14, జూన్ 2011, మంగళవారం

అమ్మాయిలకి ..లభించిన స్వేచ్చ

భూమిక జూన్ నెల మాస పత్రికలో "పుష్పాంజలి" గారి వ్యాసం చూసాక ఈ పోస్ట్ వ్రాయాలనిపించింది. ఆ వ్యాసం పేరు.." ఆడ పిల్లా!నీ అడుగులు ఎటు వైపు.." ఆ వ్యాసం లో పుష్పాంజలి గారు ఉదహరించని..మరొక కోణం నేను.. ఇక్కడ చెపుతున్నాను.

ఈ తరం ఆడపిల్లల్లో.. చాలా విషయాలలో.. ముందంజ లో..ఉన్నారు. వాళ్ళ దృష్టిలో.. అభివృద్ధి సాధించడం అంటే.. బాగా..చదువుకోవడం..ఉద్యోగం చేయడం అన్ని రంగాలలో..పురుషులతో..సమానం గా ఉండ గలగటం అనుకుంటున్నారు.

ఆ ఆలోచనలు..పెడదారి బట్టి బుద్ధి వక్రీకరించి.. లభించిన స్వేచ్చతో.. చాలా.. విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక స్వేచ్చ ఉండటమే.. స్త్రీ వాదం, అదే అభివృద్ధి పధం అని.. అనుకుంటున్నారు.

ఇలాటి ఆలోచనా ధోరణి వల్ల.. స్త్రీ జాతి మొత్తం కి.. తమ వ్యక్తిత్వ నిరూపణే ప్రమాదంలో.. పడుతుందని గుర్తించ లేకపొతున్నారు. ఇప్పటికే అబలలు అన్న ముద్రణ.

సబలలగా.. అస్తిత్వ నిరూపణ కే.. బలం సమకూరుచుకోవడానికి.. కొంత మంది.. పెమినిజం అనే వాదంతో.. ఎన్ని విమర్శలు ఎదుర్కుని అయినా చాలా..కాలంగా.. పురుష అహంకారం పై.. యుద్ధం చేస్తున్నారు.

బలహీనుల తరపున, అన్యాయానికి .గురి అయిన వారి తరపున, సామాజిక అన్యాయం జరిగిన చోటన ..మొక్కవోని దీక్షతో పోరాటం చేసి హక్కులని సాధించుకునే దశలో ముందుకు..సాగుతున్నారు. వారికి.. మిగతావారు.. మద్దతు ఇచ్చి.. చేయి+గొంతు.. కలపాల్సి ఉండగా స్త్రీల విలువలని.. దిగజార్చుకుంటూ.. పురుష విమర్శకు.. గురి అవుతున్నారు. ఫెమినిజం హేళనకి ..గురి అయ్యేటట్లు..ఇతోధికంగా.. కృషి చేస్తున్నారు.

అలా నడచుకోవద్దని హితవు పలుకుతూ.. నా..ఈ..టపా.

పెమినిజం అంటే.. మనలో ఉన్న లోపాలని గుప్తంగా.. దాచి ఉంచి మనకి..జరిగిన అన్యాయాలని ప్రశ్నిస్తూ.. వీధికెక్కడం మాత్రమే కాదని స్త్రీలలో స్త్రీ అనే ముసుగులో సభ్యసమాజం నివ్వేరబోయే పోయే పనులు చేస్తున్న కొంత మందిని దృష్టిలో..ఉంచుకునే ఈ.. కధనం వ్రాస్తున్నాను.

దయ చేసి.. నేను.. పురుష సానుభూతి పరురాలని కాదు.. స్త్రీలకి .. వ్యతిరేకిని..కాదు. కొంత మంది స్త్రీల నడవడిక.. వల్ల స్త్రీ జాతి మొత్తం విమర్శలకి.. గురి అవుతున్నదని..ఆవేదన తో.. వ్రాస్తున్నాను.

ఒకసారి.. మా విజయవాడలో..జరిగిన ఓ కార్యక్రమం గురించి ఈ..మాట.

నేడు... "స్త్రీల పై..జరుగుతున్న అన్యాయాలు పట్ల స్పందన - వారికి.. అవగాహన కల్గించడం ఎలా.?" అనే అంశం.. పై..చర్చా కార్యక్తమం జరిగింది. ఆ చర్చలో..నేను పాల్గొన్నాను. పురుషులు హాజరైన ఆ సభలో.. స్త్రీల వాఖ్యల పట్ల . అభ్యంతరాలు వ్యక్తమైనవి. . అబ్బాయిలు మోసం చేసారని నిందించే ముందు అమ్మాయిలూ మోసాలు చేయడానికి రెడీగా ఉంటారు అని వాదన మొదలయింది .

మాతో..చర్చలో..పాల్గొన్న ఆమె ఒకరు..వీరావేశంలో.. అలా మోసం చేయడానికి..పాల్బడ్డ ఒక అమ్మాయిని అయినా చూపండి. మేము ఇలాటి సభలే..నిర్వహించం అని చాలెంజ్ చేసారు. ఆమె.. తొందరపాటుకు మిగతా మేమందరం తల పట్టుకున్నాం.

నాలుగైదేళ్ళ నుండి ఒక అమ్మాయి.. విజయవాడ పట్టణం లో ఉన్న అన్ని ఎఫ్.ఎమ్ స్టేషన్ లకి.. కాల్ చేసి లైవ్ లో.. మాట్లాడుతూ..ఉంటుంది.. ఆ.. అమ్మాయికి.. చాలా మంది.. పురుష కాలర్స్ తో..స్నేహం ఉంది.. వాళ్ళందరికీ హాయ్..హలో.. చెపుతుంటుంది. డిగ్రీ వరకు..చదివి.. లేడిస్ హాస్టల్ లో ఉండి జాబు చేసుకుంటుంది.. ఆ అమ్మాయి ఒకరికి తెలియకుండా మరొకరికి... రెచ్చగొట్టే విధంగా.. ప్రేమ పూర్వక ఎస్.ఎమ్.ఎస్..లు..పంపడం..సినిమాలకి, ఔటింగ్ కి..వెళదామని ప్రపోస్ చేయడం ఇలా నలుగురైదుగురి వద్ద ఒకే అమ్మాయి పంపిన ఎస్.ఎమ్.ఎస్..లు.. చూపించారు.. వాళ్ళందరు.. ఆ..మెసేజెస్ ..ని ..జాగ్రత్తగా.. దాచుకున్నారు. వారిలో కొంత మందికి ఆ అమ్మాయితో..అత్యంత సన్నిహిత సంబంధాలు..ఉండవచ్చు కూడా.. కానీ అందరూ ఆ అమ్మాయి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందని అతి జాగ్రత్తతో ఆ అమ్మాయి నంబర్, మెసేజెస్ ని..కూడగట్టుకుని దాచి ఉంచారు.

భవిష్యత్ లో.. ఆ అమ్మాయి అతి ప్రవర్తన వల్ల.. వారికి కూడా.. ఏమైనా.. ప్రమాదం రావచ్చన్న భయం.
ఇలా రుజువులు అవన్నీ..చూపించి..ఒక అమ్మాయి..ఇలా నలుగురైదుగురితో.. ప్రవర్తించ వచ్చా? అదే ఆ అమ్మాయి పై..ఏదైనా.. అఘాయిత్యం జరిగితే స్త్రీ ల పై అన్యాయాలు జరుగుతున్నాయని..పురుషులపై దండెత్తరా!? అని అడిగారు.. అంతా.. మౌనం. "బియ్యపు గింజల్లో పలుకు రాయి" నా దగ్గర సమాధానం లేదు.. పురుషులు అందరూ.. మృగాలు కాదు.స్త్రీలు అందరూ..అమాయుకులు కాదు. అమ్మాయిలు కూడా లభించిన స్వేచ్చని..దుర్వినియోగం చేసుకోకుండా.. ఆలోచనతో,వివేకం తో..మెలుగుతూ..శక్తివంతంగా..తయారు కావాలనే నా..ఆశ.

స్త్రీ-పురుష సమానత్వం అంటే..స్వేచ్చతో.. పురుషుడిలా.. ప్రవర్తించమని కాదు. పోటీ పడటం అంటే..దిగ జారి పోవడమా ? మంచి కై పోటీ పడండీ!! అమ్మాయిలూ,స్త్రీలు.. ఆలోచించండి..!! లవ్ గేమ్స్ ఆపండి.. మీ సరదాలకి, మీ..టైం పాస్ ప్రేమలకి,మగ పిల్లలతో ..ఆడుకుని..వదిలేయకండి. అందు వల్ల..ఆడ వాళ్ళ అందరి పై..వ్యతిరేక భావనలు.. మొదలై.. విశ్వసనీయత కోల్పోతున్నారు... అన్యాయాలు జరినప్పుడు వెక్కిరింతలకి..గురి అవుతున్నారు. మిగతా అందరిని.. చులకన గా గేలి చేస్తూ అవమానంకి గురి చేస్తున్నారు.. అందుకే.. నా..ఈ.. అస్త్రం...

అమ్మాయిలకి ..లభించిన స్వేచ్చ దుర్వినియోగం !?

14 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఆడవాళ్ళు నిజంగా అంత స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారని నేను అనుకోను. పెద్దవాళ్ళు తిడతారనే భయంతో తమకి నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటామని చెప్పే ధైర్యం లేనివాళ్ళని చూశాను.

రాజేష్ జి చెప్పారు...

$వనజ గారు

మంచి సమకాలీన అంశాన్ని సృజించారు. ధన్యవాదాలు. మీరు చెప్పినదాని మీద అర్ధవంతమైన చర్చ జరిగితే బావుటుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారు.. మీరడిగిన ప్రశ్నకి.. సమాధానం.. ఈ పోస్ట్ టైటిల్ లోనే ఉంది ..చూడండీ!

రాజేష్.. ధన్యవాదములు.. ఇక్కడే.. చర్చ మొదలెడితే.. బాగుంటుంది.. అని.. నాకు.. ఉంది.

Praveen Mandangi చెప్పారు...

మగవాడు ఆడదాన్ని మోసం చెయ్యడం ఎంత తప్పో, ఆడది మగవాడ్ని మోసం చెయ్యడం అంతే తప్పు. మగవాడు ఆడదాన్ని మోసం చేస్తే ఆడదానిపై జాలి చూపిస్తారు, మౌన పోరాటం సినిమాలోలాగ. కానీ ఆడది మగవాడ్ని మోసం చేస్తే 'కలికాలం, కలికాలం, ఆడవాళ్ళు బరితెగిస్తున్నారు' అని అనుకుంటారు. ఇక్కడే నీతి విషయంలో ఆడ-మగ తేడా కనిపించడం లేదా?

అజ్ఞాత చెప్పారు...

utv bindas channel lo emotional atyachar chudandi,asalu pelli chesukundamante bhayam vestundi

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అజ్ఞాత గార్కి.. తప్పకుండా ..అ కార్యక్రమం చూస్తానండీ..

&ప్రవీణ్ శర్మగారు .. మీకు కృతజ్ఞతలు. ఆడ మగ మద్య నీతి విషయం లో.. తేడా.. ఉండకూధు.. ఇరువురు సమానం అనే భావన అందరికి..రావాలనే..నా ఆలోచన. మగవారు తప్పులు చేస్తారు ఆడవారు పోటిపడి చేయండి అని నేను చెప్పడం లేదు మగవారు..ఆడవారు ఇద్దరు.. నీతి నియమం తప్పకూడదు కూడా.. అనే చెపుతున్నాను.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ఇలాంటీవి ఇబ్బందులు అన్ని కాలాల్లోనూ ఉండేవి. అయితే ఇప్పుడు ఎక్కువ అవ్వటానికి కారణాలు చాలానే ఉన్నాయి. మీడియా, సినిమా, మారుతున్న ఆర్ధిక అవసరాలు, చదువులవల్ల పెళ్ళిళ్ళు చాలా ఆలస్యమవ్వడం వంటివి. ఈ కొందఱివల్ల అందర్నీ సందేహించే భావన పెరిగిపోయింది.

అందుకని స్వేచ్చనివ్వకూడదన్నది పరిష్కారం కాదు. సరైనరీతిలో పిల్లల్ని Educate చెయ్యలేని మన చదువుల వ్యవస్త అలా తగలడింది. మన సమాజమూ, కళాశాలలూ High living standards, morals, value system ని చెప్పించకపోవడంకూడా ఒక కారణం.

నేను ఇలాంటి చర్చనీయాంశాలపై ఇదే కరెక్ట్ అని నిర్ధారించి చెప్పడం కష్టమే... చెప్పిన అభిప్రాయాలు misinterpret అయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, ఎవరికివారే ఒక క్రమశిక్షనతో జీవించడమే మంచిదేమో అన్నది నా భావన. చిన్నతనంలో పెద్దలు నేర్పేజీవనవిధానంపైనకూడా ఆధారపడుతుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాస్కర్ గారూ.. మీరు చెప్పినది నూటికి.. నూరు శాతం నిజం. ఇక్కడ పిల్లకు మాత్రమే కాదు.. ..పెద్దలకి..తరగతులు.. అవసరం. తల్లిదండ్రులు చెప్పలేని విషయాలని .గురువులు చెప్పలేని విషయాలని.. కౌన్సిలింగ్ ద్వారా.. విద్యార్ధులకి.. అందిచడం కష్ట తరం కాదు. ఉత్తీర్ణతా శాతం మీద చూపే శ్రద్ధ .. నైతిక విలువలు నేర్పించడానికి సమయమే లేదంటున్న చదువుల ఒడిలో.. .పిల్లలకి.. దిశనిర్దేశం చేయడం.. పతనం వైపు అడుగులు వేయకుండా కాపాడుకోవడం కత్తి మీద సాము లాటిది.

సమీర చెప్పారు...

andaro chaala baaga chepparu, dadapu gata 5yrs nundi kooda pillalaku naitika viluvalu nerpe guruvulu leru. vontari samsaaraalu ekkuvynai. antaa busy ipoyaaru. pedda chaduvulu chadive vaaru anta reservations dwaarakani, dabbu dwaraa kaani chadivere ekkuva. idi future taraalavariki chaala nashtam kalugachestundi.

అజ్ఞాత చెప్పారు...

Read this story

http://ibnlive.in.com/blogs/thechastitybelt/2956/62476/short-story-two-to-tango.html

MURALI చెప్పారు...

సాటి చదువుకున్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలే చీదరించుకునేలా ఉండటం ఏవిధంగా అభ్యుదయం, స్వేచ్చ అవుతుంది. స్థూలంగా ఇది చిన్న సమస్యలా కనిపిస్తున్నా ఇందులో చాలా అంశాలున్నాయి. అందంగా లేని అమ్మాయిలు ఆత్మన్యూనతతో అందమైన బాయ్‌ఫ్రెండ్ ఉండటం గొప్పగా భావించి అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు ఆర్ధిక అవసరాలు తీర్చుకోవటానికయితే , కొందరు సంతృప్తిలేక. ఇలా కారణాలు అనేకం. ఇది కేవలం స్వేచ్చని దుర్వినియోగం చేసుకోవటం అనలేము.ఇలా ఆలోచించే మనుషులు స్వేచ్చ లేని రోజుల్లో కూడా ఉన్నారు.కానీ ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టీ, సినిమాల, సాహిత్య ప్రభావం వలన అదుపుతప్పే అవకాశాలు అందుబాటులోకొచ్చాయి. అందుకే మరింత ఎక్కువమంది ఇలా మారుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయం ఎరిగి పిల్లలని స్నేహితులుగా భావించి వాళ్ళకి తెలియచెప్పాలి.

అజ్ఞాత చెప్పారు...

వనజగారు,
మీరు రాసేవన్ని జిల్లా కేంద్రాలలో జరిగే ప్రేమ విషయాల ఉన్నాయి. ఇక సిటిలో సంగతులు చెప్పనక్కరలేదు. ఒకరోజు మా ఇంటిదగ్గర నేను చేవులారా విన్న సంభాషణ ఎమీటంటే ఒక వివాహిత మహిళ తన భర్తతో " నువ్వు మగవాడివి కాదా? నీకు సిగ్గులేదా? నేను విడాకులు ఇమంట్టుంటే నువ్వు నాతో కలసి జీవిస్తానని ఎలా అంటావు? నీకు మగతనం లేదా? నీకు కావాలంటే పిల్లలని నీతో తీసుకు పో!" అని సెల్ పోన్ లో పెద్దగా అరుస్తూ ఉన్నాది. నా ఇంటి చుట్టూరా వుండేవారు బాగా చదువుకొని తక్కువలో తక్కువ 15 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తారు. నేను ఒక మగ వారు పెళ్ళి చేసుకొంటే వచ్చే కష్ట్టాల మీద, చేసుకోకపోతే కలిగే లాభాల మీద ఒక వ్యాసం రాద్దామను కొనుట్టున్నాను. అందులో ఆధారాలుగా గణాంకా వివరాలు కూడా జత చేస్తాను. నేను ఇప్పటికే పలు ఆర్ధికవేత్తల అనాలిసిస్ పెళ్ళి ల మీద చదివి నాదగ్గర పెటుకొన్నాను. మగ వారికి పేళ్లి అంత పెంట వ్యవహారం లేదని నొక్కి వక్కాణిస్తాను. శ్రీజా ని చూడండి మొగుడు మీద ఒక కేసు పెట్టి,పుట్టింటికి పోయి కుచొంది. అదే మగ వారు,తల్లి,ఆడపడచులు ఇటువంటి కేసు దెబ్బలకి పోలిస్ పాలు బడటం, ఊరి వదలి పోవటం జరుగుతున్నాది. అంతలావు వేల కోటిశ్వరుడు,పలుకు బడికలిగిన నానోస్టార్ 50లక్షలు లేక అల్లుడి మీద కేసుపెట్టి అతనిని ఊరు వదలి పోయేలా చేస్తారా? అది వింటేనే ఎంత బలహీనమైన వాదనో మనకు అర్థమౌతుంది. ఇతని లాంటి వారు (మామలు)ఎందరో ఇటువంటి కేసులు మగ వారి మీదపేట్టి నాశనం చేశారు. వారి అమ్మయికి రేండో పెళ్ళి చేసుకొనేది అల్లుడిని బికారిని చేసి ఆడిస్తారు. నా సి కమ్యునిటి మిత్రుడికి ఇలా జరిగింది అతను ఇప్పుడు బతికి ఉన్నాడో లేడొ తెలియదు. అసలికి ఒక్కొక్క కమ్యునిటిలో ఈ గలభా ఒక్కొకవిధంగా ఉంట్టుంది. మీరు స్రీల పేరు తో జనరలైసేషన్ చేసి రాస్తున్నారు కాని ఇది ఒక్కక కమ్యునిటి లో ఒక్కొక్క విధంగా ,అందులో పురుషుడికి ఉన్న ఆర్ధిక బలిమిని ఆధరం గా చేసుకొని పేళ్ళి సమస్యలు ఉంట్టున్నయి.
----------------------------
రానున్న రోజులలో మగ వాడి మనశాంతీ స్రీలను జీవితం లో లేకుండా చేసుకోవటంలో నే ఉంది. కావాలంటే ఆపైన లింక్ లోని కథ చదవండి, ఆ రచయిత స్రీలని ఎంత వేనుక వేసుకొస్తున్నాదో తెలుస్తున్నాది. ఇది ఇప్పటి జేనరేషన్ స్రీల సైకాలజి. నేను పనిచేసే ఆఫిసులో ఇటువంటి స్రీలను చూసి ఈ కథ నాకు కొంచెం కూడా అసహజమని పించలేదు.

SrIRam

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ రామ్ గారు.. మీ అనుభవాలు తప్పక వ్రాయండి. గృహ హింస చట్టం ని అడ్డు పెట్టుకుని స్త్రీలు.. తోటి స్త్రీలని ఇబ్బంది పెట్టి మానసిక హింసకి గురిచేస్తున్నారు.అవసరమైన చోట్ల కొన్ని చట్టాల సవరణ జరగడం మాట అటుంచి.. వచ్చిన చట్టాలని మిస్ యూజ్ చేస్తున్న వారు ఉన్నారు. భాద పెట్టే వారు, బాధ నేదుర్కుంటున్న వారు అన్న విషయం లో.. జెండర్ తేడా లేదండీ.. తప్పక వ్రాయండి. ధన్యవాదములు.

chakri చెప్పారు...

LET THEM ENJOY IN THEIR OWN WAY..