8, అక్టోబర్ 2026, గురువారం

శిధిల ప్రేమ

 



శిధిల ప్రేమ - వనజ తాతినేని 


నా యిష్టాన్ని అయిష్టంగా చూస్తావ్

నా అభిప్రాయాలను విరుద్దంగా లెక్కిస్తావ్

మొత్తంగా పూర్తిగా తిరస్కరిస్తావ్ 

అది నీ హక్కు, కాదనను


నీ అయిష్టాన్ని నీ వైరుధ్యాన్ని నేను గౌరవిస్తాను

నీ తిరస్కారాన్ని ఆమోదించగలను. 

ఎవరికి యెవరూ యేమీ కానప్పుడు 

ఎందుకు ప్రకటన చేస్తారు చెప్పు? 


ప్రేమ సామ్రాజ్యాన్ని ఒంటిగా నిర్మించగలరు

కానీ కూల్చలేరు. శిధిలాలయంలో నైనా

ఎవరు శాశ్వతంగా వుండబోతారు

కాస్త ముందు వెనుక అంతే కదా ప్రియతమా!




ఇంగ్లీష్ అనువాదం:


 RUINED LOVE  - Vanaja Tatineni 


You see my liking as dislike

You count my opinions as opposition

You reject me totally, completely

That is your right, I won't deny.


I respect your dislike, your opposition

I can accept your rejection.

When no one belongs to anyone in this world

Why make a public announcement, tell me?


One can build an empire of love all alone

But cannot demolish it alone. Even in its ruins

Who is going to stay forever?

It's just a matter of sooner or later, isn't it, my dear!


08/10/2026. 09:05 am


కామెంట్‌లు లేవు: