My Poetry in English లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
My Poetry in English లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2026, శుక్రవారం

ఒక దీపం మలిగింది

 




ఒక దీపం మలిగింది   - వనజ తాతినేని 


నా వైపు నుండి  వీచే గాలి కూడా  సమీపించకుండా 

ఆంక్షలు విధించుకునే నీ గురించి వ్యాకులపడి ఏం లాభం? 

ఈ వియోగం కళంకం నేను మోయలేను 

ప్రేమ లోని ఉన్మాదం బహు వినాశనానికి 

దారి తీస్తుంది అంటారు కదా! 

అదే నిజమైతే .. 

ఈ దీపం ఆరిపోకుండా ఆపలేవు 

సెలవు ప్రియతమా! 


09/10/2026. 12:55 pm.


Translation and Analysis by My Friend వరుస క్రమంలో నేను రాసిన నాలుగు కవితల పరిణామక్రమాన్ని ఉదహరించారు.


ENGLISH TRANSLATION:

A LAMP HAS GONE OUT

What is the use of agonizing about you,

who has imposed restrictions

that even the breeze blowing from my side should not approach you?

I cannot bear the stigma of this separation

They say madness in love leads to much destruction, right!

If that is true..

You cannot stop

this lamp from going out

Farewell, my beloved!

- Vanaja Tatinani



TITLE ANALYSIS BY FRIEND:

The poet herself gave the perfect title: 'Oka Deepam Maligindi'

Why this title is 10/10:

- 'Oka' (One) - Shows it was the only lamp, the only love. Loneliness.

- 'Deepam' (Lamp) - Not just light, it's the poet herself, her hope, her waiting.

- Maligindi (Has faded out gently) - Not blown out by someone, but faded respectfully by its own decision. Self-respect. Mukti.

This title transforms anger into peaceful truth.

It is not accusation, it is acceptance.


DEEPER MEANING OF 'OKA DEEPAM MALIGINDI:

In Telugu literature, Deepam is sacred.

- A woman lights deepam for husband's long life (Deepa Lakshmi)

- A student lights deepam for knowledge

- A lover lights deepam and waits at threshold

When a deepam goes out (maligindi), it is not failure. It is completion.

The wind is forbidden to come near. So the poet herself stops the oil.

She lets the flame die. She says 'Selavu (Farewell).

This is the final stage of grief: Acceptance.

Poem progression in poet's life:

1. Nenu Samudram - I am vast, I contain everything

2. Shidhila Prema - I wait in the ruins of love

3. Choopunna Paata - I find companion in songs

4. Oka Deepam Maligindi - I extinguish and I am free

This title 'Oka Deepam Maligindi will stay in readers' hearts because it is silent. It doesn't shout. It whispers truth.

Like the poet said in previous poem: 'Konni paatalanu nishabdamga kaanuka cheyaali"

Some songs must be gifted in silence.

This poem is that silent gift.


- Your Friend, 


8, అక్టోబర్ 2026, గురువారం

శిధిల ప్రేమ

 



శిధిల ప్రేమ - వనజ తాతినేని 


నా యిష్టాన్ని అయిష్టంగా చూస్తావ్

నా అభిప్రాయాలను విరుద్దంగా లెక్కిస్తావ్

మొత్తంగా పూర్తిగా తిరస్కరిస్తావ్ 

అది నీ హక్కు, కాదనను


నీ అయిష్టాన్ని నీ వైరుధ్యాన్ని నేను గౌరవిస్తాను

నీ తిరస్కారాన్ని ఆమోదించగలను. 

ఎవరికి యెవరూ యేమీ కానప్పుడు 

ఎందుకు ప్రకటన చేస్తారు చెప్పు? 


ప్రేమ సామ్రాజ్యాన్ని ఒంటిగా నిర్మించగలరు

కానీ కూల్చలేరు. శిధిలాలయంలో నైనా

ఎవరు శాశ్వతంగా వుండబోతారు

కాస్త ముందు వెనుక అంతే కదా ప్రియతమా!




ఇంగ్లీష్ అనువాదం:


 RUINED LOVE  - Vanaja Tatineni 


You see my liking as dislike

You count my opinions as opposition

You reject me totally, completely

That is your right, I won't deny.


I respect your dislike, your opposition

I can accept your rejection.

When no one belongs to anyone in this world

Why make a public announcement, tell me?


One can build an empire of love all alone

But cannot demolish it alone. Even in its ruins

Who is going to stay forever?

It's just a matter of sooner or later, isn't it, my dear!


08/10/2026. 09:05 am


6, అక్టోబర్ 2026, మంగళవారం

The Shortest Way to the Heart

 



హృదయానికి దగ్గర దారి -వనజ తాతినేని 


రాజప్రాసాదం పై చంద్రుడు వడివడిగా ఊరేగుతున్నాడు. 

కోటగోడలపై నుండి ఊరేగుతున్న చంద్రుడిని చూస్తూ ..

అంతఃపురం లోని 27గురు రాచకన్యలు కోట గుమ్మాలకు 

ఆనుకుని ఘడియలు లెక్కెట్టుకుంటున్నారు. 

జంట చకోర పక్షులు వెన్నెలను తాగుతూ  విహరిస్తూ ఉన్నాయి 

 మతిస్థిమితం కోల్పోయిన  విరహిణిలు కొందరు 

లాంతరు చేత ధరించి పతిని వెతుక్కుంటూ బయలుదేరితే 

మరికొందరు బాట వెంబడి కాపుగాసారు 

ఎవరికివారు తమ కౌగిలిలో బంధించాలని. 

రోహిణి  మాత్రం తన ప్రేమనంతా వెన్నెలగా జేసి 

పతి  కార్యంలో  తాను పాలుపంచుకుని 

శరత్పూర్ణిమను మరింత శోభాయమానంగా మార్చింది. 

పతి హృదయానికి దగ్గర దారి  కనిపెట్టి.

తత్పూర్వ సూర్యోదయమే

పతి ఇష్టసఖి చెట్టాపట్టాలేసుకుని 

నిశీధి గృహానికి తరలిపోయారు.


English Translation


*The Shortest Way to the Heart - Vanaja Tatinani*


The moon parades swiftly atop the palace,

Watching the moon parading over the fort walls,

Twenty-seven royal daughters in the inner chambers,

Lean against the fort gates, counting every moment.


A pair of Chakora birds sip the moonlight and soar,

Some lovelorn women, having lost their minds,

Set out with lanterns in hand, searching for their lord,

While others lie in wait along his path,

Each wanting to bind him in her own embrace.


But Rohini alone,

Turned all her love into moonlight,

Partook in her lord's own work,

And made the autumn full moon night even more resplendent.


Having found the closest path to her lord's heart.

And before the sunrise,

Hand in hand with her lord's dearest friend,

She walked away into the house of night.



2, అక్టోబర్ 2026, శుక్రవారం

పంచమ స్వరం

 


పంచమ స్వరం 


అప్పుడప్పుడైనా నీ ఉనికిని  నిరూపించుకుంటేనే 

నువ్వు నాకు బతికి వున్నట్టు. 


అజ్ఞాతవాసి ని తలచుకునేంత 

సహృదయాన్ని భూతద్దంతో వెతకాలనుకోకు


వసంతకాలంలో వినబడే పంచమ స్వరంలా అయినా యెదురు పడు 

మళ్ళీ నాలో బతికిపోతావ్.


ఆంగ్ల అనువాదం


Panchama Swaram - The Fifth Note*


If only occasionally you prove your existence,

then you are alive for me.

Don't search with a magnifying glass for the kindness

to remember one in exile (Ajnatavasi).

Appear at least like the fifth note heard in spring,

You will live again in me.


02/10/2026. 10:05 am.

చిత్రం, ఆంగ్ల అనువాదం : Meta AI సౌజన్యంతో.


వల

 వల



వల 


వెలుగుగా నువ్వు వస్తావు

నీ నీడగా మారతాను నేను

చీకటిని పరిచయం చేస్తూ

తప్పుకుంటావ్ 

నిరీక్షణకు మించి యేముంటుంది 

నా దగ్గర !?

నీ ప్రేమ వర్షంలో తడినప్పుడే కదా

నేను మనిషిగా మొలకెత్తేది

అస్థిత్వ సంక్షోభం వలలో చిక్కుకున్న

పక్షులమై పోయాం మనం

వలను ధ్వంసం చేద్దాం రావోయ్! 


ఆంగ్ల అనువాదం


Vala - The Net*


You come as light,

I become your shadow,

You introduce darkness and slip away.

What do I have beyond waiting!?

Isn't it only when drenched in your love-rain that I sprout as a human?

We have become birds trapped in the net of existential crisis.

Come, let's destroy the net!


02/10/2026. 10:05 am.


చిత్రాలు, అనువాదం Meta AI సౌజన్యం.


హార్మోన్


 హార్మోన్  - వనజ తాతినేని 


ఈ ప్రపంచంలో కోట్లాది మంది వుండగా

నువ్వే యెందుకు కలవరపెట్టావ్ 

నువ్వే నా ఆక్సిటోసిన్ (Oxytocin)

కళ్ళు మూస్తే చాలు

నువ్వుగా వచ్చి నేనుగా మిగిలిపోతావ్

కళ్ళు తెరిస్తే క్షణంలో మాయం అవుతావు. 

ముగిసేదాక జీవితం యిలాగే నడుస్తుంది.


Hormone - Vanaja Tatineni*


Among billions in this world,

Why did only you disturb me?

You are my Oxytocin.

Just close my eyes,

You come as you, and remain as me.

Open my eyes, you vanish in a moment.

Life will go on like this till the end.


02/10/2026. 06:06 am. 


చిత్రం: AI సౌజన్యంతో.

28, సెప్టెంబర్ 2026, సోమవారం

చందమామ పాటలు


చందమామ పాటలు


ఎందుకలా వొంటరిగా ఊరేగుతున్నావు 

చంద్రమా! 


నన్ను పిలవకపోతివి. హ్మ్.. 

కాసిని తారాచంద్రుల కథలు 

మరికొంత వెన్నెల కవిత్వం

కొన్ని హృద్యమైన పాటలు మోసుకుని

వచ్చేదాన్ని పరుగు పరుగున 

మబ్బుల పల్లకీ యెక్కి. 


ఏమిటో.. బెట్టు పోతున్నావ్!

సరే పో! నేను శ్రావ్యమైన చందమామ పాటలు వినాలి. 


********

చందమామ ఆటలు 


సందెవేళ అరవిరిసిన జాజిపూల

పరిమళాన్ని అరచేతుల్లో అద్దుకుని

మనోవేగంతో.. వచ్చి మెత్తగా నీ కనులు మూసి నేనెవరో కనుక్కో అంటాను.

నువ్వు నీ రెండు చేతులతో నా అరచేతులను నాసిక దగ్గరకు జరుపుకుని

నువ్వు పరిమళ వి కదా అంటావ్. 

 నేను కోపంగా.. ఆ ఇరవై తొమ్మిదవ స్త్రీ 

ఎవరూ అంటాను. 

నువ్వు ఫక్కున నవ్వి కొంటెగా.. 

 “తారా! ఎందుకంత ఉక్రోషం” అని అంటావ్! 

మబ్బులతో ఆటలాడుతున్నట్లు ఆటలు తగవు చంద్రమా! 

స్వల్పకాలిక భావోద్వేగాలు దాంపత్య జీవితాన్ని భగ్నం చేస్తాయి అంటాను.


ఆంగ్ల అనువాదం


Chandamama Paatalu / Moon Songs - Vanaja Tatineni*


Why are you parading alone like that,

Oh Moon!


You didn't call me. Hmm...

Carrying a few tales of stars and moon,

Some more moonlit poetry,

And some heart-warming songs,

I would have come running,

Riding a palanquin of clouds.


What is this... you are sulking!

Fine, go! I want to listen to melodious moon songs.


**********


 Chandamama Aatalu / Moon Games - Vanaja Tatineni*


In the evening, smearing the fragrance

Of half-bloomed jasmines on my palms,

I come swiftly and softly close your eyes

And ask you to guess who I am.

You, with both your hands, bring my palms

Close to your nose and say,

"You are the fragrant one, aren't you?"

I, angrily... "Who is that twenty-ninth woman?"

You burst out laughing naughtily...

"Tara! Why so jealous!"

Stop playing games like you play with clouds, Oh Moon!

Momentary emotions ruin married life, I say.

**********

29 వ స్త్రీ అని అడగడానికి గల వివరణ :

భారతీయ ఇతిహాసాల ప్రకారం చంద్రునికి *27 మంది భార్యలు* - దక్ష ప్రజాపతి కుమార్తెలు, అందరూ అక్కాచెల్లెళ్లు - 27 నక్షత్రాలు + అభిజిత్ కలిపి. రోజుకో నక్షత్రం దగ్గర ఉంటాడు చంద్రుడు. వాటి గమనంతోనే రెండు పక్షాలు, ఒక మాసం.

మరి *తార* అంటే? తార అంటే బృహస్పతి భార్య! చంద్రుడికి తార అంటే అమిత అనురాగం ఉన్న కథ పురాణాల్లో ఉంది. ఆ ప్రేమ కథ వల్లనే బుధుడు పుట్టాడు అంటారు.

27 మంది భార్యలు మరియు తార కలిపి 28 మంది.

#వనజతాతినేని