4, జూన్ 2011, శనివారం

నా దృష్టిలో..కవిత్వమంటే..

 ప్రతి మనిషి..అనుక్షణం ఏదో..తలపుల తో..సతమతవుతుంటాడు.ఆ తలపుల అన్నిటికి  అక్షర రూపం  కల్పించలేరు.. ఒకొకరు అందంగా మాట్లాడగలరు..ఒకోకరు శ్రుతిబద్దంగా పాడగలరు. ఒకొకరు.. అందంగా వ్రాయగలరు.. మాట్లాడేవారు వక్తలు,వ్రాసేవారు కవులు,రచయితలు, పాడే వారు గాయకులుగా .. ముద్ర వేసుకుంటారు.  ప్రదర్శించే ప్రతిభని బట్టి.. వారు ..కీర్తిప్రతిష్టలు కైవసం చేసుకుంటారు. కవిత్వమంటే..బ్రాంతి అని,  కవులంటే.. ఉబుసుపోక వ్రాసే వారని అభిప్రాయం ఉన్నవారికి..కవిత్వాన్నిప్రేమించేవారి సమాధానం.. ఇది.

క్రౌంచ పక్షి దుఃఖం చూసి  వాల్మీకి గళం విప్పారింది..ఆది కావ్యం అవతరించింది..అది కవిత్వమునకు  నాంది.. అయితే..
     
ఉన్నదానిని ఉన్నట్టుగా..చెప్పేవాడు..వార్తాహరి  అవుతాడు.. ఉన్నదానిని అందంగా చెప్పేవాడు కవి.. 
కవిత్వమంటే.. ప్రముఖ  కవి  కే.శివారెడ్డి గారి మాటలలో.. " గుండెకి.. ఎండ తగలకుండా ఉంటె మనిషికి  కష్టం విలువ ఎట్టా తెలిసేది..!? అనడమే.. కవిత్వం.
 హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు..ఉదయం వినా  నా కంటికి.. ఏ దృశ్యం గోచరించదు.. అంటారు దాశరధి.. తన "అగ్నిధార " కావ్యంలో.. 

చిరుగాలిలో ,చిరుజల్లులో 
పూల పరిమళం లో.. గుభాళిస్తుంది  కవిత్వం.
 ఎగసిపడే తరంగంలో,ఎగిరే విహంగంలో..
మదనపడే అంతరంగంలో ప్రకాశిస్తుంది కవిత్వం.
కురిసే మేఘంలో..ఆడే మయూరంలో..
విరిసిన ఇంద్రచాపంలో..ప్రవహిస్తుంది కవిత్వం.
భానుడి చైతన్యంలో..దీనుడి దైన్యంలో..
తెలుగుతల్లి స్తన్యంలో పరవళ్ళు త్రోక్కుతుంది కవిత్వం.
నింగిన మొలిచిన చుక్కల్లో ,నేలను చీల్చుకు వచ్చిన మొక్కలలో..
పేదవాడి కన్నీటి చుక్కల్లో పొంగిపోర్లుతుంది కవిత్వం.
ప్రియురాలి అధరంలో..విప్లవవాది రుదిరంలో..
కష్టజీవి ఉదరంలో..ప్రజ్వరిల్లుతుంది కవిత్వం.    

ఇది ఓ.. నవ కవి..కవితావేశం..
ఇందులో కూడా బ్రాంతి.. కనబడుతుందా ?  వస్తువు,అభివ్యక్తీకరణ ,శైలి,సందర్భం ..ఇవి నాలుగు..మంచి కవితకి..ప్రాణం పోస్తాయి. రవీంద్రుని కవీంద్రుని చదవండి..ఒక దేవులపల్లిని, ఒక తిలక్ ని..ఒక శ్రీ శ్రీ ని ..అనిశెట్టి ప్తభాకర్ నో.. చూడండి.. గాలిబ్ గీతాల్లో  ..సూఫీ కవిత్వం నో.. చదవండి.. కవిత్వంకి  అర్ధం.. తెలియకపోతే.. కవిత్వమనే  ఒక ప్రక్రియ ఉందని మర్చిపోండి. అంతే కానీ  మానసిక రోగి లక్షణం కవిత్వం   వ్రాయడం అని.. నిర్ధారణ  చేసే  వ్యాఖ్య  వ్తాయకండి. 
హృదయం తో..స్పందించి  ..మనసులో.. మదించి..  ఆలోచన అగ్నికణం రగిలించి.. తేట తేనియ భాషతో.. అక్షర లక్షలతో సుమాలతో....నవరస కదంబమాలికలు..అల్లడమే.. కవిత్వం. 

కామెంట్‌లు లేవు: