1, జూన్ 2011, బుధవారం

ఆ జ్ఞాపకం ఓ..అత్తరు పరిమళం

అందం ఉంటే ..ఆకర్షిస్తారు.. 
విద్వత్తు   ఉంటే.. కీర్తిప్రతిష్టలు.. వస్తాయి..
వ్యక్తిత్వం  ఉంటే గుర్తింపబడతారు.. ఇవన్నీ  లేకున్నా..
ధనం,అధికారం ఉంటే..అన్ని ఉన్నాయనుకుంటారు..
ఇవన్నీ ఉన్నా మంచి మనసు ఉంటేనే .. 
మంచి..స్నేహితుతులు అవుతారు..అంటాను.. 
ఇది..నా అనుభవం.. అని చెప్పుకోవడం గర్వకారణం కూడా 

నేను.. చిన్నప్పుడు..ఎప్పుడో.. ఈ.. కోట్స్.. ని.. చదివిన గుర్తు.. బాగా గుర్తు లేదు.. అది.. ఇలా.. ఉంది..అనుకుంటున్నాను.. 

"మై హార్ట్ కౌన్ట్స్  ఫ్రెండ్స్"
లైక్ ఫింగర్స్ ఆన్ ఏ హ్యాండ్ 
షుడ్ ఫ్రెండ్ షిప్ గో..
బొత్ హార్ట్ అండ్ హ్యాండ్ 
ఉడ్  ఫిల్ ది బ్లౌ..

ఎవరికైనా ఎప్పుడైనా ఇలా..అనిపించవచ్చేమో..కూడా..  
నాకు.. ఇటీవల అలా అనిపిస్తుంది.. ఎందుకంటే..చెప్పలేను. మాట మౌనం అయిన చోట ..మనసుని తాకే  లేఖ మనిషికి  ఒక వరం. 

ఆ వరాల  మూటలు.. ఇప్పుడు మా మద్య  లేవు.. అంతా నిస్తేజం.. ఎందుకు? ఏమో! ప్రశ్న- సమాధానం ఉండదు. సందేహం  సందేహం.. సందేహం..  

ఓ..మిత్రురాలి లేఖ.. ఆ జ్ఞాపకం ఓ..అత్తరు పరిమళం. 
ఆమె ఎండై  ..నేను వానై రెండు కలసినప్పుడు..వచ్చే అందమైన "ఇంద్ర చాపం " మా స్నేహం. 
గులాబీ చామంతుల పూరెమ్మల కలబోత మా..కబుర్ల గంప..

ఒకప్పుడు నేను తన కోసం .. వ్రాసిన లేఖలో.. ఒక భాగం.. ఇదిగో.. ఇలా.. 

" ముసురు లో వచ్చిన చుట్టం లా భాద నన్ను పలకరిస్తూ..వచ్చింది..  శక్తులన్నీ   కూడగట్టుకుని.. నవ్వు పులుముకుని అడిగాను.. "నీ శాశ్వత  చిరునామా నేనేనా !? అని.. 
కాదని నవ్వింది..
మరి !? ఆశ్చర్యం,సందేహం..
నా మజిలీలు చాలా ఉన్నాయి.. అంది..నర్మగర్భంగా   ..   
ఎక్కడెక్కడ ..అడిగాను ఆసక్తిగా  ..
ఎక్కడెక్కడ ఆనందాలు.. నాట్య మాడతాయో  .. అక్కడక్కడికి ..నా కాళ్ళు వెళ్లి  ఆగుతాయి.... ఆ ఆనందాలకి.. కళ్ళెం వేస్తాను.. అంది. 
అయితే.. ఆ ఆనందం నా దగ్గర పుష్కలంగా..ఉంది..
నువ్వు ఎక్కడికి వేళ్ళకు.. నా దగ్గరే ఉండు..అన్నాను.. 
అప్పుడు.. భాద నా భుజం తట్టి.. వెళ్లిపోయింది..
వెళుతూ..వెళుతూ.. తన నవ్వులని.. నాకు వదిలి వెళ్ళింది.. "   అని వ్రాసాను. 
అప్పుడు.. తన జవాబు.. ఇలా.. 

హర్ ఏక్ నీంద్ ఏక్ మౌత్ హై.. హర్  యక్ శుబః ఏక్.. నయా జనమ హై..
ఇన్ దోనోమ్కి  బీచ్ జో హై...ఓ..సప్నా హై..
సప్నేమే సబ్ కుచ్ హోతా హై..  ..చాహత్,మొహబత్, సుఖ్ -దుఖ్ ,డర్ ..ఇస్ మే జోభి హై.. వహి..జిందగి క భర్పూర్ మజా లేనా చాహియే.. యహీ..జిందగీ! 

నాకు హిందీ  అంతగా రాదు కానీ  తన భావం మాత్రం బాగా.. అర్ధమైంది..  
ఇలా.. ఎన్నో..ఉత్తరాలు.. జవాన్ని..జీవాన్ని..నింపుతూ.. 

కూసే కోయిల తను వంటరిని.. అనుకుంటుందా.. !? 
మెరిసే మెరుపు.. తన వెలుగు క్షణికం అనుకుంటుందా  !?
మిణుగురు..తన వెలుగు సూర్యుని వెలుగు ముందు దివిటి అనుకుంటుందా !? 
కొవ్వొత్తి తను కరుగుతూ.. వెలుగునిస్తాను అనుకుంటుందా!?  
ఎవరి జీవితం వారిది.. జీవించడం ఒక కళ .. కల  కాదు సుమా!.. 

ఇలా.. స్ఫూర్తి నింపుకున్న ఆ రాతలు.. మా కోతలు.. ఓహ్.. అవి ప్రాణం  ఉన్న.. రెక్కలు.. 

ఎదురు చూపుని  ఇంటి గుమ్మానికి.. తోరణంగా..కట్టి.. ఆ లేఖల రాకకై.. ఎదురు తెన్నులు.

నా ప్రియ నేస్తాలకి..ఓ'విన్నపం.. 

ఇకనుండి.. నా యోగ క్షేమాలు కనుక్కోటానికి.. ఎప్పుడూ  ..మ్రోగే ఫోన్..బంద్..

మళ్ళీ.. ఆ రోజులకై ఎదురు చూస్తూ.. ఈ..రోజు నుండి..  ఉత్తరాన్ని మింగేసిన ఎస్.ఎమ్.ఎస్.. సెట్టింగ్.. బ్లాక్ ..చేస్తూ.. 
మా బుడమేరు..వాగులో..పరుగులు తీసి ఆడుకున్న బాల్యపు  ఆనందం ని..

ఓ..ఉత్తరం లో..దాగున్న గుప్పెడు మనసుని..బయటకి..పిండాలని.. నా.. మనసులోని..వెలితిని ..పూడ్చుకోవాలని.. నా ఈ.. ప్రయత్నం... 


                                                      లేఖా! ఓ' లేఖా!!నీ రాక నాకెంతో..సంతోషం..
మదిలో.. దాగిన దొంతరలు.. 
              
నీ కడకే ..నా పరుగు.


        

5 వ్యాఖ్యలు:

Chinni..! చెప్పారు...

hi akka....
neeku anipinchinatle chala mandiki anipisthundi.. but neelaa chala thakkuva mandi ila intha goppa ga cheppagalaru.. bagundi akka..

అజ్ఞాత చెప్పారు...

బాగా రాసారు. So touching
రామకృష్ణ

వనజవనమాలి చెప్పారు...

Ramakrishna garu..thankyou verymuch.. Chinni..Thanks..

nidhi చెప్పారు...

i am vy new this bloggers and this site but this is vy vy hert touching u expressed your state of mid simply directly to touch the heart hatsoff

వనజవనమాలి చెప్పారు...

నిధి గారు హృదయపూర్వక ధన్యవాదములు
మీరు నా బ్లాగ్ దర్శించడం మూలంగా మళ్ళీ ఒకసారి నా మిత్రులని తల్చుకున్నాను . మీ స్పందనకి ధన్యవాదములు.