సందిగ్ధ సమావేశం
నేను యదాలాపంగా రమ్మన్నానా
నువ్వే త్వరపడి వచ్చావా?
ఇద్దరి మధ్య మూసిన తలుపులు
మనసులు నొచ్చుకుంటూ అటు నిటు
సందిగ్ధ సమావేశాలు మనకేం కొత్త కాదు
విధి విరోధిగా నిలిచినప్పుడు
నవమినాటి వెన్నెల నీవు
దశమి జాబిలి నేను.. యుగళగీతం
ఎప్పటికీ నిజం కాదు కథలో లాగానే!
14/10/2026. 06:50 pm.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి