గులాబీ పువ్వు చెవిలో రహస్యం చెప్పాను.
నిన్ను ప్రేమిస్తున్నాను అని. సంతోషంగా తలను ఊపింది.
నిత్యం నాకై వెదుకులాడేది.
దాగుడుమూతలాట నాకిష్టమనే రహస్యం నేను చెప్పలేదుగా..
రోజుల తరబడి రాలిపోకుండా ఎదురుచూసింది.
మళ్ళీ.. వొకనాడు నీకొక రహస్యం చెప్పనా.. అంటూ..
సమీపించానో లేదో..
నిశ్శబ్దంగా రెక్కలు రాల్పుతూ వివస్త్ర అయింది.
దూరంగా.. చూడు చూడు..
మంచు పూల వాన కురుస్తుంది అనే మాటలు
వారి ఆనందోత్సవ సంబరాలు
ఏ గులాబీ విచ్చుకోదు యిక.