24, అక్టోబర్ 2026, శనివారం

దీపధారి

 


దీపధారి


మన ప్రేమ సరిహద్దులు లేని ఆకాశంలోని రూపాలు

స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణలెన్నింటినో జయించి

సహానుభూతి నుండి జనియించి,

అవగాహన, దయ, కరుణ అనే ముప్పేటలా అల్లుకుని

ప్రేమగా పరిఢవిల్లింది.


ఏ దోషమో, ఆరోపణో అంటని మన హృదయాలలో

అమృతభాండం ఉంది.

మనమేమీ ఇంద్రజాలం చేయడం లేదు,

స్వీయ జీవితాలకు కాంతినిచ్చుకుంటూ,

పరస్పరం కాంతిని పంచుకుంటూ

దీపధారిగా ఉన్నాం.

జీవితాన్వేషణలో ఇంతకు మించి ఏం దొరకాలి!?


24/10/2026. 07:50 pm.


కామెంట్‌లు లేవు: