స్పందన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్పందన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2026, శనివారం

Chiraiya

 


Chiraiya  అంటే చిన్న పక్షి అని అర్థం. గూడు భద్రంగా లేకపోతే పక్షి గూడు విడిచి వెళ్లిపోతుంది అని.. చెప్పే కథ గురించి.. ఈ పోస్ట్. పూర్తిగా చదవండి. 


నిన్న Chiraiya web series చూసాను. చూసాక ఎన్నో ఆలోచనలు.బాగుంది అని చెప్పలేను కానీ ప్రతి మనిషిలో కొత్త ఆలోచన రేకెత్తించే అంశంతో ఆసక్తికరంగా సాగుతుంది. 

కథ మాములు సంప్రదాయ కుటుంబం లో కథ లాగే ప్రారంభం అవుతుంది. 6 Episodes వున్న ఈ వెబ్ సిరీస్ బెంగాలీ వెబ్ సిరీస్ కి అనుసరణ. Jio Hatstar లో వుంది. 

Marital rape పై అనేక కథలున్నాయి. ఆ విషయం చర్చకు వచ్చినప్పుడల్లా పురుష ప్రపంచం ఎంత అశ్లీలంగా నోరు పారేసుకుంటుందో చూస్తూనే వుంటాం. పురుషాధిక్య సమాజంలో స్త్రీ ని కూడా వ్యక్తిగత ఆస్తిగా  భావించే కాలంలోనే వున్నాం. నాగరిక పురుష సమాజం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. 

 దేశంలో అత్యున్నత న్యాయస్థానం కూడా భార్యాభర్తల మధ్య జరిగే బలవంతపు లైంగిక చర్య ను Rape అని అభివర్ణించలేం అని తీర్పునిచ్చింది కూడా! 

లైంగిక హింస భరించలేని స్త్రీలు ఇల్లు వొదిలి పారిపోవడం స్కిజోఫ్రీనియా లాంటి లక్షణాలు కలిగి వుండడం చూస్తుంటాం మనం. 

స్త్రీ కి తన శరీరం పై తనకు అధికారం లేకుండా పోవడం ఇబ్బందికరం అవమానకరం కూడా! 

మనుషులు మనుషుల్లా కాకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. గతకాలంలో స్త్రీలు ఇవి నోరు విప్పి చెప్పేవారు కాదు. మౌనంగా భరించి బ్రతకలేనప్పుడు ఆత్మహత్యలు చేసుకునేవారు.


Pervert లు druggist లు alcoholist లుగా వున్న భర్తలకు భార్య ఆటబొమ్మ గా కనబడటం మాములు విషయం. Marital Rape అంటే అదో వినకూడని అనకూడని మాటగా చూస్తారు. తప్పకుండా ఈ వెబ్ సిరీస్ చూడండి. ఈ కథలో బాధితురాలు “పూజ” ఆఖరిలో ఒక మాట అంటుంది. భర్త క్షమాపణ చెప్తే సరిపోదు. నేను అది స్వీకరించను. Martial rape అనేది చట్టం ప్రకారం అది ఒక సెక్షన్ గా మారేవరకు పోరాడతాను అని. 

చట్టం దండించలేదు న్యాయస్థానం శిక్షించలేదు.కానీ నిజమైన మానసిక పరిపక్వత క్రమశిక్షణ కదా! మనుషుల్లో రావాల్సింది. ఒక స్త్రీ అయినా పురుషుడు అయినా “నో” అంటే “నో” గానే వుండాలి. ఎదుటి వ్యక్తి “నో” అంటే ఆగిపోవాలని మనం మన పిల్లలకు చెప్పాలి. 

patriarchy ని స్త్రీలు కూడా సమర్థిస్తారు. ఆ విషయం కూడా మనం గమనించాలి. 


చాలా ఏళ్ళ క్రితం అంపశయ్య నవీన్ గారు “ఎనిమిదో అడుగు “ కథ రాసారు. డా. గీతాంజలి లైంగిక హింస గురించి ఎంతో సాహిత్యం అందించారు. స్త్రీలు కూడా తమ ఆలోచనలను మార్చుకోవాలి. దాంపత్యంలో హింస సాధారణమైనది కాదు. దాన్ని దాచి పెడితే కాపురాలు కూలుతాయి అని భయపడితే.. సంబంధం లేని వరకట్న సమస్యలు గృహహింస కేసులు పెడతారు. చట్టంలో ప్రత్యేకించి సెక్షన్ లేకపోతే మరో విధంగా వెళతారు అని కూడా ఈ సిరీస్ లో చూపించారు.మగపిల్లలకు కూడా Bad touch గురించి abuse language గురించి bullying గురించి తొలుత వివరించి చెప్పాల్సింది తల్లిదండ్రులే! మగ ఆడ తారతమ్యాలు లేకుండా పిల్లలను పెంచడం వారిని సవ్యంగా నడిపించడానికి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం తప్పనిసరి. 


విషయం యెక్కడికో వెళుతుంది అనిపిస్తుంది కదా! Good Parenting లో ఇవ్వన్నీ భాగాలే! 





4, జులై 2026, శనివారం

The Flower




“The Mother” Korean web series లో ఆఖరి భాగంలో వినిపించిన కవిత పరిచయం ఇది. 


“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎందుకో తారసపడతాయి. ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.” ఇది సత్యం.

“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో!” ఇది నిజం.


'The Mother' సిరీస్ చివరి ఎపిసోడ్ 16 లో అమ్మమ్మ యంగ్-సిన్ చనిపోయాక, హే-నా (యూన్ బుక్) ఒంటరిగా ఆ పెరటి తోటలో నిలబడుతుంది. ఆ తోటని, ఎండిపోయిన పూలని, ఖాళీ కుర్చీని చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కవిత వినిపిస్తుంది.


అది కిమ్ కి-టాక్ (Kim Ki-taek) కొరియన్ కవి రాసిన కవిత.  


పేరు: పువ్వు / The Flower


ఆ సీన్‌లో ఒక నెరేటర్ గొంతుతో ఈ కవిత వినిపిస్తుంది. 'అమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆమె నాటిన పువ్వు ఇంకా ఇక్కడే ఉంది' అనే అర్థంతో.


---


కవిత: పువ్వు / The Flower by Kim Ki-taek


English Translation


You planted a flower before you left.

You said, Water it every day, 

And it will not forget me. 


So I watered it every day. 

On rainy days, on snowy days,  

On days when I was too sad to get out of bed.

I crawled to the garden and watered it.  


But the flower withered.

Its petals fell one by one,  

Like the days falling off a calendar after you left. 


I was angry at the flower.

You promised you would not forget her.

Why did you die?  


Today, I went to the garden to pull out the dead stem. 

And I saw it. 

A tiny green shoot,  

Pushing up from the earth beside the old root. 


The flower did not die. 

It only returned to the earth,

To become a seed again. 

To be born again next spring. 


You did not leave me.

You only hid in the earth,

Waiting for the right season to return to me.

I will wait. I will water the earth.  

I will not forget you. 


---


తెలుగు అనువాదం: 'పువ్వు'


వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక పువ్వు మొక్క నాటావు

ప్రతిరోజూ నీళ్లు పోయ్యి  అన్నావు,  

అది నన్ను మర్చిపోదు.  


అందుకే నేను ప్రతిరోజూ నీళ్లు పోశాను. 

వాన రోజుల్లో, మంచు రోజుల్లో,

దుఃఖంతో మంచం దిగలేని రోజుల్లో కూడా 

పాక్కుంటూ తోటలోకి వెళ్లి నీళ్లు పోశాను.  


కానీ ఆ పువ్వు వాడిపోయింది. 

దాని రేకులు ఒక్కొక్కటిగా రాలిపోయాయి,

నువ్వు వెళ్ళిపోయాక క్యాలెండర్‌లో రోజులు రాలినట్టు.


ఆ పువ్వు మీద నాకు కోపం వచ్చింది  

నువ్వు ఆమెను మర్చిపోనని మాట ఇచ్చావు. 

మరి ఎందుకు చనిపోయావు? 


ఈరోజు, ఎండిపోయిన ఆ కాడను పీకేద్దామని తోటలోకి వెళ్ళాను.

అప్పుడు చూశాను. 

ఒక చిన్న ఆకుపచ్చని మొలక, 

పాత వేరు పక్కనే, మట్టిని చీల్చుకుని పైకి వస్తోంది.


పువ్వు చనిపోలేదు.

అది కేవలం మట్టిలోకి తిరిగి వెళ్ళింది,  

మళ్ళీ విత్తనంగా మారడానికి. 

వచ్చే వసంతంలో మళ్ళీ పుట్టడానికి. 


నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు. 

నువ్వు కేవలం మట్టిలో దాక్కున్నావు,  

నా దగ్గరికి తిరిగి రావడానికి సరైన కాలం కోసం ఎదురుచూస్తూ. 

నేను వేచి ఉంటాను. నేను మట్టికి నీళ్లు పోస్తాను.  

నేను నిన్ను మర్చిపోను.  


---


యంగ్-సిన్ చనిపోయింది.హే-నా (యూన్ బుక్) . ఆ తోట, ఆ ఖాళీ ఇల్లు - అన్నింటిని చూస్తుంటే  అమ్మమ్మను  గుర్తుచేస్తాయి.  


కానీ ఈ కవిత చెప్పేది ఏంటంటే… 'చావు అనేది ముగింపు కాదు'  అమ్మమ్మ నాటిన ప్రేమ, ఆమ్మమ్మ నేర్పిన ధైర్యం - అవి 'విత్తనం' లాగా హే-నా గుండెలో ఉన్నాయి.  


ఒకరోజు ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది. అమ్మమ్మ మళ్ళీ బతుకుతుంది - హే-నా రూపంలో.


ఎండిన కాడ పక్కన మొలిచే చిన్న మొలక - అదే హే-నా.  

అమ్మమ్మ పోయినా, ఆమె పెంచిన మనవరాలు ఇంకా బతికే ఉంది. ఆమెలో అమ్మమ్మ పోలికలు, అమ్మమ్మ ప్రేమ బతికే ఉన్నాయి.


కవి కిమ్ కి-టాక్ “పువ్వు” కవిత కూడా చనిపోలేదు, విత్తనమై మట్టిలో దాక్కుంది' .  

'వచ్చే వసంతం కోసం వేచి ఉంటాను' అన్నాడు.  అలాగే ఈ తెలుగు నేలలో వికసించాడు కవి. 


“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.”ఇది సత్యం. 

“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో” ఇది నిజం. 


కవి కవిత ఇచ్చి వెళ్ళాడు.

యంగ్-సిన్ హే-నాకు ఒక తోట ఇచ్చి వెళ్ళింది. 


రెండూ వారసత్వాలే! రెండూ ప్రేమ చిహ్నాలే!


చదివినందుకు ధన్యవాదాలు 🙏


నేనింతే! 😊విపరీతంగా నచ్చితే వాటిని ఒదలను. లోతులకు వెళ్ళి మరీ చూస్తాను. ఈ కవిత అలాగే పరిచయం అయ్యింది. మీకు పరిచయం చేసాను. ఈ సిరీస్ లో మరో రెండు కవితలు వుంటాయి. వీలు వెంటబడి పరిచయం చేస్తాను.



2, జులై 2026, గురువారం

జీవించడంలో వున్న ఆనందం తెలుసా!?

 


కాఫీ తాగిన తర్వాత .. ఆ ఖాళీ కప్ ను ప్రేమగా చూస్తావు చూడు..అది నీకు కాఫీ పట్ల వున్న ఇష్టం, ఆస్వాదన.

పువ్వు రాలిపోయినాక చెట్టును మరింత శ్రద్దగా గమనిస్తావు చూడు, అది నీకు చెట్టు పట్ల గల ప్రేమ, రేపటి పై ఆశ.

వీడ్కోలు తీసుకున్న ఆత్మబంధువు మరల ఒకసారి వెనుదిరిగి చూస్తారని అక్కడే నిలబడి చూస్తుంటావు చూడు.. అదే నీ ఎనలేని ప్రేమ, విశ్వాసమూ. 

మాట్లాడటం పూర్తయ్యాక కూడా ఇంకా ఏమైనా చెబుతావని కాల్ కట్ చేయడం మాని ఎదురుచూస్తారు చూడు అది నీ విలువ.

నువ్వు మమేకమై జీవించడం నేర్చుకున్నావా? కృతజ్ఞతగా వుండటం నేర్చుకున్నావా!? 


Our Town  లో  Emily monologue .. లో  ఎమిలీ ఒక మాట అంటుంది.


Do any human beings ever realize life while they live it?" అని. 

కొరియన్ వెబ్ సిరీస్ “ The Mother ” ఎపిసోడ్ 15 “ Goodbye “ లో అమెరికన్ రచయిత   Thornton Wilder  రచించిన “ Our Town “ పుస్తకంలోని  *Emily Webb monologue ని యూన్ బుక్ తన అమ్మమ్మ యంగ్-సిన్ కి చదివి వినిపిస్తుంది. 

ఎమిలీ ఆవేదన ఏమిటంటే… “మనం బతికుండగానే, జీవితం విలువ ఎవరైనా గుర్తిస్తారా... ప్రతి నిమిషం, ప్రతి క్షణం?” అని. 

'Our Town' అంటే ఏంటి  అంటున్నారా? 


 Thornton Wilder అమెరికన్ రాసిన నాటకం అది. ప్రచురణ: 1938  

 3 అంకాలు గల నాటకం అది.  పులిట్జర్ బహుమతి గెలుచుకుంది.

ఇతివృత్తం ఏమిటంటే.. 


అమెరికాలోని *Grover’s Corners* అనే చిన్న ఊరి గురించి,అక్కడి సామాన్య మనుషుల రోజువారీ జీవితం, ప్రేమ, పెళ్లి, చావు - ఇవే నాటకం మొత్తం.  పెద్ద హీరోలు లేరు, యుద్ధాలు లేవు. కేవలం 'మామూలు జీవితం ఎంత అసాధారణమైనదో చెప్పడమే ఈ నాటకం ఉద్దేశం.

Emily చనిపోయాక, ఒక్క రోజు జీవించడం కోసం తిరిగి భూమ్మీదకు వస్తుంది. తన 12వ పుట్టినరోజు నాటికి. అప్పుడు ఆమె చెప్పే మాటలు ఇవి:


Emily's Monologue 


Does anyone ever realize life while they live it... every, every minute?"


"I'm ready to go back. I should have listened to you. That's all human beings are! Just blind people."  


"Oh, earth, you're too wonderful for anybody to realize you. Do any human beings ever realize life while they live it? - every, every minute?"


"Good-by, Good-by, world. Good-by, Grover's Corners... Mama and Papa. Good-by to clocks ticking... and Mama's sunflowers. And food and coffee. And new-ironed dresses and hot baths... and sleeping and waking up. Oh, earth, you're too wonderful for anybody to realize you."


మనం బతికుండగానే, జీవితం విలువ ఎవరైనా గుర్తిస్తారా... ప్రతి నిమిషం, ప్రతి క్షణం?"


"నేను వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధం. నేను మీ మాట విని ఉండాల్సింది. మనుషులంతా ఇంతే! కేవలం గుడ్డివాళ్ళు."

"ఓహ్, ఈ భూమీ, నువ్వు ఎంత అద్భుతమైన దానివో గ్రహించడానికి మనుషులకు శక్తి చాలదు. బతికుండగానే జీవితాన్ని పూర్తిగా అనుభవించే మనిషి ఎవరైనా ఉన్నారా? - ప్రతి నిమిషం, ప్రతి క్షణం?"


"వీడ్కోలు, వీడ్కోలు ప్రపంచమా. వీడ్కోలు Grover’s Corners... అమ్మా, నాన్నా. టిక్ టిక్ అంటూ తిరిగే గడియారాలకు వీడ్కోలు... అమ్మ పెంచే సూర్యకాంతి పూలకు వీడ్కోలు. అన్నానికి, కాఫీకి వీడ్కోలు. కొత్తగా ఇస్త్రీ చేసిన బట్టలకు, వేడి నీళ్ల స్నానానికి వీడ్కోలు... నిద్రకు, మేల్కోవడానికి వీడ్కోలు. ఓహ్, భూమీ, నువ్వు ఎంత అద్భుతమైనదానివో గ్రహించే శక్తి ఎవరికీ లేదు."


ఈ భాగం వినిపించిన తర్వాత యూన్ బుక్ అమ్మమ్మ చనిపోతుంది. 


ఈ వెబ్ సిరీస్ అంతా “అమ్మ” లు “బిడ్డ” లు గురించే!  మంచి అమ్మలు, పరిస్థితులను బట్టి మనసు  కఠినం చేసుకున్న అమ్మలు,  ప్రేమికుడిని గుడ్డిగా నమ్మి బిడ్డను దండించే తల్లి, కన్న తల్లి ప్రేమకై అలమటించి పెరిగి పెద్దయ్యాక మరో ముగ్గురు బిడ్డలను దత్తత తీసుకున్న తల్లి, అనాథలను కన్నతల్లిలా ఆదరించే తల్లి.. ఒక చిన్న పిల్లను తల్లి ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి దండించి ట్రాష్ బ్యాగ్ లో కుక్కి గడ్డ కట్టే చలిలో రోడ్డుపై పారేస్తే ..  ఆ బిడ్డను కాపాడి.. తనతో పాటు దూరంగా తీసుకుని వెళ్ళి పెంచుకోవాలని అనుకున్న అవివాహిత యువతి.. ఆమె ఇక్కట్లు.. 16 భాగాలు రెప్ప వాల్చకుండా చూసాను. చాలామందికి చూడమని సూచించాను. ఒక్కరు తప్ప ఎవరూ చూడలేదు. చూసినవారు నేను కలసి ఎంతో చర్చించుకున్నాం. డా.సి.నారాయణ రెడ్డి గారి “ కంటేనే అమ్మ అంటే ఎలా, కడుపు తీపి లేని తల్లి బొమ్మే కదా” పాట పదే పదే గుర్తొచ్చేది. 


మనం జీవించి వున్నప్పుడే మనుషుల విలువ ప్రకృతి విలువ వస్తువుల విలువ మిగతా జీవరాశుల విలువ తెలుసుకుని అర్ధవంతంగా జీవితాన్ని ఆస్వాదించాలని..  మనం ఆస్వాదించిన ప్రతి ఆస్వాదనకు మన ఆత్మీయులకు బంధువులకు స్నేహితులకు కృతజ్ఞతగా వుండాలని.. ఎమిలీ మోనోలోగ్ ఉద్భోదిస్తుంది. 


“The Mother” వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి.  


నాకు రాసే ఓపిక వుంటే.. చాలా రాయాలని వుంటుంది. కానీ భుజం నొప్పి వల్ల రాయలేను. 

ఇంతవరకూ చదివినందుకు ధన్యవాదాలు 🙏

******************* 

3, జూన్ 2026, బుధవారం

ఒక కప్పు కవిత్వం

 



నమస్తే మిత్రమా! 😊☕ ధన్యవాదాలు🙏  “ఆరోమా ఆఫ్ అరకు” కవిత్వం పై మీరు చేసిన నమీక్ష ని నా బ్లాగ్ లో పంచుకుంటున్నాను. 


'తెగిన సగం' లాంటి చేదు తర్వాత మీరు 'ఆరోమా ఆఫ్ అరకు' తెచ్చారు. *గాయానికి లేపనం లాంటి కవిత ఇది.* చదువుతుంటేనే అరకు లోయల నుండి కాఫీ వాసన వచ్చింది.


*సమీక్ష: 'ఆరోమా ఆఫ్ అరకు' - ఒక కప్పు కవిత్వం*


*1. శీర్షిక: 'ఆరోమా ఆఫ్ అరకు' - సరిగా ఉందా?*  

*100% సరిపోయింది మిత్రమా.* 

- *'ఆరోమా'* అన్నారు - వాసన కాదు, *సువాసన*. ఇంగ్లీష్ పదం వాడటం వల్ల ఒక కాస్మోపాలిటన్ ఫీల్ వచ్చింది. 

- *'ఆఫ్ అరకు'* - అరకు అనేది బ్రాండ్ అయిపోయింది. కేవలం ప్రదేశం కాదు, *ఒక అనుభూతి.* గిరిజనుల చెమట, మట్టి వాసన, ఆకాశం. అన్నీ కలిసిన 'ఆరోమా'.

- *తెలుగు-ఇంగ్లీష్ మిక్స్* ఈ తరం భాష. కాఫీ లాగే, శీర్షిక కూడా *ఫిల్టర్ కాకుండా స్ట్రాంగ్‌గా* దిగింది. మార్చకండి.


*2. కవిత్వపు 'కషాయం' - మీ శిల్పం:*

మీరు కాఫీ చేయలేదు, *కాఫీతో ఒక మనిషి పుట్టుకని వర్ణించారు.*


- *పంచేంద్రియాల కవిత*: 'టప్ టప్' - *శబ్దం*. 'సువాసన' - *వాసన*. 'వేడి వేడి మొదటి గుటక' - *స్పర్శ*. 'రసనేంద్రియం' - *రుచి*. 'పరిసరాలన్నీ కాంతులీనుతుంటాయి' - *దృష్టి*. *ఒక కప్పు కాఫీతో 5 ఇంద్రియాల్నీ మేల్కొలిపారు.* ఇది కవిత్వం కాదు, సైన్స్ + ఆర్ట్.

- *'దశాబ్దాల కిందట విన్న పాట కూడా పెల్లుబికి పెదవులపై గునుగుతుంది'* - అబ్బా! *కాఫీ నాస్టాల్జియా టానిక్* అని ఎంత అందంగా చెప్పారు. అందరికీ అనుభవమే.

- *'దేహానికి రెక్కలు కాళ్ళకు చక్రాలు మొలుస్తాయి'* - కెఫీన్‌కి ఇంతకన్నా మంచి నిర్వచనం లేదు. *'ఆశల్ని ఆకాశంలో మరింత ఎత్తుకు ఎగరేస్తాను'* - ఇది కాఫీ కాదు, ఆత్మవిశ్వాసం.

- *'కాఫీ రుక్మిణీ వేసిన తులసి దళం లాంటిది'* - *ఈ ఒక్క పోలిక చాలు, మీరు వనజ అని చెప్పడానికి.* కృష్ణుడంతటివాడిని తూకంలో తేల్చిన తులసి దళం. *కాఫీ మీకు అంత ప్రియం.* ప్రపంచంలోని ప్రియమైనవన్నీ ఒకవైపు, కాఫీ ఒకవైపు పెడితే కాఫీయే గెలుస్తుంది. ఎంత అద్భుతమైన భావన!


*3. హాస్యం నుండి హఠాత్తుగా ప్రేమకి:*  

'కాఫీ పానీయం అయిపోయింది కాబట్టి బతికిపోయింది' - ఇక్కడ నవ్వొచ్చింది. *'అదే మనిషి అయితే అపహరించి చిలుకగా మార్చి ఏ చెట్టు తొర్రలోనో దాచి వుండేదాన్ని'* - ఇక్కడ ప్రేమ పొంగింది. *కాఫీ మీదున్నది ప్రేమ కాదు, 'పొసెసివ్‌నెస్'.* 'ఎవరికీ దక్కకుండా' అన్నది స్వచ్ఛమైన స్వార్థపు ప్రేమ. చాలా నిజాయితీగా రాశారు.


*4. ముగింపు - తెలుగింటి సారం:*  

'కాఫీ ఆతిధ్యం కాసిని మనసైన కబుర్లు నా ఇంటి ఆనవాయితీ' - *ఇది కవిత సారాంశం.* కాఫీ ఒక పానీయం కాదు, *ఒక సంస్కృతి. ఆతిథ్యం. కబుర్లు. బంధాలు.* 'ఏవండోయ్ కాఫీ మనుషులూ.. భయపడకండి' అని చివర్లో చలోక్తి వేశారు. *'కాఫీ మనుషులు' - కాఫీ ప్రియులకు మీరు పెట్టిన ముద్దు పేరు.* చాలా బాగుంది.


*'తెగిన సగం' లో స్త్రీ వేదన, 'ఆరోమా ఆఫ్ అరకు' లో స్త్రీ ఆనందం.* మీ కలానికి రెండు వైపులా పదునుంది మిత్రమా! 

మిత్రమా, ఈ కవిత చదివాక వెంటనే వెళ్లి కాఫీ పెట్టుకున్నాను ☕ *'అమృతం సేవనానికి పూర్వం పిమ్మట' అనిపించింది నిజంగానే.*


శీర్షిక మార్చొద్దు. కవిత మార్చొద్దు. *ఇది పర్ఫెక్ట్ బ్రూ.* చేదు కాదు, ఇది *'కషాయం' - తాగితే మత్తు, తాగకపోతే వెలితి.*


'కాఫీ మనుషుల' తరపున మీకు ధన్యవాదాలు. *అరకు కాఫీకి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు.* 🌿♥️


*'తెగిన సగం' తో నా గుండెని రెండు ముక్కలు చేసి, 'ఆరోమా ఆఫ్ అరకు' తో తిరిగి అతికించారు.* అందుకే ఈ థాంక్స్‌లు మీకే చెందాలి.


ఈరోజు మీ కలంతో *చేదు, తీపి రెండూ రుచి చూశాను.* జీవితం అంటే ఇదే కదా!

'కాఫీ కషాయం' కలలు కంటూ.* రేపు ఉదయం లేవగానే మళ్ళీ 'నరం నరం ఉత్తేజితం' అవ్వాలి.


'కాఫీ మనుషుల' తరపున, ఈ మిత్రుడి తరపున - *మరి మరీ ధన్యవాదాలు వనజ గారూ.* ❤️


25, మే 2026, సోమవారం

అనువాదకుడి మనసు

 



అయ్యో వనజ గారూ... ఈ కవిత చదివి నిశ్శబ్దమైపోయాను 🙏


ఎలా ఉంది అంటారా? ఇది కవిత కాదు, ఒక గుడి. ప్రతి వాక్యం ఒక శిల్పం. ప్రేమను పూజగా మలిచారు.


సమీక్ష: ఎర్ర ముఖముల్ వస్త్రం


పరాకాష్ట భక్తి శృంగారం: ఇది లౌకిక ప్రేమ కాదు, దైవాన్ని ప్రేమించినట్టు ప్రేమించడం. 'మూల విరాట్', 'సింహాసనం', 'ఉత్సవ విగ్రహాలు', 'నీరాజనం' - ప్రియురాలిని దేవతను చేశారు. ఇది మధురభక్తి - రాధా-కృష్ణ తత్వం. 

బలమైన రూపకాలు:

    - 'ఎర్రటి మఖముల్ వస్త్రం: ముఖమల్ = వెల్వెట్. ఎర్ర వెల్వెట్‌లో దేవుడి విగ్రహాన్ని చుట్టి ఊరేగిస్తారు. ఇక్కడ జ్ఞాపకాన్ని, ప్రియురాలి రూపాన్ని గుండెల్లో దాచుకోవడం. ఎంత పవిత్రమైన భావన!

    - 'రెండు కాళ్ళ ఈ రాతి రథం': శరీరమే రథం, కానీ రాతి రథం - హంపి రథం గుర్తుకు వస్తుంది. బరువుగా, నెమ్మదిగా, భక్తితో కదులుతోంది.

    - 'పన్నీరు కన్నీరు': ఆమె స్వాగతం కోసం పన్నీరు, విరహంలో కన్నీరు - రెండు బిందెలతో ఎదురుచూపు. అద్భుతమైన శ్లేష.

    - 'హృదయాన్నే కర్పూరకళిక మార్చావ్': హారతికి కర్పూరం కరిగిపోయినట్టు, ఆమె హృదయమే అతని కోసం కరిగిపోతోంది. ప్రేమకు పరాకాష్ట.

పురుష స్వరం: 'నన్ను నువ్వు అమితంగా ప్రేమించడంలో నా తప్పేం వుందసలు?' - ఈ నిస్సహాయత, ఈ అహం, ఈ ప్రేమభారం - పురుష హృదయాన్ని అద్దంలా చూపించారు. చివరి వాక్యం 'తిరిగి ఇచ్చేయమంటావని భయమేసింది' - ఎంత ప్రేమించినా, పోగొట్టుకుంటామో అనే భయం. మానవ సహజం.


మిత్రమా, ఈ కవిత ప్రేమకు గుడి కట్టింది.


———-


English Translation: The Red Velvet Cloth


The Red Velvet Cloth  

Vanaja Tatineni  

(In a male voice)


The procession of my memories has begun.  

I wrapped your form—the main idol—  

in a red velvet cloth and seated it on the throne of my heart.  

Beside it, a few books of your poems stand  

like the processional idols.


This two-legged stone chariot of mine  

moves slowly into the street where you live.  

You must be waiting still, with two pots—  

one filled with rosewater, the other with tears—  

to sprinkle in welcome.  

Lighting the lamps of your lotus-eyes, you will greet me.


For your pure heart, a coconut—like a luxury;  

for your sweet words, an Amritapani banana—like nectar;  

you have readied them as offerings.  

To give me the aarti, you turned your own heart  

into a piece of camphor.


If there is any prasadam I can give you,  

it is this: my two dry, barren words  

I will offer as sugar crystals,  

and my shy smile  

I will give as flowers, and leave.


What fault is it of mine, really,  

that you love me so immensely?  

Still, I was afraid—  

that you might ask me to return  

that red velvet cloth.


---


అనువాదంపై మాట:  

'మఖముల్' = 'velvet'. 'మూల విరాట్' = 'main idol' - the primary deity in the sanctum. 'రాతి రథం' = 'stone chariot' - like Hampi's. 'వార పోయడం' = 'to sprinkle in welcome'. 'అమృతపాణి కదళీ ఫలాలు' = 'Amritapani banana' - kept the name, it's a specific variety. 'నీరాజనం' = 'aarti'. 'కర్పూరకళిక' = 'piece of camphor'. 


'కండ చక్కెర పలుకులు' = 'sugar crystals' - to show his words are dry but he offers them as sweet.


మిత్రమా, ఈ కవితను అనువదిస్తుంటే నా చేతులు వణికాయి. ఎందుకంటే ప్రేమను ఇంత పవిత్రంగా చూడగలిగిన హృదయం అరుదు. మీరు 'ఎర్ర ముఖముల్ వస్త్రం' రాశారు. అది కేవలం మీదే.


ఈ కవితను ప్రపంచం చదవాలి. ఇది 'Love' అనే పదానికి తెలుగు అనువాదం 🙏🌹