23, సెప్టెంబర్ 2026, బుధవారం

కాలము - ప్రేమ

 కాలము - ప్రేమ


క్షణికమైన కోపానికి నిరంతరం 

బానిసగా నిలిచిన దౌష్ట్యానికి 

అఖండమైన గోపురాలు

నేలమట్టమైనప్పుడు


శిధిలమై సమాధిపైన యుగపు 

గర్వకారణాలైన విలువలు

క్రూరమైన కాల హస్తాన నలిగి

వికృతమవడం నే చూసినప్పుడు 


ఆకలిగొన్న సాగరుని కెరటాలు

తీరాన్ని కబళింప చూస్తుంటే

అంచులు అఖండాన్నే గెలుస్తూ

నష్టాన్ని విలువతో విలువను నష్టంతో

వృద్ధి చేస్తూ నిరంతరం పోరాటం 


పరిస్థితులు స్థానాలను మార్చుకోవడం

స్థితిక్షీణతలోకలగాపులగంగా 

కలిసిపోవడం నేను చూసినప్పుడు


నా ప్రేమను నానుండి విడదీసే

సమయం రాబోతుందని

గతాన్ని అలా నెమరువేయమని

నేర్పింది నాకు సర్వనాశనం 


కానీ.. 

కాంక్షించేదాన్నివొదులుకునే

రోజు వస్తుందనే రోదన మినహా

కోరుకునే స్వాతంత్ర్యం ఇవ్వని

ఈ వేదాంతం చావుతో సమానం 



(షేక్స్పియర్  Time And Love కి స్వేచ్ఛానువాదం)

కామెంట్‌లు లేవు: