నాకు.. చాల..ఇష్టమైన పాట...కే.బాలచందర్ అపూర్వ   సృష్టి.. "రుద్రవీణ" చిత్రం...లో..పాట
ఒక మనిషిని..మార్చడానికి.. సంవత్సరాలు.. పట్టవు..ఒక..చిన్న సంఘటన చాలు..లేదా..ఓ..పాట ..ఓ..మాట చాలు.  
పిల్లలకి.. లోకం పోకడ తెలియని స్వచ్చమైన మనసు ఉన్నప్పుడు.. పడిన ముద్ర.. వారిని..జీవితంలో..చాలా ప్రభావాలకి..గురిచేస్తుంది. పిల్లల మనసు.. మనం నట్టింట్లో..కట్టే పాలవెల్లి.. అందులో.. మనం ఏం పెడతామో..అవే.. ఇంటికి వెచ్చిన నలుగురికి..కన్పిస్తాయి.  పిల్లల మనసులో..నాటుకున్న భావాలు అంతే..! 
రుద్రవీణ చిత్రం ప్రారంభమే..చాంధస  సంస్కృతి సంప్రదాయాల   పై  మానవత వాదం ఎక్కుపెట్టిన విల్లంబు.  "చుట్టుపక్కల చూడరా చిన్నవాడా.".అనే  పాట ద్వారానే.. బాలచందర్.. చిత్రం మొత్తం సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పేశారు.. "మానవ సేవే..మాధవసేవ " అన్నది మరచి.. సంప్రదాయం పేరిట మనుషులని..అంటరానివారిని చేసి.. కష్టాలు   ఎదురైనా స్పందించక గిరిగీసుకుని కూర్చుని.. చోద్యం చూసే కరకు గుండెల కసాయి తనం.. మారక తప్పదని..ఒక వాస్తవాన్ని.. ఎంత హృద్యంగా.. బాలచందర్ చిత్రీకరించారు.
 మన చుట్టూ  ..ఉన్న సమాజాన్ని చూసి మన వంతు   కర్తవ్యంగా..   ఏమైనా చేయవలసి వస్తే.. చెయ్యకుండా.. ఎస్కేప్ అయ్యే మనుషులు..కోకొల్లలు.. వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే..అన్న అలసత్వ ధోరణి   వల్ల.. ఇచ్చి-పుచ్చుకునే మనస్తత్వం కొరవ  అయి..  తాము మాత్రం అందలం ఎక్కాలనుకుంటారు. 
సమాజ శ్రేయస్సు కాంక్షించని.. ఎంత గొప్ప సంప్రదాయమైనా  అది అల్పమైనదే !   
ఈ విషయాన్నీ "సిరివెన్నెల"  ఈ పాటలో ఎంత గొప్పగా.. వ్యక్తీకరించారో  ..! 
విశ్వ మానవ శ్రేయస్సుని కాంక్షించని.. ఏ కళ యినా..కళాకారుడైనా.. మనసు లేని  మట్టి ముద్దలు.. ప్రాణం లేని..శిలలు..
ఒక బాలుడి   మనసులో.. శత   కోటి   ప్రశ్నలు  ..ఉధయింప జేసి  .. సమాజములో మార్పుకి,  మనుగడకి..ప్రాణం పోసిన పాట.. చాలా..స్పూర్తికరమైన   పాట.  ఈ..పాట..ప్రభావం..అనంతం. అందుకే....నేను.. మనీషి గా.. కాకపోయినా.. మనిషిగా..ఉన్నాను.. భాద్యత గల పౌరురాలుని అని..చెప్పడం.. కూడా..అందుకే.. మనిషిగా..స్పందించడం.. చేతనైన సాయం చేయడం ..నా కర్తవ్యం.. అనుకుంటూ.. దేవుడి గుడికి..వెళ్ళినప్పుడు..ఎంత భక్తితో..ఉంటానో  .. సమాజమనే..అనే దేవాలయం లోను..అంత..భక్తిగా..ఉండాలన్నది..నా.. ఈ..  సమాలోచన తో..ఈ పాట..పంచుకుంటూ..  సమాజమనే సముద్రపు   ఒడ్డున .. ఓ.. ఆలోచనా కెరటం ...  సిరివెన్నెల..అక్షర ఉద్దీపనం.       
చుట్టూ పక్కల చూడరా చినవాడ చుక్కలో చూపు చిక్కుకున్నవాడ - 2 కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం సహించదు ఆ పరమార్దం బ్రతుకుని కానీయకు వ్యర్దం - 2 చుట్టూ పక్కల చూడరా చినవాడ చుక్కలో చూపు చిక్కుకున్నవాడ స్వర్గాలని అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు సాటి మనిచి వేదన చూస్తూ జాలి లేని శిలవినావు కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగ మార్చేదా సాంప్రధాయమంటే చుట్టూ పక్కల చూడరా చినవాడ చుక్కలో చూపు చిక్కుకున్నవాడ నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే వలచింది ఋణం తీర్చుతరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావ యేరు దాటగానే చుట్టూ పక్కల చూడరా చినవాడ చుక్కలో చూపు చిక్కుకున్నవాడ కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం సహించదు ఆ పరమార్దం..బ్రతుకుని కానీయకు వ్యర్దం చుట్టూ పక్కల చూడరా చినవాడ చుక్కలో చూపు చిక్కుకున్నవాడ
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి