30, జూన్ 2011, గురువారం

సహస్ర చంద్ర దర్శనం

ఈ రోజు.. ఒక ఆసక్తికరమైన సంగతి విన్నాను .
వేయి పున్నములు..వేయి అమావాస్యలు.. చూడటం.. అన్న సంగతి. నేను ఇప్పటివరకు ఈ..విషయం వినలేదు. ఆలోచించి చూస్తే అదేం గొప్ప విషయమో.. క్రొత్త విషయమో..కాదు. "సహస్ర చంద్ర ధర్శనం " అంటారు కదా! అదే!!

మన ఇంట్లో..పెద్దవాళ్ళు ఉంటె ఇలాటి సంగతులు..మనకి..ఎప్పుడో ఒకప్పుడు.. తెలుస్తుంటాయి.
కొంచెం విషాదం ఏమిటంటే.. ఈ.. విషయం తెలుసుకునేందుకు..వేయి పున్నములు,వేయి అమావాస్యలు.. చూసిన పెద్దాయన ..ఈ రోజు..మరణించారు. ఆయన ..మా అత్తమ్మకి..అన్నయ్య అవుతారు.

మరణించారని తెలిసాక ఉదయం నేను..కడసారి చూపు కొరకు వెళ్ళాను..
పోలవరపు చలపతిరావు గారు.. ఆయన పేరు. అభ్యుదయ భావాలు కల్గిన వ్యక్తి. పెనమలూరు లో..80 సంవత్సరాల క్రితం కట్టిన స్కూలో..చదువుకుని.. ఉద్యోగాలు చేయలేదు కానీ..పూర్వీకుల నుండి వచ్చిన భూమిని నమ్ముకుని.. వ్యవసాయం చేసుకుంటూ.. తన ముగ్గురు ఆడ పిల్లలని చదివించి ఆత్మ విశ్వాసం తో.. నిలబడే టట్టు చూసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు.. మనుమలు,మనుమరాండ్రు..సంపూర్ణ జీవితమును..అనుభవింఛి 85 .ఏళ్ళు.. లో.. వేయి పున్నములు..వేయి అమావాస్యలు కాంచి .ఈ మధ్యే.. ఆవిషయాన్ని అందరి కి ..చెపుతూ..వేడుక చేసుకున్నారు..అని చెపుతున్నారు. వింటూ..ఆయన వయసుని నెలలుని..భాగించి చూసాను..నిజమే..! ఈ..కాలం వాళ్ళు అలా..అన్ని ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకగాల్గుతారా?అనిపించింది.

ఆయన మామూలు వ్యక్తి అయితే ఈ పోస్ట్ వ్రాసి ఉండేదాన్ని కాదు. ..చాలా విశాల భావాలతో.. ..ఉండేవారు..స్వాతంత్ర సమరం కి..ప్రత్యక్ష సాక్షి...మహాత్మా గాంధీ గారు..పెనమలూరు వచ్చినప్పుడు.. వారి ఇంటికి దగ్గరలోనే..ఉన్నారు. అక్కడ ఒక భవనం ఉండేది. ఆ భవనం లో మహాత్ముడు ..విడిది చేసినందుకు గాను..ఆ భవనాన్ని.."గాంధీ ఘర్ " అంటారు.. ఆ భవనంలో..ఇప్పుడు.. ప్రైమరీ స్కూల్ నడుపుతున్నారు.

నేను ఎప్పుడు అయినా వెళ్ళినప్పుడు.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పేవారు. నెహ్రు-గాంధీ ఆలోచన విధానములు గురించి.. రేడియో..గురించి.. భారత్-రష్యా మైత్రి గురించి.. ఎంతో..విపులంగా .చెప్పేవారు. ఎప్పుడు రేడియో వింటూనో,పత్రికలూ చదువుకుంటూనో.. పిల్లలతో ..మాట్లాడుతూనో .. కాలం గడిపువారు. లక్షలు ఖరీదు పలికే..భూములు, స్థలాలు ఉన్నా.. కష్టపడి బ్రతకాలి అన్న ఉద్దేశ్యంతో .. పూర్వీకుల ఆస్తులని.. అలాగే నిలబెట్టుకుని.. ఆయన..సాదాగా బతికి.. పిల్లలని అలాగే బతకమని.. చెప్పడం.. అందరికి..నచ్చదేమో కానీ. అదే మంచిదని పిస్తుంది. ఆమ్మడం అంటూ..మొదలైతే.. కష్ట పడటం..మరచిపోవడం...ఈ తరం వంతు అయింది. కదా!.

ఆ పెద్దాయనలో..నాకు నచ్చిన విషయం ఏమంటే.. ఆయన తల్లిదండ్రులు కి..ఇచ్చిన మాట ప్రకారం..ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా.. ఎప్పుడో.. పెనమలూరు.. ఊరిలో..కట్టిన మొట్టమొదటి..డాబా ఇల్లుని..పాతిక సెంట్లు స్థలాన్ని.. అలాగే కాపాడుకుంటూ...వచ్చి..ఆ ఇంట్లోనే..ఆఖరి శ్వాస వదిలారు. నిజం చెప్పాలంటే..ఆ ఇంటికి వెళ్ళడానికి..నాకు ఏదోలా ఉండేది.. దొడ్డి నిండా గేదెలు.. పేడ వాసన, పట్టపగలు దోమలతో..సహవాసం ..పాతది..రంగురూపు లేని ఇల్లు.. ఆ ఇంటి నిండా ఎప్పుడు..జనం ..ఇలా ఉండేది. కానీ.. ఆ పెద్దాయనతో .. సంభాషణ నాకు చాలా ఇష్టంగా ఉండేది. నన్ను మెచ్చుకునే వారు కూడా..బాగా మాట్లాడతావు అమ్మా.. ఏ టాపిక్ అయినా అనర్ఘళం...అని మెచ్చుకునేవారు. మా పాప కోడలు చూడు..ఎంత బాగా మాట్లాడుతుందో..అని ఇంట్లో వాళ్ళని పిలిచి వినిపించేవారట. (అందుకనేమో !నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని)

అలా ..ఆయన గురించి ఓ..గౌరవ భావం.. ఉండిపోయింది. ఆయనని ఆఖరి చూపు చూసుకోవడానికి వీలు కానే కాని ఇద్దరు మనుమరాళ్ళు.. పది నిమిషములకి..ఒక సారి పోన్ చేస్తూ..భాధపడటం బాధ అనిపించింది..ఈ రోజే..దహన కార్యక్రమాలు..నిర్వహించారు. ఆ.. అమ్మాయిలు రావడానికి..వాళ్ళు ఉండేది..భారత దేశం కాదు..అమెరికా సంయుక్తరాష్ట్రాలు మరి. అదే మగపిల్లలైతే.. వాళ్ళు వచ్చే దాకా ఉంచడం తప్పేది కాదు.. అని వినబడ్డ మాటలు.. కొంచెం బాధ అనిపించాయి.. వారసులు..అన్న వివక్ష ఏమో! రక్త సంబంధీకుల మద్య ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ఆయన ప్రభావం మాత్రం.. అందరి పై ఉండదు కదా....ఆ ఆడ పిల్లలు.. చనిపోయిన ఆ తాతయ్య కోసం ఎంత ఏడ్చి ఉంటారో! ప్చ్..పాపం అనిపించింది.


ఏ తరం వారి కైనా ..ముందు తరం వారి మాటలు.. అనుభవాలు..ముందు చూపు.. ఎంతో ఉపయోగకరం. నిబద్దత,సాధారణంగా ఉండటం,ఇచ్చిన మాట నిలుపుకోవడం,కష్టపడటం, వివేకం . ఇవన్నీ.. ఆ పెద్దయనలో.. మంచి లక్షణాలు.. అందుకే ..ఆయన .. సాధారణంగా కనబడుతూ.అసాధారణమైన వ్యక్య్హిగా మా మద్య మిగిలారు. వేయి పున్నములుని,వేయి అమావస్యలని సమంగా ఆస్వాదించారు. .ఆయన ఆత్మకి..శాంతి కలగాలని ప్రార్ధిస్తూ.. మంచి మనిషి.కి.. పాదాభివందనములతో ..ఈ పోస్ట్ .

28, జూన్ 2011, మంగళవారం

నది మాట్లాడిన రోజు.. గుర్తుకు వస్తుంది.

నేటి బాలలే రేపటి పౌరులు .పిల్లలే జాతి సంపద అంటారు. కానీ ఆ పిల్లలు..చదువుసందేలు లేకుండ్డా అజ్ఞానం అనే చీకటిలో.. పడిపోతుంటే..!? 

అప్పుడే బడులు పునః ప్రారంభం అయి..రెండు వారాలు దాటింది  .ప్రభుత్వ పాటశాలలో పుస్తకాల కొరత అని ఏటా వింటానే ఉంటాం. పిల్లలకి పుస్తకాలే సమయానికి ఇవ్వన్ని ప్రభుత్వాలు.. పిల్లలకి.మధ్యాహ్న  భోజనం సరిగా పెడతారా? ప్రసార సాధనాల్లో.. ప్రకటనలు..ఊదరగొడుతూ..ఉంటాయి.. బాలబాలికలకందరికి.. నిర్భంద విద్య అమలు చేయడం ఏమో కానీ.. ప్రకటనలు వినడానికి ఎంత బాగుంటాయో..! 

అమ్మ-నాన్న పనికి..పిల్లలు బడికి.. పనికి వెళితే  డబ్బులు  వస్తాయి అంటే..బడికి వెళితే జీవితం వస్తుంది.అంటారు..పిల్లలని బడికి పంపడం మన కర్తవ్యం ..అంటారు,  నిర్భంద  విద్య అంటారు.. ఇన్ని రకాలుగా చెబుతున్నా.. ఈ ప్రజలకి..బుద్ది  .లేదేంటి..?పిల్లలని బడికి పంపరు..? 

పుస్తకాలు  కొనే పని లేదు, రెండు జతల బట్టలు ఇస్తారు.. మద్యాహ్న భోజనం పెడతారట.అయినా పిల్లలని ప్రభుత్వ  బడికి పంపారు.. చచ్చే చెడో..కాన్వెంట్లకి పంపుతారు. పధకాలని,అవకాశాలని ఉపయోగించుకోవడం తెలియదు..ఇంగ్లిష్ విద్య మీద అంత మోజా? హాజరు పట్టీలలో  ..పిల్లలే.! భోజన పధకం డబ్బులన్నీ.. కాంట్రాక్టర్ల     జేబుల్లోకి.. .అని ఆవేదన వ్యక్తం చేసింది..ఓ.. విద్యా వాలంటీర్.
  
పల్లెటూర్లలో   పారశాల విద్య కమిటిలో.. మెంబెర్ గా చేసిన అనుభం తో.. ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

విద్యా అవకాశాలు పెరిగి ఉండవచ్చు. విద్యాశాతం  మాత్రం పెరగడం లేదు. విద్యల వాడ  పేరుగాంచిన విజయవాడ లో  డ్రాప్ ఔట్స్  ని పట్టించుకునే వారు ఉండరు. అక్షరాల  ౨౪౫౦    మంది..పిల్లలు.. గత ఏడాది బడి మానేసారని మొన్నా మధ్య. ముఖ్య మంత్రి గారి పర్యటనలో..వెల్లడించారు. వాస్తవాలు అంతకు రెట్టింపు ఉంటాయి..ఆ పిల్లలంతా మగ పిల్లలైతే.. చేతి పనులలో.. చేర్పించ బడతారు. ఆడ పిల్లలైతే.. ఇండ్లల్లో..పనికి..చేరతారు.

 అలా ఒక అమ్మాయి..ఈ రోజు మా పక్కింట్లో పని కి కుదిరింది.. పది  ఏళ్ళు  ఉంటాయేమో..! విచిత్రం ఏమిటంటే..పని చేయించుకునే ఆమె  ఒక బడిలో.లో ఉపాధ్యాయినిగా  పని చేస్తున్నారు..ఆమె ఇంట్లో.. ఇలా బడి మాన్పించి.. పనిలో..పెట్టుకోవడం తప్పు కదండీ..అంటే..అబ్బే ..పనికి కాదండీ..నాకు హెల్ప్ చేస్తుంది..నేను చదువు చెబుతాను..అంది. 
అమ్మాయిల చదువు   విషయంలో తల్లిదండ్రులు..ఎందుకు శ్రద్ద తీసుకోరో!

నాకు ఎప్పుడో చదివిన కధ గుర్తుకు వస్తుంది.. ఆ కధ పేరు "నది మట్లాడిన రోజు." ఓ..పేద పిల్ల "జాను" కి  చదువు అంటే..చాలా ఇష్టం .కానీ.. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బడికి..పంపరు.తల్లికి సాయం ఉండాలని.. ఇంట్లోనే ఉంచేస్తారు.
    
ఇంటి  పనులు  అయ్యాక జానూ..ఇంటి దగ్గరే ఉన్న నది దగ్గరకి..వెళ్లి కూర్చుంటుంది.. జాను ని నది పలక రిస్తుంది..దిగులుగా ఉన్నవేమిటి..అని అడుగుతుంది.జాను..తనకి చదువు అంటే ఉన్న ఇష్టం గురించి..ఇంట్లో వాళ్ళు బడికి పంపకపోవడం గురించి చెబుతుంది. ఇంట్లో..ఏమంటారో..అని భయపడకుండా నువ్వు దైర్యంగా  వెళ్లి బడిలో..కూర్చో ! ..తరవాత సంగతి నేను చూసుకుంటాను అంటుంది..నది..భరోసాగా..  

జానూ.అలాగే వెళ్లి కూర్చుని శ్రద్దగా..పాటాలు వింటున్నది గమనించిన టీచర్..జనూ ని గుర్తించి.. ఆమె విషయాలు కనుక్కుని.. జనూ తండ్రితో..మాట్లాడి..బడిలో..చేర్చుతుంది అప్పుడు జనూ సంతోషించి..కృతజ్ఞతతో  తన తలలోని పువ్వుని తీసి.. నది నీళ్ళలో....వదులుతుంది. అప్పుడు నది కిల కిల నవ్వుతుంది.  ఇది నది మాట్లాడిన  రోజు  కధ.  నది మాట్లాడిందో..లేదో..కానీ..జాను బడికి..వెళుతుంది. . జానూ  చదువు కల నిజం అయింది... అలా ..ఆ కధ గుర్తుండిపోయింది.

మనం కూడా..చిన్న మాట సాయం తో.. చిన్న చిన్న సాయం తో.. బడి మానేసిన పిల్లలని బడికి పంపవచ్చు. మన ప్రక్కన విద్యా సుమాలు పూయించడానికి. మన వంతుగా. చిన్న సాయాలు  చేద్దాం.సంతోషంగా.. .

నాకు తెలిసిన వాళ్ళింట్లో  .. పనికి కుదిరిన..అమ్మాయి  పని చేసే టప్పుడు..ఫోటోలు  తీసి..పేపర్లో..వేయించాలి అనుకుంటున్నాను. మీకు పరిచయం ఉన్న వాళ్ళ పిల్లలు బడి మానేస్తే.. కొంచెం శ్రద్ద తీసుకుని బడికి.. పంపే ఏర్పాట్లు చేయండి..ప్లీజ్..  పేద  పిల్లలు బడి మానేస్తే.. ఎలా ఉంటారో.. నేను వ్రాసిన కవిత లింక్ ఇస్తాను ..చూడండీ.

 వనజవనమాలి -  "ఆశల సముద్రం"
  . 

26, జూన్ 2011, ఆదివారం

మన్ క్యోన్ బహాకా రీ బహాకా

నాకు బాగా నచ్చే నటిమణి... భాను రేఖ గణేషన్. భారతీయ  చలన చిత్ర  సీమలో.. గ్లామరస్ హీరోయిన్ గా.. పేరు గాంచి..ఎవరకి అనుకరణ సాద్యం కాని  మేకప్ తో.. అరవైలలో..కూడా అందులో..సగం వయసు ఉన్నట్లు భావించేటట్లుగా .ఉండగలగటం.. ఆమె ప్రత్యేకత. ఆ రహస్యం ని చేధించడం ఎవరితరం కాదు ..అన్నట్లు..ఆమె విజయ దరహాసం..ఆమెకి ఉన్న ఆభరణం.

సలాం యే ఇష్క్ మేరిజాన్.. అని నయనాలతోనే.. ఎన్నో..భాష్యాలు  చెప్పినా..  యే కహా ఆగయే హమ్..అని.. అమితాబ్ జీ తో..నటనలో.. జీవించినా.. నీలా  ఆస్మాన్ హో గయా..అని.. విషాదం ని..గుండెల్లో దాచుకున్నా.. ఇన్ ఆన్కొంకి మస్తీ...అని ఉమ్రావ్  జాన్... గా చెరగని ముద్ర వేసినా ఆమె కామే సాటి. ఎన్ని ముద్రలో..ఆమెలో. 
వసంత సేన గా ఆమె నటనలో..జీవించిన ఈ..పాట నాకు చాలా  చాలా ఇష్టం ..
"ఉత్సవ్" చిత్రం లో.. ఈ పాట.. ఎందుకో.. చెప్పలేను.. లతా జీ మరియు ఆశా భోంస్లే  .ఇరువురి  గళ మాధుర్యం కావచ్చు..  పాట సాహిత్యం కావచ్చు. 1985 . ఫిలిం ఫేర్ అవార్డు లు.. మూడింటిని కైవసం చేసుకున్న చిత్రం. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సమిష్టి  స్వరాలూ..ఈ..పాటలో.. వినేటపుడు  ..మనకి.. మనసుని ఉయ్యాలలూపుతాయి. ఈ చిత్రం సంస్కృత కావ్య ఆధారంగా   .. 6 వ శతాబ్దం  నాటి  మృచ కటిక తో..ఈ చిత్రం రూపొందించారని..విన్నాను. ఈ..పాట ని రేడియోలో.. వినడమే బాగుంటుంది..నాకు. కానీ..మనం వినాలనుకున్నప్పుడు..రాదూ కదా !  అందుకే  అప్పుడప్పుడు  ఇలా చూడాలి కదా! చాలా రోజులనుండి ఈ పాటకి అనువాదం  చేయాలనుకుని .. ఇప్పుటకి  కుదిరింది.  .   

(मन क्यों बहका रे बहका आधी रात को
 बेला महका हो
 बेला महका रे महका आधी रात को) -२
किसने बँसी बजाई आधी रात को
जिसने पलकें हो
जिसने पलकें चुराई आधी रात को
मन क्यों ...
बेला महका रे महका आधी रात को

झाँझर झमके सुन -३
झमके आधी रात को
उसको टोको न रोको, रोको न टोको, 
टोको न रोको, आधी रात को
ओ लाज लगे रे लगे आधी रात को -२
बिना सिन्दूर सोऊँ आधी रात को
बेला महका रे महका आधी रात को
मन क्यों ...

(बात कहते बने क्या आधी रात को
 आँख खोलेगी बात आधी रात को) -२
हमने पी चाँदनी आधी रात को -२
चाँद आँखों में आया आधी रात को

बेला महका रे महका आधी रात को
मन क्यों ...

(रात गुनती रहेगी आधी बात को
 आधी बातों की प्रीत आधी रात को) -२
रात पूरी हो कैसी आधी रात को -२
रात होती शुरू है आधी रात को

मन क्यों ...
बेला महका रे महका आधी रात को

मन क्यों ...

ఈ పాటకి అనువాదం

మనసు ఎందుకో ..  ఊగిసలాడుతుంది
ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి 

లతలు విరబూస్తున్నాయి.
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో ||2||

ఎవరు వేణువు ఊదారు అర్ధరాత్రిలో
ఎవరు వేణువు ఊదారు అర్ధరాత్రిలో
వారే కనురెప్పలను ..దొంగిలించారు అర్ధరాత్రిలో


మనసు ఎందుకో ..  ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో

పాదాలకు అలంకరించ బడిన ఆభరణం ఘల్లుమంది విను..
ఘల్లుమన్నది ఘల్లుమన్నది..అర్ధరాత్రి వేళలో

దానిని ఆహ్వానించు  ఆపకు
ఆపకు రానివ్వు.. రానివ్వు ఆపకు.. అర్ధరాత్రి సమయంలో

సిగ్గువేసింది ..అర్ధరాత్రిలో
సిగ్గు వేసింది అర్ధ రాత్రిలో

సింధూరం ధరించకుండానే నిద్రపోతావా అర్ధరాత్రిలో

లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో
మనసు ఎందుకో ..  ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి

మాటలు చెప్పుకుంటూనే గడుస్తుందా..ఏం ? అర్ధ రాత్రి.
మాటల మనసు కళ్ళు తెరుచుకుంటాయి అర్ధరాత్రిలో ||2||

మేము ఈ వెన్నెలను సేవించాము (ఆస్వాదించాము ) అర్ధరాత్రిలో ||2||

చంద్రుడు కళ్ళలోకి వచ్చాడు..అర్ధరాత్రిలో

 లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో

రాత్రి కూనీ రాగం తీస్తూ ఉంటుంది అసంపూర్ణం అయిన విషయం గురించి..

అసంపూర్ణమైన విషయాలే ప్రియమైనవి..అర్ధరాత్రిలో.
అసంపూర్ణమైన విషయాలే ప్రియమైనవి..అర్ధరాత్రిలో.

రాత్రి  ఎలా పూర్తి అవుతుంది అర్ధ రాత్రిలో
రాత్రి  ఎలా పూర్తి అవుతుంది అర్ధ రాత్రిలో

రాత్రి మొదలవుతుంది అర్ధ రాత్రిలో25, జూన్ 2011, శనివారం

పెయిర్ & లవ్లీ అయినా కొని పెట్టలేదు


ఈ మద్య అసలు.. కాగితపు పుటలు కళ్ళ ముందు..రెపరెపలాడటం లేదు. నాకు  ఆధునికత  వంటబట్టి..వెబ్ పేజెస్ క్లిక్ క్లిక్ తో..మారిపోతున్నాయి. దుమ్ము కొట్టుకుని..వరుసలు వరుసలుగా..పేరుకుపోతున్న పత్రికలు..మమ్మల్ని కాస్త చూడమ్మా!..అప్పుడే..అంత చేదు అయిపోయామా..అని..నిద్రలో..ఉన్నప్పుడు కూడా.. దెప్పి పొడుస్తున్నాయని.. అలా..ఒక పత్రిక పట్టుకుని...అక్షరాల వెంట కళ్ళని..పరుగులు పెట్టిస్తున్నా.. అందులో..ఇలా..ఉంది.... 

ఆమె ఎన్ని బరువులైనా మోయగలదు.
ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలదు.
ఎంతటి దరిద్రాన్ని అయినా అనుభవించ గలదు 
కానీ  ..తన మనసుని పంచుకోలేనివాడుతో.. .
శూన్య నరకాన్ని భరించలేదు...
ఈ సృష్టి లో..అతి క్లిష్టమైన విద్య 
మనసుని అర్ధం చేసుకోవడం.. 
అని చదువుతూ.. ఆహా భలే బాగా రాసారు!.అనుకుంటున్నాను.. 

మాకుటుంబానికి.బాగాకావాల్సిన  వారు..ఒక ఆమె వచ్చారు.. "అమ్మాయి..బాగున్నావా..అమ్మా!..అంటూ..పుస్తకం ప్రక్కనబడేసి.. ఈ..చదవడంకి..ముహూర్తం కుదరలేదు..అనుకుని.."బాగున్నాను"..కూర్చోండి..మంచి నీళ్ళు  తాగుతారా.".అని అడిగి.. మర్యాదలు చేశాను. ఏం తాగుతాను లేమ్మా! మా అల్లుడు మా చేత మూడుచెరువులు ..తాగిస్తున్నాడు..అంది ఆవిడ. 

అలాగా..! ఏం జరుగుతుంది.అన్నాను.  అన్నీ  ..నీకే  కావాలి.. ఎందుకు  వాళ్ళ సంగతులు...అంటున్నారు..మా అత్తమ్మ. అయ్యో..అలాగంటావేమిటి..అక్కా.. మనిషి అన్నాక కాస్తంత మంచి చెడు చెప్పుకోవాలి.లేకపోతే గుండె బరువెక్కుద్ది అంట..టి.వి.లో చెపుతున్నారు..అంది. 

నాకు నవ్వు వచ్చింది.ఆరోగ్యం పట్ల ఎంతటి అవగాహన..కల్పిస్తున్నారు. ఎంతైనా ప్రసార సాధనాల యుగం కదా..అనుకున్నాను.ఒక అడుగు వెనుకకు తగ్గే..(చానల్స్ యుగం అనాలి కదా) .

"సరేలే..చెప్పు అంది.."మా అత్తమ్మ ఆవిడని. 
ఏం చెప్పను ..అక్కాయి.. మా అల్లుడు అమ్మాయిని నానా రకాల బాధలు పెడుతున్నాడు. 

పెళ్ళైన  పదేళ్ళ లో ప్రేమగా  ఒకసారైనా  ఒక పెయిర్  & లవ్లీ పేకెట్ అయినా కొని పెట్టలేదు..
నేను అమ్మాయిని ఎంత బాగా పెంచాను.. ఏమిటో..దాని జీవితం అలా తగలడింది..అందుకే విడాకులు  ఇచ్చేయమంటున్నాను..అంది.నేను షాక్ అయ్యాను.మా అత్తమ్మ నా వైపు చూసి నవ్వింది. వెంటనే.. నిన్ననే.. మాట్లాడుకున్న ఓ..సంగతి మెదిలింది.  నా ఫ్రెండ్ కూతురు..స్వేచ్చ వచ్చి వెళ్ళింది.. ఇక్కడికి దగ్గరలోనే.. బందువుల  పెళ్లి. నా దగ్గర కాసేపు ఉండి..చీర కట్టుకోవడం నేర్చుకుని..వడ్డానం తో..సహా అన్ని నగలు పెట్టుకుని.. చక్కగా జడ వేయించుకుని..తలనిండా..పూలు పెట్టించుకుని..అసుర సంధ్య వేళ లో.. మా ఇంటి ముందు "తులసమ్మ" ముందు..నిలబడి..ఫోటో..తీయించుకుని..వెళ్ళింది.. ఏ..మేకప్ లు    లేకుండా...ఎంత ముచ్చటగా ఉందొ.. .! 

ఏమిటి..తల్లీ..ఇలా ఏం అలంకరణ సామాగ్రి లేకుండా  వచ్చావు? ఈ ఇంట్లో..టాల్కం పౌడర్ కూడా ఉండదు అన్నాను. పర్లేదు..ఆంటీ..నాకు ఆలాటివి ఏం వద్దు.. మీకొక ఇంటరెస్టింగ్.. విషయం  చెప్పనా..?అంది..

చెప్పు..అన్నాను.. మా వూరిలో..ఒక ఫ్రెండ్ ఉంది.వాళ్ళు ఇద్దరు..అక్కచెల్లెళ్ళు. వాళ్ళ మమ్మీ..నన్ను చూసి..ఏమిటి స్వేచ్చా..!ఇలా ఉన్నావు..? ఆడ పిల్లలు.. చక్కగా..బ్యుటి టిప్స్ ఫాల్లౌ అవుతూ..అప్పుడప్పుడు..పార్లలకి..వెళ్లి అందంగా..ఉండేందుకు..జాగ్రత్తలు తీసుకోవాలి...అని చెప్పింది..ఇంకా   ఏమందంటే..

బోలెడంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం..ఇంకా కట్నాలు కూడా ఇచ్చి, బోలెడంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఎక్కడ చేయగలం..?అందంగా,ఆకర్షనీయం గా ఉంటె..ఎవరో..ఒకరు..మంచి..(అంటే ఉద్యోగం,ఆస్తి ఉన్న) పిల్లాడు కాణీ కట్నం లేకుండా  చేసుకుంటాడు..అంటుంది. ఆమె వాళ్ళ పిల్లలకి డబ్బు ఇచ్చి మరీ బ్యుటి పార్లల్ కి పంపుతుంది.వాళ్ళ అమ్మాయిలకి..ఎంత బ్యుటి కాన్షియస్ ..ఉంటుందో..అంది.. నేను..  ఆశ్చర్య పోయాను...(ఇక నుండి ఆశ్చర్యపోవడం తగ్గించుకోవాలి)  ప్రతిదానికి ఆశ్చర్య పడటమేనా? ఎక్కడ ఉన్నాను..బి .సి.లో కాదుగా.. అనుకున్నాను కూడా.. 

ఇప్పుడు..ఇంకా ఆశ్చర్యపోయాను. ఇలా..  మునుపటి తరం ఆడవాళ్ళ ఆలోచనలే ఇలా ఉంటె.. చిన్న చిన్న విషయాలకి..విడాకులు తీసుకునేందుకు, పిల్లలకి..కొన్ని ప్రేరణలు ఇచ్చి..పెద్దలు ఎంకరేజ్ చేస్తున్నారా అనిపిస్తుంది. 

కానీ..  భార్య ముద్దుముచ్చట  తెలియని భర్తల పట్ల విసిగిపోవడం..లేదా సమస్యలు ఉంటె తల్లిదండ్రులు..అండదండ ఉండటం..సాధారణంగా..ఉంటుంది. ఇక్కడ  పెయిర్  & లవ్ లి  యే సమస్య కాకపోవచ్చు..అవ్వను వచ్చు.. లేదా మా స్వేచ్చ చెప్పిన ..వాళ్ళ ఫ్రెండ్ తల్లి.. ఆలోచనా ధోరణి  కావచ్చు. ఆ ఆలోచనల వెనుక ఉన్న కారణాలు కావచ్చు.. అందం.. ఒక అవసరం..అందం గా ఉండాలన్న తపనతో.. అలంకరణ లేదా స్కిన్ కేర్.. కోసం..బోలెడంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం.


అందమే.. పెళ్ళికి..ప్రామాణికం.!? అప్పుడు కట్నకానుకలు వద్దు.. చదువు సంస్కారం వద్దు.. ఒకవేళ అందంగా లేని అమ్మాయిలు ఏం చేయాలో.. ?   ఏం చేయాలో..?ఇలా ఆలోచనల్లో ఉండగానే.. మా బంధువుల ఆవిడ..వెళ్లొస్తాను అమ్మాయి.. అంది.. సరేనండీ..అన్నాను. 

మళ్ళీ చదువుతూ ఆపేసిన పత్రిక అందుకున్నాను.ఆగిపోయిన చోట కి..వెళ్లి వెనక్కి వెళ్లాను  ఒకసారి..

మనసుని పంచుకోలేనివాడితో..శూన్య నరకాన్ని భరించలేదు..
అన్న దగ్గర ఆగాను.. గాడిదగుడ్డు ఏం కాదు.. దానికన్నా చాలా చిన్న కారణాలకి..విడిపోతున్నారు..చాలా అవసరాల కోసం కలసి..బ్రతకాల్సి  వస్తుంది.. మనసుండి మాత్రం కాదు అనుకున్నాను..  పనిలో పనిగా  "మనసు కవి" పాట ఒకటి గుర్తుకు  వచ్చింది. మనసు  లేని  బ్రతుకొక  నరకం  -అంటూ.. వినేద్దాం మరి. 

23, జూన్ 2011, గురువారం

గంజాయి విత్తనాలు నాటి

అంతటా.. చదువుల హడావిడే కానవస్తుంది.. పాఠశాలల పునఃప్రారంభదశకి  ముందు ప్రతి రోజు.. ప్రకటనల మోత, బ్రోచర్ల పంపకం, గడపగడప వేటకి తెర పడి డబ్బు సంచులు నింపుకోవడం ప్రారంభమైంది. మొన్నటి దాకా కార్పోరేట్ కళాశాలల వంతు..ఇప్పుడు.. ప్లే స్కూల్ నుండి మొదలు. ఎన్నికల ప్రక్రియ లాగా పిల్లలని బడికి  పంపడం కూడా..బడిక్రియ.

అదివరకు తల్లిదండ్రులు..సౌకర్యాలు  అంతగా పట్టించుకునే వారు కాదు. విద్యాబుద్దులు బాగా గడిస్తే చాలు అనుకునేవారు. ఇప్పుడు నేటి తరం వాళ్ళు మాత్రం ముందే..పధకాలు వేసుకుని..అన్నీ కనులారాకాంచి కానీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే.. సౌకర్యాలు  కల్పించి మెలేసి పిండి..సొమ్ముచేసుకునే హై టెక్ బళ్ళు..వీధి వీధినా..వెలిసాయి.  

పూర్తి నిడివికల శీతల గదులు  (సెంట్ర లైజేడ్ఏ.సి) ఇప్పుడు పాఠశాల తరగతుల గదులు. తల్లిదండ్రులు.. కష్ట పడో లేదా మేధ పడో, మనసు పడో. ఏదో పాట్లు పడో.. ఆ స్కూల్ లో..చేర్పించడం పరిపాటి అయిపోయింది. ఆది ఆధునిక  పాఠశాల సంస్కృతి.


తమ పిల్లలు..అలాటి పాఠశాలలో  చదువుతున్నారని చెప్పుకోవడం ఒక ఇమేజ్ అయి కూర్చుంది అని గొణుక్కుంటూ.. తమ పిల్లలు అల్లాంటి స్కూల్లో..చేర్పించలేక పోయిన ఓ..తండ్రి బాధ..విన్నాను. 

ఒక మాదిరి స్కూల్స్ కూడా.. ఈ సంవత్సరం తరగతి గదులన్నిటిని ఆధునీకరించి సౌకర్యవంతమైన స్కూల్స్ గా తీర్చి దిద్దుకున్నారు. ఆట-పాట ఎలాగు  లేవు ఆఖరికి.. చెమట కూడా పట్టనివ్వక.. పిల్లల ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు జేసే.. ఈ విషమ జాడ్యం ఏమిటో! 

ఒకవేళ తల్లిదండ్రులు..మోజుతో అలాటి పాఠశాలలో చేర్పించి.. చదివిస్తున్నా.. ఇంట్లో.. ఏ.సి.గదులు..లేకుంటే..ఏం చేస్తారు? ఒక వేళ  ఏ.సి.గదులు ఉన్నా..నిరంతరం ఆ..గదులలో..గడిపే పిల్లలకి..సూర్య రశ్మి సోకక వచ్చే అనారోగ్యాలకి భాద్యులు ఎవరు? 

పిల్లలకి కష్టం కలగకుండా ఎండపొడ సోకకుండా అంత సుకుమారంగా పెరిగిన పిల్లలు  వ్యతిరేక వాతావరణం లోను పెరగవలసి  వస్తే వతిరేక పరిస్థితులు ఎదురైతే ఎలా.. పరిస్థితులని ఎదుర్కోగలరు ? విలాసవంతమైన జీవన విధానమా? లేక విద్యాబుద్దులు నేర్చుకోవడమా? ఏది కావాలో? 

ఈ..ఎయిర్ కండీషన్ల వాడకం వల్ల పర్యావరణానికి ఎంతః నష్టం కలుగుతుంది ఎవరైనా ఆలోచిస్తున్నారా? గ్రీన్ హవుస్ ఎపెక్ట్  పట్ల అవగాహన లేక తల్లి లాటి..పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. పిల్లలని..నాశనం చేస్తున్నాం. 
మలయ మారుతం అంటే ఏమిటని అడిగితే చెప్పడానికి..ఆచూకి ఉండదు అర్ధం ఉండదు..కూడా.

పిల్లలని ఎండా,వానా,చలి,మంచు అంటే ఏమిటో తెలియకుండా  పెంచడం నాగరికమా.. అవసరమా..? పిల్లలని .. మనమే..విషమ సంస్కృతికి.. బలి చేస్తున్నాం. గంజాయి విత్తనాలు నాటి..తులసి మొక్కలు రమ్మంటే..ఎలా? 

పచ్చిక బయ్యళ్ళ పైన ,నీరెండల్లోన, చిటపట చినుకుల మద్య..ఆడుకోని బాల్యపు బందిఖానా మరింత  ప్రియం, అయినా.. కొనగలిగే ...తల్లిదండ్రులు ఆలోచించండి.

నేడు  విద్య వ్యాపారమే కావచ్చు..పిల్లల ఆరోగ్యాలతో..ఆటలా? అనుమతులు ఎలా ఇస్తారో..నాకు తెలియదు.. అలా అనుమతి ఇవ్వని చట్టం ఏదైనా ఉంటె..చెప్పి  అవగాహన పెంచే పోస్ట్ ఎవరైనా పెట్టండి ప్లీజ్!
       

22, జూన్ 2011, బుధవారం

మొగలిరేకులా మజాకా

పాతికేళ్ళ క్రితం బుల్లి తెర మనకి..బాగా  పరిచయం అవుతున్న కాలంలో.. సినీ  పరిశ్రమకి..చేటు చేస్తుంది అనుకున్నారు. సినిమాల గురించి మాట్లాడనిదే..గంట కూడా మనుగడ సాగించలేని..పరిస్థితుల్లో.  చానల్స్ ఉన్నాయి. ఆఖరికి  న్యూస్ చానల్స్ కూడా.. సినిమా కబుర్లు,విశేషాలు..ఇవే ప్రాణం.  .

ఇక కొన్నిచానల్స్ కి..సీరియల్సే.. ప్రాణాధారం.  వాటికి..ప్రాణాధారమైన లేడీ బాస్ లు..లేడీ ప్రతి నాయకురాలు,మంచి నీళ్ళ ప్రాయంగా..హత్యలు..కాలక్షేపపు  బటానీ లు తిన్నంత  ఈజీ గా.  కిడ్నాప్ లు.. ఏళ్ళ తరబడి..సాగతీత..గంటల తరబడి టి.వి లకి అతుక్కుని.. శరీరాలు పెంచుకోవడం గురించి  మెదడు కి..హింసా ప్రవృత్తి ని..ఇంజెక్ట్  చేసుకోవడం గురించి..పురుషులు మొత్తుకుని మొత్తుకుని.. ఇంట్లో..ఆడంగులు వినక ఇప్పుడు ..మగ వాళ్ళే రూట్ మార్చుకుంటున్నారు. 

నిజం.. ఇప్పుడు..ప్రైం టైం లో..సిరియల్స్ దే హవా.. రిమోట్ చేతిలో ఉండాలే కానీ..నాలుగు  చానల్స్ లో.. కార్యక్రమాలు వీక్షించవచ్చును కదా..!  జెమిని  లో..ప్రసారమవుతున్న సేరియల్స్ లో... మొగలిరేకులు సీరియల్ లో..వీలైనంత..  అన్ని  రకాల పైత్యాలు ఉన్నాయి.పల్లెటూరిలో కధ మొదలై. ..ఆస్తి కోసం హత్యలు.. ప్రేమ పేరిట మోసం,కిడ్నాపులు,బ్లాకు మెయిలింగ్, వీలైనంత ఎమోషన్.,స్నేహం,అపార్ధం,కక్ష సాధింపు చర్యలు.. కథ కొనసాగింపులు..వీక్షకుల సహనం ని పరీక్షిస్తూ..సాగు..తూ..............ఉంది.

ఆఖరికి..ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్,మాఫియా,రియల్టర్ హత్యలు..అన్నీ..కలిపి.. నేర ప్రపంచం  మూడు వంతులు..చూపించి..ఒక వంతు.. మానవ విలువలు(?).అట..చూపిస్తూ  ..ఉత్తమ  సిరియల్ గా ఎంపిక  అయి..జనాల ఉత్తమ అభిరుచి కి..అద్డం పట్టింది.. అట. యద్దనపూడి సులోచనగారు ఎంత ఓపికగా చూస్తున్నారో..ఎప్పుడు ముగుస్తుందా..అని.

మొగలిరేకులు..సీరియల్ ని విమర్శించడం నా అభిమతం కాదండీ..దాదాపు అన్ని సీరియల్స్ అంతే..! అలాటి సీరియల్స్ తప్ప ఇక ఏవి చూడటానికి.. చాలా మంది..ఇష్టపడటం లేదని కూడా అనలేం..కానీ.. అగ్రశ్రేణి..వీక్షకులు.. ఇవే..చూస్తూ..ఉన్నారు.  

ఈ..సీరియల్స్ చూస్తూ..మద్యలో..అధికంగా..వచ్చే.. వ్యాపార ప్రకటనలు..చాలా అసమంజసంగా.. ఉంటూ..వాటి పని అవి నిశ్శబ్దంగా..చేసుకుంటూ..వస్తు వినియోగాన్ని పెంచడం..వినియోగదారులని ఎలా మోసం చేయాలో.. అంత బాగా మోసం చేస్తూ..క్షణాల్లో..వాళ్లకి..కావాల్సింది వాళ్ళు లాక్కుంటూ..వాళ్ళ ప్రభావాన్ని..మనపై..వలలా విసిరి వెళ్ళిపోతారు. 

సీరియల్స్ చూడటం రెండు విధాల చేటు. ఒకటి.. రక రకాల ప్రవృత్తులని.. మెదడుకి ఎక్కించడం, గిప్ట్ ల పేరిట..ఎస్.ఏం.ఎస్.. ల  వ్యాపారం,  అమ్మకాలు పెరగడం కోసం యాడ్స్,వాటి  ప్రసారం  ద్వారా వస్తువుల ధర పెంచి..ఆర్ధిక భారం మోపడం..అని నా అభిప్రాయం.

అసలు ఈ పోస్ట్ ఉద్దేశ్యం ఇది చెప్పడం కాదు కనుక..ఈ విషయాలు..మరో పోస్ట్ లో..ముచ్చటిస్తాను.
ఒక ఆసక్తి కరమైన  విషయం ఏమిటంటే..

కృష్ణా జిల్లా  లో..ఒక పల్లెటూరిలో..  ఒక 80 సంవత్సరాల వ్యక్తి..ప్రతి రోజు..సీరియల్స్ చూస్తూ.. మొగలిరేకులు..సీరియల్స్ కి.వీరాభిమానిగా.. మారి పోయారు. హటాత్తుగా..ఇంట్లో..టి.వి. చెడిపోయింది.కొడుకుకి..చెబితే.. రిపేర్ కి..అవ్వక పక్కన పడేసారు.అలవాటు పడ్డ ప్రాణం ..ఊరుకుంటుందా?

పక్కింటికి వెళ్లి ఆ సమయానికి..మొగలిరేకులు చూడటానికి.కూర్చున్నారు. ఆ ఇంట్లో పిల్లలు.. బ్రేక్ సమయంలో..వేరొక చానల్ కి..వెళ్ళడం ..మారడం.. వల్ల సీరియలోల్..ఏం జరుగుతుందో  తెలియక ఆ పెద్దాయన  ఓ..ఆరాట పడిపోయి.. బి.పి. పెంచుకుని.. ఆ.. పక్కింటి పిల్లల పై..అరిచి..హటాత్తుగా..పడిపోతే .. ఏ హార్ట్  అటాక్  వచ్చిందో అని.. భయపడి.. హాస్పిటల్కి.. తీసుకు వెళ్లి.. బోలెడంత  బిల్లు వదిలించుకుని..ఏం లేదనిపించుకుని.. బయట పడ్డారట.  ఆ పెద్దాయన  కొడుకు కి.. వెంటనే..జ్ఞానోదయం కల్గి.. కొత్త టి.వి. కొనుక్కొచ్చా రట.

 ఇంతకీ.. ఈ విషయం తెలిస్తే..మంజులా నాయుడు ..పల్ల మాల సుధాకర్ గారు.. నటీ నటులు..ఎంత మురిసిపోతారో.. హై లెట్స్ లో..చూపుతారేమో!అనిపించింది. ఇది విన్నాక ..మొగలిరేకులా.. మజాకా..!? అనిపించింది..నాకు. ఆఖరిన ఒక విషయం ఏమిటంటే..!!! నిజం చెప్పొద్దు.. గుర్తు ఉంటె..నేను అప్పుడప్పుడు ఈ సీరియల్ చూస్తుంటాను.     


21, జూన్ 2011, మంగళవారం

భారతీయ సంగీతపు ఆత్మ గా...వాయులీనం...

బ్లాగ్ మిత్రులందరికీ, సంగీత కారులకి,సంగీత  ప్రియులందరికీ ... ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. కులం,జాతి,మతం.బాష,దేశం.. బేధాలు లేకుండా.. ఎల్లలు మార్చి,హద్దులు చెరిపేసి..ఖండాంతరాలు..ధాటి ప్రవహించేది..సంగీతం. "పశుర్వేత్తి,శిశుర్వేత్తి గాన రస ఫణి "  అన్నారు అందుకే.. 

ప్రపంచ సంగీతం లో..మన భారతీయ సంగీతానికి..యెనలేని ప్రాముఖ్యత ఉంది.నాలుగు వేదాలలోని..సామవేదం..సంగీతం కి..సంబంధించినది. భారతీయ సంగీతం  లో.. రెండు  ప్రధాన స్రవంతులు..  హిందుస్తానీ,కర్నాటక సంగీతం.  వింధ్య పర్వతాలకి..ఈవల కర్ణాటక  సంగీతం లో..భక్తి సంగీతం కి...ప్రాధాన్యం గా త్యాగయ్య,అన్నమయ్య,రామదాసు..బాణీలు కట్టి..స్వయంగా పాడే వారు..కనుక.. మనకి..భక్తి  సంగీతపు ఒరవడి..లో.. అట్టే శతాబ్దాలు గడచి  పోయాయి..

భారతీయ సంగీతపు ఆత్మ గా..స్వరం,తంత్రీ, వాయులీనం, డోలక్..ఇలా నాలుగు  విధాలు
వివిధ ప్రాంతాలలో ..వివిధ రక పరికరాలతో..ప్రపంచాన్ని ఉరూత లూగించే..సంగీత సృష్టి..కి..మన భారతీయ సంగీతం మిళితమై .. మనకి అన్ని ప్రయోగాలలోను..గర్వకారణం గా నిలుస్తుంది.

నిత్య జీవితంలో..సమస్యలతో,చికాకులతో..అతలాకుతలం అయిపోతున్న మనిషికి..ఆహ్లాదం ని ఇచ్చి..మనసుకి సేద దీర్చే  శక్తి.. సంగీతానికి తప్ప వేరోకదానికి లేదు.అందుకే  ..నాదం లోనే మోదం ఉంది..అంటారు..కదా.. .

 మన భారతీయ  సంగీతంలో.. వీనులవిందైన సంగీతంలో..వాయువు..పూరించి..పలికించే రస రమ్య గమకాలతో..అలరించి..ఆహ్లాద పరిచేది.."వేణు గానం" ఆ వేణు గానానికి.. పరవశించని వారు ఎవరు ఉండరు.
వేణు గానం అనగానే..మనకి..ముందుగా..స్పురించేది..నల్లనయ్య ముగ్ధ మనహోర  రూపం.
యమునా తీరాన ..పొన్న చెట్టు  నీడన  కుడికాలుని అడ్డంగా  నిలిపి.. ఎడమ పాదం బొటనవేలిని చిద్విలాసం గ..ఆన్చి..  తన్మయత్మం తో..మురళిని పెదవులపై..ఆన్చి.. సర్వజీవులని  ..మైమరి పింపజేసే   వేణుగానం స్పురిస్తుంది..  అందుకే   కౌమార దశలో.. వేణువు ధరించని.. కృషుడిని  ని మనం  చిత్ర పటం లో..సైతం ఆమోదించ లేము.  

మంద్రమైన స్తాయిలో విన్న వేణు  గానం  మనిషిని మరోలోకం లోకి..ప్రయాణింపజేస్తుంది.
వెంటాడే  లక్షణం వేణు గానంది..అందుకే రాదమ్మ కూడా వావి  వరుసలు,వయో భేదములు మరచి.. నల్లనయ్య  కోసం పరువు తీస్తూ..వచ్చేదట. అలాగే వేన వెల్ గోపికలు..,గోపాలురు,గోవులు ..అంతా ఆనందముగా ఉండేవారట. 
వెదురు పొదలలో..జొరబడ్డ గాలి..వింతగా ధ్వనించడం  చూసిన మనిషి  .తన ఊహలకి..రూప కల్పన జేసి..  వెదురును వేణువుగా మార్చాడట. ఆ గానములో..జగమే..తూలియాడగా.. కొన్ని పాటలు.. గుర్తు చేసుకుంటూ.. సినీ సంగీతంలో.. వేణువు స్వరాలూ..ఊదగా..
ప్లుట్ మ్యూజిక్  ఫ్లూట్  మ్యూజిక్ ఇక్కడే 

సిల్సిలా  చిత్రంలో.. పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా ప్లుట్  వినండి..ఇక్కడ    

  సిల్సిలా  చిత్రం ప్రారంభ సంగీతం...ఇక్కడ వినండి..  ఇక్కడ 

ఇవి..కొన్ని మాత్రమె!!! వినాల్సినవి..చేంతాడంత లిస్టు ఉన్నాయి.. సమయాభావం వాళ్ళ లింక్ ఇవ్వ లేకపోతున్నాను.

 ఆ వేణు గానమన్న నాకెంతో ఇష్టం  కాబట్టి ఈ..పూట ఈ పాటలు ... తో.. అందరు..మధుర  సంగీతాన్ని ఆస్వాదించి.. ఆనంద డోలికల్లో..ఊగి తేలియాడాలని..ఆశిస్తూ..    (వనమాలి కి..మధుర భక్తి తో..) వనజ.   

20, జూన్ 2011, సోమవారం

ఒక రాంగ్ కాల్ కథ.

మిస్సుడ్ కాల్ తో మొదలైన ప్రేమాయణం  పెళ్లి  వరకు వచ్చి నిలిచి పోయిన వైనం .. న్యూస్ పేపర్ లో ఓ..వార్త. కొంచెం ఆసక్తి. చదివేస్తూ ఉండగానే.. నాలో.. ఓ..సంఘటన మెదిలింది.

అది ఏమిటంటే..!!! 
మేము 8 సంవత్సరాలు  ఒకే ఇంట్లో ఉండి హటాత్తుగా ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు బోలెడు ఇబ్బంది పడ్డాం.  వేరే ఇంట్లోకి మారిపోయిన తర్వాత అన్నీ సర్దుకున్నాయి గాని  నాకే ఓ..ఇబ్బంది వచ్చి పడింది. నా మొబైలు ఫోన్ కి సిగ్నల్స్  సరిగా ఉండవు. ఇంట్లో ఉంటె మాటే వినబడదు.

అందుకే వేరేక నెట్ వర్క్  లోకి మారి..కొత్త నెంబర్ కి పాత నంబర్ తో..కాల్ చేసి చూసుకుంటున్నాను. అలా ఆ నంబర్ కి డయల్ చేసేటప్పుడు ఒక అంకె తప్పు కొట్టడం జరిగింది. ఆ నంబర్ కల వ్యక్తి వెంటనే కాల్ తీస్తే  ..అయ్యో! ఇదేమిటి..తప్పు వెళ్ళింది అని కట్ చేసాను. (ఆ కట్  చేయడం అనేది.. ఎంత అవివేకం అయింది అని నేను ఇప్పటికి అనుకుంటూ ఉంటాను.) ఆ రోజు ఆ కాల్ లిఫ్ట్ చేసిన అతను  వెంటనే తిరిగి కాల్ చేసాడు. నేను "ఎవరండి" అని అడిగాను. ఇప్పుడు ఈ నంబర్ కి పోన్ చేసారండి.అన్నారు. వెంటనే విషయం అర్ధమై.. అవునండి..నేను ఈ రోజే ఒక కొత్త  నంబర్ తీసుకున్నాను..  ఒక అంకె తప్పు వల్ల మీకు కాల్ వచ్చిందండి.. "సారీ" అని చెప్పి  కట్  చేశాను.

ఇంకొక గంట తర్వాత మళ్ళీ ..నా పాత నంబర్ కే మళ్లీ కాల్ వచ్చింది. మళ్ళీ లిఫ్ట్  చేసాను. అదే విషయం చెప్పాను. అంతటి తో ఆగి పోలేదు. మళ్ళీ ఇంకా కాసేపటికి అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. మళ్ళీ అదే విషయం చెప్పాను.కోపంగా.. మాట్లాడాను కూడా..  మళ్ళీ.. అర్ధ రాత్రికి కాల్ వచ్చింది..నేనే నిద్ర మత్తులో..తీసాను. మళ్ళీ అదే మాట. .ఎవరండీ మీరు..అని నాకే ప్రశ్నలు.. విపరీతంగా కోపం వచ్చేసి.. ఎన్నిసార్లు చెపాలి..నీకు..అన్నాను  గౌరవం తగ్గించి.అయినా నువ్వెప్పుడు పోన్ చేసినప్పుడు రాంగ్ కాల్ వెళ్ళలేదా? ఏమిటి..ఈ..అర్ధరాత్రి కాల్స్ . పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని తిట్టి పెట్టేసాను.

మళ్ళీ తెల్లవారిన తర్వాత అదే నంబర్ నుండి కాల్ వచ్చింది..మా అబ్బాయికి..ఇచ్చి వీడి సంగతి ఏమిటో.. చూడు నాన్నా..అన్నాను. మా అబ్బాయి మట్లాడి బాగా సీరియస్ అయితే.. .అబ్బే నేను ఏం తప్పుగా మాట్లడలేదండీ !ఈ నంబర్.. నా బార్య  దగ్గర ఉంటుంది. ఎవరో..ఏమిటో..తెలుసు కోవాలి కదండీ..అందుకే చేస్తున్నాను అన్నాడట. సరే.. అప్పటికి    ఆ విషయం  అయి పోయింది. ఎందుకైనా మంచిదని ..నేను ఆ నంబర్ కి అనౌన్ ని పేరు తగిలించి.. పెట్టి వారానికి..ఒక సారి అయినా వచ్చే ఆ పోన్ తీయ కుండా జాగ్రత్త పడే దాన్ని.

నేను..కొన్ని నెలలకి..ఆ విషయం కూడా మర్చి పోయాను. ఒక సారి మొబైల్ పీస్ మార్చినప్పుడు.. పేరు డిస్ప్లే లో పడక నంబర్ మాత్రమే ఉంటె..కాల్ లిఫ్ట్ చేసాను.. మళ్ళీ ఆ వ్యక్తే.. ఎందుకు ఇలా కాల్ చేస్తున్నావ్ ..అన్నాను.. ఈ నంబర్ నా భార్య దగ్గర ఉంటుంది..అన్నాడు .అయితే.. అన్నాను.  ఒక సారి ఈ..నంబర్కి కాల్ చేస్తే..మగవాళ్ళు తీసారు అందుకే ఎవరో..కనుక్కుందామని చేస్తున్నాను. అన్నాడు. నేను వెంటనే క్లారిటీ ఇచ్చాను .మాది విజయవాడ. మీ దరిదాపుల్లో.కూడా  మేను లేము.. అనవసరంగా నీ భార్యని అనుమానించకు.. అలా.. చేయడం..ఇలా.మాకు కాల్ చేసి విసిగించడం చాలా తప్పు..అని చెప్పాను. 

అతను చేసే పని మూలంగా..ఇంటికి దూరంగా ఉంటాడట. అతను లేనప్పుడు..భార్య ఎవరితో..అయినన మాట్లడుతు ఉంటుందేమో  అన్న అనుమానం తొలిచేస్తూ.. అతను ప్రశాంతంగా ఉండ లేడు. కచ్చితంగా తని భార్యని ప్రశాంతంగా  ..ఉండ నివ్వని..తత్వం నాకు అతని మాటల్లో..కనబడింది...బోధ పడింది. నేను అప్పుడు.మా వారికి..మా అబ్బాయికి చెప్పాను. మీరు  ఎప్పుడు నా పోన్ లిఫ్ట్ చేయకండి.ఆ అనుమానం పిశాచి కాల్ చేస్తే..నేను కాకుండా మీరు ఎవరైనా మాట్లాడితే.. పాపం వాడి భార్యకి నరకం చూపెడతాడు అని చెప్పాను.  అంతటి తో  ఆగలేదు. ఒక సారి నాకు అదే నంబర్ నుండి కాల్ వస్తుంది. ఇది ఎక్కడ  ఖర్మ రా బాబూ..అనుకుంటూ.. లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే తీసాను. ఒక ఆడ  మనిషి స్వరం . ఏడుస్తూ..మాట్లాడింది.. అమ్మ..నువ్వు..ఏమంటూ  నాకు పోన్ చేసావో కానీ.. మీ వాళ్ళు మా ఆయనతో..ఎవరు మాట్లాడారో..కానీ..మా ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా.. ఎవడే.వాడు..నేను పోన్ చేస్తే   ఆడ మనిషి మాట్లాడతారు.. మల్లా మగ మనిషి మాట్లాడతారు.. ఏమవుతారు   ..నీకు..చెప్పు అని.. కొట్టి చంపుతున్నాడు..అని చెపుతుంది. నాకు..అంతా అయోమయం. ఏం మట్లాడాలో..అర్ధం కాలేదు.. ఒక క్షణం ఆలోచించుకుని..ఆమె భర్త కి..పోన్ ఇవ్వ మన్నాను. అతను..మాట్లాడటం మొదేలేట్టగానే..తిట్టేశాను. నువ్వు ఆ అమ్మయిని..అలా ఇబ్బంది పెట్టడం మానేయక పోతే.. నేనే ..నువ్వు నాకు పోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావని కాల్ రిజిస్టర్ చూపి సాక్ష్యం తో.. సహా  పోలిస్ కంప్లైంట్ ఇస్తాను..అన్నాను
అంతే.. మళ్ళీ   నాకు కాల్ చేయలేదు. ఒక ఏడాది కాలం అయ్యాక అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. సరే..చూద్దాం అనుకుని  మాట్లాడటానికి తీశాను.. ఈ సారి  అమ్మాయి  మట్లాడింది. చెప్పమ్మా..! ఏమిటి సంగతి అన్నాను. వాడిని వదిలేసాను..అంది.. కొంచెం గతుక్కుమన్నాను.  ఎందుకు..అని నేను అడగలేదు..రోజు.. అంతే వేధించే వాడు.. అందుకే.. వాడి కి..బుద్ధి చెప్పాలనుకుని.. వాడు అనుమానించి నట్లే.. ఒక అబ్బాయితో..పోన్ స్నేహం చేసి.. వాడిని వదిలేసి వచ్చి..పెళ్లి చేసుకుని..మీకు దగ్గరలోనే.."ప్రియ" పచ్చళ్ళ  కంపెని లోనే..ఉద్యోగాలు చేసుకుంటున్నాం.. నా మొదటి మొగుడు నుండి.. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టె  పోన్ లు..రావు లెండి అంది. నాకైతే..నవ్వాలో..ఏం చేయాలో..అర్ధం కాలేదు.  ఇది ఒక రాంగ్ కాల్ కథ..ఇందులో..నా తప్పు ఎంత..? మాకైతే.. ఏదో..తెలియని ఫీలింగ్..    

అది జరిగిన ఒక నెలకి. ఆమె..(భర్త)  వేరే నంబర్ తో..పోన్ చేసాడు. ఏవమ్మా. నా పెళ్ళం గురించి చెపితే..అలా అనుమానిచడం తప్పు అన్నావ్ గా.. నా పెళ్ళాం.. పోనుల్లో..మాట్టాడి మాట్టాడి..ఎవరితోనో వెళ్లిపోయింది. వాడు..నీకు తెలుసేమో.. ఎక్కడ ఉన్నారో చెప్పు. ఇద్దరినీ  నరికి..పారేస్తాను..అన్నాడు.. . ఇంకా   ఏదేదో.. అంటున్నాడు..  ఇక అంతే..  బంగారం అంటి నా పాత నంబర్  (ఎంత చక్కని ప్యాన్సీ నంబరో).. తీసి.. పడేసి..  మా బందరు కాలవలో.. నేనే స్వయంగా వెళ్లి భద్రం గా పడేసి వచ్చాను.. ఇది జరిగి ఒక ఏడాది అయింది.ఈ మద్య నా పాత నంబర్ మోగుతుంది.. మళ్ళీ..ఆమె భర్త వాళ్ళకి..కాల్ చేస్తాడు. ఈ సారి గట్టిగ్గా దెబ్బలు తింటాడు. .ఇప్పుడు నా పాత నంబర్ వాడుతున్న వాళ్ళు.. నా అంత  సహనశీలురు  కాకుండా ఉండాలి కోరుకుంటూ.....

రాంగ్ నంబర్స్.. మొబైల్ చాటింగ్ .. అమ్మో.. నాకు.. ఎంత ఇబ్బంది..  కొంత మందికి..ఎంత నరకం..మరికొంత మందికి ఎంత అనుమానం. అనుకుంటూ.. ఈ షేరింగ్.
ఒక చిన్న పొరబాటు..ఒక  వ్యక్తి అనుమాన ప్రవృత్తి. ఒక భార్య.. విసిగి వేసారి.. ఒక విధమైన కక్ష తో.. తీసుకున్న నిర్ణయం... వీటన్నిటి మద్య మొబైల్ పోన్..చిద్విలాసం. 

19, జూన్ 2011, ఆదివారం

నాన్నకి.. ఓ..భ్రూణ పుత్రిక ప్రశ్ననాన్నా!!..ఈ రోజు ప్రపంచమంతా.. ఫాదర్స్  డే.. జరుపుకుంటుంది.

అందరు నాన్నలకి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ప్రేమగా కానుకలు ఇస్తున్నారు.

ఇంకా పుట్టని నేను..పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత వేసే ప్రశ్నలని పుట్టక ముందే అడగాలనుకుని సమాయుతమవుతున్నాను.

 మీరు ఇచ్చే సమాధానం బట్టి  నేను పుట్టి మీ నీడలో..బతికి బట్టకట్టాలనుకున్న పిండాన్ని నాన్నా!!
     
నాన్నా!? ఒక ప్రశ్నని వేస్తున్నాను. మనఃసాక్షిగా సమాధానం చెప్పుకోండి.నాకు చెప్పండి.   

బిడ్డ పుట్టుకకు కారకుడైన పురుషుడిని..ఆ బిడ్డకే రక్షకుడిగా చేసే..నాన్న స్థానం.. బిడ్డకి..అపురూపం. నాన్న మగ పిల్లడికే తండ్రి కాదు..ఆడ పిల్లకి కూడా.. 

ఆడ పిల్లగా నేను పుట్టినప్పుడు మనఃస్పూర్తిగా నీ వారసత్వానికి..సంతోషించారా ?  లేక..తప్పదు కనుక ఒక మగబిడ్డ పుట్టలేదన్న ఆశాభంగం ని  లోలోపల దాచుకుని.. సరిపెట్టుకున్నారా ?  మా అమ్మని.. వారసుడిని ఇవ్వలేదని సతాయించారా? 

అమ్మకి..రెండో కాన్పులోను చెల్లి పుట్టినప్పుడు  అమ్మని..తిట్టారా..? వారసుడి కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని.. అనుకున్నారా?

నన్ను  స్కూల్ కి  పంపుతున్నప్పుడు.. ఆడ పిల్లలకి.. ఇంత ఇంత ఖర్చు పెట్టి.. చదువు అవసరమా? అని మనసులోనైనా తిట్టుకున్నారా?  మేము బాగా చదువుకుంటుంటే పెద్ద చదువులు వద్దని ఆపేసి పెళ్లి చేసేయాలనుకున్నారా?
  
వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైన  ప్రశ్న.

మా అమ్మని చీటికి మాటికి..తిడుతుంటారా? వంట బాగా చేయలేదని, బట్టలు బాగా ఉతకడం లేదని,అందంగా లేదని, బాగా మాట్లాడటం రాదని,చదువు సంస్కారం లేని మొద్దు అని..చిన్న చూపు చూసేవారా?

ఒక మంచి భర్త కాలేని మీరు ఒక మంచి తండ్రి కాగలరా?మాకు  మా అమ్మని   ప్రేమించే మా మంచి నాన్న కావాలి..నాన్నా!  మంచి అమ్మో.. లేక మంచి నాన్న.. గా ఉండే వేరు వేరు ఇద్దరు మాత్రమో..వద్దు. 
   
ఇంకా కొన్ని ప్రశ్నలు..

ఇంకా కట్నం బాగా తేలేదని,మీకు నచ్చినట్లు ఉండ లేదని,  జూదం ఆడుతూ,మద్యం తాగుతూ,పర స్త్రీల పొందులలో..ఇల్లు మరచిపోయి.. భాద్యతలు విస్మరించి ఉన్నప్పుడు అభ్యంతరం చెబుతుంటే.. ఆమెని శారీరకంగా..హింసించే వారా?

ఇవన్నీ లేకుండా ..మా అమ్మని ప్రేమించి, గౌరవించి..ఆమె మాటకి  విలువనిచ్చి.. అడ పిల్లైనా,మగ పిల్లాడైనా వారి పుట్టుకకు కారణం  మీరేనని తెలుసుకుని .. పుట్టిన మమ్మల్ని ప్రేమించి... అమ్మని ప్రేమగా ..చూసుకున్నప్పుడే     మీరు మంచి నాన్నగ ఉంటారని నేను అనుకుంటున్నాను. 

చిటికెన వేలు పట్టుకుని  ప్రపంచాన్నిచూపించి ..మా పై ఆంక్షలు లేకుండా మగ పిల్లల లతో..సమానం గా మమ్మల్ని పెంచి ప్రేమించే నాన్నగా మీరు ఉంటె..నేను మీకు మాత్రమే.. వారసురాలిగా జన్మించి..  మీ పెంపకంలో..మంచి కూతురిగా.. మీకు గర్వకారణమైన కూతురిగా పెరిగి..

ప్రేమతో..గౌరవంతో.. నాన్న.. మీకు   ప్రేమ పూర్వక పితృ దినోత్శవ శుభాకాంక్షలు.. మరియు అభివాదములు.. చెప్పాలని .. అనుకుంటున్నాను.

 అలా ఉంటారా..నాన్నా..?  

అలా ఉండలేని నాన్న మీరు అయితే.. నేను అసలు పుట్ట కుండా చేయమని.. వేడుకుంటున్నాను.
                                                                                                                    
                                                                                                                         ఇట్లు..  భ్రూణ పుత్రిక.     

17, జూన్ 2011, శుక్రవారం

ఇది ఒక విష వలయం

నేను ఈ రోజు ఈ పోస్ట్ వేయడానికి  మొదట  కొద్దిగా తటపటాయించాను.కానీ మన కళ్ళ ముందు చాలా నిశ్శబ్దంగా..చాప క్రింద నీరులా.. మన పిల్లల  తరాన్ని కబళిస్తుంటే  .. చూస్తూ..ఊరకుండలేక.. ఓ..మిత్రురాలి సలహా తీసుకుని ..గో..ఏ.హెడ్ ..అనిపించుకుని మరీ వ్రాస్తున్నాను. 

అశ్లీల సాహిత్యం అంటేనే.. ఏమిటో తెలియని కాలంలో సాహిత్యం తో పరిచయం ఏర్పరచుకుని తర్వాత తర్వాత అశ్లీల సాహిత్యం అర్ధం తెలుసుకుని ఇలా కూడా..ఉంటాయా? అనుకునే వాళ్ళం. దొంగ తనంగా ఆ పుస్తకాలని కొని చదువుకునే  బాధని  తప్పించి కొన్ని వార పత్రికలలో..సరసమైన కధలు.. అలాగే..శృంగార రసాన్ని  దట్టించి కధల కథలుగా వర్ణించే సీరియల్స్ ని అందించడం వల్ల అందరికి ఆ సాహిత్యాన్ని దగ్గర చేస్తే.. ఇక ఆ అశ్లీల సాహిత్యం  ఎందుకు ? ఇదే బాగుంది! అని చదవడంకి దగ్గరైన ఆ కాలంలో ఇదొక రకమైన అశ్లీల సాహిత్యం అనే విమర్శకుల వ్యాఖ్యలు..అన్నీ చూస్తూ సెక్స్ సమస్యలు చదువుతూ సాగిన వాళ్ళం అందరం.

మేము  అసలు చదవలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి. అది వేరే విషయం .అది అప్రస్తుతం కూడా..ఇప్పుడు.  

ఈ కాలం పిల్లలకి పెద్దలకి.. అశ్లీల సాహిత్యం చదవాల్సిన అవసరం అంతగా లేదు.కారు చవకగా..చిత్రాలు లభిస్తున్నాయి. "వాత్శాయన కామసూత్రాలు" పుస్తకం చదవడమా?  ఛీ..పాడు అనుకున్న తరం వారి పిల్లలు.. ఈ రోజుల్లో..స్వేచ్చగా  సైబెర్ కేఫ్ కి వెళ్లి గంటల తరబడి అశ్లీల చిత్రాలు చూస్తూ ఉన్నారు. ఇది అంతా టెక్నాలజీ మహిమ. పోర్నోగ్రపి బారిన పడి..నాశనమవుతున్న పిల్లలను చూస్తూ..ఊరుకుందామా?  

 ఇప్పుడు కంప్యూటర్  విద్య  తప్పని సరి అయింది.ప్రతి ఇంట్లో..ఇంటర్నెట్ కనక్షన్ లేక పోవచ్చు.కానీ ఒక మాదిరి ఊర్లో కూడా..నెట్ సెంటర్ లు..ఉంటున్నాయి. గంటకి పది రూపాయలు ఇస్తే ఇష్టానుసారం..యదేచ్చగా వారి లోకంలో..వాళ్ళు  విహరిస్తూ ఉంటారు.

ప్రక్క వారు చూడ కుండా ప్రత్యేక  కాబిన్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బాగా మారు మూల ప్రాంతాల్లో..కూడా.. డిష్ కనక్షన్ ఉండటం ..అక్కడ కూడా  కొన్ని చానల్స్ లో  అర్ధరాత్రి..వచ్చే కార్య క్రమాలు, అశ్లీల చిత్రాలు.. వెరసి.. 10 సంవత్సరాలు పిల్లలు కూడా ఆ..చిత్రాలు చూడటానికి..అలవాటు పడుతున్నారు. అమ్మ నాన్న పనికి వెళితే.. బడి నుండి మద్యాహ్నం అన్నం  తినడానికి వచ్చి ఆ చానల్స్ చూసే పిల్లలు..పల్లెటూల్లలో..ఉన్నారంటే..ఆశ్చర్య పోవద్దు. వాళ్ళే తమ తోటి ఆడపిల్లల పై..అఘాయిత్యాలకి పూనుకుంటున్నారు అనేది వాస్తవం.

ఈ రోజుల్లో కాలేజ్ లో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి అబ్బాయి దగ్గర సెల్ పోన్  ఉంటుంది.. అలాగే..చదువు సంద్యలు అబ్బక చేతి పనులు చేసుకునే.. యువత  దగ్గర సెల్ పోన్లు ఉంటున్నాయి. వినోదం  కోసం  పాటలుకి  మాత్రమే  పరిమితమయ్యాయి అనుకున్న మెమరి కార్డ్  లు.. శృంగార చిత్రాలు ని భద్ర పరచుకుని.. యదేచ్చగా..చూస్తూ.. కనపడ్డ ప్రతి స్త్రీని కామ దృష్టి తో.. చూడటం, వెకిలి చేష్టలు చేయడం, లైంగిక నేరాలు చేయడానికి పూనుకోవడం చేస్తున్నారు.

పోర్నోగ్రఫి   ఇలా.. విచ్చల విడిగా రాజ్యమేలుతుంటే..ఇది టెక్నాలజీ విప్లవం అందామా? 


ప్రతి విషయం లోను మంచి-చెడు రెండు ఉంటాయి. చెడుకి..ఆకర్షితమైనంత త్వరగా.. మంచిని..అలవర్చుకోవడం లేదు. ఇక విజ్ఞానం వంట బట్టించుకున్న వారు కూడా.. సైబర్ సెక్స్ కి..అలవాటు పడి.. అదే పనిగా ఆ చిత్రాలు చూస్తూ..దాంపత్య జీవితంలో.. మధురిమలని కోల్పోతున్నారు.  ఒక ఏం. బి.ఏ చదివిన అమ్మాయి.. సరియిన వరుణ్ణి  ఎంపిక చేసుకోలేక సైబర్ సెక్స్ కి అలవాటు పడి తర్వాత పెళ్లి చేసుకున్నావివాహ జీవితంలో ఇమడలేక తిరిగి  భర్త మీద ఆరోపణలతో కోర్ట్ కి  వెళ్లి నీలి చిత్రాల ఆస్వాదనలో జీవితాన్ని.విషవలయం చేసుకొనడం వెనుక కారణం ఇదే!.


మా బంధువుల  అమ్మాయి ఒకరు నార్త్ లో ఉంటారు.ఆమె,ఆమె  భర్త ఇద్దరు   ఉద్యోగాలకి  ..వెళ్లి పోతారు.ఇంట్లో ఇంటర్నెట్ కనక్షన్ ఉంది. ఇద్దరు మగ పిల్లలు. ఒక అబ్బాయికి.. మద్యాహ్నం వరకే తరగతులు. ఇంకో ఆబ్బాయి.. ఇంజినీరింగ్ విద్యకి.. మన రాష్ట్రం వచ్చి అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. రెండో  అబ్బాయిని కూడా ఇక్కడికే తీసుకు వచ్చారు.   "అక్కడ చదువు బాగుంటాయి కదా అయినా  ఉన్న ఇద్దరు పిల్లలు దూరంగా ఉంటె తల్లిదండ్రులకి..వెలితి కాదు" ..అని అడిగితే స్కూల్ నుండి ఇంటికి వచ్చి  అదే పనిగా ఆ నీలి చిత్రాలే  చూస్తూ ఉంటాడు  ఒంటరిగా ఉంచ కూడదని  అందుకు..తీసుకు వచ్చాం అని చెప్పారు.  

ఇక నా ఫ్రెండ్ ఒకరు.. పిల్లల గొడవ భరించలేక సిస్టం కొని ఇంటర్ నెట్ కనక్షన్ పెట్టించారు. హాల్లో సిస్టం పెట్టారు.
సౌకర్యంగా లేదు కదా.. పిల్లల రూమ్లో పెట్టే పని అంటే అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు.ఇక్కడైతే అటు వెళుతూ  ఇటు వెళుతూ  గమనించ వచ్చు అని  అంటే నేను ఖంగు తిన్నాను. పిల్లలని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అర్ధమైంది.


మద్య తరగతి జీవన శైలి లో కూడా..పడక గదులు వేరువేరు అయిపోయాక  ఆధునిక జీవన సరళిలో.. పిల్లలు ఏం చేస్తున్నారో..గమనించడం కష్టమైపోయింది.గుంటూరు పట్టణం లో.. ఒక నెట్ సెంటర్ లో..ఒక అమ్మాయికి..ఎదురైన అనుభవం.. మనకి..పత్రికా ముఖంగా..తెలిసిందే!

 లైంగిక విద్య పేరిట పిల్లలకి..అవగాహన పేరిట పిల్లలకి.. స్కూల్ స్థాయి లోనే అన్ని తెలుసు. కానీ సరి అయిన అవగాహన రాక లైంగిక నేరాలు,ప్రేమ కలాపాలు ఎక్కువయ్యాయి... ఇన్ని పోకడల మద్య పిల్లలని కాపాడుకోవడం, మంచిని నేర్పడం,  మంచి తల్లిదండ్రులు అనిపించుకోవడం ఎంత కష్టం చెప్పండి. పెడదారి పడుతున్న పిల్లలని ఎలా కాపాడుకోవడం? ఇలా ఉంటాయని తెలియని వేల మంది  తల్లిదండ్రులు ఉంటారు.

 ఇది ఒక విష వలయం. చెడుని  గమనిస్తూ మన పిల్లలు..చెడు వైపు..ఆకర్షింప బడకుండా కాపాడుకోవడం కూడా ఓ పెద్ద భాద్యత. ఏమంటారు? 


మొన్నటికి మొన్న తిరుపతి వేద పాఠశాలలో..మెమరీ కార్డు ల  సాక్షిగా ఏం జరుగుతుందో..మనమందరం చూసాం. బహుశా ఇలాటివి జరుగుతున్నాయని.. ఇలా ఉంటుందని తెలియని వారికి కూడా తెలియజేసింది..ఈ సంఘటన. మన పిల్లలు ఇలా చూస్తారని కలలో కూడా  పెద్దలు భావించరు.ఒకవేళ  తెలిసినా  గోప్యం గా,చిన్నతనం గ భావించడం వల్ల  వారికి..అందువల్ల జరిగే అనర్ధం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాటి జాడ్యం వల్ల పిల్లల వికాసం లో మార్పు వస్తుంది. 

జాగ్రత్త పడటం అని కాదు కానీ..మన పిల్లల   సెల్ పోన్ లు వాళ్ళకి తెలియ కుండా చెక్  చేయడం లాటి సి.ఐ.డి పనులు చేయాలి.టి వి  లో అయితే అలా అశ్లీల చిత్రాలు  వచ్చే చానల్స్ ని బ్లాకు చేయవచ్చు. ఇంకా కాలేజెస్ లో.. కౌన్సిలింగ్ తరగతులు పెట్టాలని  సూచించాలి. పర్సనాలిటి డెవలప్మెంట్ కోర్సులు  ఎలా ఉంటాయో..అలాగే యువతకి సెక్స్ ఎడ్యుకేషన్  పై...తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడికి పంపవచ్చు.  రకరకాల జాడ్యాల నుండి పిల్లలని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలకి..స్నేహితుని లెక్క కావాలని, ఉండాలని అన్నమాట.

ముందు సినిమాలని బాన్ చేస్తే పోలా? అని నా స్నేహితురాలు..నొక్కి వక్కాణించింది  .

అవును..అక్కడ ఏమైనా తక్కువా..ఏమిటి..?    .    .         

16, జూన్ 2011, గురువారం

అసభ్య పదజాలం వాడటం ఒక ప్యాషన్?

మధుర  భాషణమున మర్యాద ప్రాప్తిన్చున్..  లలిత సుగుణ జాల  తెలుగు బాల... 
ఏమిటండి.. ఇప్పుడు ఈ శతకం  గుర్తు చేసుకుంటున్నారు .. అంటారా..? 
ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి.. ఎదుటివారికి  చెపుతూ ఉండాలి. లేక పోతే.. మనమే టంగ్ స్లిప్ అయ్యిందని..విచారపడనూ వచ్చు. ఎదుటివారు అనవసరంగా నోరు పారేసుకుంటే మనకి విపరీతంగా బాధ కలుగవచ్చును కదా?

అసభ్య పదజాలం  వినడానికి..మాట్లాడటానికి.. అసభ్య హాస్యం ని   ఆస్వాదించడానికి అలవాటు అయిపోయాం.  మొన్న ఈ మద్య నాకొక నెంబర్ నుండి పదే పదే మిస్సుడ్  కాల్ వస్తుంది. ఎవరో.. ఏం అత్యసర పరిస్థితుల్లో చేస్తున్నారో అనుకుని. నేనే కాల్ చేసి.. ఎవరు అని అడిగాను. అటు వైపు నుండి నో వాయిస్.  ఒక నిమిషం ఓపికగా ఎదురు  చూసి కట్ చేసి ఎస్.ఎమ్.ఎస్ పెట్టాను.. ఎవరు మీరు..? ఎందుకు మిస్సుడ్ కాల్ చేశారు..!? నేను కాల్ చేస్తే.. మాట్లాడలేదు. అని. "మీరు ఎవరో  ..చెప్పండి.."అని రిప్లై వచ్చింది. నేను ఇక ఆ మెసేజ్ ని ఖతారు చెయ్యలేదు. మళ్ళీ.. ఆ నంబర్ నుండే.. చెప్పక పోతే.."దోబ్బెయ్ రా." అని  మెసేజ్. విపరీతమైన కోపంతో..వేరే నంబర్ తో.. కాల్ చేసాను. ఒక అమ్మాయి మాట్లాడింది. "నువ్వేనా మెసేజ్   పెట్టింది... ఏమిటి..ఆ పదజాలం.. చదువుకున్నావా? అది సంస్కారమేనా.. అసలు..నువ్వు ఆడ పిల్లవేనా..?" అని తిట్టి లైన్ కట్ చేశాను. 

సినిమాల ప్రభావం వల్ల ఆడ-మగ తేడా లేకుండా.. తొక్క ,తోలు,ముదురు.. ఇంకా.. ముద నష్టపు  భాషలో.. మాట్లాడటం..సర్వ సాధారణమై పోయింది.  హాస్యం పేరిట అసభ్యపు మాటలు వాడటం. ద్వందార్ధపు డైలాగ్ లు  మాట్లాడటం.. అమ్మో..ఏం సంస్కృతి? ..పిల్లలు నేర్చుకుంటున్నది ఇదా?అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి..అదే..నేర్చుకుంటున్నారు అని నిర్ధారించు కుంటున్నాం కూడా.  

అసలు పిల్లలు అలాటివి మాట్లాడటం  వింటే.. వెంటనే పెద్దవాళ్ళు ఖండించడం మొదలు పెడితే.. పిల్లల్లో..మార్పు వస్తుంది. అలా కాకుండా.. పెద్ద వాళ్ళు పిల్లలు ముద్దుగా "నీ అమ్మ నీ అక్క "అనరా..అని నేర్పిస్తుంటే..కడుపు మండిపోయింది.  మా పెదనాన్న వరుస అయ్యే ఒకాయన అలా మా అబ్బాయికి నేర్పిస్తుంటే.. మొహమాటం లేకుండా  ..పోట్లాడాను. అలా నేర్ప వద్దని. 

ఎవరైనా.. అసభ్యంగా మాట్లాడితే.. అది..నోరా-తాటి మట్టా? అని అనుకుని ఆ మాటలు వినబడనంత దూరం వెళ్ళడం  తప్ప ఖండిస్తే.. ఇంకా..ఎక్కువ తిట్టించుకోవడం ఆడవారికి..శాపం.

  ఒక  యదార్ధ కధ..లో.. ఒక కుటుంబం. తండ్రి ..ఓ..బ్యాంకు  ఉద్యోగి. పని వేళ లలో అక్కడ ఎలా ఉంటారో..తెలియదు కానీ..ఇంట్లో.అడుగు పెడితే..భార్యని అసభ్య పదజాలం తో..తిట్టడం.. చేస్తూ..ఉండేవాడు. ఇద్దరు ఆడపిల్లలు..బంధువు ఎవరు  ఆ ఇంటి గుమ్మం తొక్కినట్లు ఎవరు చూసి ఉండరు.ప్రభుత్వ  ఉద్యోగం,ఆస్తిపాస్తులు,అందం చందం అన్ని..ఉన్నాయి అనుకుని ఆమె తల్లిదండ్రులు.. సమాన స్థాయి ఉద్యగం చేస్తున్న ఆమెని ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమెకి..రోజు అసభ్య పదజాలంతో..తిట్టి..చిత్ర హిమసకి..గురిచేసేవాడు. అలా..తిట్లు తింటున్న  ఆమెబాహ్య ప్రపంచం చూడలేక ఉద్యోగానికి..రాజీనామా చేసి..ఇంట్లో ఉండిపోయింది. భరించలేక   పెద్దలకి చెబితే..అదసలు పెద్ద విషయమే కానట్లు  వదిలేస్తే.. ౨౦ సంవత్సరాలు మౌనంగా భరించింది. ఆ నోటి దాడికి.. పిల్లలు కూడా బలి అవుతుంటే.. భరించలేక ఆమె నిస్సహాయంగా  ఏడవటం.. చేసేది. అఖరికి  పిల్లలు ఇద్దరు ఎదురు తిరిగి.. ప్రశ్నిచడం  నచ్చని తండ్రి.. విపరీతంగా..చేయిజేసుకోవడం జరిగితే.. ఆ పిల్లలు పోలిస్ స్టేషన్ కి..వెళ్లి..పిర్యాదు చేసారు.ఆ ఇంట్లో నుండి తల్లిని కూడా తీసుకుని వెళ్లి వేరే ఇంట్లో..ఉండి.. కోర్ట్ ద్వారా విడాకులు తెప్పించారు. వాళ్ళు  కోర్ట్ లో..చూపిన బలమైన సాక్ష్యం .. రెండు గంటలు సేపు.. ఆ తండ్రి ఇద్దరు ఆడపిల్లలని,తల్లిని చెప్పనలవికాని భాషతో.దూషిస్తూ..కొడుతూ..ఉన్న దృశ్యాలని..వీడియో చిత్రం లో.. చిత్రీకరించి ఉన్నది  చూపారు. జడ్జి కూడా ఆశ్చర్య పోయి..అసహ్యించుకుని..వెంటనే..తల్లికి విడాకులు ,పిల్లలకి ,ఆమెకి భరణం..ఇచ్చేటట్లు..తీర్పునిచ్చారు. 

ఇలా చాలా  మంది స్త్రీలు  మౌనంగా.. దూషణ ని   భరిస్తూ..ఉంటారు. అలాగే ఆడవారు నోరుని ఆయుధంగా మార్చుకుని.. తిట్టడం,పోట్లాడటం చూస్తాము. మనిషిని మానసికంగా..కృశింప జేయడానికి అసభ్య పదజాలం తో దూషణ ఒక వెపన్. "తిట్టు ఒక బాష కాదు. అది గర్వంగా నేర్చుకొనడానికి." అని నేను తిట్టే వారికి చెప్పాలనుకుంటాను.  కొన్ని ఇంగ్లీష్  తిట్లు.. షిట్  అంటారు..బుల్ షిట్ అంటారు డాగ్ షిట్ .. ఇంకా ఏవేవో..
 "నో స్మోకింగ్  ఏరియా" లాగా.. అన్ని చోట్లా...


ఇలా హెచ్చరికలు పెట్టాలి. 

దూషణం ఒక భూషణం కాకూడదు. పిల్లలు తెలియక నేర్చుకుంటే పెద్దలు ఖండించాలి. పెద్దలు తిడుతుంటే.. వారికి   తరగతులు నిర్వహించి..ఆ నోటి దురదని తగ్గించే ప్రయత్నం చేయాలి.  మీడియా.. ముఖ్యంగా.. పిల్లలపై ప్రభావం చూపే  హాస్యం పేరిట చౌకబారు మాటలు.. పాటలు..ద్వందార్ధ మాటలు,సంజ్ఞలు.. చూపించకుండా.. సామాజికపరమైన భాద్యత గుర్తెరిగి చిత్రాలు నిర్మించాలి.అప్పుడే..ఈ..విష సంస్కృతి.. మన మద్య నుండి తరమడం సులభం. ఇతరులని నొప్పించే అజ్ఞాత వ్రాతలు,ఆకాశ రామన్న ఉత్తరాలు.. ఇలాటివి కూడా.. అసందర్భ,అసభ్య   ప్రేలాపనలే!మన్నన,మర్యాద సంస్కార లక్షణం. అది భావితరాలకి మనమిచ్చే గొప్ప ఆస్తి కూడా... అసభ్య పదజాలం వాడటం ఒక ప్యాషన్ కాదు. అలా మాట్లాడే వారిని ఖండించండి.. ప్లీజ్!!!

15, జూన్ 2011, బుధవారం

లిఫ్ట్..ఇవ్వాలంటే భయం


నాకు ఈ..మద్య ఒక భయం పట్టుకుంది. ..లిఫ్ట్..ఇవ్వాలంటే భయం!తీసుకోవాలంటే భయం.? ఏం చేద్దాం? పరిస్థితులు అలా ఉన్నాయి. 

మొన్నటికి మొన్న మా "అత్తమ్మని" ..ఒక కుర్రాడి  బండిపై..కూర్చుని ప్రయాణించి రావమ్మా..అంటే.. నడచయినా వస్తాను కానీ.. ఎవరో..అబ్బాయితో  ..కలసి రావడమే.? కుదరదు కాక కుదరదు అంటే.. చేతిలో పని ప్రక్కన పడేసి నేనే వెళ్ళాల్సి వచ్చింది..మనుమడి వయసున్న ఆ అబ్బాయితో..ప్రయాణించాల్సి రావడానికే .. ఒప్పుకోని   ఆమె.. ఒకవేళ నేనలా రావాల్సి వస్తే.. ఆమోదిస్త్హారా?..నాలో..ఓ..సందేహం జనియించింది.. 

నాదంతా.. ముక్కుసూటిదనం. అప్పటికప్పుడే..అడిగేశాను.. వెంటనే..ఆమె.. అలా..బాగోదు..అన్నారు.." ఏం" అన్నాను.. "అది అంతే.." మన కుటుంబాలలో.. అలా లేదు. అన్నారు.. అలా లేనివి  మన కుటుంబాలలో  చాలా..వచ్చాయి.. అందామనుకుని.. నోరు నోక్కేసుకుని.. ఇదిగో..ఇక్కడ కక్కేస్తున్నాను. ..

ఒకోసారి.. అత్యవసర   సమయాలలో, సందర్భాల్లో కూడా .. స్రీలు..  లిఫ్ట్  అడిగి తీసుకోవడం అదేదో.పెద్ద తప్పులా భావిస్తారు.. కారణం మన సమాజంలో.. భార్య -భర్త ..లేదా..సమీప బంధువుల తోడి మాత్రమే..వాహనంలో..కలసి ప్రయాణించడం అలవాటుగా..ఉంది. 

మన మద్య కి ఎన్నో కొత్త అలవాట్లు  పుట్టగొడుగుల్లా  ..పుట్టుకొచ్చాయి .వాటికి..మొదట్లో..మనమేమన్నా.. రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికామా..ఏమిటి? ఎంత మందో..వాచలకుల  నోళ్ళల్లో పడి..నాని నాని.. చిరిగి పీలికలై..పిపీలికమై.పోయి.. ఇంకొక క్రొత్తది వచ్చాక కానీ.. ఆ..విషయం మరుగున పడేది.. కాలం మారింది మారక చస్తామా? అనుకునే.. సందర్భాలు వేరు వేరుగా..ఉంటాయి కొన్నిటికి..మినహాయింపు..ఉంటాయి.. వాటికి ఉదహరణ గమనించండి.

ఒక.యువకుడు.. తన భార్య ఫేంట్-షర్ట్ వేసుకుంటే.. ఆమోధించినంత  తేలికగా  ఆమె.. వేరొకరి టూవీలర్ పైనో.. వెహికల్ పైనో..(పురుషుడి) లిఫ్ట్ అడిగి..ఇంటికి వస్తే.. అభ్యంతరం  చెబుతారు.  చెప్ప లేదు అనుకుంటే.. మనం చాలా నాగరికులమైపోయామని అర్ధం.

ఈ..పోస్ట్ ఉద్దేశ్యం ఏమిటంటే.. స్త్రీలు లిఫ్ట్ ఇవ్వడమో..లేదా తీసుకోవడం లో..అభ్యంతరములు ఉన్నాయా..? ఉంటె.. అవి ఎవరికి.. ఎందుకు.. అని.. అడగాలి అనిపించింది.. ఇక్కడ వ్రాయాలి అనిపించింది. 

ఈ..కాలపు అమ్మాయిలకి..ఉద్యోగినులకి.. అందరికి.. ప్రత్యేకించి వాహనం ఉండటం తప్పని సరి  అయింది. ఒక వేళ వాహనం   లేకున్నా.. ఇంటికొక టూ వీలర్ ఉండనే ఉంటుంది.. ఒక వేళ అలా లేకున్నా.. బస్ ప్రయాణం అయినా తప్పదు కదా.. ! మహిళలు  ..ఏదయినా పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడో.. చదువుల కొరకు కళాశాలలకి  ..వెళ్ళినప్పుడో.. సడన్గా.. ఏ..వానో రావచ్చ్గు.. బస్సు చెడిపోనో  వచ్చు.. ట్రాఫిక్  జామ్ లో చిక్కుకోనో వచ్చు.  అనారోగ్యం తో.. హాస్పిటల్కి.. వెళ్ళవలసి  రావచ్చు.పరీక్ష కి టైం  సమీపిస్తుండవచ్చు.. అలాటి  సమయాలలో..  వేరొకరి   వాహనం పై వెళ్ళడానికి.. సంకోచిస్తూ ..ఉంటారు.. వెళ్ళవలసిన పని ఎంత అత్యవసరం అయినప్పటికీ...ఎలాగో..తంటాలు  పడి  చెమటలు క్రక్కుకుంటూ..నడచి.. లేదా..ఆటో లు పట్టుకుని.. సమయానికి.. చేరలేక అవస్థలు పడుతుంటారు. అదే పురుషుడు అయితే.. నిరభ్యంతరంగా  వెళ్లిపోతు ఉంటారు. 

ఆడ పుట్టుక పుట్టినందుకు ఎన్ని ఇబ్బందులు. 

" ఆలస్యం అయినా..నడిచి అయినా రా.. ఎవరనా లిఫ్ట్  ఇస్తానన్న తీసుకోకు.."అని అమ్మాయిలని.. అమ్మలు హెచ్చరిచడం మామూలే!."నాకైతే..అభ్యంతరం ఏం లేదు..కానీ.. చూసేవాళ్ళని దృష్టిలో..ఉంచుకోవాలి కదా.." అని ఓ..భర్తా.., "ఎవరి బండి పడితే..వాళ్ళ బండి ఎక్కి..రావడమేనా.. హద్దు-అదుపు లేకుండా" అనే..ఓ.. బామ్మ.. "ఎవరతను.. మీరు అతనితో కలసి వచ్చారు?" అని ఇరుగు-పొరుగు ఆరాలు.. ఇన్నిటికి సమాధానం ..ఓ..ప్రయాణికురాలు .ఓ..ప్రయాణికుడి సాయం అందుకుని.. కలసి ప్రయాణం చేసినందువల్ల ఉత్పన్నమయ్యే ప్రశ్నలు.. జాగ్రత్తలు,హెచ్చరికలు.

 ముఖ్యంగా.. స్త్రీలకి..ఒక అపరిచిత వ్యక్తి తోనో..లేదా..కొద్దిపాటి పరిచయం వ్యక్తితోనో.. కలసి.. ప్రయాణించాల్సి రావడం అనేది.. చాలా ఇబ్బందికరమని .. అప్పటికప్పుడు  ఏర్పడిన అవసరం  దృష్ట్యా  అనిపించదు  . కానీ.. చూసే వారి దృష్టిలో..అది.. నేరం. అది బరితెగించిన తనం.. మనలో.. చాలా మందికి.. మనవాళ్ళు కాని  వ్యక్తులతో..ప్రయాణించి రావడం అనేది.. చాలా సందర్ఫ్హాలలో  తప్పు.   ఎందుకంటే శరీరాలు తగిలి అపవిత్రం అయిపోతాయన్న భావన. కావచ్చు..లేదా.. ప్రమాదాలు ముంచుకొస్తాయని కావచ్చు.  

విదేశాలలో అయితే.. అవసర పడినప్పుడు   నిస్సంకోచంగా.. లిఫ్ట్ అడిగి తీసుకుని..ప్రయాణించడం కద్దు. మన  భారతీయ  సంస్కృతిలో  అలా ప్రయాణించడం అనేది అరుదు. మన స్త్రీల గౌరవం, శీలం (?) అనే వాటికి అత్యంత విలువ నివ్వడం మూలంగా  ..నేమో..ఇంకా. ఈ..ప్రయాణం కి..అభ్యంతరాలు అనుకుంటాను.   ఇక ఇలాటి ప్రయాణాలలో..ప్రమాదాలు పొంచి ఉంటాయనే  భయం కావచ్చు..

 ఏది ఏమైనా.. మనిషి పై..ఎదుట మనుషులకి.. నమ్మకం సన్నగిల్లి పోతుంది.. మా కాలనీ..లోపలకి ..నేను వెళుతూ.. ఒక కిలోమీటర్ చూరాన్ని బోలెడంత .. బరువులతో.. నడవలేక నడుచుకుంటూ..వెళ్ళే వారి  వద్ద ఆగి.. లోపలకి..వెళుతున్నాను..రండి.. అన్నా కానీ..అనుమానంగా..నా వంక చూస్తారు.. వివరంగా  .. నేను ఎవరో..చెప్పి..పర్లేదు..రండి అని..అన్నాక కానీ..వాళ్లకి..నమ్మకం కుదరదు..ఇవన్నీ..నీకు అవసరమా.. ?అన్న చీవాట్లు పడినా నేను ఊరుకోను..అదో..తృప్తి..  మనిషి అన్నాక అవసరపడినప్పుడు.. లేదా..ఎదుటి వారి అవసరం కళ్ళకి కనబడినప్పుడు..తనవంతు సాయం చేయడం అన్నది.. ఒక సంస్కారం.. అని నాకు..నేర్పిన  సంస్కారం. 

 అలాగే.. పరాయి పురుషుల వెంబడి.. ప్రయాణం చేసినంత మాత్రాన తప్పు కాదు.. అలా అని ఎల్లప్పుడు..అలా ప్రయాణం చేయడం మంచిది కాదు.. ఎవరికి వారు విజ్ఞతతో.. నడచుకోవాల్సిన..తీసుకోవాల్సిన నిర్ణయాలు  ఇవి. అవసరం అయినప్పుడు.. లిఫ్ట్ తీసుకోవడం తప్పని.. లేటు  గా   వెళితే.. మా బాస్.. మెమో..ఇస్తాడు..  దానికన్నా..ఇది నయం కదా..అంటుంది..ఒకామె.. అందుకే  ఎవరి ప్రయారిటీ.. ఏమిటనేది..వాళ్ళ అవసరం బట్టి  .ఉంటుంది .అని  అంటాను.

అర్ధరాత్రి  వర్షంలో తను వెళ్ళే రూట్ కాకపోయినా    ..20 కిలోమీటర్లు..ప్రయాణించి..వచ్చి.. ..  తనకి..జాగ్రత్తగా లిఫ్ట్ ఇచ్చినవారికి.. కనీసం  వాళ్ళ ఆయన చూస్తున్నాడు అన్న భయంతో థాంక్స్ కూడ..చెప్పలేక పోయిన నా స్నేహితురాలు..  అదే అంశం తో..ఒక కధ రాసి బహుమతి  పొందింది..  ఒక అమ్మాయి సమయానికి.. పరీక్షా స్థలంకి..వెళ్ళ లేనేమో  ..నన్న భయం తో.. ప్రక్కింటి అంకుల్ తో..కలసి.. వెళ్లి. చేదు అనుభవం ఎదుర్కున్నవాస్తవం తెలుసు..  ఏ విషయమైనా..మదిలో..దాచుకునే కంటే  మందిలో..పెడితే..ఇంకో నల్గురి అభిప్రాయాలు..తెలుస్తాయి అని నా ఆశ. లేశ మాత్రం ఆలోచించకుండా..వ్రాసిన ఈ..టపా.  మీ అభిప్రాయానికి ..ఆహ్వానం. 

14, జూన్ 2011, మంగళవారం

అమ్మాయిలకి ..లభించిన స్వేచ్చ

భూమిక జూన్ నెల మాస పత్రికలో "పుష్పాంజలి" గారి వ్యాసం చూసాక ఈ పోస్ట్ వ్రాయాలనిపించింది. ఆ వ్యాసం పేరు.." ఆడ పిల్లా!నీ అడుగులు ఎటు వైపు.." ఆ వ్యాసం లో పుష్పాంజలి గారు ఉదహరించని..మరొక కోణం నేను.. ఇక్కడ చెపుతున్నాను.

ఈ తరం ఆడపిల్లల్లో.. చాలా విషయాలలో.. ముందంజ లో..ఉన్నారు. వాళ్ళ దృష్టిలో.. అభివృద్ధి సాధించడం అంటే.. బాగా..చదువుకోవడం..ఉద్యోగం చేయడం అన్ని రంగాలలో..పురుషులతో..సమానం గా ఉండ గలగటం అనుకుంటున్నారు.

ఆ ఆలోచనలు..పెడదారి బట్టి బుద్ధి వక్రీకరించి.. లభించిన స్వేచ్చతో.. చాలా.. విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక స్వేచ్చ ఉండటమే.. స్త్రీ వాదం, అదే అభివృద్ధి పధం అని.. అనుకుంటున్నారు.

ఇలాటి ఆలోచనా ధోరణి వల్ల.. స్త్రీ జాతి మొత్తం కి.. తమ వ్యక్తిత్వ నిరూపణే ప్రమాదంలో.. పడుతుందని గుర్తించ లేకపొతున్నారు. ఇప్పటికే అబలలు అన్న ముద్రణ.

సబలలగా.. అస్తిత్వ నిరూపణ కే.. బలం సమకూరుచుకోవడానికి.. కొంత మంది.. పెమినిజం అనే వాదంతో.. ఎన్ని విమర్శలు ఎదుర్కుని అయినా చాలా..కాలంగా.. పురుష అహంకారం పై.. యుద్ధం చేస్తున్నారు.

బలహీనుల తరపున, అన్యాయానికి .గురి అయిన వారి తరపున, సామాజిక అన్యాయం జరిగిన చోటన ..మొక్కవోని దీక్షతో పోరాటం చేసి హక్కులని సాధించుకునే దశలో ముందుకు..సాగుతున్నారు. వారికి.. మిగతావారు.. మద్దతు ఇచ్చి.. చేయి+గొంతు.. కలపాల్సి ఉండగా స్త్రీల విలువలని.. దిగజార్చుకుంటూ.. పురుష విమర్శకు.. గురి అవుతున్నారు. ఫెమినిజం హేళనకి ..గురి అయ్యేటట్లు..ఇతోధికంగా.. కృషి చేస్తున్నారు.

అలా నడచుకోవద్దని హితవు పలుకుతూ.. నా..ఈ..టపా.

పెమినిజం అంటే.. మనలో ఉన్న లోపాలని గుప్తంగా.. దాచి ఉంచి మనకి..జరిగిన అన్యాయాలని ప్రశ్నిస్తూ.. వీధికెక్కడం మాత్రమే కాదని స్త్రీలలో స్త్రీ అనే ముసుగులో సభ్యసమాజం నివ్వేరబోయే పోయే పనులు చేస్తున్న కొంత మందిని దృష్టిలో..ఉంచుకునే ఈ.. కధనం వ్రాస్తున్నాను.

దయ చేసి.. నేను.. పురుష సానుభూతి పరురాలని కాదు.. స్త్రీలకి .. వ్యతిరేకిని..కాదు. కొంత మంది స్త్రీల నడవడిక.. వల్ల స్త్రీ జాతి మొత్తం విమర్శలకి.. గురి అవుతున్నదని..ఆవేదన తో.. వ్రాస్తున్నాను.

ఒకసారి.. మా విజయవాడలో..జరిగిన ఓ కార్యక్రమం గురించి ఈ..మాట.

నేడు... "స్త్రీల పై..జరుగుతున్న అన్యాయాలు పట్ల స్పందన - వారికి.. అవగాహన కల్గించడం ఎలా.?" అనే అంశం.. పై..చర్చా కార్యక్తమం జరిగింది. ఆ చర్చలో..నేను పాల్గొన్నాను. పురుషులు హాజరైన ఆ సభలో.. స్త్రీల వాఖ్యల పట్ల . అభ్యంతరాలు వ్యక్తమైనవి. . అబ్బాయిలు మోసం చేసారని నిందించే ముందు అమ్మాయిలూ మోసాలు చేయడానికి రెడీగా ఉంటారు అని వాదన మొదలయింది .

మాతో..చర్చలో..పాల్గొన్న ఆమె ఒకరు..వీరావేశంలో.. అలా మోసం చేయడానికి..పాల్బడ్డ ఒక అమ్మాయిని అయినా చూపండి. మేము ఇలాటి సభలే..నిర్వహించం అని చాలెంజ్ చేసారు. ఆమె.. తొందరపాటుకు మిగతా మేమందరం తల పట్టుకున్నాం.

నాలుగైదేళ్ళ నుండి ఒక అమ్మాయి.. విజయవాడ పట్టణం లో ఉన్న అన్ని ఎఫ్.ఎమ్ స్టేషన్ లకి.. కాల్ చేసి లైవ్ లో.. మాట్లాడుతూ..ఉంటుంది.. ఆ.. అమ్మాయికి.. చాలా మంది.. పురుష కాలర్స్ తో..స్నేహం ఉంది.. వాళ్ళందరికీ హాయ్..హలో.. చెపుతుంటుంది. డిగ్రీ వరకు..చదివి.. లేడిస్ హాస్టల్ లో ఉండి జాబు చేసుకుంటుంది.. ఆ అమ్మాయి ఒకరికి తెలియకుండా మరొకరికి... రెచ్చగొట్టే విధంగా.. ప్రేమ పూర్వక ఎస్.ఎమ్.ఎస్..లు..పంపడం..సినిమాలకి, ఔటింగ్ కి..వెళదామని ప్రపోస్ చేయడం ఇలా నలుగురైదుగురి వద్ద ఒకే అమ్మాయి పంపిన ఎస్.ఎమ్.ఎస్..లు.. చూపించారు.. వాళ్ళందరు.. ఆ..మెసేజెస్ ..ని ..జాగ్రత్తగా.. దాచుకున్నారు. వారిలో కొంత మందికి ఆ అమ్మాయితో..అత్యంత సన్నిహిత సంబంధాలు..ఉండవచ్చు కూడా.. కానీ అందరూ ఆ అమ్మాయి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందని అతి జాగ్రత్తతో ఆ అమ్మాయి నంబర్, మెసేజెస్ ని..కూడగట్టుకుని దాచి ఉంచారు.

భవిష్యత్ లో.. ఆ అమ్మాయి అతి ప్రవర్తన వల్ల.. వారికి కూడా.. ఏమైనా.. ప్రమాదం రావచ్చన్న భయం.
ఇలా రుజువులు అవన్నీ..చూపించి..ఒక అమ్మాయి..ఇలా నలుగురైదుగురితో.. ప్రవర్తించ వచ్చా? అదే ఆ అమ్మాయి పై..ఏదైనా.. అఘాయిత్యం జరిగితే స్త్రీ ల పై అన్యాయాలు జరుగుతున్నాయని..పురుషులపై దండెత్తరా!? అని అడిగారు.. అంతా.. మౌనం. "బియ్యపు గింజల్లో పలుకు రాయి" నా దగ్గర సమాధానం లేదు.. పురుషులు అందరూ.. మృగాలు కాదు.స్త్రీలు అందరూ..అమాయుకులు కాదు. అమ్మాయిలు కూడా లభించిన స్వేచ్చని..దుర్వినియోగం చేసుకోకుండా.. ఆలోచనతో,వివేకం తో..మెలుగుతూ..శక్తివంతంగా..తయారు కావాలనే నా..ఆశ.

స్త్రీ-పురుష సమానత్వం అంటే..స్వేచ్చతో.. పురుషుడిలా.. ప్రవర్తించమని కాదు. పోటీ పడటం అంటే..దిగ జారి పోవడమా ? మంచి కై పోటీ పడండీ!! అమ్మాయిలూ,స్త్రీలు.. ఆలోచించండి..!! లవ్ గేమ్స్ ఆపండి.. మీ సరదాలకి, మీ..టైం పాస్ ప్రేమలకి,మగ పిల్లలతో ..ఆడుకుని..వదిలేయకండి. అందు వల్ల..ఆడ వాళ్ళ అందరి పై..వ్యతిరేక భావనలు.. మొదలై.. విశ్వసనీయత కోల్పోతున్నారు... అన్యాయాలు జరినప్పుడు వెక్కిరింతలకి..గురి అవుతున్నారు. మిగతా అందరిని.. చులకన గా గేలి చేస్తూ అవమానంకి గురి చేస్తున్నారు.. అందుకే.. నా..ఈ.. అస్త్రం...

అమ్మాయిలకి ..లభించిన స్వేచ్చ దుర్వినియోగం !?

13, జూన్ 2011, సోమవారం

నవ్వినా - ఏడ్చినా..కన్నీళ్ళే ఎందుకు వస్తాయి.!?.

నాకు ఒక సందేహం వస్తుంది..అనుకున్నానో లేదో..!? ..  పదే పదే..ఇదే మాట అంటూ..ఉంటావు? అసలు.. సందేహాలు వచ్చే వయసా..నీది.. సందేహాలు తీర్చే వయసు  అయితే.. అని.. అంతరంగం చీవాట్లు..పెడుతుంది.. ఆలోచనలు..ఒకటే కుమ్మరి పురుగులా..తోలిచేస్తుంటే.. సందేహాలు.. నడిరేతిరి..కీచురాళ్ళ ల.. రోదపెడుతుంటే.. నిద్ర తక్కువైపోయి.. మెదడు చురుకు కోల్పోయి.. సర్వీసింగ్ చేయించుకోమని.. హెచ్చరికలు చేస్తుంది.నా బండి సర్వీసింగ్ చేయించుకునే తీరికలేదు.. ఇంకా మెదడుకి ఎక్కడ సర్వీసింగ్ ? అనుకుంటున్నాను  .  

ఈ..ఉపోద్ఘాతం ఎందుకంటే.. లౌకిక  విషయాలపట్ల  ఆసక్తి తగ్గిపోతుంది.. అలా అని ఆద్యాత్మిక విషయాల పట్ల ఆనురక్తో..  లేదా.. వైరాగ్యమో..  రాలేదులెండి.  మా అబ్బాయి .. తను విదేశీ  విద్యకి వెళుతూ..  నా..చేతికి.. ఈ..చిట్టెలుక..ని. అంటించి వెళుతూ.. "అమ్మా!..ఇక నీ ఇష్టం ..పోయెట్రి డాట్ కమ్..చూస్తావో.. నీకిష్టమైన పాటలే ప్లే చేసుకుని.. వింటావో..చూస్తావో.. నీ ఇష్టం..నేర్చుకున్న వాళ్ల్లకి..నేర్చుకున్నంత.. ప్రపంచమే.. నట్టింట్లో..అని..ఈ..గిఫ్ట్.. ఇచ్చి..వెళ్ళిన తర్వాత  నన్ను పుస్తక పటనానికి..ఆఖరికి.. న్యూస్ పేపర్ చదవకుండా కూడా .. చుట్టూ పక్కల  మనుషులకి... కూడా దూరం చేసింది... ఈ నెట్ ప్రపంచం. 

 అయినా.. ఇక్కడ నేను చలనం లేకుండా ఉండనా!?   అబ్బా.. అదేం కాదు..  శోధించి శోధించి..ఎన్నో విషయాలని విశేషాలని సాధించానా!? ..అని కాదు ప్రశ్న. అప్పుడు  ఇప్పుడు ఏం ఆనందం కలుగలేదు..మిగలలేదు..అనే కన్నా .. ఈ..రోజు..నాకు కల్గినది..ఆనందమో.. దుఖమో..!? ఏమి తెలియలేదు..  దాదాపు ఒక నెల రోజుల తర్వాత..

మా  బంగారుకొండని.. (కుడి ప్రక్క పిక్ లో..ఉన్న నిఖిల్ చంద్ర ) ని .. వీడియో కాల్ లో.. చూసి.. ఏడ్చాను.. సంతోషమో.. దుఖమో.. తెలియదు.. ఇప్పటికి.. ధారా పాతంగా కారుతున్న కన్నీరుతో..   కానీ.. ఒక సందేహం ..ముంచుకొచ్చింది.. నవ్వినా -ఏడ్చినా..కన్నీళ్ళే ఎందుకు వస్తాయి..అని..   ఎవరైనా  చెప్పండి   ప్లీజ్!!


11, జూన్ 2011, శనివారం

మొబైల్ చాటింగ్

మన భారతీయ వివాహ వ్యవస్థ  అంతా ..డొల్లతనం. పాశ్యాత్యదేశాలు గర్వించ దగినంత  గొప్పగా  ఇప్పుడు లేవంటే.. ఇప్పుడు..ఈ పోస్ట్ ఇలా వ్రాసిననందుకు..నా పై.. విమర్శల వర్షం  కురుస్తుందేమో! 40 % మాత్రమే.. వివాహాన్ని గౌరవించి.. బంధాలకి..విలువ ఇచ్చి.. సర్దుబాటు ధోరణితో జీవిస్తున్నారు.
  
వివాహ విచ్చిన్నతకి.. అనేకానేక కారణాలు.ఆడవారు గళం విప్పి ప్రశించడం తెలియని ఆ కాలంలో.. ఒక వేళ తెలిసి ప్రశ్నించినా.. ఆ మాటకి.. విలువలేని.. కాలమున..." మేడిపండు చూడు మేలిమై ఉండు".. లాగా.. అలా.. జీవితాలు తెల్లరిపోయాయి. ఆడ-మగ ఇప్పుడు.. సమాన స్థాయిలో.. కత్తులు నూరుకుంటున్నారు.

అణచివేత తనాన్ని సహించలేని స్త్రీలు.. ఒంటరి  జీవితాల పోరాటంలో.. సమస్యల నెదుర్కుంటూ.. పెనం పై నుండి పొయ్యిలో..పడినట్లు..భావన అయితే కాదు కానీ.. వారు ఆశించిన రీతిలో.. జీవనం సాగించలేకపోవడం.. లో..చాలా అసంతృప్తి ఉంది... వేరొక పురుషుడి తో  కలసి మనుగడ సాగించడానికి.. అనేక అభ్యంతరాలు .. ఉంటున్నాయి. అదే పురుషులకి..కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. వాళ్ళు అరవై ఏళ్ళ వయసులో కూడా.. పెళ్లి కొడుకులయ్యే అనుకూల పరిస్థితులు..ఈ.. సమాజంలో.. ఒక వరం  అందుకే.. మగవాళ్ళు..తప్పులు చేసినా.. మగమహారాజు.. అయ్యాడు.. స్త్రీ దగా పడినది.. అవుతున్నదని.. ఓ.. మహిళా సంఘ సంస్కర్త .. ఓ..సభలో.. గొంతు చించుకుని.. చెబుతుంటే.. విని నవ్వుకుంటున్న పురుషులని చూసి.. ఈ..టపా వ్రాయాలనిపించింది  .     

మన వివాహ వ్యవస్థ చాల  గొప్పది.. ఎన్ని.. తుపానులు వచ్చినా.. పెను గాలులు వీచినా, వడగళ్ళు పడ్డా.. చలించని..గొప్పది..అనుకోవడం అంటే.. ముమ్మాటికి మోసం చేసుకున్నట్లే!.. చిన్నపాటి గాలికే ఆకు  రాలినట్లు రాలిపోతున్నాయి. సంప్రదాయం,కుటుంబం,సంస్కారం,నమ్మకం వీటి ప్రాతిపదిక పై..వివాహాలు జరుగుతున్నాయా..ఏమిటి? అన్నీ చూసుకునే ఆలోచించి తీసుకునే నిర్ణయాలవల్ల  జరిగిన వివాహాలు.. కూడా.. రెండు మూడేళ్ళు  సజావుగా సాగినట్లే  సాగి..విచ్చిన్నమవుతున్నాయి.

 అబ్బాయి కి.. బోర్ కొడుతున్దట. అమ్మాయికి.. అబ్బాయిలో.. అన్నీ లోపాలే కనబడుతున్నాయి.. వారి వాదనలో.. వెలుగు చూసే విషయం  ఏమంటే...జీవితంలో..ఎవరికి వారు.. గొప్ప అనే భావన.. అసలు..తగ్గ కూడదు.. ఒకరికొకరు గౌరవించుకోవాలి.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం అసలు.. నచ్చదు. సర్దుబాటులు అసలే కుదరదు. ఇవన్నీ సాద్యమా?  ఇంకొక ముఖ్య విషయం ఏమంటే..

వివాహ  వ్యవస్థని..పదిలం గా..కాపాడే అంతః సూత్రం ఎన్ని యుగాలు మారినా ఎన్ని మార్పులు వచ్చినా మారని ఒకే ఒక మంచి బాట. "ఒకే భార్య -ఒకే బాణం అన్న  రాముడుని..ఆదర్శంగా..చూడడం". ఇప్పటి కాలంకి..ఇది  అసలు నచ్చదు. భార్యాభర్తల మద్య ఆకర్షణ  తగ్గిపోయాక  దారి  మళ్లడం..చాలా సులభతరమైన రోజులివి.

ప్రక్కనే..పొంచి కూర్చుని ఉన్నట్లు..భార్యాభర్తల మద్య  మూడోమనిషి.. ఎపుడైనా ఎంటర్ అవ్వచ్చు.  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం  పుణ్యమా అని.. నట్టింట్లో..కూర్చుని నట్టడివిలో.. కూర్చుని కూడా ముచ్చట్లు..ఆడవచ్చు. మొబైల్ పుణ్యమా అని.. ఎన్ని కాపురాలు..కూలిపోతున్నాయో! పస్త్రేషన్ తో.. కూసింత మార్పు కనబడగానే.. అదే జీవితానికి..కావాల్సిన మార్పు అనుకుని తప్పుడు నిర్ణయాలతో.. జీవితాలని..నాశనం చేసుకుంటున్నారు కూడా.. నిజం తెలిసే అప్పటికి అంతా ముగిసిపోతుంది.. అప్పుడు ఎంత వగచినా ఏం ప్రయోజనం ?

 ఒక మొబైల్ చాటింగ్ వల్ల ఒక ఆత్మ హత్య ..ఇద్దరు పసి పిల్లలు తల్లిని కోల్పవడం ..జరిగింది  కానీ ఒక పురుషుడికి.. రెండు నెలలకే ఇంకొక భార్య వచ్చిన కథ ఇది.

నేను..  మరి కొంత మంది ఇరుగు-పొరుగు ప్రతి రోజు.. సాయంత్రం వేళప్పుడు.. ఉబుసుపోక,మార్పు కోసం ఓ పావు  గంట సేపు మా గేటు ముందు  నిలబడి వొచ్చేపోయేవారిని చూస్తూ నిలబడి కబుర్లు చెప్పుకుంటూ  ఉంటాం. సాయంత్రం  వేళ కాబట్టి  ఎక్కువుగా.. ఇంటి ముఖం  పట్టిన ఉద్యోగినులు.. వెళుతూ ఉంటారు.  రోజు..ఒక 25 -30  మద్య వయసు  ఉన్నఒకామె.. మొబైల్ ఫోన్ లో..మాట్లాడుకుంటూ..వెళుతుంటుంది.ఒకోసారి మనుషులు లేని చోట ఆగి నిలబడి మాట్లాడుతుంటుంది.. కొన్ని నెలల్లో  ఆదివారం మినహాయించి..రోజు అదే దృశ్యం మాకు అలవాటైపోయింది. ఆమె భర్త కూడా ఉద్యోగి.. ఆమె ఇద్దరు  పిల్ల తల్లి. ఈమెకి  ..ఇంత సంస్కార  లోపం ఏమిటి? ఫ్త్రెండ్స్ ఉండటం వాళ్ళతో..మాట్లాడటం తప్పు కాదు.. ఇంట్లో మాట్లాడలేని విషయాలు.. రోడ్డులో.. వెళుతూ కూడా ప్రతి రోజు ఏమి ఉంటాయి..?  సం థింగ్ ..రాంగ్..  అనుకునేదాన్ని.

 కొన్నాళ్ళకి..సడన్గా  ఆమె ఇంటినుండి చెప్పా పెట్టకుండా మాయమైనది.. భర్త ,పిల్లలు ఆమె కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.. అలా ఒక వారం గడిచేటప్పటికి.. కొన్ని విషయాలు బయట పడ్డాయి.. తన కొలీగ్ తో.. కలసి.. ఆమె..వెళ్ళిందని..  ఆమె కొలీగ్   కి..భార్య ఉంది..ఒక పాప కూడా ఉంది. ఇద్దరు భాద్యత గల  వేరు వేరు ఒక తల్లి- ఒక తండ్రి .వారి భాగ స్వామ్యులు. కుటుంబాలు.. ఇవేమీ కానరావు.. శరీరాల పట్ల ఆకర్షణతో.. జీవిత భాస్వామ్యులని..మోసం చేస్తూ.. ఎక్కువ కాలం  ఆ అక్రమ సంబంధాలు  కొనసాగించడం వీలుకాక వారి ఆనందం వారు వెదుక్కుంటూ.. వెళ్ళిపోయారు. ..ఆమె భర్త అది చిన్నతనంగా  భావించి.. బిడ్డలని.. ఆమె తల్లి దండ్రుల వద్ద వదిలేసి  .. రెండు  నెలలకే.. మరో..అనధికార  వివాహం చేసుకున్నాడు.. ఆమె కొలీగ్ ప్రియుడు   ఒక ఐదు ఆరు నెలలకి.. భార్యని వెదుక్కుంటూనో.. బలవంతంగా బంధువులు  లాక్కుని వెళితేనో.. వెళ్ళిపోయాడు.  ఆమె ఒంటరి ది.. అయి.. సమాజంలో.. విలువ కోల్పోయి.. (?) ఆత్మ హత్య చేసుకుని మరణించింది.  ఇక్కడ పురుషులు ఇద్దరు.. మళ్ళీ వివాహ జీవనంలో.. ఒదిగిపోయారు.. ఒక స్త్రీ.. భర్త  చేసిన చేష్టని..దిగమింగుకుని  .ఏమి  జరుగనట్లు..భర్త చుట్టూ..జీవితాన్ని చుట్టుకుని బ్రతికేస్తుంది.  పర పురుషుడి ఆకర్షణలో పడి.  అనీ కోల్పోయి.. మరణంని..ఆశ్రయించినది..స్త్రీనే   !

చదువుని ఉద్యోగాలు చేస్తున్నా విచక్షణ కోల్పోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న స్త్రీల సంఖ్యా తక్కువేంకాదు.. కానీ..పురుషులకొక నీతి స్త్రీలకి ఒక నీతి చలామణి అవుతున్న.. ఈ..భారతీయ వివాహ వ్యవస్థలో.. పిల్లలు..బలి పశువులు.

 మన మద్య ఇన్ని నిస్సంకోచంగా జరిగిపోతుంటే..ఇంకా.. వివాహ బంధం పవిత్రత అనుకొనడం ఏమిటీ ?  అవి చలం గారి రచనా కాలంలోనే..ఉన్నాయి.. మన భారతీయ సమాజం ఒప్పుకోదు కానీ.. .. అన్ని వర్గాల ప్రజలలో..  ఇప్పుడు పెళ్లి  అనే అందమైన ఒక వల లో.. ఇమడలేని..స్వేచ్చ  ప్రవృత్తి  కల   స్త్రీ పురుషుల   జీవన చిత్రాలలో.. మొబైల్  చాటింగ్ కుటుంబాలని విడదీసే  ఒక సాధనం. అసంతృప్తులని.. వెళ్ళ బోసుకుని  సాంత్వన చేకూర్చుకునే మంత్రజాలం.

దూరాలు తరిగిపోతున్నాయి..సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ప్రపంచమే.. ఓ..కుగ్రామం.  ఇక భారతీయ వివాహ వ్యవస్థకి.. ప్రత్యేకత ఏముంది.. నలుగురితో..నారాయణ.  పాశ్చాత్య  సంస్కృతి అని అనుకోవడం  ఇకపై..బాగుండదేమో..! అనుకుంటూ..నే...

 ఒక జంట..నూరేళ్ళ పంట.. పండించుకోవాలంటే..అవగాహన ,సర్దుబాటు,ప్రేమ ,భాద్యత ఇవన్నీముఖ్యం.

 ఏ దేశంకి చెందినవారయినా  ఇవన్నీ   ఉన్న స్త్రీ  పురుషుల మద్య.. వివాహబంధం..పవిత్రం. కులాల, మతాల,జాతుల కందని అనిర్వచనీయ అనుబంధం... అని నా.. నిశ్చితాభిప్రాయం.                      

10, జూన్ 2011, శుక్రవారం

ఋణం తీర్చుతరుణం వస్తేనాకు.. చాల..ఇష్టమైన పాట...కే.బాలచందర్ అపూర్వ  సృష్టి.. "రుద్రవీణ" చిత్రం...లో..పాట

ఒక మనిషిని..మార్చడానికి.. సంవత్సరాలు.. పట్టవు..ఒక..చిన్న సంఘటన చాలు..లేదా..ఓ..పాట ..ఓ..మాట చాలు.  

పిల్లలకి.. లోకం పోకడ తెలియని స్వచ్చమైన మనసు ఉన్నప్పుడు.. పడిన ముద్ర.. వారిని..జీవితంలో..చాలా ప్రభావాలకి..గురిచేస్తుంది. పిల్లల మనసు.. మనం నట్టింట్లో..కట్టే పాలవెల్లి.. అందులో.. మనం ఏం పెడతామో..అవే.. ఇంటికి వెచ్చిన నలుగురికి..కన్పిస్తాయి.  పిల్లల మనసులో..నాటుకున్న భావాలు అంతే..! 


రుద్రవీణ చిత్రం ప్రారంభమే..చాంధస  సంస్కృతి సంప్రదాయాల  పై  మానవత వాదం ఎక్కుపెట్టిన విల్లంబు.  "చుట్టుపక్కల చూడరా చిన్నవాడా.".అనే  పాట ద్వారానే.. బాలచందర్.. చిత్రం మొత్తం సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పేశారు.. "మానవ సేవే..మాధవసేవ " అన్నది మరచి.. సంప్రదాయం పేరిట మనుషులని..అంటరానివారిని చేసి.. కష్టాలు  ఎదురైనా స్పందించక గిరిగీసుకుని కూర్చుని.. చోద్యం చూసే కరకు గుండెల కసాయి తనం.. మారక తప్పదని..ఒక వాస్తవాన్ని.. ఎంత హృద్యంగా.. బాలచందర్ చిత్రీకరించారు. మన చుట్టూ  ..ఉన్న సమాజాన్ని చూసి మన వంతు  కర్తవ్యంగా..   ఏమైనా చేయవలసి వస్తే.. చెయ్యకుండా.. ఎస్కేప్ అయ్యే మనుషులు..కోకొల్లలు.. వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే..అన్న అలసత్వ ధోరణి  వల్ల.. ఇచ్చి-పుచ్చుకునే మనస్తత్వం కొరవ  అయి..  తాము మాత్రం అందలం ఎక్కాలనుకుంటారు. 

సమాజ శ్రేయస్సు కాంక్షించని.. ఎంత గొప్ప సంప్రదాయమైనా  అది అల్పమైనదే !   

ఈ విషయాన్నీ "సిరివెన్నెల"  ఈ పాటలో ఎంత గొప్పగా.. వ్యక్తీకరించారో  ..! 

విశ్వ మానవ శ్రేయస్సుని కాంక్షించని.. ఏ కళ యినా..కళాకారుడైనా.. మనసు లేని  మట్టి ముద్దలు.. ప్రాణం లేని..శిలలు..

ఒక బాలుడి  మనసులో.. శత  కోటి   ప్రశ్నలు  ..ఉధయింప జేసి  .. సమాజములో మార్పుకి,  మనుగడకి..ప్రాణం పోసిన పాట.. చాలా..స్పూర్తికరమైన  పాట.  ఈ..పాట..ప్రభావం..అనంతం. అందుకే....నేను.. మనీషి గా.. కాకపోయినా.. మనిషిగా..ఉన్నాను.. భాద్యత గల పౌరురాలుని అని..చెప్పడం.. కూడా..అందుకే.. మనిషిగా..స్పందించడం.. చేతనైన సాయం చేయడం ..నా కర్తవ్యం.. అనుకుంటూ.. దేవుడి గుడికి..వెళ్ళినప్పుడు..ఎంత భక్తితో..ఉంటానో  .. సమాజమనే..అనే దేవాలయం లోను..అంత..భక్తిగా..ఉండాలన్నది..నా.. ఈ..  సమాలోచన తో..ఈ పాట..పంచుకుంటూ..  సమాజమనే సముద్రపు  ఒడ్డున .. ఓ.. ఆలోచనా కెరటం ...  సిరివెన్నెల..అక్షర ఉద్దీపనం.       


చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ  - 2
కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం 
సహించదు ఆ పరమార్దం బ్రతుకుని కానీయకు వ్యర్దం  - 2
చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

స్వర్గాలని అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు   
సాటి మనిచి వేదన చూస్తూ జాలి లేని శిలవినావు 
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే 
గుండె బండగ మార్చేదా సాంప్రధాయమంటే   
చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది 
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే వలచింది 
ఋణం తీర్చుతరుణం వస్తే తప్పించుకుపోతున్నావా 
తెప్ప తగలపెట్టేస్తావ యేరు దాటగానే 
చుట్టూ పక్కల చూడరా చినవాడ  
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 
కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం 
సహించదు ఆ పరమార్దం..బ్రతుకుని కానీయకు వ్యర్దం 
చుట్టూ పక్కల చూడరా చినవాడ  
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

9, జూన్ 2011, గురువారం

మత మౌడ్యం,కుల మౌడ్యం,దురభిమానం..కళ్ళకు కమ్మిన మైకం.

అభిమానం అనేది వెర్రి తలలు వేస్తే మెదడు..ఆలోచించడం ఎందుకు మానేస్తుందో.. నాకు అర్ధమైన సందర్భం ఒకటి.. చెప్పదలచాను.. ఎక్కడైనా ఏమో..నాకు తెలియదు కానీ.. విజయవాడలో చదువుకునే పిల్లలకి చాల మందికి కమ్యూనిటీ పిచ్చి..బాగానే ఉంటుంది.. అది అంతా పిల్లలకి మనసు సరిగా వికశించని దశలో అయితే.. పెద్దలు అర్ధమయ్యే రీతిలో పిల్లలకి చెప్పి వారి మనసుకి కమ్మిన మబ్బుల ని పారద్రోలవచ్చు. కానీ  వాళ్ళు..డిగ్రీ స్తాయిలో చదివే పిల్లలే! వారితో మనం వాదించగలమా ? నేను ఇలాగే ఒకసారి మా అబ్బాయి నుండి చాలా తీవ్రమైన..ఒత్తిడిని ఎదుర్కొన్నాను       .

అసలు.. ఎనిమిది,తొమ్మిది తరగతులు..చదివేటప్పుడే.. పిల్లలు కమ్యూనిటీల వారిగా గ్రూప్లు కడతారని తెలిసి నేను ఆశ్చర్య పోయాను. మా అబ్బాయి.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివేటప్పుడే కొంతమంది పిల్లలతో కలసి గ్రూప్ గా  ఉండేవారు. వీళ్ళది.."సి" కమ్యూనిటీ. అంటే..మీదికాదా?అని సందేహించకండి. నాకు అలాటివి నచ్చవు కనుక.. అలా అన్నాను. పిల్లలలో ఇలాటి గ్తూప్ లని  ప్రోత్శ హించేది గురువులే అంటే ఆశ్చర్య పడనవసరం లేదు కూడా..!!  ఈ.."సి" అనేవాళ్ళు..వేరేవాళ్ళతో గొడవపడి స్కూల్ బయట కొట్టుకున్నారు.విషయం తెలిసాకా.. తప్పు ఎవరిదైనా మా అబ్బాయి ఫ్రెండ్స్ తల్లిదండ్రులు.. మేము కలసి పిల్లలకి..తెలియకుండా మాట్లాడుకుని ఇంటర్మీడియట్ లో.. అందరిని కలవనీయకుండా వేరు వేరు కాలేజెస్ లో జాయిన్ చేసాం.  అయినా అక్కడా.. అలాటి..గ్రూప్సే ! 

పిల్లలతో వాదిస్తే ఎడ్డెం అంటే తెడ్డం  అంటారని.. ఎదిఎదగని వారి మనసులని కలుషితం కాకుండా ఉండాలని మౌనం వహించి ఊరుకున్నాం. అంటరానితనం నేరం అని పాట్య పుస్తకాలలో..వెనుక పేజీపై వేసి..మరీ.. చూపిస్తున్నారు.అది చూసి అయినా నేర్చుకోండి.. మనుషులు లో భేదాలు వద్దనే కదా.. అంటే.."అది..మీ కాలం అప్పుడు.. ఇప్పుడు కాదు.. ఎవరి కమ్యునిటీ వారికి కావాలి మీకేం తెలియదు..మీరు  ఊర్కోండి.".అని.. అనడం కద్దు . రోజు..ఇలాటి వాదనలతో..తల బొప్పికట్టడం అటుంచి ఏం గొడవలు కొని తెచ్చుకుంటారో..అని భయం. ఎలాగోలా ఇంటర్ మీడియట్ హాస్టల్ చదువు కనుక గొడవలు లేకుండా పూర్తి అయింది.కొంత మంది నాన్..సి.లతో..మా అబ్బాయి..ఫ్రెండ్ షిప్  చేశాక హమ్మయ్య అనుకున్నాను.. 

తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్ లో  మళ్లీ మొదలు.
 విజయవాడ లోనే.. "సి" గ్రూప్ కి..ప్రత్యేకమైన కళాశాలలో.. మా అబ్బాయి చదవడం మళ్ళీ..అక్కడా..కమ్యూనిటి  ల పిచ్చి మొదలయింది. నేను  అనుక్షణం భయపడుతూ..ఉండేదాన్ని. ఒక రోజు మా అబ్బాయికి గట్టిగా వార్నింగ్..ఇచ్చాను. బుద్ధిగా చదువుకునే వాళ్లకి ఇలాటివి పట్టవు..కాలక్షేపపు చదువులు,పనిపాట లేని వారికే..ఈ..పిచ్చి. అలాటి వాటిల్లో తలదూర్చావు అంటే..ఊరుకోను అన్నాక.. కొంచెం ఆలోచించడం మొదలెట్టాడు. క్లాస్ లో అందరితో..కలవడం, మాట్లాడటం,వాళ్ళ ప్రక్కన కూర్చుని..లంచ్..చేయడం,ఫ్రెండ్ షిప్ చేయడం  ఇలాటివి  చేస్తుండటం తో.. "సి" కమ్యూనిటీ వాళ్ళందరు.. మన కమ్యూనిటీ పరువు తీస్తున్నావు..అని మా అబ్బాయిని..వేలివేశారట. ఆ విషయం చెప్పి భాధపడినప్పుడు.. తనకి ఏది బాగుందో..ఆలోచించుకోమని చెప్పాను. కమ్యూనిటీ పేరిట అధికారం చలాయించడం..అహంకారం ప్రదర్శించడం.. మిస్ బిహేవియర్..ఆడపిల్లని ఏడిపించడం ఇవ్వన్నీ..గమనించి అవన్నీ నచ్చక తనే దూరం జరిగి తనకి నచ్చినవాళ్ళతో .. స్నేహం చేయడం ప్రాంభించాడు. అయితే అంతర్లీనంగా.. మా అబ్బాయికి.. కమ్యూనిటి పిచ్చి..ఉంది. "సి" పార్టీల పేరిట వేలకి వేలు తగలెయ్యడం, మళ్ళీ కమ్యూనిటిల్లోనే ..పేద, బైక్ ల,కార్ల కేటగిరీ లు.. బేదాలు,వాదాలు అన్నీఅక్కడే..!! వాటికి..సాక్ష్యాలు కళాశాలలే!   ..  .. 

 సిని హీరోల అభిమాన సంఘాలు..  వారి చిత్రాల విడుదలప్పుడు..చేసే హంగామా..కొన్ని అల్లాగే ఉన్నాయి..
మనిషి లో.. కుల మౌడ్యం  అయితే మరీ పెరుకోలేదు కదా..అని ఊరుకునేదాన్ని నేను.. చిరంజీవి గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ ,కష్టపడి పట్టుదలతో ఒక రేంజ్ కి చేరుకోవడం,నటన ..డాన్స్ ..అన్నీ ఇష్టం.  చిరంజీవి.పాటలు ఇంట్లో..వినవడితే టక్కున టి.వి.అయినా రేడియో..అయినా ఆఫ్..చేయడం, నాపై..చిర్రు బుర్రులాడటం.. "సిగ్గుండాలి.. మన వాళ్ళు కాని వారిని.. ఇష్టపడటానికి"  అని అంటూ ఉండేవాడు.. నాకు..విపరీత మైన కోపం వచ్చేది.. అయినా..శాంతం  శాంతం..అనుకుని..తమాయించుకునేదాన్ని.

ఒక రోజు..చాలా సీరియస్గా కాలేజి  నుంచి..ఇంటికి వచ్చి.. "అమ్మా!..నువ్వు చిరంజీవి గురించి..పొగడటం ఆపేస్తావా..లేదా! "అన్నాడు.. "ఏమైంది.. నాన్నా.." అన్నాను లాలనగా.. నువ్వు రేడియోలో.. లైవ్ ప్రోగ్రాం  లో..  చిరంజీవిని పోగుడుతున్నావ్.. అది.. విన్న మా ఫ్రెండ్స్..నన్ను హేళన చేస్తున్నారు.. నువ్వు..ఇక్కడ.. నందమూరి వంశస్తులని..మోసుకోస్తావు..అక్కడ మీ..మమ్మీ..చిరజీవి..ఫ్యాన్..అట ..అని గేలి చేస్తారు..అన్నాడు. "అయితే " అన్నాను..చాలా కూల్ గా. నువ్వు వెంటనే అలా పొగడటం మానేయాలి అన్నాడు. నేను..మళ్ళీ మౌనం..అప్పటికి ఆ  గొడవ సర్దుమణిగింది. చిరంజీవికి..పద్మభూషణ్ అవార్డు  వచ్చినప్పుడు..ఎఫ్.ఎమ్..లైవ్ ..లో..మాట్లాడినప్పుడు గొడవ అది. అదేమిటో..!? మా అబ్బాయి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్   అందరు..రేడియో వినడం.. నేను..ఏం మాట్లాడానో.. చెప్పడం.. ఎక్కువైపోయింది..అప్పట్లో.
అమ్మో.. !ఈ పిల్లలలో..  ఇదెక్కడ  దురభిమానం.. అనుకునేదాన్ని. 

ఒక రోజు..ఒక క్లిష్ట సమస్య రానే వచ్చింది.. టి.వి..లో చిరంజీవి.. నటించిన సినిమా వస్తుంది.. మంచి బీట్ సాంగ్  కాబట్టి....వాల్యూం పెంచి అందులో.. లీనమై..ఆనందంతో తలమునకలై..ఉన్నాను. మా అబ్బాయి బయట నుండి వచ్చి.. "అమ్మా"నీకు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా వెంటనే..టివి.కట్టేయి..అన్నాడు..నాకు  కోపం నాషాలాకి.. అంటింది. నీ మీద ఇష్టానికి.. చిరంజీవి సినిమా చూడటానికి..పోలిక ఏమిటి నాన్నా? ఇష్టాలు-అభిరుచులు..అవి ఒకరి కోసం రావు మారవు.ఎవరి ఇష్టం వారిది..నువ్వు ఎప్పుడు..నన్ను ఈ విషయంలో బలవంతం చేయకు..అన్నాను.. అంతేనా ..?అన్నాడు.."అవును..అంతే.". అన్నాను. తను విసురుగా  వెళ్ళిపోయాడు. నా..ఆనందం అంతా..ఆవిరి అయిపోయింది.  "ఏమిటి ఈ  పిల్లాడు ఇలా తయారు  అవుతున్నాడు..అచ్చు..వాళ్ళ నాన్నగారు..ఇంతే.. ఇంట్లోకి రాగానే టక్కున రేడియో..కట్టి పడేసేవారు.పేపర్ కానీ..పుస్తకం కానీ ఆయన లేనప్పుడే..చదవాలి.అంతా.. వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకొవాలంటే .ఎలా.? ఒకరు ఇష్ట పడినదాన్ని  మనం ఇష్టపడాలి అంటే.. చచ్చేంత ప్రేమ అయినా..ఉండాలి.లేకపోతే.. మనకంటూ..ఒక సొంత ఇష్టం లేకుండా ఉండాలి,వ్యక్తిత్వం లేకుండా అయినా ఉండాలి..అని నా నిశ్చితాభిప్రాయం కూడా.
స్వతహాగా  నేను.. మొండిదాన్ని కావడం మూలంగా.. ఆ అగ్ని అంత త్వరగా చల్లార లేదు. ఒక గంట తర్వాత మా అబ్బాయి దగ్గరకి..వెళ్లి కూర్చున్నాను. కదిలిస్తే కస్సు మంటున్నాడు. తను రెండు,మూడు సార్లు..కసురుకున్నా అక్కడే కూర్చుని.. తనకి..మంచిని..ఓపికగా భోదించడం ఎప్పుడూ..నా.పని.అలాగే  ..కూర్చున్న నన్ను చూసి.. "చెప్పు" అన్నాడు. మళ్ళీ   అడిగేదాక  మాట్లాడ కూడదనుకుని  బెట్టు చేశాను." చెప్పమ్మా?" అన్నాడు.." ఏం చెప్పాలి?"నా ప్రశ్న.. "ఏదో..చెప్పాలనేగా   వచ్చావు.." అన్నాడు. ఇప్పుడు.. దొరికాడు.. ఇక చెప్పింది వింటాడు అని నమ్మకం కుదిరి అప్పుడు..మొదలెట్టాను..

చిన్నీ! మన ఇంట్లో.. స్టీరియో రికార్డర్..ఎప్పుడు.. కొన్నాం?.అడిగాను.నాన్న గారు..శబరిమలై ..వెళ్ళినప్పుడు..అన్నాడు.. (ఆ వస్తువుని.. నేను నా కొడుకు వెళ్లి కొనుక్కోచ్చాం. )ఎందుకు అప్పుడే కొన్నాం.. నాన్నగారు ఉన్నప్పుడు.. ఎందుకు  కొనలేదు అంటే ఆయనకీ..ఇష్టం ఉండదు కనుక.  ఆయనకీ ఇష్టం లేదని..మనం ఆయన కోసం మనం పాటలు వినాలి అనే  ఇష్టం  ని చంపుకున్నామా..?లేదు  కదా? అలాగే ఇంకో..విషయం .ఎంతో.. ప్రేస్టేజేస్ వి.ఆర్.ఎస్.సి.లో..నీకు..సి.ఎస్.ఈ  లో సీట్ వస్తే.. నాకు "సి"..అంటే ఇష్టం లేదంటే..ఆ బ్రాంచ్  లోనే జాయిన్ అవమని బలవంత పెట్టానా..? అప్పుడు లక్షలకి..లక్షలు పోసి కొందామన్న ఎవరికి రాని..సీట్ ని ..నువ్వు వద్దనుకుని నీకు ఆ సబ్జక్ట్ పై..ఇష్టం లేదని వేరే బ్రాంచ్ ఎన్నుకున్నప్పుడు.. నేను నిన్ను ఆ బ్రాంచే  తీసుకోమని..బలవంత పెట్టానా..! లేదు కదా? అన్నాను.. అయితే..ఏమిటట..?అని మొండిగా వాదించడం మొదలెట్టాడు.. ఇక  లాభం లేదు సీరియస్  గా క్లాస్స్ తీసుకున్నాను. 

 ప్రతి మనిషికి..ఇష్టా ఇష్టాలు..ఉంటాయి.వాటిని మన కోసం మార్చుకోమని అడగ కూడదు.. నన్నే కాదు..ఎవరిని కూడా.. రేపు నీకు పెళ్లి అయితే  భార్య వస్తుంది..ఆమెని కూడా..ఇలా ఆజ్ఞాపించకూడదు.. నీకు  నచ్చని ఇష్టం లేని విషయాన్నీఎందుకు ఇతరలుకి..నచ్చకూడ ధో అని నువ్వు చెప్పలేవు కదా!నీకు ఎలాటి     ఇష్టాలయితే ఉంటాయో..ఇతరులకి..అలాగే ఇష్టాలు..అభిప్రాయాలు ఉంటాయి. నీకు నచ్చకపోతే మౌనంగా ఉండు. అంతే కానీ.. వాళ్ళని.హోల్డ్  చేయాలనుకోవడం  చాలా తప్పు.. అలాగే  ..బ్లాక్మైలింగ్..కూడా.నీకన్న నాకు చిరంజీవి అంటే.. ఇష్టం అని..అంటే నువ్వు జీర్ణం చేసుకోలేవు.నేను అలా అనలేను కూడా ..అన్నాను. మా అబ్బాయి సైలెంట్ గా..ఉండిపోయాడు.  తర్వాత ఎప్పుడు..మా అబ్బాయి..అలా మాట్లాడలేదు..కూడా. తర్వాత  కొన్నాళ్ళకి.. చిరంజీవి హిట్ సాంగ్స్ అన్నీ..డౌన్లోడ్ చేసి నాకు..మెమరి కార్డు లోకి..సేవ్  చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యేటప్పటికి తనకి.. ఏది మంచో ఏది చెడో..ఆలోచించే..జ్ఞానం  అబ్బినందుకు నాకు..చాలా సంతోషం వేసింది. ఇప్పుడు..మా బంగారు కొండ నిజంగా..బంగారు కొండే!! 

కమ్యూనిటి ల పిచ్చిలో అభిమాన హీరోల పిచ్చిలో..పడి  రియలైజ్  కాలేని..పిల్లల్లో..ఒకప్పటి..నా కొడుకే కనపడతాడు నాకు.వాళ్లకి.. ఏది..సబబో..చెపుతూనే ఉంటాను నేను.
మత మౌడ్యం,కుల మౌడ్యం,దురభిమానం కళ్ళకు కమ్మిన మైకం లాటిదని..నా అభిప్రాయం. అది మనుషుల నుండి వారిని..విడదీస్తుంది.