇంకా చాలా వాటికి కుల దృవీకరణ తప్పనిసరి చేస్తున్నందుకు అనుమానం కల్గుతుంది. ఎందుకు .. ఈ కుల ద్రువీకరణలు .. అంటే .. సమీకరణాల కోసమే కదా ! మీరూ ఆలోచించండి మరి. 
రైతు భరోసా పధకానికి అర్హులైన వారిని తొలగించిన ప్రభుత్వం ఆటో వాలాలకు చేతి పనుల వారికి ఆర్థికసాయం చేయగల్గుతుందా .. ప్రజలు నమ్ముతున్నారా ? :) 
అబ్బా.. మతవ్యాప్తికి సంఘ సంస్కరణలు చేసినంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయడం సిగ్గుపడే విషయం కదా ! అని సిగ్గుపడుతూ .. 

26, నవంబర్ 2019, మంగళవారం

సమస్య ..ఒక కానుక



నేను కుండీలో పెంచే మొక్కల్లో ముఖ్యమైనది "మరువం " పాక్షికంగా సూర్యరశ్మి తగిలే చోటులో మరువం బాగా ప్రవర్ధమానం అవుతుంది. పూలు కరువైనప్పుడు మరువం, తులసి దళాలు పూజకు వాడుకుంటాను. అయినా గాలి గట్టిగా వీస్తే చాలు మరువం వాసన కాఫీ వాసనలా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. 

ఒకోసారి మరువం తుంచనప్పుడు ఎండిపోతుంది. అప్పుడప్పుడు ఎండిపోయిన మరువం కొమ్మలను దెచ్చి ఇష్టమైన పుస్తకాలలో పెడుతూ వుంటాను. పెట్టిన పేజీని చదివి అందులో విషయాన్ని చదువుకుని మురిసిపోతాను. పుస్తకాలు బహుమతిగా ఇచ్చినప్పుడు మరువం పెట్టి యిస్తూ వుంటాను. కొన్ని రోజుల క్రిందట  పది దాకా మరువం కొమ్మలు ఎండిపోయి కనిపించాయి. వాటిని తీసుకొచ్చి .. పరుపు పై చక్కగా పేర్చి ఉంచిన పుస్తకాలపై .నుండి ఒక పుస్తకం తీసుకుని అందులో కొన్ని కొమ్మలుంచాను. కొన్ని బట్టల  బీరువాలో పెట్టాను. 

మళ్ళీ యెందుకో ఆసక్తి కలిగి మరువం కొమ్మలు పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకుని ఆ కొమ్మలు పెట్టిన చోటున ఏమి వ్రాసి వుందో చూసుకున్నాను. సమస్యలు అనే కానుక. ఆహా అనుకున్నాను. ఆ కానుక మనకి మనం తెచ్చుకున్నది కావచ్చు ఇతరుల ద్వారా మనకు కలగడం కావచ్చు. ఏమైనా సమస్యలను కానుకగా స్వీకరించక తప్పదు. .సమస్యలు అనుభవాల దండలో పూలు. జ్ఞాపకాలు పూలు వాడినా ఆ పరిమళాన్ని అంటి పెట్టుకున్న దారపు పోగులు. 

సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా యెదుర్కొన్నామన్నదే జీవితం. 
చాలా పుస్తకాలు మూడు పెట్టెలవరకూ ఇతరులకి ఇచ్చేసాను. మరికొన్ని పుస్తకాలు చదువుకొని ఇమ్మని మా కిట్టీ సభ్యులకు బట్వాడా చేస్తున్నాను. ఒకరినుండి మరొకరు మార్చుకుని చదువుకోమని. ఒక ఫ్రెండ్ "వేయిపడగలు "అడిగింది. తీసుకెళ్లి యిచ్చాను. మూడునెలలు టైమ్  లిమిట్ పెట్టి అప్పటికి చదివేయాలని చెప్పాను..   

అక్షర క్రమంలో సర్దుకోవాలని కింద పరచి .. అలమారాలు చెమ్మగా ఉన్నాయని ..పుస్తకాలన్నిటినీ పరుపు పై పవళింపజేశాను. ఏమిటో ..నాకీ సమస్య  :) ఎదుర్కోవాలి తప్పదు. 
పెద్దలగా మన పిల్లలు తమకు సమస్యను ఎలా కొని తెచ్చుకుంటారో .. వాటిని ఎలా పరిష్కరించుకుంటారో చూస్తూ ఉండటం తప్పదు. పెద్దలాగా సలహా ఇవ్వబోతే ... నీకెందుకు అని కసురుకుంటారు కాస్త సున్నితమైన వాళ్ళైతే .. I'll Take Care. don't worry అంటారు. సమస్య వాళ్ళ చేయి దాటిపోయేదాకా చూసి అప్పుడు మనం కల్పించుకోవాలన్నమాట. అప్పుడు సమస్యలు ఒక కానుకే అనుకోవాలన్నమాట.నా లిస్ట్ లో వున్నా  కొంతమంది పిల్లలకు ఇది సెటైర్ .. :)  అవకాశం వస్తే పెద్దలు దెప్పకుండా వొదులుతారా యేమిటీ  :) 

ఈ విషయం అంతా రాసాక ..ఇంకొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. పేజీ తెరిచి చూడటం అందులో వున్న విషయాన్ని చదువుకుని sync చేసుకోవడం అన్నది .. నా బైబిల్ మిత్రులని చూసి నాకు అంటుకుని ఉంటుందనిపిస్తుంది  :) ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట అని నానుడి కదా ! 

పని కట్టుకుని చేసే మత  ప్రచారం చాపక్రింద నీరులా మనని చుట్టుకుంటుంది. అది రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని మనకి తెలియనిది కాదు. అది ఏ మతమైనా సరే ! మనిషికి మతం ముఖ్యం కాదు.. నా చుట్టూ ఉన్న విషయాలపై కథ వ్రాయాలి అనేంత బలంగా మత విషయాలు రాజకీయ కోణాలు బలంగా వేళ్ళూనుకుంటున్నాయి.  దేవాలయాలు చరిత్ర కూడా బాగా గమనిస్తూ ..అనేక విషయాలు తెలుసుకుంటున్నాను. మనిషికైనా దేశానికైనా సమస్యలు కానుకలు అనుకోవాలి. అంతకు మించి పోరాటం చేయాలి తప్పదు.





 

24, నవంబర్ 2019, ఆదివారం

నీకూ నాకు ప్రత్యేకమైన రోజు






పుట్టినరోజు శుభాకాంక్షలు ..బంగారం .. ఈ రోజు నీకూ నాకూ ప్రత్యేకమైనదే ..

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో..

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో

యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ..

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..నా ఆశీస్సులలో సదా ఆ సదాశివుడి దీవెనలు నీవెంట ఉంటాయి. 

"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా

నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా

నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"

పుట్టినరోజు శుభాకాంక్షలు ..బంగారం .. ఈ రోజు నీకూ నాకూ ప్రత్యేకమైనదే ..

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో..

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో

యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ..

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..నా ఆశీస్సులలో సదా ఆ సదాశివుడి దీవెనలు నీవెంట ఉంటాయి. 

"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా

నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా

నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"



సముద్ర తీరంలో ... ఇష్టమైన వారి పేరు వ్రాసుకోవాలట. జన్మజన్మలకూ ..ఆ అనుబంధం కలిసేలా భగవంతుడు దీవిస్తాడట .. అని విన్నాక నీ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు .. సముద్ర తీరానికి వెళ్లి వెళ్ళగానే ..నీ  పేరు వ్రాసుకున్నాను చిన్ని బంగారం ...

21, నవంబర్ 2019, గురువారం

తడిచిన గుండెకు తీగైన మరో గుండె




ఈ రోజు నా బ్లాగ్ పుట్టినరోజు ... తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజున బ్లాగ్ వ్రాయడం మొదలెట్టాను.
బ్లాగ్ వ్రాయడం మొదలెట్టకపోతే నేను ఈ రచనా రంగం వైపు వచ్చేదాన్ని కాదేమో .. కాలక్షేపం కోసమైతే బ్లాగ్ మొదలెట్టలేదు .అది కచ్చితంగా చెప్పగలను.నా  బ్లాగ్ అంటే .. నన్ను నేను బహిర్గతం చేసుకుని మళ్ళీ నాలోకి వొంపుకోవడం. ఒకవిధంగా చెప్పాలంటే .. నా ఉనికి. ప్రపంచానికి నా గురించి తెలియజేసేది కూడా . యేవో కొన్ని రాతలు తప్ప నేను వ్రాసుకున్నవి అన్నీ బ్లాగ్ లో జతపరిచాను . కొన్ని తుడిచివేసాను. (నాకు నచ్చక) 
నా జీవితంలో నేను రెండింటిని చూసి గర్వపడతాను .. మొదటిది నా కొడుకు . రెండు నా బ్లాగ్. 
గత సంవత్సరం నేను USA లో అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు .. నాకు ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ కి వెళ్లే సమయమూ కాదూ ఎమర్జన్సీ కూడా కాదు. గుండెల్లో మంట విపరీతమైన పెయిన్. నాకేదో అయిపోతుందనిపించింది. అబ్బాయితో చెప్పాను .. నా బ్లాగ్ డిలీట్ అయిపోకుండా జాగ్రత్తగా చూడు అని. అది నా అప్పగింత  :) 

ఇంత శరీరానికి చిన్న ఇబ్బంది కల్గితే ఏదో అయిపోతుందని ఊహించుకుని భయపడటం కూడా నా లక్షణం కాదు. నాకెందుకో ఆ సమయంలో ఒకటి గుర్తుకొచ్చింది. "నువ్వు కచ్చితంగా హార్ట్ ఎటాక్ తోనే చనిపోతావ్, నీ గుండె ..నీవి నీది కాని వేదనలు కూడా మోసి మోసి కునారిల్లిపోయి ఉంటుంది. అన్నీ నీకే కావాలి. అన్నీ హృదయం దాకా తీసుకుంటావ్. నాకెందుకు అని అనుకోవు. నీ జాతకం కూడా అదే చెపుతుంది " అని ఒక ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో. నేను జాతకాలను నమ్ముతాను నమ్మను అనేది పక్కన పెడితే .. మనకో మన దగ్గరవాళ్లకు ఏదైనా మంచి లేదా చేదు జరుగుతుందని చెపితే అదే ఆలోచిస్తాము. నేనపుడు ఆ స్థితిలోకి అప్రయత్నంగా నెట్టబడి .. అలా అప్పగింతలు పెట్టాను. 

అప్పటి నా స్థితికి కారణం వెర్టిగో లక్షణాలు .. మరియు .. శరీరానికి కదలికలు లేకుండా ఎప్పుడూ కూర్చునో పడుకునే ఉండటం మూలంగా ... జీర్ణాశయంలో gas ఉత్పత్తి ఎక్కువకావడం. అదంతా తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ .. నేను దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నానో తెలిసిన సమయం అది.  

నా కన్ను చెమరిస్తే మనసు  నీరైతే గుండె బరువెక్కితే  ..   హృదయం చెమ్మగిల్లితే.. కోపం వస్తే ..ఎండ కాస్తే వాన కురిస్తే ..నవ్వొస్తే ... అనుభూతి నిలవనీయకపోతే ..ఆలోచన పంచుకోవాల్సి వస్తే ... నన్ను నేను బహిర్గతం చేసుకుని తెరిపిన పడటానికి .. డైరీ లాంటి బ్లాగ్ .. నాకు భుజమైంది. ఆసరా అయింది. నా తడిచిన గుండెను ఆరేసుకోవడానికి మరో గుండె తీగైంది. అందుకే నా బ్లాగ్ అంటే నాకు అత్యంత ఇష్టం . ... కచ్చితంగా నా బ్లాగ్ లో నేను దొరుకుతాను. <3 ఐ లవ్ మై బ్లాగ్ .  ఎంతోమంది వీక్షకులు .. చదువుతూ .. అభిమానంగా పలకరిస్తారు. అది చాలు కదా ..  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు "వనజ వనమాలి" నాలోనే నాతోనే వుంటూవుండాలి నా నేస్తమై ... వ్యసనమై..  

ఈ వ్రాతలు ఇసుకలో వ్రాసిన వ్రాతలు కావు. ఏ బేషజాలు లేకుండా .. ఆర్భాటాలు లేకుండా కీర్తికండూతి కోసం ఆలోచించకుండా వ్రాసుకున్న రాతలు. నిజాయితీగా వ్రాసుకున్న రాతలు. 
కథల విషయానికి వస్తే ఒక పాతిక వంతు కల్పనలు ఉండవచ్చు తప్ప .. వాస్తవానికి ..నా అనుభవానికి ఇతరుల అనుభవానికి  దూరంగా నేల విడిచి .. రచనలు చేయలేదు నేను. ఎంతో మంది ఇప్పటికీ చదువుతూ ..తమ స్పందనను నాతో పంచుకుంటూ ... బ్లాగ్ బావుందండీ .. అని చెప్పడం నాకు సంతోషాన్నిస్తుంది. ఆ స్పూర్తితో వ్రాస్తూనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. 



17, నవంబర్ 2019, ఆదివారం

చరణౌ కరుణాసింధుః

అంతరాంతరాలలో వున్న దీపం వెలగాలంటే ... ఈశ్వరుడిపై విశ్వాసం వుండాలి. లౌకిక దృష్టితో వ్యాపార దృష్టితో భక్తుడిని భగవంతుడిని చూసినంత కాలమూ భక్తి ఈశ్వరుడు రెండూ మనకి అర్ధం కావు . ఇవి మాటలు అర్ధమైనంత తేలికపాటి జ్ఞానం కాదు. అనుభూతి ప్రధానమైన ఆధ్యాత్మికమైన అనుభవం.  ఎవరి అనుభవం వారికి ప్రాధాన్యం. ఒకరికి మన అనుభవాన్ని సరఫరా చేయలేము... గీతాంజలిని  నిత్య పఠిత గ్రంధము చేసుకోవడం మూలంగా లోకం మరింత బాగా అర్ధమవుతుందని కాదు..మనం యెలా   జీవిస్తే ప్రశాంతంగా వుండగలమో తెలుస్తుంది. ఆ అనుభవంలో నుండి పుట్టినదే క్రింద వ్రాసుకున్న ప్రార్ధన. తర్వాత కొంత ఆలోచన చేసి ... ఈ ఉపోద్ఘాతం వ్రాసుకున్నాను. 

చిత్రం: అరుణాచలేశ్వరుని సన్నిధి (చిత్ర సేకరణ సునీత పోతూరి గోడపై నుండి ) 


తండ్రీ..
నిప్పులు చెరిగే యెండలో రాతి మెట్లపై నడిచే అవసరం కల్పించావ్ సరే..
పాదరక్షలు లేవని భంగ పడకుండా ..
ఆ రాతిబాటకు ఇరుపక్కలా.. పచ్చని పచ్చికనూ పరిచివుంచావు

కష్టంలో కూడా సౌఖ్యాన్ని పక్కనే వుంచిన నిన్ను
నా తండ్రిగా.. కీర్తించకుండా వుండగలమా..
నీ కరుణా సముద్రపు అలల తాకిడికి 
వినమ్రంగా తలవొంచనా.. తడిచిన.. కనులతో.. ఈశ్వరా!

15, నవంబర్ 2019, శుక్రవారం

అమ్మ అమ్మే ...

చిన్న కథ .. 

మా ఊరిలో సామూహిక వన భోజనాలు అంట. కాస్త నదురుగా వుండేవాళ్ళు వేదికనలంకరిస్తారట.
"అదేంటి.. ఆ లిస్ట్ లో నువ్వు వుంటావనుకున్నాను" అంది.. నాఫ్రెండ్.
నేను చిన్నగా నవ్వి ..
ఒకటి:నేనెప్పుడైనా కాకా పట్టడం చూసావా..
రెండు: నిర్మొహమాటంగా మాట్లాడే నన్ను చూపి.. పెద్ద పెద్ద అన్నవాళ్ళు “ మనవాళ్ళే.. కాస్త ఓ చూపు చూస్తూ వుండు “ అని సిఫారసు చేస్తారా..
మూడు: ఈ రెండూ వుండకపోవడం వల్ల.. నాకెవరైనా బాకాలు ఊదగలరా..
అన్నాను.
నా ఫ్రెండ్ కంగు తిని .. ‘’ నీతో మాట్లాడడం చాలా కష్టం “అంది.
‘’ మరే... మాటలు వండటం యెక్కడ యెన్ని వడ్డించాలో అన్ని వడ్డించడం, చమత్కారం నాకసలు తెలియదని నీకు తెలియదా.. ‘’ అన్నాను.
‘’నీ కాఫీ కన్నా మాటలే మరింత చేదుగా వున్నాయి. తప్పకుండా రా.. ‘’అని ఇన్విటేషన్ చేతిలో పెట్టి.. ‘’కాస్త వినయంగా వుండటం నేర్చుకోరాదు. వచ్చే పేరును చెడగొట్టుకుంటున్నావు ‘’ అంది.
“నిర్మాత కె.మురారి.. దర్శకుడు కె.రాఘవేంద్రరావు పై చెప్పు విసిరివేసాడంట. అది తగలకుండానే రాఘవేంద్రరావు కారెక్కి కూర్చున్నాడంట... తప్పించుకుని అవమానపడకనే బతికిపోయాడు పాపం“అన్నాను.
‘’అర్దమైంది’’ అంది లేచి నిలబడి.
*************
రచయిత వ్యాఖ్యానం :
PS: స్వభావం అమ్మలాంటిది. అమ్మ అందగత్తె లేదా కురూపి .. అని వుండదు. అమ్మ అమ్మే!
దట్సాల్. 👸👸

8, నవంబర్ 2019, శుక్రవారం

కులవృక్షం పై సమీక్ష









కులవృక్షం కథల పై ..మంజు యనమదల గారి సమీక్ష ...

ఈ లింక్ లో ....కులవృక్షం కథా సంపుటి పై సమీక్ష

జీవితానుభవాలే కథాంశాలుగా కులవృక్షం - మంజు
తెలుగులు సాహిత్యంలో కథలకు ప్రత్యేక స్థానం ఉంది. బ్లాగర్ గా, కవయిత్రి రచయిత్రిగా తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఉక్కు మహిళ తాతినేని వనజ. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం, తెగువ ఆమె సొంతం. సమాజంలో ఎక్కువగా మహిళల మనసు వేదనలు, రోదనలే ఈమె కథాంశాలు. కథా సంపుటి పేరులోనే వైవిధ్యమున్నట్లుగానే ప్రతి కథా మన మనసులను తాకుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
మొదటి కథ పూలమ్మి కథ మనిషిలోని మానవత్వాన్ని, మృగాన్ని ఒకేసారి చూపే కథ. దాహం రెండక్షరాలే కాని ఎన్ని రకాల దాహాలో దాహం కథలో తెలుస్తుంది. కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి స్త్రీల వెంటబడే మగనికి ఓ అతివ చెప్పిన సమాధానం లోపం లేని చిత్రం కత. మత సంప్రదాయాలను ఆసరా చేసుకుని చేసే మెాసాల్లో ఓక మెాసం కథ చూసి చూడనట్లు. మతాచారాలను ఎక్కడ ఎలా పాటించాలో, వాటి వలన ఇబ్బందులు తెలిపే కథ ఉడాన్. తమవి కాని రాతలు కూడ తమవేనని చెప్పుకొనే కొందరు రచయితల నీచత్వం, రాతల్లో నీతులు, చేతల్లో శాడిజం బయట పెట్టిన కత రచయితగారి భార్య. నాయకులు వెంట తిరిగే ఖద్దరు చొక్కాల వెనుక అసలు రూపాన్ని బయట పెట్టిన కథ ఆదర్శ నాయకుడు. ఆడ పని, మగ పని అని విభజించి ఆంక్షలు ఆడవారికే అని ఆలోచించే వారికి జీవితం విలువను తెలిసిన కథ గంధపు చెక్క - సానరాయి. కొడుకు దుర్మార్గానికి భరించలేని తల్లి అపరకాళిగా మారుతుందని సంపెంగ సేవలో కథ నిరూపిస్తుంది. ఆధునిక పరికరాలు ఎంత అందుబాటులో ఉన్నా ఆత్మీయ స్పర్శను అందించలేవని ఓ తల్లి కొడుకు కోసం ఎదురుచూసిన వాస్తవ సంఘటనను, ఆ కలయికను హృద్యంగా చెప్పిన కథలాంటి నిజం ఆత్మీయ స్పర్శ కథ. నూతి నీళ్ళు మన దాహార్తిని తీర్చడానికే కాదు.. ఎందరో అతివలను తమ గుండెల్లో దాచుకున్న సహృదయం గలవని, వినే మనసుంటే కనీళ్ళ కతలెన్ని వినబడతాయెా విని చూడమంటుంది నూతిలో గొంతుకలు కథ. వాస్తవ వెతల సంకలనమీ కథ. ఈ తరం పిల్లలకు స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి తేడా తెలియాలని చెప్పే కథ త్వరపడి. కొన్ని ఖాళీలంతే పూరించబడవు అన్న మాటలోనే ఎన్నో భావాలను అందిస్తూ పొట్ట కూటి కోసం తిప్పలను, నవ్వుల వెనుక దాచిన వెతలను చక్కగా   చెప్పారు ఆమె నవ్వు కథలో. ప్రకృతి విరుద్ధమైన బంధాలలోని లోపాలను తెలిపే సరికొత్త కథా వస్తువుతో వచ్చిన కథ పరస్వరం.

ఏ పనైనా ఇష్టంగా చేయాలి కాని పలానా కులం పలానా పని చేయాలన్న నిబంధన ఉండకూడదన్న సూచననిస్తూ, అభిరుచులకనుగుణంగా పని చేయాలని, మనుషుల మనస్తత్వాలు మారాలని ఈ కథా సంపుటి పేరైన కులవృక్షం కథ చెబుతుంది. తడియారని జ్ఞాపకాలెప్పుడు రెప్పలను తడి చేస్తూనే ఉంటాయని, అనుబంధం, మమకారం విలువను తెలిపే కథ రెప్పల తడి. దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం చేయడం మంచిది కాదని, అవసరాలు చేయించే తప్పులను చూపిన కథ ఆవలివైపు. లతాంతాలు కథ చదవడం పూర్తయినా కొన్ని రోజులు చదువరులను వెంటాడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. సున్నితమైన కథా వస్తువును చాలా లాఘవంగా అక్షరీకరించారు.

కుటుంబ బంధాలకు, ఆడ మగ మధ్యన స్నేహానికి గల సన్నని తెరను చెప్పిన కథ చేరేదెటకో తెలిసి. ఉద్యోగం చేసే మహిళలు పడే కష్టాలు, వారిని వేదించే పై అధికారులు, వారిని సమర్థించే కొందరి గురించి చెప్పిన కథ పిడికిట్లో పూలు. ఆడ మగ కాని మరో పుట్టుక ఈ సమాజంలో కష్టపడి పని చేసుకో బతకాలంటే ఎంత కష్టమెా మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన కథ మార్పోద్దు మాకు, మార్పొద్దు. కథలలో అరుదుగా జరిగే విషయమిది. ఒక కథకు పొడిగింపుగా మరొక కథ. అలాంటి కథే చిగురించిన శిశిరం కథ. ఇది చేరేదెటకో తెలిసి కథకు పొడిగింపు. మధ్య వయసు ఆడ మగ మధ్యన స్నేహం, ఆరాధనకు చక్కని తార్కాణం ఈ రెండు కథలు. సరికొత్త కథా వస్తువు మగ వేశ్య మనసు కథను, చాలా సున్నింతంగా కథను నడిపించిన తీరు, సమస్యకు సూచించిన పరిష్కారం చాలా బావుంది.

ఎన్నో జీవితాలు మన చుట్టూనే ఉన్నా, మనకు తెలియని లేదా తెలిసినా ఆఁ మనకెందుకులే అని పక్కకు తప్పుకుపోయే సగటు మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను, ఎందరో స్త్రీల ఎన్నో సమస్యలను. కొన్ని స్వీయానుభవాలను కథలుగా చెప్పడంలో వనజ తాతినేని కృతకృత్యులయ్యారు. ఓ రచయిత్రిగా సమాజంలో సమస్యలను కళ్ళకు కట్టినట్టుగా మన ముందుంచారు. సాధారణ శైలిలో, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తన రచనలను తీర్చిదిద్దారు. ఎన్నుకున్న ప్రతి కథా వస్తువు ఉహాజనితం కాదు. వాస్తవ పరిస్థితులకు అక్షరరూపం. కథలా కాకుండా సహజ సంఘటనల్లా సాగిపోతుంటాయి. అద్భుతమైన కథలను కులవృక్షం ద్వారా అందించిన వనజ తాతినేనికి హృదయపూర్వక అభినందనలు.     

మంజు యనమదల