27, జనవరి 2011, గురువారం

మినీ మినీ మినీ..కవితలు




1 .విహంగానికి.. ఎంతటి స్వేఛ్చో!
ఆకాశంలో ఎగురుతున్నందుకు కాదు  
రెక్కలు విరిచి పంజరాన బంధించ నందులకు....

2.శిఖరానికి ఎంత గర్వమో!
మహోన్నతంగా ఉన్నందుకు  కాదు..
అధిరోహకుల ఆత్మ విశ్వాసంకి సవాల్ విసురుతున్నందుకు..

౩.రాగానికి ఎంత అతిశయమో!
రాళ్ళని కరిగిస్తున్నందుకు కాదు
స్వర బంధనం వీడనందుకు....

4.ఆత్మకి  ఎంతటి ఆనందమో!
జన్మజన్మాలని సృశిస్తున్నదుకు కాదు
తన ఉనికి పరమాత్మకి మాత్రమే తెలిసినంధులకు...

5.గరళం గర్వపడుతుంది
హరిస్తున్నందుకు కాదు
హరుని కంటాన భద్రంగా దాగి ఉన్నందుకు...

6.శిశిరం సిగ్గు పడింధీ
వివస్త్రగా మారినంధులకు కాదు
వసంతం తనని తడిమి తడిమి చిగిర్చింప జేసినంధులకు...

7.వెన్నెల రగిలిస్తుంది!
చల్లదనంతొ కాదు..
విరహంతో ....

8: గులాబీలు గుండెల్లో గుచ్చేస్తాయట!
 ముళ్ళతో కాదు అరవిరిసిన అందంతొ..

9.విరిబోణి తనువుని చుట్టేసిన
చీరకి ఎన్ని రంగులో !
విరుల వనంలోఎన్ని కోకలో
చీర రంగులకి   దీటుగా...                                                                                                                                                                                                                                                                                                                                                                                       

ఇన్నర్ లాంప్

దీప దీప్తోభవ

నిండుగానూనెపోసినప్రమిదలోఒదిగిన వత్తినినేను
ఆ వత్తిని వెలిగించి కాంతిని పంచాలనుకునే ఆలోచన ఒకరిది.
మనం ఎక్కడ ఉన్నా.. మన ఆలోచనల్లో నిండుగా ఉండి
మనల్ని అనుక్షణం ప్రోత్శహించి,మనలో స్ఫూర్తి నింపి
మనలని చైతన్యవంతంగా మలచే శక్తి కొందరికే ఉంటుంది.
ఆ శక్తి మనలో.. వెలిగే దీపం లాటిది.
అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.
ఆ దీపం లాంటి మనిషి ఎంత దూరంలో ఉన్నా..కానీ.. మాట ద్వారా.. పాట ద్వారా.. అక్షరం ద్వారా .. మనని ఉత్తేజపరుస్తూ.. ఉంటారు. వారినే ఇన్నర్ లాంప్.. అంటాను నేను.

ప్రతి మనిషిలోను నిబిడీకృతమైన శక్తియుక్తుల్ని గుర్తించి వారికి దిశానిర్దేశం చేసిన వారందరు ఎవరికైనా.. పూజ్యనీయులే.
అలాటి వారందరికీ.. ధన్యవాదములు తెలపటం సంస్కారం అనిపించుకుంటుంది కదా!
అందుకే.. ఈ.. టపా.. మరి మీరు.. మీలో మీరు తొంగి చూసుకుని అలాటివారు ఎవరైనా ఉంటే .. ధన్యవాదములు చెప్పడం మరువకండి.
చెప్పిన తర్వాత. ఎంత సంతోషం గా ఉంటారో.. గమనించుకోండి. ఇది నా అనుభవం కూడా.


25, జనవరి 2011, మంగళవారం

శుభాకాంక్షలు


రవీంద్రుడు జనగణమణతో..జయధ్వనులు పలికించినా..
మహ్మద్ ఇక్బాల్ సారే జహసే అచ్చాహిందు సితాః హమారా అని కీర్తించినా,
బకించంద్ర చటర్జీ వందేమాతరం గీతంతో..ప్రణ మిల్లినా..
నేతాజీ..జైహింద్ నినాదంతో జాతిని ఏక  తాటిన   నడిపించినా..
దేవులపల్లి జయ జయ ప్రియభారత జనయిత్రి అని పూజించినా..
 ఏ.ఆర్ .రహమాన్ "మా..తుజే.. సలాం" అని స్వరపరచినా..
అది మన అందరి హృదయంతరాల భారతీయ భావన.
అశోకుడు  పాటించిన  ధర్మ నిరతితొ,
బాపూజీ..అహింసా మార్గంలో..
మదర్ ప్రేమ భావనతో.. వారసత్వసంపదగా.. దేశ భక్తిని పెంపొందించుకుని..
సామాజిక భాద్యతతో.. నడుచుకుందాం.
అందరికి... గణ తంత్ర దినోత్శవ  శుభాకాంక్షలు..          

అతడు -ఆమె




ఆమె:
చినుకునై నిన్ను నిలువల్లె తడిపేయాలని ఉంది...
పిల్ల తెమ్మరనై నిన్ను సృశించాలని ఉంది...
మణి దీపమై..నీ కన్నుల వెలగాలని ఉంది..
ఆకాశమై నీ.. ముంగిట హృదయం పరవాలనీ    ఉంది..
ధరణి నై  నీ.. చరణ కమలాలక్రింద ఒదిగిపోవాలని ఉంది..

ప్రియతమా! ఈ.. జన్మకిది సాద్యమా!?

 అతడు:
సునామీలా.. నిన్ను నాలో కలిపేసుకోవాలని ఉంది..

23, జనవరి 2011, ఆదివారం

నేనెందుకు వ్రాస్తున్నానంటే..

నేను ఎందుకు వ్రాస్తున్నాను అంటే..!?  

మన మనసులోని భావాలు కొందరితో  మాత్రమే పంచుకోగలం.అలా పంచుకోలేని భావాలను వ్రాసుకోవడం తప్ప ఏమి చేయజాలము. ఆ వ్రాసుకోవడం కూడా చేయలేక పోతే... ఏదో తెలియని అనిశ్చితి. 

స్వీయ అనుభవాల్ని,మన ఆలోచనలని,నేర్చుకున్న జ్ఞానాన్నినలుగురితో పంచుకోవాలి కదా! పంచుకుంటే పెరిగేది జ్ఞానం.మనిషి పుట్టిన దగ్గరనుండి నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలంటే ప్రశ్నించాలి. 

ప్రశ్నించడమంటే.. కొందరికి నచ్చదు.  ఎందుకని నచ్చదు అంటే.. జెండర్  సేన్సిటివిటి .నిజం! ఎంతో  సున్నితనైన  ఆలోచనలు, గాడమైన అనుబంధాలు ఉన్న కుటుంబ సభ్యులకి  కూడా..ఆడవాళ్ళూ ప్రశించడం నచ్చదు. 

ఆడవాళ్ళ ఆలోచనలు గడ్డిపరకలతో సమానం. ఆడవాళ్ళూ ఇప్పటికి చీరలగురించి,కుటుంబాల గురించి మాట్లాడుతూనే ఉండాలి ప్లస్ ఇంకా  మాట్లాడుతున్నారు. 

ఆడవాళ్ళు  అంతకన్నా ఎదగడం అసంభవం  అనే భావన కొందరి పురుషులది, మరి కొందరి  ఆడవాళ్లది కూడా.

జీవితంలో.. వాటికీ భాగం ఉన్నప్పుడు  మాట్లాడితే తప్పు ఏమిటి? ఇన్ క్లూడింగ్ వాటితో ..సహా.. స్త్రీలు చాలా తెలుసుకుంటున్నారు. వాటి గురించి చెప్పుకోవడానికి... ఒక వేదిక కావాలి..  ఆవేదిక లో.. భాగం  బ్లాగ్ కూడా.. 

గుండు సూది తయారి నుండి.. అంతరిక్ష ప్రయాణంలో వరకు.. స్త్రీ పని భాగస్వామ్యం లేకుండా..ఏ పని జరగడం లేదు. అయినా.. ఇంట్లో మాత్రం ఆడవారు మాట్లాడటం ప్రశ్నించడం నిషిద్ధం. తాతల తరం నుండి,తండ్రుల తరం నుండి,సహోదరుల తరంలోనూ, ఆఖరికి కడుపున పుట్టిన బిడ్దల నుండి కూడా  ఆజ్ఞాపించడం హక్కుని చేసుకున్న వాళ్ళ తీరుని ప్రశ్నించడానికి.. నేను వ్రాస్తాను.

బయట మాత్రం సంస్కారం  ముసుగు వేసుకుని స్త్రీల అభివృద్ధిని నోటితో.. మెచ్చుకుని నొసటితో వెక్కిరించడం  చేసేవాళ్ళని చూస్తూ..భరించగలగటం ఎంత కష్టం . మీ మెదడు మోకాలిలో ఉంది .. మీ తెలివితేటలు ఇంతే! అని హేళన చేసినట్లు ఉండే వారికి సమాధానం చెప్పటానికే నేను వ్రాస్తాను.

చదుకుని ఇంటా-బయటా చాకిరీ చేసే మహిళలకి  ఎన్నెన్ని హర్ట్స్,పెయిన్స్ ఉంటాయో! ప్రపంచంలో.. మనిషికి మనిషికి ఉండాల్సిన  సంబంధం గురించి  కుటుంబ సభ్యుల మద్య  ఉన్న అనుబంధం  గురించి కన్నా ఎక్కువ ఆలోచించాలి. ఇల్లు ఆడవారికి.. భద్రతే కాదు ఇంకో కోణంలో జీవిత ఖైదు కూడా.. స్వేచ్చా భావన లేని నరక కూపంలో.. మగ్గే  స్త్రీలని చూసాక వాళ్ళ గురించి వ్రాయాలనుకోవడం తప్పు కాదే!?  ఆడవాళ్ళని భద్రత పేరిట సంప్రదాయాల పేరిట ఇతరులతో కలవనీయకుండా.. గిరి గీసి కూర్చోపెట్టే.. పెత్తందారితనం గురించి ప్రశించడం, అన్నీ తెలుసుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుందీ? 

మన కన్నా ముందు ఎంతో మంది సహృదయులు  మహిళల పట్ల సానుభూతితోనో .. లేదా సమాజ అభ్యున్నతి  ఆకాంక్షించో.. స్త్రీల  తరపున  వకాల్తా  పుచ్చుకుని వ్రాసి.. ఒక బాట చూపారు. తర్వాత.. మనుషులుగా జీవించడం నేర్చుకున్న స్త్రీలు వాళ్ళ గురించే కాదు.. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుని వ్రాయడం మొదలెట్టారు. అందుకే  కథ, కవిత, వ్యాసం , గల్ఫిక , నాటిక,నవల, పద్యమో,గద్యమో  ఏదో ఒకటి వ్రాస్తున్నప్పుడు వాళ్ళకి  వ్రాసే స్వేచ్చ కూడా లేని  వెనుకబాటుతనంని మనం ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందో.? 

నాకు అర్ధం కానప్పుడు.. నా ఆలోచనలని.. కాగితాలపై.. వ్రాయడం తప్పు అయిందని  అన్నప్పుడు  నేను ప్రశ్నించాను. అరువు గొంతుకలు  తొ..జీవన పర్యంతం ఎలా బ్రతకగలం?. "'ఎదురు తిరిగితే పోయేది ఏమి లేదు ఎనకబాటుతనం తప్ప" అన్న డైలాగ్ గుర్తుకోస్తున్నప్పుడు.. వ్రాస్తూ ఉంటాను. ఇంకా ఏమి  వ్రాయనే లేదు.( ఎందుకు ఈ.. బ్లాగుల రాత? ఏముంది  అందులో.. అవహేళనకి  స్పందించి..)

నా.. కవితలు చూసినప్పుడు.. చాలా మంది.. స్త్రీల పక్షపాతిని అని తీర్మానించాక .. అలా  అన్నవారివి పాషాణ హృదయాలని నిర్ధారించుకుని.. సమస్యని.. స్త్రీ పురుషుల భేదంతో చూడకూడదు  ఇద్దరు సమానమే.. అలా చూడటమే మనిషి తనం +మానవత్వం కూడా  అనిపించుకుంటుంది.. అని చెప్పటానికి మళ్ళీ వ్రాసాను. అలాగే.. ఇప్పుడూ వ్రాస్తాను.

నా కోసమే కాదు నా ఆలోచనలని హర్షించేవారి  కోసం కూడా..నేర్చుకుంటూ.. వ్రాస్తాను.  ఇష్టం అయితే చూడండీ! లేదంటే  మానేయండీ!!! స్త్రీల తెలివితేటల మీద చిన్న చూపు ఉన్న వారికోసం వ్రాయాలి కనుక వ్రాస్తాను.అందుకే .. నా..ఈ.. వ్రాత.       

19, జనవరి 2011, బుధవారం

దిల్ హుమ్ హుమ్ కరే గబరాయే"రుడాలి "





కొన్ని పాటలు గుండెల్ని  పిండేస్తాయి. విన్నప్పుడే కాదు. ఎప్పుడు గుర్తుకు వచ్చినా సరే! అలాటి పాట..గురించి.. నా మాట. 1993 లో..వచ్చిన "రుడాలి " చిత్రం .. ఆ సినిమలో నటించిన "డింపుల్ కపాడియా" తన "శనిచరి" పాత్ర నటనకి గాను నేషనల్ అవార్డ్  అందుకున్నారు.  భారతీయ ప్రఖ్యాత  బెంగాలి రచయిత్రి మహా శ్వేతాదేవి  రచించిన "రుడాలి" నవల ఆధారంగా.. కల్పనా లాజ్మి దర్శకత్వం వహించిన చిత్రం. ఫ్రేమ్ ఫ్రేమ్  కి. అభిమానిని నేను.  చలన చిత్రం కాదు అది జీవన చిత్రణ.  కొన్ని పాత్రల సజీవ చిత్రణ. ఇక పాటల విషయానికి  వస్తే..అన్ని పాటలు.. సన్నివేశానికి తగ్గట్టుగా.. ఉంటాయి. కానీ.. నన్ను కదిలించే పాట .. దిల్ హుమ్  హుమ్ కరే  గబరాయే..పాట. ఆ పాట విన్నప్పుడల్లా.. ఆ..విషాద కావ్యం గుండెల్ని పిండేస్తుంది. పాట సాహిత్యం తో పాటు.. సంగీతం ఎక్కడో.. పాతాళం నుండి పొంగుకోచ్చిన బాధ లావాలా.. ఎగచిమ్ముతుంది. ఎన్నో..విషాద గీతాలు విన్నా కూడా.. ఎప్పుడు కలగని..బాధ. అయినా.. వింటూనే ఉంటాను. "భూపేన్ హజారిక " సంగీత ముద్ర అది. ఈ .. పాట రెండు సార్లు ఉంటుంది. ఒక  వెర్షన్ లతా జీ.. రెండవసారి..భూపేన్  హజారిక .. సాహిత్యం కూడా.. భూపేన్ హజారిక నే. బ్రహ్మపుత్ర నది లోతంత గాఢమైన సంగీతం అది. వింటూనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ చిత్రాన్ని.. రోజుల తరబడి చూస్తూనే ఉంటాను.. ఎందుకో.. ఇంకా చూడాలని పిస్తూనే ఉంటుంది.

 అమ్జాద్ ఖాన్   ఆఖరి చిత్రం. సినిమా.. విడుదలకి ముందే ఆయన మరణించారు. ఖాన్ కి.. చిత్రాన్ని గౌరవార్ధం  అంకితం చేసారు. రుడాలి నవల సూరంపూడి కామేశ్వరి  తెలుగులో అనువదీకరించారని తెలుసుకున్నాను.  తెలుగు అనువాద నవల "రుడాలి" HBT ముద్రణలో అనేకసార్లు  వెలువడింది కానీ మా  బెజవాడ పుస్తక ప్రదర్శనలో కూడా.. దొరకలేదు. 

ఒక వాస్తవిక  జీవన చిత్రం "రుడాలి" చిత్రం. ప్రాంతాల, సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు స్త్రీల జీవనాన్ని ఎలా.. నిర్దేశిస్తాయో.. అదే "రుడాలి" విషాద కావ్యం. ఏమి నచ్చిందో.. విడదీసి చెప్పలేను..కానీ.. ఆసాంతం విషాదం. ఆ విషాద సంగీతం మాత్రం మధురమే! ఈ..పాటకు స్వేచ్ఛానువాదం యిది. 
.
"దిల్ హుం హుం కరె" (రుదాలి)
ఈ గుండె కొట్టుకుంటున్నా దడే!
ఉరుము ఉరిమినా దడే!
యెప్పుడన్న వో చుక్కపాటి కన్నీటి వాన
కనికరం కూడా లేదే ఈ పాపిష్టి కళ్ళకు!
ఆకులన్నీ యెండిపోయిన క్షణాల
నీ ముందు జోలె పరుస్తాను
నీ ఒక్క స్పర్శకే
యీ ఎండిన కొమ్మా
పచ్చగా ప్రాణం పోసుకుంటుంది.
నువ్వు తాకిన ఈ దేహాన్నైతే
ప్రపంచం నుంచి దాయగలను గాని,
నీ చూపులు తాకిన ఈ మనస్సును
ఎవరికి చూపను?
ఒయీ చంద్రుడా!
నీ వెన్నెల నా ఒళ్ళంతా మండిస్తోంది.
అంతెత్తు గడపమీద నువ్వు
రెక్కలు తెగ్గోయించుకుని నేల మీద ముడుచుకుని నేను!
(రుదాలి (1993), గుల్జార్, భుపేన్ హజారికా, లతా మంగెష్కర్/భుపేన్ హజారికా)
(original song)



dil hum hum kare ghabraaye, ghan dham dham kare darr jaaye
ek bund kabhee paanee, kee moree ankhiyo se barsaaye
dil hum hum kare ghabraaye

teree jhoree daru sab sukhe pat jo aaye
teraa chhua lage, meree sukhee dar hariyaaye
dil hum hum kare ghabraaye

jis tan ko chhua tune, uss tan ko chhupaau
jis man ko lage naina, woh kisko dikhaau
o more chandrama, teree chaandanee ang jalaaye
teree unchee ataree maine pankh liye katwaaye
dil hum hum kare ghabraaye, ghan dham dham kare darr jaaye
ek bund kabhee panee kee moree ankhiyo se barsaaye
dil hum hum kare ghabraaye

17, జనవరి 2011, సోమవారం

నలుపు నాలుగు విధాల కాదు



హాయ్. ఫ్రెండ్స్! నలుపు నాలుగు విధాలు..
అదేమిటీ .. "నవ్వు నాలుగు విధాలు చేటు అని కదా.. అంటారు"  అనుకుంటూ  పొరబడకండి.

"ఈ..నలుపు ఏమిటి? అన్ని నలుపు బొమ్మలు ఏమిటీ! "అనిచిరాగ్గా మొహం చిట్లించుకోకండీ త్వరపడి.
ఈ..పోస్ట్ చదివిన తర్వాత నాకులాగా.. నలుపుకి  వీరాభిమానిగా మారడం ఖాయం అని..
నా రాతల మీద కన్నా నలుపు పై నాకంత నమ్మకం.

ఎన్నెన్నోవర్ణాలు అన్నిట్లో అందాలు, నలుపంటే నాకిష్టం అని చెప్పడమే కాదండీ.. నలుపు పట్ల కొందరికి చిన్న చూపు కొందరికి ఏహ్య భావం కొంత మందికి భయం వారికి కల్గిన భావాన్ని కొంత తగ్గించే ప్రయత్నం. కొంత మందికి నాకులానలుపంటే  ఛాలా ఇష్టం.  ఈ నలుపంటే ఇష్టం అయినవాళ్ళకి ఇంకొంత ఇష్టం కల్గేటట్లు నా ఈ రాతలు.

అసలు ఈ విషయం చెప్పడానికి ముందు నాకు ఒక కష్టం కాని కష్టం వచ్చిపడింది. వచ్చే నెలలో ఒక ఐదు ఆరు రోజుల టూర్ కోసం ప్లానింగ్ వేసుకున్నాం. అది పుణ్యక్షేత్రాల సందర్శన కొరకు యాగాలలో పాల్గొనే భక్త బృధంతో కలసి నా ప్రయాణం ఏర్పాట్లు జరిగి పోయాయి. అమ్మోఅన్ని రోజులు,ఆ యజ్ఞాలు యాగాలు చూస్తూ ఇంటికి దూరంగా ఉండటమా!నా వల్ల కాదేమో అన్న శంక నాలో ఉన్నావెళ్ళడం నిర్ణయం అయిపోయినాకా వెనుతిరగరాదని ధృడంగా తీర్మానించుకుని ఏయే బట్టలు ధరించాలి అనుకుని ఆలోచిస్తూ బట్టల బీరువా ముందు నిలబడ్డా!  అరగంట నిలబడ్డా అందులో నలుపు తఃప్ప ఇంకేమి కనబడలేదు. ఒకవేళ ఉన్నా అందులోనూ నలుపు గీతలో, నలుపు సున్నాలో అర్ధంకాని వెబ్ డిజైన్ లు ఉన్నవే ఉన్నాయి. చచ్చాను బాబోయ్! అనుకుని ఉసూరుమని కూర్చున్నాను. ఇప్పుడు షాపింగు కి ..పరుగులెత్తాలి. ఎందుకంటే బయలు దేరే బృందం అంతా నలుపు అంటే ఆమడ దూరం పరుగెత్తే వాళ్ళు,  పది యోజనాల దూరంగా ఉంచే వాళ్ళు. అది నా ...కష్టం.

చీర కొనుక్కున్నాను.. అత్తమ్మా!చూడండీ..అని.. మా..అత్తమ్మకి చూపిస్తే.. ఆ రంగు తప్ప నీకు వేరే రంగు దొరకలేదా ? అని చిరాగ్గా మొహం పెట్టె  ఆవిడ దగ్గర నుండి.. కాలికి చెప్పులు కూడా  నలుపు ని అంట నివ్వని స్నేహితురాలు " రమ " వరకు నాకు నలుపు అనుభవాలు ఎన్నెన్నో!. అసలు "నలుపు ప్రపంచపు ప్యాషన్ " అని వీళ్ళందరికీ.. నచ్చ చెప్పడం ఎలా అని సీరియస్ గా ఆలోచించి ఈ.. ప్రయత్నం మొదలెట్టాను.  " మీ బట్టల బీరువాలో నలుపు డ్రెస్ లేదంటే.. మీకు.. ప్రపంచపు ప్యాషన్ గురించి తెలియదన్నమాట" . ఈ..కొటేషన్ గుర్తు చేస్తుంటాను ..అడిగిన వారికి, అడగని వారికి అందరికీనూ.

ఈ.. ప్రపంచంలో వీలైనంతగా నల్ల ప్రేమికులని పెంచుదామని నా ప్రయత్నం బెడిసికొట్టి.. నేనే నలుపు కాకుండా వేరే రంగు బట్టలు ధరించే ప్రయత్నాలు మొదలెట్టవలిసి వస్తుంది అని కలలో కూడా..అనుకోలేదు. అయినా నలుపు అంటే.. ఎందుకండీ.. అంత భయం?  ఏమిటో.. అశుభం అంటారు.   వెలుగునీడలు.. కష్ట-సుఖాలు అంటూ..పెద్దవాళ్ళే చెప్పారు. చీకటి లేకుంటే వెలుగుకి విలువ వచ్చేనా? కష్టం లేకుంటే సుఖం బోర్ కొట్టదూ.. ! అయినా..ఒక మాట అంటున్నానండీ ఏమనుకోవద్దు. తలలు ముగ్గుబుట్టలు అయిన వాళ్ళు ఆ తెలుపుని మాటేసి నలుపు రంగుతో
 నిగ నిగ లాడుతూ..వయసుని దాచే ప్రయత్నం చేసేటప్పుడు..ఈ..నలుపు ఎందుకు? చక్కగా.. తెలుపే ఉంచేసుకోవచ్చు కదా?  " ఏమిటో ఈ బాల నెరుపులు".. అంటూ బిల్డప్పులు.

మనం నిత్యం వాడే వస్తువులుఅన్ని నలుపులోనే ఉంటాయి.. మరి వాటిని పారేయడం లేదు కదా! అంత ఎందుకండీ !  కొన్ని వస్తువలని నలుపులో..తప్ప వేరే రంగులో.. చూడలేం కూడా ! కావాలంటే ఊహించుకోండి.

ఉదా: బెల్టు,హేల్మెట్టు,మనీ పర్సు ,గొడుగు,కళ్ళజోడు.. షూష్,చెప్పులు.. ఇలా.. చాలా వస్తువులు.. నలుపు లోనే బాగుంటాయి. మనం కాలు బయట పెడుతూనే నిత్యం నడిచే రోడ్డు నలుపు. రోడ్డు మీద నడిచే వాహనాలలో మూడువంతులు రోడ్డు కింగ్లు  నల్లరంగు వాహనాలే! నల్ల ఉప్పు, నల్ల మిరియాలు,నల్లద్రాక్ష,నల్ల కాఫీ,నల్ల టీ, నల్ల బంగారం బొగ్గు,నల్ల ఇసుక,నేరేడు పండ్లు,ఆలివ్ ఇలా.. నలుపు ప్రత్యేకం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అత్యధికంగా..అమ్ముడయ్యే బుక్ బైబిల్ అట్ట కూడా  నలుపే! తెల్లటి కాగితంపై నలుపు అక్షరాలు, బ్లేక్ బోర్డ్, క్లాప్ బోర్డ్,.. అన్ని నలుపే కదా! అసలు నలుపుకి ఏ రంగు అయినా.. attach చేసుకోవచ్చు. తనలో అన్నిటిని కలిపెసుకునే కెపాసిటి నలుపుకే ఉందేమో!? ఏ రంగు అయినా నలుపు పై వచ్చిన అందం ఏ రంగు పైనా రాదండీ!


అసలు  నలుపు బట్టలు ఏ రంగు వారికైనా నప్పుతాయి వేసవిలో మండిస్తాయి తప్ప తతిమా కాలంలో.. నలుపు బహు రక్షణం. చలి కాలంలో నువ్వుల వంటకాలు ఒంటికి ఎంత మంచిది. చీకటి నలుపు, కాటుక నలుపు,నల్ల కలువలు అని కళ్ళను వర్ణించడం పరిపాటి.అంతెందుకు నల్ల మబ్బుల మాటున దోబూచులాడే చంద్రుడు లో..నలుపు, గండు కోయిల నలుపు,మధుపుటీగ నలుపు, అగరవత్తులు నలుపు,నారాయణుడు నలుపు,నరుడు నలుపు.
 ఇంకా చెప్పాలంటే ....అసలు నల్లవస్త్రం తన తరపున నన్ను.. మీకు ఇలా చెప్పమంది. ఏదైనా నిరసన తెల్పాలనుకున్నప్పుడు.. మీ చేతిలో..ఆయుధం నేను. మౌన పోరాటం చేస్తున్నప్పుడు.. మీ నోటికి అడ్డు నేను, న్యాయ దేవత కళ్ళకి గంత ని నేను.. న్యాయవాదులకి,న్యాయ మూర్తులకి సత్య ప్రతిరూప వస్త్రదారణం నేను.

ఎందుకు.. నలుపు అంటే.. అంత భయం ? కుక్క ఎంత విశ్వాస జంతువు అయినా..నలుపు వద్దంటారు. పిల్లి ఎంత స్నేహశీలి. అమ్మో..నల్ల పిల్లి మరీ..అపశకునం అంటారు. కాకి నలుపు అంటారు. ఆ కాకి పిలుపుకి ఎంత ఫాలోయింగ్ ఉందో..తెలుసా అండీ!మనం పిలిస్తే నలుగురు కూడా పలకరు కదా !  అసలు.. నల్లదనం లో ఎంత స్ట్రాంగ్ ఉందొ అన్నది మీకు తెలియదా? నల్లధనంలోను ఎంత సిరి దాగుందో.. అసలు లెక్క కందుతుందా? అన్ని బాగానే ఉన్నాయి కానీ.. పిల్ల నలుపు, పిల్లడు నలుపు అంటారు. ఎంత మండుతుందో! అల్లా అనిపించుకోకుండా ఉండాలంటే ఎన్ని క్రీములు రాయాలి.. ఎన్నిడబ్బులు  ఫేషియల్స్ కి..  తగలబెట్టాలి. అందుకే.. నలుపు ని హృదయంతో మెచ్చుకుంటే ఏమవుతుంది చెప్పండీ!.. నలుపు నాణ్యం అండీ! పెద్దవాళ్ళు చెప్పారు కదా అలా అని. తన నటనతో అందరిని మెప్పించిన మహా నటి సావిత్రిగారు.. నలుపు శరీర చాయ కల్గి ఉండేవారట. అభినేత్రి వాణీశ్రీ, ఇలా.. చెప్పుకుంటూ పోతూ ఉంటే.. చేంతాడంత లిస్టు.

ఆఖరిగా.. ఒక మాట. నలుపు వస్త్రాలు ధరిస్తే శనీశ్వరుడు పట్టి పీడిస్తాడని.. పిచ్చి నమ్మకాలూ. అశుభం ఇలా.. ఏదేదో శంకలు.కానీ.. నలుపు శనీశ్వరుడుకి అత్యంత ప్రీతికరం అంట. నల్ల బట్టలు కట్టుకుని ఆయనని ప్రార్ధిస్తే.. ఏమి చేయడట. పనిలోపని ఆయన వాహనం కాకికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టడం మరువకండీ! శరీర ఛాయ పేరిట జాతులనీ వేరు చేయడం మూలంగా ఎన్ని వైషమ్యాలు ఏర్పడుతున్నాయో.. మన అందరికి తెలుసు. అయినా అమేరికా వాళ్ళు వైట్ హౌస్ ని బ్లాకు హౌస్ గా మారిస్తే నష్టం ఏమి ఉండదు.సామరస్యం పెరగవచ్చు కూడా.. అందుకే ..రంగుని బట్టి కాక . మనసులని బట్టి,. సంస్కారాన్ని బట్టి మనుషలని గౌరవిద్దాం ..ప్రేమిద్దాం. హ్హా !!! డీప్ గా వెళ్లిపోయినట్లు ఉన్నాను కదా ! ఇంతకీ.. నలుపు వద్దంటే..ఎలా.. ? నాకు నలుపే కావాలి. నాకు కుక్క కావాలి-కుక్క కావాలి.. అన్నట్లు. ఎవరి ఇష్టం వారిది..

