12, జులై 2011, మంగళవారం

కొన్ని వాస్తవాలు - జీర్ణించుకోలేనివి

ఒక మిత్రుడు పంపిన మంచి విషయం. వేయి ఆలోచనా శతఘ్నులు బ్రద్దలి బాధావేసాలు ముప్పిరిగొని..ఈవిషయం పంచుకొవడం.మీరు ఆలొచించండి. సౌజన్యం WWW.TeluguColours.com

ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు నిషేధం
ఒకపక్క ఆధునిక కాలం పరుగులు తీస్తుంటే,మరోపక్క కుల సంప్రదాయాలు మనుషుల్ని వెనక్కినెట్టడానికి యత్నిస్తున్నాయి. ఒరిస్సాలో పైకలి ఖండయత్ అనే కులం ఒకటి ఉంది. ఆ కుల పెద్దలు ఈ మధ్య ఒక ఫర్మాన జారీచేశారు. దాని ప్రకారం ఆ కులానికి చెందిన పెళ్లికాని యువతులు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడరాదు. ఈ ఆంక్షలు ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉంటే పిల్లలు ప్రేమ అనో, ఇంకొకటనో ,ఇతరులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి మొబైల్ ఫోన్స్ పెళ్లికాని పిల్లలు వాడరాదని నిషేధించామని ఆ కుల సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయమై ఆ కులంలో ఉన్న తల్లిదండ్రులందరికి కూడా విజ్ఞప్తి కూడా పంపారట.పెళ్లికాని పిల్లలు అర్జెంటుగా మొబైల్ ఫోన్ వాడవలసిన అవసరం లేదని కులపెద్దలు భావించారని కుల సంఘం నేత సోమనాద్ నాయక్ చెప్పారు. అనేక విద్యా సంస్థలు మొబైల్ ఫోన్స్ ను తమ ఆవరణలో వాడడాన్ని నిషేదించినప్పుడు తాము కూడా ఈ పనిచేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఒడిషాలోని గంజాం జిల్లాలో పైకలి కుటుంబాలు పదివేల వరకు ఉంటాయి.అయితే తమ ఫత్వాను ఉల్లంఘించేవారికి ఎలాంటి శిక్షలు వేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు.ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నామని ఇంకా శిక్షల గురించి ఆలోచించలేదని చెబుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ కులం లో పిల్లలంతా పదో తరగతి వరకైనా చదువుకోవాలని కూడా ఈ కుల సఃగం కోరుతోంది.మరి చదువును ప్రోత్సహిస్తూ, అభ్యుదయంలో ఉన్నారనుకోవాలో, లేక మొబైల్ వాడకంపై నిషేదం పెట్టి తిరోగమనంలో ఉన్నారనుకోవాలో!ఈ ప్రమాణాల తంతులో అసలు సత్యం తేలకపోతే వాతల కోర్టుకు వెళతారేమో!

4 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

అబ్బాయిలకి కూడా నిషేధిస్తే బాగుండునండీ.. అవసరం ఉన్న వాళ్ళ కన్నా, ఎలాంటి అవసరమూ లేని వాళ్ళే ఎక్కువ వాడుతున్న సాధనాల్లో ఒకటి ఈ సెల్ ఫోన్.
..కాకపొతే ఇక్కడ వివక్ష కనిపిస్తోంది., అమ్మాయిల మీద. ఇది మాత్రం సమర్ధనీయం కాదు..

ahmisaran చెప్పారు...

బహుసా మగవాడు ఎంత చెడినా పర్వాలేదు ఆడపిల్లమాత్రం పవిత్రం గా ఉండాలనే శతాబ్దాల మన సంస్కృతి కారణం గా ఈరకం కట్టడి ఆడపిల్లలకే విధించి ఉండొచ్చు.
గుడ్డికన్నా మెల్ల నయం అన్న చందాన కనీసం ఆడపిల్లలన్నా సెల్ కి దూరమైతే, మున్ముందు మగపిల్లలకీ రావచ్చు.
కుల పరమైన ఫత్వా కన్నా
కుటుంబ పరమైన క్రమశిక్షణ ముఖ్యమైనది
అది ఈ కాలం లో ఎక్కువ శాతం లోపిస్తున్నది.
కాలప్రవాహం లో మార్పు రావాలని కోరుకుందాం.

Praveen Sarma చెప్పారు...

ఒరిస్సాలో అక్షరాస్యత పెరిగింది కానీ ఆ రాష్ట్రం సామాజికంగా అభివృద్ధి చెందలేదు. మా చిన్నప్పుడు జరిగిన ఘటన ఇది. గంజాం జిల్లాలో 27 సంవత్సరాల వయసున్న ఒకామె తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన అబ్బాయిని ప్రేమించింది. పెళ్ళికి ముందు గర్భవతయ్యింది. ఈ విషయం తెలిసి ఊర్లో అందరూ ఆమె గురించి చెత్తగా మాట్లాడుకున్నారు. కానీ ఆమెని ప్రేమించిన అబ్బాయి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆమెని ప్రేమించిన అబ్బాయైనా ఆమెని అర్థం చేసుకున్నాడనే సంతోషం ఆమెకి కలగలేదు. ఆమె పుట్టిన బిడ్డని చంపేసి పారిపోయింది. మూఢ నమ్మకాలూ, సంప్రదాయాలూ ఆడవాళ్ళని ఇలా అంధకారంలోకి నెడతాయి.

జయ చెప్పారు...

మొగపిల్లలు ఫోన్ చేసేది ఆడపిల్లలకేగా!!!! కొన్ని విద్యాసంస్థలలో మాత్రం పిల్లలు సెల్ ఫొన్ వాడకం ఇతర కారణాల మీద నిషేధించారు. అత్యవసరమైతే కామన్ ఫోన్ నుంచి కాంటాక్ట్ చేసుకోవచ్చు. కాని పూర్తిగా, కేవలం ఆడపిల్లలకి మాత్రమే నిషేధించటం అమానుషం.