17, అక్టోబర్ 2026, శనివారం

కవితా లాహిరి

 



కవితా లాహిరి

నా మానస గృహ ప్రాంగణాన రంగవల్లిక 

నువ్వు  

గుమ్మానికి కట్టిన తోరణాలు నువ్వు

నడిమిటింటి దీపానివి నువ్వు

రాత్రికి రారాజువి నువ్వే


నిన్ను తలుచుకుంటే చాలు 

సామాన్యమైన పదాలకు రెక్కలు వచ్చి 

నా భుజాలపై కవితావాక్యంగా వాలతాయి 

నా నైపుణ్యం యేమీ లేదు

పదాల ప్రాణశక్తి నువ్వే

నా ప్రాచీన కవితా లాహిరి నువ్వే


                                     - వనజ తాతినేని. 

17/10/2026. 03:52 pm


కామెంట్‌లు లేవు: