30, జులై 2011, శనివారం

గురు బ్రహ్మలా! వీరు కుల బ్రహ్మలు..


అంటారు.

కానీ ఇప్పుడు.. చాలా కళాశాలలో..గురువులు కుల మౌడ్యంతోకళ్ళు మూసుకు పోయిన వారే!

పిల్లలకి విద్యా బుద్దులతో పాటు మంచి-చెడు ఔచిత్యంని భోధించే గురువులే కులతత్వాన్ని ప్రోత్సహిస్తూ.. తమ కులం కాని వారిని పైశాచిక ధోరణితో..కారణం లేకుండా హింసించడం సర్వ సాధారణం అయిపోయింది.

ఒక ఉదాహరణ చెబుతాను. మేము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే.. మాకు సమీపంలో..ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ లో..పని చేస్తున్న ఒక మేడం అద్దెకి..వచ్చారు.ఆవిడ మాటల సందర్భంలో..మన వాళ్ళు కాని వారితో నేను అస్సలు మాట్లాడను అని అన్నారు. మరి మీ స్టూడెంట్స్ సంగతేమిటి మరి? అడిగాను. వాళ్ళని అంతే.. ప్రక్కకి నేట్టేయడమే!అన్నారు.
ఇలాటి వారిని గురువు అనాలా?

మనం చాలా సందర్భాలలో.. ఏ పి.హెచ్.డి. స్థాయిలోనో విద్యార్ధులని మార్కులు ఇవ్వకుండా కావాలని హింసిస్తున్నారు అనో, అమ్మాయిలని అయితే లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారనో అని విన్నాం. కొందఱు ఆ సమస్యని ఎదుర్కున్నారు కూడా.

కానీ.. ఈ రోజున చాలా కళాశాలల్లో.. లెక్చరర్స్ ,లాబ్ టెక్నీషియన్స్ తో సహా.. పిల్లలని వివిధ రకాల కారణాలతో వేధిస్తున్నారు. ఇది నిజం.

మనం పిల్లలకి.. తల్లి దండ్రులుగా ఎన్నో నీతి భోదలు చేస్తాం. వారు మనం చెప్పినదానిని ఆచరించడానికి అన్వనయిన్చుకోవడానికి..సంసిద్దతని చేకూర్చు కుంటూ ఉండగానే మన ఒడిని దాటి సమాజం అనే బడిలో..అడుగు పెట్టగానే..అక్కడ తల్లిదండ్రులు చెప్పినదానికి వ్యతిరేకంగా కనబడగానే పెద్దవాళ్ళు చెప్పేదంతా అబద్దం. వాళ్లకి బయట ఎలా ఉందో తెలియదు అనుకుని ఒక స్థిర నిర్ణయం ఏర్పరచుకుని.. ఇంట్లో..చెప్పే మాటలకి వ్యతిరేకంగా చేస్తూ ..చెబుతూ ఉంటారు.
సమాజంలో వివిధ రకాల మనస్తత్వాలు..వాళ్ళ మనుసు పై అప్లై అయి.. ఒక విధంగా కన్ప్యూజన్ లో..వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఖచ్చితంగా.. అలాటి దశే .. (అడాల్సేంట్ ఏజ్ ) ఆ దశ లోనే పిల్లల లో రక రకాల పైత్యాలు, విపరీత ధోరణి కి కారణమవుతున్నాయి.

కులం పేరిట, మతం పేరిట,ధనిక -పేద తారతమ్యాలు తో.. వర్గాలు ఏర్పడి.. అకారణ విద్వేషాలు..రగులు కుంటున్నాయి.

అది రూపు మాపాల్సింది..గురువులు. వారే కుల పిచ్చిని ప్రోత్సహిస్తుంటే.. కొందఱు అకారణంగా బలి అవుతుంటే.. చూస్తూ ఉండటం కన్నా వేరే మార్గం లేదు. ఖండించి..గొడవలు పెట్టుకునే తీరిక లేదు.మూర్ఖత్వం ముందు తలవంచుకు వెళ్ళడం నేర్చుకున్న సగటు మనుషులం అని అనుకుని నేను కూడా ఆ కోవా మనిషిగానే రాజీ పడతాను , తృప్తి పడతాను.

నాకే ఇలాటి సమస్య వచ్చింది కూడా.. మా అబ్బాయి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు..తనకి..ఫిజిక్స్ రికార్డు వర్క్ ఉండేది. తను రికార్డ్ వర్క్ కంప్లీట్ చేసుకుని.. సబ్మిట్ చేసేందుకు కాలేజ్కి..తీసుకుని వెళ్ళాడు.

ఆరోజు.. ఆ.."సర్" లీవ్ లో ఉన్నారు.స్పోర్త్స్ రూమ్లో..బాగ్ లో..పెట్టేసి.. గ్రౌండ్ లో..క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆట పూర్తయ్యాక చూస్తే.. ఆ రూం కి వెళ్లి బాగ్స్ కల్లెక్ట్ చేసుకుని బాగ్ చూసుకుంటే మొబైల్ ఫోన్స్,ఫిజిక్స్ రికార్డ్ ..మాయం. వాటి కోసం రిపోర్ట్ చేయడం.. మరలా రికార్డ్ తయారు చేసుకోవడానికి సమయం లేకపోవడం వాళ్ళ ఆ సంవత్సరం ..అ సబ్జెక్టు వ్రాయడానికి వీలు కాలేదు.అలా ఆ సబ్జెక్ట్ మిగిలిపోయింది.

నెక్స్ట్ ఇయర్లో.. మళ్ళీ రికార్డ్ తయారు చేసుకుని..సబ్మిట్ చేసాడు మా అబ్బాయి. ఎన్నో లోపాలు చూపి రిజెక్ట్ చేసారు..ఆ.. లాబ్ టెక్నీషియన్.
నిజానికి మా అబ్బాయి వ్రాసుకున్న రికార్డ్ చూసి వ్రాసుకున్న పిల్లలకి..ఓకే.. చేసారు.మళ్ళీ రికార్డ్ తయారు చేసుకుని వెళితే..అక్కడ పెట్టి వెళ్ళు తర్వాత్ చూస్తాను అన్నారంట. ఆయన ముందున్న బల్లపై పెట్టి వచ్చేసిన కొన్ని రోజుల తర్వాత ..మా అబ్బాయి వెళ్లి.."సర్ ..నా రికార్డ్ కలెక్షన్ చేసారా? ఇస్తారా అని అడగితే..అసలు నీ రికార్డ్ ఎప్పుడు ఇచ్చావ్? అన్నారట. మా అబ్బాయి కి విషయం అర్ధమై పోయింది. తనని వేధించడానికే.. అలా చేస్తున్నారని.

తర్వాత జూనియర్స్ చెప్పారట..నీ రికార్డ్ ల్యాబ్ లో..ఉంది అని.
వెంటనే అది తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పర్మిషన్ లేకుండా లోపలి వెళ్లాడన్న నెపంతో..తిట్టిపోసి.. నీ రికార్డ్ ఇక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారు..? లేదని నేను చెబుతున్నాను కదా..అని అరచి.. గెట్ అవుట్..అని బయటికి..నేట్టించుకుని అవమానం తో..బయటకి రావడం... ఆ రాత్రంతా బాధపడటం..చూసి నేను చాలా ఏడ్చాను.

సున్నిత మనస్కుడైన మా అబ్బాయి మనసు గాయపడిన మూలంగా.. ఆ రాత్రంతా నేను మేలుకుని నా బిడ్డకి కాపలా కాసుకోవాల్సి వచ్చింది.

నేను వెళ్లి ఆ "సర్" తో..మాట్లాడతాను..అంటే..వద్దమ్మా!..వాడు (గౌరవభావం తగ్గి) ఎలా పడితే అలా మాట్లాడతాడు. నువ్వు వెళ్లి వాడితో..ఏమైనా అనిపించుకుంటే..బాగోదు..నేనే చూసుకుంటాను అన్నాడు.

అయినా నేను మళ్ళీ మనసు ఆగక సెక్షన్ హెడ్ ని కలసి మాట్లాడితే..అలా ఏం ఉండదు..నేను చూస్తాను..మేడం! మీరేం..వర్రీ అవకండి..అని మాటల నవనీతం పూసి..పంపించారు.

ఒక పది వేలు ఇస్తే.. సబ్జెక్టు కి..మార్కులు ఇస్తారు.అలా ట్రై చేయక పోయారా?అని..ప్యూనుల రాయబారాలు. నేను ఏదైతే అదే అవుతుందని అలా కుదరదే కుదరదని చెప్పాను. మా బాబు వాళ్ళ నాన్న గారు..ఆ డబ్బు ఇచ్చేసి అ వేధింపులు లేకుండా చేస్తే బాగుంటుంది కదా అంటే .. కూడా నేను ఒప్పుకోలేదు.

నిజానికి.. అక్కడ అందరికి తెలుసు. ఆ..ఫిజిక్స్ లాబ్ టెక్నీషియన్ సర్..కుల గజ్జితో పిల్లలని వేదిస్తాడని.డబ్బు ఆశించి పిల్లలని ఇబ్బంది పెడతాడని.

ఇక క్యాంపస్ లో చూస్తే.. ఒకే కులం వారు ఒకే చోట వెహికల్స్ పార్క్ చేయడం దగ్గర నుండి..క్లాస్స్ లో కూర్చునే వరకు అన్ని గ్రూప్ రాజకీయాలే!
ఇతర కులాలవారు వాళ్ళ వెహికల్స్ మద్య పార్క్ చేసుకుంటే..టైర్లు లో.గాలి తీసేయడం.. కొత్త బండ్లు అయితే.. పదునైన వస్తువులతో..గీకి..అందం చెడగొట్టడం, సైడ్ వ్యూ మిర్రర్స్ మాయం చేయడం..అన్నీ మామూలే! ఇవి.. కుల మౌడ్యం తో కనిపించే సంగతులు. విద్యాలయాల్లో..విద్వేషాలు.

మా అబ్బాయి..ఈ జోన్ లో క్రికెట్ లో కాలేజ్ టీం ని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడటం, కోచ్ తో పాటు కాంప్ లకి వివిధ చోట్లకి వెళ్ళడం.. క్లాస్ లు పోగొట్టుకోవడం,పరీక్షలకి..రెండు రోజుల ముందు పుస్తకం తెరవడం.. అయినా బాగానే వ్రాయడం ఇది పద్ధతి.
వాళ్ళ టీం కి .. అటెండెన్స్ లో.. మినహాయిపు ఇచ్చేవారు . కాలేజ్ కి.. పేరు తెచ్చిపెడుతున్నారని.

అందుకు కూడా .వేధించేవారు.
ఏరా? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నువ్వు.. కాలేజ్ కి హీరో వి అయినా నా ముందు జీరో వే..అని ఎగతాళి చేస్తూ.. మానసిక హింసకి గురి చేసిన వికృత మనస్తత్వం అక్కడ పేరుకుని ఉండేది.

కాలేజ్ కెప్టెన్ గా..యూనివెర్సిటీ ప్లేయర్ గా వి.ఆర్.ఎస్.ఈ .ని ఈ జోన్ లో.. క్రికెట్ విజేతగా నిలపడంలో..ప్రధాన పాత్రధారి అయిన ..చాలా సాఫ్ట్ అయిన కుర్రాడి కే కుల వేధింపు..తప్పలేదు.

నేనైతే.. చాలా కోపంతోనూ,బాధతోనూ.అవసరమైతే..వాళ్ళ బ్యాచ్ తో వెళ్లి..ఘోరావ్ చేసినా బాగుండును అనుకునేదాన్ని. ఇలా వేధింపు కి గురికావడం ఒక చేదు గుర్తు. మరువనన్నా మరవలేనిది కదా!


కారణం .. ఆ "సర్" ఎదురైన ప్రతి సారి నమస్కారం పెట్టలేదని, తన బైక్ పై..మా ఇంటి పేరు..వ్రాయించుకుని మా కమ్యూనిటిని చాటుకోవడం..ఇవన్నీ..ఆ "సర్" కి కంటగింపు గా మారి దాదాపు మూడు సంవత్సరాలు వేధించాడు.

ఆఖరికి..నాలుగవసారి రికార్డ్ సబ్మిట్ చేసాక వారం లో ఒక సారి అయినా ఆ "సర్'" ముందు నిలబడి.. అకారణంగా తిట్టించుకుని.. తన నోటి దురుసు తనాన్ని భరించి మౌనంగా తలవంచుకుని రావాల్సి వచ్చేది. (నాకు ఇవన్నీ తెలియకుండా చాలా సార్లు జరిగేది. ఎందుకంటే..మా అబ్బాయి అంత సహనం నాకు లేదు. అకారణంగా..ఎవరు తిట్టినా నేను ఉపేక్షించను.) ఇక మా అబ్బాయి అయితే కాలం కలసి రాక వీడితో..తిట్టిన్చుకోవాల్సి వచ్చింది..అనే వాడట తన ఫ్రెండ్స్ తో..

అలా ఆ దెబ్బతో.. మావాడి హీరో ఇజం అంతా..అణిగి పోయి..ఆ లాబ్ టెక్నీషియన్ చుట్టూ తిరిగి..తిరిగి అందరి చేతా..పాపం .."నిఖిల్ "..అనిపించుకునేవాడు.

ఒకవేళ స్టూడెంట్స్ వాళ్ళ తిట్లు భరించలేక సహనం కోల్పోయి వయలేంట్ గా మారితే.. "గురువు ని కొట్టిన శిష్యుడు" అని పేపర్ లో..న్యూస్ వచ్చి ఉండేది..అనుకునేదాన్ని.

ఆఖరికి సెక్షన్ హెడ్ జోక్యంతో.. సంతకం చేసి మార్కులు ఇస్తూ.. నాన్-సి తో..పెట్టుకుంటే ఏమవుతుందో ..చూసావా? అన్నాడట..ఎగతాళిగా.. ఇలాటి పైశాచిక ధోరణి లో..ఉన్నారు..గురువులు.

ఆ ల్యాబ్ టెక్నీషియన్ "సర్" ఎవరో..ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ తెలుసు. ఆయనతో..చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటారు. గౌరవంతో కాదు..భవిష్యత్ ని బలి తీసుకుంటాడనే భయం తో.. .

ఇంకొక స్టూడెంట్ అయితే..ఏడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాడట.
ఎందుకంటే.. ల్యాబ్ లో నోరు పారేసుకుని ఆ స్టూడెంట్ తల్లిని..తిడితే.. ఆ "సర్" కాలర్ పుచ్చుకున్నాడని.. అతనికి. పనిష్మెంట్ ఇస్తూ..అతనికి..ఇంకా రికార్డ్ మార్కులు..ఇవ్వలేదట. పాపం ఈ సంవత్సరంకి..అతనికి విడుదల అవుతుంది. ఏడు ఏళ్ళు శని పీడన అన్నమాట.

చాలా కాలేజెస్ లో..కుల గజ్జి ఓపెన్ సీక్రెట్.. పిల్లలు వేధింపులకి గురి కాకుండా ఉండాలంటే.. కులానికి ఒక కాలేజ్ ఉండాలేమో! లేదా....సబ్జెక్ట్ కి..ఇంత అని.. ముడుపులు సమర్పించుకుంటే..ఇలా వేధింపులు ఉండవు...అంట.

ఇలా కొత్త కొత్త విషయాలు.. తెలుసుకుని ఆశ్చర్య పడుతూ..భాదపడుతూ నా కొడుకు కి కల్గిన కష్టం ఇంకొకరికి రాకూడదని..కోరుకుంటూ..


విద్యాలయాలు.. దేవాలయాలు. మన లోని విష సంస్కృతులని, మన ఇంటి సమస్యల ప్రభావాన్ని పిల్లల పై చూపి.. వారికి.. చదువుల వత్తిడే కాకుండా, మానసిక వత్తిడికి..గురి చేసి వారి పువ్వు లాటి మనసులని నలిపి వేయవద్దని కోరుకుంటూ..

గురు బ్రహ్మల్లారా.. కుల బ్రహ్మలు..గా..మిగిలిపోకుండా ఉండాలని..విన్నపం చేస్తూ.. ఇక్కడ నా.. అనుభవం ని పంచుకుంటున్నాను.

29, జులై 2011, శుక్రవారం

శ్రీధర్ జ్ఞాపకాలలో.

శ్రీధర్ జ్ఞాపకాలలో..ఓ..రెండు పాటలు..


ఈ పాట అమెరికా అమ్మాయి చిత్రం లో.. 
పాట..ఒక వేణువు వినిపించెను....
లిరిక్స్:మైలవరపు గోపి
సంగీతం:రాజన్-నాగేంద్ర 
పాడిన వారు.జి.ఆనంద్.


ఏదో ఏదో అన్నది.. ఈ మసక మసక వెలుతురు.. 
చిత్రం:ముత్యాలముగ్గు 
ఆరుద్ర..రచన 
సంగీతం :కే.వి.మహదేవన్.,
గానం: రామకృష్ణ  ...


                                                  
                                                     గోరంత దీపం చిత్రం ఆఖరి ఘట్టం చూడండి.

ఆకు పచ్చ జరి..అన్నీ మేలిమి బంగారు పోగులే !

"ఆకుపచ్చ జరి"   నానీల సంపుటి  పరిచయం. 
శిశిరంలో
చెట్టు దిగంబరి
అయితేనేం  ఆమనిలో 
ఆకుపచ్చని జరి...

అంటారు..నానీల గట్టి గింజల్ని చల్లిన..కవి.

నానీలను రాయడం అంటే 
పెద్ద కొండను చిన్న అద్దంలో చూపించడమే
కడలిని కమండలంలో బంధించడమే.. 

ఒక వేదికపై నానీలను చదివి వినిపించినప్పుడు..
నానీల నాన్న "ఆచార్య గోపి" అతని నానీలని విని ప్రోత్శాహించాక...    

..అతని కలం.. ఇలా అంది ..

గుండె లోతులని 
కలంతో తవ్వా 
ఉబికివచ్చే 
అక్షరధారల కోసం.. అని.

కిటికీ లోంచి
ప్రపంచం కనిపిస్తుందా?
అయితే అది తప్పకుండా
పుస్తకమే..

 అని భాష్యం చెప్పారు ..ఆ  కవి.

గర్భ సంచిలో
ఖననం
తప్పించుకుందా?
కట్నాగ్ని జ్వాలల్లో దహనం

..అని అంటూ.. నే

అతివ
అంతరిక్షంలో నడక
ఆబల అనే సామెత
అంబుధి లో మునక

.. అంటారు ఆశావాదంగా

తెలుగు పావురం
ఎగిరిపోతుంది
అమ్మో !ఆంగ్ల డేగ
రెక్కల చప్పుడు..!

.. అని భయపడుతూ..

చేతి వెన్న ముద్ద
చిన్న బోయింది
ఇప్పుడంతా
ట్వింకిల్ లిటిల్ స్టార్లే!

.. అంటారు వ్యంగంగా..

కలం పీక
నొక్కాలని చూస్తారేం?
కొత్త కావ్యం
పుడుతుంది జాగ్రత్త

.. అంటూ..హెచ్చరిస్తూనే..

మీడియా అనుకూలం
 అయితే పూల గుత్తి
వ్యతిరేకం అయితే
వాడి కత్తి.. అంటారు..పోర్త్ ఎస్టేట్ గా అభివర్ణించే..మీడియా రంగాన్ని..

అక్కడ ఆడ మాంసం
అమ్ముతున్నారు
కేజీలలో కాదు
గంటలలో..అని..వ్యధ చెందుతారు.

ఆ దీపం చుట్టూ
 అన్నీ మగ పురుగులే
రెడ్ లైట్
ఏరియా మరి.. అంటారు హెచ్చరిస్తూ..

బుద్దదేవుడు
బ్రతికి పోయాడోచ్
అతడు ఆంధ్రుడు
కాడుగా మరి..అంటూ..మిలీనియం మార్చ్ పై చురక.

రింగ్ టోన్లు
పిచుకుల కూతలా?
అంతరించిన పిచుక జాతి
స్మృత్యర్ధం .. అంటూ పర్యావరణ వినాశనం గురించి..

విజేతల గాధలు
మధుర గేయాలు
దానికి పునాదులు
గుండె గాయాలే!..అంటూ..

కవిత్వం
వ్రాయడమంటే
అంతరంగంలోకి
ప్రయాణించడమే..

అంటారు..ఈ నానీల కర్త..
మోపూరు పెంచల నరసింహం .

చరిత్ర
పుస్తకమంతా
శవాలు కాలుతున్న
కమురు వాసన..

అని చెప్పే...ఈ కవి.. తన కళ్ళతో..లోకాన్ని చూడక ..

మనసుతో..
అక్షరాలూ నాటాను
కవిత్వమనే పంటను
కలంతో కోసాను

...అంటుంటే..

"అతను తనకంటూ..ఒక లోకాన్ని సృష్టించుకోలేదు..లోకాన్నే తనలోకి తీసుకున్నారు..అంటారు.." ఆకు పచ్చ జరి..కి వ్రాసిన  ముందు మాటలో.. ఆచార్య గోపీ.

జరి అనేది బంగారు పోగుల అల్లిక.కానీ ఇక్కడ జరి..ఆకు పచ్చనిది. ప్రజలకి అన్నం పెట్టె హరిత లోకాన్ని కాంక్షిస్తూ..  ఆయన వ్రాసిన నానీలని.. "ఆకు పచ్చ జరి" పేరుతో.. నానీల సంకలనం తీసుకుని వచ్చారు.

 ఆకు పచ్చ జరి సంకలనం ని..పెన్నా రచయితల సంఘం (పెరసం) ప్రచురణ లోకి తీసుకువచ్చారు.   ఈ ఆకుపచ్చని జరి లో..అన్నీ మేలిమి బంగారు పోగులే !
నానీల జలపాతం

అందరు చదువ తగినవి.అలోచింపజేసేవి కూడా  .
ప్రతులకు.. 

పెరసం (పెన్నా రచయితల సంఘం ) 
            లేదా
మోపూరు పెంచల నరసింహం (రచయిత )
న్యూ మిలిటరీ కాలనీ
ఏ.కే. నగర్, నెల్లూరు -524004  

28, జులై 2011, గురువారం

పేస్ బుక్ లో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ గారు.

ఈ రోజు నుండి పేస్ బుక్ లో.. మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్  గారు ..మనకి కనబడబోతున్నారట.  ఒకే ఒక్కడు స్తాయిలో..కాకుండా పెద్ద మార్పు ఆశిస్తూ.. ఎల్లప్పుడు  ప్రజలకి సన్నిహితంగా  ఉంటూ..ప్రజా సమస్యలని..ఎక్కువుగా తెలుసుకుంటూ..సరి అయిన రీతిలో..సమస్యలని త్వరిత  గతిన .పరిష్కరించాలనుకోవడం..మంచి పరిణామం కదండీ! అందుకు వారికి అభినందనలు చెబుతూ.. స్వాగతిద్దాం. 
 కొంత మంది చూడండీ..పేస్ బుక్ లో.. సొల్లు కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏముంది అని..కామెంట్ చేసేవారికి..ఇది..ఒక సరి అయిన జవాబే కదా!? 
నేను మన ముఖ్యమంత్రి గారికి.. ఒక సమస్య చెప్పదలచానండీ!!
మన రాష్ట్రం లో రేబిస్ టీకాల కొరత ఏమో కాని.. మా ఇంటి ముందు వీధి కుక్క ప్రసవ వేదన పడుతుంది.చూడలేక పోతున్నాను. తగినన్ని పశు వైద్యశాలలు స్తాపించి.. జంతువులకి..సరి అయిన వైద్య సదుపాయం కల్పించే  చర్యలు చేపట్టాలి.అల్లాగే మేము  తాగే నీళ్ళలో..చిల్లగింజ వేసుకోకుండా తాగడం ఎలా? అని అడగాలి... అలా అడగడం తప్పంటారా? .. వర్ధిల్లాలి..అధునాతన ముఖ్యమంత్రి  గారు. జై..ఆంద్ర ప్రదేశ్.!!సర్వేజనా సమస్యారహిత భవంతు..  రేడియో మిర్చి వార్తా సౌజన్యం తో.. ఈ విషయం పంచుకుంటూ.. 

27, జులై 2011, బుధవారం

రమేష్ నాయుడు గారి..చిత్రం లేని ఆయన వికీ చూసి స్పందించండి...ప్లీజ్.

ఆషాడం వచ్చింది. మరో రెండు రోజులలో వీడ్కోలు తీసుకోనున్నది. 
అప్పుడప్పుడు ఆకాశం చినుకులతో భూమిని పలకరిస్తుంది.. విరహతాపమును తీర్చగా .. 
దూరంగా ఉన్న ప్రియుడిని  లేదా ప్రియురాలు ఎడబాటు వలన కల్గిన విరహవేదనని..వర్ణించిన వేటూరి పాట గుర్తుకు వచ్చింది.
ఆ పాటకి అద్భుత సంగీతాన్ని అందించిన రమేష్ నాయుడు గారు, 1983 లో..ఆయన కి లభించిన  జాతీయ అవార్డ్  తలపుకి వచ్చింది.
ఆ పాట ఆలపించిన గాన గంధర్వుడు కే. జే.యేసు దాస్ గళం కి హారం గా ఒదిగిన జాతీయ అవార్డ్ ని గుర్తు చేసుకుంటూ.. ఈ ముగ్గురి  మేలు కలయికని ఉదహరిస్తూ..ఒక టపా వ్రాద్దామని.. మొదలెట్టి..లింక్ కోసం.... యూట్యూబ్ కి వెళ్లి..పాట ప్లే చేసి చూసుకుంటూ.. నా అలవాటైన..పని  చేస్తున్నాను.(అంటే నాలా ఈ పాటని విని,చూసి  స్పందించిన వారి వ్యాఖ్య లని చూస్తున్నాను) ఒక చోట ఆసక్తి..గా ఉంది.చదివి భ్రుకుటి  ముడి పడింది.అద్దం పెట్టి చూసుకోనక్కరలేదు కదా! తెలుస్తుంది కదా!:))))) అది ఏమిటో..మీరు చూడండి. 

ఆకాశ దేశాన ఆషాడ మాసాన పాట చూస్తూ..  కే.జే.యేసు దాస్ గారి గళం వింటూ.. రమేష్  నాయుడు గారి స్వరాలూ వింటూ..  క్రింద  తప్పకుండా.. చూసి స్పందించండి...ప్లీజ్ !!    
Friends, I am a Tamilian. I do not know Telugu My little Telugu comes from The beautiful kritis of Thyagaraja which I learnt from a respected Guru here in Trichy.
Anyway I love all the songs of this landmark movie. The pity is when you search for Ramesh Naidu, it takes you to the wikipedia page. But there is no photo of this great composer. If anyone of you can upload his photo, it will be a great service.
Regards,
S.Suresh,
Trichy.
SIVARAMSURESH 8 months ago
ఇలా ఒక స్పందన ఉంది. సంతోషించాలో..భాదపడాలో అర్ధం కాలేదు.
వెంటనే  వికిపిడియా వెతుక్కుంటూ వెళ్లాను. అక్కడ క్రింద ఉన్నట్లు కొద్ది  గంటల దాకా ఉంది.  ఒక రాష్ట్రేతుడు  స్పందించి నంతగా మనం స్పందించలేదు. అతను..ఆ విషయం తెలిపి..భాధ పడి 8 నెలలు అయినా.. ఒకరు కూడ స్పందించలేదు. ఒక ఉత్తమ సంగీత కర్తకి.. ఇదేనా లభించే గౌరవం? చిత్రం లేని వికీ..నిండుగా లేదని నా భావన. ఆయన స్వరాల వెల్లువ లో కొట్టుకుని పోతూ..ఆయన పట్ల మనం చూపే గౌరవ భావం ఇదేనా? అనిపించించింది. నేను ఆయన చిత్రం పెట్టాలని ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా కంత పరిజ్ఞానం  లేదు. ఎవరైనా స్పందించండి..ప్లీజ్!!

Ramesh Naidu
Born1933 (age 77–78)
KondapalliAndhra Pradesh,India
OccupationMusic Direct
Pasupuleti Ramesh Naidu (1933 – September 3, 1987) was a South Indian music director. His major works were in Telugu films in the 1970s and 1980s. The music he did for the film Megha Sandesham is considered as his best score.                                           ఇక్కడ  రమేష్ నాయుడు గారి చిత్రం జత పరచే ప్రయత్నం చేయండి..25, జులై 2011, సోమవారం

సిరివెన్నెల శోభ

మురళీ మనోహరం! భారతీయసంగీతపుఆత్మ
జగత్ వశీకరణం ఈనాదం 
సాహితీ సంద్రాన ఉవ్వెత్తున ఎగసిపడే భావ కెరటం 
సంగీతం నా.. చెవుల ద్వారా ఆత్మను చేరే వేళ  నా మనస్సు స్వర్గాన్ని తాకుతుంది.. అన్నారు  ఒక కవి..
ఆ కవి మాటలకి..స్పూర్తితో.. అది  నిజంగా ..నిజం .సంగీతానికి   సరిజోడీ అయిన సాహిత్యం తోడైతే..
అది ఒక సినిమా పాట అయితే ..

ఆపాటే.. సిరి వెన్నెల పాట.

చాలా మందిఈపాట తమకి.. చాలా చాలా ఇష్టమనిచెబుతూ ఉంటారు.
 ఎందుకంటే ..అలసిన మనసుకి ఓ..పాట.ఆ పాట మనసుని సేదతీరుస్తూ.. తన ఒడిలో.. మన అందరిని అమ్మలా.. అమ్మ పాడిన జోల పాటలా..లాలిస్తే.. ఎంత బాగుంటుంది!మరి ఆ పాట.. జగమంతా..పాలిస్తుంది.

ఆ పాటే.. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..నాకు.. చాలా చాలా చాలా.. ఇష్టమైన పాట.. ఎద కనుమలలో.. ప్రతిధ్వనించిన విరించి..విపంచి గానం ..ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో..అ పాట కోరిన వారి  పేరులలో.. అత్యధికంగా.... ఎవరైనా ఉన్నారంటే  అది నేనే! ఇప్పటికి.. ఆ పాట ప్రసారమైతే..వింటూ.. నన్నే తలచుకుంటారు..

ఆ .. పాట సాహిత్యం ,సంగీతం నా..పై..గాఢ ముద్ర  వేసాయి.నా మనసు బాగోలేనప్పుడు  ఈ పాట వింటే చాలు .. మనసు దూదిపెంజలా మారిపోతుంది..ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం కదా..! ఫ్రెష్ గా నూతన   ఉత్తేజం నింపుకుని  జీవితాన్ని  జీవిస్తాను. తెలుగు సిని సంగీతంలో.. ఉస్తాద్ పండిత్ హరిప్రసాద్ చౌరాసియా అంటేనే  నాకు వండర్  అనిపించింది.. ఎందుకంటే.. నాకు .. . ఆయన బాన్సురి పరిచయం ఉంది ఎలా అంటే.. సిరివెన్నెల సినిమా కన్నా   ముందు.." సిల్సిలా" చిత్రంలో..వారి వేణు నాదం ఆ సినిమా..స్టార్టింగ్ లో..   మనలని అలరించింది. అప్పుడే  .. హరిప్రసాద్ గారి వేణు నాదం గురించి తెలిసింది. తర్వాత.. సిరివెన్నెల  చిత్రం .. కథానుగుణంగా   ప్లూట్ ప్లేయింగ్  మనలని.. వినువీధుల్లో.. విహరింపజేసింది.. ఎంతైనా.. సంగీతపు ఆత్మని తన అణువణువునా..నింపుకున్న కళాకారులు కదా! ..

 సంగీత వినీలాకాశంలో..చందమామ.. కే.వి.మహదేవన్.. భారతీయ సంగీత దిగ్గజం మేరుపర్వత నగదీరుడు.. హరిప్రసాద్ చౌరాసియా మేలికలయికతో.. వచ్చిన పాటలు.. ఎంత హిట్.. అయి..అందరి వీనులు విందు చేసాయో.. కదా ! ".పశుర్వేత్తి,శిశుర్వేత్తి,వేత్తి గాన రసః ఫణి " ..అంటే.. ఇదేనేమో! సరసస్వర సుర ఝరీ..గమనమౌ సామవేద సారమిది..ఈ..గీతం. సహజంగా.. వేణు నాదాన్ని  ఇష్టపడే నేను..  ఈ.. బాసురి..నాదాన్ని.. వినడం అంటే.. నన్ను..నేను మర్చిపోయినట్లే. ఇక సాహిత్యం విషయానికి  వస్తే..సీతారామశాస్త్రి గారికి.. ఈ.. సినిమా పేరునే.. ఇంటిపేరుగా.. ఇచ్చిన ఘనత  సాహిత్యానిదే..

ఇక పాట లో.. తారాగణం సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, సంయుక్త        వీరిచేత జీవింపజేసిన  మన తెలుగు  కళామ తల్లి ముద్దు బిడ్డ .. కళా తపస్వి..  పాటకి.. గళం అందించిన.. ఎస్.పి.బాలు,సుశీలమ్మ,  ఎవరిని వదిలేసినా.. క్షమించరాని నేరం చేసినట్లే..  ఇంత మంది.. విద్వత్తు కలిస్తే.. ఈ..పాట.

 నీకు ఏ..పాట అంటే ఇష్టం అంటే.. నేను టాప్ వన్ గా.. చెప్పే పాట..  నిను నిద్రిస్తున్న సమయంలో.. ఎక్కడైనా ఈ..పాట వినిపిస్తున్నా..వెంటనే.. నన్ను..నిదుర లేపే పాట  ఈ..పాట.  నా అంతిమ యాత్ర .. ఈ..పాటతో.. సాగాలి అని నా.. కొడుకుకి.. చెప్పిన మాట. . ఇంత చెప్పి ఈ..పాట గురించి ఏమి చెప్పలేదు కదూ! ఎందుకంటే. ఈ..పాట గురించి చెప్పటానికి..

నాకు.. మాటలు లేవు.. అనుభవం చాలదు.. నేను.. అంత ఎదగలేదు.. ఇంత గొప్ప పాట గురించి.. చెప్పటానికి.. నాకు సాహసం లేదు  .. ఇన్నాళ్ళు.. చెప్పనిది..కూడా..అందుకే.. ఏమైనా..చేప్పగల్గుతానేమో.. అని.. వెయిట్  చేసాను.  ఉచ్స్వాసం  కవనం ..నిశ్వాసం గానం...  అంతే! ఆపాత మధురం సంగీతం.. ఆలోచనామృతం ..సాహిత్యం. .. ఈ..రెండూ.. ఈ..పాటలో.  The flute is symbol of the spiritual call. The  call of the divine love .. సంగీతపు ఉస్తాద్.. మాటలో.  పాటని ఆస్వాదించండి  ఈ లింక్ లో 
బాపు బొమ్మగా వాణీశ్రీ అభినయం.. భక్త కన్నప్పతో.. ఓ..పాట ...

భక్త కన్నప్ప చిత్రం గుర్తుకు రాగానే.. నాకు శ్రీ కాళహస్తి ఎంత గా గుర్తుకు వస్తుందో..! 
అంతగా..కృష్ణంరాజు నటన.. బాపు బొమ్మగా వాణీశ్రీ అభినయం ..అంత గుర్తుకు వస్తాయి.నా చిన్నప్పుడు నాకు ఎనిమిదేళ్ళు అప్పుడు మా పిన్నితో కలసి  ఆ చిత్రం  చూసి..తెగ నచ్చేసి  కాళహస్తి చూడాలని తెగ ఉబలాట పడిపోయి ..అందరిని..శ్రీ  కాళహస్తి ఎప్పుడు వెళతారు.. నన్ను తీసుకుని వెళ్తారా? అని అడిగేదాన్ని. ఎవరు తీసుకుని వెళతాం అనేవాళ్ళు కాదు.  వెళ్ళినా నాకు తేసిసేది కాదు.. తర్వాత తెలిసాక తెగ కోపం వచ్చేసి.. రోషంతో..ముక్కుపుటాలు ..అదురుతూ..ఏడ్చేసి
తెగ పోట్లాడే దాన్ని...
ఆ తర్వాత మా కుటుంబం అంతా  ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణం లో.. శ్రీ కాళహస్తి లో..ఆగి అక్కడ ఒకటి రెండు రోజులు ఉండాలనుకున్నప్లాన్ కి గండిపడింది. తిరుపతిలో మాచెల్లి తప్పి పోయి..ఎలాగోలా..మూడు రోజుల వెదుకులాటలో..దొరికి ..అమ్మయ్య అనుకుని ..ముందు అనుకున్నవి వాయిదా వేసేసి.. తిరుగు ప్రయాణం లో  బస్సు లో నుండి సువర్ణముఖి పరవళ్ళు చూడటమే దక్కింది నాకు... ఇప్పటికి నాకు సువర్ణముఖి అంటే..అప్పటి పరవళ్ల దృశ్యమే..గుర్తు ఉంటుంది.ఈవాల్టి..ఎండిన, తవ్వేసిన నది..దృశ్యం బాధాకరం. 
భక్త కన్నప్ప చిత్రంలో.. చూసిన స్వర్ణముఖి నదిలో.. ఆడిపాడుతూ..గంతులు వేయాలన్న నా కోరిక ..మా బుడమేరు వాగులో..ఆడి పాడి తురుగుతూ..తీర్చుకున్నాన్..లెండి. అలా నా కల వేరవేరి..అలా  ఆ చిత్రం పట్ల గొప్ప ఇమేజ్ ని..మిగిల్చింది.  శివయ్య పై భక్తి  భావనని పెంచింది.ఎంత భక్తి భావం అంటే..ఒడలు పులకిన్చెంత  భక్తి భావం.
అలాగే  ఈ  చిత్రం.. లో..అన్ని విలువలు.. ఇప్పటికి.. నాకు.. ఆశ్చర్యమే! "ముత్యాల ముగ్గు" చిత్రం కన్నా ఎందుకో..ఈ చిత్రం ఇష్టం నాకు. పాటలు  విషయంలో.. సంగీతం చాలా బాగుంటుంది. ఇక సాహిత్యం అయితే..చెప్పనవసరం లేదు.ఇలాటి పాటలు వింటూనే.. తెలుగు మాధుర్యంని.. సాహిత్యం పట్ల మమకారాన్ని పెంచుకున్నాను. కిరాతార్జునీయం అంటే.. ప్రాణం.. వేటూరి ..పద పదమున నటరాజు నర్తనమే..గోచరించెను.  

ఈ పాటలో..ఎంత సహజంగా ప్రకృతిలో.. ప్రకృతి-పురుషుడు,శివుడు-శక్తి ..కలిసిపోయినంత గొప్పగా..ఒక చక్కని అనిర్వచనీయ మైన అనుభూతిని..అందించే పాట.. చూడటం నాకు మైమరపు.మదిలో..ఓ.. మంచి..భావానికి..ఊపిరి పోస్తుంది.   మీరే చూడండీ....ఎంత బాగుంటుందో!  ఎంత గొప్పగా ఉంటుందో!  ఆరుద్ర కలం నుండి వెలువడిన ..పదం పదం ఆస్వాదించి.... సాహిత్యం తో పాటు... దృశ్యాలకి అభిమాని ని.. అయి ..ఆదినారాయణ రావు-సత్యం సంగీతం లో.. తేలియాడుతూ.. ఈ పాట మీతో పంచుకుంటున్నాను. 
   


పాట సాహిత్యం :

ఆకాశం దించాలా..  
నెలవంకా తుంచాలా  సిగలో ఉంచాలా (ఆ) 
చెక్కిలి నువ్వు నొక్కే టప్పటి  చక్కిలిగింతలు చాలు 

ఆకాశం నా నడుమూ.. నెలవంకా నానుదురు
సిగలో నువ్వేరా...

పట్టు  తేనె తెమ్మంటే చెట్టెక్కి  తేస్తానే .. తేస్తానే  
మిన్నాగు మణి నైనా పుట్టలోంచి తీస్తానే.. తీస్తానే 
ఆ.... పట్టు తేనె నీ కన్నాతియ్యంగా ఉంటుందా 
మిన్నాగు మణి కైనా  నీ ఇలువ వస్తుందా
అంతేనా అంతేనా..?.. 
అవును అంతే రా ..
ఆకాశం  అంచులలో భూదేవి కలిసేలా కౌగిట్లో  కరిగేరా (ఆ) 

సూరీడు ఎర్రదనం సింధూరం చేస్తానే.. చేస్తానే.. 
కరి మబ్బు నల్లదనం కాటుక దిద్దేనే ..  దిద్దేనే.. ..
ఆ.. వీవంటి వెచ్చదనం  నన్నేలే సూరీడు 
నీ కంటి చల్లదనం..   నా నీడ నా గూడూ.. 
అంతేనా అంతేనా..?
అవును అంతేరా ... 
మెరిసేటి చుక్కల్లో నెలవంక చుట్టాల తలంబ్రాలు  పోయ్యాలా..
గుండె లోన గువ్వలాగా కాపురం ఉంటె చాలు. (ఆ) 

ఈ పాట ని దృష్టిలో..ఉంచుకునే మహేష్ బాబు ఒక్కడు లో. . చందమామని తుంచి   కొప్పులో ఉంచాలా  వచ్చి ఉంటుంది..అని నవ్వుకుంటాను
ప్రియుని..అతిశయం  ప్రేయసి..మనసులోని..ప్రేమ ముందు విలువ ముందు దిగ దుడుపే కదా! !. పట్టు తేనె నీ కన్నా తీయంగా ఉంటుందా.?  మిన్నాగు మణి కైనా నీ విలువ వస్తుందా  ? నీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడు.నీ కంటి చల్లదనం నా నీడ  నాగూడు . ఇలాటివి ఎంత అర్ధవంతంగా ఉంటాయో!  ఇక పోతే ఈ చిత్ర నిర్మాణం .. శ్రీ కాళహస్తి చుట్టూరా  చిత్రీకరించలేదు. వట్టిసీమ,బుట్టాయిగూడెం.పరిసర ప్రాంతాలలో.. గోదావరి ఒడిలో..చిత్రీకరించారు. తర్వాత తర్వాత చూసి..సువర్ణముఖి అలా ఉండదని తెలిసి ఊసూరుమనిపించింది. అయినా..యే  నదీమ తల్లి ఒడి.. అయినా పచ్చదనాల,చల్లదనాల చిరునామా యే కదా! ఈ పాట లో..అదే చూడండీ!...
.

24, జులై 2011, ఆదివారం

మాతృత్వంలోనే ఉంది

మాతృత్వం లోనే  ఉంది   కులగౌరవం  చిత్రం లో.. ఈ పాటకి.. పెద్దగా పరిచయం అవసరం లేదు అనుకుంటాను. చాలా చక్కని పాట.

రేడియో పుణ్యమా అని ఇప్పటికి..ఈ పాట వింటూ ఉంటాను.

కొసరాజు రాఘవయ్య చౌదరి గారి సాహిత్యంలో.. టి.జి.లింగప్ప గారి సంగీతంలో..ఆలు-మగల అనురాగాన్ని..మాతృత్వం గొప్పదనాన్ని చెపుతుంది. నాకు చాలా ఇష్టమైన పాట ఇది.
పాట సాహిత్యం:
మాతృత్వంలోనే  ఉంది ..ఆడ జన్మ సార్ధకం
అమ్మా! అని పిలిపించుకునుటే  స్త్రీ మూర్తికి గౌరవం (మా)
స్త్రీ -పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు 
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు  (స్త్రీ)
మబ్బు  వెంట  నీరు వలె 
పువ్వునంటు తావి వలె (మబ్బు)
అనుకృతముగా వచ్చును ఈ సంబంధం ..
ఈ అనుబంధం ఆలుమగలు బ్రతుకున పండించుకున్నపరమార్ధం (మా)

ప్రకృతి కాంత పురుషుని  ఒడిలోన పరవశించినది 
భూమాత మురిసి పచ్చ పచ్చగా నవ్వుతున్నది  (ప్ర )
అంతా అనురాగామయం ఆనందానికి నిలయం 
పతి హృదయమే సతికి నిత్య సత్యమైన.. ఆలయం 
పూజించే దేవాలయం..
భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం (మా) 

23, జులై 2011, శనివారం

అసుర సంధ్య వేళ ..వేటూరి పాట


అమరజీవి చిత్రం ..గుర్తుందా? ఆ చిత్రంలో..ఓ..వింత ప్రేమ కథ. ఆసాంతం అపార్ధాలతో..నడచి..ఆఖరికి ప్రేమించిన ప్రేయసి భర్తకి.. తన కళ్ళని దానం చేసి అమరజీవిగా నిలిచిన..ఓ..ప్రియుని కథ. చిత్రం కన్నా పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామీ "అనే పాట..నాకు బాగా నచ్చుతుంది. వేటూరి గారి .. సాహిత్యం ..చాలా ఇష్టంగా వింటాను.

ఈ పాట తరచూ కోరి మిగతా శ్రోతల వినబడని తిట్లు తింటూ ఉంటాను. ఎందుకంటే ఆరు నిమిషాల పైబడి ఉన్న పాటని ఆస్వాదించడం తెలియకుంటే..పరమ చిరాకు కల్గిస్తుంది. అర్ధమైన వారికి..ఒక రసస్వాదన.శ్రీవారికి ప్రేమలేఖ కన్నా ముందు వేటూరి గారి పద రచన .. ఓ..ప్రేమ లేఖ రూపంలో..ఈ పాట ముందు సాకీగా సాగుతుంది.

ఈ పాట ఒక వేదిక పై సాగుతూ..నాయికా నాయకుల ఊహా లోకంలో సాగుతున్నట్లు గుర్తు...ఉంది. ఒక వేళ ఏమైనా మార్పు ఉంటే.. తప్పని తప్పు సమాచారంకి..మన్నించ గలరు. . ఇక్కడ పాట నేపధ్యం కన్నా పాట సాహిత్యం,సంగీతం,భావం చెప్పదలచాను. ఈ పాట సాహిత్యం కూడా.. చాలా కష్టపడ్డా సేకరించలేక.. వింటూ..వ్రాసుకున్నాను. ఇది అంతా పాట పై మమకారమే! అదీ.. వేటూరి పాట పై..ప్రత్యేక మమకారం.

ఇక కథలో ..నాయకుడేమో.. విరాగి. ప్రేమ దోమ తెలియని సదాచార సన్యాసి. నాయిక ఏమో..అతని పై..ప్రేమ ని మక్కువగా పెంచుకుని సిగ్గు బిడియాలు విడిచి..అతనికి..తన ప్రేమని.మొహాన్ని,కోరికని..బాహాటంగా తెలియ జేస్తుంది. అతనేమో..కాదు పొమ్మంటాడు. తగదు..తగదు పాపం అంటాడు.
కావ్య లక్షణంతో..నాయికా నాయకుల మద్య జరిగిన ప్రేమ,శృంగార &వైరాగ్య భాషణంబులని.. పాటలో..చెప్పడం తెలుగు చిత్రాలలో..కొత్త కాకపోయినా.. ఈ పాట ఆసాంతం ఓ..కావ్యం చూస్తున్న భావాన్ని కల్గిస్తుంది అనడంలో ..సందేహం లేదు అనుకుంటాను.జంధ్యాల గారి దర్శకత్వంలో..ఈ చిత్రం రూపు దిద్దుకుంది. వేటూరి గారి కి..జంధ్యాల గారికి..ఆలోచనల సమతుల్యంలో..ఈ పాట..చూడ చక్కనిది. శ్రవణానంద కరమైనది కూడా.పాట సాహిత్యం :

శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి పుంభావ భక్తి ..
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి,నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజల కు పువ్వుగా, జపములకు మాలగా, పులకించి పూమాలగా..
గళమునను, స్వరమునను, ఉరమునను
ఇహములకు, పరములకు నీదాన నే !.
ధన్యనై ,జీవనవ దాన్యనై తరియించుదాన..
మన్నించవే..!మన్నించవే!! అని విన్న మించు నీ ప్రియ సేవిక ..
దేవ దేవి. .

అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి..ఆడ ఉసురు తగల నీకు స్వామీ.! !
ముసురుకున్న మమతలతో..కొసరిన అపరాధమేమి ?
స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిని వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

హరి హరి సుర జేష్ట్యాదులు ,కౌశిక వ్యాసాదులు
ఇగ తత్వములను దెలిపి, నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని ..నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ..పడకు పెడ దారి (అసుర )

నశ్వరమది..నాటక మిది
నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసేవరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుని ముంగిట రంగ వల్లికని కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ!(అసుర)

అలిగే నట శ్రీ రంగం..తొలగే నట వైకుంటం
యాతన కేల దేహం ..ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము వీక్షణమే మరు తాహము
రంగా! రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అనుభవించు ఒడి చేరి..(అసుర)

ఎ పాటలో..జయ ప్రద గారు యెంత బాగా రొమాంటిక్ భావాలు ఒలికిన్చిందో.! అలాగే పాటలో.. సుశీల గారి..స్వరం ఎంత బాగా భావాలని అందించిందో.!! వినడమే తప్ప సంగీత జ్ఞానం లేని దాన్ని..వర్ణించలేను.
ఈ చిత్రం లో..మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి,(జయప్రద)ఓదార్పు కన్న చల్లనిది.. (సుమలత) పాటలు..
చాలా బాగుంటాయి.ఇక ఏ.యెన్ .ఆర్ గారి నటనా చాతుర్యం ని.. చెప్పడానికి మాటలే చాలవు.

ఇక పాట వినేయండీ!! అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి

ఈ పాటలో నాకు ఇష్టమైన అంశాలు.. జయ ప్రద గారి నటన, వేటూరి గారి సాహిత్యం .సుశీల గారి గళం .. అంతా మధురం.
ఒక అజ్ఞాత మిత్రునికి కృతజ్ఞతలు. తప్పులు గానేను అందించిన సాహిత్యాన్ని సవరించించి నందులకు. మరీ మరీ కృతజ్ఞతలు..తో..ఈ పోస్ట్

22, జులై 2011, శుక్రవారం

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు


ఈ రోజు దాశరధి గారి జయంతి..

దాశరధి గారి మొదటి కవితా సంపుటి "అగ్నిధార"

ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో.. దాశరధి గారిది ఒక ప్రత్యేక అధ్యాయం.ఆయన తెలంగాణలో పుట్టడం మూలంగా..భారత స్వాతంత్ర్య పోరాటంలో..ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం  లేకపోయిందని.. చెపుతారు.దాశరధి అటు భారతావని మొత్తం స్వాతంత్ర్య సమర శంఖం పూరిస్తుంటే.. తెలంగాణం లో..ఆ ప్రాంత విముక్తి కొరకు పోరాడవలసి వచ్చినదంటే ..నిజాం పరపీడన వల్ల ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాల్బడ్డారో !

దాశరధి తెలుగు దేశంలో ఒక భాగమైన తెలంగాణా స్వాతంత్రోద్యమానికి శంఖం  పూరించారు. ఆ  ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టములకి  గురి అయ్యారు. జైల్లోను,ఉద్యమంలోను.. బాధతో..కవితావేశంలో.. ఆయన వేలువరించిన ఎన్నో కవితా ఖండికలను..మనం దృష్టిలోకి..తీసుకున్నా అందులో..ప్రధానమైనది.."అగ్నిధార"

తెలంగాణా విముక్తి పోరాటంలో తెలుగువారల సమరగీతం దాశరధి లో..ప్రస్పుటంగా కానవస్తుంది.ఆయన ప్రజా కవి. ప్రేక్షకుని వలె కాకుండా ప్రజల కష్టనష్టాలలో  ..తానోకడిగా కలసిపోయి ఉద్యమ వీరుడిగా "పెన్'' అనే ''గన్"  పట్టి..గళం అనే బుల్లెట్ లు వెలువరించి..ప్రజా శక్తులతో కలసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్య రంగంలో..దూకించారు.

నిజం పాలనలో విసిగి పోయిన తెలంగాణా ప్రజల  ఆవేశం,ఆకాంక్షలన్నీ..దాశరధి కవిత్వంలో..ప్రతిబింబించాయి..రజాకార్ల దుండగాలతో ..ఆస్తుల దోపిడీలతో..గృహదహనాలతో ,స్త్రీల మాన అపహరణ లతో.. మారణ దారుణ కాండ కి అట్టుడికి పోయిన కాలంలో.. దాశరధి ఆగ్రహావేశంతో..

ఓ..నిజాం పిశాచమా!కానరాడు 
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని 
తీగెలని తెంపి ,అగ్నిలో దింపినావు 
నా తెలంగాణా కోటి రతనాల వీణ

తర తరాల స్వప్నాల సుందర ఫలమ్ము 
స్వైర భారత భూమి చూపెడెనో  లేదో
విషం గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజం నవాబు జన్మజన్మాలబూజు 

అచట పాపము దౌర్జన్య మావరించి  
తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి 
మత పిశాచం పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి లోకమ్ము మీద 

నా తెలంగాణా  కోటి రతనాల వీణ 
తీవియలు తెగి  విరిగి నదించ కుండే 
నా తెలుగు జాణ ప్రాణమానాలు దోచి
ఈ నిజం పిశాచి  కన్నెర్ర చేసే..

ఇలా.. సాగింది..అగ్నిధార . సమర గీతమై నిలిచింది.నిజాం ..ప్రభుత్వం ఊరుకుంటుందా ? ఇనుపగొలుసులతో  బంధించి ఓరుగల్లు నగర వీధుల్లో..నడిపించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్భందించింది. అగ్ని ప్రజ్వరిల్ల కుండా ఆపడం ఎవరి తరం? విప్లవ కవిత్వాన్ని జైలు గోడల మీద శిలాక్షరాలుగా  లిఖించాడు..దాశరధి.
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు. 
తెలంగాణా స్వాతంత్రోద్యమ కవిత ..దాశరధి గళంలో.. పద్య,కావ్య రూపాలలో సాగినా.. ప్రజలు మెచ్చినది..అగ్నిధార..మాత్రమే !

దాశరధి కి కన్నతల్లి అంటే యెంత ఇష్టమో..తెలంగాణ మంటే   అంత ఇష్టం..ఆమెని వేనోల్ కీర్తించి.. తన "రుద్రవీణ" ని ఆమెకి అంకితం  చేసాడు.    

చివరకు నిజాం ప్రభువు..హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో..విలీనం చేసిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..సమైక్యంలోనే అర్ధం ఉందని తలచి.. సమైక్య భావనకి..నడుం బిగించి.. విశాలాంధ్ర సమైక్యత కోసం పద్యాలు వ్రాసారు. ..
తుంగభద్రానదీ భంగమ్ములిరుక్రేనా 
లోరసిపారుచు రుచు లరయు చుండ 
కృష్ణ వేణీ    తరంగిణీ నాలుకలుచాచి 
దారుల రెండిట "మజా"లరయుచుండ
గోదావరీ వీచికా దివ్యహస్త మ్ము 
లిరుకేలన్కుల మన్ను తరచు చుండ 
కోటి   కిన్నెరసాని మాటి మాటికి పొంగి 
రెండు వైపులా దరు లోడంగోనగా 

ఇటునటును తెల్గు  నేల లారటంనోంది
కలసి పోబో జూచున్న యట్టులనే దోచు 
కలిమివేయుము న తెలంగాణ తల్లి 
మూడుకోట్లునోక్కనే ముడి బిగించి ..

నా కోర్కె దీర్చుమమ్మా! 
నీవు మదీయశ్రు కణ  వినిర్మితమాలా 
నీక మ్ము సమర్పించెద 
గాక ,విశాలాంద్ర మనేడి కల నిజమగుతన్ .. అని నదుల నిలా సమైక్య సూత్రంగా వాడారు. 
ఇలా  ప్రాంతం కొరకు,విశాలాంద్రం  కొరకు....ఆయన కలం నర్థించినది.
పునర్నవం,ఆలోచనాలోచనాలు,తిమిరంలో సమరం.. ఇలా కావ్య సృష్టి సాగింది. 

ఎవడైనా మానవుడే-ఎందుకు ద్వేషించడాలు? రాక్షసి నైనా మైత్రికి రానిత్తును భయం లేదు!

హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు -ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచించదు 

గతాన్ని కాదనలేను ,వర్తమానం వద్దనబోను ,భవిష్యత్ ఒదులుకోను ..కలం నా కంట మాల .. నా పేరు ప్రజా కోటి -నా వూరు  ప్రజా వాటి ..అంటారు. 

బాంబులలో బలం చచ్చి -పాములలో విషం చచ్చి 
ప్రేమములో బలం హెచ్చి -స్నేహంలో  శక్తి హెచ్చి
చిన్న పాటి అంకుశామున-గున్న ఏనుగును వంచే 
కొత్తరకం పడ్డాయి కనుగోన్నాను రండో !..అంటూ.. ఆయన పథం ని మనకి చూపారు. 

తిమిరంతో ఘన సమరం -జరిపిన బ్రతుకే అమరం 
కవితా తేజోవలయం-అవని శాంతికి అది నిలయం ..అని చెప్పారు. సందర్భాలు వేరువేరుల్లో.  

కమ్మని నా తెలంగాణ ..తొమ్మిది జిల్లాలేనా ? 
బహు లాంధ్రకు తెలంగాణ పర్యాయ పదం కాదా....అన్నారు. వేర్పాటు వాదాలు ని ఆయన మందలించారు. 

ఒక్క తెలుగు -ఒక్క  వెలుగు..అని నినదించారు. 

తల్లీ!నిను ముక్కలోనరించ దలచు వారి 
ఆశ అది ఆశలైయున్న అవసరాన 
నీ పదమ్ము ల్ల  పై తల మోపి నేడు 
చించు చుంటి ఆనందాశ్రు బిన్దువులును.. 
.
నవంబర్ ఒకటి..మనమంతా ఒకటి ..

సూర్య చంద్రులున్నంత వరకు తెలుగు జాతి ఏక సూత్రం పై నిలవాలని ఆయన  ఆకాంక్ష. 

కుడి కంటిని  ఎడమ కన్ను పొడిచేనా ?
కుడి చేతిని ఎడమ చేయి నరికేనా ? 
ఒక దేహం-ఒక గేహం మరిచావా ?
ఒక్క తెలుగు ఒక్క వెలుగు మరిచావా? 
వెలుతురుబాకు 

విడిపోవుట -చెడిపోవుట 
విడిపోవుట -పడిపోవుట 
కలసియుంట గెలుచుకుంట 
తెలుగు విలువ తెలుసుకునుట ! 
గుండెను రెండుగా చీల్చు మొండితనం పనికి రాదు
మనుషులని ఏకం చేసే మంచితనం కావాలి.... 
ఇది.. ఆయన భావన. 

ఈనాటి స్వార్ద కుటిల రాజకీయ నాయకుల  పన్నాగాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా  రుద్ది.. ప్రాంతాల  పేరిట.వెనకబాటు తనం పేరిట వేరు కుంపట్లు పెట్టి  విధ్వంసాలు సృష్టించే.. నాయకులు.. ఆంద్ర ప్రాంతం వారిని నిజాం ప్రభువులతో పోల్చి.. తెలంగాణ వాదంతో..అవమాన పరస్తున్నారు. అసలు  తెలంగాణ ప్రజల వెనకబాటుతనం ఎందుకు ఉందో.. ఆలోచిస్తూ.. ప్రజల కవి.. వాస్తవ దృక్పధం కల్గిన సమరశీలి దాశరధి..ని ఒకసరి  పరికించి చూస్తే.. తెలుగు వారిగా వారు ఏం కోరుకున్నారో అర్ధం అవుతుంది.తెలుగు దేశాన్ని..ఇంతగా ప్రేమించిన కవి దార్శకనీయత..ఏమిటో..అర్ధం కావాలని..ఒక చిన్ని ఆశతో.. ఈ..వ్యాసం.  
ఆకాశవాణి విజయవాడ "ఏ" కేంద్రంలో  (2004 జూలై ఇరవైరెండు  న) సాహితీ కార్యక్రమంలో.. ప్రసారం  అయిన ..  నా  ప్రసంగ వ్యాసాన్ని కుదించి..ఈ పోస్ట్.. 

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు. ఆ బాకు  అజ్ఞాన తిమిరాన్ని..చీల్చి చెండాడాలని.. .. ముకుళిత హస్తములతో..నా అభిమాన కవి..కి..పాదాభి వందనాలతో.. 

21, జులై 2011, గురువారం

నా మనసే ఒక తెల్లని కాగితం

అర్దాంగి ..పాత చిత్రం కాదండీ ! జయసుధ,మురళి మోహన్ జంటగా నటించిన చిత్రం. అందులో నా మనసే..ఒక తెల్లని  కాగితం అనే పాట గురించి..ఆ పాట చాలా బాగుంటుంది. అర్ధాంగి  కి అర్ధం ఆ చిత్రం ..ఆ అర్ధాంగి  మనసే ..ఈ పాట. పాటని కొంచమే వీక్షించగలం. అంతవరకే లభ్యం అయింది .. అయినా  చూడండి..ప్లీజ్!

నా  మనసే  ఒక  తెల్లని  కాగితం .పాట సాహిత్యం :

నా మనసే ఒక తెల్లని కాగితం 
నీ వలపే తోలి వెన్నెల సంతకం (నా)
అది ఏనాడైనా ఏనాడైనా 
నీకే నీకే అంకితం (నా) 

తెరచిన నా కన్నులలో..ఎప్పుడు నీ రూపమే 
మూసినా నా కన్నులలో ఎప్పుడు నీ కలల దీపమే (తె)
కనులే కలలై కలలే కనులై... 
చూసిన అందాలు అనుబందాలు.. అవి నీకే నీకే అంకితం (నా)

నిండిన నా గుండెలలో ఎప్పుడు నీ ధ్యానమే 
పండిన ఆ ధ్యానంలో ఎప్పుడు నీ ప్రణయ గానమే (నిండిన)
ధ్యానమే గానమై గానమే ప్రాణమై (ధ్యా)
పలికిన రాగాలు అనురాగాలు 
అవి నీకే నీకే అంకితం (నా )


ఇక్కడ పాట వినండీ! నా  మనసే  ఒక  తెల్లని  కాగితం . . -- అర్ధాంగి    సుశీలమ్మ గొంతులో..ఓ..మధురిమ ఈ పాట. తాతినేని చలపతి రావు గారి స్వరకల్పన .. ఓ..స్వరప్రాభవం..

20, జులై 2011, బుధవారం

వేయివేణువులు మ్రోగేవేళ..
   వేయివేణువులు మ్రోగేవేళ సాహిత్యం..క్రింద..

వేయి వేణువు మ్రోగేవేళ 
హాయి వెల్లువై పొంగేవేళ  
రాసక్రీడలో చేరేవేళ
రాదమ్మని లాలించేవేళ

నను పాలించగ నడచివచ్చితివా..
మొరనాలింపగా తరలి వచ్చితివా..గోపాలా..(నను) 

అరచెదిరిన తిలకముతో అదిగదిగో రాధమ్మ
అరజారిన పయ్యదతో  అదిగదిగొ గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో  ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలొ ఎద ఎదలొ 
నీ కొరకై వెదుకుతు ఉండగ(నను)  

కంసుని చెరసాలలొ ఖైదీగా పుట్టావు  
కాంతల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగావు 
కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు  
ఈ భక్తుని గుండె లో ఖైదీగా ఉండాలని (నను)


ఎంత చక్కని పాట. నాకైతే ఎంతో ఇష్టమైన పాట.వనమాలి పాటేదైనా అందునా..వేణువు ఎన్నిమార్లు విన్నా తనివితీరదు. "మామ" స్వరకల్పనలో వేణువు రాతిలో కూడా రాగాలు పలికిస్తుంది.   ఇక సాహిత్యం విషయంకి వస్తే ఆయన రాముడి పేరుని ఇంటి పేరులో కృష్ణుడిని పేరులోను సమన్వయపరచుకున్న దాశరధి కృష్ణమాచార్యులు.దాశరధి గా ప్రతీక.

ఇంతటి భక్తిరసంలో..ముంచెత్తుతూ ఆ సాహిత్యపు సొంపులు చూడండీ!!మధురాతిమధురం. సాహిత్యంలో వారి ముద్రని మరొకసారి చెప్పుకుందాం.

ఆ వనమాలికి భక్తులన్న అలవిమాలిన అనురాగం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవిస్తుంది.అందుకేనెమో..అసలే దక్షిణ నాయకుడు.అష్ట భార్యలున్నవాడు.ఆ పై పదహారువేల గోపెమ్మలు.అయినా ఆయన అందరిని సంతోషంగా ఉంచగల్గాడు. ఎందుకంటే నిజంగా ఆయన రెపల్లె లోనో, బృందావనిలోనో ఉండడు.ఆయన నివాసం భక్తుల హృదయాలు. పిలవగానే వడి వడిగా పరుగు పరుగున వాలిపోతాడు.వారిని పాలిస్తాడు..మొరలాలకిస్తాడు. తనని ఆరాదించే భక్తులకి బందీగా ఉంటాడు. అది వనమాలి భక్తులకి..ఇచ్చిన వరం. అదే సంగతిని..బహు సుందరంగా వ్రాసారు..ఆ కవి. నిజంగా ఆ నల్లనయ్య ఆ సాహిత్యానికి, ఆ..మధుర గానానికి..పరుగు పరుగున రాకపోడా అనేంత గొప్పగా ఉంధి సాహిత్యం.
వేణువు ఒకటి మ్రోగితేనే మది ఊగుతుంది.తూగుతుంది. అలాటి వేయి వేణువులు మ్రోగేవెళ ఎంతగానొ ప్రేమించే రాధమ్మని చేరి రాసక్రీడలో..మునిగే వేళ ఆపదలో ఉన్న భక్తుడు పిలవగానే.. ఉన్నపళాన ఆ నల్లన్నయ్య పరుగు పరుగున భక్తుల కడకు వచ్చెస్తే.. 

ఆయనంతే భక్తులని యెప్పుడు పాలించడానికి ..లాలించడానికి.. కనికరించడానికి..సిద్దంగా..ఉండగలడు . కానీ ఆయన దేవేరిలకి కోపం రాదు? మంచిసమయము..భార్యని వదిలేసి వెళ్ళిపోతే?ఇక వారి అవస్తలు..ఇలా..ఉంటాయని చెప్పడం ఒక శౄంగార కావ్యం కూడా..రసమయ జగత్తులో ఉండగా ఆ నల్లనయ్య ఆమెని విడిచి వెళ్ళగా మొహంతో..శయ్యం పై ఆ రాదమ్మ పొరిలి పొరిలి సగం చెరిగిన కుంకుమతో...ఊర్పులు విడుస్తుందని..

ఆ గొపెమ్మ ఏమో..కొరికతొ సగం జారిన పయ్యదతో..కలియచుడుతుందని, ఇక సత్యభామ తనని వొదలి వెళ్ళాడన్న కొపంతోను..వాంచ వల్ల ఎర్రగా మారిన కన్నులతో పొద పొదలోను ఆచూకి కోసం ఎద ఎద లోను వెదుకుతూ ఉంటె..నన్ను పాలి0చగా నువ్వు వచ్చావా గొపాలా!? అని ఆయనని ఆర్ధ్రంగా,ముకుళితమైన మనసుతో..కీర్తిస్తున్నాడు..ఆ భక్తుడు.

చెరసాలలో ఖైదీగా పుట్టి ఇంతుల కౌగిళ్ళలో..ఖైదీగా పెరిగి (అందరు ఆయనని ప్రేమించే వారే..కదా?) కరకు అయిన నల్ల రాతి గుళ్ళలొ ఖైదీగా మారినా (ఆయనని రాతి గుళ్ళల్లో మనమే ఖైదీగా మార్చాము. ఆయన నిజంగా భక్తుల హృదయాలలోనే ఉంటాడని చెబుతారు.)ఈ భక్తుని గుండెళో ఖైదీ కావాలని కొరుకుంటాడు. ఎంత ఆశొ! చూడండీ! అది అపారమైన భక్తికి..చిహ్నం.  
ఎంత చక్కని భావం. ఎన్ని సార్లు విన్నా..మళ్ళీ వినాలనిపించే పాట.ఈ చిత్రంలో శొభన్ బాబు గారు కృష్ణుడిగా ఎంత సుందర రూపమో! ఎ.ఎన్నార్ ఆహార్యం అంత చక్కనిదే !.అందుకే పదికాలాలు నిలిచే పాట. మీరు చూసి విని ఆస్వాదనలో మునిగి తేలాలని బుద్దిమంతుడు చిత్రంలో.. ఈ పాట పరిచయం. వేయి  వేణువులు  

మ్రోగే  వేళ   ఇక్కడ వినండీ!

16, జులై 2011, శనివారం

నాకు ఎంతో.. ఇష్టమైన "సుర్ " సంగీతం .

మరకతమణి దక్షిణాన ఎంత పేరుమోసిన స్వరకర్తో వింధ్య పర్వతాల ఆవల కూడా..అంత పేరు మోసిన మణిమకుటం. క్రీం గా సురపరిచితమైన వారి స్వరహేలకి నాదస్వరానికి ఊయలలూగిన సహస్ర ఫణిహ్ నర్తనంని పొలిన మదినర్తనంని స్వీయ పులకింతల మద్య అనుభూతించక తప్పని అనుభవం. హిందీలో తక్కువ చిత్రాలకి సంగీతం అందించినా..కీరవాణి ముద్ర అక్కడ పదిలం.నాకు ఎంతో ఇష్టమైన "సుర్ " చిత్రంలో..రెందు పాటలని వినండీ!! ఎంత తీపి గుండెకోతకి మన ప్రమేయం లేకుండానే గురి కాకుంటే..అప్పుడు అడగండి.ఎమిటి ఇంత అతిశయంగా చెప్పారు అని.ఓకే నా!!15, జులై 2011, శుక్రవారం

ప్రజాప్రతినిధులు ప్రజలకు భారం


కేంద్ర ప్రభుత్వం మన యెం.పి లకి..పెంచిన జీతభత్యముల వివరాలు చూస్తే..మనకి.. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి..నోరు తెరుచుకుంతుంది.ఆనక కోపం ముంచుకొస్తుంది.ఈ వివరాలు చూడండీ !దేశంలో దారిద్ర్యానికి దిగువున బ్రతుకుతున్న ప్రజల ఇక్కట్లు వారికి పట్టవు. వాళ్ళకి సకల సౌకర్యాలను ఎలా పోరాడి సాదించుకున్నారో..చూడండి.

నిత్యం మనం చూసే దౄశ్యాలు ఇవి.
An Important Issue!
Indian government approves 200% MPs salary hike , Still some MP's are unhappy.
Now , MP's take home salary is Rs 45 lakh per annum + other allowances.
TOTAL expense for a MP [having no qualification] per year :  Rs.60,95,000
For 534 MPs, the expense  for 1 year:
Rs. 325,47,30,000
3254730000 X 5 years =
Rs.1627,36, 50000  ( One Thousand six hundred crores plus..)
This is the present condition of our country:
1627 crores could make their lives livable!!
Think of the great democracy we have K
Do Mp's really need salary hike? Do they really wait for 30th of every month for salary
credits to there bank accounts, like we do every month ????
FORWARD
THIS MESSAGE TO ALL REAL CITIZENSOF INDIA !!
ARE YOU?
I know hitting the Delete button is easier...but....try to press the Fwd button & make people aware!


రాజీవ్ సోలంకి.. గూగుల్ గ్రూప్ ద్వారా అందించిన వివరాలు ఇవి. యధాతదంగా అందిస్తున్నాను .

వాళ్ళకు లభించిన జీతభత్యాలు అదనపు సౌకర్యాలు గణాంకాలు ఇవి. కళ్ళు తిరిపోతున్నాయి కదా! ..

ఒక ముఖ్యమైన విషయం! 


భారత ప్రభుత్వం MP యొక్క జీతభత్యాలు  200%   అంగీకరిస్తుంది. ఇప్పుడు, MP యొక్క జీతం ఏడాదికి రూపాయలు 45 లక్షల + ఇతర అనుమతులు ఉంది. Rs.60, 95,000: ఒక MP సంవత్సరానికి [సంఖ్య అర్హత కలిగి] కోసం మొత్తం వ్యయాల 534 MPs కోసం, 1 సంవత్సరం కోసం వ్యయం: రూపాయలు. 325,47,30,000 3254730000 X 5 సంవత్సరాల = Rs.1627, 36, 50000 (వెయ్యిన్నొక్క ఆరు వందల కోట్ల ప్లస్ ..) ఈ మన దేశంలో ప్రస్తుత పరిస్థితి: 1627 కోట్లు వారి జీవితాలను లివబుల్ చేస్తాయి!
  
MP యొక్క నిజంగా జీతం పెంచడం అంత అవసరమా?  వారు నిజంగా జీతం కోసం ప్రతి నెల 30  కోసం వేచి చూస్తున్నారా?. CITIZENSOF INDIA ఈ సందేశాన్ని ఎక్కువ మందికి తెలియ చేయడానికి ప్రయత్నించండి! -

ఇక విశాలాంద్ర అందించిన వివరాలు ఇవి...

పా ర్లమెంటు సభ్యుల నెలసరి జీతభత్యాలను గణనీయంగా పెంచుతూ  నెలసరి జీతాన్ని 300శాతం - రు.16వేలనుండి రు.50వేలకు పెంచుతూ నిర్ణయించింది. దీంతోపాటు ఎంపి కార్యాలయ ఖర్చులను రు.20వేలనుండి రు.40వేలకు, నియోజకవర్గ భత్యాన్ని రు.20వేలనుండి రు.40వేలకు, వ్యక్తిగత వాహనం కొనుగోలుకు వడ్డీలేని రుణాన్ని రు.1 లక్షనుండి రు.4లక్షలకు, రోడ్డు మైలేజి ఛార్జీని కిలో మీటరుకు రు.13నుండి రు.16కు, పార్లమెంటు సమావేశాలప్పుడు దినభత్యాన్ని సిట్టింగ్‌కు రు.1000 నుండి రు.2000కు పెంచింది. మాజీ ఎంపిలకు నెలవారీ పెన్షన్‌ను రు.8వేలనుండి రు.20వేలకు పెంచింది. ఒక టరంకు మించి ప్రతి అదనపు సంవత్సరానికి రు.1500 చొప్పున పెరుగుతుంది. ఇది ప్రస్తుతం రు.800గా వుంది. ఎంపిలకు జీతభత్యాలుగాక విమాన ప్రయాణం, రైల్లో ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణం ఉచితం. ఎంపి జీవిత భాగస్వామికి ఎనిమిది విమాన టిక్కెట్లతోపాటు రైల్లో, ఫస్ట్‌క్లాస్‌లో ఎన్నిసార్లయినా ప్రయాణించే సౌకర్యం. అంతేకాక ఢిల్లీలో ఉచిత బంగళా, ఫర్నీచర్‌కు సంవత్సరానికి రు.60వేలు, ఇతర వస్తువులకు రు.15వేలు, సోఫాకవర్లు, కర్టెన్‌లు, బాత్‌రూం టైల్స్‌ ఉచిత వాషింగ్‌, సంవత్సరానికి 50వేల యూనిట్ల ఉచిత కరెంట్‌, 4వేల కిలోలీటర్ల నీరు, మూడు లాండ్‌లైన్లు, 2 సెల్‌ఫోన్స్‌కు సంవత్సరంలో లక్షన్నర ఫ్రీకాల్స్‌ సౌకర్యాలున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కుటుంబానికి ఉచిత వైద్యం కూడా ఉంది. సౌకర్యాలు కాకుండా కొత్త జీతభత్యాలకింద (నియోజకవర్గ అలవెన్స్‌, ఆఫీసు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌, ఫర్నీచర్‌, విద్యుచ్ఛక్తి, దినభత్యాలు కలుపుకుని) ఒక్కొక్క ఎంపి పొందే మొత్తం సాలీనా రు.20లక్షలు దాటుతుందని ఒక స్వతంత్ర అంచనా. 70కోట్లమందికి పైగా సామాన్య ప్రజలున్న దేశానికిది నిజంగా భారమే.

మన ఎంపిల్లో అత్యధికులు కోట్లకు పడగలెత్తినవారే. 15వ లోక్‌సభ ఎంపిల్లో 300మందికిపైగా కుబేరులే. వారు అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం వారందరి సంపద విలువ రు.3075 కోట్లు. రాజ్యసభలోను కుబేరుల సంఖ్య పెరుగుతోంది.  ప్రజాప్రతినిధులు ప్రజాసేవకులుగా వుండాలని ఎవరైనా ఆశిస్తారు - వారు ప్రజలకు భారం కాకూడదు.

ప్రజలలో చైతన్యం రావాలని ఈ పొస్ట్ ని ఉంచాను. గణాంకాలు తేడా ఉన్నప్పటికి వాస్తవం మాత్రం గమనించాలని.. నా ఈ చిన్ని ప్రయత్నం.