2, జూన్ 2011, గురువారం

అమ్మాయిలకి..చదువు ఒక ఆభరణం. ఉద్యోగం..ఆత్మ విశ్వాసం..

చేయి చేయి కలిసి
ప్రతి మనిషి జీవితంలో.. రెండు ముఖ్యమైన ఘట్టాలు.. పెళ్లి ,ఇల్లు.. కోరుకున్నట్టు, కలలుకన్నట్లు కొందరికే జరుగుతాయి.. అందరికి జరగవు. .కోటి కలలతో.. పెళ్లి ప్రయాణం కి సిద్దమైన ఈ.. కాలం వారికి.. కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ టపా.. 

అమ్మాయిలు.. ఎంత బాగా చదువుకున్నా..ఉద్యోగం చేస్తున్న వారైనా.. ప్రేమ పెళ్ళిళ్ళు.. చేసుకోకుండా  ..మిగిలిన వారు..తల్లిదండ్రుల ఎంపికకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అరగంట పెళ్ళిచూపుల్లో.. ఒక యువకుడిని విశ్వసించి  అతని చిటికిన వేలుకి తన చిటికిన వేలుని అందించి.. అతని వెంట నడుస్తుంది. ఇది భారతీయ సంప్రదాయంలో..కొత్త ఏమి కాదు.   అలా అతనితో..నడచిన ఆ అమ్మాయికి.. చాలా సమస్యలు.. ఎదురవుతున్నాయి.. 

ఇప్పటి భారతీయ యువకులకి.. అందమైన,చదువుకున్న, వంట చేయడం తెలిసి ఉన్న,ఉద్యోగం చేయగల అమ్మాయి వధువుగా రావాలి.అమ్మాయిలకి.. కారు.. కనీసం బైక్ అయినా ఉండి మంచి ఉద్యోగం చేస్తూ.. పెళ్లి అవగానే.. తనతో.. రెక్కలు కట్టుకుని కుటుంబాన్నివదిలి వచ్చేసే అబ్బాయిలు కావాలి. 

పెళ్లి అంటే కంజీవరం చీరలు.. వంటి నిండా నగలు..అట్టహాసపు.మండపాలు.. విందు భోజనాలు ఇవి కాదు.. ఇవి కాకుండా ..పెళ్లి చేసుకునే వ్యక్తి పట్ల  కనీస అవగాహన శూన్యం.విదేశాల  పెళ్లి కొడుకులకి మరీ గిరాకీ..  చదువుకుని రంగు రూపు కాస్తంత బాగుంటే  చాలు.. అంతే! విదేశీ సంబంధం ముంగిట్లో.. ఉంటుంది..కట్నం కానుకుల ప్రసక్తి రాకుండానే.. దర్జాగా,హోదా కి తగినట్లు పెళ్లి చేస్తే చాలు..అంటూ..హడావుడిగా వారం రోజుల లోపునే పెళ్లి అయిపోవడం.. ఇక తర్వాత అసలు రంగు బయటపడటాలు.. వివాహ వైఫల్యాలు సర్వసాధారణం అయిపోయాయి. 



ఇప్పుడు.. మద్య తరగతి బతుకులు దాటిన  ఒక వర్గంలో..అమ్మాయిలు అబ్బాయిలు..అన్నిట్లా సమానమే! పురుషుడు ఒక మాటంటే..ఓర్చుకుని ఉండే..తత్వం అమ్మాయిలకి  ..లేదు.. అదేమిటంటే..ఎందుకు పడాలి..అంటూ..ప్రశ్నలు..తూటాల్లా వస్తాయి. అసలు పడి ఉండాలి అనే ఆలోచనే..అహంకార  ధోరణి . యుగయుగాల ధోరణి సమసిపోతుందని..అమ్మాయిలు  కలలు..కనడం..మానరేమో!  గణాంకాల వివరాల ప్రకారం   అమ్మాయిల శాతం తగ్గడం.. చదువుకున్న అమ్మాయిల శాతం పెరగడం..వాళ్ళకి..స్వాభిమానం ఉండటం..ఆర్ధిక స్వాతంత్ర్యం పెరగడం మొదలగు కారణాల వల్ల అమ్మాయిలు.. అబ్బాయిల అణచివేత విధానాన్ని సహించి ఉండటం సాద్యం కాదేమో! అయినా.. అబ్బాయిలకి.. అహంకారం తగ్గడం లేదు.. చదువుకున్న అమ్మాయిని చేసుకున్న నేరానికి..చింత పడని క్షణం లేదంటే.. నమ్మండి..అనే వారి సంఖ్యా పెరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి ఎలా ఉందటే.. అక్కడ ఉన్నదీ మన అమ్మాయి అయితే..అభిప్రాయం ఒక రకంగా.. కోడలు అయితే ఒక రకంగా..ఊసరవెల్లి రంగులు మారతాయి.

  ఒక ఉదాహరణ చూడండీ!..మద్య తరగతి కుటుంబంలో..పుట్టిన ఒక అమ్మాయి బాగా చదువుకుని క్యాంపేస్ సెలక్షన్ లో..ఉద్యోగం తెచ్చుకుని.. లక్షలు సంపాదించు కుంటుంది .విదేశి   పెళ్ళికొడుకులు ఆ.. అమ్మాయి ఇంటి ముందు క్యూ కట్టారు.. ఆ అమ్మాయికి.. డైమండ్ నెక్లెస్ ,వడ్డానం ,పెట్టి మరీ పెళ్ళిచేసుకున్నారు.ఆ అమ్మాయి అదృష్టం అన్నారు అంతా.. పెళ్ళయిన  తర్వాత రోజే   ఆ పెళ్లి పెటాకులైంది. కారణం.. అ పెళ్లి కొడుకుకి.. చదువుకున్న అమ్మాయిలపై సదభిప్రాయం లేదు...నీకు.. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా!నిజం  చెప్పు?..  నేను ఎన్నోవాడిని..అని ఒకటే ప్రశ్నలు....ఆ అమ్మాయి.. షాక్ అయింది.. అ అమ్మాయి వెంటనే..బయటికి.. వచ్చేసి అతనికి..నో.. చెప్పేసి..విడాకులకి.. అప్లై చేసింది. కారణం ఎవరికి..తెలియదు..ఇంట్లోవారికి తప్ప. ఆ అమ్మాయి తల్లిదండ్తులు..ఆ అమ్మాయి ఫీలింగ్స్ కి విలువ ఇచ్చారు. చదువుకుని.. ఉద్యోగాలు చేస్తూ..క్లాస్  మెయిన్ టైన్ చేస్తున్న అతని  తల్లిదండ్తులు..అ అమ్మాయిని అడిగిన వారు, అడగనివారి  దగ్గర తూర్పార  బట్టారు. ఎన్ని నగలు పెట్టాం..ఎన్ని చీరలు పెట్టాం. చదువుకున్నదని  పొగరు .. ఎవడినో  ప్రేమించింది ..అంట .. పెద్దవాళ్ళకి..చెప్పలేక పెళ్లి అయ్యాక ఇలా నాటకం మొదలెట్టింది.. అంటూ..ఎదురు దాడి చేసారు.. 

అలాగే  అమ్మాయిలు   ఏం తక్కువ కాదు.. వాళ్ళ అంచనాలకి..తగినట్లు లేకపోయినా..  మితిమీరిన స్వేచ్చ లభించకపోయినా.. పెళ్లి లాభించక పోయినా అబ్బాయిల మీద తిరుగులేని దెబ్బ కొట్టి  విడాకులు కి.. అప్లయ్ చేయడం నష్ట పరిహారం కోరడం సర్వ సాధారణం అయిపోయింది.అందుకే.. విడాకుల సంఖ్య నానాటికి  పెరుగుతుంది. సమస్యలు ఉన్న చోట్ల నిజంగానే  సమస్యలు  ఉంటున్నాయి.  కొంత చదువు ఉద్యోగాలు పెరిగిన చోట  ఇలాటి సమస్యలు..ఉత్పన్నమవుతున్నాయి. 

అమ్మాయిలు - అబ్బాయిలు కలసి చదువుకుంటున్నారు.స్నేహం  చేస్తున్నారు..కొంత మంది.. ప్రేమలో..మునిగి తేలుతున్నారు.. మళ్ళీ అది ప్రేమ కాదనుకుని.. విడిపోయి..వేరొకరితో.. పెళ్ళికి..తయారవుతున్నారు..తీరా పెళ్లి అయ్యాక  తమ లైఫ్ పార్టనర్ ని.. నమ్మలేకపోతున్నారు. అడుగడుగునా.. అభద్రతా భావం..మోసపోయాం  అన్న భావన ..
ఏం మాట్లాడి,ఏం చేసి జీవితాలు  ఏం చేసుకుంటున్నారో..తెలియనంత..అయోమయంలో..ఉంటుంది.యువత . వివాహ వైఫల్యాల  వెక్కిరింతలో..ఒంటరి  బ్రతుకుల్లో..జీవితం వెళ్ళదీస్తూ..ఉన్నారు.  పని భారపు ఉద్యోగాలలో.. షిఫ్టుల సర్దుబాట్లులో..అంతా.. అయోమయమే!      


అ మ్మాయిలు.. అలా  చేస్తూ..ఉన్నారు కాబట్టే అబ్బాయిలు అలా అడుగుతున్నారని.. కొందరంటారు. అబ్బాయిలు.. లవ్ అఫ్ఫైర్స్ నడిపి..ఏమి ఎరుగని వారిలా..పెళ్ళికి రెడీ అవడం లేదా? అయినా.. అమ్మాయిలని అలా అవమానిచడం తప్పు కదా?  నిబద్దత వ్యక్తిత్వంకి సంబంధించింది.. అలా అనుమానిచడం తప్పుకాదా? అందరికి బాయ్  ఫ్రెండ్స్ ఉంటారా! ఉండాలా ! ?  నమ్మి చిటికెన వేలుపట్టుకుని వెళ్ళిన  ఆమే గురించి.. అంత చులకన   భావమా? ఇలా  వొంకర  ఆలోచనాలు ఉన్నవాడు జీవితాంతం అనుమానిస్తాడు..అందుకే ఇప్పుడే.. విడిపోవడం.. ఆత్మాభిమానం కాపాడుకోవడం అయినా అవుతుంది.. అని.. అమ్మాయిలు. 

ఏమైనప్పటికీ  అమ్మాయిలు.... స్వయం నిర్ణయాదికారంతో  మెలగడం.. ఆలోచనా పరిణితిని సూచిస్తుంది. ..  అమ్మాయిలు-అబ్బాయిలు ..ఇద్దరు   జాగరుకులగా.. మెలగక పోవడం వల్ల  వాళ్ళ కుటుంబాలు.. మరియు వారి  జీవితాలు.. అనిశ్చితి  లోకి నేట్టబడుతున్నాయి.. నమ్మకం  పునాదిలేని   వైవాహిక జీవితం.. పేక మేడలా.. కూలిపోతుంది.. ఇలాటి ఆలోచనా విధానం ని మానుకుని.. ఒకరికొకరు అవగాహన  పెంచుకుంటూ.. స్నేహితుల్లా   మెలుగుతూ.. వైవాహిక జీవితానికి..తెరతీయండి.. 

 పెళ్లి -ఇల్లు ఒక కల. .అవి నెరవేర్చుకోవడం  ఎవరికివారి చేతుల్లోనే ఉంది. మీ తల్లిదండ్రులకి  మీ జీవితం పట్ల  భరోసా కల్గించండి.   పెళ్లి ఒక భద్రత... ఒక అనుబంధం.. నూరేళ్ళ స్నేహం...  మీ అహాలు..మీ ఇజాలు..అన్నీ పక్కన నెట్టేసి.. కొంగు ముడితో.. కొలువు తీరండి..  అమ్మాయిలకి.. చదువు ఒక ఆభరణం. ఉద్యోగం..ఆత్మ విశ్వాసం... అబ్బాయిలకి.. నమ్మకం ప్రాధాన్యం.. అవగాహన ..వందేళ్ళ జీవితం... 

కొన్ని తరగతులవారిని చూసి మాత్రమే వ్తాసిన టపా..ఇది. ఎవరిని కించపరచడం నా..ఉద్దేశ్యం కాదు.. అని నా మనవి.  

                               

1 కామెంట్‌:

భావన చెప్పారు...

ఏమిటండి, ఈ రోజు అందరు ఆడవాళ్ల గురించి రాస్తున్నారు? ఏమైనా ప్రత్యేక దినమా? నిజమే మీరు చెప్పింది, అమ్మాయిలు అబ్బాయి లు అని కాదు అసలు ఈ కాలం పెళ్ళి చేసుకోబోయే పిల్లలందరిలోను ఒక లాంటి అతి తెలివి కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యి వాళ్ళు బాధ పడి తల్లి తండ్రులనూ బాధ పెడుతున్నారు. గారాబం గ పెంచుకుని పిల్లలను పేరెంట్స్ కూడా పిల్లలు (అమ్మాయైనా అబ్బాయైనా) మాటలకు తానా అంటే తందానా అంటున్నారు. ఒక విధం గా మంచిదే కాని రెండిటికి మధ్య బేలన్స్ గా వుండటం రావటం లేదు ఎవరికీ కూడా.