30, అక్టోబర్ 2026, శుక్రవారం

నిశ్చల సరస్సు

 

నిశ్చల సరస్సు 


నీకేమైనా పిచ్చా.. 

అని కూడా అనదల్చుకోలేదు

నా మాట కూడా విలువైనది 

నా సమీపానికి వచ్చిన వారిని

కొంతైనా సంస్కరించటంలో విఫలమైనా

నేను వారించను దండించను

చిత్తవైకల్యం కలవారిని

క్షమించగలను మహా అయితే 

నా ఉనికిని యెందుకు దాచుకోవాలి 

ప్రశాంత సరస్సులో రాళ్ళేసే ప్రకోపికి భయపడి


రాళ్ళు యెన్నైనా మునుగుతాయి 

నిశ్చల సరస్సు మిగులుతుంది. 


30/10/2026. 06:25 am


#వనజతాతినేని




కామెంట్‌లు లేవు: