మిస్సుడ్ కాల్ తో మొదలైన ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చి నిలిచి పోయిన వైనం .. న్యూస్ పేపర్ లో ఓ..వార్త. కొంచెం ఆసక్తి. చదివేస్తూ ఉండగానే.. నాలో.. ఓ..సంఘటన మెదిలింది.
అది ఏమిటంటే..!!!
మేము 8 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి హటాత్తుగా ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు బోలెడు ఇబ్బంది పడ్డాం. వేరే ఇంట్లోకి మారిపోయిన తర్వాత అన్నీ సర్దుకున్నాయి గాని నాకే ఓ..ఇబ్బంది వచ్చి పడింది. నా మొబైలు ఫోన్ కి సిగ్నల్స్ సరిగా ఉండవు. ఇంట్లో ఉంటె మాటే వినబడదు.
అందుకే వేరేక నెట్ వర్క్ లోకి మారి..కొత్త నెంబర్ కి పాత నంబర్ తో..కాల్ చేసి చూసుకుంటున్నాను. అలా ఆ నంబర్ కి డయల్ చేసేటప్పుడు ఒక అంకె తప్పు కొట్టడం జరిగింది. ఆ నంబర్ కల వ్యక్తి వెంటనే కాల్ తీస్తే ..అయ్యో! ఇదేమిటి..తప్పు వెళ్ళింది అని కట్ చేసాను. (ఆ కట్ చేయడం అనేది.. ఎంత అవివేకం అయింది అని నేను ఇప్పటికి అనుకుంటూ ఉంటాను.) ఆ రోజు ఆ కాల్ లిఫ్ట్ చేసిన అతను వెంటనే తిరిగి కాల్ చేసాడు. నేను "ఎవరండి" అని అడిగాను. ఇప్పుడు ఈ నంబర్ కి పోన్ చేసారండి.అన్నారు. వెంటనే విషయం అర్ధమై.. అవునండి..నేను ఈ రోజే ఒక కొత్త నంబర్ తీసుకున్నాను.. ఒక అంకె తప్పు వల్ల మీకు కాల్ వచ్చిందండి.. "సారీ" అని చెప్పి కట్ చేశాను.
ఇంకొక గంట తర్వాత మళ్ళీ ..నా పాత నంబర్ కే మళ్లీ కాల్ వచ్చింది. మళ్ళీ లిఫ్ట్ చేసాను. అదే విషయం చెప్పాను. అంతటి తో ఆగి పోలేదు. మళ్ళీ ఇంకా కాసేపటికి అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. మళ్ళీ అదే విషయం చెప్పాను.కోపంగా.. మాట్లాడాను కూడా.. మళ్ళీ.. అర్ధ రాత్రికి కాల్ వచ్చింది..నేనే నిద్ర మత్తులో..తీసాను. మళ్ళీ అదే మాట. .ఎవరండీ మీరు..అని నాకే ప్రశ్నలు.. విపరీతంగా కోపం వచ్చేసి.. ఎన్నిసార్లు చెపాలి..నీకు..అన్నాను గౌరవం తగ్గించి.అయినా నువ్వెప్పుడు పోన్ చేసినప్పుడు రాంగ్ కాల్ వెళ్ళలేదా? ఏమిటి..ఈ..అర్ధరాత్రి కాల్స్ . పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని తిట్టి పెట్టేసాను.
మళ్ళీ తెల్లవారిన తర్వాత అదే నంబర్ నుండి కాల్ వచ్చింది..మా అబ్బాయికి..ఇచ్చి వీడి సంగతి ఏమిటో.. చూడు నాన్నా..అన్నాను. మా అబ్బాయి మట్లాడి బాగా సీరియస్ అయితే.. .అబ్బే నేను ఏం తప్పుగా మాట్లడలేదండీ !ఈ నంబర్.. నా బార్య దగ్గర ఉంటుంది. ఎవరో..ఏమిటో..తెలుసు కోవాలి కదండీ..అందుకే చేస్తున్నాను అన్నాడట. సరే.. అప్పటికి ఆ విషయం అయి పోయింది. ఎందుకైనా మంచిదని ..నేను ఆ నంబర్ కి అనౌన్ ని పేరు తగిలించి.. పెట్టి వారానికి..ఒక సారి అయినా వచ్చే ఆ పోన్ తీయ కుండా జాగ్రత్త పడే దాన్ని.
నేను..కొన్ని నెలలకి..ఆ విషయం కూడా మర్చి పోయాను. ఒక సారి మొబైల్ పీస్ మార్చినప్పుడు.. పేరు డిస్ప్లే లో పడక నంబర్ మాత్రమే ఉంటె..కాల్ లిఫ్ట్ చేసాను.. మళ్ళీ ఆ వ్యక్తే.. ఎందుకు ఇలా కాల్ చేస్తున్నావ్ ..అన్నాను.. ఈ నంబర్ నా భార్య దగ్గర ఉంటుంది..అన్నాడు .అయితే.. అన్నాను. ఒక సారి ఈ..నంబర్కి కాల్ చేస్తే..మగవాళ్ళు తీసారు అందుకే ఎవరో..కనుక్కుందామని చేస్తున్నాను. అన్నాడు. నేను వెంటనే క్లారిటీ ఇచ్చాను .మాది విజయవాడ. మీ దరిదాపుల్లో.కూడా మేను లేము.. అనవసరంగా నీ భార్యని అనుమానించకు.. అలా.. చేయడం..ఇలా.మాకు కాల్ చేసి విసిగించడం చాలా తప్పు..అని చెప్పాను.
అతను చేసే పని మూలంగా..ఇంటికి దూరంగా ఉంటాడట. అతను లేనప్పుడు..భార్య ఎవరితో..అయినన మాట్లడుతు ఉంటుందేమో అన్న అనుమానం తొలిచేస్తూ.. అతను ప్రశాంతంగా ఉండ లేడు. కచ్చితంగా తని భార్యని ప్రశాంతంగా ..ఉండ నివ్వని..తత్వం నాకు అతని మాటల్లో..కనబడింది...బోధ పడింది. నేను అప్పుడు.మా వారికి..మా అబ్బాయికి చెప్పాను. మీరు ఎప్పుడు నా పోన్ లిఫ్ట్ చేయకండి.ఆ అనుమానం పిశాచి కాల్ చేస్తే..నేను కాకుండా మీరు ఎవరైనా మాట్లాడితే.. పాపం వాడి భార్యకి నరకం చూపెడతాడు అని చెప్పాను. అంతటి తో ఆగలేదు. ఒక సారి నాకు అదే నంబర్ నుండి కాల్ వస్తుంది. ఇది ఎక్కడ ఖర్మ రా బాబూ..అనుకుంటూ.. లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే తీసాను. ఒక ఆడ మనిషి స్వరం . ఏడుస్తూ..మాట్లాడింది.. అమ్మ..నువ్వు..ఏమంటూ నాకు పోన్ చేసావో కానీ.. మీ వాళ్ళు మా ఆయనతో..ఎవరు మాట్లాడారో..కానీ..మా ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా.. ఎవడే.వాడు..నేను పోన్ చేస్తే ఆడ మనిషి మాట్లాడతారు.. మల్లా మగ మనిషి మాట్లాడతారు.. ఏమవుతారు ..నీకు..చెప్పు అని.. కొట్టి చంపుతున్నాడు..అని చెపుతుంది. నాకు..అంతా అయోమయం. ఏం మట్లాడాలో..అర్ధం కాలేదు.. ఒక క్షణం ఆలోచించుకుని..ఆమె భర్త కి..పోన్ ఇవ్వ మన్నాను. అతను..మాట్లాడటం మొదేలేట్టగానే..తిట్టేశాను. నువ్వు ఆ అమ్మయిని..అలా ఇబ్బంది పెట్టడం మానేయక పోతే.. నేనే ..నువ్వు నాకు పోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావని కాల్ రిజిస్టర్ చూపి సాక్ష్యం తో.. సహా పోలిస్ కంప్లైంట్ ఇస్తాను..అన్నాను
అంతే.. మళ్ళీ నాకు కాల్ చేయలేదు. ఒక ఏడాది కాలం అయ్యాక అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. సరే..చూద్దాం అనుకుని మాట్లాడటానికి తీశాను.. ఈ సారి అమ్మాయి మట్లాడింది. చెప్పమ్మా..! ఏమిటి సంగతి అన్నాను. వాడిని వదిలేసాను..అంది.. కొంచెం గతుక్కుమన్నాను. ఎందుకు..అని నేను అడగలేదు..రోజు.. అంతే వేధించే వాడు.. అందుకే.. వాడి కి..బుద్ధి చెప్పాలనుకుని.. వాడు అనుమానించి నట్లే.. ఒక అబ్బాయితో..పోన్ స్నేహం చేసి.. వాడిని వదిలేసి వచ్చి..పెళ్లి చేసుకుని..మీకు దగ్గరలోనే.."ప్రియ" పచ్చళ్ళ కంపెని లోనే..ఉద్యోగాలు చేసుకుంటున్నాం.. నా మొదటి మొగుడు నుండి.. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టె పోన్ లు..రావు లెండి అంది. నాకైతే..నవ్వాలో..ఏం చేయాలో..అర్ధం కాలేదు. ఇది ఒక రాంగ్ కాల్ కథ..ఇందులో..నా తప్పు ఎంత..? మాకైతే.. ఏదో..తెలియని ఫీలింగ్..
అది జరిగిన ఒక నెలకి. ఆమె..(భర్త) వేరే నంబర్ తో..పోన్ చేసాడు. ఏవమ్మా. నా పెళ్ళం గురించి చెపితే..అలా అనుమానిచడం తప్పు అన్నావ్ గా.. నా పెళ్ళాం.. పోనుల్లో..మాట్టాడి మాట్టాడి..ఎవరితోనో వెళ్లిపోయింది. వాడు..నీకు తెలుసేమో.. ఎక్కడ ఉన్నారో చెప్పు. ఇద్దరినీ నరికి..పారేస్తాను..అన్నాడు.. . ఇంకా ఏదేదో.. అంటున్నాడు.. ఇక అంతే.. బంగారం అంటి నా పాత నంబర్ (ఎంత చక్కని ప్యాన్సీ నంబరో).. తీసి.. పడేసి.. మా బందరు కాలవలో.. నేనే స్వయంగా వెళ్లి భద్రం గా పడేసి వచ్చాను.. ఇది జరిగి ఒక ఏడాది అయింది.ఈ మద్య నా పాత నంబర్ మోగుతుంది.. మళ్ళీ..ఆమె భర్త వాళ్ళకి..కాల్ చేస్తాడు. ఈ సారి గట్టిగ్గా దెబ్బలు తింటాడు. .ఇప్పుడు నా పాత నంబర్ వాడుతున్న వాళ్ళు.. నా అంత సహనశీలురు కాకుండా ఉండాలి కోరుకుంటూ.....
రాంగ్ నంబర్స్.. మొబైల్ చాటింగ్ .. అమ్మో.. నాకు.. ఎంత ఇబ్బంది.. కొంత మందికి..ఎంత నరకం..మరికొంత మందికి ఎంత అనుమానం. అనుకుంటూ.. ఈ షేరింగ్.
ఒక చిన్న పొరబాటు..ఒక వ్యక్తి అనుమాన ప్రవృత్తి. ఒక భార్య.. విసిగి వేసారి.. ఒక విధమైన కక్ష తో.. తీసుకున్న నిర్ణయం... వీటన్నిటి మద్య మొబైల్ పోన్..చిద్విలాసం.
ఒక చిన్న పొరబాటు..ఒక వ్యక్తి అనుమాన ప్రవృత్తి. ఒక భార్య.. విసిగి వేసారి.. ఒక విధమైన కక్ష తో.. తీసుకున్న నిర్ణయం... వీటన్నిటి మద్య మొబైల్ పోన్..చిద్విలాసం.
7 కామెంట్‌లు:
ఆ కట్టుకున్న రెండవవాడు మంచివాడైతే, జరిగినదాంట్లో ఆ అమ్మాయి తప్పు నిజంగానే లేకుంటే (మనకు కనిపించే మనిషి, లోపలి మనిషి వేరుగా ఉండొచ్చు కదా అందుకే ఈ షరతులు) ఒకమ్మాయి జీవితం బాగుపడిందని సంతృప్తి పడండి.
ఇలాంటివి ఒక్కోసారి ఉత్తిపుణ్యానికి పోలీసు కేసుల వరకూ వెళ్ళిన సందర్భాలున్నాయి. జాగ్రత్త సుమా!
చదువుతుంటే ఇలా కూడా జరుగుతుందా అనిపించింది. ఇలాంటి మనుజులు కూడా ఉన్నారా ఈ ఇలాతలంపై అని అనుమానమేసింది.
నాకూ ఇలాంటి (అంటే మరీ 'ఇలాంటి' కాదనుకొండి) ఫోను అనుభవం ఒకటుంది. అది మీ టపా వల్ల చాలా నెలలకు మళ్ళీ గుర్తు చేసుకున్నాను :)
అచంగ..గారు.. ధన్యవాదములు. ఆ నంబర్ తోనే.. ఆ నా ఇబ్బంది తొలగి పోయింది. ధన్యవాదములు.
ప్రణవ్..మీకు.. మరీ మరీ ధన్యవాదములు.
Tejaswi..Thank you very much
బాగుందండి వనజవనమాలి గారు ఇంతకూ మీ పాత సెల్ నంబర్ ఎంతో? ( అమ్మో నిజంగా చెప్పెసేరు )
Thank you very much..Budda Muraligaaru. aa..number..marchipoyaanandee
a number padesharu sare
enka konnirojulaku anty 180days taruvatha vere vallaku vastundhi papam a number ewariki vastundho emoo
కామెంట్‌ను పోస్ట్ చేయండి