ఎంత శుభకార్యాలు, పూజలు,వ్రతాలు, యాగాలు చేసుకునేటప్పుడు నలుపు వస్త్రాలు ధరించకూదదని ఎవరు చెప్పారో దానికి..వివరణ ఏమిటో తెలుసుకోవాలని ఉంది. మన సంప్రదాయాలలో,ఆచార వ్యవహారాలలో ఎంతో కొంత మంచి ఉండనే ఉంటుంది. నలుపు వస్త్రాలు ధరించడం వల్ల చెడు జరుగుతుందని నాకైతే పట్టింపు అసలు లేదు. కిలో బంగారం ఒక నల్ల చీర ప్రక్క ప్రక్కనా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే నేను నల్ల చీరే కావాలంటాను. అది నా..ఇష్టం. నలుపు వద్దని అంటే .. టేస్ట్ లెస్స్ అనుకోవడం తప్పితే.. ఇదంతా చెప్పినా మా ఇంట్లో ఒప్పుకోరండీ! అంటారు పాపం చాలా మంది. వాళ్ళ అభిరుచికి,ఇష్టానికి.. ప్రాధాన్యం లేనట్లు . కొన్ని జీవితాలు అంతే.

మన మనస్సులో పేరుకున్న సంశయాలు,మూడ నమ్మకాల ప్రభావం మన మీద ఉన్నంత కాలం అమ్మో!ఏమవుతుందో.. అనుకుంటూ భయంగా .. బ్రతికేస్తాం. అందుకే..కొంచెం భయంని ప్రక్కన పెట్టి.. కొన్ని కొన్నిటిని ఆస్వాదిద్దాం. ఇంతకీ.. నేను షాపింగ్కి వెళ్ళను. హాయిగా నాకున్న నల్లటి అందమైన చీరలే ధరించి అబ్బ..ఎంత బాగున్నాయో! నలుపు వద్దంటారు కానీ ఆవిడ కట్టుకోలా అంతా.. చాదస్తం మన వాళ్లకి అంటూ.. వద్దు అన్న వాళ్ళని విసుక్కుంటూ నా.. చీరలకి ప్రశంసలు.. అందిస్తే.. నాకు చాలా సంతోషం సుమండీ.. ఎందుకంటే స్వయంగా రూప కల్పన చేసుకున్న చీరలు. వేలకి వేలు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న చీరలు. ప్రదర్శించకపోతే అడ్వర్టైజ్మెంట్ కి బోలెడు పెట్టాలి. కదా! అందుకే ఇలా.. అన్నమాట. 

ఎంతైనా.. ఆడవారిమండీ! మా.. బెజవాడ తెలుగు కళ గారు కూడా (పద్మకళ) నా .. బ్లాగ్ ని . తెల్లంచు నల్లచీర కట్టుకున్న తెలుగు వనితగా.. అభివర్ణించారు. ఆమెకు కృతజ్ఞతలతో.. నలుపు పై నిరసన చూపకండి. అన్ని రంగుల లాగే నలుపుని ప్రేమించండి. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూవులు ఎన్ని రంగులు ఎన్ని సొగసులిచ్చాడు, అన్నింటా..ఒకేలా.. చూడ మన్నాడు. కవిగారి కవిత్వం కొంత నా పైత్యం కొంత.కలిపి చెబుతూ  నలుపంటే ఇష్టం కలిగించాను కదా !  నలుపు.. గులాబీ..కూడా ఉందని మీకు తెలుసు కదా! కానీ.. రాయల్ ఫ్రీ చిత్రం దొరక లేదండీ! అందుకే జతపర్చలేదు. కాస్త ఈ పోస్ట్ చదివి చూసాక అయినా నలుపు పట్ల మీకు వ్యతిరేక అభిప్రాయం ఉంటే మార్చుకుంటారు కదూ!

ఇది నలుపు నాలుగు విధాల కాదు నలబై విధాల మేలు  అన్న మాట. మా అత్తమ్మ మొబైల్ ఫోనులో... పిలుస్తున్నారు. ఇలా వ్రాస్తున్న  సంగతి తెలిసిందో ఏమో ! నీ..నలుపు పిచ్చి అక్కడ కూడా అతికిస్తున్నవా.!? అంటూ..ప్రేమగా మందలిస్తారు.  ఈ సారి షాపింగ్ కి.. వెళ్లి నప్పుడు నలుపు చూసినప్పుడు.. నన్ను గుర్తు చేసుకోండీ..ప్లీజ్!!!!!  ఓ.కే. బై ఫ్రెండ్స్ !




14, జనవరి 2011, శుక్రవారం

బంగారం లాంటి బంగారు పాట

క్రిష్ణమ్మ ఒడిలో..  పిల్లలని మందలిస్తూ.. 
నాలాగే నేనుంటాను 
పంటపొలాల్లో రైతు బిడ్డ  
సరదాగా.. డిఫ్రెంటుగా!        
ఆడుతూ పాడుతూ వర్షంలో..
అమ్మబండిపై తాతినేని తేజం 
గిరిజన సహోదరులతో.. నలమల కొండలలో..ఎక్కు పెట్టిన బాణం 

చిరునవ్వుల  చంద్రుడు 
నేను మీకు పరిచయం చేయబోయే పాట నాకిష్టం కావటానికి ముందే..
నాకెంతో ప్రాణమైన మా ఇంటి వెలుగు .. మా..చుక్కల్లో చంద్రుడు..(తను తప్ప మా ఫ్యామిలీ లో అందరి సంతానం  అమ్మాయిలే ) కి చాలా చాలా ఇష్టమైన పాట.

చుక్కలో చంద్రుడు సినిమా రాగనే.. తన మొబైల్ ఫోన్ లో.. కాలర్ .. ట్యూను గా సెట్ చేసుకున్నాడు. ఆ పాట వినమ్మా! బాగుంటుంది అని తనే నాతో చెప్పాడు. విని చాలా బాగుంది అని..ప్రశంసగా  చిన్న  మొట్టికాయ వేశాను అనుకోండి .
తర్వాత తర్వాత   ఛాలా మంది మీ..అబ్బాయి కాలర్ ట్యూన్ భలే ఉందే! అని మెచ్చుకునేవాళ్ళు. నాకు భలే గర్వంగా ఉండేది.. మంచి అర్ధంతో అచ్చు నా కొడుకు.. మనస్తత్వంకి అద్దం పట్టేటట్లు ఉంటుంది.
తనకి కూడా..ఇష్టమైన పాట.. అందుకే అప్పుడప్పుడు తనకి ఆ పాటని డేడికేట్ చేస్తుంటాను.
ఈ పాట రచన లో.. సురేంద్ర కృష్ణారావు తొ..పాటు  నటుడు..సిద్దార్ధ కూడా  పాలుపంచుకున్నాడు.
చక్రి సంగీతం.  ఇక పాట సాహిత్యం  ఇదుగోండి!  వినాలనుకుంటే.. రాగాలో.. లభ్యం

మళ్ళీ మళ్ళీ రాదంట ఈ.. క్షణం..
నచ్చినట్టు నువ్వుండరా..
యవ్వనం అంటేనే ఓ..వరం.
తప్పు ఒప్పు తేడా లేనే లేదురా..
చిన్న మాటని చెవిన వెయ్యని...
నిన్ను నువ్వు నమ్ముకుంటే నింగి వంగదా ..
విన్న మాటని విప్పి చెప్పనీ..
బ్రతుకుతూ..బ్రతకనిస్తే నువ్వు దేవుడే!
ఎవిరిబడి,లెట్స్ పంప్ థిస్ పార్టీ..
రాక్ ఎవెర్ బాడీ విత్ మీ...

నాలాగే నేనుంటాను  ..
నా మది మాటే వింటుంటాను..
థట్స్ జస్ట్  ద వే  ఐ యాం..
నాతోనే నేనుంటాను..
నచ్చిన పనినే చేస్తుంటాను..
ఐ డోన్ట్ గివ్ ఎ  డామ్..
నవ్వులు  రువ్వుతూ.. నవ్వులు పంచుతూ..
నాలుగు  రోజులు ఉన్నాచాలు..  అంతే  చాలురా (ఎ)

అందని పండును పొందాలి..
ఆంతా ఆనందం..
అందిన వెంటనే పంచాలి..ఎంతో సంతోషం.
అల్లరి పనులే చేయాలి.. అప్పుడే ఆరోగ్యం.
నా  సాటి నేనుంటాను...
పోటీలో ముందుంటాను...
కెరటం నాకే ఆదర్శం.. పడినా లేస్తాగా..
సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా..
కష్టం అంటే ఇష్టంగా..నష్టం రాదంటా ..
నమ్మిందే చేస్తుంటాను..ప్రాణం పెట్టి సాధిస్తాను..
నవ్వులు రువ్వుతూ.. నవ్వులు పంచుతూ..
నాలుగు రోజులు ఉన్నా చాలు.. అంతే..చాలురా..
ఎవిరి బడి, లెట్స్ పంప్ థిస్ పార్టీ , రాక్  ఎవెరి  బాడీ విత్ మీ!
నవ్వులు రువ్వుతూ.. నవ్వులు పంచుతూ..
నాలుగు రోజులు ఉన్నా చాలు. అంతే చాలుర.. (ఎ)
ఆకాశం  నీ సరిహద్దు.. అవకాశాన్నే అసలోదలద్దు..
ఆవేశం అసలే వద్దు..ఆలోచిస్తే..ఎంతో ముద్దు..
స్వేచ్చగా మంచిని పంచుతూ..
నాలుగు రోజులు ఉన్నా చాలు. (ఎ)



ఓల్డ్ మెలోడీస్ వినే వారికి  ఈ..పాట నచ్చక పోవచ్చు. కానీ..  సాహిత్యపరంగా..  స్పూర్తికరంగా.. ఈ..పాటకి.. వినే ఓటు వెయ్యవచ్చు..
నాకు నచ్చిన పాట  వెనుక  కధ ఇది.. మొదటసారిగా.. ఈ..పాటని.. నేను విన్నప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత రుచి తెలిసింది.

మీరు  చూస్తూ ..వినండీ.. బై 
ఈ..పాట ని గుర్తు చేసిన shabbuki ధన్యవాదములు.
అలాగే చిన్ని.. బంగారం!! .. నీ.. అనుమతి లేకుండా  నీ.. పిక్స్ పెట్టినందుకు.. సారీ బంగారం !  

12, జనవరి 2011, బుధవారం

పిల్లలు.. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులా?

పిల్లలు తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులా? వారిని ఆస్తులను కాపాడుకున్నంత భద్రంగా కాపాడుకోవాలా? అయితే అది సాధ్యమా? న అప్పుడప్పుడూ నన్ను, నా స్నేహితులనూ ,యవ్వనంలో  పిల్లలున్న తల్లిదండ్రులను  కూడా యీ ప్రశ్న వేధిస్తుంది.


 "ఖలీల్ జిబ్రాన్" ఇలా అన్నారని ఎక్కడో  చదివాను. "పిల్లలు ప్రకృతి ప్రసాదించిన వరాలు.నరజాతి భవిష్యత్తుకు ప్రతీకలు. పిల్లలు మననుంచే వచ్చారు..కానీ వాళ్ళు మనకు మాత్రమే సంబంధించిన ఆస్తులు కాదు. మన వ్యక్తిగత ఆకాంక్షల తోను,బలహీనతలతోను పిల్లల  మీద రుద్ది వాళ్ళ జీవితాలను నరకప్రాయం చేయడం అమానుషం. పిల్లలలో శక్తి -సామర్ద్యాలువికసించేలా చేయడం, వ్యక్తిత్వం రూపొందేలా శాయశక్తులా కృషి చేయడం,ఎదిగాక ప్రేమించే స్నేహితులుగా వారికి ఆత్మీయతని పంచడం మన ధర్మం" అని.


 నేను.. ఈ వాక్యాలు చదవడం వల్ల నా ఆలోచనలలో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. అందు మూలంగా నేను ఎప్పుడు నా కొడుకుకి “ఇలా ఉండు,ఇలాగే చేయి” అని ఎప్పుడు ఆంక్షలు పెట్టలేదు.  తనకి ఇష్టం లేని చదువలని   చదవమని బలవంతం చేయలేదు.  తన ఆలోచనలకి అనుగుణంగానే నడుచుకునేటట్లు సహకారం అందించడం చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పడం. అంతే!  చూసే వాళ్లకి పిల్లల్ని అతి గారాభం చేసినట్లు ఉంటుంది.


కానీ ఈ రోజుల వాతావరణం  ఎలా  ఉందంటే.. పిల్లలకి తల్లిదండ్రులు ఏ.టి.ఎమ్..లా ఉండాలి.  మనం చెప్పే జాగ్రత్తలు కానివ్వండి,సలహాలు కానివ్వండి,సూచనలు కానివ్వండి వాళ్ళకి పరమబోరు. చాదస్తం. ఇంకా వీలైతే  కన్నవాళ్లు రాక్షసులు. ఇవి వాళ్ళిచ్చే టాగ్స్. వాళ్ళ ఉన్నతి కోసం తరగతి  తరగతికి వాళ్ళు మెట్లు ఎక్కుతుంటే మెట్టు మెట్టుకి నోట్ల కట్టలని పేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు!? ఉద్యోగస్తులైతే పర్లేదు. ముఖ్యంగా పల్లెల నుండి పట్టణాలకి వలస వచ్చి పిల్లల  చదువులు పేరిట పల్లెలు బీడుపోయింది ఇందుకే.


ఏడాదికి ఒక ఎకరా లెక్కన అమ్మి వాళ్ళ బంగారు భవిత కోసం ఆశించి,శ్వాసించిన   తల్లిదండ్రుల మాటకి పిల్లలు విలువ ఇవ్వడం లేదని బాధపడటం  కన్నా ఆ బాధ పడినట్లు పిల్లల కి తెలియజేప్పితే వాళ్ళు అర్ధం చేసుకోరా?  అంటాను నేను.


  

మనం చాలా కస్టపడి పెంచాము. అందుకు బదులుగా వాళ్ళు బాగా చదువుకుని,మంచి ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ లక్షలు సంపాదించే అమ్మాయిని లక్షల,కోట్ల కట్నంతో జీవిత భాగస్వామిని చేసుకుని ఫలానా వారి అబ్బాయి లేదా ఫలానా వారి అమ్మాయి అని  గర్వంగా  చెప్పుకునేటట్లు ఉండాలి. ఇది తల్లి దండ్రుల ఆశ.


ఇక పిల్లల  విషయానికి  వస్తే చదువుల పేరిట బాల్యాన్ని  బంధిఖానా కి చిరునామా చేసి రాంకుల ఒత్తిడిలో ఇష్టాలని మనసులని చంపేసి మేము పిల్లలం కాదు మర బొమ్మలమా? మనం వాళ్ళు  అనుకునట్లు ప్రవర్తించాలా ?  అని  పిల్లలూ వారి అభిప్రాయాలు. ప్రతి ఇంట్లోను ఇదే తరహా వాదన.


కొన్ని  చోట్ల   విభిన్నమైన తల్లిదండ్రులు ఉన్నారు. లేరనుకోవద్దు. విభిన్న మైన పిల్లలు ఉన్నారు. కానీ చాలా చోట్ల పిల్లపై ఆంక్షలు సామజిక భద్రత కోసం స్వేచ్ఛ పేరిట దుర్వ్యసనాలకు  బలి అవుతారనే భయంతో  పిల్లలపై అనేక ఆంక్షలు .  అది పిల్లలకి అర్ధం అయ్యేటట్లు చెప్పడం వారి బాధ్యతే కాదు గురువుల బాధ్యత కూడ..


  తరం తరంకి  మద్య అంతరాలు చాలా సహజం. సహజంగా పిల్లలకి ఉండాల్సింది క్రమశిక్షణ, పెద్దల యెడ గౌరవం. దురదృష్టవశాత్తు  ఇప్పటి పిల్లలకి అవే ఉండటం లేదు. మీకేమి తెలియదు, మీరు నోరు మూసుకుని కూర్చోండి.  అంటూ తల్లిదండ్రుల పట్ల  పిల్లల చిన్న చూపు. పెద్దల అహం దెబ్బతినడంతో పాటు  మా మాటే   విని తీరాలనే పట్టుదలలు. ప్రతి కుటుంబంలో ఘర్షణలు. ముఖ్యంగా  .. పెళ్ళిళ్ళ విషయంలో పెద్దల   ప్రమేయం లేకుండా ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి..  ఎక్కడో వ్యతిరేకంగా  ఉన్నా అవి పెద్ద పట్టింపు  కాదు అనే చెప్పాలి.


ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోదలచాను. నా.. ఫ్రెండ్ కి ఒక కూతురు ఉంది. తనది కులాంతర ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది. వాళ్లకి ఒక కూతురు. గారాబంగానే పెంచారు. వేలంవెర్రి ఇంజినీరింగ్ చదువులనే  లక్షలు  డొనేషన్ కట్టి  మరీ చదివించారు.. అంతా బాగానే ఉంది. ఆ.. అమ్మాయికి స్నేహితులు ఎక్కువే. ఆడ-మగ ఫ్రెండ్స్.. తేడా అసలే   లేదు.వచ్చిన చిక్కు ఏమిటంటే  అర్ధరాత్రి  వరకు  మొబైల్ ఫోన్ లో ముచ్చట్లు. సినిమాలు, మూన్ లైట్  డిన్నర్స్ ,అర నిమిషానికి  ఒకసారి  ఐ లవ్ యు..లు చెప్పుకోవడాలు.. తల్లిదండ్రులకి  ఒకసారి కాక పోయినా ఒకసారయినా చెవుల్లో పడతాయి కదా!  చదువు పూర్తయ్యింది. ఎలాగోలా మూడుముళ్ళు వేయించి    గౌరవం నిలుపుకుందామని  ప్రేమించిన అబ్బాయి వివరాలు చెప్పమ్మా! వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం, నీ పెళ్లి  చేస్తాం అన్నారట. 


అప్పుడు ఆ.. అమ్మాయి ఎంత అవమానంగానో ఫీల్ అయిందట. ఇంతేనా.. తల్లిదండ్రులుగా మీరు నన్ను అర్ధం చేసుకుంది!!  వాట్ ఏ షేం! వాట్  ఏ షేం !! అని విరుచుకు పడిందట. 


అదేమిటమ్మా! నువ్వు అ..అబ్బాయికి రోజూ “ ఐ లవ్ యు లు చెపుతావుగా, అది ప్రేమ కధ కాదా? అయితే పెళ్లి చేసుకోవా? అతను చేసుకోనన్నాడా?” అని ఆదుర్దాగా  అడిగిందట. 


అప్పుడు ఆ అమ్మాయి సమాధానమేమిటో అన్నది మీరు ఊహించలేరు. “ఓహ్.. మమ్మీ! అతను నాకు.. ఫ్రెండ్ మాత్రమే!  నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. మీరు ఈ కాలానికి పనికి రారు.నా దారిన నన్ను వదిలేయండి. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినపుడు  చెబుతానులే “ అంటూ తెగ క్లాస్  తీసుకుందట.


 ఈ.. స్వేచ్చ పేరిట ఈ అర్ధరాత్రి తిరుగుళ్ళు ఏమిటో,  ఈ.. ఐ లవ్ యు లకి అర్ధాలు ఏమిటో నాకు అర్ధం కావడం  లేదు.. నువ్వు అయినా  చెప్పవే అంటూ నాతొ  మొరపెట్టుకుంది.

ఆ అమ్మాయి భవిష్యత్తు పట్ల ఆ.. తల్లిదండ్రులకి  ఎంత దిగులో చెప్పలేను. 


పిల్లలు ఎందుకు  తల్లిదండ్రులిచ్చిన స్వేచ్చని దుర్వినియోగం చేసుకుంటున్నారు.? కనీసం వాళ్లకి.. కావాలిసింది ఏమిటో వాళ్ళకైనా తెలుస్తుందా? అమాయిల అబ్బాయిల మద్య నిజంగా ఫ్రెండ్ షిప్  యేనా?   వీళ్ళ  భవిత  అందకారమా ? వాళ్ళ తల్లితండ్రుల ఆశలు అడియాశలేనా? స్నేహమా-ఆకర్షణా?ప్రేమా?  ఎందులోనుండి   ఎందులోకి వెళుతున్నారు?  వాళ్ళు    అయోమయంతో  ఉండి పెద్దలని అయోమయంలో పడేసే.. ఈ. స్నేహాలని ఏమంటారు. ఇది పిల్లలకి ఇచ్చిన స్వేచ్చ ఫలితమా ?  అంటూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది.


 నేను ఆలోచనలో పడ్డాను. స్వేచ్ఛకు అర్ధం ఏమిటి?  అసలు పిల్లలను ఎలా పెంచాలి? అలా మనం పెంచగల్గుతున్నామా?  చాదస్తం  అని కొట్టిపారేసిన పిల్లలు వాళ్ళు వారు కోరుకున్నట్లు ఉండగల్గుతున్నారా?  ఎక్కడికి ఈ పయనాలు ! నాలో అనంతకోటి  ప్రశ్నలు వేధిస్తున్నాయి..


 అసలు నేను నా కొడుకుని ఎలా పెంచాను ఎలాటి వ్యక్తిత్వం వచ్చింది అనేది మళ్లీ చెపుతాను. ఇంతలో.. నా ఫ్రెండ్ కూతురు లాటి వారి  ఆలోచనా  విధానం ఏమిటో కాస్త మీరైనా చెపుదురూ!  మీ ఆలోచనా కోణాన్ని  గమనిస్తాము.  పిల్లలను ఆస్తులను కాపాడుకున్నంత  తేలికగా కాపాడుకోగాలమా.?  ఖలిల్ జిబ్రాన్  చెప్పినట్లు.. భారతీయ తల్లిదండ్రులు మారగాలరా? స్వేచ్చ  పేరిట  మన పిల్లలు మాయదారి సంస్కృతి ముసుగులో సమిధలు అవుతున్నారా? ఆలోచిద్దాం.  


ఇలాంటి మరికొన్ని ఆలోచనాత్మక వ్యాసాలూ  నా బ్లాగ్ లో  https://vanajavanamali.blogspot.in

11, జనవరి 2011, మంగళవారం

లవ్ మానియా

                                

ఇక్కడ ప్రేమ అమ్మబడును..!?
ఇప్పుడు జీవితం కన్నా,జీవనం కన్నా
చదువుకన్నా,సంస్కారం కన్నా
 ప్రేమ అవసరమైన వస్తువని..కనుగొన్నారు..

అమ్మ స్పర్శలో,నాన్న మందలింపులో
బామ్మ గోరు ముద్దలో,తాత బుజ్జగింపులో దొరకని ప్రేమ
మాట పంచుకోవటానికి లేని తనంలో
లేమితనం నుండి బయటపడటానికో
వెంటాడి వేధించే అభద్రతాభావం నుండో
మేల్కొన్న ప్రేమ
తెర సాక్షిగా..
పలకల  మీద ప్రేమ లేఖలలో..ప్రత్యక్షం.
ఎదిగి ఎదగని ఆలోచనలతనంలో..
ఉత్ప్రేరకం ప్రేమ..ఉద్రేకం ప్రేమ.

ఆ ముసుగులో, తొడుగుల రక్షణలో (కండోమ్స్)..
జీవితంలో చిరునవ్వులు  సాక్షిగా..(ఐ.పిల్)
ఇప్పుడు వాంచల పర్వం అంతా ...
బహిరంగ రహస్యమే మరి.
విచ్చుకునే ప్రేమని ,విచ్చు కత్తి అయిన ప్రేమని .
ఆహ్వనిచడం  తప్పదు..

అసంతృప్తుల కాష్టంలో రగిలే  సహచరికికి
సానుభూతి శీతల పవనం కోసం
నిరంతర ప్రేమాన్వేషణ.
దోరుకునో-లేదో?
అది ప్రేమో!కాదో?
శరీరాల పట్ల ఆసక్తికో
వస్తువుల పట్ల ఆకర్షణకో..
భావసామీప్య సహజాతావరణానికో..
తలొగ్గిన సిగ్గుకి లోపాల్నిపూరించే ప్రేమని
కొనుక్కోక తప్పదు మరి..

జీవన చరమాంకంలో..
సహచరులను కోల్పోయినవారికి
అలసిన కాయాలకి..
అంతస్తులతో కొలిచి..
ధనం విలువతో తూచి చూసే
రక్త సంబంధం కన్నా..
మానవత్వం నిండిన
చిరు ఆత్మీయ స్పర్శే మిన్న అని...
ఆఖరి చిరునామా ఆయిన
ఆశ్రమాల లోనే లభ్యం.
అంతా....ప్రేమ లోకమే..!
ఆయినా అందరికి.. అందని ద్రాక్ష ప్రేమ.

ఇప్పుడు   ప్రపంచం అంతా ..
లవ్  మానియా తొ.. అతలాకుతలం అవుతూ..
ప్రేమ ప్రేమ అని కలవరిస్తుంది..
పుట్టిన బిడ్డ కూడా
క్యార్ క్యార్ బదులు..
ప్రేమ ప్రేమ అంటుంది.   

9, జనవరి 2011, ఆదివారం

"శబ్దాలయ రేడియో మిత్రమండలి"విజయవాడ.. వారి అనుబంద హేల


సందడే సందడి 

హలో!తొలి పలకరింపుల కలకూజితం కుసుమ 
"శబ్దాలయ రేడియో  మిత్రమండలి" విజయవాడ వారి అనుబంద హేల.కృష్ణమ్మ ఒడిలో.. ఏటేట రేడియో శ్రోతల సంబరాలు.చిత్ర శబ్దం
చిన్ననాటి నెచ్చెలి సిని నటి సావిత్రి తొ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మద్దాలి సుశీల 
తరతరాలశబ్ద బంధం 
శబ్దాలయ సందడి    
శబ్ద మిత్రులు 
మార్కొని  తరంగం  రమేష్  స్వాగతం 
ఆకాశవాణి శ్రోతల వనంలో ..ఓ సుమం స్వపరిచయం                  
అభిమాన దరహాసాలు 
    5  వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాపాయి శబ్దాలయ 
 ఎన్నెన్నో జన్మల బంధం  ఆకాశవాణి  -శ్రోతల అనుబంధం 

5, జనవరి 2011, బుధవారం

స్నేహం అంటే..

 ముసుగు స్నేహాలు  ఎలా చేయాలి ? అందుకు సేఫ్ పద్దతులు ఏమిటీ ... అని ఒక స్త్రీ అడగడం  ఏమైనా బాగుందా చెప్పండి!?

ముసుగు స్నేహాలు ఎందుకు చేయాలి ? అసలు .. స్నేహం  అంటే  ఏమిటి ..?
ఇప్పుడు  ఇరువురు  స్త్రీ -పురుషుల మద్య  స్నేహం సాధ్యమేనా? విదేశాల సంస్కృతి మన దేశంలో అంతగా పొసుగుతుందా..?  అంత విచ్చలవిడి సంస్కృతిని మనం కోరుకుంటున్నామా!? ఇన్నిటిని..పరికించాలి..

 మొదటగా.. స్నేహం అంటే.. ప్రొద్దుటే.. పూసి  సాయంత్రానికి వాడిపోయే పువ్వులాగా.. స్నేహం వయసు చిన్నదిగా ఉండకూడదు. పువ్వులోని   పరిమళంలా.. జీవన పర్యంతం మనవెంట ఉండాలి!? అనుకుంటే.. అలాటి స్నేహాలు.. ఎందుకున్డటం లేదు అని అనుకుంటే.. ప్రతి  ఒక్కరు.. అవసరం కోసం,కాలక్షేపం కోసం  స్నేహం చేయడం ఎంత వేగంగా.. స్నేహం చేస్తారో.. అంత వేగవంతంగా మరుగున పడేయడం సర్వ సాధారణమైన రోజులివి..

 అక్కడక్కడా.. నిజమైన స్నేహం  ఆనవాళ్ళు ఉన్నప్పటికీ.. అత్యధిక శాతం ఈ..స్నేహాలే కాబట్టి..  మనిషి..కి  స్నేహం విలువ  చెప్పడం  ప్రామాణికాలు నిర్దేశించడం చాల.. క్లిష్టం కూడా! అయితే ఒక పాతికేళ్ళ క్రితం వరకు.. ఆడ-మగ పిల్లల మద్య స్నేహలు.. పది  పన్నెండు ఏళ్ళు  వచ్చేవరకు అరమరికలు లేకుండా కొనసాగేవి. తరవాత దూరాలు .. కొనసాగేవి.
అంతగా..  అయితే కొన్ని ప్రేమలు.. అతితక్కువ పెళ్లివరకు దారి తీసిన స్నేహాలు.ఇవి.. అప్పటి స్నేహాలు..
ఇవాళ స్నేహం అనే..పదానికి ఆకర్షణ.. మూలమేమో! చిన్న చిన్న పిల్లలని  గమనించండి..వారి మాటలలో ముదురు కబుర్లు.
అందుకు.. మీడియా ప్రభావం చాలా.. ఉంది. చదువుకునే  ఇద్దరు ఆడ మగ పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మద్య ఖచ్చితంగా.. ప్రేమ ఉండాలనేట్లు తీసే.. సినిమాలు.  హద్దులు.. దాటటానికి.. ప్రేరేపించే.. మాటలు..  హావ .. భావాలు ప్రకటించడం  ఇవన్ని వైపరీత్యం  కాదా..! 

 స్నేహం .. అంటే  కష్ట-సుఖాలలో,మంచి-చెడు.. విషయాలలో.. మనసు పంచుకుని.. తోడుగా.. ఓదార్పుగా.. ఉండటం  అనుకోవడం మానేసి..
స్నేహం అంటే.. ఆకర్షణ... దేహాలు కలయిక.. అనుకోవడం మన సంస్కృతి.. లో భాగం కావాలా..!? స్త్రీ-పురుషుల మద్య స్నేహం యే దారి అయినా.. గోదారి లోకే.. దారితీసినట్లు..దేహాల కలయికకే.. దారి తీస్తుందా!?  ఎలాటి కాలయాపన లేకుండా.. పరిచయం కాగానే.. డేటింగ్  ప్రపోజల్.. పిట్టుకోవడం.. ఇద్దరు.. ఓ..కే..అనుకుంటే.. ఒక పని అయిపోవడం .. తర్వాత దేహాలు దులిపేసుకోవడం.. ఇది.. విదేశీ సంస్కృతి. అది మనం నేర్చుకుని సమస్యలు లేని నురక్షిత  మైన   సెక్స్ సంబంధాలు కొనసాగించడం ఎలా.. !? ప్రమాదం లేని స్నేహం అంటే అనుకోవడం..ఇదేనా?.

దీనికి.. నా.. స్పందన ఏమిటంటే..  అసలు.. స్నేహం ముసుగులోనే.. మన భారతీయ సమాజంలో..విచ్చలవిడి శృంగారం  నేరుపుతున్నారు. దానికి  ఎన్నో.. తార్కాణాలు... ఎంత అమాయకంగా.. సేఫ్ సెక్స్  గురించి.. మన భారతీయ వనితలకి  చెప్పడం కన్నా.. వారి మీద జరిగే దాడులని ఎలా.. ఎదుర్కోవాలి..? ప్రేమ పేరిట నయవంచకుల పాలిట పడి  అవాంచిత గర్భధారణ  దాల్చడం గురించి, కామ పిశాచాల బారి నుండి.. ఎలారక్షించుకోవాలో, లైంగిక వేధింపులుని, ఎలా.. ఎదుర్కోవాలో..ఇలా..చెబితే.. బాగుంటుంది.. తప్ప ముసుగు స్నేహాలు  ఎలా చేయాలి ? అందుకు సేఫ్ పద్దతులు ఏమిటీ ... అని ఒక స్త్రీ అడగడం  ఏమైనా బాగుందా చెప్పండి!? 

ఒకే..బాణం, ఒకే భార్య.. అంటూ..ఉగ్గుపాలతో భోధించిన మన సంస్కృతి ఇప్పుడు  విశృంఖల  శృంగారంలో.. తీసుకోవాల్సిన  జాగ్రత్తలు.. చెబుతుందా.?  ప్రమాదకరమైన ముసుగు స్నేహాలు చేయమని  చెపుతారా..?పారదర్శకమైన స్నేహంని కోరుకోవడం తప్పు కాదు కదా!? భారతీయ పెమినిజం కూడా.. దీనికి అతీతం కాదని నా.. అభిప్రాయం.
ఈవాళ.. యెన్ 72  ల గురించి , కండోమ్స్  గురించి తెలియంది ఎవరికి.. చెప్పండి.. పల్లెల్లో.. సైతం  అవగహన   వచ్చేసింది..  టీ.వీ.ల ప్రభావం మరి.. గుప్పిట మూసినంత సేపే.. రహస్యం..అవగాహన పేరిట, లైంగిక విద్య పేరిట.. అన్ని బట్ట  బయలు అయ్యాక.. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో..  ఎవరికి చెప్పనవసరం లేదు.

మన భారతీయ సమాజం పిల్లి  పాలు త్రాగుతూ..తాను కళ్ళు మూసుకుని తనని ఎవరు చూడ లేదు  అనుకుంటుంది ..లాగా ఎవరు ఎవరిని పట్టించుకుండా   తమకి స్వేచ్చ లభించింది కదా   అని ఆ లభించిన  స్వేచ్చతో..  నైతిక విలువలు వదిలేసి   గొంగట్లో  ..తింటూ.. వెంట్రుకలు అనుకుంటున్నట్లు ఉంది.. పరిస్థితి.

కొద్దిగో.. గొప్పో.. సభ్య సమాజంలో.. విలువలతో.. బ్రతికే..వాళ్ళు.. ఉన్నారు. శాస్త్ర సాంకేతిక  పరిజ్ఞానం అందుబాటులోకి  తెచ్చుకుని..  విద్యల పట్ల, ఉద్యోగాల పట్ల.. స్పష్టమైన దృక్పధంతో.. ఉన్నారు తప్ప  స్త్రీలు  ఎన్నెన్ని.. సమస్యలని.. ఎదుర్కుంటున్నారు.. అలాటి సమస్యలలో.. ఇంకొక సమస్య.. రాకుండా ఉండాలంటే..! అంటూ.. వైదేహి గారు.. అభిప్రాయం చెప్పండంటూ.. ఆహ్వానిచడం అభినందనీయం.కానీ ఆవిడ  అడిగిన తీరు సమర్ధనీయం కాదు.
 మామూలు స్నేహానికే  .. భయపడుతున్నట్లు బ్రతికే మన భారతీయ స్త్రీలు.. (అంటే  మన గురించి మనం వెలిబుచ్చుకునే  స్థానం లోనే మన అసలు.. చిత్రం పెట్టడానికి భయపడే మనం )  డేటింగ్ సంస్కృతిని.. ఆహ్వానించడానికి, అబద్దపు స్నేహాలు చేయడానికి జాగ్రత్తలు.. ఇలా తీసుకోవాలి  అలా తీసుకోవాలి అని చెప్పడానికి..సాహసిస్తారా..చెప్పండి.!?

ముందు స్నేహం అనే ఆ.. పదానికి  అర్ధం నిర్వచించండి.. తర్వాత.. స్త్రీ-పురుషుల మద్య లైంగిక కలయికలకి.. స్త్రీలు.. ఎలాటి జాగ్రత్తలు.. తీసుకోవాలో,కలయికల తర్వాత ఆ.. సంబంధాలు.. ఎలా.. కొనసాగిన్చుకోవాలో.. వద్దనుకుంటే.. ఎలా వదిలించుకోవాలో.. చెప్పుకోవచ్చు.  సెక్స్ ఈజ్ బయలాజికల్ నీడ్స్.. కాదనం కానీ..  అంతకన్నా.. విలువైనవి.. నైతిక విలువలు.. అవి లేనందుకే.. విదేశాలలో.. కుటుంబ వ్యవస్థ.. నాశనం అయింది.. అలాటి సమాజం మనకు వాంచితమా!? ఆలోచించండి.!!!! నేను ఇలా బ్లాగోముఖంగా ఆవిడా అడిగినదాన్ని నిరశిస్తున్నాను.

 స్త్రీ-పురుషుల మద్య అక్రమ సంబంధాలకి.. ఆకర్షణ అని పేరు పెట్టుకుంటే.. బాగుంటుంది.. స్నేహం అని ఉదహరించ వద్దని మనవి.
ఆ.. పదానికి.. నా దృష్టిలో.. అపారమైన విలువ ఉంది..  ఏ  దేశం లో అయినా.. స్త్రీల గతి దుర్గతి ఎలా ఉందంటే.. ఒకసారి శరీరాన్ని.. పురుషుడికి ఇస్తే వందల సార్లు వేలసార్లు  ఆమెని అణచిపెట్టడం ఎక్కడైనా.. ఉంది. ఆఖరికి భర్త అయినా సరే..ఆమెని అణచి ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు. అలాటి  స్థితిలో మహిళలు.. స్నేహం చేస్తారా?అంత అసమానత, ఆసహాయత. ఉండటం  మహిళలకి శాపం ..ఏమో!!  "ఆకాశంలో   సగం మనం"  వినడానికే.. బాగుంటుంది..అలా కాకుంటే   కాస్తైన  బెటర్  అని అనుకుంటే. ఇలాటి..  చర్చ వచ్చి ఉండేది కాదేమో!

నేను ఈ అభిప్రాయం వెలిబుచ్చుతూ ఎవరిని కించ పరచ లేదు. వాస్తవికతని.. కాస్త  తీవ్రతగా.. చెప్పాను.. అంతే!  స్నేహం చేయండి. అది.. ఆత్మీయంగా.. ఆధారంగా  ఉండాలి. కొందఱు పురుషులు పరిధిలు దాటినందుకే.. సమాజం  నాశనం అవుతుంది. ఇక మహిళలు కూడానా!? వద్దు వద్దు..  అని నేను విన్నమిస్తాను. ముసుగు  స్నేహాలు   వద్దు.అలాగే ..అనవసర  స్నేహాలకి  తెర తీయకండి. ..అంటాను నేను. 

3, జనవరి 2011, సోమవారం

నీ చరణం కమలం మృదులం


ఈ ..పాట చిత్రీకరించిన ఆలయ చిత్రం

నీ చరణం కమలం మృదులం.... నా హృదయం పదిలం పదిలం



నాకు చాలా చాలా... చాలా ఇష్టమైన పాట

నీ  చరణం కమలం  మృదులం నా హృదయం పదిలం పదిలం

ఫ్రెండ్స్! మీరందరూ చాలా ఆసక్తి కరంగా ఫాలో అవుతున్నారు కదా!

అందమైన పాదం మంజీర నాదం వినిపిస్తుంటే ఆ రవళులు చెప్పలేనంతగా ఎన్ని హృదయాలని.. కొల్లగొడుతున్నాయో! అనేగా మీ మదిలోని మాట.  🙂 చూసారా!.. ఎలా క్యాచ్ చేసానో..!

రాఘవేంద్రుడి చిత్రీకరణ మంత్రజాలం అండీ.! ఏదో.. తెలుగు వారి పరిమళం నాకు కొంచెం అబ్బింది కనుక ఈ అందమైన భావన రావడం కోసం చాలా కష్టపడి ఇలా అందంగా మీ ముందుకు ఒక పాట. అదీ నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాటని మీకు పరిచయం చేయబోతున్నాను.

ఇంతకీ పాటని ఊహించారా! మురారి ఆర్ట్స్ చిత్రాలన్నిటికి కే.వి.మహదేవన్ సంగీతమందిచారు..

ఆ బేనర్ పై వచ్చిన చిత్రాలన్నిటిలోనూ అందమైన మన గోదావరి నదిలో అంతకన్నా అందంగా సెట్టింగ్స్ వేసి చిత్రీకరించిన పాటలు మన మనసులని దోచేసాయ్ అనుకోండి..

జానకిరాముడు చిత్రంలో అన్ని పాటలు చాలా.. బాగుంటాయి. అందులో అతిశయోక్తి లేదు కానీ.. అన్ని పాటలలో.. నాకు నచ్చిన పాట మాత్రం”నీ.. చరణం కమలం మృదులం” అనే పాట. 

లేత తమలపాకు లాటి అందమైన పాదాలతో అందమైన కాస్టూమ్స్ తో.. విజయశాంతి రూపం చెరగన ముద్ర వేస్తుంది. పాట చిత్రీకరణలో.. ఎన్ని.. సొబగులున్నాయో! ఆ.. సాహిత్యం,సంగీతం నా హృదయం పై తీయని ముద్ర వేసాయి.ఆ పాటలో.. ఎన్ని రసమయ కోణాలు ఉన్నాయో! ఒక తెలుగు పాటకి నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వ వచ్చు అని నాకు అనిపించిన ఆ పాట యిది. 

నాయిక ని దృష్టిలో ఉంచుకుని పాట వ్రాసారో.. సాహిత్యంని బట్టి పాటని చిత్రీకరించారో ఏమిటో.. రాఘవేంద్రుడికి మురారి గారికి ఎరుక.

సాహిత్యం ఆత్రేయ అని వుంటుంది కానీ ఆ..పాట వేటూరి అని నా గట్టి నమ్మకం.ఆ..పద ముద్రలు అచ్చు అలాగే ఉంటాయి. సాహిత్యం గమనించండీ!

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు..

కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యా రాగాలు (ము )

అంగ అంగమున అందచందములు ..

వంపు వంపున హంపి శిల్పములు..

ఎదుటే.. నిలిచిన చాలు ఆరారు కాలాలు.. (నీ)

జతులే పలికే జాణ తనంలో జారే పైటల కెరటాలు..

శ్రుతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు..(జ)

అడుగు అడుగున రంగవల్లికలు, పెదవి అడుగున రాగ మాలికలు ..

ఎదురై పిలిచినా చాలు.. నీ.. మౌన గీతాలు.. (నీ)

నీ.. చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం ..

నీ..పాదాలే రసవేదాలై.. నను కరిగించే..నవనాదాలు..

ఒక సౌందర్య అన్వేషణ, సౌందర్య ఆరాధన జీవనాన్ని ఎంత ఆహ్లాదంగా.. ఉంచుతుందో!  ఇలాటి రస వేదాలు.. నవ నాదాలు మనలని.. కరిగించనీయగల్గితే ఇంకా ఏమి కావాలి అనిపిస్తుంటుంది నాకు..

“ఎ థింగ్ అఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవెర్” అన్నారు కదా జాన్ కీట్స్. నిజం కదండీ!
పాట చిత్రీకరణలో వొకటే లోపం అండీ.. హీరోయిన్ గుడి మెట్లు దిగి వస్తున్నప్పుడు అసలుసిసలైన తామరలను అడుగడుగుకి పరచి.. తర్వాత పాట చిత్రీకరణలో కోనేరులో కాగితపు పూలు వుండటం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. అయినా కమలం మన జీతీయపుష్పం కదా..,అలాగే లక్ష్మీ నివాసం అంటారు కదా.. రెండు విధాలుగా హీరోయిన్ చేత ఆ పూలను తొక్కించడం యేదైతే వుందో అది అభ్యంతరంగా అనిపించింది నాకు. కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో కూడా! 

ఈ..పాట స్టార్టింగ్ బీట్ గుండె ఝల్లుమనిపించి.. స్పందన కల్గిస్తుంది.అసాంతం ఒక మధుర భావనని నింపే.. ఈ పాట మీరూ చూసేయండి . కొరియోగ్రపీ అద్బుతః. అందమైన విజయశాంతిని మరింత అందంగా చూపించారు. ఆమె నృత్యం ముద్రలు చాలా బాగున్నాయి. 

ఈ పాట చిత్రీకరణ “పట్టెసం- పట్టిసీమ” గుడి మెట్లు చిత్రీకరించారు.  మిగతా భాగం గోదావరి నదిపై సెట్టింగ్స్  వేసి అద్భుతంగా చిత్రీకరించారు. పట్టిసీమ వెళ్ళాలనే కోరిక అలాగే వుండిపోయింది. తప్పకుండా చూడాలని చాలామంది చెప్పారు. ఎప్పటికి తీరేనో ఆ కోరిక. పాట చూసేయండి మరి..

https://youtu.be/zOu44L3eJHM




1, జనవరి 2011, శనివారం

శాంతిమంత్రం




             శాంతిమంత్రం

   
ఆ దళ మైతేనేం  ఈ దళ మైతేనేం  
నేపధ్య..పూజ మాత్రం ఒకటే.! 
దళాలన్నీ చెట్టు  ప్రాణం  నుండి పుట్టుకొచ్చినవే 
కొమ్మలు వేరైనా కాండం ఒక్కటే!
మూలాలు మాత్రం.
అణగారిన భావాలనుండి..
బలంగా పాతుకున్నవే 

విరామాల ప్రస్తావనలో
దళాలన్నీ వర్ణాలని మరచి.. 
అలంకారాలన్నీ విడిచి.. 
సహజ వర్ణాన్ని స్వీకరించి 
జన జాగృతికై నిర్భీతిగా 
మిట్ట మధ్యానపు సూరీళ్ళు లా
నలుచెరుగుల నుండి
నడివీదుల్లోకి నడచి వస్తుంటే  
అడవితల్లి దారంతా  పూల వర్షంతో  
మౌనంగా అభిషేకించింది 

విరామాల ప్రస్తావనలో..
విజయం సాధించింది.. 
సాంత్వన  చేకూర్చుకుంది.. 
మాత్రం తల్లులే.!

చీకటి మాటున..
అంగ బలం, అర్ధ బలం
ఆయుధ బలం సమకూర్చుకుని
రాజ్యం కుటిల యత్నాలని 
తిప్పి కొట్టి.. కర్కశ తుపాకులకి
ప్రాణాలని బలి ఇచ్చి 
తల్లులకి గుండె కోతని మిగిల్చిన
గిరి పుత్రుల తో పాటు  పోయింది,  పోతున్నది..
అమాయుకుల ప్రాణ  బలం .

శాంతి మంత్రం  కొంగ జపంలా మారితే
శాంతి  కపోతాలకి రెక్కలార్చుకునేదుకు
నెలవు దేవాలయ గోపురాలు కాదు..
తుపాకీ బారేళ్ళు
ఇప్పుడు.. శాంతి మంత్రానికి  నిలువెత్తు  సాక్ష్యం  
అస్తమిస్తున్నసూర్యునిలోని అరుణిమా
మరునాటికి   నెత్తురోడుతూ
మరింత ఎర్రబారే  ఉద్యమ సంద్రమా

హాలికుడా!





                                                                                                                                                           హాలికుడా!

హాలికుడా! సేద్యం చేస్తూనే ఉన్నావు .. ఒక వ్యసనంలా ! 
అనావృష్టి..అతివృష్టి లను   తట్టుకుంటూ..
అరకొర  ఇచ్చే విద్యుత్ సరఫరాని..తిట్టుకుంటూ..
ప్రతి ఏరువాకకి.. నీ..ఆశ.. 
పెటీల్మని చీల్చుకుని  వచ్చిన మొలక లాటిది..
చేదోడు వాదోడు కాలేని..ఎద్దు పుండు లాంటి పంట రుణాలు..
కారం జల్లినట్లు ఉండే.. పంటల భీమాల సాక్షిగా..
నీ..కండల్లోని సారాన్నికరిగిస్తూ.. 
అలవాటైన స్వేదాన్ని..చిందిస్తూ..  .. 
రుతుపవనాలు..  నకిలీ..విత్తనాలు.. 
సముద్రపు నీళ్ళ లాటి   నేతల వాగ్దానాలు.. 
ఎండమావిలాంటి..ప్రాజెక్ట్ నిర్మాణాలు.. 
దోబూచులాడుకుంటున్నా..
మొక్కవోని విశ్వాసంతో.. 
ఆరుగాలం కళ్ళల్లో.. వత్తులు వేసుకుని.. పండించి.. 
దళారీల గాదెలు నింపి..  
నీ..ఇంట దుఖ రాసులు నింపి..
నీ వారికి.. వెన్ను చూపించే..
దేశానికి వెన్నుముకవి..  నీ..ఉనికి పదిలం. 
మొదలంటా.. ఎండిన పైరుని చూసి గుండె తడి ఆరిపోయినా....
నేర్రులువారిన పంటపొలం చూసి..గుండె వ్రక్కలైనా....
భూమిని నమ్ముకున్నావు కనుక.. 
జీవశ్చవంలా   బ్రతుకుతూనే  ఉంటావు .. 
అమ్మకైనా ..వెల  కట్టగల
రియల్  మాయాజాలపు  వలలో  చేపవైనావు .
సెజ్ కుంపట్లు.. నీ..గుండెల్లో..మంటలు రేపితే.. 
కర్ణుని  పిడికిట్లోని.. 
భూమాత కన్నా.. విలవిలలాడినావు.. 
పరిహారం అందించని.. దృత రాష్ట్రుల  పాలనలో..
శిబి చక్రవర్తివైనావు ..
గుత్తకైనా..సాగు చేసుకునే
చిన్న కమతగాడివయ్యావు..
ఎన్ని కష్టాలైన.. నీవు బ్రతుకుతూనే ఉండాలి..
అందరిని బ్రతికిన్చేందుకు.. 
హరిత విప్లవం సాక్షిగా.. 
హరితం కాలేని.. నీ బ్రతుకు..
ఆఖరికి..  ఉరికోయ్యకి.. వేలాడుతుంది..
దుఃఖరాశులు..నింపుతూ.. 
హాలికుడా! జాతి  ప్రేమికుడా..!!
నీకు.. వేనవేల  వందనాలు.