మనం ఒకొరినొకరు ఓడించుకోవడంలో
ప్రావీణ్యం సంపాదించాం
ప్రేమను గెలిపించడానికి.
అనుభవంలోనికి రానిది
వ్యర్థం అంటారు కదా!
రేయింబవళ్ళు వ్యర్థం లో అర్ధాన్ని
సంపూర్ణ జీవిత మార్గాన్ని చెక్కుతున్నాం
శిల్పులు లాగా.
మఖ లో పుట్టి పుబ్బలో మాయమయ్యేది కాదు మన ప్రేమ.
గుహని వెలిగించే దివ్వె. చరిత్రలో ఒక పుట.
16/10/2026. :02:20 am.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి