చిన్న కథ ..
మా ఊరిలో సామూహిక వన భోజనాలు అంట. కాస్త నదురుగా వుండేవాళ్ళు వేదికనలంకరిస్తారట.
"అదేంటి.. ఆ లిస్ట్ లో నువ్వు వుంటావనుకున్నాను" అంది.. నాఫ్రెండ్.
నేను చిన్నగా నవ్వి ..
ఒకటి:నేనెప్పుడైనా కాకా పట్టడం చూసావా..
రెండు: నిర్మొహమాటంగా మాట్లాడే నన్ను చూపి.. పెద్ద పెద్ద అన్నవాళ్ళు “ మనవాళ్ళే.. కాస్త ఓ చూపు చూస్తూ వుండు “ అని సిఫారసు చేస్తారా..
మూడు: ఈ రెండూ వుండకపోవడం వల్ల.. నాకెవరైనా బాకాలు ఊదగలరా..
అన్నాను.
ఒకటి:నేనెప్పుడైనా కాకా పట్టడం చూసావా..
రెండు: నిర్మొహమాటంగా మాట్లాడే నన్ను చూపి.. పెద్ద పెద్ద అన్నవాళ్ళు “ మనవాళ్ళే.. కాస్త ఓ చూపు చూస్తూ వుండు “ అని సిఫారసు చేస్తారా..
మూడు: ఈ రెండూ వుండకపోవడం వల్ల.. నాకెవరైనా బాకాలు ఊదగలరా..
అన్నాను.
నా ఫ్రెండ్ కంగు తిని .. ‘’ నీతో మాట్లాడడం చాలా కష్టం “అంది.
‘’ మరే... మాటలు వండటం యెక్కడ యెన్ని వడ్డించాలో అన్ని వడ్డించడం, చమత్కారం నాకసలు తెలియదని నీకు తెలియదా.. ‘’ అన్నాను.
‘’నీ కాఫీ కన్నా మాటలే మరింత చేదుగా వున్నాయి. తప్పకుండా రా.. ‘’అని ఇన్విటేషన్ చేతిలో పెట్టి.. ‘’కాస్త వినయంగా వుండటం నేర్చుకోరాదు. వచ్చే పేరును చెడగొట్టుకుంటున్నావు ‘’ అంది.
“నిర్మాత కె.మురారి.. దర్శకుడు కె.రాఘవేంద్రరావు పై చెప్పు విసిరివేసాడంట. అది తగలకుండానే రాఘవేంద్రరావు కారెక్కి కూర్చున్నాడంట... తప్పించుకుని అవమానపడకనే బతికిపోయాడు పాపం“అన్నాను.
‘’అర్దమైంది’’ అంది లేచి నిలబడి.
*************
రచయిత వ్యాఖ్యానం :
PS: స్వభావం అమ్మలాంటిది. అమ్మ అందగత్తె లేదా కురూపి .. అని వుండదు. అమ్మ అమ్మే!
దట్సాల్. 👸👸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి