17, జనవరి 2011, సోమవారం

నలుపు నాలుగు విధాల కాదు - నలబై విధాల మేలు

హాయ్. ఫ్రెండ్స్! నలుపు నాలుగు విధాలు..
అదేమిటీ .. "నవ్వు నాలుగు విధాలు చేటు అని కదా.. అంటారు"  అనుకుంటూ  పొరబడకండి.

"ఈ..నలుపు ఏమిటి? అన్ని నలుపు బొమ్మలు ఏమిటీ! "అనిచిరాగ్గా మొహం చిట్లించుకోకండీ త్వరపడి.
ఈ..పోస్ట్ చదివిన తర్వాత నాకులాగా.. నలుపుకి  వీరాభిమానిగా మారడం ఖాయం అని..
నా రాతల మీద కన్నా నలుపు పై నాకంత నమ్మకం.

ఎన్నెన్నోవర్ణాలు అన్నిట్లో అందాలు, నలుపంటే నాకిష్టం అని చెప్పడమే కాదండీ.. నలుపు పట్ల కొందరికి చిన్న చూపు కొందరికి ఏహ్య భావం కొంత మందికి భయం వారికి కల్గిన భావాన్ని కొంత తగ్గించే ప్రయత్నం. కొంత మందికి నాకులానలుపంటే  ఛాలా ఇష్టం.  ఈ నలుపంటే ఇష్టం అయినవాళ్ళకి ఇంకొంత ఇష్టం కల్గేటట్లు నా ఈ రాతలు.

అసలు ఈ విషయం చెప్పడానికి ముందు నాకు ఒక కష్టం కాని కష్టం వచ్చిపడింది. వచ్చే నెలలో ఒక ఐదు ఆరు రోజుల టూర్ కోసం ప్లానింగ్ వేసుకున్నాం. అది పుణ్యక్షేత్రాల సందర్శన కొరకు యాగాలలో పాల్గొనే భక్త బృధంతో కలసి నా ప్రయాణం ఏర్పాట్లు జరిగి పోయాయి. అమ్మోఅన్ని రోజులు,ఆ యజ్ఞాలు యాగాలు చూస్తూ ఇంటికి దూరంగా ఉండటమా!నా వల్ల కాదేమో అన్న శంక నాలో ఉన్నావెళ్ళడం నిర్ణయం అయిపోయినాకా వెనుతిరగరాదని ధృడంగా తీర్మానించుకుని ఏయే బట్టలు ధరించాలి అనుకుని ఆలోచిస్తూ బట్టల బీరువా ముందు నిలబడ్డా!  అరగంట నిలబడ్డా అందులో నలుపు తఃప్ప ఇంకేమి కనబడలేదు. ఒకవేళ ఉన్నా అందులోనూ నలుపు గీతలో, నలుపు సున్నాలో అర్ధంకాని వెబ్ డిజైన్ లు ఉన్నవే ఉన్నాయి. చచ్చాను బాబోయ్! అనుకుని ఉసూరుమని కూర్చున్నాను. ఇప్పుడు షాపింగు కి ..పరుగులెత్తాలి. ఎందుకంటే బయలు దేరే బృందం అంతా నలుపు అంటే ఆమడ దూరం పరుగెత్తే వాళ్ళు,  పది యోజనాల దూరంగా ఉంచే వాళ్ళు. అది నా ...కష్టం.

చీర కొనుక్కున్నాను.. అత్తమ్మా!చూడండీ..అని.. మా..అత్తమ్మకి చూపిస్తే.. ఆ రంగు తప్ప నీకు వేరే రంగు దొరకలేదా ? అని చిరాగ్గా మొహం పెట్టె  ఆవిడ దగ్గర నుండి.. కాలికి చెప్పులు కూడా  నలుపు ని అంట నివ్వని స్నేహితురాలు " రమ " వరకు నాకు నలుపు అనుభవాలు ఎన్నెన్నో!. అసలు "నలుపు ప్రపంచపు ప్యాషన్ " అని వీళ్ళందరికీ.. నచ్చ చెప్పడం ఎలా అని సీరియస్ గా ఆలోచించి ఈ.. ప్రయత్నం మొదలెట్టాను.  " మీ బట్టల బీరువాలో నలుపు డ్రెస్ లేదంటే.. మీకు.. ప్రపంచపు ప్యాషన్ గురించి తెలియదన్నమాట" . ఈ..కొటేషన్ గుర్తు చేస్తుంటాను ..అడిగిన వారికి, అడగని వారికి అందరికీనూ.

ఈ.. ప్రపంచంలో వీలైనంతగా నల్ల ప్రేమికులని పెంచుదామని నా ప్రయత్నం బెడిసికొట్టి.. నేనే నలుపు కాకుండా వేరే రంగు బట్టలు ధరించే ప్రయత్నాలు మొదలెట్టవలిసి వస్తుంది అని కలలో కూడా..అనుకోలేదు. అయినా నలుపు అంటే.. ఎందుకండీ.. అంత భయం?  ఏమిటో.. అశుభం అంటారు.   వెలుగునీడలు.. కష్ట-సుఖాలు అంటూ..పెద్దవాళ్ళే చెప్పారు. చీకటి లేకుంటే వెలుగుకి విలువ వచ్చేనా? కష్టం లేకుంటే సుఖం బోర్ కొట్టదూ.. ! అయినా..ఒక మాట అంటున్నానండీ ఏమనుకోవద్దు. తలలు ముగ్గుబుట్టలు అయిన వాళ్ళు ఆ తెలుపుని మాటేసి నలుపు రంగుతో
 నిగ నిగ లాడుతూ..వయసుని దాచే ప్రయత్నం చేసేటప్పుడు..ఈ..నలుపు ఎందుకు? చక్కగా.. తెలుపే ఉంచేసుకోవచ్చు కదా?  " ఏమిటో ఈ బాల నెరుపులు".. అంటూ బిల్డప్పులు.

మనం నిత్యం వాడే వస్తువులుఅన్ని నలుపులోనే ఉంటాయి.. మరి వాటిని పారేయడం లేదు కదా! అంత ఎందుకండీ !  కొన్ని వస్తువలని నలుపులో..తప్ప వేరే రంగులో.. చూడలేం కూడా ! కావాలంటే ఊహించుకోండి.

ఉదా: బెల్టు,హేల్మెట్టు,మనీ పర్సు ,గొడుగు,కళ్ళజోడు.. షూష్,చెప్పులు.. ఇలా.. చాలా వస్తువులు.. నలుపు లోనే బాగుంటాయి. మనం కాలు బయట పెడుతూనే నిత్యం నడిచే రోడ్డు నలుపు. రోడ్డు మీద నడిచే వాహనాలలో మూడువంతులు రోడ్డు కింగ్లు  నల్లరంగు వాహనాలే! నల్ల ఉప్పు, నల్ల మిరియాలు,నల్లద్రాక్ష,నల్ల కాఫీ,నల్ల టీ, నల్ల బంగారం బొగ్గు,నల్ల ఇసుక,నేరేడు పండ్లు,ఆలివ్ ఇలా.. నలుపు ప్రత్యేకం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అత్యధికంగా..అమ్ముడయ్యే బుక్ బైబిల్ అట్ట కూడా  నలుపే! తెల్లటి కాగితంపై నలుపు అక్షరాలు, బ్లేక్ బోర్డ్, క్లాప్ బోర్డ్,.. అన్ని నలుపే కదా! అసలు నలుపుకి ఏ రంగు అయినా.. attach చేసుకోవచ్చు. తనలో అన్నిటిని కలిపెసుకునే కెపాసిటి నలుపుకే ఉందేమో!? ఏ రంగు అయినా నలుపు పై వచ్చిన అందం ఏ రంగు పైనా రాదండీ!


అసలు  నలుపు బట్టలు ఏ రంగు వారికైనా నప్పుతాయి వేసవిలో మండిస్తాయి తప్ప తతిమా కాలంలో.. నలుపు బహు రక్షణం. చలి కాలంలో నువ్వుల వంటకాలు ఒంటికి ఎంత మంచిది. చీకటి నలుపు, కాటుక నలుపు,నల్ల కలువలు అని కళ్ళను వర్ణించడం పరిపాటి.అంతెందుకు నల్ల మబ్బుల మాటున దోబూచులాడే చంద్రుడు లో..నలుపు, గండు కోయిల నలుపు,మధుపుటీగ నలుపు, అగరవత్తులు నలుపు,నారాయణుడు నలుపు,నరుడు నలుపు.
 ఇంకా చెప్పాలంటే ....అసలు నల్లవస్త్రం తన తరపున నన్ను.. మీకు ఇలా చెప్పమంది. ఏదైనా నిరసన తెల్పాలనుకున్నప్పుడు.. మీ చేతిలో..ఆయుధం నేను. మౌన పోరాటం చేస్తున్నప్పుడు.. మీ నోటికి అడ్డు నేను, న్యాయ దేవత కళ్ళకి గంత ని నేను.. న్యాయవాదులకి,న్యాయ మూర్తులకి సత్య ప్రతిరూప వస్త్రదారణం నేను.

ఎందుకు.. నలుపు అంటే.. అంత భయం ? కుక్క ఎంత విశ్వాస జంతువు అయినా..నలుపు వద్దంటారు. పిల్లి ఎంత స్నేహశీలి. అమ్మో..నల్ల పిల్లి మరీ..అపశకునం అంటారు. కాకి నలుపు అంటారు. ఆ కాకి పిలుపుకి ఎంత ఫాలోయింగ్ ఉందో..తెలుసా అండీ!మనం పిలిస్తే నలుగురు కూడా పలకరు కదా !  అసలు.. నల్లదనం లో ఎంత స్ట్రాంగ్ ఉందొ అన్నది మీకు తెలియదా? నల్లధనంలోను ఎంత సిరి దాగుందో.. అసలు లెక్క కందుతుందా? అన్ని బాగానే ఉన్నాయి కానీ.. పిల్ల నలుపు, పిల్లడు నలుపు అంటారు. ఎంత మండుతుందో! అల్లా అనిపించుకోకుండా ఉండాలంటే ఎన్ని క్రీములు రాయాలి.. ఎన్నిడబ్బులు  ఫేషియల్స్ కి..  తగలబెట్టాలి. అందుకే.. నలుపు ని హృదయంతో మెచ్చుకుంటే ఏమవుతుంది చెప్పండీ!.. నలుపు నాణ్యం అండీ! పెద్దవాళ్ళు చెప్పారు కదా అలా అని. తన నటనతో అందరిని మెప్పించిన మహా నటి సావిత్రిగారు.. నలుపు శరీర చాయ కల్గి ఉండేవారట. అభినేత్రి వాణీశ్రీ, ఇలా.. చెప్పుకుంటూ పోతూ ఉంటే.. చేంతాడంత లిస్టు.

ఆఖరిగా.. ఒక మాట. నలుపు వస్త్రాలు ధరిస్తే శనీశ్వరుడు పట్టి పీడిస్తాడని.. పిచ్చి నమ్మకాలూ. అశుభం ఇలా.. ఏదేదో శంకలు.కానీ.. నలుపు శనీశ్వరుడుకి అత్యంత ప్రీతికరం అంట. నల్ల బట్టలు కట్టుకుని ఆయనని ప్రార్ధిస్తే.. ఏమి చేయడట. పనిలోపని ఆయన వాహనం కాకికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టడం మరువకండీ! శరీర ఛాయ పేరిట జాతులనీ వేరు చేయడం మూలంగా ఎన్ని వైషమ్యాలు ఏర్పడుతున్నాయో.. మన అందరికి తెలుసు. అయినా అమేరికా వాళ్ళు వైట్ హౌస్ ని బ్లాకు హౌస్ గా మారిస్తే నష్టం ఏమి ఉండదు.సామరస్యం పెరగవచ్చు కూడా.. అందుకే ..రంగుని బట్టి కాక . మనసులని బట్టి,. సంస్కారాన్ని బట్టి మనుషలని గౌరవిద్దాం ..ప్రేమిద్దాం. హ్హా !!! డీప్ గా వెళ్లిపోయినట్లు ఉన్నాను కదా ! ఇంతకీ.. నలుపు వద్దంటే..ఎలా.. ? నాకు నలుపే కావాలి. నాకు కుక్క కావాలి-కుక్క కావాలి.. అన్నట్లు. ఎవరి ఇష్టం వారిది..

ఎంత శుభకార్యాలు, పూజలు,వ్రతాలు, యాగాలు చేసుకునేటప్పుడు నలుపు వస్త్రాలు ధరించకూదదని ఎవరు చెప్పారో దానికి..వివరణ ఏమిటో తెలుసుకోవాలని ఉంది. మన సంప్రదాయాలలో,ఆచార వ్యవహారాలలో ఎంతో కొంత మంచి ఉండనే ఉంటుంది. నలుపు వస్త్రాలు ధరించడం వల్ల చెడు జరుగుతుందని నాకైతే పట్టింపు అసలు లేదు. కిలో బంగారం ఒక నల్ల చీర ప్రక్క ప్రక్కనా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే నేను నల్ల చీరే కావాలంటాను. అది నా..ఇష్టం. నలుపు వద్దని అంటే .. టేస్ట్ లెస్స్ అనుకోవడం తప్పితే.. ఇదంతా చెప్పినా మా ఇంట్లో ఒప్పుకోరండీ! అంటారు పాపం చాలా మంది. వాళ్ళ అభిరుచికి,ఇష్టానికి.. ప్రాధాన్యం లేనట్లు . కొన్ని జీవితాలు అంతే.

మన మనస్సులో పేరుకున్న సంశయాలు,మూడ నమ్మకాల ప్రభావం మన మీద ఉన్నంత కాలం అమ్మో!ఏమవుతుందో.. అనుకుంటూ భయంగా .. బ్రతికేస్తాం. అందుకే..కొంచెం భయంని ప్రక్కన పెట్టి.. కొన్ని కొన్నిటిని ఆస్వాదిద్దాం. ఇంతకీ.. నేను షాపింగ్కి వెళ్ళను. హాయిగా నాకున్న నల్లటి అందమైన చీరలే ధరించి అబ్బ..ఎంత బాగున్నాయో! నలుపు వద్దంటారు కానీ ఆవిడ కట్టుకోలా అంతా.. చాదస్తం మన వాళ్లకి అంటూ.. వద్దు అన్న వాళ్ళని విసుక్కుంటూ నా.. చీరలకి ప్రశంసలు.. అందిస్తే.. నాకు చాలా సంతోషం సుమండీ.. ఎందుకంటే స్వయంగా రూప కల్పన చేసుకున్న చీరలు. వేలకి వేలు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న చీరలు. ప్రదర్శించకపోతే అడ్వర్టైజ్మెంట్ కి బోలెడు పెట్టాలి. కదా! అందుకే ఇలా.. అన్నమాట. 

ఎంతైనా.. ఆడవారిమండీ! మా.. బెజవాడ తెలుగు కళ గారు కూడా (పద్మకళ) నా .. బ్లాగ్ ని . తెల్లంచు నల్లచీర కట్టుకున్న తెలుగు వనితగా.. అభివర్ణించారు. ఆమెకు కృతజ్ఞతలతో.. నలుపు పై నిరసన చూపకండి. అన్ని రంగుల లాగే నలుపుని ప్రేమించండి. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూవులు ఎన్ని రంగులు ఎన్ని సొగసులిచ్చాడు, అన్నింటా..ఒకేలా.. చూడ మన్నాడు. కవిగారి కవిత్వం కొంత నా పైత్యం కొంత.కలిపి చెబుతూ  నలుపంటే ఇష్టం కలిగించాను కదా !  నలుపు.. గులాబీ..కూడా ఉందని మీకు తెలుసు కదా! కానీ.. రాయల్ ఫ్రీ చిత్రం దొరక లేదండీ! అందుకే జతపర్చలేదు. కాస్త ఈ పోస్ట్ చదివి చూసాక అయినా నలుపు పట్ల మీకు వ్యతిరేక అభిప్రాయం ఉంటే మార్చుకుంటారు కదూ!

ఇది నలుపు నాలుగు విధాల కాదు నలబై విధాల మేలు  అన్న మాట. మా అత్తమ్మ మొబైల్ ఫోనులో... పిలుస్తున్నారు. ఇలా వ్రాస్తున్న  సంగతి తెలిసిందో ఏమో ! నీ..నలుపు పిచ్చి అక్కడ కూడా అతికిస్తున్నవా.!? అంటూ..ప్రేమగా మందలిస్తారు.  ఈ సారి షాపింగ్ కి.. వెళ్లి నప్పుడు నలుపు చూసినప్పుడు.. నన్ను గుర్తు చేసుకోండీ..ప్లీజ్!!!!!  ఓ.కే. బై ఫ్రెండ్స్ !