నాకు బాగా నచ్చే నటిమణి... భాను రేఖ గణేషన్. భారతీయ చలన చిత్ర సీమలో.. గ్లామరస్ హీరోయిన్ గా.. పేరు గాంచి..ఎవరకి అనుకరణ సాద్యం కాని మేకప్ తో.. అరవైలలో..కూడా అందులో..సగం వయసు ఉన్నట్లు భావించేటట్లుగా .ఉండగలగటం.. ఆమె ప్రత్యేకత. ఆ రహస్యం ని చేధించడం ఎవరితరం కాదు ..అన్నట్లు..ఆమె విజయ దరహాసం..ఆమెకి ఉన్న ఆభరణం.
సలాం యే ఇష్క్ మేరిజాన్.. అని నయనాలతోనే.. ఎన్నో..భాష్యాలు చెప్పినా.. యే కహా ఆగయే హమ్..అని.. అమితాబ్ జీ తో..నటనలో.. జీవించినా.. నీలా ఆస్మాన్ హో గయా..అని.. విషాదం ని..గుండెల్లో దాచుకున్నా.. ఇన్ ఆన్కొంకి మస్తీ...అని ఉమ్రావ్ జాన్... గా చెరగని ముద్ర వేసినా ఆమె కామే సాటి. ఎన్ని ముద్రలో..ఆమెలో.
వసంత సేన గా ఆమె నటనలో..జీవించిన ఈ..పాట నాకు చాలా చాలా ఇష్టం ..
"ఉత్సవ్" చిత్రం లో.. ఈ పాట.. ఎందుకో.. చెప్పలేను.. లతా జీ మరియు ఆశా భోంస్లే .ఇరువురి గళ మాధుర్యం కావచ్చు.. పాట సాహిత్యం కావచ్చు. 1985 . ఫిలిం ఫేర్ అవార్డు లు.. మూడింటిని కైవసం చేసుకున్న చిత్రం. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సమిష్టి స్వరాలూ..ఈ..పాటలో.. వినేటపుడు ..మనకి.. మనసుని ఉయ్యాలలూపుతాయి. ఈ చిత్రం సంస్కృత కావ్య ఆధారంగా .. 6 వ శతాబ్దం నాటి మృచ కటిక తో..ఈ చిత్రం రూపొందించారని..విన్నాను. ఈ..పాట ని రేడియోలో.. వినడమే బాగుంటుంది..నాకు. కానీ..మనం వినాలనుకున్నప్పుడు..రాదూ కదా ! అందుకే అప్పుడప్పుడు ఇలా చూడాలి కదా! చాలా రోజులనుండి ఈ పాటకి అనువాదం చేయాలనుకుని .. ఇప్పుటకి కుదిరింది. .
(मन क्यों बहका रे बहका आधी रात को
बेला महका हो
बेला महका रे महका आधी रात को) -२
किसने बँसी बजाई आधी रात को
जिसने पलकें हो
जिसने पलकें चुराई आधी रात को
मन क्यों ...
बेला महका रे महका आधी रात को
झाँझर झमके सुन -३
झमके आधी रात को
उसको टोको न रोको, रोको न टोको,
टोको न रोको, आधी रात को
ओ लाज लगे रे लगे आधी रात को -२
बिना सिन्दूर सोऊँ आधी रात को
बेला महका रे महका आधी रात को
मन क्यों ...
(बात कहते बने क्या आधी रात को
आँख खोलेगी बात आधी रात को) -२
हमने पी चाँदनी आधी रात को -२
चाँद आँखों में आया आधी रात को
बेला महका रे महका आधी रात को
मन क्यों ...
(रात गुनती रहेगी आधी बात को
आधी बातों की प्रीत आधी रात को) -२
रात पूरी हो कैसी आधी रात को -२
रात होती शुरू है आधी रात को
मन क्यों ...
बेला महका रे महका आधी रात को
मन क्यों ...
ఈ పాటకి అనువాదం
మనసు ఎందుకో .. ఊగిసలాడుతుంది
ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి
లతలు విరబూస్తున్నాయి.
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో ||2||
ఎవరు వేణువు ఊదారు అర్ధరాత్రిలో
ఎవరు వేణువు ఊదారు అర్ధరాత్రిలో
వారే కనురెప్పలను ..దొంగిలించారు అర్ధరాత్రిలో
మనసు ఎందుకో .. ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో
పాదాలకు అలంకరించ బడిన ఆభరణం ఘల్లుమంది విను..
ఘల్లుమన్నది ఘల్లుమన్నది..అర్ధరాత్రి వేళలో
దానిని ఆహ్వానించు ఆపకు
ఆపకు రానివ్వు.. రానివ్వు ఆపకు.. అర్ధరాత్రి సమయంలో
సిగ్గువేసింది ..అర్ధరాత్రిలో
సిగ్గు వేసింది అర్ధ రాత్రిలో
సింధూరం ధరించకుండానే నిద్రపోతావా అర్ధరాత్రిలో
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో
మనసు ఎందుకో .. ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి
మాటలు చెప్పుకుంటూనే గడుస్తుందా..ఏం ? అర్ధ రాత్రి.
మాటల మనసు కళ్ళు తెరుచుకుంటాయి అర్ధరాత్రిలో ||2||
మేము ఈ వెన్నెలను సేవించాము (ఆస్వాదించాము ) అర్ధరాత్రిలో ||2||
చంద్రుడు కళ్ళలోకి వచ్చాడు..అర్ధరాత్రిలో
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో
రాత్రి కూనీ రాగం తీస్తూ ఉంటుంది అసంపూర్ణం అయిన విషయం గురించి..
అసంపూర్ణమైన విషయాలే ప్రియమైనవి..అర్ధరాత్రిలో.
అసంపూర్ణమైన విషయాలే ప్రియమైనవి..అర్ధరాత్రిలో.
రాత్రి ఎలా పూర్తి అవుతుంది అర్ధ రాత్రిలో
రాత్రి ఎలా పూర్తి అవుతుంది అర్ధ రాత్రిలో
రాత్రి మొదలవుతుంది అర్ధ రాత్రిలో
2 కామెంట్‌లు:
ఆమె నటనే కాదు ఆలోచనలు సైతం అద్భుతం ..తండ్రి గనేషన్ చివరి రోజుల్లో ఆమెనే సేవ చేసింది దాదాపు ఏడేళ్ళ క్రితం అనుకుంటా జి లో ఆమె ప్రత్యేక ఇంటర్వ్యు వచ్చింది. దేవుడు నన్ను ఇలా బతకమి పంపించాడు అలా బతుకుతున్నా.. అంటూ తన జీవితం ఎలా ఉందో అలానే స్వికరిస్తున్నట్టు చాలా పరిపక్వతతో చెప్పింది
I like this song very mech, vanajavanamali gaarU!
కామెంట్‌ను పోస్ట్ చేయండి