అనువాద కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనువాద కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

అమ్మ - చెట్లు ప్రసాదించిన జీవితం

 చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన)  జీవితం - పెరుమాళ్ మురుగన్ 

ఈ కథ మూలం: ప్రసిద్ధి  తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ - అమ్మ. "A life bestowed by trees"  అనే శీర్షికతో కవితా మురళీధరన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఇంగ్లీషు నుండి తెలుగు లో అనువదించిన వారు - సునీతా రత్నాకరం 

ఒక మంచి కథను స్పూర్తికరమైన అమ్మ ను సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో

ఇప్పుడు ఈ కథను చదివి వినిపిస్తున్నది… వనజ తాతినేని 


 అమ్మ - చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన)  జీవితం - పెరుమాళ్ మురుగన్ 


అమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుండేవి. తన అవసరాలకి ఎప్పుడూ ఎవరిమీదా ఆధారపడేది కాదు. తన ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు కూడా ఉన్న మేకల్ని, ఆవుల్ని అమ్మేసి ఇంట్లోనే ఉండిపోయింది. నేను నా కుటుంబంతో సహా నామక్కల్ కి మారినప్పటి నుంచి పొలంలో ఉన్న నా రెండు గదుల ఇల్లు ఖాళీగానే ఉంది. అమ్మని అందులో ఉండమన్నాం, కానీ నాకు అంత పెద్ద ఇల్లు ఎందుకని దానిని అద్దెకిచ్చేసింది. ఆ ఇంటి వెనక నా పుస్తకాలు పెట్టి ఉంచిన చిన్న అర లాంటి గది ఉంది. మట్టి పెంకులతో  కప్పు వేసిన ఆ చిన్న అర చాలు అనేది. 


నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని చూసినా అమ్మ అనే మాట ఒకటే 'నాకేం ఖర్చులుంటాయి?' అని.  బదులుగా నా పిల్లలు ఎప్పుడు మా ఊరు వెళ్లి వస్తున్నా తానే పదో, ఇరవయ్యో వాళ్ళ చేతిలో పెట్టేది. 


ఆ ఇంటి నుంచి వంద, నూట యాభై రూపాయల అద్దె వచ్చేది. ఆవిడ ఒక్కతే ఉన్నా ఆ కాసిన్ని డబ్బులెట్ల సరిపోతాయ్? అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూరగాయలు, సరుకులు తీసుకెళ్ళేవాణ్ణి. 'ఇవన్నీ నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నువ్వు డబ్బులన్నీ దుబారా చేస్తావేం? నాకేమైనా అవసరం వుంటే నేనే అడుగుతాను కదా' అని నన్ను కోప్పడేది. అప్పట్నుంచీ అమ్మకేం కావాలో ముందే అడిగి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నా. అమ్మా నీ ఖర్చులన్నీ ఎట్లా గడుస్తున్నాయ్  అని నేను ఆమెనడిగితే ఇంటి బయట చుట్టూ ఉన్న చెట్లని చూపించి, 'అవి ఇస్తాయి' అని చెప్పేది. మా అమ్మకి ఆ కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆదాయం సరిపోయేది. 


పెళ్ళికి ముందు మా అమ్మకి పొలం పనులు ఏమీ తెలియవు, ఒకసారి నేర్చుకున్నాక ఆమె మొక్కని పెంచడం కూడా ఒక అందంతో చేసేది. అమ్మ అంట్లు తోమే జాలారు దగ్గర్లో ఒక మిరపచెట్టుని  ఎప్పుడూ పెంచేది. ఏడాది పొడుగూతా ఆమెక్కావాల్సిన మిరపకాయలు ఆ చెట్టే ఇచ్చేది. రెండు మూడేళ్లు వుండేది. ఆకుపచ్చటి గొడుగులాగా చూడటానికి కూడా కంటికింపుగా వుండేది. కొన్ని కాయలు పచ్చిగా కోసుకునేది, కొన్నిటిని చెట్టుమీదే పండనిచ్చి ఎండబెట్టేది. పది రోజులకోసారి పొరియల్ చెయ్యడానికి ఒకట్రెండు కలేపళ్ళ మొక్కలు సరిపొయ్యేవి. అమ్మ ప్రకృతిని ఉపయోగించుకునే పద్ధతి భలే ముచ్చటగా వుండేది. 


నామక్కళ్ లో మేముండే ఇంట్లో కూడా అమ్మ చెట్లు పెంచింది. ఒక ములగ చెట్టు, ఓ కరివేపాకు చెట్టు బయటి గోడ పక్కనే వేసి, డాబా ఎక్కితే వాటిని కోసుకొనేంత పెరిగేదాకా పెంచింది. మా ఇంటిముందు నాటిన గోరింటాకు మొక్క ఇప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో గోడంతా కమ్మేసింది. వాకిలి మొత్తం నింపేసే ఆ గోరింట వాసన తగిలినప్పుడల్లా అమ్మ, అమ్మతోపాటే ఆమె ఆ చెట్లను జాగ్రత్తగా పెంచుకున్న జ్ఞాపకం నాలో నిండిపోయేది.  


అమ్మ మా ఊళ్ళో పెంచిన చెట్ల ముచ్చట ఇంకా పెద్దది. ఇంట్లో, పొలంలో ఎన్నో చెట్లు పెట్టింది. ఒక్కో కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, నిమ్మచెట్టు, జామచెట్టు, ఉసిరిచెట్టు, రెండేసి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, చింత చెట్లుండేవి. మొత్తం పదమూడు చెట్లు - మాకంత  గుర్తు. 


మా చింత చెట్లు ఓ మాదిరివి, చింతకాయలు పండి ఎండిపొయ్యాక కూడా వాటంతట అవి రాలేవు కావు, కర్రతో కొట్టి దులుపుకోవడమే. మా అమ్మ ఆ చింత పండు ని  'నరం చింత' అనేది, నరాల్లాగా చెట్టుకి అతుక్కుని ఒక పట్టాన రాలవని. ఒక్కో ఎండిన చింతకాయని జాగ్రత్తగా  రాల్చి, గింజ తీసేసి దాచేది. తనకోసం కొంత పక్కన పెట్టుకుని మా అన్నకూ, నాకు ఏడాదికి సరిపడా చింతపండు ఇచ్చేది. చింత చెట్టు పంటని ఎప్పుడూ అమ్మింది లేదు, మిగిలిన పదకొండు చెట్ల నుంచి వచ్చిందే అమ్మ ఆదాయం. 


మా చుట్టుపక్కల పెద్దగా కరివేపాకు చెట్లు ఉండేవి కావు, నీటి ఎద్దడితో పెంచడం కష్టమని ఎవరూ వేసేవాళ్ళు కాదు. మా దగ్గర కరివేపాకు ఎంత  అబ్బురంగా ఉండేదంటే ఎవరింట్లో అన్నా ఒక్కళ్ళే బిడ్డలు వుంటే వాళ్ళని లేత కరివేపాకు మొక్కతో పోల్చేవాళ్ళు. మా అమ్మ కరివేపాకు చెట్టు మొదట్లో ఓ కుండ పెట్టేది. పంపులో నీళ్లు వచ్చినప్పుడల్లా ఆ కుండ నింపి పెట్టేది. మేము కాళ్ళు, చేతులు అక్కడే కడిగేవాళ్ళం కాబట్టి ఆ చెట్టుకి వేరే నీళ్లు పొసే పనిలేదు. కొబ్బరి చెట్ల దగ్గరా అట్లాగే రెండు కుండలు పెట్టింది. అంట్లు అక్కడ కడిగేది  మళ్ళీ నీళ్లు పోసేపని లేకుండా. జామ, ఉసిరి చెట్లు అమ్మ వుండే చిన్న గది ముందే వుండి కావలసినంత నీడ ఇచ్చేవి ఇల్లూ, వాకిలికి, వాటికి మాత్రం అప్పుడప్పుడూ కాసిన్ని నీళ్లు పోస్తే సరిపొయ్యేది. 


దానిమ్మ చెట్లు ఇంటికీ రోడ్డుకి మధ్య ఉన్న కాలిబాటలో వుండేవి. నా భార్య ఈ దానిమ్మ గింజలు మొలకెత్తించి ఒక పాలిథిన్ సంచీలో పట్టుకెళ్లి అక్కడ నాటింది. ఆ చెట్టు బాగానే ఎదిగి పూలు, పిందెలు వచ్చేవి. పిందెలు కాస్తా కనపడగానే ఎక్కడినుంచో పురుగులొచ్చి వాటిని పాడు చేసేవి. అమ్మ ఆ పిందెల మీద బూడిద చల్లి పురుగుల్ని చంపాలని చూసేది కానీ, ఆ బూడిదని  అవి మంచిగ అరాయించుకునేవి. 


ఒకసారి అమ్మ ఇంటి చుట్టుపక్కల కనపడ్డ పాలిథిన్ సంచీలు పోగు చేసి ఆ దానిమ్మ కాయల చుట్టూరా జాగ్రత్తగా చుట్టి దారంతో కట్టేసింది. పురుగులు ఈ సంచీల్ని ఏమీ చేయలేకపోయాయి, అట్లా అమ్మకి అవి క్రిమి సంహారకాలుగా ఉపయోగపడ్డాయి. అప్పట్నుంచి అమ్మ ఆ చెట్టుమీద ఒక కన్ను వేసి ఉంచేది, కాయ కనపడగానే చిటుక్కున పాలిథిన్ సంచీ కట్టేది పురుగు దాన్ని చూసేలోపు. మా దానిమ్మ చెట్టుమీద పాలిథిన్ సంచీలు పెరుగుతున్నట్లు వుండేది అదాటున చూస్తే. అప్పుడప్పుడూ జాగ్రత్తగా ఆ సంచీలు విప్పి కాసేపు కాయకు గాలి తగలనిచ్చి మళ్ళీ కట్టేసేది. ఆ కాయ పూర్తిగా పండి సుళువుగా తెంపగలిగినప్పుడే వాటిని తెంపేది చెట్టుకి దెబ్బ తగలకుండా. మా పాలు పళ్ళు మేము తిన్నాక మిగిలినవి అమ్మితే బాగానే డబ్బు వచ్చేది వాటిమీద.  


