23, జూన్ 2011, గురువారం

గంజాయి విత్తనాలు నాటి

అంతటా.. చదువుల హడావిడే కానవస్తుంది.. పాఠశాలల పునఃప్రారంభదశకి  ముందు ప్రతి రోజు.. ప్రకటనల మోత, బ్రోచర్ల పంపకం, గడపగడప వేటకి తెర పడి డబ్బు సంచులు నింపుకోవడం ప్రారంభమైంది. మొన్నటి దాకా కార్పోరేట్ కళాశాలల వంతు..ఇప్పుడు.. ప్లే స్కూల్ నుండి మొదలు. ఎన్నికల ప్రక్రియ లాగా పిల్లలని బడికి  పంపడం కూడా..బడిక్రియ.

అదివరకు తల్లిదండ్రులు..సౌకర్యాలు  అంతగా పట్టించుకునే వారు కాదు. విద్యాబుద్దులు బాగా గడిస్తే చాలు అనుకునేవారు. ఇప్పుడు నేటి తరం వాళ్ళు మాత్రం ముందే..పధకాలు వేసుకుని..అన్నీ కనులారాకాంచి కానీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే.. సౌకర్యాలు  కల్పించి మెలేసి పిండి..సొమ్ముచేసుకునే హై టెక్ బళ్ళు..వీధి వీధినా..వెలిసాయి.  

పూర్తి నిడివికల శీతల గదులు  (సెంట్ర లైజేడ్ఏ.సి) ఇప్పుడు పాఠశాల తరగతుల గదులు. తల్లిదండ్రులు.. కష్ట పడో లేదా మేధ పడో, మనసు పడో. ఏదో పాట్లు పడో.. ఆ స్కూల్ లో..చేర్పించడం పరిపాటి అయిపోయింది. ఆది ఆధునిక  పాఠశాల సంస్కృతి.


తమ పిల్లలు..అలాటి పాఠశాలలో  చదువుతున్నారని చెప్పుకోవడం ఒక ఇమేజ్ అయి కూర్చుంది అని గొణుక్కుంటూ.. తమ పిల్లలు అల్లాంటి స్కూల్లో..చేర్పించలేక పోయిన ఓ..తండ్రి బాధ..విన్నాను. 

ఒక మాదిరి స్కూల్స్ కూడా.. ఈ సంవత్సరం తరగతి గదులన్నిటిని ఆధునీకరించి సౌకర్యవంతమైన స్కూల్స్ గా తీర్చి దిద్దుకున్నారు. ఆట-పాట ఎలాగు  లేవు ఆఖరికి.. చెమట కూడా పట్టనివ్వక.. పిల్లల ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు జేసే.. ఈ విషమ జాడ్యం ఏమిటో! 

ఒకవేళ తల్లిదండ్రులు..మోజుతో అలాటి పాఠశాలలో చేర్పించి.. చదివిస్తున్నా.. ఇంట్లో.. ఏ.సి.గదులు..లేకుంటే..ఏం చేస్తారు? ఒక వేళ  ఏ.సి.గదులు ఉన్నా..నిరంతరం ఆ..గదులలో..గడిపే పిల్లలకి..సూర్య రశ్మి సోకక వచ్చే అనారోగ్యాలకి భాద్యులు ఎవరు? 

పిల్లలకి కష్టం కలగకుండా ఎండపొడ సోకకుండా అంత సుకుమారంగా పెరిగిన పిల్లలు  వ్యతిరేక వాతావరణం లోను పెరగవలసి  వస్తే వతిరేక పరిస్థితులు ఎదురైతే ఎలా.. పరిస్థితులని ఎదుర్కోగలరు ? విలాసవంతమైన జీవన విధానమా? లేక విద్యాబుద్దులు నేర్చుకోవడమా? ఏది కావాలో? 

ఈ..ఎయిర్ కండీషన్ల వాడకం వల్ల పర్యావరణానికి ఎంతః నష్టం కలుగుతుంది ఎవరైనా ఆలోచిస్తున్నారా? గ్రీన్ హవుస్ ఎపెక్ట్  పట్ల అవగాహన లేక తల్లి లాటి..పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. పిల్లలని..నాశనం చేస్తున్నాం. 
మలయ మారుతం అంటే ఏమిటని అడిగితే చెప్పడానికి..ఆచూకి ఉండదు అర్ధం ఉండదు..కూడా.

పిల్లలని ఎండా,వానా,చలి,మంచు అంటే ఏమిటో తెలియకుండా  పెంచడం నాగరికమా.. అవసరమా..? పిల్లలని .. మనమే..విషమ సంస్కృతికి.. బలి చేస్తున్నాం. గంజాయి విత్తనాలు నాటి..తులసి మొక్కలు రమ్మంటే..ఎలా? 

పచ్చిక బయ్యళ్ళ పైన ,నీరెండల్లోన, చిటపట చినుకుల మద్య..ఆడుకోని బాల్యపు బందిఖానా మరింత  ప్రియం, అయినా.. కొనగలిగే ...తల్లిదండ్రులు ఆలోచించండి.

నేడు  విద్య వ్యాపారమే కావచ్చు..పిల్లల ఆరోగ్యాలతో..ఆటలా? అనుమతులు ఎలా ఇస్తారో..నాకు తెలియదు.. అలా అనుమతి ఇవ్వని చట్టం ఏదైనా ఉంటె..చెప్పి  అవగాహన పెంచే పోస్ట్ ఎవరైనా పెట్టండి ప్లీజ్!
       

5 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

very true.

SJ చెప్పారు...

BAGA CHEPPARU

Pranav Ainavolu చెప్పారు...

చాలా బాగా చెప్పారు.
ప్రస్తుత విద్యా విధానంతో పిల్లల్ని పరుగు పందెంలో గిత్తలుగా తయారు చేస్తున్నారే కానీ కవులు కలలు కన్న 'నవజీవన బృందావనం'లోకి కావలసిన పౌరులను కాదు.

ప్రస్తుత విద్యా విధానానికి విరుద్ధంగా పోటీ తత్వాన్ని ప్రోత్సహించని ఒక బడి గురించి ఈ మధ్యనే విన్నాను. అది జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన The School. ఇక్కడ హోంవర్క్ ఉండదు. అసలు ఏడవ తరగతి వరకు పరిక్షలే ఉండవు. ప్రతి విద్యార్థికీ ఓ వ్యక్తిత్వం ఉండాలనీ, బలవంతాలూ, భయాలూ లేకుండా తమకు తామే జవాబుదారీగా తమ ఆదర్శాల కోసం జీవించాలన్నది జే‌కే గారి ఉవాచ.

మొన్నీమధ్యనే నేటి పిల్లల్లో తగ్గిపోతున్న మానసిక వికాసం గురించి ఓ ఆర్టికల్ చదివాను. దాని గురించే ఆలోచిస్తున్నానూ... ఇంతలోనే మీరు టపా రాసేశారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రణవ్ ..మీరు చెప్పింది నిజం .. మా ప్రక్కనే పోరంకి లో.. చక్కటి కాన్సెప్ట్ గల స్కూల్ ఉంది.. అందులో ..చదివిన పిల్లలు చక్కని మానసిక వికాసం కల్గి ఉంటారు. కానీ తల్లిదండ్రులకి అలాటి స్కూల్స్ నచ్చడం లేదు. .ఏ చేద్దాం అలా ఉంది.. పరిస్థితి.
సాయి గారు, కొత్త పాళీ గారు, ప్రణవ్ అందరికి ధన్యవాదములు.

Praveen Mandangi చెప్పారు...

ఎసి వాడితే కరెంట్ బిల్ ఎక్కువ కాలుతుంది కదా. నాకు తెలిసిన ఒక ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ ఎసి పెట్టాడు. అతనికి కరెంట్ బిల్ అదనంగా మూడు వేలు రూపాయలు కాలింది. నా దగ్గర ఉన్నది కూలర్. దానికి కరెంట్ అంత కాలదు.