29, అక్టోబర్ 2026, గురువారం

ఆంతర్యం

 


ఆంతర్యం. - వనజ తాతినేని 


నాకు నేను తప్ప వేరొకరు పొసగరు 

అంత స్వేచ్చా పిపాసిని

అందుకే నువ్వు కూడా 

అనుకోని అతిథి వి

అది కూడా క్షణాలో నిమిషాలో 


 బాహ్యంగా సమయాన్ని వేరొకరికి పంచడంలో 

బహు పిసినారులం మనం

అంతఃహృదయాన సమయాన్ని 

లూఠీ చేయడంలో మనని మించి  

నేర్పరులు యెవరుంటారు!?


క్షణాల అతిథి వచ్చి యుగాల దోపిడీ 

చేయడం అంటే యిది కాదూ! 


28/10/2026. 07:50 pm. 


కామెంట్‌లు లేవు: