చిత్ర సీమ సాక్షిగా ఎన్నో పాటలు మన మనసుని రంజిపజేస్తూనే ఉంటాయి.మరి కొన్ని పాటలుమనసుని కసకస రంపంతో కోసేస్తున్నట్లు భాదను పెంచుతాయి. ఇదొక స్వీట్ మెలోడి.
తను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మనసులో తనకొక సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆ ప్రియురాలి ప్రేమలో కరిగి పోవాలని తన చెంత ఆమె ఒదిగిపోవాలని మనసారా తలపోస్తూ ఉండే యువ ప్రేమికుడికి తన ప్రేయసి తన ప్రేమని తిరస్కరిస్తే కలిగే భాద జీరించుకోలేనిది.అయినప్పటికీ ఏనాటికైనా ఆమె ప్రేమని గెలుచుకోగలను అనే నమ్మకంతో..తన వేదనని పాటగా మలచి వినిపిస్తున్నాడు ఆ ప్రేమికుడు.
నువ్వు చూసినా చూడకపోయినా .మాట్లాడినా మాట్లాడక పోయినా తనని ప్రేమిస్తూనే ఉంటానంటున్నాడు. ఆమె తిడితే తన పేరు ఆమె పెదవులపై నిలిచిందని సంతోషపడతాను.ఒక వేల కోపంతో ద్వేషం తో కొట్టినా తన చెంప పై ఆ తీయని గుర్తులు మిగిలిపోతాయని ఆనందంగా పాడుకుంటూ ప్రేమని ప్రేమతోనే జయించాలి తప్ప ప్రేమించలేదని ద్వేషంతో.. కత్తులతో దాడులు చేయడం, యాసిడ్ దాడులు చేయడం చేస్తున్న యువతకి.. ఓ..మంచి సందేశం ఇస్తున్నాట్లు ఉన్న ఈ పాట "ఒకటో.నంబర్ కుర్రాడు" చిత్రానికి "చంద్రబోసు" సాహిత్యం అందిస్తే.. మంచి పాటని పాడే అవకాశం ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టు ఎమ్.ఎమ్.కీరవాణి స్వీయ సంగీతంలో.. ఎంత చక్కగా పాడి..పరవశింపజేసారో!
ఈ పాటలో..విశాఖ సాగర తీరం,కైలాసగిరి చూడవచ్చు.
ప్రేమికుల్లారా! ప్రేమించండి.ప్రేమని జయించండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించకండి . నిజమైన ప్రేమ కి.. నిరీక్షణ అవసరం.
2 కామెంట్‌లు:
వనజ వనమాలి గారు.. మీ పోస్ట్ బాగుంది నాకు ఇష్టం ఇనా పాటలలో ఇది ఒకటి,
ప్రస్తుతా కాలం లో స్వచ్చమైన ప్రేమ కరువు అయిపోయింది, ప్రేమ పేరు తో
పది మంది అమ్మయిలతో మాట్లాడే అబ్బాయిలు ఉన్నారు అలాగే పది మంది అబ్బాయిలతో
మాట్లాడే అమ్మాయిలు ఉన్నారు, ప్రేమ అనే పదానికి విలువ లేకుంట చేస్తున్నారు, స్వచ్చమైన ప్రేమ
వంద మందిలో ఒకరు ఉంటారు ఏమో, దుస్తువులు మార్చినట్లు లవర్స్ ని మర్చేస్తునారు,
ప్రేమ అనేది ఇవాళ రేపు ఒక వస్తువు అయింది,
సినిమాలు చూసి అందులో చూపించే ప్రేమను చూసి అదియే ప్రేమ అనుకుంట్టున్నారు,
నిజాయితీగా గా స్వచ్చమైన ప్రేమ ఉన్న లవర్స్ కి నా అభినందనలు
నాకు కూడా ఈ పాట సాహిత్యం చాలా ఇష్టం ముఖ్యంగా నిన్ను చూడాలని ఉన్నా చూడలేకున్నా అని అమ్మాయి పడే ఆవేదన! ఆమెకి ఇష్టమయినా కానీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలని అతని మీద ఉన్న ఇష్టాన్ని దాచేస్తుంది! తెలుగు పాటలు గారు చెప్పినట్టు బట్టలు మార్చినట్టు మార్చే వాళ్ళు ఉన్నారు కానీ అలాంటివాళ్ళకి ప్రేమ, స్నేహం, ఆకర్షణకి తేడా తెలియకపోవడం వలన ఇలా జరుగుతోంది అని నా అభిప్రాయం! నా దృష్టిలో ప్రేమ అంటేనే నిజం! కాని జనాలు తమ తమ స్వార్ధాల కోసం, అవసరాల కోసం ఈ ముసుగు తొడిగి దాని పరువు తీస్తున్నారు అంతే! ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది!
కామెంట్‌ను పోస్ట్ చేయండి