14, అక్టోబర్ 2011, శుక్రవారం

మృత్యు శకటం ఆ కవిని మోసుకేళుతుంది..ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను.
ఇలాంటి రోజు ఎవరి జీవితంలోనైనా  ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా వస్తుంది. 
ఈ రోజు ఇలా వచ్చినందుకు కోపమైతే లేదు కానీ
ఇన్నిరోజులు చావుకి బ్రతుకుకి మద్య ఊగిసలాడించి
అందరితో..ఇంకెన్నాళ్ళు!? ఈ బాధ  చూడటం నరక ప్రాయం కదా! అనుకుంటూ..
ఈ రోజు కై ఎదురుచూపులు మిగిల్చావు. 
బతికినన్నాళ్ళు భావాలతో యుద్ధం చేసి అక్షరాలతో సహవాసం చేసిన
ఆ భావశిల్పికి మరణ శాసనం ని లిఖించడానికి 
ఇరువదినాలుగు దినాలు అవసరపడ్డాయంటే..
నీకు అలాటి కవి హృదయం లేదని అర్ధం చేసుకుంటూ..
నీ మహిష వాహనపు గంటలు వినకుండా.. ఆ భావకుడు..
చేతనా అచేతానావస్త లోను  పాటకి  ప్రాణం  పోయాలని 
మలి చరణం రాసుకుంటూ.. ఉన్నట్టుంది.
పొంచి ఉన్న నీడలా.. ఎప్పుడయినా కబళించే నీకు
సుకవి కి మరణం లేదని అతనెప్పుడు..  
చిరంజీవిగా పాటలో బ్రతికుంటాడని.. తెలుసు కదా! 
మృత్యు శకటం ఆ కవిని మోసుకెళుతుంది..    
భావాలు దారంతా పూలలా  వెదజల్లబడుతున్నాయి.

 జాలాది గారి ఆత్మకి శాంతి కల్గించాలని ప్రార్ధిస్తూ..


3 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

నీ మహిష వాహనపు గంటలు వినకుండా.. ఆ భావకుడు..
చేతనా అచేతానావస్తతోను పాటకి ప్రాణం పోయాలని
మలి చరణం రాసుకుంటూ.. ఉన్నట్టుంది. బాగుందండీ!

Sandeep చెప్పారు...

ఎంతో బాధ కలిగించే విషయం అండి. చాలా గొప్ప రచనలను చేశారు. ఇటువంటి రచయితల గొప్పదనాన్ని, వారి భావసాంద్రతని తెరకెక్కించలేని మన తెలుగు చలనచిత్ర రంగం ఎప్పుడో కలిమిని కోల్పోయింది. ఈ రోజు ఈయన లేకపోవడం మన లాంటి భావపిపాసులకు, అక్షరదాసులకు కూడా దిగ్భ్రాంతిని మిగిల్చింది.

ఆయనకు మరిన్ని గొప్ప పాటలు వ్రాసుకునే జన్మ లభించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

vishnu చెప్పారు...

spandinchina teeru baagunnadi.yenta baagaa vraasaaru.kaviki maranam ledu.ee roju jalaadi gaari paatalu chaalaa vinnaanu koodaa.thankyou