ఏ మాత్రం ఆశ్చర్యం వద్దు. నాకు తెలిసిన సోనియా గురించే..నేను చెపుతున్నా.. ఎలా తెలుసు అనుకుంటారా? అయ్యో..రోజు ఏమిటి ఖర్మ ..నేను పుట్టినప్పటి నుండి.. పేపర్లో చదువుకున్నాను. పైగా ఈ దేశపు కోడలు ఆమె.. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? అందుకే తెలుసుకుని ..నాకు తెలిసిన "సోనియా" అని సింపుల్గా అంటున్నానన్నమాట. శక్తివంతమైన భారతీయ మహిళగా ఆమెని ప్రపంచం గుర్తించాక మనం కాదంటామా?కాదనుకుని ఆమె నీడలో బ్రతికేస్తున్నాం కూడా..
ఒకోసారి ఒకో మనిషే కాదు జాతి జాతి మొత్తం ఒక మనిషిని విశ్వశించలేం కారణం మనలో..ఆణువణువునా దాగిన మన అనే బలీయభావం.ఆ భావం తోనే.. ఎక్కడ ఉన్నా ఎవరు మనవారిగా భావించినా యిట్టె కలసిపోతాం.పరాయి భావనలో అభద్రతా బావం వెంటాడుతుంది.అందుకే మనం పరాయి చోటికి వెళ్ళగానే మన తెలుగు వారు కనబడగానే హమ్మయ్య అనుకుని వెంటనే కలేసుకుని,మొహాలు చేటంత చేసుకుని,అంతలోనే పూసేసుకుని.. కాల క్రమంలో.. వెనుక గుస గుసలతో..చెప్పేసుకుని, ఇంకా కొన్నాళ్ళకి తిట్టేసుకునే లెవెల్లో తయారవుతాం. కానీ మనవాళ్ళకి ఏదైనా ప్రమాదం కల్గినంతలోనే మళ్ళి ఒకటై పోయి మహాభారత నీతి గుర్తుతెచ్చుకుంటాం. మాలో మేము తిట్టుకుంటాం కొట్టుకుని చస్తాం పరాయి వాళ్లకి మాత్రం మేమంతా ఒకటే..అని దృడంగా చాటి చెపుతాం. ఇదంతా చెప్పుట ఎందుకనగా..
మన దేశంలో.. అవినీతి,కుల,మతతత్వం ని ప్రోత్సహించడము రాజకీయనాయలకి వెన్నతో పెట్టిన విద్య. వారినే మనం ఓట్లు వేసి మరీ గెలిపించి.. మన బతుకులని దారిద్ర్య రేఖకి దిగువునకీడ్చి.. మనని అదః పాతాళానికి అణగద్రోక్కుతున్నాసరే..గుడ్డిగా నమ్మేస్తాం. వారసత్వ రాజకీయం తప్ప మన జాతికి ప్రత్యాన్మయ మార్గం లేనట్లు స్టాంపింగ్ ప్రధానమంత్రి ,ముఖ్యమంత్రుల కాలంలో..మన బతుకులుని గాలివాటు దీపం లాగా పణంగా పెట్టి ఈ సెక్యులర్ స్టేట్ లో బ్రతికేస్తున్నాం. ఎగుమతులను ఉత్పత్తి చేసే సెజ్లు, ఐ .టి పార్కులు, విదేశాల్లో ఉద్యోగాల కోసం చదివే చదువులు ..అంతా ప్రపంచీకరణే! ఇన్ని ఆమోదించిన మనం ఒక విదేశీయురాలిని ప్రధానిగా అంగీకరించలేం. కాని జాతి మనుగడ మాత్రం ఆమె చేతిలోని పగ్గంగా మారింది.అది మనమే ఇచ్చాం. నేను కూడా..ఒక విదేశి వనిత ప్రధానిగా ఉండటం అంగీకరించలేను. నూట ఇరవై కోట్ల భారతీయులలో..ప్రధాని కాగల అర్హత ఎవరికి లేదా.. అనే ప్రశ్నించి తీరతాను.
కానీ ఒక స్త్రీ మూర్తిగా సోనియాలో.. నేను చూసిన కోణాలని నా దృష్టిలో వ్రాసుకున్నవి ఇలా.. మీకు నచ్చితే ఓకే..లేకున్నా పర్లేదు. ఇది నా కోణం మాత్రమే.
ఆమె బహుముఖాలు
నమ్మినవాడితో ఖండాలని దాటి వచ్చిన ఆమె
శ్వాసని కూడా శాసించే రక్షణ వలయాల మద్య
ఆధునిక వసతుల మద్య అంతఃపురంలో.. బహు రాణి.
హింస తాకిడికి కళ్ళెదుటే కూలిపోయిన మహా శక్తిని చూసి
ఆమె కళ్ళల్లో నదులే ప్రవహించాయి.
దేశాభవితని భుజస్కందాలపై ఎత్తుకున్న అతని
అడుగులో అడుగు అయింది.
భయపడినదే జరిగినప్పుడు ఆమె గుండెలో..
జీవనదులే ఇంకిపోయాయి.
తన కూనలని పదిలంగా పొదువుకుని
వలువలు,చిలువలతో అస్త్రాలని సందిన్చినవారికి
మౌనంతోనే సమాదానం ఇచ్చిన ఆమె వేదనలో..
ఘనీభవించే మంచు ఖండాలే నివ్వేరపోయాయేమో!
వారసత్వ సంపదని జాతికి అందించే కర్తవ్య దీక్షలో
కదన రంగాన నడుమున కట్టిన శిశువుతో పోరాడిన
ఝాన్సీ లక్ష్మి బాయి గోచరిస్తుంది.
చిటారు కొమ్మన ఊరిస్తున మిటాయి పొట్లం
అందుకోనివ్వని ఈ రాజకీయ కురుక్షేత్రంలో..
విశ్వసనీయమైనవి కులం,మతం కాదని
ఓటు బంక్లని తలచి కైవసం చేసుకునేదుకు..
అపర చాణక్యుని అంశని ఆవాహం చుసుకున్నదేమో..
అతివగా మెట్టినింట ఘనత ఘనమని
ఈ జాతిని మునుముందుకు నడిపించే సారధినని..
ఘనంగా చెప్పుకున్నట్లు ఉండటమే కాదు..
మానవత్వానికి ఆనవాలుగా..క్షమా గుణం ప్రదర్శిన ఆమె..
అంతరంగం ఓ..ఎడారి నది..
కొవ్వొత్తిలా కరగకుండా, వ్యధ చెంద కుండా
ఏ వెలుగులు దరికి రావన్నదానికి సాక్షీ భూతంగా నిలిచిన
ఆమె ప్రస్థానంలో.. నిలిచినవి..నేను కన్నవి
కొండంత ఆత్మ స్థైర్యాన్ని,కరుణార్ద అంతరంగాన్ని
స్వచ్చమైన అభిమానాన్ని
ఆణువణువూ నిండిన అంకిత భావాన్ని
బందాలకి-భాద్యతలకి బందీ అయిన స్త్రీ మూర్తిని.
ఆమె .. బహుముఖాలు.
ఆమెని చూస్తే.. ఈ క్రింది వాక్యంలో నిజం గుర్తుకు వస్తుంది.( ఒకోసారి విరుద్దం గా కూడా)
Failure also looks beautiful when you have Friends & Family to support you...Success also hurts when they are not with you.
ఏమిటీ నీకు ఈ పాటల పిచ్చి.? .పొద్దస్తమాను వింటావు.. మళ్ళీ వాటి గురించే రాస్తానంటావు? పాట మెడలో వేసుకుని ఊరేగు అంటుంటే..నిజంగా మెడలో వేసుకుని కూడా ఊరేగుతున్నాను. నా ఉదయపు నడకలో. కాకపొతే అప్పుడు దేవరాగం విత్ భారతి చెప్పే భక్తి విశేషాలు,స్థల పురాణాలు,భక్తి పాటలు అన్నమాట.
పాట గురించి నేను మాట్లాడ కుండా ఉండటం చాలా కష్టం. ఎందుకంటె.. పాట లక్షణం ప్రవాహం. పాటని మనం బంధించగలమా?
పాటని నేను తింటాను,తాగుతాను, శ్వాసిస్తాను.పాట ఒడిలో నిదురిస్తాను. పాట తోనే మేల్కొంటాను కూడా.నేను పాటని అమితంగా ప్రేమిస్తాను.అందుకే నా బ్లాగ్ లో సగానికి పైగా పాటలు ఉంటాయి. ఈ నాటి పాట ఇదుగోండి...
ఇక్కడ నాలాటి వారు కొందరు ఉంటారు కదా వారు వింటారని..ఈపాట అంత ప్రసిద్ది ఏం కాదు.కానీ చాలా బాగుంటుంది
చిరంజీవి ,రాదిక నటించిన చిత్రాలలో విభిన్నంగా ఉండే చిత్రాలలో "ప్రియ " చిత్రం ఒకటి. నాకు ఈ చిత్రం కన్నా ఒకే ఒక పాట అమితంగా నచ్చుతుంది. మనసు కవి పాట ఇది.
ప్రేమ వైపల్యంలో ఉన్న ఇద్దరి ప్రేమికుల మానసిక సంఘర్షణ తో కూడిన ఈ పాట..మనసు తెర తీసి తీయనట్లు మనిషి తో దోబూచులాడుకుంటా.. ఒకరినొకరు ఓదార్చు కుంటున్నట్లు ఉంటుంది. ఈ పాట సాహిత్యం ఆత్రేయ గారు. చక్రవర్తి గారి సంగీతం కలసి మనసు పై ఒక మేలిమి ముద్ర వేసి వినమంటూ ఉంటుంది.నాకు చాలా ఇష్టమైన పాట ఇది.
నా హృదయమా !
నా హృదయ ఉదయ రాగమా !
మాయని తీయని మధురగీతి పాడుమా (మాయని)
అందమై మకరందమై
మందమంద మలయా నిలయ గంధమై
మదనుని విరివిల్లుల అరవిందమై
ఎల తేటి యెదమీటు ఆనంద మై (ఎల)
పులకరించు కుసుమమా (నా హృదయమా)
ఆటవై సయ్యాట వై , చిలిపి వలపులాడేటి చెర లాటవై
తలపుల తళ తరలోక శ్వాస వై
పరువాల సరదాల బూచాట వై (పరువాల)
కరిగి పోవు స్వప్నమా (కరిగి ) (నా హృదయమా)
వాణి వై వర వీణవై బృదావన సమ్మోహన వేణువై
పద కవితా మృదు భాషల భాణి వై అనురాగాల రాగాల నెరజాణ వై (అను )
గానమైన మౌనమా (గానమైన )
జాలివై, చిరు గాలివై సిరి మల్లెల చిరుజల్లుల వేళ వై
కనుసన్నల చెలి వెన్నెల జాలువై
జోజోల ఉయ్యాల జంపాల వై (జో జోల )
సేద తీర్చు నేస్తమా? (సేద)
నా హృదయమా !
నా హృదయ ఉదయ రాగమా !
మాయని తీయని మధురగీతి పాడుమా (మాయని)
ఈ గీతాన్ని వింటారా? ఇదిగో.. ఇక్కడ నా హృదయమా.. చూడండీ !!
చిత్ర సీమ సాక్షిగా ఎన్నో పాటలు మన మనసుని రంజిపజేస్తూనే ఉంటాయి.మరి కొన్ని పాటలుమనసుని కసకస రంపంతో కోసేస్తున్నట్లు భాదను పెంచుతాయి. ఇదొక స్వీట్ మెలోడి.
తను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మనసులో తనకొక సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆ ప్రియురాలి ప్రేమలో కరిగి పోవాలని తన చెంత ఆమె ఒదిగిపోవాలని మనసారా తలపోస్తూ ఉండే యువ ప్రేమికుడికి తన ప్రేయసి తన ప్రేమని తిరస్కరిస్తే కలిగే భాద జీరించుకోలేనిది.అయినప్పటికీ ఏనాటికైనా ఆమె ప్రేమని గెలుచుకోగలను అనే నమ్మకంతో..తన వేదనని పాటగా మలచి వినిపిస్తున్నాడు ఆ ప్రేమికుడు.
నువ్వు చూసినా చూడకపోయినా .మాట్లాడినా మాట్లాడక పోయినా తనని ప్రేమిస్తూనే ఉంటానంటున్నాడు. ఆమె తిడితే తన పేరు ఆమె పెదవులపై నిలిచిందని సంతోషపడతాను.ఒక వేల కోపంతో ద్వేషం తో కొట్టినా తన చెంప పై ఆ తీయని గుర్తులు మిగిలిపోతాయని ఆనందంగా పాడుకుంటూ ప్రేమని ప్రేమతోనే జయించాలి తప్ప ప్రేమించలేదని ద్వేషంతో.. కత్తులతో దాడులు చేయడం, యాసిడ్ దాడులు చేయడం చేస్తున్న యువతకి.. ఓ..మంచి సందేశం ఇస్తున్నాట్లు ఉన్న ఈ పాట "ఒకటో.నంబర్ కుర్రాడు" చిత్రానికి "చంద్రబోసు" సాహిత్యం అందిస్తే.. మంచి పాటని పాడే అవకాశం ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టు ఎమ్.ఎమ్.కీరవాణి స్వీయ సంగీతంలో.. ఎంత చక్కగా పాడి..పరవశింపజేసారో!
ఈ పాటలో..విశాఖ సాగర తీరం,కైలాసగిరి చూడవచ్చు.
ప్రేమికుల్లారా! ప్రేమించండి.ప్రేమని జయించండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించకండి . నిజమైన ప్రేమ కి.. నిరీక్షణ అవసరం.
నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అసలే కరంట్ కోత... రెండవ వేసవి కాలం తలపిస్తున్న రోజులు. కాస్త గాలి పోసుకుందామని దినపత్రిక చేతిలో పట్టుకుని వరండాలోకి వచ్చాను.
ఇంటిముందు నుండి "సోది చెపుతానమ్మ సోది" అని సాగదీసి పలుకుతూ.. రిపీట్ గా భలే రిధమిక్ గా అనుకుంటూ వెళుతుంది సోది అమ్మి. వెళుతున్న ఆమె వైపు నేను ఆసక్తిగా చూడటం గమనించి.. సోది చెబుతాను బిడ్డా!రమ్మంటావా? అనడిగింది. ఉహు..వద్దు ! తల అడ్డంగా తిప్పుతూ అన్నాను. ఆమె ముందుకు కదిలింది.
మా చిన్నప్పుడు సంగతి గుర్తుకు వచ్చింది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా పందిట్లో బిచాణా పెట్టి మరీ అమ్మలక్కలు సోది చెప్పించుకునేవాళ్ళు. నమ్మనివాళ్ళు నవ్వుకోవడం,నమ్మినవాళ్ళు సంతోష పడటమో,దిగులుపడట మో గుర్తుకొచ్చింది.
సాధారణంగా పల్లెలలో గేదె సరిగ్గా పాలు ఇవ్వకపోయినా, బుడ్డోడికి జ్వరం తగిలినా సోది అడగడం సోది అమ్మి ఏం చెప్పిందో అలాగే చెప్పినట్లు చేయడం చేసేవారు.
"అమ్మ కూడా అప్పుడప్పుడు సోది దగ్గర కూర్చునేది. ఆమె సోదిలోకి ఎప్పుడూ.. మా చనిపోయిన మేనత్త వచ్చి ఆమెని మర్చిపోయారని పండగకి చీర కూడా పెట్టడంలేదని ఆక్షేపించేది.
అప్పుడు అమ్మ ఒక కొత్త చీర కొనడం ఆమె పేరిట దేవుడి దగ్గర పెట్టడం తర్వాత ఎవరైనా ముత్తైదువు మహిళ కి ఆ చీర ఇవ్వడం చేసేది.
ఒకోసారి మా నాన్న గారి మేనత్త సోదిలోకి వచ్చేది. ఆమె వచ్చిందంటే ఏడుపుతోనే మొదలు.మా నానమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. ఐదుగురు అన్నదమ్ముల మద్య ఒకే ఆడపడుచు..మూడు వందలఎకరాల భూస్వాముల కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగి మా ఊరిలోనే మరో గొప్పింటి కోడలిగా వెళ్లి .కట్న కానుకలు పేచీలవల్ల బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుందట. ఆమె సోదిలోకి వస్తే అందరు భయపడేవారు.
నాకు అప్పుడప్పుడే..జ్ఞానం వికసించి కాస్త హేతుబద్దమైన ఆలోచనలు పుట్టుకొచ్చి .. "అమ్మా! నిజంగా చనిపోయినవారు అలా సోదిలోకి వస్తారా? వట్టిదే ! నువ్వు నమ్మకు,ఆ సోది అమ్మి నోటికొచ్చింది ఏదో చెపుతుంది.. అంతే! అనేదాన్ని. నమ్మడం నమ్మకపోవడం కన్నా..ఆ సోదమ్మికి ఓ నాలుగు రూపాయలు, ఒక చాటెడు నూకలు ఇస్తే ఏం పోద్దిలే! అనేది అమ్మ.
నానమ్మ అయితే.. సాక్షాత్ కలియుగదైవం వెంకటేశ్వర స్వామే ఎరుకల రూపంలో వచ్చి జరగబోయే దాన్ని సోది రూపంలో చెప్పి వెళ్ళాడట. మనకైతే కుల దైవం వస్తాడు. ఇప్పుడు నువ్వలా అనకూడదు, తప్పు అనేది. లెంపలు వేసుకో అనేది కూడా ! సరే,పెద్ద వాళ్లకి ఎదురు చెప్పలేం కదా! లెంపలేసుకోకపోయినా మౌనంగా ఉండేదాన్ని.
ఆ సోది అమ్మి చెప్పే మాటలు వింటూ.. ఎవరికి ఏం చెప్పిందా..? వాళ్ళకి చెప్పిందే ఇంకొకరికి ఇంకో రూపంలో..ఎలా చెపుతుందా? గట్టిగా అడిగితే టక్కున చేతిలో మీటుతూ ఉన్న సోది బుర్ర (గుమ్మడికాయ బుర్ర) కింద విసిరి పడేసి పలాయన వాదం చేసేది. డబ్బు దశకం ముందే ఇచ్చేసే వాళ్ళు కాబట్టి మరో మాటకి అవకాశం ఉండేది కాదు.
మా పక్కింటి పిన్నో.. ఎదిరింటి అత్తో.. మేము అనుకున్నది రాలేదు.. సోది దండగ అని తిట్టుకునే వాళ్ళు. అలా తిడితే పాపం తగుల్తుంది , కులదైవం కోప్పడతాడు అని అమాయకంగా ముఖం పెట్టి చురకవేస్తూ హెచ్చరించేదాన్ని. పిల్లలు చదువుకుని చెడిపోతున్నారు..అని దులపరించుకుని వెళ్ళేవారు. అప్పుడు మా పందిరి క్రింద తుఫాను వచ్చి వెలిసినట్టు ఉండేది.
ఇలా నేను ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటూనే ఉన్నాను. అంతలో మళ్ళీ రిటన్ లో ఇటే వస్తుంది సోది అమ్మి.
తరాలు మారాయి కదా సోది ఏ విదంగా చెపుతుందో.. చూద్దాం అని ఆసక్తి కలిగి .. సోది చెప్పాలి రా! అంటూ..పిలిచాను.
ఆమె లోపలి వచ్చి కాసిని చల్లని మంచినీళ్ళు అడిగి ఇప్పించుకుని తాగి వరండాలో ఫ్యాన్ కింద తీరిగ్గా కూర్చుంది . మా ఇంటిలో చేట అటకెక్కి కూర్చుంది. మా పక్కింట్లో చేట అడిగి తీసుకుని ఏం పుచ్చుకుంటావు? అడిగాను.. పాతిక రూపాయలమ్మా..అంది. రోజుకి ఎన్ని సోదిలు చేపుతావ్ ?అని అడిగి ఆదాయం లెక్క వేయాలనుకుని. మా నానమ్మ మాట తప్పు అలా అడగకూడదు అని చెప్పింది గుర్తుకొచ్చి ఆ చేటలో బియ్యం ఒక కేజీ కి తక్కువ కాకుండా పోస్తూ ఇప్పుడు ఈ సోది అవసరమా? ముప్పయి అయిదు రూపాయల ఖరీదైన బియ్యం ఓ పాతిక రూపాయల ఖర్చు అనుకుంటూనే.. చేట బయటకి తెచ్చి పాతిక రూపాయలు చేటలో పెట్టి ఇంతలోనే ఎన్న చేట ఆలీ డైలాగ్స్ గుర్తుకొచ్చి నవ్వుకుంటూ..
కాస్త పసుపు-కుంకుమ , వక్క పెట్టి.. అమ్మ,నానమ్మ పెట్టిన దణ్ణాలని మనసులో గుర్తు తెచ్చుకుంటూ ఆ చేటని తాకుతూ దణ్ణం పెట్టుకున్నాను.
నీ ఎడమ భుజం తాకిందంటే పుట్టింటి సోది అడుగుతున్నవని అర్ధం,కుడి భుజం తాకిందంటే మెట్టినింటి సోది అని అర్ధం.
నేను చెపుతున్న సోది ఏమంటే..
అంటూ.. నా పుర చేయిని ఎడమ భుజం తాకించి.. ఈ సోది అడుగుతున్నవే బిడ్డా.. ! ఎందుకడుగుతున్నవంటే.. ఈ దినాలు వచ్చిన్నయంటే నన్ను తల్చుకుని కన్నీరు మున్నీరు అవుతావే బిడ్డా!అంది..
నేనేమి తలచుకోవడం లేదు ఎవరు నువ్వు.. ? అడిగాను.
ఎవరని అడుగుతావేటి బిడ్డా.. నన్ను మర్సిపోయావా? ఈ సోది చెప్పేటి చెయ్యి మగవాళ్ళయితే గడ్డం అంటుతుంది ఆడవాళ్ళైతే మొఖాన ఉన్న బొట్టు అంటుకుంటుంది..నేను చెప్పేటి ఈసోది.. ఆడ కూతురి సోది అంటూ నా నుదుట బొట్టుని అంటించింది.
అయితే నువ్వు ఆడమనిషివా? అయితే నాకు ఏమి అవుతావు..అన్నాను.. నిజంగా ఆ టైం లో నేను పక్కాగా మా అమ్మ సోది అమ్మిని ఎలా ప్రశ్నించేదో అలాగే గుర్తుకు తెచ్చుకుని మరీ అడిగాను అన్నమాట.
ఏమవుతావంటే ఏమి చెప్పెనే బిడ్డా!నువ్వు నాకు బాగా కావల్సినదానివి, నువ్వు ఏటికి ఎదురీదుతున్నావ్ ? నీకు కష్టం వచ్చినప్పు డల్లా నేను నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను.నీకు నీ దారిలో ఎదురేలేదు బిడ్డా! అన్నీ బాగానే ఉన్నా నన్ను మరసి పోయావే బిడ్డా ..మీ పుట్టుకకి కారణం అయిన వారిని పట్టించుకోవడం లేదే బిడ్డా అంది..
నువ్వు ఎవరు ఎందుకు అలా అంటున్నావ్? నేను ఏటికి ఎదురీదడం లేదు..ఎవరిని పట్టించుకోకుండా ఉండనూ లేదు.. అబద్దం చేపుతున్నావ్ అన్నాను వాదనగా.
నేను నిజమే చెపుతున్నా.. బిడ్డా ! నీ ఇంటి ఇలవేలుపు చెపుతున్నాను బిడ్డా.. !
నీ ఇంటి ఇలవేలుపంటే.. ఆ ముక్కంటి దేవుడే బిడ్డా, ఇది కూడా అబద్దమంటావా? నేను చెప్పింది ఇనుకుని జాగ్రత్త పడాలే బిడ్డా! ఆ శ్రీశైల మల్లికార్జున్డే పలికిస్తా ఉండే, నమ్మవే బిడ్డా..!
నాకు కాస్త కాదు.. బాగానే నమ్మకమే కలిగింది..
ఏం చెప్పలనుకున్నావు? ఏం చేయాలి నేను.? అన్నాను.
నీ బిడ్డని చూసుకున్నట్లే నీకు జనమ ఇచ్చినవాల్లని బాగా చూడాలే బిడ్డా! అత్తమామాలని బాగా చూడాలి బిడ్డా అంది. అన్నీ మంచి మాటలే చెపుతుంది అనుకున్నాను.
నీ పాడి పంట నీ బిడ్డల బాగోగులు అన్నీ నేను చూస్తూ ఉంటాను నువ్వు మాత్రం నన్ను మర్సిపోకుండా.. పండగకి పబ్బనికి మాత్రమే కాదు రోజు గురుతు ఉంచుకుంటానే ఉండావ్.నాకు సంతోషంగానే ఉంది బిడ్డా.. నీ తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి బిడ్డా.. నీ తోడబుట్టిన వాళ్లకి కోపం ఎక్కువ. నువ్వే సర్దుకుని ఉండాలే బిడ్డా.. అని చెపుతూ ..నా ముఖం వంకే చూస్తూ.. సోది పరిసమాప్తి చేద్దామని చూస్తున్నట్లుంది.
అన్నీ బాగానే ఉన్నాయి, ఇంతకి నువ్వు ఎవరు..నాకేమవుతావు? అడిగాను మళ్ళీ..
ఈ సారి కోపంగా ఎన్ని సార్లు అడుగుతావే బిడ్డా! నేను నిన్ను కన్నకడుపే బిడ్డా అంటూ నా ఉదర భాగాన్ని తాకి చూపి టక్కున సోది బుర్ర కింద పెట్టేసింది. మెల్లగా అన్నీ సర్దుకుని బయలుదేరింది.
ఇంక నాకు మాటలు లేవు.. కళ్ళు రెండు సెలయేరులయ్యాయి. కారుమబ్బులు కరిగినట్లు ధారాపాతంగా కన్నీటి వర్షం.
సోది అమ్మి సోది ని నమ్మానో లేదో తెలియదు కానీ..
అమ్మ గుర్తుకు వచ్చింది.అడుగడునా ఆమె ప్రేమ గుర్తుకు వచ్చింది. ఆమె వేసిన బాట గుర్తుకు వచ్చింది. మా కోసం పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయి.మా కోసం పడిన తపన గుర్తుకు వచ్చాయి.
ఈ నెలలోనే అమ్మ మాకు దూరమైన రోజు.. (అక్టోబర్ రెండు ) మా నోటి కి "అమ్మా" అనే పిలుపుకి తాళం పడిన రోజు. అన్నీ గుర్తుకు వచ్చాయి.లోపలి వచ్చి తనివితీరా అమ్మని తల్చుకుని, అమ్మ ప్రేమని తల్చుకుని ఏడ్చాను.
కాసేపటకి కొంచెం గిల్టీ ఫీలింగ్ తో.. నాన్నకి ఫోన్ చేసి పలకరించాను. ఇక్కడిరా నాన్నా !..ఒక పది రోజులు ఉండి వెళ్ళవచ్చు. అని పిలిచాను.
అమ్మ పోయాక ఆయన అక్కడే ఉన్నారు. పుట్టి పెరిగిన వూరు వదిలి ఉండలేనంటూ ఒక వేళ వచ్చినా.. ఒక పూటకే చెప్పుల్లో కాళ్ళు పెడతారు. చూస్తూనే వారించకుండా మేము మౌనం వహిస్తాం. అది కూడా ఎస్కేపిజం అనుకుంటాను.
ఒక ఆసక్తి + ఒక సరదా కలిపి..అమ్మ జ్ఞాపకాల ఊటలో..ముంచివేసింది. ఇది మాత్రం నిజం. అమ్మ గురించి ఇంకొన్ని పోస్ట్ లలో వ్రాస్తాను. ఈ కవిత అమ్మ గురించి వ్రాసుకున్నదే.
సోదమ్మి మాత్రం పొట్టకూటికోసం నాలుగు సరిపడే మాటలు చెప్పి ..
చెప్పి చెప్పకుండా, అర్ధం అయి కానట్టు చెప్పు కుంటూ..నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ.. జనాన్ని మభ్య పెడుతూ ఉండవచ్చు.
వాళ్ళు ఎక్కడో..ఏదో ఒక మాట అది మనకి అన్వనయిన్చుకునేలా మాటలు చెప్పి వెళుతుంటారు.. కానీ పెద్ద పెద్ద వాళ్ళు స్వామీజీలు వేదాలు, ఉపనిషత్తులు,భారత ,భాగవతాలు ఉదహరిస్తూ మంచి మాటలు చెప్పినట్లు చెప్పి మనలని వాళ్ళ మాయా జాలంలోకి లాక్కుని కట్టలు కట్టలు డబ్బులు గుంజే రకం అయితే కాదుగా.. అనుకుంటూ.. నిట్టూర్చాను.
ప్రతి ఒక్కరికి తమ జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల.
ఆ కల కొంత మందికి స్వంత మవుతుంది. మరి కొందరికి కలగా మిగిలిపోతుంది. తాము కట్టుకోబోయే ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. అసలు ఇల్లు అంటే ఎలా ఉండాలి.
ఇలా ఉండాలి అనేం లేదు కానీ ఇలా ఉంటే యెంత బాగుండునో! పట్టణం తాలూకు రణగొణ ధ్వనుల మద్య కాకుండాహాయిగా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో మనం సేదతీరుతున్నట్లు మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఉంటే బాగుంటుంది కదా!
అసలు ఇల్లంటే మనని ప్రపంచంలో ఎక్కడున్నా సరే లాక్కోచ్చేటట్టు ఉండాలి. ప్రపంచంలో స్వర్గం ఎక్కడ ఉంది అంటే అది ఖచ్చితంగా ఎవరికి వారికి వారి ఇంట్లోనే ఉందనిపించాలి కూడా.. ఇల్లు ఒక భద్రత. పగలల్లా ఎక్కడ తిరిగినా మనకంటూ ఒక ఇల్లుండటం అనేది మనని నిశ్చింతగా ఉండనిస్తుంది. ప్రపంచమంతా ఎన్నో అందమైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ఉండవచ్చు ఆ ప్రదేశాలకి వెళ్లి లోకాన్ని మరచి ఆనందంగానూ గడపవచ్చు. కానీ కొన్నాళ్ళకి అవి మొహం మొత్తి ఇంటిని వెదుక్కుంటామంటే మన ఇంట్లో మనం ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు.
మనపై ఎవరి ఆక్షలు ఉండకుండా నచ్చినట్లు ఉండగల్గుతాం. పరాయి చోటు మనకి భద్రత నివ్వదు..స్వేచ్చ నివ్వదు.భరోసాని ఇవ్వదు. దేవుడే ఇచ్చాడు వీధీ ఒకటి .. ఇక ఇల్లేల సొంత ఇల్లేల అని తాత్విక పదాలు పాడుకోలేం కదా! అందుకే ఇల్లు ఒక కల.
అసలు ఇల్లుని చూడగానే ప్రశాంత వాతావరణం గోచరించాలి ఇక "ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. " అంటే ఇల్లాలిని చూడకుండానే ఇల్లుని చూసి ఇల్లాలు ఎలా ఉంటుందో చెప్పగలరు అంట. బాహ్యపరంగా కాదనుకోండి. అందుకే ఇల్లు అలా ఉండాలి అంటే నేను చెప్పిన విధం ఏమనగా..
ఇలా కాకపోయినా
ఇలా అయినా ముగ్గు పెట్టుకోవాలి కదా !? .
ప్రతి నిత్యం ఇంటిముందు శ్రద్దగా వేసుకున్న ముగ్గు మన సంప్రదాయాన్ని ఆడవారి ఆరోగ్యాన్ని, ఉత్సాహంని ,శ్రద్దని తెలియ జేస్తుంది.
ఇక లివింగ్ రూం ఎలా ఉండాలంటే చూడటానికి ఎలాటి ఆడంబరాలు లేకుండా.అట్టహాసం లేకుండా.. సింపుల్గా ఉండాలి. అద్దాల అరమరలు అమర్చి వాటినిండా కిక్కిరిసినట్లు బొమ్మలు పేర్చడం కన్నా చక్కగా ఒక అరమర ఏర్పాటు చేసుకుని
అందులో మన అభిరుచికి తగిన విధంగా పుస్తకాలు ఉంచడం మూలంగా.. రోజు వాటిని చూస్తూ.. ఉంటె రోజుకు ఒకసారయినా ఒక పుస్తకమ యినా చదవాలనిపిస్తుంది. ఇంట్లో అరమరలని వస్తు సామాగ్రితో నింపే కన్నా పుస్తకాలతో నింపుకుంటే ఇల్లు అందంగా లేకపోవచ్చు కానీ మంచి ఆలోచనలు సదా మన తోడూ ఉండేందుకు పుస్తకాలు మనకి మేలు చేస్తాయి.
ఇక వంటిల్లు విషయానికి వస్తే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఈ వంటింటి తోనే ముడి పడి ఉంటుంది. అక్కడ అందం,పరిశుభ్రత,అమరిక అన్నీ ఉండాలి. చూడగానే అందంగా ఆకర్షనీయం గా ఉండాలి. అప్పుడే మనకి మన ఇంటి పదార్దాలు మనకి నచ్చుతాయి..అందువల్ల బయట ఆహార పదార్దాల వైపుకి మనసు వెళ్ళదు. అన్నీ సౌకర్యంగా అమర్చి ఉంటె వంట చేయడం సౌఖ్యంగా ఉంటుంది. అందంగా అమర్చుకుంటే..చూడటానికి ఇంపుగాను ఉంటుంది.
ఇక బాత్ రూం ల విషయంకి వస్తే.. చాలా మంది వాటిని పట్టించుకోరు. ఎక్కడో ఓ..మూలాన పడి ఉంటాయి. వాటిని ఎవరు చూస్తారులే అని భావిస్తారు. లివింగ్ రూమ్కి ఇచ్చిన ప్రాముఖ్యం వంట గదికి కానీ బాత్ రూమ్ల కి ఉవ్వక పోవడం చూస్తూ ఉంటాం. నేను ఎప్పుడో ఒకసారి ఓ..పుస్తకంలో చదివాను. స్నానాల గది అన్నది మనిషి అంతఃకరణనాన్ని పట్టి ఇస్తుంది అట. ఇంటి పై పై అలంకరణలు ఆడంబరాలు అన్నీ..మనిషి బాహ్య రూపం ని ప్రదర్శిస్తే మనిషి అంతఃకరణ ని లోపలి మనసుని మన పరిశుభ్రత ఎలా ఉందొ తెలియ చెపుతుందట..
ఇక బెడ్ రూం విషయానికి వస్తే మనం అలసి సొలసి సేదదీరడానికి.. మనదైన ప్రపంచంగా విహరించడానికి.. పడక గది ఒక వరం. ఆ గది విషయం కి వచ్చేటప్పటికి.. అక్కడ యెంత తక్కువ సామాగ్రితో..ఉంటె అంత మంచిది. .మన జీవనం తాలూకు ఒత్తిడులు అన్నీ మరచి మనలని మనం రీచార్జ్ చేసుకునే ప్రపంచం. తక్కువ కాంతితో.. విశాలంగా ఉండేలా.. లేదా అనిపించేలా.. ఉంటూ.. ఆ గదిలో అడుగు పెట్టగానే.. వెంటనే.. వాలిపోదాం అనిపించేలా ఉండాలి.
అలాగే ఉంది కదా?
ఇక కిడ్స్ బెడ్ రూం ఇలా ఉంటే బాగుంటుందని నా ఆలోచన
ఈ రూం డిజైన్ చూడండి .తక్కువ ప్లేస్ లో..బెడ్స్ అమరిపోయాయి ఎంత బాగుందో కదా? బట్ ఇలా ఇంత ఖరీదుగా ఇల్లు నిర్మించుకునే అవకాశం అందరికి ఉండవచ్చు. లేకపోవచ్చు..లేదా ఇంత కన్నా రిచ్ గా కూడా కట్టుకోవచ్చు. కానీ అందం తో పాటు సౌకర్యంగా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోవడం అవసరం. ఎందుకంటె ఇల్లు అంటే అందరు నివశించేది..కానీ.. మహిళలు మాత్రమే శుభ్రపరచి పరిశుభ్రంగా ఉంచగల్గేది కాదు. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే యెంత తక్కువుగా సామాను ఉంటే అంత మంచిది. అనవసర తాపత్రయంతో..ఎడాపెడా సామాను కొనేసి గదులు నింపినంతమాత్రాన అందం గా ఉండదు. ఉపయోగపడే వస్తువులను మాత్రమే కొనుక్కుని వాటిని శుభ్రం చేసుకుంటూ పొందికగా సర్దుకుని...ఉండటం మూలగా అందం ఆనందం.
అందం వస్తువల విలువలో ఉండదు. అభిరుచిలో ఉంటుంది.కదా!..
మేడలలో..మిద్దేలలో.. సుఖం ఉంటుందని కాదు పూరి గుడిసేలోను ఆనందంగా ఉండవచ్చు. ఇల్లు ఎండా-వాన నుండి రక్షణే కాదు. మనిషికి చిరునామా.. జీవితాని ఓ..భద్రత.మనసుకి నిశ్చింత. ఇదంతా ఎందుకు చెప్పాననుకుంటూన్నారా ? ఎవరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారన్నా.. గృహప్రవేశ ఆహ్వానం కి పిలిచినా.. నేను ఎప్పుడు ఓ..ఇంటి దాన్ని అవుతానో అని దిగులు ముంచుకొస్తుంది. (ఓ..ఇంటిదాన్ని అయి పాతికేళ్ళు అవుతున్దిలెండి.ఆ ఇంటి దాన్ని కాదు ) ఓ..స్వంత ఇంటి మహిళని అవుదామని కలలుకంటున్నాను. గూగులమ్మని..ఇల్లు చూపవమ్మా అంటే ఇలా కళ్ళు చెదిరేలా చూపింది. ఆలస్యంగా అయినా ఇలాటి నిర్మాణం తోనే ఇల్లు కట్టుకోవాలని.. ఆశ.పనిలో పనిగా..ఇల్లు ఎలా ఉంచుకోవాలో.. అప్పుడెప్పుడో..నేను చెప్పినదాన్ని నెమరవేసుకుని.. ఇలా రాసేసి..(టైపు చేసి పడేసి) చదవడానికి మా మిత్రులు ఉన్నారులే అని ధీమా మాత్రం కాదండీ.. ఇవి చూసి మెచ్చినా సరే లేదా ఇంతకన్నా మంచి మంచి డిజైన్ లు ఇచ్చే వెబ్ అడ్రస్ లు ఇచ్చినా సరే .అని అభ్యర్దిస్తూ .. . ....
నేను వాడిన చిత్రాలు అన్నీ (ఐడియా బుక్స్ ఆన్ హౌజ్ ) నుండి సేకరించి..అందరితో..పంచుకుంటున్నవి తప్ప దుర్వినియోగం చేస్తున్నవి కాదు..అని గమనించ మనవి.
అబ్బ! బతకడం మహా బరువుగా ఉంది.. పువ్వులా నదిలో.. తేలియాడే బతుకు బతకడానికి కూసింత అదృష్టం అయినా చేసుకుని పుట్టవద్దూ.. పోనీ అలా పుట్టలేకపోయామని పువ్వు మీద నది ప్రవాహం మీద దుగ్ధ ఎందుకు గానీ .. కూసింత అయినా ఉలికి పడి చూసి చుట్టూరా చూడండీ.. మనం చూడనవసరం లేదు మీడియా మనమీద దయ తలచి మెరుగైన సమాజం కోసం లాటి శీర్షికలతో.. పారాహుషార్ లాటి డజన్ల కొద్ది ఉపశీర్శికలతో జనాలని నిద్రపొనీయకుండా.. దోమలు చంపుకుంటూ(అవినీతి దోమలని పెంచుకుంటూ) మరి చూడమని..సరి కొత్త కథనాలు ఎందుకిస్తుంది అనుకుంటున్నారు..భాద్యత అండీ భాద్యత. భాద్యతని కూడా సెన్సేషనల్ గా చూడాలని మీడియా అప్పుడప్పుడు చెవుల్లో శంఖం పూరించి నిదుర లేపి మరీ చెబుతుంది. నిద్ర ఎప్పుడు పోయా మంటారా అని అడగకండి.
ప్రభుత్వం అంత హాయిగా నిద్ర పోతుంటే మనకెందుకు రాదండి నిద్ర.. రేపుద్దున్నేకి..గ్యాస్ రేట్ పెరగవచ్చు.ఉల్లిపాయ రేటు బాంబులా పేలవచ్చు.చమురు ధర దీపావళి వెలుగుల్లో వేలగావచ్చు.పప్పు .. పప్పా!అదేమిటి అని కొత్తగా మాటలు నేర్చుకునే చిన్నారులు చూడనిదాన్ని అడగా వచ్చు. చింతాల్ సబ్బు మానేసి సంతూర్ కొనుట అలవాటు పడినాము.ఆకు కూరలు లాభం లేదు..మునగాకు మంచిదంట ఇంటి పక్క ఏ గోడమూల చూసో..ఆ మొక్క నాటేద్దాం.ఆకు కూరల బదులు మునగాకు కూర మంచిది అని నలుగురికి చాటి చెపుదాం. వంటింట్లో ఏ సరుకు తగ్గించుకుని.. డబ్బు ఆదా చేసి కార్పోరేట్ స్కూల్ ఫీజు కో పొడుపు చేద్దాం లేకపోతె కార్పోరేట్ ఆసుపత్రికో! పెద్దగా తేడా ఏం లేదు కదా!.
ఓ పద్నాలుగేళ్ళ నాడు "గాయం' చిత్రంలో.. ఒక పాట నేపధ్యంలో సిరివెన్నెల గారు.. (ఆయన నోరు చల్లంగా ఉండ ) ఓ మంచి చెడ్డ మాట చెప్పారండి. నిజాలు శోధించి,సాధించి ఈ గొర్రె జనం కి చెబితే ఏం జేస్తారు.. ? సెన్సేషనల్ న్యూస్ గా చూసి కాసేపు ముచ్చటించుకుని పేపర్ పక్కన పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు..అని చెప్పిన స్థాయి నుండి.. మన మీడియా యెంత ఎదిగి పోయిన్దండీ.. మొన్నటికి మొన్న అన్నాఅవినీతి యుద్దాన్ని క్షణ క్షణం చూపింది. సామాజిక సృహ పెంచింది. అలాగే తారాజువ్వలా పైకి లేచి టప్పున పడిపోతుంది. జనాని కేమో మీడియాలో చెపితేనే వార్త. మన పక్కిల్లు కాలితే కూడా.. మనం చూస్తున్న వార్తల్లో చూపిస్తుంటే కానీ మనకి తెలియదు. బిన్ లాడెన్ ని పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా తెలియకుండా గాలించి గాలించి పట్టుకుని మట్టుబెట్టిన వైనం లా.. మీడియా ఎన్ని సాహసాలు చేస్తుంది.అర్ధం చేసుకోరూ.. సొల్లు కబుర్లు,చెత్త సినిమాలు,రేటింగ్లు పక్కన పెట్టి ప్రజాస్వామ్య దేశంలో..అచ్చరాల నోటుని,వోటుని చూపించాక..కూడా ప్రజలకి బుద్ది రాలేదు జ్ఞానం రాలేదు అని ఊరుకోదాయే! అన్నిటిలో దూరిపోయే సూది కున్న బెజ్జం లాటిది. అందరి దగ్గరా ఇమిడిపోయే సేల్పోన్ లాటిది.మరీ మాటాడితే ఇంద్రుడుకి వళ్ళంతా కన్నులున్నట్లు సహస్ర అవతారి. ఇన్ని అవతారాలు ఎత్తినా పోద్దస్తమాను ఇవే చెప్పేసి కూడా.. చెప్పిందే చెపుతాడు.వాడు ఏం చెప్పాడు వీడెం చెప్పాడు అని తెగ ఆసక్తితో..ఇంట్లో ఆడాళ్ళని సీరియల్స్ చూడనీయకుండా.. వాడి వాదన నిజమా వీడి వాదన నిజమా? అని తెగ ఆలోచించినట్లు నటించి జుట్టుపీక్కుని మరీ నిజం కోసం భూతద్దంతో..శోదించి.. ఆ శోధించడంలోను, నటించడంలోను విసుగొచ్చి.. అమ్మో!కరంట్ బిల్లు షాక్ కొడుతుందని గుర్తొచ్చి ..టప్పున టీవి కట్టేసి పొద్దునే లేచి మళ్ళీ ఏం జరుగుతుందని ఆసక్తి తో..టీ.వి ఆన్ చేసే సగటు జీవి... మన భారతీయుడు. ఇంతకన్నా ఇంకేమన్నా ట్యాగ్ లైన్ ఉంటె చెప్పండోచ్! నేను తెగ వెదుకుతున్నా.
లోకం అంతా నిదురిస్తున్న వేళ ఆమెకి నిద్ర రానంటుంది.పక్కలో..అటునిటు ఒత్తిగిల్లుతూనే ఉంది.
మనసంతా ప్రేమికుడి గూర్చిన ఆలోచనలే!
అక్కడ అతనికి అలాగే ఉంది.అందుకే ఆ ఇద్దరు చిక్కని వెన్నెలలో మంచు కొండల్లోకి విహారంకి వెళ్లి మనసులో మెదిలే భావాలని..పంచుకుంటూ పాడుకుంటున్నారు.ఒట్టు పెట్టుకుంటున్నారు.
నాకు బాగా నచ్చిన పాట ఇది. ప్రేమికులందరూ ఇలా ఉండాలని కోరుకుంటాను... ఆ పాట సాహిత్యం చూడండి. తెలుగులో..ఇలా ఉంటుంది.
AAP KI KASAM
నేను నీ ఆలోచనలతో.. నిద్ర రాక పక్క మార్చు కుంటూనే ఉన్నాను.
నీ మీద ఒట్టు
రాత్రంతా ..ఆలోచనలు మారుతూనే ఉన్నాయి.
ఉదాసీనం గా ఉండవద్దు.
పగటి వేళలలో విడిపోవడం ఎటు ఉండనే ఉంది.
నీ మీద ఒట్టు.
ఆమె:
అర్ధ రాత్రి ఉలికి పడి లేచిన వేళ నువ్వే గుర్తుకు వస్తావు
ఆ తర్వాత నిద్ర నన్ను.నేను నిద్రని
తరుముకుంటూ ఉంటాము.
చిక్కని వెన్నెల పరచుకున్న ఈ రాత్రి అంతా..
నా మనసుని గుచ్చుతూ..ఉంది.
కురుస్తున్న ఈ మంచు ..నిప్పులా మండుతుంది.
నీ మీద ఒట్టు..
అతడు :
ప్రియతమా..! సరస్సు లాంటి కన్నులలో
మునిగి తప్పి పోతావు.
మనసులో ఉన్న కోరికలు పరచిన శిరోజాల మాటున
నిద్రపోతాయేమో!
నువ్వెళ్ళి పో ! లేకపోతే ఏదో ఒకటి (తప్పు) జరుగుతుంది
ఇటువంటి పరిస్థితుల్లో అడుగు తడబడుతుంది ..
నీ మీద ఒట్టు.
ఆమె: ఒక వేళ అలిగితే
నన్ను బతిమలాడి అక్కున చేర్చుకో..ప్రియా
అతడు: దూరంగా ఉంటే దరి చేర్చుకో..ప్రియా
ఆమె: కొంచెం మొండిగా ఉంటే కౌగిలించుకో ప్రియా
ఆమె:ఎప్పటికీ తెగ కూడదు ఈ ప్రేమ సంబంధం
నీ మీద ఒట్టు.
ఈ ఆప్ కి కసమ్ .. యెంత మధురంగా ఉంటుందో! ఉందొ కదా! ఇక ఈ వీడియోలో చూడండీ!
తారాగణం :
రాజేష్ ఖన్నా,ముంతాజ్
గాయనీ గాయకులూ:కిషోర్ కుమార్,లతా మంగేష్కర్
ఆనంద్ బక్షీ సాహిత్యం- ఆర్.డి బర్మన్ సంగీతం వహించారు.
హిందీ సాహిత్యం:
karvatein Badalte Rahe Saari Raat Hum
Aap Ki Kasam ...
Gham Na Karo Din Judaai Ke Bahut Hain Kum
Aap Ki Kasam ...
Yaad Tum Aate Rahe Ek Hook Si Uthti Rahi
Neend Mujhse Neend Se Maein Bhaagti Chhupti Rahi
Raat Bhar Bairan Nigodi Chandni Chubhti Rahi
Aag Si Jalti Rahi Girti Rahi Shabnam
Aap Ki Kasam ...
Jheel Si Aankhon Mein Aashiq Doobke Kho Jayega
Zulf Ke Saaye Mein Dil Armaan Bhara So Jayega
Tum Chale Jaao Nahin To Kuchh Na Kuchh Ho Jayega
Dagmaga Jayenge Aise Haal Mein Kadam
Aap Ki Kasam ...
Rooth Jaayen Hum To Tum Humko Mana Lena Sanam
Door Hon To Paas Humko Tum Bula Lena Sanam
Kuchh Gila Ho To Gale Humko Laga Lena Sanam
Toot Na Jaye Kabhi Yeh Pyar Ki Kasam
Aap Ki Kasam ..
బాలీవుడ్ నటి రేఖ అంటే ఇష్టం ... సిల్ సిలా చిత్రం మరీ ఇష్టం .. ఆ ఇష్టంతోటే ... ఈ పాట పరిచయం
అతడు-ఆమె
ఆమెతో అతను అంటూ ఉంటాడు ....
నేనెప్పుడూ ... ఇవే ముచ్చటించుకుంటాను.
యేమని అంటే
నేను నా ఒంటరితనం నీ గురించే మాట్లాడుకుంటాం.
నువ్వు ఉంటే ఎలా ఉంటుందో..ఏ విషయానికి నువ్వు నవ్వుతావో..
నువ్వు ఎలా మాట్లాడతావో , నువ్వు ఏం చేపుతావో
నువ్వు అలా చెపుతావు,ఇలా చెపుతావు
నువ్వు ఏ విషయంలో హైరానా పడతావో
ఆ విషయంలో హైరానా పడతావా అని
నువ్వు ఉంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని
నేను నా ఒంటరితనం ఆ విషయాలే తరచుగా చెప్పుకుంటూ ఉంటాం... అంటూ అతను
ఈ విషయమే చెప్పటానికి వచ్చాను నేనూను..
నీ తోడుగా,నీ సహచర్యంలో నడుస్తూ
ప్రియమైన నీ కౌగిలిలో ఉన్నాను ప్రియతమా!
నా ఈ శరీరం..ప్రాణం కరిగిపోతున్నాయి
ఈ విషయమే చెప్పటానికి నీ తోడుతో నడుస్తూ.. అంటుంది ఆమె.
ఇది రాత్రి..
నీ నల్లని కురులు పరచి ఉన్నవి .
చందమామవలె అనుకోనా? లేక నీ చూపుల తోడుగా నా ఈ రాత్రి గడుస్తుందనుకోనా?
అది చందమామా! లేక నీ చేతి కంకణమా ?
నక్షత్రములా అవి? లేక నీ మేలిముసుగులో దాగిన పిల్ల తెమ్మెర కదలికలా?
లేక నీ శరీరం నుండి వ్యాపించిన సువాసనా?
నీ కాలికున్న అందెల సవ్వడి తెలుపుతాయి నువ్వెక్కడ దాగున్నావో! నేనూ ఈ విషయాన్నే ఎప్పటి నుండో.. లోలోపల ఆలోచిస్తున్నాను.
నువ్వు లేవన్న విషయము,ఇక్కడ లేవన్న విషయమునూ..
కానీ నా మనసు చెపుతుంది
నువ్వు ఇక్కడే ఉన్నావు, నా చుట్టూనే ఎక్కడో ఉన్నావు అని... అనుకుంటున్నాడు అతను.
అందుకు ఆమె ఇలా చెప్పుకుంటుంది
నువ్వు శరీరం,నేనూ నీడ
నీవు లేకపోతే నేను ఎక్కడ ఉంటాను
నన్ను అమితంగా ప్రేమించేవాడా !
నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా!
చివరి శ్వాస వరకూ కలిసే ఉండాలి
ఈ దారిలోనే పయనించాలి
ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను ..అని చెపుతుంది ఆమె.
తడిసిన చందనపు సువాసనలా , వెన్నెల లా ఉంది నీ ప్రేమ
నా హృదయం ఎలా ఉందంటే పూదోటలా
సుతి మెత్తగా ఈ సాయంత్రం దొర్లుతూ దొర్లుతూ ఉంది.
ఈ విషయాన్ని చెప్పాలి అని నీ తోడుగా నడుస్తూ..
అని ఆమె చెపుతుంటే ఇలా విశ్లేషించుకుంటూ అంటున్నాడు అతను
బలహీనమైన స్థితి అటువైపు ఉంది - ఇటువైపు ఉంది
ఒంటరితనంలో గడవాల్సిన రాత్రి ఇక్కడా ఉంది-అక్కడా ఉంది
చెప్పడానికి చాలా ఉంది
అయితే ఎవరికీ చెప్పాలి నేను
ఎప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండాలి?ఈ వేదనని సహిస్తూ..
మనసు చెప్తుంది
ఇన్నాళ్ళు .. నీకు నాకు మద్య అడ్డుగోడగా ఉన్న
లోకంలోని సంప్రదాయాల గోడను ఈ రోజు కూలగోట్టమని
ఎందుకు మనసు మండించుకోవాలి?
లోకానికి తెలియ చేద్దాం
అవును .మా మద్య ప్రేమ ఉంది అని
మా మద్య ప్రేమ ఉంది ప్రేమ ఉంది.
అని చెప్పటానికే తీర్మానిన్చుకున్నట్లు చెపుతున్నాడు అతను
ఈ విషయమే చెప్పటానికి వచ్చాను నేనూ.నీతో నడుస్తూ.. అంది ఆమె.
ఈ సంభాషణ అంతా. ప్రేమికులైన ఒక భర్త -భార్య మద్య పాట రూపంలో సాగుతుంది. భార్య-భర్తే కదా.. ఇంత కన్నా ఇంకా బాగా చెప్పుకోవచ్చు అనుకుంటున్నారు కదూ!
నిజమే కానీ వారిరువురు భార్య-భర్తలు కాదు. ప్రేమించుకుని విధి వ్రాతతో విడిపోయి వేరు వేరు వివాహాలు చేసుకుని మరలా అనుకోనివిధంగా కలిసినప్పుడు చిగిర్చిన గాఢమైన ప్రేమ తో..వారి మద్య ఉన్న ప్రేమ బంధం ఎంత బలీయంగా ఉందొ చెప్పుకుంటున్నారు.
హిందీ భాష నుండి తెలుగు లోకి తర్జుమా చేసిన ఈ పాట .. అందమైన ఈ పాటని ఇక్కడ చూడండి.
నాకు నచ్చిన ఈ పాట "సిల్సిలా" చిత్రం లో పాట. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం కొంత వాస్తవవికంగా ఉంటుందని అనుకుంటారు. నాకు బాగా నచ్చిన చిత్రంలో.. నాకు బాగా నచ్చిన పాట.
ఈ పాట కి అసలు సాహిత్యం ఇది. అనువదించడంలో..కొంత ఇబ్బంది కల్గినా తప్పులు ఉన్నా భావ విషయంలో..అటుఇటుగా ఉన్నా తప్పులు తెలియజేస్తే సవరించే ప్రయత్నం చేస్తాను.
song By AMITABH BACHCHAN AND LATA MANGESHKAR --MALE-- Main aur meri tanhaai aksar yeh baatein karte hain Tum hoti to kaisa hota, tum yeh kehti, tum voh kehti Tum is baat pe hairaan hoti, tum us baat pe kitni hansti Tum hoti to aisa hota, tum hoti to vaisa hota Main aur meri tanhaai aksar yeh baatein karte hain --FEMALE-- Yeh kahan aa gaye hum Yunhi saath saath chalte Teri baahon mein hai jaanam Mere jism-o-jaan pighalte Yeh kahan aa gaye hum Yunhi saath saath chalte --MALE-- Yeh raat hai, yeh tumhaari zulfein khuli hui hai Hai chaandni ya tumhaari nazrein se meri raatein dhuli hui hai Yeh chaand hai ya tumhaara kangan Sitaarein hai ya tumhaara aanchal mne chupke se kuchHawa ka jhonka hai ya tumhaare badan ki khushboo
Yeh pattiyon ki hai sarsaraahat ke tu kaha hai Yeh sochta hoon main kab se gumsum Ke jab ki mujhko bhi yeh khabar hai Ke tum nahin ho, kahin nahin ho Magar yeh dil hai ke keh raha hai Ke tum yahin ho, yahin kahin ho --FEMALE-- O, tu badan hai main hoon chhaaya Tu na ho to main kahan hoon Mujhe pyaar karne waale Tu jahan hai main vahan hoon Hamein milna hi tha hamdam Issi raah pe nikalte Yeh kahan aa gaye hum Yunhi saath saath chalte Mm, meri saans saans maheke Koi bheena bheena chandan Tera pyaar chaandni hai Mera dil hai jaise aangan Koi aur bhi mulaayam Meri shaam dhalte dhalte Yeh kahan aa gaye hum Yunhi saath saath chalte --MALE-
Majboor yeh haalaat, idhar bhi hai udhar bhi Tanhaai ki ek raat, idhar bhi hai udhar bhi Kehne ko bahut kuch hai, magar kisse kahe hum Kab tak yunhi khaamosh rahe aur sahe hum Dil kehta hai duniya ki har ek rasm utha de Deevaar jo hum dono mein hai, aaj gira de Kyoon dil mein sulagte rahe, logon ko bata de Haan humko mohabbat hai, mohabbat hai, mohabbat Ab dil mein yehi baat, idhar bhi hai udhar bhi --FEMALE-- Yeh kahan aa gaye hum Yunhi saath saath chalte Yeh kahan aa gaye hum
మీ పిల్లలు బెట్టింగ్ వలలో చిక్కుకుంటున్నారా? అదేనండీ సరదాగా ఆటలాడుకుంటూ.. బెట్ ..అంటున్నారా? జాగ్రత్త సుమండీ! పందెం లేకుండా ఆట మజా ఏముంది అనుకుంటే అది చాలా ప్రమాదకరమైన పరిణామం . బెట్టింగ్ వలలో పెద్ద పెద్ద క్రీడాకారులు ఎలా అయితే చిక్కుకుంటున్నారో ఏమో కనీ వాళ్ళ ప్రలోభాలు వారివి. వారిని మనం ఏం చేయలేం కానీ మన పిల్లలని ఆ బెట్టింగ్ వలనుండి కాపాడుకోవడానికి కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కాలం.పిల్లలు ఏదో వాళ్లకు కావాల్సింది చదువు కుంటున్నారో ,లేదా సెర్చ్ చేసి చూసు కుంటున్నారో ..అని నాలా అమాయకంగా అనుకోకుండా పేస్ బుక్ లోనో,ఆర్కుట్ లోనో చాట్ చేసుకుంటున్నట్లు ఉన్నా వారి మద్య వివిధ దేశాల మద్య క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు మీ పిల్లలు కూడా ఆ జూదం వలలో చిక్కుకుని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారా?
మైదానంలో రెండు జట్ల మద్య జరిగే ఆటని నియంత్రించే మాఫియా బెట్టింగ్ లు, అదే ఆట పై వందల కోట్ల పై జరిగే వ్యాపారాలు సంగతి సరే చిన్న చితక పట్టణాలలో సైతం బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఆట జరిగే టప్పుడు మన మద్య మనకి తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ వలలో..పిల్లలు చిక్కుకుంటున్నారు. అందుకు ఒక ఉదాహరణ అనాలో..ఒక అనుభవం అనాలో.. ఏమో కానీ ఒక వాస్తవ విషయం చెప్పబోతున్నాను. ఇది నా అనుభవం మాత్రమె అనుకోవద్దు. ఇలాటి అనుభవం ఎవరో ఒకరి ఇంట్లో కూడా జరుగుతున్నాయి.
ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను మా అబ్బాయికి GRE వ్రాయడానికి నేను ఫీ ఇచ్చి పంపాను. ఆ డబ్బు అందుకు ఉపయోగించకుండా నాతొ అబద్దం చెప్పాడు తర్వాత తెలిసిన విషయం ఏమంటే ఆ డబ్బు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన దేశం గెలుస్తుందని బెట్ కట్టి మన దేశం ఓడిపోయింది,మా వాడు డబ్బు పోగొట్టుకున్నాడు. అసలు పిల్లలు చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్ లు ఆడుకుంటూ కూడా బెట్ కట్టడం ఆనవాయితీ అన్న సంగతి నాకు చాలా కాలం తెలిసింది కాదు. కాలేజ్ లో చదివే పిల్లలు తల్లిదండ్రులకు తెలియ కుండా ఎన్నో నాటకాలు ఆడుతూ ఉంటారు. పిల్లలు అన్నాక యేవో కొన్ని సరదాలు ఉంటాయి కాదనం.కానీ ఇలా వేలకు వేలు తగలపోయడం మాట అలా ఉంచి.. ఆట అనేదాన్ని గెలుపు-ఓటమి నిమిత్తం లేకుండా..ఆట ఆడే విదానాన్ని తమ-పర బేధం లేకుండా ఆస్వాదించకుండా .. వారి ఆట పై..బెట్ లు కట్టుకుని ఒక ప్రమాదకరమైన వ్యసనం లో చిక్కుకుంటున్నారు.
చాలా నెలల తర్వాత నీ GRE ఎగ్జాం ఎప్పుడు..బాగా ప్రిపేర్ అవుతున్నావా? అని అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పలేదు మా వాడు. అప్పుడు మా బావ గారి అమ్మాయి చెప్పింది."పిన్ని తమ్ముడు ఫి కని ఇచ్చిన ఆ డబ్బు క్రికెట్ మ్యాచ్ పై బెట్ కట్టి పోగొట్టుకున్నాడు .నువ్వు తిడతావని చెప్పడం లేదు అని చెప్పింది. నేను మా అబ్బాయిని ఏమి అనలేదు. మళ్ళీ పీ కట్టి రమ్మని డబ్బు ఇచ్చి పంపాను.
అసలు ఈ క్రికెట్ మ్యాచ్ బెట్ కట్టడాలు వివిధ కాలేజెస్ లలో చదివే పిల్లల్లోనే ప్రతి ఆదివారం జరుగుతాయని ఎవరో నా చెవిన వేసారు. నాన్నా! నిజమేనా? ఆ సంగతి అన్నాను. అవునమ్మా! అసలు బెట్ లేకపోతె మజా ఏముంటుంది.. అన్నాడు. ప్రతి సండే మేము ఆడే మ్యాచ్ లలో నేను క్రీజ్ లో దిగక ముందు నుండే నా రన్స్ పై బెట్ లు కడతారు. వాళ్ళు ఓడిపోకుండా ఉండటానికైనా నేను బాగా ఆడాలి అని చదువు సంద్యలు,తిండితిప్పలు లేకుండా పరుగులు పెడుతూ ఉండేవాడు.నాకు కోపం వస్తూ ఉండేది. సమయం చిక్కినప్పుడు తనకి బెట్టింగ్ అనేది యెంత చెడ్డ విషయమో..చెప్పడం కోసం ఎదురు చూసాను.
ఒక సారి మా ఊరిలోనే ఒక కుర్రవాడి తండ్రి మా అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చారు. వారిని కూర్చో బెట్టి ఏమిటండీ విషయం అని అడిగాను. నిఖిల్ తో ఓ విషయం మాట్లాడిపోదామని .. వచ్చాను అన్నారు.పర్వాలేదు మాతో చెప్పండి ఎటువంటి విషయమైనా సరే! అన్నాను. ఆయన ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మా వాడు పెద్దగా చదువు సంద్యలు లేకుండా పనిపాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే మూకతో కలసి తిరుగుతూ ఉంటాడు. ఈ మద్య ఇంట్లో డబ్బులు దొంగిలించడం,బయట అప్పులు చేయడం అవి చేస్తున్నాడు. ఒకసారి మీ అబ్బాయి నిఖిల్ వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు. మా వాడు ఎక్కువ మొత్తంలో డబ్బు తెచ్చి క్రికెట్ మ్యాచ్ ల పై బెట్ లు కడుతున్నాడు . జాగ్రత్త అంకుల్. అని చెప్పి వెళ్ళాడు. మీ బాబు వచ్చి చెప్పి వెళ్ళగానే నేను లారీ పై డ్యూటికి వెళ్లాను. నేను వచ్చేసరికి దాదాపు ఎబైవేలు రూపాయలు నేను తెమ్మాన్నానని అప్పుగా తెచ్చి బెట్ కట్టి ఓడిపోయాదట.ఆ డబ్బు గెలుచుకున్న వారు మీ నిఖిల్ కి బాగా తెలుసట .ఇప్పిస్తారేమో అని ఒక మాట అడుగుదామని వచ్చాను..అన్నారు. నాకైతే మాట రాలేదు. బాబోయి...పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా లేని పిల్లలు ఇలా చేస్తున్నారంటే..వాళ్ళు యెంత ప్రలోభానికి గురి అవుతున్నారు అనిపించింది. ఎలోగాలా.. ఆ అబ్బాయికి ఆ డబ్బు రావటానికి నానా తిప్పలు పడి ఆ అబ్బాయికి ఆ డబ్బు సమకూర్చి.. వాడికి గట్టిగా క్లాస్స్ పీకి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ చేసి.. అమ్మయ్య అనుకున్నారు..మా అబ్బాయి,వాడి ఫ్రెండ్స్ నూ.. ఇవి పిల్లల సరదా సరదా బెట్టింగ్స్ అనుకోవాలా?
ఇక నేను ఆ రోజు మా వాడికి గట్టిగా క్లాసు తీసుకున్నాను. బెట్ మ్యాచ్ లు ఆడినా బెట్ కట్టినా అందువల్ల వచ్చే లాభం-నష్టం కన్నా వ్యసనం యెంత ప్రమాదకరమైనదో.. అందువల్ల ఎందరు సర్వస్వాన్ని కోల్పోతారో..చెప్పాను. ఊరుకోమ్మా.. అన్నీ అంత సీరియస్ గా ఆలోచిస్తావ్? నేను వంద నుండి అయిదు వందల వరకే బెట్ పెడతాను. అన్నాడు. ఇక అప్పుడు సీరియస్ అయ్యాను. బెట్టింగ్ ద్వారా సంపాదిన్చాలనుకోవడం చాలా సిగ్గు చేటు. ఒకరి కష్టార్జితం ని ఇతరులు దోచుకు తినడం కన్నా హీనం. నువ్వు గెలుచుకున్నప్పుడు నీకు సంతోషం కల్గించే విషయం ఇంకొందరిని నష్ట పరచి .అది వాళ్ళని భాద పెడుతుంది.ఒకరిని భాదపెట్టి ఆ డబ్బుని నువ్వు సంతోషంగా సొంతం చేసుకోవడమే చాలా తప్పు. తేలికగా డబ్బు సంపాదిన్చాలనుకోవడం సోమరితనం యొక్క లక్షణం. పని చేయకుండా తిండి వాడు దొంగ ..అన్నారు గాంధీజీ.అని చెప్పి..తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఇలా తగలపోయడం మీకు సిగ్గు అనిపించడం లేదా?అన్నాను. ఆ..మేము కష్ట పడకుండానే వచ్చేస్తున్నాయా ఏమిటీ? మేము ఒక మ్యాచ్ గెలవాలంటే ప్రాక్టీస్ చేసి యెంత చెమటలు కక్కుతామో..మీకేం తెలుసమ్మా.. అన్నాడు. అది తప్పు.. బంగారం. ..అంటూ..లాలనగా జూదం యెంత ప్రమాదకరమో.. ధర్మ రాజు దగ్గర నుండి మా బంధువులలో ఒకాయన గుర్రపు పందేలలో..సర్వస్వం ఎలా పోగుట్టుకున్నాడో..చెప్పి .. ఇలా ఈ రోజు చిన్నగా మొదలైన సరదాలు ముందు ముందు యెంత పెను ప్రమాదంగా మారతాయో వివరించి చెప్పాను.
అలా జరిగిన తర్వాత కొంత ఆలోచనలో పడి బెట్ మ్యాచ్ లు లు ఆడటం మానేసాడు. మరలా ఒక సంవత్సరం తర్వాత ఒక సంఘటన జరిగింది. అమ్మా.. నాకు ఒక అయిదు వేలు డబ్బులు కావాలమ్మా!అన్నాడు. ఎందుకు బంగారం అని అడిగాను. ఎందుకు ఎందుకు అని అడుగాతావ్? అడగకుండా ఇవ్వలేవా అన్నాడు..కోపంగా. ఇస్తాను కానీ అంత డబ్బు అవసరం నీకు ఏముంది.. బంగారం ..అన్నాను.నేను ఆర్కుట్ లో..ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ ఉన్నాను. నా చాట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మ్యాచ్ మనవాళ్ళు గెలవరు. అంది.. నేను గెలుస్తారు అన్నాను. బెట్ అంది.. మళ్ళీ నేను వెనుకంజ వేస్తె బాగుండదని ఓకే.. అన్నాను. మా ఇద్దరి మద్య బెట్ అయిదు వేలు. మన ఇండియా వోడిపోయింది. నేను మాట ప్రకారం ఆ అమ్మాయికి డబ్బు ఇవాలి కదా అన్నాడు. మరి ఇవ్వాలి కదా అన్నాను నవ్వుతూ.. మరి అందుకే ఇవ్వు అన్నాడు. ఏమిటీ ఈ బెట్ ల మాయాజాలం అని ఆలోచిస్తూ.. మా వాడికి డబ్బు ఇచ్చాను. మా వాడు కూడా చాలా "షై" ఫీలింగ్ తో సారీ అమ్మా!..ఇలా ఎప్పుడూ చేయను అన్నాను.
సరే .. వదిలేయి అన్నాను. ఎవర్రా..ఆ అమ్మాయి అని అడిగాను ఆసక్తిగా..మన సిటి లోనే ఒక పెద్ద రౌడీ నాయకుడి కూతురు..మా క్లాస్స్ మేట్.అన్నాడు. వాలా నాన్న పెద్ద రౌడీ అని భయపడి డబ్బు ఇస్తున్నావా? ఆన్నాను జోక్ గా.. కాదులేమ్మా..మాట అన్నాక మాటే కదా! అన్నాడు. అప్పుడు నాకు దిగులు కల్గింది..గర్వం కల్గింది. మాట తప్పే నైజం లేనందుకు..బెట్టింగ్ ల వలలో..ఈజీగా చిక్కు కుంటూ ఉన్నందుకునూ. తర్వాతా ఆ అమ్మాయి తన అకౌంట్ నెంబర్ చెపితే ఆ నంబర్కి డబ్బు జమ చేసి వచ్చాడు. అలా ఆ రోజు ఆ అమ్మాయి దాదాపు పన్నెండు మంది పరిచయస్తులతో .. చాట్ లోనే బెట్ కట్టి డబ్బు గెలుచుకుందట, ఒరేయ్..గోర్రేలమందలా అందరం ఒక అమ్మాయి చేతిలో చిక్కుకున్నాం..మా ఇంట్లో అయితే ఏం అనలేదు .థాంక్ గాడ్..అంటున్నాడు మావాడు. బాప్ రే.. ఆమ్మాయిలు అనుకున్నాను.ఆ రోజు సాయంత్రం మా అబ్బాయికి షాపింగ్ చేసుకోచ్చుకోమని డబ్బు ఇచ్చాను. నువ్వు రామ్మా! ..వెళదాం అంటే ఇద్దరం వెళ్లి తిరిగి తిరిగి తనకి నచ్చినవి కొనుకున్నాడు. వాడికి అర్ధమైంది. నేను విపరీతమైన కోపంలో ఏమడిగినా వెంటనే ఇచ్చేస్తాను అని. నేనుకూడా తనకి కావాల్సినవి అందించడానికి యెంత ఇబ్బందిలోనే ఉన్న సరే వెనుకాడను. పిల్లలు తల్లిదండ్రుల ఇబ్బందిని గుర్తించాలి .ఆ ఇబ్బంది లో కూడా వారికి మనం యెంత ప్రాముఖ్యతని ఇస్తున్నామో అర్ధం కావాలి..అని నా ఆలోచన. అప్పటికి వారు అర్ధం చేసుకోలేక పొతే వారు మనిషిగా ఎదగటానికి.. ఆస్కారమే లేదని నా ఉద్దేశ్యం కూడా.
ఆ రోజు అలా జరిగిన తర్వాత మరునాడు మా ఊరిలోనే కేర్&షేరింగ్ స్వచ్చంద సేవా సంస్థ నిర్వహణలో.. పూర్తిగా హెచ్.ఐ వి. బాధిత పిల్లలు ఉన్న అనాధ శరణాలయం కి వెళ్లి అక్కడ ఆ పిల్లలకి కావాల్సిన వస్తు సరంజామాని స్వయంగా కొని పెట్టి వచ్చాం. ఆ విషయం మా వాడికి చెప్పి ఏదైనా మనం ఖర్చు పెట్టిన డబ్బుకి ప్రయోజనం,సంతృప్తి ఉండాలి..అని చెప్పాను. తనని తిట్ట లేదు,కోపపడ లేదు కూడా.. చాలా సైలెంట్ గా తన తప్పుని తనకి తెలియ జెప్పడం లో.. సఫలీకృతం అయ్యాను. ఎలా అంటారా.. మా అబ్బాయి ముఖంలో..విపరీతమైన భాద+కళ్ళలో చిప్పిల్లిన నీరు.అది చాలు నాకు.
నేను ఇంకో విషయం చెప్పనా !..నేను. మా మా అబ్బాయిని ఎప్పుడు తిడతానో తెలుసా? తుడుచుకుని తడి టవల్ కుప్పగా పడేసి వెళ్ళినప్పుడు.. భోజనం చేసేటప్పుడు వడ్డించుకుని గిన్నెలపై మూతలు పెట్టకుండా వెళ్ళినప్పుడు..నీళ్ళ సీసాల్లో నీళ్ళు త్రాగి నింపకుండా ప్రిజ్ద్ లో పెట్టకుండా..చుట్టూ.. పేర్చుకున్నప్పుడు పిచ్చి తిట్లు తిడతాను. నువ్వు తిట్టే సమయాల్లో తిట్టకుండా ఇప్పుడు తిడతావు ఏమిటో నాకు అర్ధం కావు..అని అనడమే కాదు..తన ఫ్రెండ్స్ కి చెప్పుకుని నవ్వుకుంటాడు కూడా..
మా అబ్బాయి అంతటితో మారి పోయాడని అనుకోకండి. మొన్నటికి మొన్న యు.ఎస్ నుండి వచ్చినప్పుడు.. క్రికెట్ ఆడటానికి వెళుతూ.. దాదాపు ఒక అయిదు వేలు తన వాలెట్ లో పెట్టుకుంటుంటే..ఎందుకు బంగారం అంత డబ్బు నీకు అసలే మతిమరుపు..అన్నాను. బెట్ మ్యాచ్ ఆడాలి అమ్మా..అన్నాడు. ఇంకా నువ్వు మారలేదా? అంటే..ఫ్రెండ్స్ సరదా పడుతున్నారమ్మా..అన్నాడు. సరదా పడటం అంటే బెట్ కట్టుకోవడం కాదు నాన్నా! నీవు వాళ్లతో కలసిన సందర్భాన్ని సంతోషంగా గడపడం. అందుకోసం ఖర్చు పెట్టు.అంటే కానీ బెట్ మ్యాచ్ వద్దు అన్నాను. ఒక్క క్షణం ఆలోచించుకుని రెండు వేలు తీసుకుని మూడు వేలు అక్కడ పెట్టి.. నీ తర్వాత డైలాగ్ నే చెప్పనా.. అంటూ..
వద్దు బంగారం.సరదాకి కి ఓ..హద్దు ఉంటుంది. ఈ డబ్బు పోగొట్టుకున్నా నీకు బాధ. నీకు వచ్చినా నాకు బాదే.ఎవరి డబ్బు అయినా కష్టార్జితమే కదా.అంటావ్ ..అన్నాడు.. నేను నవ్వుకున్నాను. అప్పుడు మావాడు తన కష్టపడ్డ డబ్బుని తీసుకుని వెళుతున్నాడు. ఆ డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటాడో..అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి.. ఆలోచించ గల్గాడు. ఇదంతా చూస్తున్న మా వారు..మీ అమ్మ చేత మీ యూత్ కి కౌన్సిలింగ్ క్లాస్స్ లు పెట్టించాలి రా.. అప్పుడు గాని మీరందరూ బెట్టింగ్స్ కట్టకుండా ఉంటారు.అన్నారు.
నిజమే కదా..సున్నితంగా..అర్ధమయ్యే విధంగా చెప్పాలి కదా.. లేక పొతే పిల్లలు అర్ధం చేసుకుంటారా? వాళ్ళ సరదాలకి అడ్డు పడుతున్నాము అని మనని శత్రువులా చూడరూ!?
నేను నా అనుభవాన్ని ఎందుకు చెపుతున్నాను అంటే..మా అబ్బాయి గ్రేట్ అని కాదు. పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు వారిని కొట్టి తిట్టి నానా యాగి చేసి,ఏడ్చుకుంటూ,చీదుకుంటూ..దబ దబ బాదటమో కాదో..మనం చేయాల్సింది.. స్మూత్ గా హండిల్ చేసి ఓపికగా వివరించలేక పొతే.. మనం మంచి తల్లి-తండ్రి గా ఫెయిల్ అయినట్లే! తప్పులు చేస్తూ..పరిణామక్రమంలో.. తనని తాను తీర్చి దిద్దుకున్న వాడే.. మనిషిగా ఎదగ గలడు. తప్పులు అంటే ఎలాటి తప్పులు అని నన్ను అడగ కండీ! మన పిల్లలు మనకి తెలియ కుండాను, తెలిసీ కూడా తప్పులు చేస్తుంటారు..వారిని కాపాడుకోవడం, సరయిన మార్గంలో.. పెట్టుకోవడం వారిని వివిధ రకాల ప్రలోభాల బారిన పడకుండా కాపాడుకోవడం కూడా మన భాద్యత కాబట్టి.. చీటికి మాటికి ఏదో ఒక విషయంలో బెట్ లు కట్టుకుంటూ.. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనుకుంటూ ఈ బెట్టింగ్ ల బారిన పడే పిల్లలు ఉంటున్నారు. అందులో.. మన పిల్లలు సారీ! మీ పిల్లలూ..ఉంటారేమో..చూసుకోండి అని చెప్పడానికి ఈ పోస్ట్.
ఈ లేఖా సాహిత్యం 2001 వ సంవత్సరంలో మార్చి నెలలో ..(తేదీ గుర్తులేదు ) ఆకాశవాణి విజయవాడ కేంద్రం వనితావాణి లో ప్రసారమైనది. (స్క్రిప్ట్ యధాతదంగా మరియు ఇప్పుడు మరింత అర్ధం చెప్పడానికి చిత్రాలు మాత్రం గూగుల్ ద్వారా సేకరణ)
పోస్ట్ మెన్ తెచ్చే లేఖ కోసం ఆ తల్లి ఇంట్లోకి వీధి వాకిలికి మధ్య తిరగలి రాళ్ళ మధ్య పడి తిరిగే గింజలా తిరుగుతూనే ఉంది. ఎలా వుందో తన కూతురు. అత్తింట్లో యెన్ని భాదలు పడుతుందో! ఇన్నాళ్ళు వుత్తరం రాయకుండా యెప్పుడూ లేదు.. అనుకుంటూ వీధీ వాకిట్లోకి వెళ్లి వీధి చివర వరకు చూపుల దారి వేసివస్తుంది. ఉత్తరం రాలేదు కానీ ఒక దుర్వార్త వచ్చి గుండెని పిండి పిండి చేసేసింది. ఎవరి వుత్తరం కోసమైతే యెదురుచూసిందో ఆ కూతురు ఆ అమ్మకి వుత్తరం వ్రాయకుండానే మూడేళ్ళ కొడుకుతో సహా స్నానాల గదిలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండురోజుల ప్రయాణం చేస్తే కానీ ఆ వూరికి చేరడం కష్టం కనుక ఆత్మహత్య గనుక లేనిపోని గొడవలెందుకని దహన సంస్కారాలు నిర్వహించాం అన్న కబురుతో కడసారి చూపుకి కూడా వీలవక ఆ తల్లి గుండెలవిసేలా యేడుస్తూనే వుండగా .. ఆ తల్లికి అప్పటిదాకా యెదురు చూసిన లేఖ రానే వచ్చింది. గుండె బరువుని మరింత పెంచింది. అందులో యేముందో చదువుదాము.
అమ్మకోలేఖ
అమ్మా! నెల రోజుల నుండి నా ఉత్తరం కోసం యెదురు చూస్తూ వుంటావ్ కదూ! నేను నిత్య సంఘర్షణతో, అయోమయంలో వున్నాను కదమ్మా!
ఏ భావాన్ని యెలా ప్రకటించి నీకు వ్రాయగలను చెప్పు ? ఇప్పుడు నేను వ్రాస్తున్న యీ ఉత్తరం నీకు మునుపటి వుత్తరాల్లా ఆనందం కల్గిస్తుందో లేదో కానీ ఆలోచింప జేస్తుందని నా నమ్మకం. ఏమిటీ యీ ఉపోద్ఘాతం అని ఆశ్చర్యపోకు. స్త్రీల జీవితాలకే లేదు కదమ్మా!
మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయ గల్గిన నైపుణ్యం సాధించారు కానీ మానవ విలువలు యిలా వుండాలని హద్దులు యేర్పరచ లేకపోతున్నాడు కదమ్మా! తరాలు మారే కొద్దీ అంతరాలు యేర్పడినప్పుడు మనసులు-అనుబందాలు అర్ధం లేనివే అవుతున్నాయి.పాత నుండి కొత్తకి పరుగులు తీస్తూ వుండటం నాగరికత చిహ్నం అంట కదా!
ఏది శ్వాశతం కానీ ఈ అనంత సృష్టిలో మనిషి మనుగడకి ఊపిరి పోసే సరికొత్త ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసి "గుడ్డెద్దు చేలోపడి మేసినట్లు మనం జీవనం సాగిద్దామా? దానికి నో!అనే సమాధానం యిస్తారు కదా! ఫండ మెంటల్ రైట్స్ ఏర్పరచుకున్న మనం వాటిని నిర్వర్తించ కుండటంలో వైఫల్యం చెందుతున్నాం. సమాజానికి మానవుడికి గల అవినాభావ సంబందాన్ని గుర్తించాలని నా అభిప్రాయం.
సమాజం ఆరోగ్యం గా ఉండటానికి కుటుంబాలు దోహదం చేస్తాయని ప్రపంచ వ్యాప్తంగా ఘోషించుకుంటూన్నాం.
ఆ కుటుంబం ఆరోగ్యంగా వుండటానికి మాత్రం భాద్యురాలు స్త్రీ అంటుంది మన భారతీయ సమాజం.
కుటుంబంలో కష్ట-నష్టాలు,సుఖ-దుఖాలు అన్నింటికీ స్త్రీయే ఆధారం అన్నట్టు పెద్ద బరువుని ఎత్తి చేతులు దులుపుకుంటున్న మగధీరులు,వారికి తాన అంటే తందానా రీతిలో సమజమూను.
అసలు సమాజంలో స్త్రీకి పురుషుడుకి సమానమైన భాద్యతలు, స్తితి కూడా ఉండాలని భావించకపోవడమే అసలైన పొరబాటు. పొరబాట్లు అలవాటైన లోకంలో అడుగడుగునా అణచివేస్తూ క్రుశింపజేస్తూ నిరంతర జీవన ప్రయాణంలో సాగి పోవాల్సిందే తప్ప స్పీడ్ బ్రేకర్ లు,టర్నింగ్ పాయింటులు మచ్చుకైనా కానరాక మనుగడ సాగిస్తుంది మన భారతీయ మహిళ.
పుట్టుక ముందే తల్లి ద్వారా పోరాటం నేర్చుకుని మరీ పుడుతుంది నేడు పుట్టే ప్రతి ఆడ శిశువు.
పుట్టుక నుండే తల్లిదండ్రుల ఆంక్షలు,పెరిగిపెద్దయ్యేటప్పుడు అన్నదమ్ముల ఆంక్షలు,చదువు కోసం ఆరాటం, ఉద్యోగం కోసం పోరాటం. ఇక జీవిత భాగస్వామ్యి ఎంపికలో తన ప్రమేయం లేక తల్లిదండ్రుల ఇష్టాలకి తలొగ్గి భాద్యతలు గుర్తించి మసలుకునే నాలాటి వారు ఎందరో!
అంతా ఎడ్జెస్ట్ మెంట్ ఎడ్జెస్ట్ మెంట్. తీరా మెట్టినింట స్వజాతి మనుషుల నుండే ఈర్ష్యా-ద్వేషాలతో కూడిన వేధింపు చర్యలు. జీవితం చుక్కాని లేని నావలా సాగిపోతుందో,సుడిగుండంలో పయనించాల్సి వస్తుందో..అంతా భయం భయం.
పుట్టిన దగ్గర నుండి కడసారి కాటి వరకు ఎన్నెన్నో ఘట్టాలు,అణచి వేతలు.
నేటి స్త్రీ తన వ్యక్తిత్వం కోల్పోకుండా వుండాలని ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇదంతా ఎందుకు రాస్తున్నానో..నీకు అర్ధమవుతూ ఉంటుంది కదమ్మా! వైవాహిక జీవితంలో నేను అనుభవిస్తున్న నరక యాతన నుండి విముక్తి కోరుతున్నానని ఈ కష్టాల కడలి ఈదలేక వొడ్డున చేరదామనే నా పోరాటం నీరు కారుస్తూ మీరందరూ చేస్తున్న ప్రయత్నాలు నా మనసుని బాధిస్తున్నాయి. ఏ బిడ్డ అయినా తల్లి దగ్గర కష్టం పంచుకుంటుంది.బిడ్డని దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ తన చల్లని స్పర్శతో ఆత్మవిశ్వాసం కల్గించాలి కానీ నువ్వేమిటమ్మా ..నా నిర్ణయాన్ని ఆక్షేపిస్తున్నావు?
వ్యసనాలకి బానిసైన భర్త పెట్టె మానసిక,శారీరక హింసలకి తట్టుకోలేని ఒక భార్య భర్త నుండి విడాకులు పుచ్చుకుని మానసిక ప్రశాంతతో బ్రతకాలనుకోవడం నేరమా?
ఒక స్త్రీ తన అంతరంగాన్ని విశదీకరించి వ్రాస్తున్న ఈ వుత్తరం మీ లాటి తల్లులని మారుస్తుందని నా నా నమ్మకం.
భార్య భర్తల మద్య ప్రేమ ఉండాలి..కానీ ఇక్కడ ఆంక్షలు.సహకారం ఉండాల్సిన చోట ఏర్పాటువాదం,అవగాహన ఉండాల్సిన చోట అహంకారాలు రాజ్యమేలుతున్నాయి. బతుకు బండి సాఫీగా నడవడానికి మూల సూత్రాలని మరచిన భార్యాభర్తల మద్య సమన్వయము యెలా సాధ్యం చెప్పు?
సంసారం అంటే స్త్రీని గుర్రంలా మార్చి కళ్ళకు గంతలు కట్టి,ముకు తాడు బిగించి పగ్గాలు చేత బూని స్వారి చేసేవాడా పురుషుడు?
కదలక పొతే కొరడా దెబ్బలని భరించ మన్నట్లు ఉంటుంది.మీ పెద్దల ఆలోచన కూడా..
సుఖాలు లేకున్నా పర్లేదు.కష్టాలు మాత్రం వద్దనుకుని రాజీ పడి బ్రతుకుని ఈడ్చే స్త్రీలు ఎక్కువని చెప్పక తప్పదు సమానత్వం ఎండమావి లా గోచరిస్తుందని...
ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వ కారణం? అబలల పై అత్యాచారాలు,యాసిడ్ దాడులు,భర్తల నిరంకుశత్వ ధోరణి, ఆ దోరణి భరించలేని భార్యలు ఎదురు తిరిగి భర్తని చంపే స్థితికి జారిపోవడం ..ఇలాటివి వింటున్నాం. మన దేశంలోనూ ఇటువంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా !
కుటంబ హింసని భరించలేని స్త్రీలు విడాకులు కోరుకుంటే ఆ స్త్రీకి అడుగడుగునా అవమానాలు,అవహేళనలు తప్పవు. తప్పులు అనీ పురుషుడివి అయినా నోరెత్తని ఇరుగు-పొరుగు సైతం విడాకులు కోరుకోగానే ఆ స్త్రీకి అక్రమ సంబంధాలు అంటగడతారు అలా తిరిగి కోలుకోనివిధంగా అపవాదులు వేసి తృప్తి పడతారు.
స్త్రీకి ఇలాంటివి అధిగమించే శక్తి కావాలి .ఆసరా అందించే వారి సంఖ్యా పెరగాలి. సభ్య సమాజంలో స్వేచ్చగా,గౌరవంగా బ్రతకడానికి చేయూత నివ్వాలి.కానీ మీలాటి వారందరూ చెప్పే మాటలు మాలాటి వారిని అడుగడునా అణచివేస్తూ..వికృత కోణాలలో ఆలోచించి వికృత రూపాలలో వేయి కోరలు చాచి మమ్మల్ని కాటు వేస్తున్నాయి.మా ధైర్యాన్ని సన్నగిల్లిన్ప జేస్తున్నాయి . పరువు-ప్రతిష్టలకి వెరచి సమాజం ఏమనుకుంటుందో అని భయంతో..అర్ధపం పర్ధం లేని మూర్కత్వపు చట్రాలలో బిగించి చట్టాలనాశ్రయిస్తే ప్రయోజనం ఉండదని కోర్టుల చుట్టూ తిరిగలేమని సమస్యలని,కష్టాలని కడుపులోనే దాచుకోమని సలహా ఇస్తారు.
స్త్రీలకి విద్యావకాశాలు పెరిగాయి. ఆ చదువలని సాగనీయడం లేదు. చదువుకోవాలనే కోరికకి అడ్డుకట్టవేసి పెళ్లి చేసి మీ భాద్యత తీర్చేసుకున్నాము అనుకుంటున్నారు. ఎట్టకేలకు కొంత మంది చదువుకుని ఉద్యగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించుకుంటే ఆ సంపాదన తన అవసరాలకి సైతం వాడుకునే స్వేచ్చ లేదు.
ఈ పురుషాధిక్య ప్రపంచంలో ద్వితీయ శ్రేణి పోరురాలిగా జీవితం గడుపుతూ విముక్తి కోసం ఆక్రోశిస్తూ .. ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మాని పుట్టడం మేలని నిరాశ,నిసృహలతో కాలం వెళ్ళదీస్తూ..ఉంది.
"మాతృస్వామ్య హక్కు కొల్పడమే ప్రపంచ చరిత్రలో స్త్రీ జాతి పొందిన పరాజయం అని.. స్త్రీని భోగ్య వస్తువుగా,వంట మనిషిగా,పిల్లలని కానీ పెంచే యంత్రంగా మార్చివేసారని ఎలుగెత్తి ఘోషించాడు..ఎంగెల్స్."
ఈనాటి మహిళా సంఘాలు సైతం అసలు సమస్యలని మరచి కొన్ని సమస్యలకే పరిమితం అయిపోతున్నారు.
మన చరిత్రలో యుద్దాలలో ధైర్య సాహసాలతో పోరాడిడిన స్త్రీ మూర్తులున్నారు.మార్గాన్ని నిర్దేశించిన వీరమాతలున్నారు. కానీ జీవితం అనే యుద్దంలో పోరాడేవారికి ఉత్శాహం ఇవ్వలేని మీలాటి వారు చరిత్రని పాఠాలుగా మార్చి చెబుతున్నారు. తప్పు చేయడం మగవారి వంతు వాటిని తప్పక భరించడం ఆడవారి ఖర్మం అంటూ అదేదో పాటించవలసిన తప్పనిసరి హక్కు అయినట్లు నీతి బోధ చేస్తారు తప్ప స్త్రీ మనసును,మనిషిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
జీవితం అంటే కొంత సర్డుబాటే కాదనం. మీ లాటి వారు ప్రతి క్షణం సర్దు బాటు అనుకోమంటారు. మనం నిర్దేశించుకున్న కొన్ని విలువలు ప్రకారం జీవితాన్ని జీవించడం కోసం అనుకోవడం లేదు. ఎక్కడినా స్త్రీకి వ్యక్తిత్వం మేల్కుంటే అక్కడ వందమంది పురుషులు అణచి వేయడా సమాయతమై ఉంటారు.అది సుపీరియర్ కాంప్లెక్స్ కాదా? అర్ధం పర్ధం లేని పంతాలకి పోయి కాపురం నాశనం చేసుకుంటావా? మగవాళ్ళు తప్పు చేస్తారు ఓర్చుకోవాలి అంటూ మళ్ళీ మళ్ళీ చెప్పే పాత పాటలే వినే ఓర్పు నాకు లేదు. విడాకులు తీసుకుని నీ బిడ్డని పెంచగాలవా? అంటుంది మా అత్తగారు సవాల్ విసురుతూ..
నా చదువు నన్ను చదువు కొనిస్తే ఇలాటి పరిస్థితి వచ్చి నప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది ఉండేది కదా!ఆర్ధిక స్వాతంత్ర్యం తో..నా బిడ్డని నేను పోషించుకునే స్థితి నాకు ఉండేది కదా.. అయినా ఇప్పుడు నాకు దిగులు లేదమ్మా ! స్వయం ఉపాది కల్పనతో ఏదో ఒకటి చేయ గలననే దైర్యం,ఆత్మ విశ్వాసం పుష్కలంగా ఉంది.
ఆర్ధిక స్వాతంత్ర్యం ,ఆత్మ విశ్వాసం లేని స్త్రీలు రాజీ పడిపోయి ఒకరిమీద ఆధారపడే దుస్థితి కల్గినదుకు అనుక్షణం సిగ్గుపడుతూ.. క్షణ క్షణం మరణిస్తూ.. నిత్యం సంఘర్షణతో ఆత్మ వంచనతో బతకడం జీవితం జీవించడం అనిపించు కుంటుందా?
పాశ్యాత్య దేశాలల్లో నవనాగారికతతో,ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీలు చిన్న చిన్న సమస్యలకే విడాకులు పుచ్చుకునే సంస్కృతి ఉంటె ఉండవచ్చు కాక. మన దేశ సంస్కృతిలో పెరిగిన స్త్రీలు ఎన్నో కష్టాలను భరించిన తర్వాత కానీ విడాకులు కోరుకునే పరిస్థితి వస్తుంది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు కదమ్మా!పాశ్యాత్య నవనాగరికతను దిగుమతి చేసుకుని మన భారతీయ కుటుంబ జీవన విదానాంకి భంగం కల్గిస్తున్నారంటూ మన దేశం లోని ప్రతి స్త్రీని అణగ ద్రోక్కడం సమంజసమా? కాయ కష్టం చేసే స్త్రీలు సైతం ఆర్ధిక స్వాతంత్ర్యం తో.. తన ఆత్మాభిమానం నిలుపోగల్గుతుంది. ఉన్నంత లో తన బిడ్డలని పెంచుకుంటుంది. ఉన్నత వర్గాలలో పుట్టిన స్త్రీలు చదువు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గి తమ ఉనికిని కాపాడుకోగల్గుతున్నారు. మద్య తరగతి వారు మాత్రం దైర్యం లేక,తెగింపు లేక తెగని ఆలోచనలతో.ఊగిసలాడే మనస్తత్వం తో..స్వయం నిర్ణయం తీసుకోలేక నిరంతర యుద్ధం చేస్తూ..కుటుంబ జీవనం అనే రాజుని గెలిపించి తాను మాత్రం సైనికుడిలా ఒరిగిపోతుంది.
మద్య తరగతి స్త్రీకి ప్రతినిధిగా తప్పనిసరి పరిస్తుతుల్లో మరలా రాజీ పడిపోవడానికి నా మనసు అంగీకరించడం లేదు.ఆత్మ వంచనతో జీవించడం కన్నా ఆత్మ విశ్వాసంతో..పయనించాలి అనుకుంటున్నాను. మా పక్కింటి పిన్ని గారు తప్పులు చేసిన భర్తని క్షమించడంలోనే ఔదార్యమ్ ఉంటుందని అంది. పత్శా తాపం కల్గిన మనిషిని క్షమించవచ్చు, కావాలని తప్పుడు దారిలో పయనిస్తున్న మనిషిని భరిస్తూ జరిగినవన్నీ మరచి నటన అనే ముసుగు వేసుకుని కాపురం చేయడం నల్గురి దృష్టిలో గౌరవంగా ఉంటుందేమో కానీ నాకు మరణంతో సమానం.
స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే అది శాపం అవుతుందా? చలం వ్యతిరేకించిన ఆలోచనల ధోరణి దశాబ్దాలు దాటినా అలాగే ఉంది. మారనిది,మాయనిది స్త్రీల పై అణచివేత,కొన్ని దేశాలలో ఓటు హక్కు లేదు.మరికొన్ని దేశాలలో స్త్రీల పై జరిగే అత్యాచారాలకి అంతే లేదు.ఇదీ ప్రపంచ దేశాలలో స్త్రీల దుస్థితి.కొంత లో కొంత మన భారత దేశంలోనే నయం అని తృప్తి పడతాం కానీ మానవ హక్కులు పరిరక్షించే ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ భారతీయ కుటుంబ స్త్రీల మనోగతాలను పరిశీలిస్తే తెలుస్తుంది. లెక్కలేనన్ని హింసాయుత దారుణాలు,వెలుగులోకి రాని అసంఖ్యాక దురాగతాలు .
నా స్నేహితురాలు అంది. భార్య-భర్తలు విడిపోవచ్చు కానీ తల్లి దండ్రులు విడిపోకూడదని. వ్యసన పరుడైన తండ్రి నీడ బిడ్డల మీద పడటం ఏ మాత్రం మంచిది? తండ్రి చూపే ప్రేమ,ఆదరణ కన్నా అతని దుర్వ్యసనాలే బిడ్డలపై ప్రభావం చూపుతాయని మానసిక వేత్తల అభిప్రాయం లెక్కలోకి తీసుకోరేం?
చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గిన నా ఫ్రెండ్ అక్క తన వ్యక్తిత్వము కాపాడుకునే ప్రయత్నంలో విడాకులు పుచ్చుకుని తన పిల్లలని పదిలంగా కాపాడుకుంటుంది. తనకి తరచు ఒక కల వస్తుంది అని చెబుతుంది. అది ఏమిటంటే తన కొడుకు తనని తండ్రి ప్రేమ నుండి దూరం చేసావని దూషిస్తూ అర్ధం పర్ధం లేని క్రమశిక్షణ కి గురి చేస్తున్నావని,తరచూ నిందిస్తున్నావని అడుగుతావని అంటూ ఉంటాడట. ఆ కల నుండి మేలుకుని ఆలోచిస్తూ ఉంటానని, ఆ కల నిజం అయినా ఆశ్చర్య పోనని అంటుంది. ఆమె భర్త తరపు బంధువులు తరచు ఆమె ఇంటికి వస్తూ అలాంటి ఆలోచనలే ఇంజెక్ట్ చేస్తున్నారని తెలుసుకుని వారికి దూరంగా ఉంచడం చేస్తుంది.
స్త్రీలు తమ వ్యక్తిత్వాలని తాకట్టు పెట్టి పిల్ల కోసం అన్నీ భరించి తన రక్తమాంసాలను కరిగించి తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా బిడ్డల బంగారు భవిష్యత్తు కుటుంబ జీవనంలోనే చూపగలదా? ఒంటరి మహిళల్లో అలా పెంచలేరా? అలా అనీ భరించి త్యాగమయి అనిపించుకోవడంలో.. జీవితం అంతా అరగదీసుకోవాలా? బిడ్డలు తల్లి త్యాగాలు గుర్తిస్తారా? బిడ్డలు గుర్తిస్తారని తల్లి త్యాగాలు చేస్తుందా? అని ఆవిడ అడిగే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెపుతారు? విడాకులు తీసుకున్నందుకు ఆమె చుట్టూ జేరి ఆమెని మాటలతో చిత్రవధకి గురుచేసి ఆమె నిర్ణయం తప్పని ఉద్భోద చేస్తూ ఉంటే ఈ ఊరినుండే బదిలీ చేయించుకుని వెళ్లి పోయింది. తన నిర్ణయాలకి తనని వదిలేయక జీవితం అంతా తల్లిదండ్రుల కోసం, భాద్యతల కోసం,బిడ్డల కోసం,కుటుంబం కోసం, కరిగిపోయే కొవ్వొత్తిలా కరిగిపోవాలనుకోవడమే ఈ సమాజం విధించే ఆంక్ష లైతే స్త్రీ శిశువు పుట్టగానే చంపేయడం మంచిది అనిపించక మానదు. అమ్మా! నన్ను అలా ఎందుకు చంపేయలేదు. నాకు ఎన్ని భాదలు తప్పి పోయేవో!నీకు పదే పదే నా భాదలు చెప్పి విసిగించే వారు ఉండే వారు కాదు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టె ఉత్తరాలు వ్రాయను. దైర్యంగా తలెత్తుకుని జీవించే నీ కూతురిని చూస్తావు కూడా!
స్త్రీ మనసుని ఔపాసన పట్టిన వారు ఎవరైనా ఉంటే ఎన్ని కోణాలలో స్త్రీలో ఉదాత్త గుణాలని చూడ గల్గుతారో!ఒక మంచి వెంట చెడు ఒక చెడు వెనుక మంచి ఉంటాయన్న వేదాంతాన్ని ఒంట బట్టించుకుని తల్లిగా కుటుంబ జీవనం ని విడిపోనివ్వకుండా బతుకు బండిని లాగక తప్పదనే నీ మాటని పెడ చెవిని పెట్టి మీ తరంలో మీరు తీసుకోలేని నిర్ణయాన్ని మా తరంలో సాహసించి నేను తీసుకున్నందుకు ఆక్షేపించినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు. అభినందనలు అందిస్తూ చేయూతనిస్తారో! ఆక్షేపిస్తారో! నావి అన్నీ ప్రశ్నలే! ప్రశ్నలోనే సమాధానం ఉందని అమ్మలందరూ తెలుసుకోలేని వారు కాదు. అయిన మౌనం వహిస్తారు. మౌనం అర్ధాంగీకారం అనుకునే కన్నా మాకు స్పష్టమైన మీ ఆలోచన,అనుభవాల ధోరణి పంచడం కావాలి. నేడు కాకున్నా రేపు మాత్రం తప్పక మాదవుతుంది అనే ఆశతో ముందుకు సాగిపోయే "ఆమె" కి ప్రతినిధిని నేను. అపరాజితని నేను. అమ్మా నన్ను తప్పు చేస్తే దండించే నీవు నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే దండించే అధికారం ఉందని మరువకు. ఎప్పుడైనా ఏదైనా చెప్పకుండా చేయని నేను ఇప్పుడు నీకు తెలియ కుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేక నా వేదనని.. నా లాటి వారి వాస్తవ స్థితులని తెలిపే ప్రయత్నం చేసాను.అర్ధం చేసుకుంటావనే ఆశతో ..