22, అక్టోబర్ 2026, గురువారం

దగ్ధమైన స్వేచ్ఛ

దగ్థమైన స్వేచ్ఛ 


నిన్ను సంపూర్ణంగా గాఢంగా ప్రేమించడం వల్ల 

వియోగ విషాదాలకు గురి కాలేదు కానీ.. 

నా స్వేచ్ఛ ను కోల్పోయాను.

నిజంగా నువ్వు నన్ను ప్రేమించి వుంటే

నీ ప్రేమలో పునీతం అయివుండేదాన్ని

ప్రేమ కావాలా స్వేచ్ఛ కావాలా అని అడిగితే  

స్వేచ్ఛే కావాలి అంటాను నేను. 

నీ బదులు చెట్టును కావిలించుకున్నా 

ఈర్ష్య పడే నీలో నా స్వేచ్ఛ దగ్ధమైంది. 

అయిననూ

నేను నీ బానిసను.నువ్వు నాకు బాసట. 


22/10/2026. 09:15 pm. 


Incinerated Freedom - Vanaja Tatineni.


Because I loved you completely, deeply

I was spared the sorrow of separation, but...

I lost my freedom.


If you truly loved me,

I would have been sanctified in your love.


If you ask me - do you want love or freedom?

I will say - I want freedom.


Even if I hug a tree instead of you,

you get jealous.

In you, my freedom was burnt to ashes.

And yet -

I am your slave.

You are my support.

కామెంట్‌లు లేవు: