21, జూన్ 2016, మంగళవారం

ఆమె నవ్వు


కామయ్య తోపు, కామయ్య తోపు దిగడానికి లేచి రావాలండీ బస్ కండక్టర్ గట్టిగా అరిచాడు  
మీరు టిఫిన్ చేయడానికి దిగుతారా సార్ వెనుక సీట్ లో  కూర్చున్న కృష్ణ చేతిలో క్యారేజ్ బుట్టతో సహా లేచి నుంచుని  అడిగాడు

"ఊహూ" తల  అడ్డంగా ఊపాను.  కృష్ణ నేను పనిచేసే బాంక్ లో  ఈ మధ్యే అటెండర్గా జాయినయ్యాడురోజూ ఆ బస్టాప్ దగ్గరకి రాగానే మర్యాదగా అతనా మాటడగడం నేను తల అడ్డంగా ఊపడం రెండూ అలవాటైపోయాయి

బస్ స్టాప్ లో  ఆగగానే యధాలాపంగా నా కళ్ళు ఆ టిఫినీ బండి పై ఆగుతాయి ఒక్కసారి ఆమెని చూపుతో పరామర్శించి ఆ బండి చుట్టూ ఉన్న జనాన్ని చూస్తానువాళ్ళ కడుపులో ఆకలితో పాటు కళ్ళల్లో ఆకలిని తీర్చడానికి చెమటలు క్రక్కుతూ ఉన్నట్టుంటుందామె బంగారు రంగు ఛాయ, చక్కని కళ గల ముఖంఉంగరాల జుట్టూశుభ్రంగా  తయారై అంత కన్నా శుభ్రంగా  బండి చుట్టుప్రక్కల పరిసరాలని  ఉంచుతుందిప్రక్కనే  కూతురు ఆ పిల్లకి పదిహేడు పద్దెనిమిదేళ్ళు ఉన్నట్టు ఉంటుంది.  పలహారాలు తింటున్న వారికి మంచినీళ్ళిచ్చి,  కావాలన్న వాళ్లకి మరొకమారు చట్నీలు వేస్తూ డబ్బులు తీసుకుంటూ ఆమెకి సాయంగా ఉంటుందిఇక ఆమె   రెండు చేతులని  అయిదారు చేతులుగా మార్చుకుని  మరిగే నూనె మూకుట్లో  ఆర్డర్ ని బట్టి బజ్జీలో, పునుగులో, జిలేబీలనో వేస్తూఆకులలో ఫలహారాలని పెట్టి అందిస్తూ కారిన చెమటని తుడుచుకోను కూడా తీరికలేకుండా ఉంటుంది   చెమట చుక్కలు కోటేరులాంటి ముక్కు నొక్కులో ఆగి ముత్యంలా మెరుస్తూ ఉంటాయి.శ్రమ  సౌందర్యంలో ఉన్న అందమంతా ఆ చుక్కలో కనబడుతూ ఉంటుంది.

బస్ అక్కడ ఎక్కువసేపు ఆగి ఉంటే   నా చూపు అందరి చూపులాగానే ఆమె ముఖంపై నుండి  క్రిందికి దిగుతుందిచక్కటి శరీరాకృతినిజానికి అదే ఆమె అసలైన పెట్టుబడిఆమెని చూసి లొట్టలేయడానికే మగవాళ్ళు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అక్కడాగి తీరతారుదానికి ఉదాహరణ మా అటెండర్ కృష్ణ నే వాడి వయసు ఇరవైకి పైనతండ్రి చనిపోతే అతని స్థానంలో అనేక రికమండేషన్ లతో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడుఎన్నో అప్పుల్లో ఉన్న కుటుంబం గుర్తుకురాదు వాడికి రోజూ అక్కడాగి ఇరవై  ముప్పై రూపాయలకి సరిపడా టిఫిన్ ఆరగిస్తాడు 

"రోజూ అంత ఖర్చు పెట్టడం ఎందుకు ఇంటిదగ్గర చేసుకుంటే అందరూ తింటారు కదా అంటే "ఇంటికెళితే ఏముంటుందండీ చప్పిడి కూర, రేషన్ బియ్యం కూడు తప్పమినపప్పు కొని, బియ్యం కొని ఆయన్నీ చెయ్యాలంటే మాటలా అండీ అయినా ఇంట్లో అంత కష్టపడి చేసేవారు ఎవరుండారండీఅందరూ టీవిలకి అతుక్కుపోతా ఉంటిరికూరల కోసమే కర్రీ పాయింట్ ల మీద పడాల్సొస్తుందిఅని విసుక్కుంటాడు.

వాడి మాట నిజమే ... టిఫిన్ బండ్ల దగ్గరనూడిల్స్ బండ్ల దగ్గర,పానీ పూరీ బండి దగ్గర ఎక్కడ చూసినా తుగిడీ తుగిడీలుగా జనంఆవురావురంటూ నోట్లో నాలుగేళ్ళు కుక్కుంటూ.  అన్నపూర్ణా హోటల్ ముందైతే రాత్రి పూట పదిన్నరకి కూడా ఇసుకవేస్తే రాలనంత జనంఇళ్ళల్లో  ఆడవాళ్ళు అందరూ ఖాళీగా ఏం  చేస్తుంటారో !?

ఈ మాటే ఒకసారి ఆఫీస్ లో అంటే  కొలీగ్  నళిని "ఆడవాళ్ళని మీ మగవాళ్ళుఇంక అంతకన్నా ఏమి అనగలరులెండి వాళ్ళు మాత్రం పొద్దస్థమాను కష్టపడటం లేదూ అయినా పాత రోజులు కావండీ ఇప్పుడుఇంట్లో నలుగురుంటే కనీసం నలుగురికీ వారికి  ఇష్టమైన నాలుగు కూరలు వండాలిఉదయాన్నే తిన్న టిఫిన్ సాయంత్రం తినకూడదురెండు చట్నీలు ఉండాలి  రకరకాల రుచులు కావాలిఇవన్నీ చేయడానికి ఖర్చు సంగతి అలా ఉంచండి ఆడవాళ్ళకి మాత్రం ఓపికుండవద్దూ అంటుంది.

ఇక సరళ  గారైతే మా ఇంట్లో అయితే రాత్రి పూట అందరూ టిఫిన్ చస్తారుఒకోకరికి ఒకో రకం ఆ బాధంతా పడలేక ఎవరికీ కావాల్సింది వాళ్ళని తెచ్చుకోమని డబ్బులిస్తానువాళ్ళతో పాటు నాకు కూడా తెచ్చేస్తారు." పని తప్పి పోద్ది అన్న సంతోషం ఆమె మాటల్లో

రోజూ అలా హోటల్  తిండి తింటే దెబ్బ తినే  ఆరోగ్యం సంగతి ఏమిటీ ?  అసలే ఈ మధ్య ఏవేవో కల్తీ నూనెలతో పదార్ధాలు తయారుచేస్తారని చదువుతున్నాం మీరు పిల్లలనిమగవాళ్ళని హోటల్స్ వైపు మళ్ళనీయకూడదండీఅత్యవసరమైన పనిగా వంటింటి వైపు వేయాలి వాళ్ళ అడుగులుఅప్పుడే ఆరోగ్యాలు బావుంటాయి" అన్నానొకసారి.

"అబ్బ !  మధ్యలో ఈయన  నసేమిటోఎవరి పని వారు చూసుకోకఎవరి తిండి వాళ్ళు చూసుకోక ప్రతిదానికి  ఆర్గ్యూ చేసి చంపుతాడు." నళిని తను వినాలనేట్టుగానేఇక నేనెప్పుడూ వాళ్ళతో ఆర్గ్యూ చేయలేదుచేసి గెలవలేమని తెలిసి .  నా ఆలోచనల్లో నేనుండగానే  "ఏం సార్ ఏమీ మాట్లాడరేంటీనేను అన్నది నిజమా కాదా ? "

"ఏమన్నావ్ రా వినలేదు మళ్ళీ చెప్పు ". "నిలబడి తింటామన్నమాటే కానీ రుచిలో ఫైవ్ స్టార్ హోటల్ రుచికేమీ తీసిపోవుపైగా  తినే తిండి పై టాక్సో ,గీక్సో కట్టే పనిలేదు వాళ్ళకేమో  అద్దె,కరంట్ బిల్లు ఖర్చులుండవు కాబట్టి నాణ్యంగా వేడి వేడిగా పెడతారుఅది చాలదూ జనం ఎగబాడటానికిఅన్నాడు.

ఒరేయ్ కృష్ణా!  ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా? అనడిగా ఆశ్చర్యంగా 

"కొన్ని అట్టాగే తెలుస్తా ఉంటాయండీ అంతే"  
"అదే ఎట్టా తెలుస్తాయి అని 
పుట్టినదగ్గర్నుండి  టీవి చూస్తున్నాను బెజవాడలో బతుకుతున్నాను అదేమన్నా విచిత్రమా సార్ తెలియకుండా ఉండటానికి "  

"అబ్బా ఏమి మనిషండీ బాబూ ఆవిడచేతిలో హృదయం  ఉంది  మాటలో హృదయం ఉంది " అని ఒక రోజు పొగిడే వాడు.    

నిలబెట్టి రోజుకి అయిదారు వేలు సంపాదిచ్చేస్తుందిచుట్టుప్రక్కల బళ్ళ బేరాలన్నీ పోయాయివాళ్ళు ఈగలు తోలుకోవడమే ఇకరంకు  ముండ అందరిని చూసి  ఒకటే నవ్వుద్దిఆ నవ్వుకే పడిపోతారుఇక మా బళ్ళ దగ్గరకెవరొస్తారు ఇంకో సెంటర్ వెతుక్కోవాల్సిందే అని ప్రక్కనాడు  తిడుతున్నాడని ఇంకో రోజూ చెప్పేవాడు.   రాత్రి ఇద్దరు మనుషులకి బాగా మందు పోపిచ్చి  ఆ టిఫినీ బండి దగ్గరకి పంపిచ్చి  గొడవ చేయించారట  ఒకడైతే ఆమె పై చెయ్యేసి  ఎదవ పనులు కూడా చేసాడంటతల్లీ కూతుళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట అని ఇవాళ  వార్త మోసుకొచ్చాడు.

"అయ్యో ఇబ్బందేమీ లేదుగావాళ్ళు బాగున్నారా అన్నాను 

"ప్రొద్దున్నే తెలిసింది  ఊరుకుంటానా వెళ్లి పలకరించి వచ్చా!ఎవడో చెప్పండి మా కట్టమీద కుర్రాళ్ళమి  వెళ్లి ఇరగొట్టి వస్తాంఅన్నానని చెప్పుకొచ్చాడు. 

కొన్నాళ్ళ తర్వాత   ఛీ ఛీ ! మనుషుల్లో నీతి నిజాయితీ తగ్గి పోతున్నాయి అన్నాడు మొహం చించరిచ్చుకుంటూ
"ఏమైందిరా కృష్ణా "

వొక కానిస్టేబుల్ రోజూ వచ్చి  గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నాడట ఆ మనిషికి లొంగి పోయింది  అంటున్నారందరూ"  

"ఏదో  వొక అండ కావాలి కదరాఅందుకోసం అయి ఉంటుందిలేఏ అండా లేకపోతే  అంతమంది మగాళ్ళ మధ్య నెట్టుకురావడం కష్టం కదా ! "

"పెళ్లీడు కొచ్చిన పిల్లని పెట్టుకుని ఆ వయస్సులో ఆమెకావేషాలేమిటో.? మా ఇంట్లో వాళ్ళవరైనా ఆట్టా చేస్తే  నడిరోడ్డులో  డొల్లిచ్చిడొల్లిచ్చి  కొట్టి బందరు కాలవలో ముంచేవాడిని". ఉక్రోషం వాడి మాటల్లో.  ఆ సాయంత్రం టిఫినీ బండి దగ్గర దిగాలా వద్దా అన్నట్టుగా ఉన్నాడు. "ఏం ఇవాళ వెళ్ళవా ? " మాట్టాడకుండా విండో లో నుండి చూసాడు కానీ బస్ దిగలేదు. . "దేశం ఏమీ గొడ్డుబోలేదు లెండి  ఈమె ఒక్కదాని బండేనా ఉందీ అన్నపూర్ణ హోటల్ దగ్గర తింటాఅన్నాడు. ఆ బెట్టు నాలుగు రోజులే ! రోజూ   వాడి దృష్టంతా ఆమె మీదే ఉండేది ప్రతిరోజూ మా మధ్య టిఫిన్ బండి  మాటలు తప్ప ఇంకేమీ లేనట్లు ఆమె మాటలే చెప్పేవాడు

"ఆమె భర్తకి ఏదో జబ్బు అంటండీ ఇంట్లోనే ఉంటాడుబండి దగ్గరుండి డబ్బులు తీసుకునే పిల్ల ఆమె కూతురే ఇంకో కొడుకు కూడా ఉన్నాడు,   చిన్నదైనా సొంతిల్లే !  ప్రక్కనే సందులోనే ఇల్లుపగలల్లా  ఇంటి పని చేసుకుని  పిండ్లు రుబ్బుకుని సాయంత్రానికి రెడీ అయిపోద్ది." ఆమె గురించి వివరాలు తెలుసుకొచ్చాడు.  కృష్ణ ఆలోచనలే కాదు పాదాలు ఆ టిఫినీ బండి చుట్టూ తిరుగుతూ ఉండేవి 

"ఏమండీమగాడు  తన కన్నా పెద్దదాన్ని  పెళ్లి చేసుకుంటే తప్పేంటీ !? ఏమైనా నష్టం జరుగుతుందంటారా ?"
"నష్టమేమి లేదురాఅదివరకు అలా చేసుకోవడానికి భయపడే వాళ్ళేమో ఇప్పుడంత భయపడటంలా ఒక ఏడాది రెండేళ్ళు పెద్దైనా సరే శుభ్రంగా కాపరం చేసుకుంటున్నారు"  .

"నేననేది ఒక ఏడూ రెండేళ్ళు తేడా  కాదండీపది హేనేళ్ళు  ఇరవయ్యేళ్ళు  తేడా అంటూ అడిగాడు.  నాలో ఎక్కడో లేశ మాత్రమున్న అనుమానం నిజమవుతుంది . "బాగోదు కృష్ణా!   అసహ్యంగా ఉంటుంది "

"కృష్ణుడుకి  రాధ మేనత్త అవుద్ది అంట గదండీ అయినా ఆళ్లిద్దరి మధ్య సంబంధం ఉండేదంట కదా !" 

"సంబంధం కాదు రా అది ప్లేటోనిక్ లవ్నేను వివరించే ప్రయత్నం వాడి ముందు వీగిపోయింది.

"అంటే ఏంటండీ అదీ పెళ్లి లేని ప్రేమా సంబంధాలు లేని ప్రేమా ఇవరంగా చెప్పాల్సిందే మీరుఅంటూ ఎదురుగా కూర్చున్నాడు.  పని ఉందని మేనేజర్ పిలవడంతో అప్పటకి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాను .

మర్నాడు "నిన్న రాత్రి బండి కట్టేసేదాకా అక్కడే ఉన్నానండీనా కూతురిని పెళ్లి చేసుకుంటావా అందినేను మాట్లాడలేదుఏడుపొచ్చేసింది ఆ డొక్కు మొహందాన్ని, ఎత్తు పళ్ళదాన్ని నేనెలా చేసుకుంటానండీడబ్బు  లేకపోతే లేకపోయింది కానీ నాకేం అందం తక్కువాకుర్ర హీరో "ఆది" లాగా ఉంటావని మా కట్ట మీద ఆడపిల్లలందరూ రెప్పార్చకుండా చూస్తారు నన్ను.  రేపో మాపో గవర్నమెంట్  ఉద్యోగం వచ్చేసినట్టే కదా !. అప్పులు తీరిపోయ్యాక పెళ్లి చేస్తే నాలుగు లక్షలు కట్నం వస్తది అంటది మా అమ్మ అని చెప్పుకొచ్చాడు. . 
"ఏమన్నావ్ మరి? " అడిగాడు ఆసక్తిగా .

"మా అమ్మ కట్నం కావాలంటదిఅని చెప్పాను . "అన్ని డబ్బులు ఇవ్వలేను గాని ఏమి అడిగితే అదిస్తాను అందిఏమడిగినా ఇస్తావా? అన్నాను ఇస్తానందిఅందుకే  ఆమె కూతురిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పానుమా వాళ్ళు ఒప్పుకోలా   ఆ పిల్లేమీ బాగోలేదుఅయినా ఆ పునుగుల బండామెతో వియ్యం అందుకోవడమేమిటీపరువు తక్కువ.  ప్రొద్దుటూరు మామయ్య అరెకరం పొలమిచ్చి పిల్లనిస్తామని అంటున్నాడుఆ పిల్లని చేసుకుందువుగాని అంది అమ్మఅదే సంగతి చెప్పానామెకి.   నవ్వి ఊరుకుంది". అన్నాడు.  

కొన్నాళ్ళ తర్వాత పది రోజులు సెలవు  పెడుతున్నానండీ"  అన్నాడు.  ఎందుకురా అంటే పని ఉందని చెప్పాడు కానీ అసలు విషయం  చెప్పలేదు.  ఖాతాదారుడొకరు చెప్పారు మీ అటెండర్ పెళ్లి చేసుకున్నాడు అని. "ఎవరిని? "ఆశ్చర్యంగా అడిగానేనడిగిన విధానం చూసి అతనాశ్చర్యపోయి ... "మిమ్మల్ని కూడా పిలవలేదాఆ పునుగుల బండమ్మాయి కూతురిని పెళ్ళిచేసుకున్నాడుఇంట్లో  తెలియకుండా  జమలాపురంలో పెళ్లి చేసుకోచ్చాడంటకృష్ణ వాళ్ళమ్మ ఒకటే ఏడుపు.  ఈడికి పెట్టె టిఫిన్ లో అదేదో  మందు పెట్టిందిలేకపోతే కాణీ  కట్నం లేకుండా ఆ కర్రి మొహందాన్ని ఎందుకు చేసుకుంటాడు అనిమొత్తానికి వీడెల్లి ఆ రొచ్చులో పడ్డాడు".  " రొచ్చుఅన్న  మాట వినగానే నాక్కోపం  వచ్చిందిఆ రొచ్చు ముందు నిలబడే రోజూ టిఫిన్ తినే వాళ్ళలో ఇతన్ని చూస్తానుఅప్పుడు రొచ్చు అనిపించలేదేమో !

సెలవు అయిపోకుండానే ఆఫీస్ కి వచ్చాడు కృష్ణ కొత్త పెళ్లికొడుకు మెరిసి పోతున్నాడు. "నేను ఉద్యోగం మానేస్తున్నానండీ ! మా అమ్మతో బాగా గొడవగా ఉందండీ మా తమ్ముడిని పెడతారంట ఉద్యోగంలో నేను సరేనన్నాను నెల మొత్తం చేసినా కూడా ఇక్కడ అయిదేలు రావు మా అత్తమ్మతో కలిసి నేను టిఫిన్ బండి నడుపుకుంటాను ఒక్క రోజులో నెలకొచ్చే  ఆదాయం వస్తదిఅన్నాడు.

"నిజమేలే !"  అన్నట్టు తలూపి ఊరుకున్నా. " మీరొక  సహాయం చేయాలిమా అత్త ఇల్లు ష్యూరిటీ గా  పెట్టి లోను తీసుకోవాలి సర్ అన్నాడు. "ఆ ఇల్లేనా నీకిస్తానందిఅడిగానునవ్వేసాడు.  ఇంటి కాగితాలు అన్నీ పట్టుకురండి. చూసి లోన్ వచ్చేది రానిది చెపుతాను అన్నా .  పేపర్స్ అన్నీ సరిగ్గానే ఉండటంతో  శ్రద్ద తీసుకుని త్వరగా  బాంక్ లోన్ వచ్చేటట్లు ఏర్పాటు  చేసానుకృష్ణఅతని అత్త కలిసి టిఫిన్ బండి బాగా నడిపే వారుసంపాదన బాగుండేది.   నెల నెలా బాకీ కట్టడానికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవాడు. అప్పుడడిగాను మీ అత్త గారు నీకు ఇల్లు ఇచ్చేస్తుందా అని. 

"ఇల్లు  కాదండి అసలు సంగతి వేరే ఉందిఅన్నాడు .

"నాకు తెలుసులే అదిఅనగానే "మీరు భలే కనిపెట్టేసారండిఆమెపై మనసు పడే, వెనుకా ముందూ ఆలోచించకుండా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాఒంటిగా ఉన్నప్పుడు నాకిస్తానన్నది ఇమ్మని అడిగా. 
మీ మామకి ఎయిడ్స్ వచ్చింది.  ఆయన్ని హాస్పిటల్ కి తిప్పడానికే  బోలెడు డబ్బులు అయిపోయాయి.  ఇక పిల్లకి కట్నమిచ్చి పెళ్ళేం చేయగలనుచక్కని పిల్లాడివి,  బుద్ధిమంతుడువిఉద్యోగం కూడా ఉంది.  నా కూతురిని నీకిచ్చి చేస్తే దిగులుండదనుకున్నాను.  వ్యాపారం బాగా సాగాలని కాస్త పైట ప్రక్కకి జరిపి చిన్న చిరునవ్వు నవ్వుతున్నా! అంత మాత్రానికే నేను రంకు దాన్ని అయిపోలేదుతప్పబ్బయ్యా నీ తల్లిలాంటిదాన్ని అట్టాంటి ఆలోచన పెట్టుకోబాకు"  అందండీ !

"అనుకున్నదొకటి అయిందొకటా? అయినా తప్పుగా ఆలోచించావేమో కృష్ణా" అన్నాను . 

"ఆమె మాటలని నమ్మలేదు ఎక్కడో అనుమానం ఉంది కానీ ఏమీ  చేయలేనుఎక్కిన మత్తు,వికారం  దిగిపోయింది  నా పెళ్ళాం అమాయకత్వం చూసి జాలేసి నోరు మూసుకుని ఊరుకున్నా"

ఆమె తెలివికి నవ్వుకుంటూనే  మరి ఇప్పుడేం  చేస్తావ్ నామాటల్లో ఎగతాళి కనబడినట్టు ఉంది కృష్ణ కి

"కాళ్ళకి మడుగుల లెక్కన  బంక మట్టి అతుక్కుందిఎట్టో గట్టా కడుక్కోవాలితప్పదు కదండీ మోహంలో పడి ముఖం పగలగొట్టుకున్నానో, కష్టాలు విని కరిగిపోయానో తెలియడంలేదు సర్ ఇకనుండి  ఆ ఇంటికి పెద్ద  కొడుకుగా నిలబడాలనుకుంటున్నా ! "

కృష్ణ మాటలకి ముచ్చటేసిందిఎంత మంచాడు వీడు అనుకున్నా.  కొన్నాళ్ళకి  నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫరై వెళ్ళాక అప్పుడప్పుడు ఫోన్లో మాటలు.  తర్వాత నిదానంగా అవి  తగ్గిపోయాయి .

రెండేళ్ళ తర్వాత మిత్రుడి కూతురు పెళ్ళికని    విజయవాడకి  వచ్చి కాస్త సమయం చూసుకుని  కృష్ణ ని చూసేళదామని కామయ్య తోపు సెంటర్లో బస్ దిగానుకృష్ణ అక్కడే ఉన్నాడు నన్ను చూసి చాలా సంతోషించాడు.  కుర్చీ వేసి అతిధి మర్యాదలు చేయబోయాడువద్దని వారిస్తూ  ఎలా ఉన్నారు కృష్ణా ? అనడిగాను 

"ఏదో పర్వాలేదండీకొడుకు పుట్టాడు సంగతి చెపుతున్నప్పుడు సంతోషం. "వ్యాపారం ఎలా ఉంది ? "

 " మా అత్త చచ్చిపోయిందండీ. అంటూ ముఖం క్రిందికి దించుకున్నాడు. కళ్ళల్లో సన్నటి నీటి తెర. మంచి మనిషండీ! ఆడది  కదా ! తన బ్రతుకు తను బతుకుతున్నా లోకం  ఓర్వలేకపోయింది. మొగుడు మంచోడు కాక పిల్లలని పెంచడానికి నానా తిప్పలు పడింది. లోకుల నోళ్ళలో నానింది. మా మామ కన్నా ముందే మా అత్త చచ్చిపోయిందండీ. పువ్వులాగా పంపిచ్చా. కళ కళ లాడతానే పోయిందండీ. ఆమె పోయినాక  వ్యాపారం బాగా సాగడంలేదండీవిచారం అతని కళ్ళల్లో. ఆమె చిరునవ్వు ముఖం నా కళ్ళముందు కదలాడింది . రెప్పదాటని కన్నీళ్ళే వో ఉబికాయి. బండి దగ్గర ఆమె నిలబడే చోటు వైపు చూసాను. అదే  సన్న నవ్వు ముఖంతో మసక మసకగా కనబడి మాయమైపోయినట్టు అనిపించింది  కొంచెం గుండె బరువైనట్టు అనిపించింది. 

నూనె కళాయి ముందు నిలబడి పునుగులు,బజ్జీలు వేస్తున్న అమ్మాయిని చూసి "ఆమె  నీ భార్య కదూ !" అనడిగాను   బిడ్డ తల్లైన ఆ అమ్మాయి  కొద్దిగా ఒళ్ళు తేలింది లోపలి పోయినట్లుడే బుగ్గలు పూడి కొత్త అందంతో  మెరుస్తున్నాయి.

"అవునండీ"

“మీ అత్త ఢక్కా ముక్కీలు తిని ఉంది కాబట్టి మగవాళ్ళ చూపులని భరించిందిపాపం చిన్న పిల్ల.  ఈ పిల్లనెందుకురా నడిరోడ్డులో నిలబెట్టావ్? " మందలింపుగా అన్నాను.

సాగినన్నాళ్ళు ఇంట్లోనే  ఉంటారుసంసారం బండి సాగకపోతేనే కదండీ బయటకొచ్చేదిమా ఆవిడకి మా అత్త అందం రాలేదన్నమాటే కానీ మా అత్తలా రుచికరంగా వంటలు చేయడం వొచ్చు  సార్ వ్యాపారంలో పోటీ ఎదుర్కోడానికి అది కూడా చాల్లేదు అందుకే మా ఆవిడని నిలబెట్టా" అన్నాడు.

కృష్ణ మంచి నీళ్ళు టీ అందిస్తూ, డబ్బులు తీసుకుంటూ మధ్య మధ్యలో భార్య వైపు ఎవరైనా వంకరగా   చూస్తున్నారేమోనని చుట్టూరా గమనిస్తూ భార్య పైన  ఓ చూపేస్తూ నాతో  మాట్లాడుతున్నాడు

"ఇంతమంది జనం మధ్య ఆ పిల్లకి ఇబ్బంది కదరా వేరే మార్గం ఆలోచించు"

"ఆలోచించడానికి ఏమీ లేదండీ నగల షాపులాళ్ళుకార్ల కంపెనీలాళ్ళు బట్టలషాపులాళ్ళు ఆఖరికి గడ్డం గీసుకునే రేజర్ కోసం కూడా ఆడాళ్ళని చూపిస్తూ టీవీలలో  ఎడ్వర్టైజ్మెంటులు ఇస్తున్నారు కదా !. నా వ్యాపారం బాగా సాగడానికి చెమటలు కక్కే మా ఆవిడని చూపిస్తే తప్పేం ఉందిలే సార్ అన్నాడు తెలివిగా .

ఆర్ధిక శాస్త్రం చదవకపోతేనేం వ్యాపార రహస్యం తెలుసుకున్నవాడుఇక కృష్ణ బతుకుకి  డోకా లేదు. ఆశ్చర్య పోతూనే మెచ్చుకోక తప్పింది కాదు. కృష్ణ దగ్గర వీడ్కోలు తీసుకుని రోడ్డు దాటి  బస్ ఎక్కి టిఫిన్ బండి వైపు చూసాను. ఆమె నవ్వుతూ కనబడుతుందేమోనని. కొన్ని ఖాళీ లంతే, ఎప్పటికి నింపబడవు.   

(19/06/2016 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం )  

19, జూన్ 2016, ఆదివారం

ఈ నవ్వేమిటో ..


నేను వ్రాసిన కథ ..ఈ రోజు ఆదివారం ఆంధ్ర జ్యోతిలో  ప్రచురితమైంది .  కథ పేరు  "ఆమె నవ్వు"

చదవండి ...   ఆమె నవ్వు  ఈ లింక్ లో ..







18, జూన్ 2016, శనివారం

కళాత్మకం బాతిక్ కళ





పుట్టా పెంచలదాసు గారు గారు . ఒక మంచి బాతిక్ చిత్ర కారుడు,జానపద గాయకుడు. వీరి గురించి పరిచయం  "అరుగు " వెబ్ పత్రికలో చదివాను. చదివిన నాలుగైదు రోజులకే కడప జిల్లాకి వెళ్లాను. వారిని స్వయంగా కలవాలని రెండు బాతిక్  చిత్రాలని కోరి చేయించుకోవాలని అనుకున్నాను. అయితే అక్కడ నేనున్నా రెండురోజుల్లో ..చిట్వేల్ వరకు వెళ్ళి కలవడం సాధ్యం కాదనిపించింది. తిరిగి వచ్చి ఒక ఉత్తరం వ్రాద్దామనుకుంటూనే అలక్ష్యం చేసాను. నిన్న పుట్టా పెంచల దాసు గారు పేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్టు లో కనిపించారు .సంతోషం కల్గింది. వెంటనే .. వారికి స్నేహ అభ్యర్ధన పంపాను. వారు అంగీకరించి ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నారు. 

ఇప్పుడీ పరిచయం ఎందుకంటే .. పుట్టా పెంచలదాసు గారి బాతిక్ చిత్రాలలో చక్కని కళాత్మకత ఉంది. జీవకళ ఉట్టి పడుతుంది.  కళాకారులకి ప్రోత్సాహం లేక కళని నమ్ముకున్నందుకు సరైన  జీవనోపాధి లభించక ఆర్ధిక ఇబ్బందులతో నిరాశ నిసృహలతో జీవనం సాగించడం చాలా బాధాకరమైన విషయం. 

మన దురదృష్టమేమిటంటే ... మన వారి కళలని మనం గుర్తించం. పరాయి వాళ్ళ చిత్రాలని ఆహా ..ఓహో అంటూ మెచ్చుకుంటూ ఎంత ఖరీదు అయినా కొని ఇళ్ళల్లో అలంకరించుకుంటారు. కానీ మనమధ్య ఉన్న కళాకారులని గుర్తించి, అభినందించి,ప్రోత్శాహించలేము కదా ..అని నా మనసుకి అనిపించింది. 
నాకు ఇప్పుడిలా చేయాలనిపించింది. పుట్టాపెంచలదాసు గారి తో నాకు నచ్చిన రెండు చిత్రాలని డిజైన్ చేయించుకుని ... వాటిని ఫ్రేమ్ చేయించుకుని ఇంట్లో అలంకరించుకోవాలని, ఎవరికైనా గిఫ్ట్ గా  ఇవ్వాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల కళని కళాకారుని గౌరవించుకున్నట్లే!

24 x 18 సైజులో .. వాల్ ఫీసు లుగా చిత్రించుకోవచ్చని నాకనిపిస్తుంది. ..మరి పెంచలదాసు గారు ఏమంటారో !? 
ఇలా వారి పరిచయాన్ని నా చిన్నపాటి ఆకాంక్షని తెలుపుతూ ..ఈ పోస్ట్ . 
పుట్టా పెంచలదాసు గారికి  ఇలా పోస్ట్ చేయడం అభ్యంతరం కాదని భావిస్తూ ... అభ్యంతరమైతే మన్నించాలి మరి. 



కళాకారుడి పరిచయం    ఈ లింక్ లో .

16, జూన్ 2016, గురువారం

పండుగ అంటే ..సిరివెన్నెల మాట - పాట

Genes Episode 86 - 4 | ManaTeluguMovies - Shows

ఈ పై లింక్ లో కార్యక్రమం ని చూడండి

తెలుగు సినీ సాహిత్యంలో గొప్ప సాహిత్యం అందించిన వారిలో "సిరివెన్నెల" గారిది ప్రత్యేక శైలి

ఒక పాటని విని ..ఆ పాట లో భావాన్ని అర్ధం చేసుకుంటే...కొంతైనా మానసిక వికాసం కలుగుతుంది.

"'పదుగురి సౌఖ్యం కోరే దినమే పండుగ కాదా ? అని రుద్రవీణ చిత్రం లో పాటలో చెప్పినా..
"పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైనా పెంచలేని ఎడారి కాదా? అని అల్లుడుగారు చిత్రంలో పాటలో చెప్పినా..

మనిషి తత్వం మనసు తనం కనబడాలంటే..మన ఆలోచనా విధానం లో మార్పు రావాలని చెపుతూ..

పాటైనా సరే సాంఘిక ప్రయోజనం ని ఆశిస్తూ..ఆలోచింప జేయాలనే ఆకాంక్షతో.. సిరివెన్నెల గారు వ్రాసిన పాటలు అన్ని మేలేన్నిక కలవే!

కొండంత భావాన్ని గుప్పెడు పదాలలో గుప్పించి వ్రాయడం బహుశా వారికే సాటి ఏమో!

నేను ఎప్పుడో ఎక్కడో చదివిన ..వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి.


"మనమెంత  ఎత్తుకు వెళితే మనచూపు  అంత  విశాలమవుతుంది.
 మన చూపు ఎంత విశాలమయితే మన భావన అంత బలంగా ఉంటుంది
భావనలు ఎంత బలంగా ఉంటే వ్యక్తీకరణ అంత స్పష్టంగా ఉంటుంది
వ్యక్తీకరణలో  స్పష్టత ఏర్పడిన కొలదీ  రచయితకి  సమాజానికీ  అంతరంగిక బంధం మరింత బలీయమవుతుంది 
 వ్యక్తుల ఆచరణ పరస్పర ప్రేరక మవుతుంది."

ఖచ్చితంగా ..సిరివెన్నెల గారి పాటలు చూసినప్పుడు నాకు పై వాక్యాలు కి సరిపోతుంది అనుకుంటాను.

ఇక్కడ ఒక విషయం చెప్పదలచాను.


సిరివెన్నెల గారి భావ సంపద ఎంత ఘనమైనదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు

వారి ప్రతి..మాట, ప్రతి పాట విన్న,చూసిన శ్రోతకి హృదయానికి హత్తుకుని పోతాయి.

ఒక సందర్భాన్ని వారు చెప్పిన కోణంలో మనం చూడటం నేర్చుకుంటే.. మన లో బూజు పట్టిన భావాలు అన్ని దులిపి పారేసుకున్నట్లే!

ఇటీవల సిరివెన్నెల గారిని, వారి తనయుడు ని ఆతిధులుగా పిలిచి "ఈ టి వి " వారు" జీన్స్" అనే గేం షో నిర్వహించారు.

ఆ కార్యక్రమంలో ..సిరివెన్నెల గారిని ఒక పాట పాడమని కోరారు.


అప్పుడు వారు పాడిన పాట..

పండుగ అంటే ..

ఏమిటో వారి పాటలో చూడండి.


పండుగ అంటే ఫలానా రోజంటే ..
తక్కిన రోజులు అన్ని బరువుగా మోసున్నామంతే

బంధువు లెవరంటే ఫలానా వాళ్ళంటే
పక్కనే ఎందరు ఉన్నా ఒంటరి వాళ్ళం అయినట్టే

పంచాంగం చెపితేగాని పండుగ రానందా?
మంచి ముహూర్తం కాదని గుండెల సవ్వడి ఆగిందా

ఆకురాలే కొమ్మల కోసం ఆమని వస్తుంది
ఆశలు రాని మనసుంటే ప్రతి రోజు అలాంటిది

పెదవులపై నవ్వులు పూస్తే అదే చిత్రమవుతుంది
మది ముంగిట ముగ్గులు వేసే శాంతి పేరే సంక్రాతి

ప్రత్యేకంగా బంధువులు వచ్చే రోజు ఒకటి ఉంటుందా?
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా?

ఒకటి రెండంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు
అంకెలు ఎన్నంటే పక్కన నిలబెడుతూ
కలుపుకు పోతుంటే లేక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే

నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే

నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే
మనిషి తనం ఒకటే ..మనిషి తనం ఒకటే!

ఈ పాటలో కొంత భాగం "చక్రం" చిత్రం ..లో రంగేళీ హోలీ హంగామా కేళీ ..అనే పాటలో చూడవచ్చు.

10, జూన్ 2016, శుక్రవారం

సన్మతినీయవే భారతీ

ఈ పాట ఈ టీవీ  సీరియల్ "కళంకిత" లో ఉన్న పాట. 

ఈ పాట సాహిత్యం "సుమన్" 
సంగీతం :సాలూరి వాసూ రావు 
పాడినవారు :ఎస్ :జానకి 

చక్కని అర్ధమున్న పాట ఇది. అందుకే నాకు ఇష్టమైంది . 


సన్మతినీయవే భారతీ 
సన్మతినీయవే భారతీ 
జగతిని వెలిగించు నీతి  నియతుల నిర్మల  జ్యోతి 
జగతిని వెలిగించు నీతి  నియతుల నిర్మల  జ్యోతి 
కళారంగానికేల ఈర్ష్యల దుర్గతి 
కళారంగానికేల ఈర్ష్యల దుర్గతి 
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతీ 
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతీ
సన్మతినీయవే భారతీ 

అన్ని కళల పరమార్ధం అమేయానందమే 
అన్ని కళల పరమార్ధం అమేయానందమే

కళలన్నీ కోరేది నీ సన్నిధానమే 
కళలన్నీ కోరేది నీ సన్నిధానమే

ధ్యేయం ఒకటే  కదా ఈర్శ్యాగ్నులు ఎందుకు? 
ధ్యేయం ఒకటే  కదా ఈర్శ్యాగ్నులు ఎందుకు?

మార్గం ఒకటే మదమత్సరాలు ఎందుకు? 
మార్గం ఒకటే మదమత్సరాలు ఎందుకు? 

సన్మతినీయవే భారతీ 
సన్మతినీయవే భారతీ 


నాట్యశాస్త్రంలో ఆ నాగరాజుకెంత పరిణితి 
నాట్యశాస్త్రంలో ఆ నాగరాజుకెంత పరిణితి 

అయినా గళమున గరళంతో విషజీవిగానే విఖ్యాతి 
అయినా గళమున గరళంతో విషజీవిగానే విఖ్యాతి

కమ్మగా సాగే గీతాన్ని ఆపేయదా చిన్న అపశృతి 
కమ్మగా సాగే గీతాన్ని ఆపేయదా చిన్న అపశృతి 

అసూయ అంటని కళకి అసమానం కదా ప్రగతి 
అసూయ అంటని కళకి అసమానం కదా ప్రగతి 

సన్మతినీయవే భారతీ 
సన్మతినీయవే భారతీ 

జగతిని వెలిగించు నీతి నియతుల నిర్మల జ్యోతి 
కళారంగానికేల ఈర్ష్యల దుర్గతి 
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతి
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతి
సన్మతినీయవే భారతీ 
సన్మతినీయవే భారతీ  భారతి..  భారతీ....  




3, జూన్ 2016, శుక్రవారం

కాస్త విను చిన్నమ్మా...

చిన్నమ్మా !  ఎలా ఉన్నావ్ ? 

ఈ పలకరింపులో ఉట్టిపడే ఆత్మీయత నీ మనసుని తాకుతుందని నాకు తెలుసు. 
మన మనసులు మాత్రమే  సున్నితమైనవి . ఎదుటివారి మనసు మాత్రం పాషాణం లాగా ఉండాలి అంటే  ఎట్టాగమ్మా!  ఎందుకంటే మనం ఎన్నెన్నో అంటుంటాం కదా ! వాళ్లకి అసలు చక్కిలిగిలి ఉండకూడదు. ఎన్ని రాళ్ళు వేసి కొట్టినా చలించకూడదు అంటే ఎట్టాగమ్మా!  ఇలాగైతే చాలా కష్టమే చిన్నమ్మా !!

నీలో హంస గుణం లేకుంటే ముందుకు సాగడం కష్టం చిన్నమ్మా ! రక్త స్పర్శ వేరు, భావజాల స్పర్శ వేరు చిన్నమ్మా ! ఎదుటివాడిని తిడుతూ కౌగిలికి ఆహ్వానిస్తే రారు చిన్నమ్మా! ఎదుటివాడిని ద్వేషించి మనల్ని మనం వెలివేసుకుంటే వ్యక్తీ స్వేచ్ఛ అనుకుని హాయిగా బతికేయవచ్చు. మంది కోసం మందిలో బతికే వాళ్లకి  ఈ సూత్రం పనికిరాదు చిన్నమ్మా ! నిజానికి దూరంగా పారిపోకు చిన్నమ్మా ! దైర్యం నీ సహజ గుణం. నిలబడి ఎదుర్కో! 

అభాద్రతాభావంలో నలిగిపోకు. నువ్వంటే నాకెప్పటికీ అభిమానమే ! అందుకే చెపుతున్నా!  అకారణంతో నచ్చలేదని దూరంలో పెట్టాననుకుని అందరిని దూరం చేసుకుంటున్నావ్. కాలాతీత,మతాతీత, కులాతీత స్నేహాన్ని అర్ధం చేసుకుంది ఇంతేనా !? 

ఎదుటివారు చెప్పింది వినాలి కదా !.  ఏం చెప్పదల్చారో  వినకుండా కూడా  దూరంగా నెట్టేస్తే ఎలా ? 

మొన్న ఒకసారి నాకూ కళ్ళు విచ్చుకున్నాయి పత్తి పువ్వులా... జీవించి ఉన్నప్పుడు తోటి మనుషుల నుండి ఎదురయ్యే    ప్రతిచర్య ఒక  రాజకీయమే అని ఆలస్యంగా తెలుసుకున్నాను . 

కొందరిలో హటాత్తుగా కనబడే ఉదారవాదాన్ని చూసి తెగ సంబరపడిపోతాను . వారి హృదయం విశాలమైందని.
కానీ వారి సహజ గుణం అలాగే ఉంటుందని తెలియకపోతే ఎలా పిచ్చి వనజమ్మా ..అని మనసు నాలుగు కూకలేస్తే గాని సత్యం బోధపడలేదు. కొందరు ఎపుడు దొరుకుతారా అని ఎదురు చూస్తారు . అచ్చం పులిలా. అవును నిజం ... పొదలమాటున పులిలా పొంచి ఉంటారు. సమయం వచ్చినప్పుడు చావు దెబ్బ తీస్తారు.

ఇప్పటికైనా అలాంటి వారి నైజం నీకు తెలిసిందని అనుకుంటున్నాను. ద్రోహం చేయడం నా రక్తం లోనే లేదు. నమ్మడమే ! నమ్మినదానిని నిలబెట్టుకోవడమే నాకు చేతనైనది. ఇంకో విషయం ఏమిటంటే  నిష్కర్షగా నా అభిప్రాయం చెప్పడానికి ఏనాడు వెనుకాడను.  

ఎవరో వస్తారు కొంత పరిచయంతో. ఆ పలకరింపులన్నీ సాధారణ పలకరింపులే ! తాడే పామై కనబడటం నీకున్న అభద్రతా భావమే ! దానికి నేనేం చేయను ? హృదయం నలిగిందని బాధపడటం తప్ప. 

ఈ దేశపు సౌభాగ్యం అన్ని మతాల స్త్రీలు అందంగా ఉండాలని అలంకరించుకునే గోరింటలో ఉంది 
ఈ దేశపు ఐకమత్యం అందరి భుజాలపై మోసే త్రివర్ణ పతాకంలో ఉంది. 
ఈ దేశపు సామరస్యం జనగణమన జాతీయ గీతంలో దాగి ఉంది. 

మొత్తానికి ఈ దేశపు ఘనత    mile sur mera tumhara జీవన గీతంలో ఉంది. కాదనగలవా !?  

మనమొక్కరిమే మోస్తున్నామని అనుకోవడం భ్రమ కాదూ ! మానసిక దౌర్భల్యాలని వదిలించుకో ..  హృదయాన్ని ఆకాశం చేసుకో ! 

సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన వివేకానందుడు అంటే మనకెంతో  ఇష్టం కదా ! ఆదారిలోనే మనం ఉన్నాం. ఆ నడకలోనే ఉన్నాం. 


                                                                                                                    యువర్స్ లవింగ్లీ ... 






చిత్ర సేకరణ : pinterest.