అనువాద కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనువాద కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, సెప్టెంబర్ 2026, బుధవారం

కాలము - ప్రేమ

 కాలము - ప్రేమ


క్షణికమైన కోపానికి నిరంతరం 

బానిసగా నిలిచిన దౌష్ట్యానికి 

అఖండమైన గోపురాలు

నేలమట్టమైనప్పుడు


శిధిలమై సమాధిపైన యుగపు 

గర్వకారణాలైన విలువలు

క్రూరమైన కాల హస్తాన నలిగి

వికృతమవడం నే చూసినప్పుడు 


ఆకలిగొన్న సాగరుని కెరటాలు

తీరాన్ని కబళింప చూస్తుంటే

అంచులు అఖండాన్నే గెలుస్తూ

నష్టాన్ని విలువతో విలువను నష్టంతో

వృద్ధి చేస్తూ నిరంతరం పోరాటం 


పరిస్థితులు స్థానాలను మార్చుకోవడం

స్థితిక్షీణతలోకలగాపులగంగా 

కలిసిపోవడం నేను చూసినప్పుడు


నా ప్రేమను నానుండి విడదీసే

సమయం రాబోతుందని

గతాన్ని అలా నెమరువేయమని

నేర్పింది నాకు సర్వనాశనం 


కానీ.. 

కాంక్షించేదాన్నివొదులుకునే

రోజు వస్తుందనే రోదన మినహా

కోరుకునే స్వాతంత్ర్యం ఇవ్వని

ఈ వేదాంతం చావుతో సమానం 



(షేక్స్పియర్  Time And Love కి స్వేచ్ఛానువాదం)

23, ఆగస్టు 2026, ఆదివారం

గడ్డి పరకలకూ గాయాలున్నాయి

 


కొన్ని వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అందులో పాత్రలు ఆ దేశ ప్రాంత సాహిత్యాన్ని.. ముఖ్యంగా కవిత్వాన్ని ఉటంకిస్తూ వుంటారు. అలా కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నేను విన్న చిన్న కవిత ఇది. అర్థవంతంగా వుంది అనిపించింది. 

అందుకే ఈ పరిచయం. 


famous poem by South Korean poet Jeong Ho-seung


English Translated by Brother Anthony and Susan Hwang 


Grass, Too, Has Its Bruises


స్వేచ్చానువాదం. 


గడ్డిపరకలకూ గాయాలున్నాయి,

పువ్వుల రెమ్మలకూ  గాయాలున్నాయి.

నీతో కలిసి నేను నడిచిన ఆ పల్లెటూరి దారిలో నడుస్తూ,

ఆ దారి పక్కన కూర్చుని సాయంకాలపు సంధ్యారాగాన్ని చూస్తున్నప్పుడు...

గాయాలపాలైన ఆ గడ్డిపరకలు 

తమ చేతులను ఊపుతూ మనల్ని పలకరిస్తాయి.

ఎన్నో గాయాలను మోస్తున్న ఆ పువ్వుల రెమ్మలే...

అత్యంత పరిమళభరితంగా సువాసనలను వెదజల్లుతాయి.


***********

Grass, too, has its bruises.

Petals, too, have their bruises.

Walking across a field that I used to walk with you,


I sit to watch the changing evening colors

as leaves of grass speckled with bruises wave their hands.

It's the petals with many bruises that have the sweetest scent.




20, ఆగస్టు 2026, గురువారం

The Voice

 


మన జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోయిన వారి గురించి ఎప్పుడో వొకప్పుడు దుఃఖిస్తాం. ఆ విషాద వీచికలు యెప్పటికీ అంటిపెట్టుకునే వుంటాయి. దూరమా మరీ దూరమా అనే కొలతలతో లెక్కించలేము. చదివిన మంచి కవిత వొకటి. 

The Voice

BY THOMAS HARDY


ఓ లలనా! నువ్వు ఎంతగానో గుర్తొస్తున్నావు, నన్ను ఎంతగా పిలుస్తున్నావో!

పిలుస్తున్నావో!

నా సర్వస్వంగా ఉన్న స్థితి నుండి మారిపోయినప్పటిలా  కాకుండా,

తొలినాళ్ళలో మన అనుబంధం సాగిన  రీతిలోనే

ఇప్పుడు ఉన్నానని చెబుతూ నన్ను పిలుస్తున్నావు.


నాకు వినిపిస్తున్నది నీ గొంతేనా? అయితే నిన్ను చూడనివ్వు,

నువ్వు నా కోసం వేచి ఉండే ఆ పట్టణానికి నేను చేరువైనప్పుడు

నువ్వు నా కోసం ఎక్కడ ఎదురుచూస్తావో అక్కడే

అవును, అప్పుడు నిన్ను చూసినట్టే,

ఆ నాటి లేత నీలి రంగు గౌనుతో సహా!


లేక అది కేవలం ఆ సోమరి గాలి మాత్రమేనా?

తడిసిన పచ్చిక బయలు దాటి నా చెంతకు వీచేది అది;

నీవు నిస్తేజంగా నిరాశలో పూర్తిగా కరిగిపోయి,

దూరంగా గానీ దగ్గరగా గానీ ఇక ఎన్నటికీ వినిపించకుండా పోయావా?


అందువలన నేను; తడబడుతూ ముందుకు సాగుతుండగా,

నా చుట్టూ ఆకులు రాలుతున్నాయి,

ఉత్తరం వైపు నుండి ముళ్ళ పొదల గుండా సన్నగా వీస్తున్న గాలి,

ఇంటామె నన్ను పిలుస్తోంది.


**********

(The Voice" ఒక ప్రసిద్ధ ఆంగ్ల కవిత్వం, దీనిని బ్రిటీష్ రచయిత థామస్ హార్డీ (Thomas Hardy) తన మొదటి భార్య ఎమ్మా గిఫోర్డ్ (Emma Gifford) 1912లో మరణించిన తర్వాత రాశారు. ఈ కవితలో భార్య మరణం తర్వాత హార్డీ అనుభవించిన తీవ్రమైన దుఃఖం, పశ్చాత్తాపం మరియు ఆమె జ్ఞాపకాలు స్పష్టంగా కనిపిస్తాయి.)


స్వేచ్ఛానువాదం. - వనజ తాతినేని 


4, జులై 2026, శనివారం

The Flower




“The Mother” Korean web series లో ఆఖరి భాగంలో వినిపించిన కవిత పరిచయం ఇది. 


“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎందుకో తారసపడతాయి. ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.” ఇది సత్యం.

“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో!” ఇది నిజం.


'The Mother' సిరీస్ చివరి ఎపిసోడ్ 16 లో అమ్మమ్మ యంగ్-సిన్ చనిపోయాక, హే-నా (యూన్ బుక్) ఒంటరిగా ఆ పెరటి తోటలో నిలబడుతుంది. ఆ తోటని, ఎండిపోయిన పూలని, ఖాళీ కుర్చీని చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కవిత వినిపిస్తుంది.


అది కిమ్ కి-టాక్ (Kim Ki-taek) కొరియన్ కవి రాసిన కవిత.  


పేరు: పువ్వు / The Flower


ఆ సీన్‌లో ఒక నెరేటర్ గొంతుతో ఈ కవిత వినిపిస్తుంది. 'అమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆమె నాటిన పువ్వు ఇంకా ఇక్కడే ఉంది' అనే అర్థంతో.


---


కవిత: పువ్వు / The Flower by Kim Ki-taek


English Translation


You planted a flower before you left.

You said, Water it every day, 

And it will not forget me. 


So I watered it every day. 

On rainy days, on snowy days,  

On days when I was too sad to get out of bed.

I crawled to the garden and watered it.  


But the flower withered.

Its petals fell one by one,  

Like the days falling off a calendar after you left. 


I was angry at the flower.

You promised you would not forget her.

Why did you die?  


Today, I went to the garden to pull out the dead stem. 

And I saw it. 

A tiny green shoot,  

Pushing up from the earth beside the old root. 


The flower did not die. 

It only returned to the earth,

To become a seed again. 

To be born again next spring. 


You did not leave me.

You only hid in the earth,

Waiting for the right season to return to me.

I will wait. I will water the earth.  

I will not forget you. 


---


తెలుగు అనువాదం: 'పువ్వు'


వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక పువ్వు మొక్క నాటావు

ప్రతిరోజూ నీళ్లు పోయ్యి  అన్నావు,  

అది నన్ను మర్చిపోదు.  


అందుకే నేను ప్రతిరోజూ నీళ్లు పోశాను. 

వాన రోజుల్లో, మంచు రోజుల్లో,

దుఃఖంతో మంచం దిగలేని రోజుల్లో కూడా 

పాక్కుంటూ తోటలోకి వెళ్లి నీళ్లు పోశాను.  


కానీ ఆ పువ్వు వాడిపోయింది. 

దాని రేకులు ఒక్కొక్కటిగా రాలిపోయాయి,

నువ్వు వెళ్ళిపోయాక క్యాలెండర్‌లో రోజులు రాలినట్టు.


ఆ పువ్వు మీద నాకు కోపం వచ్చింది  

నువ్వు ఆమెను మర్చిపోనని మాట ఇచ్చావు. 

మరి ఎందుకు చనిపోయావు? 


ఈరోజు, ఎండిపోయిన ఆ కాడను పీకేద్దామని తోటలోకి వెళ్ళాను.

అప్పుడు చూశాను. 

ఒక చిన్న ఆకుపచ్చని మొలక, 

పాత వేరు పక్కనే, మట్టిని చీల్చుకుని పైకి వస్తోంది.


పువ్వు చనిపోలేదు.

అది కేవలం మట్టిలోకి తిరిగి వెళ్ళింది,  

మళ్ళీ విత్తనంగా మారడానికి. 

వచ్చే వసంతంలో మళ్ళీ పుట్టడానికి. 


నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు. 

నువ్వు కేవలం మట్టిలో దాక్కున్నావు,  

నా దగ్గరికి తిరిగి రావడానికి సరైన కాలం కోసం ఎదురుచూస్తూ. 

నేను వేచి ఉంటాను. నేను మట్టికి నీళ్లు పోస్తాను.  

నేను నిన్ను మర్చిపోను.  


---


యంగ్-సిన్ చనిపోయింది.హే-నా (యూన్ బుక్) . ఆ తోట, ఆ ఖాళీ ఇల్లు - అన్నింటిని చూస్తుంటే  అమ్మమ్మను  గుర్తుచేస్తాయి.  


కానీ ఈ కవిత చెప్పేది ఏంటంటే… 'చావు అనేది ముగింపు కాదు'  అమ్మమ్మ నాటిన ప్రేమ, ఆమ్మమ్మ నేర్పిన ధైర్యం - అవి 'విత్తనం' లాగా హే-నా గుండెలో ఉన్నాయి.  


ఒకరోజు ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది. అమ్మమ్మ మళ్ళీ బతుకుతుంది - హే-నా రూపంలో.


ఎండిన కాడ పక్కన మొలిచే చిన్న మొలక - అదే హే-నా.  

అమ్మమ్మ పోయినా, ఆమె పెంచిన మనవరాలు ఇంకా బతికే ఉంది. ఆమెలో అమ్మమ్మ పోలికలు, అమ్మమ్మ ప్రేమ బతికే ఉన్నాయి.


కవి కిమ్ కి-టాక్ “పువ్వు” కవిత కూడా చనిపోలేదు, విత్తనమై మట్టిలో దాక్కుంది' .  

'వచ్చే వసంతం కోసం వేచి ఉంటాను' అన్నాడు.  అలాగే ఈ తెలుగు నేలలో వికసించాడు కవి. 


“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.”ఇది సత్యం. 

“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో” ఇది నిజం. 


కవి కవిత ఇచ్చి వెళ్ళాడు.

యంగ్-సిన్ హే-నాకు ఒక తోట ఇచ్చి వెళ్ళింది. 


రెండూ వారసత్వాలే! రెండూ ప్రేమ చిహ్నాలే!


చదివినందుకు ధన్యవాదాలు 🙏


నేనింతే! 😊విపరీతంగా నచ్చితే వాటిని ఒదలను. లోతులకు వెళ్ళి మరీ చూస్తాను. ఈ కవిత అలాగే పరిచయం అయ్యింది. మీకు పరిచయం చేసాను. ఈ సిరీస్ లో మరో రెండు కవితలు వుంటాయి. వీలు వెంటబడి పరిచయం చేస్తాను.



27, మే 2026, బుధవారం

మంత్రముగ్ధురాలినై..

 ఈ రోజు చిన్న కవిత చదివాను. అనేక కోణాలు వున్నాయి .. ఆ కవితలో.. 


Spellbound


The night is darkening round me, 

The wild winds coldly blow;

But a tyrant spell has bound me 

And I cannot, cannot go.


The giant trees are bending

Their bare boughs weighed with snow 

And the storm is fast descending,

And yet I cannot go.


Clouds beyond clouds above me,

Wastes beyond wastes below;

But nothing drear can move me;

I will not, cannot go.


Emily Bronte,



మంత్రముగ్ధురాలినై.. 


నా చుట్టూ  చీకటి చిక్కనవౌతుంది., 

భయంకరమైన గాలులు వణికిస్తున్నాయి 

కానీ ఒక క్రూరమైన మాయ నన్ను బంధించింది, 

నేను వెళ్ళలేను, వెళ్ళలేకపోతున్నాను..


భారీ వృక్షాలు వంగిపోతున్నాయి

వాటి బోసి కొమ్మలు మంచుతో బరువెక్కి ఉన్నాయి, 

తుఫాను వేగంగా ముంచుకొస్తోంది, అయినా నేను వెళ్ళలేను.


నా పైన మేఘాల సమూహం, 

నా కింద వ్యర్థాలకు మించి వ్యర్థాలు;

కానీ ఈ నిరుత్సాహకరమైనదేదీ నన్ను కదిలించలేదు;


నేను వెళ్ళను, వెళ్ళలేను.


(ఎమిలీ బ్రాంటే కవితకు స్వేచ్ఛానువాదం)


తన చుట్టూ చీకటి తుఫాను ముంచుకొస్తున్నా భీకరమైన చలిగాలులకు వణికిపోతున్న కూడా 

మంత్రముగ్ధురాలినై అక్కడి నుండి వెళ్ళలేక పోతున్నాను,వెళ్ళను కూడా అని కవయిత్రి తన కవితలో చెప్పింది అంటే “భయద సౌందర్యం “ వీక్షణం ఆమెకు ఆనందం కలిగిస్తుంది. లేదా అంతకన్నా భయంకరమైన పరిస్థితి ఆమెకు ఇంట్లో వుండి వుండవచ్చు, లేదా అక్కడ నుండి బయటకు వచ్చే మార్గం  కనబడకపోవడం కూడా కావచ్చు. ఇలా ఈ చిన్ని కవితను ఇలా అర్థం చేసుకోవచ్చు. అలాగే కొంతమంది భయంకర పరిస్థితుల్లో జీవించడంలో కూడా ఆనందం వెదుక్కుంటూ వుంటారు కావచ్చు అనడానికి ఈ కవిత ఒక ఉదాహరణ. 


(నా కింద వ్యర్థాలకు మించి వ్యర్థాలు బదులు ఎడారులకు మించి ఎడారులు అని కూడా అనుకోవచ్చు) 


కవిత్వం చదవడం వల్ల పాఠకులకు కొత్త చూపు వస్తుంది. నాకు చదవడం విశ్లేషణ చేసుకోవడం ఇష్టం. ఎమిలీ బ్రాంటే వ్యక్తిగత జీవితం గురించి తెలియదు.. ఒక రచనలో అనేక పార్శ్వాలు ఉంటాయి కదా! అలా ముందుకు వెళ్ళాను. ధన్యవాదాలు 🙏


9, మే 2026, శనివారం

రేలపూల కవిత్వం



 రేలపూల చెట్టును హిందీలో Amaltas (अमलतास) అని ఆంగ్లంలో Golden Shower Tree

బెంగాలీలో Sonali or Sonar అని అంటారట. 

రేలపూల పై కవిత్వం ఏమైనా వుందా అని వెతికాను. 

ఇదిగో అద్భుతమైన కవిత్వం దొరికింది.  "Nightingale of India” పేరుగాంచిన బెంగాలీ వనిత కవయిత్రి  మన తెలుగువారి కోడలు,అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.(ఉత్తర ప్రదేశ్) ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం" (Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold), విరిగిన రెక్కలు (the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి.


**************

పాలరాతి పెట్టె

కళాత్మకమైన ఈ పాలరాతి పెట్టె లాగే,

కాసియా పువ్వులా సున్నితమైన నా హృదయం ఉంది.

సున్నితమైన స్వప్నాలతో చెక్కబడి,

ఎన్నో సూక్ష్మ, అద్భుత భావనలతో తీర్చిదిద్దబడి వుంది.


అందులో నేను ఆ పరిమళాన్ని, సువాసనను పదిలపరుస్తాను

గాఢమైన, ఉద్వేగభరితమైన జ్ఞాపకాల సమ్మేళనాన్ని

దాల్చినచెక్క, చందనం, లవంగాల సువాసనలా,

పాట, దుఃఖం, జీవితం, ప్రేమ ల పరిమళాన్ని దాచుకుంటాను.


Alabaster -Sarojini Naidu


LIKE this alabaster box whose art Is frail as a cassia-flower, is my heart, Carven with delicate dreams and wrought With many a subtle and exquisite thought. Therein I treasure the spice and scent Of rich and passionate memories blent Like odours of cinnamon, sandal and clove, Of song and sorrow and life and love.


7, మే 2026, గురువారం

మేఘాల సమూహానివి నీవు


 
విశ్వకవి  రవీంద్రనాథ్  ఠాగూర్ జయంతి సందర్భంగా… ఒక కవిత/పాట గురించిన విశేషాలు

రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం చదువుతూ వుండగా …ఈ కవిత నన్ను ఆకర్షించింది. 

ఈ కవిత రాసినప్పుడు కవి వయస్సు ఎంత వుంటుంది అనే ఆలోచన వచ్చి search  చేసాను. ఠాగూర్ తన 36 సంవత్సరాల వయస్సులో ఈ కవిత రాసారు. అదీ ఓ పడవ ప్రయాణంలో. 


ఈ పాటను రచిస్తున్నప్పుడు రవీంద్రనాథ్ ఒక జమీందార్‌గా సేవ చేయడానికి నదిని దాటుతూ పడవలో ఉన్నారు.ఈ పాట యొక్క మొదటి రాతప్రతి 'మజుందార్ పుంథి' అనే నోట్‌బుక్‌లో లభించిందట. అందులోని కవిత పేరు 'మానస్-ప్రతిమ' మరియు దాని మొదటి పంక్తి 'తుమీ సోంధ్యార్ మేఘ్ శాంతో సుదూర్'. ఆ రాతప్రతిపై 'చలన్‌బిల్, ఝోర్-బ్రిష్టి' అని లిఖించబడి ఉంది. ఒక సాయంకాలపు ప్రశాంతమైన వర్ణనతో కూడిన ఈ కవితను రాస్తున్నప్పుడు కుండపోత వర్షం కురుస్తోందని ఇది సూచిస్తుంది, అయినప్పటికీ, కవితలో దానికి సంబంధించిన ఎలాంటి సూచనలు లేవు. నిజానికి, దీని స్వభావం ఎంత పొడిగా ఉంటుందంటే, 'హేమంత' రుతువును సూచించడానికి ఒకసారి కవి స్వయంగా కొంతమంది గాయకులను ఈ పాటను పాడమని కోరారు.


ఆ విషయం ఏమిటంటే..ఒకసారి శాంతినికేతన్‌లో మహిళలు ఆరు ఋతువులకు సంబంధించిన పాటలు  ప్రదర్శిస్తున్నారట. రవీంద్రనాథ్ మరికొందరు ప్రొఫెసర్లతో కలిసి ఉన్న వేదికపై వారు ఆరు పాటలు పాడాలని అనుకున్నారు..


'హేమంతం’కు తగిన పాట వారికి దొరకలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ వారికి సహాయం చేసి, 'తుమీ సంధ్యార్ మేఘోమాల' అనే పాటను సూచించారట. ఠాగూర్ తన పాటలను కవితలుగా ఆంగ్లంలో తనే స్వయంగా రాసారు. అలాగే స్వరలిపి చేసి స్వయంగా పాడేవారట. రవీంద్రుడి సాహిత్యం అంతా.. శాంతినికేతన్ వెబ్ సైట్ లో పదిలపరిచారు. అందుకు ఠాగూర్ ఆఖరి కుమారై,కుమారుడు,సోదరులు ఎంతో శ్రమించి భద్రపరిచారు.

అక్షరజ్ఞానం లేని ఏదో కొద్దిగా చదువుకున్న బెంగాలీ కుట్టుపని కార్మికులు కూడా తాము పదే పదే  ఠాగూర్ పాటలు వింటూ నాకు వినడం అలవాటు చేసారు. గీతాంజలి తప్ప ఏమీ తెలియని నాకు  అలా ఠాగూర్ సాహితీ సుగంధం నన్ను చుట్టుకుంది.   



Rabindranath Tagore wrote and composed the song "Tumi Sondharo Meghomala" (তুমি সন্ধ্যার মেঘমালা) in 1897while on a boat at Chalan Bil. It is a renowned Rabindra Sangeet, categorized under the 'Prem' (love) parjaay.

Written on: 24th September 1897 (9 Ashwin 1304)

Place: Chalanbil


Tumi Sandhyar Meghamala .


You Are A Cluster Of Clouds  - Rabindranath Tagore


You are a cluster of clouds of the evening sky

I have sought only you all my life

It is you who fills my empty sky

I have made you with the sweet fancies of my mind

You are mine, you are mine

O you wanderer of my boundless sky.


With the blood of my heart I have beautified your feet

My evening dreams are full of you

I have coloured your lips with poison and honey

Mixing with my joys and sorrows

You are mine, you are mine

You have filled my lonely being.


I have coloured your eyes with collyrium

Made of the fancies of my love

You always fill the view of my spellbound eyes

With my music

I have dressed all your limbs

You are mine, you are mine

Both in my life and death you fill my being.


********** తెలుగు స్వేచ్ఛానువాదం. 


మేఘాల సమూహానివి నీవు. 


సంధ్యా గగనపు మేఘాల సమూహానివి నీవు

నా జీవితమంతా కేవలం నిన్నే వెతికాను

నా శూన్య ఆకాశాన్ని పూరించేది నీవే

నా మనసులోని మధుర కల్పనలతో నిన్ను సృష్టించుకున్నాను

నీవు నాదానివి, నీవు నాదానివి

ఓ నా అంతులేని ఆకాశపు సంచారిణీ!


నా హృదయరక్తాన్ని పారాణి చేసి నీ పాదాలను అలంకరించాను

నా సాయంకాలపు స్వప్నాలన్నీ నీతోనే నిండి ఉన్నాయి

నా సుఖదుఃఖాలను మేళవించి,

నీ పెదవులకు విషం, తేనెల రంగులు అద్దాను

నువ్వు నాదానివి, నువ్వు నాదానివి

నా ఏకాకి అస్తిత్వాన్ని నువ్వు నింపివేశావు.


నీ కళ్ళకు కాటుక అద్దాను అది

నా ప్రేమ కల్పనలతో రూపొందించబడినది

నా మంత్రముగ్ధ నేత్రాలను నువ్వు 

ఎల్లప్పుడూ నా సంగీతంతో నింపుతావు.

నేను నీ కాళ్ళు చేతులకు (అవయవాలకు) దుస్తులు తొడిగాను.

నువ్వు నా దానివి, నువ్వు నా దానివి

నా బ్రతుకు, మరణం రెండింటిలోనూ నీవే నా అస్తిత్వాన్ని నింపుతావు.


(జత పరిచిన చిత్రం Pinterest సౌజన్యం తో )