ఆంక్షలు యెరుగని ప్రేమ
నువ్వెందుకు నా నుండి దూరంగా పారిపోయి
మొక్కలకు జంతువులకు ప్రేమను ధార పోస్తావు
ఆ పాటి ప్రేమకు నోచుకోలేదా నేను?
అవునులే, ఒప్పందాన్ని గౌరవించని నువ్వు
నా ప్రేమకు మాత్రం యెందుకు పట్టాభిషేకం చేస్తావు
ఆంక్షలు యెరుగని ప్రేమ నీది
***********
గుదిబండలు
ఒకోసారి ఒప్పందాలు గుదిబండలు
ఆ ఒప్పంద పత్రాలపై సంతకాన్ని కన్నీటితో తుడిపేస్తాను
వెనక్కి వచ్చేయ్ ప్రియా!
కాగితాలపై ప్రేమ లిఖించి వుండదని నీకూ తెలుసు
అయినా బెట్టు పోతావు
నాకు తెలుసులే!
నా రాతల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని నీ పన్నాగం.
*********
తుఫానులో నావ
నేను యోగి గా నైనా మారకపోతిని
పిచ్చివాడిని అయినా కాలేక పోతిని
నీ స్మరణలో చిక్కి శల్యం కాకుండా.
తుఫానులో చిక్కుకున్న నావను నేను



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి