19, అక్టోబర్ 2011, బుధవారం

నా సొంత ఇంటి కల

ప్రతి ఒక్కరికి తమ జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల. 

ఆ కల కొంత మందికి స్వంత మవుతుంది. మరి కొందరికి కలగా మిగిలిపోతుంది. తాము కట్టుకోబోయే ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. అసలు ఇల్లు అంటే ఎలా ఉండాలి.ఇలా ఉండాలి అనేం లేదు కానీ ఇలా ఉంటే యెంత బాగుండునో! పట్టణం తాలూకు  రణగొణ ధ్వనుల మద్య కాకుండాహాయిగా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో మనం సేదతీరుతున్నట్లు మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఉంటే బాగుంటుంది కదా!  


అసలు ఇల్లంటే  మనని ప్రపంచంలో ఎక్కడున్నా సరే లాక్కోచ్చేటట్టు ఉండాలి. ప్రపంచంలో స్వర్గం ఎక్కడ ఉంది అంటే అది ఖచ్చితంగా ఎవరికి  వారికి వారి ఇంట్లోనే ఉందనిపించాలి కూడా..  ఇల్లు ఒక భద్రత.  పగలల్లా ఎక్కడ తిరిగినా మనకంటూ ఒక ఇల్లుండటం   అనేది మనని నిశ్చింతగా ఉండనిస్తుంది. ప్రపంచమంతా ఎన్నో అందమైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ఉండవచ్చు ఆ ప్రదేశాలకి వెళ్లి లోకాన్ని  మరచి ఆనందంగానూ  గడపవచ్చు. కానీ కొన్నాళ్ళకి అవి మొహం మొత్తి ఇంటిని వెదుక్కుంటామంటే  మన ఇంట్లో మనం ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. 

మనపై ఎవరి ఆక్షలు ఉండకుండా నచ్చినట్లు ఉండగల్గుతాం. పరాయి  చోటు  మనకి భద్రత నివ్వదు..స్వేచ్చ నివ్వదు.భరోసాని ఇవ్వదు.  దేవుడే ఇచ్చాడు వీధీ ఒకటి  .. ఇక ఇల్లేల సొంత ఇల్లేల అని తాత్విక పదాలు పాడుకోలేం కదా! అందుకే ఇల్లు ఒక కల.

అసలు ఇల్లుని చూడగానే ప్రశాంత వాతావరణం గోచరించాలి ఇక "ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. " అంటే ఇల్లాలిని చూడకుండానే ఇల్లుని చూసి ఇల్లాలు ఎలా ఉంటుందో చెప్పగలరు అంట. బాహ్యపరంగా కాదనుకోండి.  అందుకే ఇల్లు అలా ఉండాలి అంటే నేను చెప్పిన విధం ఏమనగా.. 


ఇలా కాకపోయినా 

ఇలా   అయినా   ముగ్గు   పెట్టుకోవాలి కదా !? .


ప్రతి నిత్యం ఇంటిముందు శ్రద్దగా వేసుకున్న ముగ్గు మన సంప్రదాయాన్ని  ఆడవారి ఆరోగ్యాన్ని, ఉత్సాహంని ,శ్రద్దని తెలియ జేస్తుంది.      

ఇక లివింగ్ రూం ఎలా ఉండాలంటే చూడటానికి  ఎలాటి ఆడంబరాలు లేకుండా.అట్టహాసం లేకుండా.. సింపుల్గా     ఉండాలి.  అద్దాల అరమరలు అమర్చి వాటినిండా కిక్కిరిసినట్లు బొమ్మలు పేర్చడం కన్నా చక్కగా ఒక  అరమర ఏర్పాటు చేసుకుని 


అందులో మన అభిరుచికి తగిన విధంగా పుస్తకాలు ఉంచడం మూలంగా.. రోజు వాటిని చూస్తూ.. ఉంటె రోజుకు ఒకసారయినా ఒక పుస్తకమ యినా చదవాలనిపిస్తుంది.  ఇంట్లో అరమరలని   వస్తు సామాగ్రితో నింపే కన్నా పుస్తకాలతో నింపుకుంటే ఇల్లు అందంగా లేకపోవచ్చు కానీ  మంచి ఆలోచనలు  సదా మన తోడూ ఉండేందుకు పుస్తకాలు మనకి మేలు చేస్తాయి.

ఇక వంటిల్లు విషయానికి వస్తే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఈ వంటింటి తోనే ముడి పడి ఉంటుంది. అక్కడ అందం,పరిశుభ్రత,అమరిక అన్నీ ఉండాలి. చూడగానే అందంగా ఆకర్షనీయం గా ఉండాలి. అప్పుడే మనకి మన ఇంటి పదార్దాలు మనకి నచ్చుతాయి..అందువల్ల బయట ఆహార పదార్దాల వైపుకి మనసు వెళ్ళదు. అన్నీ సౌకర్యంగా అమర్చి ఉంటె వంట చేయడం సౌఖ్యంగా ఉంటుంది. అందంగా అమర్చుకుంటే..చూడటానికి ఇంపుగాను ఉంటుంది. 

ఇక బాత్ రూం ల విషయంకి వస్తే.. చాలా మంది వాటిని పట్టించుకోరు. ఎక్కడో ఓ..మూలాన పడి ఉంటాయి. వాటిని ఎవరు చూస్తారులే అని భావిస్తారు. లివింగ్ రూమ్కి ఇచ్చిన ప్రాముఖ్యం వంట గదికి కానీ బాత్ రూమ్ల కి ఉవ్వక పోవడం చూస్తూ ఉంటాం. నేను ఎప్పుడో ఒకసారి ఓ..పుస్తకంలో చదివాను. స్నానాల గది అన్నది మనిషి అంతఃకరణనాన్ని పట్టి ఇస్తుంది అట. ఇంటి  పై పై అలంకరణలు ఆడంబరాలు అన్నీ..మనిషి బాహ్య రూపం ని ప్రదర్శిస్తే మనిషి అంతఃకరణ ని లోపలి మనసుని మన పరిశుభ్రత  ఎలా ఉందొ తెలియ చెపుతుందట.. 

   

ఇక బెడ్ రూం విషయానికి వస్తే మనం అలసి సొలసి సేదదీరడానికి.. మనదైన ప్రపంచంగా విహరించడానికి.. పడక గది  ఒక వరం. ఆ గది విషయం కి వచ్చేటప్పటికి.. అక్కడ యెంత తక్కువ సామాగ్రితో..ఉంటె అంత మంచిది. .మన  జీవనం తాలూకు ఒత్తిడులు అన్నీ మరచి మనలని మనం రీచార్జ్ చేసుకునే ప్రపంచం. తక్కువ కాంతితో.. విశాలంగా ఉండేలా.. లేదా అనిపించేలా.. ఉంటూ.. ఆ గదిలో అడుగు పెట్టగానే.. వెంటనే.. వాలిపోదాం అనిపించేలా ఉండాలి. 

అలాగే ఉంది కదా?ఇక కిడ్స్ బెడ్ రూం ఇలా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఈ రూం డిజైన్ చూడండి .తక్కువ ప్లేస్ లో..బెడ్స్ అమరిపోయాయి ఎంత బాగుందో కదా?  బట్ ఇలా ఇంత ఖరీదుగా ఇల్లు నిర్మించుకునే అవకాశం  అందరికి ఉండవచ్చు. లేకపోవచ్చు..లేదా ఇంత కన్నా రిచ్ గా కూడా కట్టుకోవచ్చు. కానీ అందం తో పాటు సౌకర్యంగా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోవడం అవసరం. ఎందుకంటె ఇల్లు అంటే అందరు నివశించేది..కానీ.. మహిళలు మాత్రమే శుభ్రపరచి పరిశుభ్రంగా ఉంచగల్గేది కాదు. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే యెంత తక్కువుగా సామాను ఉంటే అంత మంచిది. అనవసర తాపత్రయంతో..ఎడాపెడా సామాను కొనేసి గదులు నింపినంతమాత్రాన   అందం గా ఉండదు. ఉపయోగపడే వస్తువులను మాత్రమే కొనుక్కుని వాటిని శుభ్రం  చేసుకుంటూ పొందికగా సర్దుకుని...ఉండటం మూలగా అందం ఆనందం. 

అందం వస్తువల విలువలో ఉండదు. అభిరుచిలో ఉంటుంది.కదా!.. 

మేడలలో..మిద్దేలలో.. సుఖం ఉంటుందని కాదు పూరి గుడిసేలోను ఆనందంగా ఉండవచ్చు. ఇల్లు ఎండా-వాన నుండి రక్షణే కాదు. మనిషికి చిరునామా.. జీవితాని ఓ..భద్రత.మనసుకి నిశ్చింత.  ఇదంతా ఎందుకు చెప్పాననుకుంటూన్నారా ? ఎవరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారన్నా.. గృహప్రవేశ ఆహ్వానం కి పిలిచినా.. నేను ఎప్పుడు ఓ..ఇంటి దాన్ని అవుతానో అని దిగులు ముంచుకొస్తుంది. (ఓ..ఇంటిదాన్ని అయి పాతికేళ్ళు అవుతున్దిలెండి.ఆ ఇంటి దాన్ని కాదు ) ఓ..స్వంత ఇంటి మహిళని అవుదామని కలలుకంటున్నాను.  గూగులమ్మని..ఇల్లు చూపవమ్మా అంటే ఇలా కళ్ళు చెదిరేలా చూపింది. ఆలస్యంగా అయినా ఇలాటి నిర్మాణం తోనే   ఇల్లు కట్టుకోవాలని.. ఆశ.పనిలో పనిగా..ఇల్లు ఎలా ఉంచుకోవాలో.. అప్పుడెప్పుడో..నేను చెప్పినదాన్ని   నెమరవేసుకుని.. ఇలా రాసేసి..(టైపు చేసి పడేసి) చదవడానికి మా మిత్రులు ఉన్నారులే అని ధీమా మాత్రం కాదండీ.. ఇవి చూసి  మెచ్చినా సరే లేదా ఇంతకన్నా మంచి మంచి డిజైన్ లు  ఇచ్చే వెబ్ అడ్రస్ లు  ఇచ్చినా సరే .అని అభ్యర్దిస్తూ    .. . ....  

నేను వాడిన చిత్రాలు అన్నీ (ఐడియా బుక్స్ ఆన్ హౌజ్ ) నుండి సేకరించి..అందరితో..పంచుకుంటున్నవి తప్ప దుర్వినియోగం చేస్తున్నవి కాదు..అని గమనించ మనవి.            

2 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

మీ కల తీరాలని కోరుకుంటూ విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ .

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు మీరు తొందరలోనే ఒక ఇంటి వారు కావాలని కోరుకుంటున్నాను. ఇంటి నిర్మాణానికి నెట్ ను నమ్మితే తప్పేమీ లేదు కానీ దాని కన్నా కట్టిన ఇళ్ళను ఓసారి చూడడం ఇంకా మంచిదేమో. వీలున్నప్పుడు సర్వే చేయండి మీకు నచ్చిన ఇళ్లను పరిశీలించండి . ఫోటోలు తీసుకోండి. మా ఇంటి నిర్మానమప్పుడు మిత్రుడు అదేమన్నా తాజ్ మహాలా ? యెంత సేపు చూస్తావ్ తిరిగి వచ్చేప్పుడు కలువు అన్నాడు . తాజ్ మహల్ ను చూసేందుకు 15 నిముషాలు చాలు కానీ మా ఇంటిని చూడడానికి చాలా సేపు పడుతుంది లేట్ అవుతుంది కాబట్టి రాలేనని సమాధానం చెప్పను. మన ఇల్లు మనకు తాజ్ మహల్ కన్నా అందమయిందే