1, జులై 2011, శుక్రవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు ...

ఈ రోజు  మా "అప్పు" పుట్టినరోజు. 
అప్పు అంటే..మా చెల్లెలు కూతురు. పి.ఎస్. హేమంత. మొన్ననే..పదవ తరగతిలో..95 %  మార్కులు తెచ్చుకుని..ఇంటర్మీడియట్ లో..జాయిన్ అయింది. 
నాకైతే మా "అప్పు"ని చూస్తుంటే.. చాలా గర్వంగా  ఉంటుంది. మొన్న మొన్న నే.. కదా.. నేనే ..హాస్పిటల్ లో.. వాళ్ళ అమ్మ డెలివరీ టైం లో..ప్రక్కన ఉండి పుట్టగానే హాస్పిటల్ స్టాఫ్ చేతుల్లో నుండి.. నా చేతుల్లోకి అందుకుని.. అపురూపంగా "అప్పు" అని పేరు పెట్టాను. అలా పిలుస్తూ.. పిలుస్తూ.. 15 ఏళ్ళు గడిచాయి. " హేమంత "అన్న పేరు కూడా..నేనే పెట్టాను. 
మా "అప్పు" చాలా తెలివి కలది. ఐ.ఐ టి. లో..సీట్ సంపాదించాలనే లక్ష్యంతో.. మూడు సంవత్సరముల  నుండి ..ఓ..కార్పొరేట్.. స్కూల్లో చదువుకుంటూ..ఉంది.  తరగతి పుస్తకాలే కాదు అన్ని విషయాలు గురించి తనకి..అవగాహన ఉంది. ఆ వయస్సుకే..నాతో..కూర్చుని చాలా విషయాలు డిస్కస్ చేస్తుంది.VR1 we are one ..అనే స్వచ్చంద సంస్థ గురించి చెపుతూ.. తనకి.. అలా సర్వీసెస్ చేయాలని ఉందని చాలా ఇంటరెస్టింగ్  గా చెప్పింది.. నేను ఆ పిల్లను అలాగే అబ్బురంగా చూస్తూ ఉండిపోయాను.నిన్న మొన్నటి చిన్నారి..యేనా.. అంతలోనే ఎంత ఎదిగి  పోయింది అనుకుంటాను. 
తనకి పాత సినిమాలంటే ..బ్లాకు &వైట్ సినిమాలు ఇష్టం. 8 తరగతి లో ఉండగా క్లాసు పస్ట్ .. వచ్చినప్పుడు ఏం గిఫ్ట్ కావాలంటే.."సాగర సంగమం " సి.డి. కావాలని అడిగింది. ఐ.ఐ.టి లో మెకానికల్ బ్రాంచ్ తీసుకుని.. 352 .సి.సి. బైక్,పొల్యూషన్ లేని కారు తయారు చేయాలని..తన కోరిక. ఆస్త్రోనోట్..కల్పనా చావ్లా, సుధా నారాయణ మూర్తి, ఇంద్రాణి నూయి,హేల్లెన్  కెల్లెర్ తన రోల్ మోడల్స్.  అడాల్ఫ్ హిట్లేర్..గురించి.. బాగా చదువుతూ..ఉంటుంది..కొత్త విషయాలు తెలుసుకోవడం.. పుస్తకాలు విపరీతంగా చదవడం..చాలా ఇష్టం. ఓర్పుగా  ఉంటుంది.తన పుట్టిన రోజు... కల్పనా చావ్లా పుట్టిన రోజు.. ఒకటే కావడం.. మా అప్పుకి..చాలా సంతోషం. ఆమెలా.. దేశానికి..పేరు తేవాలని..తన ఆకాంక్ష. 


మా బంగారు తల్లి.. బాగా చదుకుని.. తాను ఆశించిన  జీవితం తో.. ఆనందముగా.. ఉండాలని కోరులుంటూ.. భగవంతుడు.. తనకి  విద్యవివేకములని ప్రసాదించి..ఆయువారోగ్యములని..సుఖ..సంతోషములని ప్రసాదించాలని..కోరుకుంటూ.. "అప్పు" నీకు.. హృదయ పూర్వక శుభాకాంక్షలు..అందిస్తూ.. ప్రేమతో..దీవెనలతో.. .. 
పుట్టినరోజు శుభాకాంక్షలు ... ..

9 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

మీ అమ్మాయి అప్పు కి పుట్టినరోజు శుభదీవెనలు! నా తరపున చెప్పండి.

సాయి చెప్పారు...

అప్పూ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ....

రాజి చెప్పారు...

అప్పు కి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
వనజవనమాలి గారు

మాలా కుమార్ చెప్పారు...

మీ అప్పు కు జన్మదిన శుభాకాంక్షలండి .

బుద్దా మురళి చెప్పారు...

puttina roju shubhaa kankadalu.mi appu korika tiraalani korukuntunnanu

Sravya Vattikuti చెప్పారు...

వెరీ నైస్ ! హేమంత కు పుట్టినరోజు శుభాకాంక్షలు ! తన లక్ష్యాలను సాధించి దేశానికి..పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను !

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

హేమంత కు పుట్టినరోజు శుభాశీస్సులు.

వనజ వనమాలి చెప్పారు...

భాస్కర్ గారు..ధన్యవాదములు.

@సాయి.. మీకు మరిన్ని ధన్యవాదములు.

@రాజీ మా అప్పు మీ అందరికి ధన్యవాదములు తెలుపుతుంది.మీకు..నా ధన్యవాదములు.

@మాల కుమార్ గారు మీ వంటి పెద్దల ఆశీస్సులు.. అప్పుకి ఎల్లప్పుడు ఉండాలని కోరుంటాను. ధన్యవాదములు.

@ మురళి గారు అప్పు నుండి మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.

@ శ్రావ్య మీకు మరిన్ని ధన్యవాదములు
@ విజయ మోహన్ గారు మీ ఆశీస్సులకి.. కృతజ్ఞతలు.

swetha చెప్పారు...

BELATED HAPPY BIRTHDAY HEMANTHA.. :)