నీ ధ్యాసలో -వనజ తాతినేని
వేలాది రోజులుగా
అనారతము నీ ధ్యాసే
హృదయంలో రాత్రి
నీవు నిదురించాకనే నా నిద్ర
నిత్యం చీకటి విచ్చింది
పువ్వులు విరిసినవి
చలువ తెమ్మెర నను తాకింది
ఉషస్సు నను తడిపింది
అయినను నువ్వు యెదురు పడవు
చితాగ్ని తరుణానికైనా వస్తావా?
*********
అనుగ్రహం - వనజ తాతినేని
భగవదనుగ్రహం కొరకు కొందరు
గిరి ప్రదక్షిణలు చేయుచున్నారు
చిక్కని తలపులతో నేను నీ ప్రదక్షిణ చేస్తున్నాను
కాలహరణం చేయకుండా అనుగ్రహించు
కలకాలం కౌగిలిని కోరను నేను
విడిపోతూ తలుస్తూ కలుస్తూ
అనుభూతితో జీవిస్తాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి