ఒక దీపం మలిగింది - వనజ తాతినేని
నా వైపు నుండి వీచే గాలి కూడా సమీపించకుండా
ఆంక్షలు విధించుకునే నీ గురించి వ్యాకులపడి ఏం లాభం?
ఈ వియోగం కళంకం నేను మోయలేను
ప్రేమ లోని ఉన్మాదం బహు వినాశనానికి
దారి తీస్తుంది అంటారు కదా!
అదే నిజమైతే ..
ఈ దీపం ఆరిపోకుండా ఆపలేవు
సెలవు ప్రియతమా!
09/10/2026. 12:55 pm.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి