29, అక్టోబర్ 2026, గురువారం

నువ్వొస్తానంటే నేవొద్దంటానా

 


నువ్వొస్తానంటే నేవొద్దంటానా


హద్దు అదుపు లేని జ్ఞాపకాలు 

మంచి చెడు విచక్షణ లేని జ్ఞాపకాలు 

ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి

నిద్ర పట్టనప్పుడో పాట వింటున్నప్పుడో 

వాన పడుతున్నప్పుడో యదాలాపంగా 

యెవరో వొకరు అన్న మాట విన్నప్పుడో 

ఆ క్షణం నేను మర్చిపోతాను

అది జ్ఞాపకమని మళ్ళీ తిరిగిరానిదని


జ్ఞాపకం లాగానే 

 ఇప్పుడు నువ్వొస్తానంటే నేవద్దంటానా!? 


28/10/2026. 06:40 am. 




కామెంట్‌లు లేవు: