హృదయానికి దగ్గర దారి -వనజ తాతినేని
రాజప్రాసాదం పై చంద్రుడు వడివడిగా ఊరేగుతున్నాడు.
కోటగోడలపై నుండి ఊరేగుతున్న చంద్రుడిని చూస్తూ ..
అంతఃపురం లోని 27గురు రాచకన్యలు కోట గుమ్మాలకు
ఆనుకుని ఘడియలు లెక్కెట్టుకుంటున్నారు.
జంట చకోర పక్షులు వెన్నెలను తాగుతూ విహరిస్తూ ఉన్నాయి
మతిస్థిమితం కోల్పోయిన విరహిణిలు కొందరు
లాంతరు చేత ధరించి పతిని వెతుక్కుంటూ బయలుదేరితే
మరికొందరు బాట వెంబడి కాపుగాసారు
ఎవరికివారు తమ కౌగిలిలో బంధించాలని.
రోహిణి మాత్రం తన ప్రేమనంతా వెన్నెలగా జేసి
పతి కార్యంలో తాను పాలుపంచుకుని
శరత్పూర్ణిమను మరింత శోభాయమానంగా మార్చింది.
పతి హృదయానికి దగ్గర దారి కనిపెట్టి.
తత్పూర్వ సూర్యోదయమే
పతి ఇష్టసఖి చెట్టాపట్టాలేసుకుని
నిశీధి గృహానికి తరలిపోయారు.
English Translation
*The Shortest Way to the Heart - Vanaja Tatinani*
The moon parades swiftly atop the palace,
Watching the moon parading over the fort walls,
Twenty-seven royal daughters in the inner chambers,
Lean against the fort gates, counting every moment.
A pair of Chakora birds sip the moonlight and soar,
Some lovelorn women, having lost their minds,
Set out with lanterns in hand, searching for their lord,
While others lie in wait along his path,
Each wanting to bind him in her own embrace.
But Rohini alone,
Turned all her love into moonlight,
Partook in her lord's own work,
And made the autumn full moon night even more resplendent.
Having found the closest path to her lord's heart.
And before the sunrise,
Hand in hand with her lord's dearest friend,
She walked away into the house of night.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి