16, జూన్ 2011, గురువారం

అసభ్య పదజాలం వాడటం ఒక ప్యాషన్?

మధుర  భాషణమున మర్యాద ప్రాప్తిన్చున్..  లలిత సుగుణ జాల  తెలుగు బాల... 
ఏమిటండి.. ఇప్పుడు ఈ శతకం  గుర్తు చేసుకుంటున్నారు .. అంటారా..? 
ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి.. ఎదుటివారికి  చెపుతూ ఉండాలి. లేక పోతే.. మనమే టంగ్ స్లిప్ అయ్యిందని..విచారపడనూ వచ్చు. ఎదుటివారు అనవసరంగా నోరు పారేసుకుంటే మనకి విపరీతంగా బాధ కలుగవచ్చును కదా?

అసభ్య పదజాలం  వినడానికి..మాట్లాడటానికి.. అసభ్య హాస్యం ని   ఆస్వాదించడానికి అలవాటు అయిపోయాం.  మొన్న ఈ మద్య నాకొక నెంబర్ నుండి పదే పదే మిస్సుడ్  కాల్ వస్తుంది. ఎవరో.. ఏం అత్యసర పరిస్థితుల్లో చేస్తున్నారో అనుకుని. నేనే కాల్ చేసి.. ఎవరు అని అడిగాను. అటు వైపు నుండి నో వాయిస్.  ఒక నిమిషం ఓపికగా ఎదురు  చూసి కట్ చేసి ఎస్.ఎమ్.ఎస్ పెట్టాను.. ఎవరు మీరు..? ఎందుకు మిస్సుడ్ కాల్ చేశారు..!? నేను కాల్ చేస్తే.. మాట్లాడలేదు. అని. "మీరు ఎవరో  ..చెప్పండి.."అని రిప్లై వచ్చింది. నేను ఇక ఆ మెసేజ్ ని ఖతారు చెయ్యలేదు. మళ్ళీ.. ఆ నంబర్ నుండే.. చెప్పక పోతే.."దోబ్బెయ్ రా." అని  మెసేజ్. విపరీతమైన కోపంతో..వేరే నంబర్ తో.. కాల్ చేసాను. ఒక అమ్మాయి మాట్లాడింది. "నువ్వేనా మెసేజ్   పెట్టింది... ఏమిటి..ఆ పదజాలం.. చదువుకున్నావా? అది సంస్కారమేనా.. అసలు..నువ్వు ఆడ పిల్లవేనా..?" అని తిట్టి లైన్ కట్ చేశాను. 

సినిమాల ప్రభావం వల్ల ఆడ-మగ తేడా లేకుండా.. తొక్క ,తోలు,ముదురు.. ఇంకా.. ముద నష్టపు  భాషలో.. మాట్లాడటం..సర్వ సాధారణమై పోయింది.  హాస్యం పేరిట అసభ్యపు మాటలు వాడటం. ద్వందార్ధపు డైలాగ్ లు  మాట్లాడటం.. అమ్మో..ఏం సంస్కృతి? ..పిల్లలు నేర్చుకుంటున్నది ఇదా?అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి..అదే..నేర్చుకుంటున్నారు అని నిర్ధారించు కుంటున్నాం కూడా.  

అసలు పిల్లలు అలాటివి మాట్లాడటం  వింటే.. వెంటనే పెద్దవాళ్ళు ఖండించడం మొదలు పెడితే.. పిల్లల్లో..మార్పు వస్తుంది. అలా కాకుండా.. పెద్ద వాళ్ళు పిల్లలు ముద్దుగా "నీ అమ్మ నీ అక్క "అనరా..అని నేర్పిస్తుంటే..కడుపు మండిపోయింది.  మా పెదనాన్న వరుస అయ్యే ఒకాయన అలా మా అబ్బాయికి నేర్పిస్తుంటే.. మొహమాటం లేకుండా  ..పోట్లాడాను. అలా నేర్ప వద్దని. 

ఎవరైనా.. అసభ్యంగా మాట్లాడితే.. అది..నోరా-తాటి మట్టా? అని అనుకుని ఆ మాటలు వినబడనంత దూరం వెళ్ళడం  తప్ప ఖండిస్తే.. ఇంకా..ఎక్కువ తిట్టించుకోవడం ఆడవారికి..శాపం.

  ఒక  యదార్ధ కధ..లో.. ఒక కుటుంబం. తండ్రి ..ఓ..బ్యాంకు  ఉద్యోగి. పని వేళ లలో అక్కడ ఎలా ఉంటారో..తెలియదు కానీ..ఇంట్లో.అడుగు పెడితే..భార్యని అసభ్య పదజాలం తో..తిట్టడం.. చేస్తూ..ఉండేవాడు. ఇద్దరు ఆడపిల్లలు..బంధువు ఎవరు  ఆ ఇంటి గుమ్మం తొక్కినట్లు ఎవరు చూసి ఉండరు.ప్రభుత్వ  ఉద్యోగం,ఆస్తిపాస్తులు,అందం చందం అన్ని..ఉన్నాయి అనుకుని ఆమె తల్లిదండ్రులు.. సమాన స్థాయి ఉద్యగం చేస్తున్న ఆమెని ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమెకి..రోజు అసభ్య పదజాలంతో..తిట్టి..చిత్ర హిమసకి..గురిచేసేవాడు. అలా..తిట్లు తింటున్న  ఆమెబాహ్య ప్రపంచం చూడలేక ఉద్యోగానికి..రాజీనామా చేసి..ఇంట్లో ఉండిపోయింది. భరించలేక   పెద్దలకి చెబితే..అదసలు పెద్ద విషయమే కానట్లు  వదిలేస్తే.. ౨౦ సంవత్సరాలు మౌనంగా భరించింది. ఆ నోటి దాడికి.. పిల్లలు కూడా బలి అవుతుంటే.. భరించలేక ఆమె నిస్సహాయంగా  ఏడవటం.. చేసేది. అఖరికి  పిల్లలు ఇద్దరు ఎదురు తిరిగి.. ప్రశ్నిచడం  నచ్చని తండ్రి.. విపరీతంగా..చేయిజేసుకోవడం జరిగితే.. ఆ పిల్లలు పోలిస్ స్టేషన్ కి..వెళ్లి..పిర్యాదు చేసారు.ఆ ఇంట్లో నుండి తల్లిని కూడా తీసుకుని వెళ్లి వేరే ఇంట్లో..ఉండి.. కోర్ట్ ద్వారా విడాకులు తెప్పించారు. వాళ్ళు  కోర్ట్ లో..చూపిన బలమైన సాక్ష్యం .. రెండు గంటలు సేపు.. ఆ తండ్రి ఇద్దరు ఆడపిల్లలని,తల్లిని చెప్పనలవికాని భాషతో.దూషిస్తూ..కొడుతూ..ఉన్న దృశ్యాలని..వీడియో చిత్రం లో.. చిత్రీకరించి ఉన్నది  చూపారు. జడ్జి కూడా ఆశ్చర్య పోయి..అసహ్యించుకుని..వెంటనే..తల్లికి విడాకులు ,పిల్లలకి ,ఆమెకి భరణం..ఇచ్చేటట్లు..తీర్పునిచ్చారు. 

ఇలా చాలా  మంది స్త్రీలు  మౌనంగా.. దూషణ ని   భరిస్తూ..ఉంటారు. అలాగే ఆడవారు నోరుని ఆయుధంగా మార్చుకుని.. తిట్టడం,పోట్లాడటం చూస్తాము. మనిషిని మానసికంగా..కృశింప జేయడానికి అసభ్య పదజాలం తో దూషణ ఒక వెపన్. "తిట్టు ఒక బాష కాదు. అది గర్వంగా నేర్చుకొనడానికి." అని నేను తిట్టే వారికి చెప్పాలనుకుంటాను.  కొన్ని ఇంగ్లీష్  తిట్లు.. షిట్  అంటారు..బుల్ షిట్ అంటారు డాగ్ షిట్ .. ఇంకా ఏవేవో..
 "నో స్మోకింగ్  ఏరియా" లాగా.. అన్ని చోట్లా...


ఇలా హెచ్చరికలు పెట్టాలి. 

దూషణం ఒక భూషణం కాకూడదు. పిల్లలు తెలియక నేర్చుకుంటే పెద్దలు ఖండించాలి. పెద్దలు తిడుతుంటే.. వారికి   తరగతులు నిర్వహించి..ఆ నోటి దురదని తగ్గించే ప్రయత్నం చేయాలి.  మీడియా.. ముఖ్యంగా.. పిల్లలపై ప్రభావం చూపే  హాస్యం పేరిట చౌకబారు మాటలు.. పాటలు..ద్వందార్ధ మాటలు,సంజ్ఞలు.. చూపించకుండా.. సామాజికపరమైన భాద్యత గుర్తెరిగి చిత్రాలు నిర్మించాలి.అప్పుడే..ఈ..విష సంస్కృతి.. మన మద్య నుండి తరమడం సులభం. ఇతరులని నొప్పించే అజ్ఞాత వ్రాతలు,ఆకాశ రామన్న ఉత్తరాలు.. ఇలాటివి కూడా.. అసందర్భ,అసభ్య   ప్రేలాపనలే!మన్నన,మర్యాద సంస్కార లక్షణం. అది భావితరాలకి మనమిచ్చే గొప్ప ఆస్తి కూడా... అసభ్య పదజాలం వాడటం ఒక ప్యాషన్ కాదు. అలా మాట్లాడే వారిని ఖండించండి.. ప్లీజ్!!!

13 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

మీ వ్యాసాలు చాలా బాగున్నాయండి. నలుగురికీ ఉపయోగపడేలా వ్రాస్తున్నారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

shishira garu..thank you very much ..

dhanalakshmi చెప్పారు...

చాలా బావుంది అండి. చాలా కుటుంబాలలో ఆడవారు కూడా పక్కన వాళ గురుంచి చాలా అసహ్యం గ మాటలడుతారు. అదే పిల్లలు నేర్చుకుంటునారు.

కొత్త పాళీ చెప్పారు...

నిజమేనండి.
పిల్లలు పెరగడంలో అసభ్యపదాల్ని వాడడం కూడా ఒక మజిలీ, ముఖ్యంగా మగపిల్లలకి. కానీ తరవాత్తరవాత అది సమసిపోతుంది. ఐతే ఇదొక సంస్కృతిగా బలపడుతున్న ధోరణి మట్టుకు విచారించాల్సిన విషయం.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

షిట్ అన్నది చాలా సాధారణంగా నోట్లోంచి వస్తూ ఉంటుంది చాలా మందికి. షిట్ బయటకి రావలసింది ఆహార వాహికకి అటువేపునుంచిరా వెధవా ఇటునుంచి కాదు అని చెప్పలనిపిస్తుంది అది విన్నప్పుడల్లా. ఇక దొబ్బడం, దొబ్బించుకోవడం అన్నది మన సినిమాల్లో హీరో హీరోయిన్లు చాలా మామూలుగా అనేస్తూ ఉంటారు.

kazachaitanya చెప్పారు...

చాలా బావుంది అండి. చాలా కుటుంబాలలో పిల్లలు కూడా చాలా అసహ్యం గ నేర్చుకుంటునారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధనలక్ష్మి గారు స్పందించిన మీకు ధన్యవాదములు.

కృష్ణ గారు..మీకు ధన్యవాదములు.. మీ మాట బాగుంది.

కొత్తపాళీ ..గారు.. ధన్యవాదములు.. మనం ఏదైనా అలా..విన్నప్పుడు ఖండించడం చేస్తుంటే అప్పుడైనా.. అలా మాట్లాడటం మానేస్తారని..ఎవరు ఏమనుకున్నా నేను చెపుతూనే ఉంటాను.

చైతన్య .. ధన్యవాదములు. ఇలాటి జాడ్యాలు.. చాప క్రింద నీరులా..మనని కబళిస్తున్నాయి. స్పందించిన మీ అందరికి.. ధన్యవాదములు

సమీర చెప్పారు...

meeru enchukunna vishayam chaalaa bagundi. kaani matter nu kaasta kudichchi kaani, leda chinna chinna peraaluga gani vidagodite bagundedi anipinchindi naaku. emantaaru?

Raj చెప్పారు...

బాగా చెప్పారండీ!.. ఈ కాలము లో అలా మాట్లాడటం చాలా గొప్పగా అని భావిస్తున్నారు.. అసలు ఎదుటివాడు నోరు తెరిస్తే - తాము మొహం ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందో ఆలోచించరు..

నైస్ పోస్ట్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

sameera..Thank you very much. next time mee soochana gamanisthaanu.

Raj..garoo.. Thank you very much.

అజ్ఞాత చెప్పారు...

తెలుగు సినేమాల లో బాష దిగజారి పోవటానికి ఇ వి వి, యల్.బి. శ్రీరాం గారు చేతనైనంత సహాయం చేశారు. హలో బ్రదర్ సినేమా తో మొదలు పెట్టారు ఇటువంటి బాషని. దాదాపు ఒక దశాబ్దం సి గ్రేడ్ కామేడి సినేమాలు తీయటం, అవి టి వి లో ఎక్కువ చూడటం వలన పిల్లలు చూసి చూసి చేడిపోయారు. వెకిలిగా మాట్లాడటం ఒక అలవాటుగా అయిపోయింది వీరి దెబ్బకి.

SrIRam

durgeswara చెప్పారు...

యుగధర్మం

ఇప్పుడు నీఛమైనదే ఉన్నతంగా కనపడుతుంది.

Pranav Ainavolu చెప్పారు...

ఒక్కో పోస్ట్ చదువుతుంటే మీ మీద గౌరవం పెరిగిపోతుందండీ...

ఈ మధ్య అసభ్య పదజాలం జీవితంలో ఒక భాగమైపోయింది. మనుషులు వాటిని చాలా ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారో అర్ధం కావట్లేదు.
ఇహ సినిమాల సంగతి సరే సరి... అసభ్య పదజాలం వాడడం, తిట్టడం, కొట్టడం.. ఇవి నేటి చాలనచిత్రాల్లో హాస్యమంటే. దీన్ని హాస్యం అనడం కంటే రాక్షశానందం కరెక్తెమో. ఈ చావకబారు హాస్యం వినడమే/చూడడమే దౌర్భాగ్యం అనుకుంటే వీటిని డియాలోగ్ టు డియాలోగ్ రిపీట్ చేస్తూ నవ్వుకుంటుంటారు జనాలు. చూస్తుంటే రోజురోజుకి మన విలువలు తగ్గిపోతున్నాయేమో అనిపిస్తుంది.

పిల్లల ముందు అసభ్యకర పదజాలంతో మాట్లాడితే పెద్దయ్యాక వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతారు. Abusive parents yield abusive children!