13, అక్టోబర్ 2011, గురువారం

ఆప్ కి కసమ్

లోకం అంతా నిదురిస్తున్న వేళ ఆమెకి నిద్ర రానంటుంది.పక్కలో..అటునిటు ఒత్తిగిల్లుతూనే ఉంది.
 మనసంతా ప్రేమికుడి గూర్చిన ఆలోచనలే! 
అక్కడ అతనికి అలాగే ఉంది.అందుకే ఆ ఇద్దరు చిక్కని వెన్నెలలో  మంచు కొండల్లోకి విహారంకి వెళ్లి మనసులో మెదిలే భావాలని..పంచుకుంటూ పాడుకుంటున్నారు.ఒట్టు పెట్టుకుంటున్నారు.

నాకు బాగా నచ్చిన పాట ఇది. ప్రేమికులందరూ ఇలా ఉండాలని కోరుకుంటాను... ఆ పాట సాహిత్యం చూడండి. తెలుగులో..ఇలా ఉంటుంది. 

AAP KI KASAM    

నేను నీ ఆలోచనలతో.. నిద్ర రాక పక్క మార్చు కుంటూనే ఉన్నాను.
నీ  మీద ఒట్టు 
రాత్రంతా ..ఆలోచనలు మారుతూనే ఉన్నాయి.
ఉదాసీనం గా  ఉండవద్దు.
పగటి వేళలలో  విడిపోవడం ఎటు ఉండనే ఉంది.
నీ మీద ఒట్టు.

ఆమె:
అర్ధ రాత్రి ఉలికి పడి లేచిన వేళ  నువ్వే గుర్తుకు వస్తావు 
ఆ తర్వాత నిద్ర నన్ను.నేను నిద్రని 
తరుముకుంటూ ఉంటాము. 
చిక్కని వెన్నెల పరచుకున్న ఈ రాత్రి  అంతా..
నా మనసుని గుచ్చుతూ..ఉంది.
కురుస్తున్న ఈ మంచు ..నిప్పులా మండుతుంది.
నీ మీద ఒట్టు..

అతడు :
ప్రియతమా..! సరస్సు లాంటి కన్నులలో 
మునిగి తప్పి పోతావు.
మనసులో ఉన్న కోరికలు పరచిన శిరోజాల మాటున 
నిద్రపోతాయేమో!
నువ్వెళ్ళి పో ! లేకపోతే ఏదో ఒకటి (తప్పు) జరుగుతుంది 
ఇటువంటి పరిస్థితుల్లో అడుగు తడబడుతుంది ..
నీ మీద ఒట్టు.

ఆమె:  ఒక వేళ అలిగితే 
నన్ను బతిమలాడి అక్కున చేర్చుకో..ప్రియా

 అతడు: దూరంగా ఉంటే దరి చేర్చుకో..ప్రియా 

ఆమె: కొంచెం మొండిగా ఉంటే కౌగిలించుకో ప్రియా

ఆమె:ఎప్పటికీ తెగ కూడదు ఈ ప్రేమ సంబంధం 
నీ మీద ఒట్టు.

ఈ ఆప్ కి కసమ్  .. యెంత మధురంగా ఉంటుందో! ఉందొ కదా! ఇక ఈ వీడియోలో చూడండీ!

 
   తారాగణం : 
రాజేష్ ఖన్నా,ముంతాజ్
గాయనీ  గాయకులూ:కిషోర్ కుమార్,లతా మంగేష్కర్ 
ఆనంద్ బక్షీ సాహిత్యం- ఆర్.డి బర్మన్ సంగీతం వహించారు. 

హిందీ సాహిత్యం:

karvatein Badalte Rahe Saari Raat Hum
Aap Ki Kasam ...

Gham Na Karo Din Judaai Ke Bahut Hain Kum
Aap Ki Kasam ...

Yaad Tum Aate Rahe Ek Hook Si Uthti Rahi
Neend Mujhse Neend Se Maein Bhaagti Chhupti Rahi
Raat Bhar Bairan Nigodi Chandni Chubhti Rahi
Aag Si Jalti Rahi Girti Rahi Shabnam
Aap Ki Kasam ...

Jheel Si Aankhon Mein Aashiq Doobke Kho Jayega
Zulf Ke Saaye Mein Dil Armaan Bhara So Jayega
Tum Chale Jaao Nahin To Kuchh Na Kuchh Ho Jayega
Dagmaga Jayenge Aise Haal Mein Kadam
Aap Ki Kasam ...

Rooth Jaayen Hum To Tum Humko Mana Lena Sanam
Door Hon To Paas Humko Tum Bula Lena Sanam
Kuchh Gila Ho To Gale Humko Laga Lena Sanam
Toot Na Jaye Kabhi Yeh Pyar Ki Kasam
Aap Ki Kasam ..
 

6 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

అత్యంత కాకతాళీయం:
నా మొబైల్ లో ఉన్న నాకిష్టమయిన 50 హిందీ పాటల్లోంచి " ఈమధ్యాన్నం మీరు టపా వేసిన సమయంలో నేను ఆఫీసు లో విన్నాను."
ఎన్ని సార్లు విన్నా వినాలని పించే ఈమదురమైన పాట నన్ను కాశ్మీర్ లోయల వెంట తిప్పి వెనక్కి తేస్కోస్తుంది. బహుసా పహాడీ సంగీతం మహత్యమేమో.
అనువాదం బాగుంది. అభినందనలు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

తెలుగు అనువాదం బాగుంది. ఆ అనువాదం చదివాక పాట విన్నాను, చాలా బాగుంది. పరిచయం చేసినందుకు థ్యాంక్సండి.

ప్రియతమా..! సరస్సు లాంటి కన్నులలో మునిగి తప్పి పోతావు.

హిందీ పాటలింత బాగుంటాయా!

వనజ వనమాలి చెప్పారు...

భాస్కర్ గారు .. హిందీ పాటలు చాలా బాగుంటాయి. ఒకప్పుడు హిందీ పాటలలో సాహిత్యం అర్ధం కాక ఏడ్చిన కూడా సందర్భాలు ఉన్నాయి. కేవలం పాటలోని సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికే నేను హిందీ భాషని నేర్చుకుంటున్నాను.మన తెలుగు భాషలో ఉన్న పద సౌందర్యం కానీ, విస్తృత భావ సౌదర్యం కనే హిందీ భాషలో ఉండదు. అనువాదం కష్టం కూడా..హిందీ సాహిత్యం అర్ధం చేసుకోగల్గితే చాలా మధురంగా ఉంటుంది.చాలా పాటలు బాగా నచ్చి అందుకే పరిచయం చేస్తున్నాను. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

వనజ వనమాలి చెప్పారు...

Atreya gaaru meeku ee paata nacchinanduku dhanyavaadamulu.

M. చెప్పారు...

I was confused by ur Posts in Telugu,,,, when i read carefully then i got it....

Really its a wonderful song... i like it

rajasekhar Dasari చెప్పారు...

వనజ వనమాలి గారికి దీపావళి శుభా కాంక్షలు