అప్పుడప్పుడూ వచ్చే వానలు గోరింటాకు చెట్టునీ, మునగ చెట్టునీ పోషించేవి. గోరింటాకుని ప్రత్యేకం కొనేవాళ్ళు ఉండరు, అందుకే వేరేవి ఏమైనా కొంటున్నప్పుడు వాళ్ళు గోరింటాకు తెంపుకోవచ్చు. మునగచెట్టు మాత్రం ఏడాది పొడుగునా ఏదోకటి ఇచ్చేది. మునగాకు ఎప్పుడూ వుండేది, కాలంలో మునక్కాయలు కాసేవి. మునగచెట్టు మహా పెళుసు, అందుకే ఆ చెట్టుని ఎవ్వరినీ పట్టుకొనిచ్చేది కాదు, అమ్మే చులాగ్గా చెట్టు కందకుండా ములక్కాయలు కోసే విద్య నేర్చుకుంది. ఎప్పుడైనా గాలి విసురుకి ఓ కొమ్మ విరిగిపోతే చెయ్యి విరిగినంత పనయ్యేది అమ్మకి. మునగచెట్టుకి పసిపిల్లలంత సుకుమారపు అవసరాలుండేవి, అమ్మ ఆ చెట్టుని అంత సుకుమారంగానే చూసుకునేది. మా మావిడిచెట్లు ఇంటి నుంచి కాస్త దూరంగా పొలంలో వుండేవి. ఆ రెండు చెట్లకి పైపుతో నీళ్లు పెట్టేది. చెట్లనుంచి వచ్చే వస్తువేదీ అమ్మ వృధా పోనిచ్చేది కాదు. అమ్మ బజారుకి ఎప్పుడూ ఉత్త చేతులతో బయలుదేరేది కాదు, రెండు మూడు కట్టల కరివేపాకు, మునగాకో, ఏ కూరగాయలో సంచీలో వేసుకునేది. దారిలో ఉన్న ఇళ్లలో వాటి అమ్మకం అయిపోయేది. చుట్టుపక్కల పిల్లలు జామకాయలు, ఉసిరికాయల కోసం వచ్చేవాళ్ళు, అవి అమ్మకి అందే ఎత్తులో వుండవు కాబట్టి ఆ పిల్లల్ని కోసుకోనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బు తీసుకునేది. మామిడిపళ్ళ కాలం వస్తే  మాత్రం పొద్దంతా ఆ చెట్లకి మా అమ్మ కావిలి వుండేది. ఆ చెట్ల దరిదాపుల్లో ఒక నీడ తచ్చాడినా 'ఎవరక్కడ?' అని అరుస్తుండేది. 


మా ఇంటికెప్పుడైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉన్న మునగాకో, మునక్కాయలో తప్పకుండా కోసుకుని సంచీలో వేసుకునేది, వెళుతూ వెళుతూ వాటిని అమ్మేసి సంచీ ఖాళీ చేసుకునేది, ఎక్కడా వస్తువు దుబారా కావద్దు అమ్మ లెక్కలో. 


అమ్మ కంటపడకుండా ఒక్క పసి పిందె అయినా తప్పించుకునే ప్రసక్తి లేదు. ఇంక  మామిడిపళ్ళ కాలంలో అయితే మేము ఎంత బతిమిలాడినా ఊరునుంచి కదిలేది కాదు. తప్పక రావాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రంగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటికి చేరేది. మేము కనుక వేసవిలో ఊరికి వెళితే వెంటనే చెట్ల దగ్గరికెళ్లి రెండు పండిన కాయలు తెంపుకొచ్చేది. ఆ పళ్ళు మా చేతికిస్తూ 'మీరొస్తున్నారని చెట్టుమీదే వుండనిచ్చా' అని చెప్పేది ఎక్కువ రోజులు ఉండనిచ్చినందుకు చెట్టు తనకేదో అనుమతి ఇవ్వాలన్నట్టు. మాకు ఎప్పుడూ బాగా మగ్గిన జామకాయలు, చక్కగా పండిన ఉసిరికాయలు దొరికేవి. అమ్మకి ఆ చెట్ల అణువణువూ తెలుసు. 


మామిడిపళ్ళ కాలంలో అమ్మ ఆదాయం బాగా వుండేది. కొబ్బరికాయలు కూడా అమ్మేది. అమ్మకి ఎంత ఆదాయం వచ్చేది ఇవన్నీ అమ్మితే? మహా అయితే కొన్ని వందలు. మూడొందల రూపాయలు మహా బాగా సరిపోతాయి అనేది, ఇంకా కొంత డబ్బు దాచేది కూడా. నా అంచనా అయితే ఇంటద్దెతో కలిపి ఒక అయిదొందలు వస్తాయి నెలకి. అందులోనే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు గడిపేది అమ్మ. 


నాకు మంచి జీతం వచ్చే గవర్నమెంటు ఉద్యోగమని అమ్మకి తెలుసు. అమ్మ అవసరాలు నేను చూసుకోగలననే నమ్మకం, తాను ఒప్పుకుంటే చూసుకుంటాననే  గర్వం ఉన్నాయి ఆమెకు. అప్పట్లో మా ఊళ్ళో ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తిండికి కూడా సరిగా లేకుండా తిప్పలుపెట్టిన పిల్లల కథలేమీ తక్కువలేవు. మన దగ్గర పిల్లలు కావాలనుకునేదే ముసలితనంలో ఆసరాగా ఉంటారని. చిన్నప్పటినుంచీ 'పెద్దయ్యాక మీ అమ్మా నాన్నల్ని చూసుకోవా?' అన్న మాటల్ని నూరిపోస్తూనే వుంటారు. అయినా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసే పిల్లలు వుంటూనే  ఉన్నారు. అమ్మకీ మొదట్లో ఈ భయం వుండేది, కానీ నా చేతలతో ఆమెకి గట్టి నమ్మకం కలిగింది తనకా గతి పట్టదని. 


ఎవరైనా అమ్మని నిన్ను వాడు చూసుకుంటాడా అని అడిగితే, 'వాడెప్పుడైనా నేను అడిగింది ఇవ్వనన్నాడా? కట్టలకొద్దీ నోట్లు ఇవ్వబోతాడు, నేనే వద్దంటాను. నన్ను చూడటానికి ఎప్పుడైనా ఉత్త చేతులతో వస్తాడా? సంచీల నిండా ఏవొకటి నింపుకువస్తాడు. ఇక్కడేమైనా పిల్లలున్నారా అవి తినడానికి? అందుకే వాడిని అవేవీ తేవద్దంటాను. నా ఒక్కదానికి గడవడానికి ఈ చెట్లు చాలవా?' అంటుంది. 


అమ్మకి పార్కిన్సన్స్ జబ్బు చేశాక ఎనిమిదేళ్లు బతికింది. ఆమె ఇష్టం మీద హోమియోపతీ మందులు వాడినా, అల్లోపతీ మందు కూడా వేసుకునేది. రోజుకో మాత్ర, అది ఖరీదైనదే. ఎక్కువ ధర అని తెలిస్తే వాటిని వద్దంటుందన్న భయానికి నేను అవి చవకేనని చెప్పా. ప్రతీ నెలా మర్చిపోకుండా ఆ మాత్రలు కొనిచ్చేవాణ్ణి. ఊళ్ళో ఎవరైనా 'నువ్వు నీ కొడుకుని చదివించావ్, వాడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా?'అని అడిగితే అమ్మ 'మీకు కళ్ళు కనబడట్లేదా, నెలనెలా ఎన్నెన్ని మాత్రలు తెచ్చి పోస్తున్నాడు? వాటికీ ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా చెప్పాడా? అవి వెయ్యో రెండువేలో నీకేమైనా తెలుసా?' అని పోట్లాడేది. 


ఆ చెట్లు అమ్మకి ఆదాయం ఇవ్వడమే కాక ఇంకో పెద్ద మేలు చేసాయి. 


నేనెప్పుడూ ఊరికి వెళ్లినా అమ్మ ఏ చెట్టు కిందో కూర్చొనో, నిలబడో వుండేది. మా ఇల్లు పొలాల్లో వుండటంచేత ఒంటరిగా వుండేది. మిగిలిన ఇళ్ళు కూతవేటు దూరంలో వుండేవి కానీ, యింటి ముందు అటూ ఇటూ జనాలు తిరిగేవాళ్లు కాదు. ఎప్పుడైనా జనాలు ఇటు వచ్చినా ఒకట్రెండు మాటలంతసేపు కనపడేవాళ్లు. ఎవరి పని వాళ్ళకుండేది. అమ్మకి చెట్లతోనే సావాసం. వాటితో మాట్లాడేది. వాటితో పాటు అమ్మ ఒక చెట్టు, అట్లా కలిసిపోయేది. వాటిలో వచ్చే చిన్న మార్పైనా అమ్మ పసిగట్టేది. ఏ చెట్టు మీద ఎన్ని పిందెలున్నాయి, ఎన్ని పండ్లున్నాయి, ఎన్ని కాయలున్నాయి, అవి ఎన్నాళ్ళలో పండుతాయి, అన్నీ అమ్మకి తెలుసు. ఏ పనిలో ఉన్నా వాటివైపు ఓ చెవి వేసి వుంచేది. అమ్మకు కొన్నేళ్లు ఎక్కువ ఆయుష్షు పోసింది ఖాయంగా ఆ చెట్లే. 


రెండేళ్లపాటు వర్షాలు లేవు మా ప్రాంతంలో. బోరింగులో నీళ్లు అడుగంటిపోయాయి. ఆ చెట్లని కాపాడానికి అమ్మ ఎన్నో తిప్పలు పడ్డది. పార్కిన్సన్స్ వల్ల కాళ్లు చేతులు సరిగ్గా చాపగలిగేది కాదు, బరువులు పట్టుకునే శక్తి వుండేది కాదు. ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పెద్ద బాధ లేదు కానీ మామిడి చెట్లు వడలిపోవడం మొదలైంది. వాటిని కాపాడుకోవాలని అమ్మకు ఎంత ప్రాణంగా ఉండేదంటే పిల్లలు ఆడుకునే రెండు గురుగుముంతలు కొనుక్కొచ్చింది. వాటిలో నీళ్లు నింపుకుని ఆ చెట్ల దగ్గరికి బయల్దేరేది. ఆ కాస్త దూరానికి ఒకటిరెండుసార్లు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుంటేగానీ నడవగలిగేది కాదు. అట్లా ప్రతీరోజూ కాసిన్ని నీళ్ళని పోసి ఆ చెట్లని మళ్ళీ జీవం పుంజుకునేలా చేసింది.  


మేము అమ్మని చూసేందుకు వెళ్ళినప్పుడు ఆమె అడిగేది ఒక్కటే 'ఆ మామిడి చెట్లకి ఒక కుండెడు నీళ్లు పోసిపొమ్మని'. అమ్మ దగ్గరికి ఏదైనా కొనడానికి వచ్చినవాళ్ళనీ ఆ మాటే అడిగేది. రెండేళ్లపాటు ఆ మామిడిచెట్లు పూత పుయ్యలేదు. కానీ అమ్మ పంతంతో బతికించింది. మూడో ఏడాది కొంచెం వర్షాలు పడ్డాయి, మామిడిచెట్లు మళ్ళీ పూత పూసి కాయలు కాసాయి, అమ్మ సంబరానికి అంతులేదు. 


అమ్మ చివరి యేడాది  భారంగా గడిచింది. ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మా ఇంటికి తీసుకువచ్చాం. ఊర్నుంచి అమ్మని చూడటానికి ఎవరైనా వస్తే ముందు చెట్ల గురించే వాకబు చేసేది. మేము కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు పోయడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైనా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగైతే తనను బస్సు ఎక్కించేదాకా ఊరుకునేది కాదు. ఆ చెట్లకి ఆ గురిగిముంతలతో నీళ్లు పోస్తూ కనీసం వారమన్నా అక్కడ వుండేది. ఆ చెట్లని చూసుకోవడానికి ఎవరూ లేరని అమ్మ చాలా దిగులుపడేది. 


అమ్మ చివరి ఆరు నెలల్లో మా ఊరికి వెళ్లలేకపోయింది. మేము వెళ్ళినప్పుడల్లా ఆ చెట్లకి నీళ్లు పోస్తూనే ఉన్నాం. మేం చెయ్యగలిగింది అంతే. పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చెట్లకి నెలకోసారికన్నా ఎక్కువ వెళ్లి నీళ్లు పొయ్యలేకపోయాం. అమ్మ కడతేరి పోయాక కొన్ని నెలలపాటు మా ఊరికి వెళ్లలేకపోయాం. అమ్మ వస్తువులు తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు ఆ మామిడి చెట్లని ఒకసారి  చూడాలనుకున్నాను. చెప్పడానికేముంది? రెండు చెట్లూ ఎండిపోయి మొద్దుల్లా నిలబడ్డాయి. అనాధ పిల్లల్లా! 


---------------- సేకరణ*************** ఈ కథ పోస్ట్ చేయడం పై అభ్యంతరం వుంటే లేదా copy right వుంటే గనుక తెలియజేయండి. తొలగించగలను. మంచి కథను పాఠకులకు అందించడమే నా ఉద్దేశ్యం అని మనవి చేస్తూ..


ఈ కథ  చదువుతూ వుంటే.. ఆవిడ.. ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మ  అనిపించింది, చాలా మంది అమ్మల్లాగే వుంది కూడా!  విజయవంతమైన  అనేదానికన్నా ఆటుపోట్లు తట్టుకునే నిబ్బరం ఉన్న ప్రతి స్త్రీ పురుషుల వెనుక గట్టిగా నిలబడ్డ అమ్మ  మాత్రం కచ్చితంగా వుంటుందని అనిపిస్తుంది.  అమ్మ కు 🙏




4, అక్టోబర్ 2025, శనివారం

మధ్యాహ్న భోజనం

 మళయాళంలో  కారూర్ నీలకంఠ పిళ్ళై రాసిన కథకు  LR స్వామి గారు తెలుగు అనువాదం చేసారు. ఇలాంటి మంచి కథను ఆడియో బుక్ గా చేసాను. తప్పకుండా వినండీ.

 

2, అక్టోబర్ 2024, బుధవారం

ఇదిగో చూడండి

 హాల్లో అడుగు పెట్టగానే నేను అవాక్కయి రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండిపోయాను. ఆర్ట్‌ స్టూడెంట్‌, ఇరవయ్యేళ్ళ అమ్మాయి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో రకరకాల భంగిమల్లో తయారుచేసిన తెల్లని రొమ్ముల శిల్పాలు ప్రదర్శనకి పెట్టింది. నేను సిగ్గుపడుతూ రహస్యంగా ”ఇలాంటి శిల్పాలు చేసేందుకు ఆ అమ్మాయికి సిగ్గనిపించలేదా?” అని అడిగాను అమ్మని.


”ఎందుకు సిగ్గుపడాలి? ఈ శరీర భాగాల వల్ల అమ్మాయిలూ, ఆడవాళ్ళూ ఎంత హింస అనుభవిస్తున్నారు? రద్దీలో ఉన్నప్పుడు అయ్యే అనుభవాలు వాళ్ళకే తెలుసు. ప్రకృతి ప్రసాదించిన అవయవాలని చూసి సిగ్గుపడడం దేనికి రూహీ? వీటిని అశ్లీలంగా చూపించడం మాత్రం తప్పే. యుక్తవయసు కుర్రాళ్ళు ఈ ప్రదర్శనని చూసేందుకు సిగ్గుపడుతున్నారని చెపితే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారేమో.”






1, అక్టోబర్ 2024, మంగళవారం

ఇదిగో చూడండి..

 చాలా చాలా అవసరమైన కథ యిది. శాంతసుందరి గారూ మీకు అనేకానేక ధన్యవాదాలు అనువదించి ..ఇచ్చినందుకు. ఆడపిల్లలున్న ప్రతివారు యీ కథ చదవండి,పిల్లలతో చదివించండి ..


పాఠకులు లింక్ యిస్తే కూడా చదవని వాళ్ళు వున్నారు ..అలాంటి వారి కోసం యీ కథని పూర్తిగా Copy and paste  చేస్తున్నాను. భూమిక వారిని అనుమతి కోరుతూ .. 


‘ఇదిగో చూడండి!” హిందీ మూలంః నీలమ్‌ కులశ్రేష్ఠ -ఆర్‌.శాంతసుందరి


Posted on March 22, 2018 by భూమిక


మట్టిరంగు సహ్యాద్రి కొండలమీద క్యాబ్‌ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం. సాపూతారా కొండలు మూడువేల అడుగులేనని అమ్మ ఎంత నవ్విందో, ”ఆహా! గుజరాత్‌ హిల్‌ స్టేషన్‌ ఎంత బావుంది. ఒక మట్టి దిబ్బని ‘హిల్స్‌’ అంటున్నారు” అంది వ్యంగ్యంగా.


అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది. ‘ఏమైంది దీనికి? ఎంత అందమైన హిల్‌ స్టేషన్‌ ఇది. మధ్యలో లేక్‌ కూడా ఉంది’ అన్నాను.


అమ్మ నా బుగ్గని సుతారంగా తట్టి, ”యూ.పీ., కాశ్మీరీ హిల్‌ స్టేషన్లను చూశావంటే నువ్వు కూడా వెక్కిరిస్తావు తెలుసా?” అంది.


సాపూతారా, అంటే పాకే ప్రాణి, పాములాంటిది. సర్పగంగా నది ఒడ్డున ఉంది ఈ కొండ. హోలీ పండుగనాడు ఆదివాసీలు దీనికి పూజలు చేస్తారు. కొంత దూరం పైకెక్కగానే పచ్చదనం కనిపిస్తుంది. తొంభై ఏళ్ళ క్రితం చెట్ల గుబుర్లలో, పొదల మధ్య ఆదివాసీలు ఎలా నివసించేవారో!


పొట్ట నింపుకోవటమే వాళ్ళ జీవితం అయ్యుంటుంది. అమ్మే చెప్పింది అలాగని. వీళ్ళు భిల్లులయినా మరే తెగవాళ్ళయినా మగవాళ్ళందరూ ఇళ్ళూ, భవనాలు కట్టే చోట కూలి చేస్తూ బతికేవారు, ఆడవాళ్ళు పొయ్యిలోకి కట్టెలూ, పుల్లలూ ఏరేందుకు అడవిలోకి పోయేవారు. పాకల్లో వదిలి వెళ్ళే పిల్లలని చూసేందుకు ఎవరూ ఉండరు కదా, అందుకని వాళ్ళకి నల్ల మందు కొద్దిగా తాగించి నిద్రపుచ్చేవారు. ఇలా నల్లమందు తాగి తాగి ఆ పిల్లల్లో బుద్దిమాంద్యం, ఎప్పుడూ మత్తుగా ఉండడం కనిపించేవి. పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఎందుకూ పనికిరాకుండా తయారయేవాళ్ళేమో.


పూర్ణిమగారు ముంబై నుంచి ఇక్కడికి విహార యాత్రకి వచ్చినపుడు వీళ్ళని చూసిందేమో. పధ్నాలుగేళ్ళ ఆడపిల్లలు చోళీ, ఓణీ వేసుకుని, తలమీద కట్టెల మోపుతో సరాసరి రోడ్డు మధ్యన వయ్యారంగా నడుస్తూ పోవడం చూసి ఆశ్చర్యపోయి ఉంటుందావిడ. ఒకసారి ఆవిడ కారుకి అడ్డంగా నడుస్తున్న అలాంటి అమ్మాయి ఎంత గట్టిగా హారన్‌ మోగించినా పక్కకి తప్పుకోనేలేదు. డ్రైవర్‌ ఆఖరి నిమిషంలో కారు పక్కకు తప్పించి వెళ్తూ ఉంటే కిటికీలోంచి ”హారన్‌ వినిపించలేదా అమ్మాయ్‌?” అని అడిగిందట ఆవిడ. ఆమె ప్రశ్నకి ఆ అమ్మాయి తల తిప్పి చూసింది. ఆ పిల్ల కళ్ళల్లో కనిపించిన శూన్యం, మొహంలో ఏ భావమూ లేకపోవడం చూసి ఆవిడ అవాక్కయింది. తర్వాత వాకబు చేస్తే వాళ్ళందరూ నల్లమందు వ్యసనానికి బానిసలైపోయారని తెలిసింది. 1953లో ఇలాంటి ఆడపిల్లల్ని బాగుచేసేందుకు ఆవిడ ‘శక్తిదల్‌’ అనే సంస్థను ప్రారంభించి కాలక్రమాన నల్లమందు అలవాటు మాన్పించడమే కాక వాళ్ళకోసం స్కూళ్ళూ, కాలేజీ కూడా ప్రారంభించిందట.


”ఏయ్‌, ఏమిటాలోచిస్తున్నావు?” అన్నాడు అరవింద్‌ నా మొహం ముందు చెయ్యి ఆడిస్తూ.


నేను సిగ్గుపడుతూ, ”ఈ కొండల గురించీ, ఇక్కడ ఆదివాసీల గురించీ మా అమ్మ ఎన్నో విషయాలు చెప్పింది. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి” అన్నాను.


నీరవ్‌, మొబైల్‌లో ఏవో గేమ్స్‌ ఆడుతున్న త్రిషా నవ్వారు. మీనల్‌ కిటికీలోంచి బైటికి చూస్తూ కూర్చుంది. అరవింద్‌ కారు వేగం తగ్గిస్తూ, ”హోటల్‌ వచ్చేసింది. మొబైళ్ళు ఆఫ్‌ చెయ్యండి” అన్నాడు.


సాపూతారా లేక్‌ చూడగానే నేను చిన్నపిల్లలా ఆనందపడిపోయాను. ”ఎంత బావుందో అద్దంలా మెరిసిపోతోంది కదూ?” అన్నాను.


సామాను గదుల్లో పెట్టి కాస్త మొహం అదీ కడుక్కుని నలుగురం విద్యాపీఠ్‌ వైపు నడిచాం. సోషల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ మాకు ఈ ప్రాజెక్టు చేయమని ఇచ్చింది. ‘ఆదివాసీల అభివృద్ధికి ఎన్జీఓలు అందించే సహకారం’. అక్కడ ప్రిన్సిపాల్‌ మమ్మల్ని ముందు ఒక చిన్న మైదానంలోకి తీసుకెళ్ళింది. అక్కడ నేలమీద తివాచీలు పరుచుకుని అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. కొందరు కాలేజి విద్యార్థులు వాళ్ళతో మాట్లాడేందుకు వస్తున్నారని ముందే వాళ్ళకి తెలియజేశారు. నలుగురైదుగురు అమ్మాయిలు పూలదండలతో మమ్మల్ని ఆహ్వానించి ప్రార్థనాగీతం పాడారు.


మేము నలుగురం వాళ్ళకి మా ప్రాజెక్టు గురించి చెప్పి జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగాం. అమ్మాయిలు చక్కగా జవాబులు చెప్పారు. ఒక లెక్చరర్‌ మాకు విద్యాపీఠ్‌లోని వివిధ విభాగాలను చూపించింది. నల్లమందుకి అలవాటుపడ్డ అమ్మాయిలను ఇంత సమర్ధంగా సంగీతం, ఆటలు, చదువు సంధ్యలవైపు మళ్ళించిన ఆ విద్యాపీఠ్‌ ఎంత గొప్పగా పనిచేస్తోందో అనుకున్నాను.


రోజంతా వివరాలు రాసుకుంటూనే ఉన్నాం. సాయంత్రం వరకు అక్కడ గడిపి అలసిపోయి క్యాబ్‌లో జారగిలపడి కూర్చుని హోటల్‌కు బయలుదేరాం. విద్యాపీఠ్‌ ప్రార్థనా గీతం – ”సాపూతారా నా, రుతంభరా నా, సారా సపన్‌ బనానా, అమే సృష్టి సజావీ, జ్యోతి జగావీ…’ మనసులో ఇంకా మారుమోగుతూనే ఉంది.


‘రుతంభరా అంటే సనాతన సత్యంతో నిండి ఉన్న’ అని ప్రిన్సిపల్‌ చెప్పింది. అక్కడ సనాతన సత్యమంటే ప్రగతి ద్వారాలు తెరుచుకుంటూ పోవటమని ఆవిడ చెప్పింది. ఆదివాసీ అమ్మాయిలే ఇంత ప్రగతి సాధిస్తే మరి మనం మన స్టాండర్డ్‌ని ఇంకా పెంచాల్సి


ఉంటుందని అనుకున్నాం నేనూ, త్రిషా. ఇంటికి చేరుకున్నాక విన్నదీ, చూసిందీ మొత్తం అమ్మకి చెప్పేయాలన్న తహతహతో రాత్రి బాగా పొద్దుపోయేవరకూ మాట్లాడుతూనే ఉంటే అమ్మ కోప్పడింది. ”ఇక చాలు రూహీ, చూడు ఎంత అలసిపోయావో, నేనెక్కడికీ పారిపోవటం లేదుగా, రేపు మిగతా కబుర్లు చెబుదువుగాని పడుకో” అంది.


పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, స్నానానికి బట్టలు తీసుకుంటుండగా మొబైల్‌లో మెసేజ్‌ వచ్చినట్టు ‘టింగ్‌’ అని చప్పుడయ్యింది. బట్టలు మంచంమీద పెట్టి మెసేజ్‌ ఓపెన్‌ చెయ్యగానే అందులో ఉన్న ఫోటో చూసి నా తల తిరిగిపోయింది. కుర్తీకున్న గుండీలన్నీ తీసేసి ఉన్న నా ఫోటో. నడుం వరకూ నగ్నంగా… చూడగానే నేను హోటల్‌లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు కిటికీ కర్టెన్‌ సందులోంచి తీసినదని తెలిసిపోయింది. మొబైల్‌ నంబర్‌ నీరవ్‌ది. మెసేజ్‌లో, ‘వాట్‌ ఎ బ్యూటీ యు హ్యావ్‌ ఇన్‌సైడ్‌’ అని ఉంది. నేను నిలువెల్లా వణికిపోయాను. పడిపోకుండా ఉండేందుకు పక్కనున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాను. నేను నిలదొక్కుకునే లోపల మరో మెసేజ్‌ వచ్చింది. ‘కాలేజ్‌కి వెళ్ళే లోపల నా గదికి రా, లేకపోతే మెసేజ్‌ వైరల్‌ అయిపోతుంది. అర్థమైంది కదా?’ ఇది చూసి నేను పూర్తిగా కుంగిపోయాను. నిలబడేందుకు కూడా శక్తి లేనిదానిలో కుర్చీలో కూలబడ్డాను. ఇంతలో వంటింట్లోంచి అమ్మ గొంతు వినబడింది, ”రూహీ, లంచ్‌ బాక్స్‌ రెడీ చేశాను’.


భయంతో బిగుసుకుపోయి నాకు నోటంట మాట రాలేదు. కాసేపటికి అమ్మ నా గదిలోకొచ్చి, ”ఇంకా తయారవలేదేం? అదేమిటి మొహం అంత నీరసంగా కనిపిస్తోంది?” అంది గాభరాపడుతూ.


”అమ్మా!” కష్టంమీద ఆ ఒక్క మాటా నోట్లోంచి రాగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది. అమ్మ కంగారుపడుతూ నన్ను దగ్గరికి తీసుకుని ”ఏమైందే?” అంది.


”తల పగిలిపోతోందమ్మా, ఈ రోజు కాలేజి మానేస్తాను” అన్నాను.


”అంతమాత్రానికే ఇలా ఏడవాలా? వెళ్ళి స్నానం చేసి రా, తేలికగా ఉంటుంది. ఇవాళ ఇంట్లో పడుకుని రెస్ట్‌ తీసుకో” అంది అమ్మ. వెంటనే అలమారలో ఉన్న తలనొప్పి మాత్ర తీసి నా మంచం పక్కనున్న బల్లమీద పెట్టి ‘ఇవాళ ఆఫీసులో ఇన్‌స్పెక్షన్‌ ఉంది. లేకపోతే సెలవు పెట్టేదాన్నే. తలనొప్పి తగ్గకపోతే కొద్దిగా ఏమైనా తిని ఈ మాత్ర వేసుకో’ అంది.


అమ్మ త్వరగా ఆఫీసుకెళ్ళిపోతే బావుణ్ణు, గట్టిగా గొంతు చించుకుని అరిచి ఏడవచ్చు అనుకున్నాను.


ఇక నేను ఎవరికీ నా మొహం చూపించలేను అనుకున్నాను. అమ్మ వెళ్ళిపోగానే ముందు నా మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశాను. లేకపోతే నీరవ్‌ ఇంకా ఏ చెత్త మెసేజ్‌లు పంపిస్తాడోనని భయం వేసింది. గుండె దడదడలాడటం ఇంకా పూర్తిగా తగ్గలేదు. వాడు ఈ మెసేజ్‌ నిజంగా వైరల్‌ చేస్తే? ఈ బాధ ఎవరికి చెప్పుకోను? అమ్మ నాతో స్నేహితురాలిగా అన్ని విషయాలూ మాట్లాడుతుంది. అయినా ఈ ఫోటో అమ్మకి చూపించటం నా వల్ల కాదు. నాన్న టూర్‌ నుంచి వెనక్కి వచ్చాక ఈ విషయం తెలిస్తే… దేవుడా! నాతోపాటు అందరికీ తలవంపులే కదా? అలా జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం. అమ్మ ఇంటికి వచ్చేలోగా ఆత్మహత్య చేసుకోవాలి. కానీ ఆత్మహత్య పాపమనీ, పిరికివాళ్ళు చేసే పని అనీ అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. మరి… మరి… ఏం చెయ్యాలి? నాకు ఏ దారీ తోచలేదు. ఏడుస్తూ అలా కుర్చీలోనే పక్కకి వాలి కాసేపటికి నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.


అదేపనిగా డోర్‌ బెల్‌ మోగుతుంటే మెలకువ వచ్చింది. గడియారం వైపు చూశాను. ఒంటిగంట. ఈవేళప్పుడు ఎవరొచ్చారు చెప్మా, మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ ఉండరని అందరికీ తెలుసే అనుకున్నాను. నెమ్మదిగా నడుస్తూ మెయిన్‌ డోర్‌ కీ హోల్‌ నుంచి చూశాను. బయట అమ్మ రుమాలుతో మొహం తుడుచుకుంటూ నిలబడి ఉంది. నేను ఉలిక్కిపడి తలుపు తీశాను. ”ఇంత త్వరగా వచ్చేశావేం” అన్నాను.


”నీ ఒంట్లో బాలేదుగా, ఆఫీసులో ఉండలేకపోయాను. ఇన్‌స్పెక్షన్‌ అయిపోగానే సెలవు పెట్టి వచ్చేశాను” అంది అమ్మ. నా నుదురు తాకి చూసి, ”జ్వరం లేదు. అవునూ! మొబైల్‌ ఎందుకు ఆఫ్‌ చేసి పెట్టావు? ఎన్నిసార్లు ఫోన్‌ చేశానో. నువ్వు ఎత్తకపోయేసరికి ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చాయి తెలుసా?” అంది.


నేను అమ్మ నడుముని వాటేసుకుని భోరుమని ఏడవసాగాను. అమ్మ గాభరాగా నా మొహం పైకెత్తి తల నిమురుతూ ”ఏమైందే? ఎందుకా ఏడుపు? చెప్పు…” అంది.


నేను ఏడుస్తూనే, ”నా ఒంట్లో అస్సలు బాలేదు…” అన్నాను తలదించుకుని.


అమ్మ బలవంతాన నా మొహం మళ్ళీ పైకెత్తి, ”రూహీ! నేను నీ అమ్మని. నువ్వేదో పెద్ద ఆపదలో చిక్కుకున్నావు. చెప్పు అదేమిటో” అంది కాస్త గట్టిగా.


”అమ్మా…” అని ఇంకా గట్టిగా ఏడుస్తూ మొబైల్‌ వైపు చూపించాను.


అమ్మ వెళ్ళి దాన్ని తీసుకొచ్చింది. నేను దాన్ని ఆన్‌చేసి నీరవ్‌ పంపిన మెసేజ్‌ ఆవిడకు చూపించాను. ఒక్క క్షణం అమ్మ మొహం పాలిపోయింది. కానీ వెంటనే తనని తాను సంబాళించుకుని, ”ఎప్పుడు తీసిన వీడియో ఇది?” అని అడిగింది.


”సాపుతారా హోటల్‌లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు తీసినట్లుందమ్మా”.


”కొత్త చోటికి వెళ్ళినప్పుడు కిటీకీలు, కర్టెన్లు బాగా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలని నీకు చాలాసార్లు చెప్పాను”.


”సారీ అమ్మా!”


”అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు? సర్లే, నువ్వేమీ బాధపడకు.”


”ఇంత ఘోరం జరిగితే బాధపడవద్దంటావేంటి? మన కుటుంబానికి ఎంత అవమానం ఇది.”


”అవమానమా? అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? నువ్వే తప్పూ చెయ్యలేదే. పాపపు పని అంతకన్నా చెయ్యలేదు. ఇక ఈ వీడియోలో కనిపించేది నీ శరీరంలో మాత్రమే ఉందా? ఇది లోకంలో ఉండే ప్రతి స్త్రీ శరీరంలోనూ ఉండే భాగమే కదా? వీటినుంచి పాలు తాగే ప్రతి మనిషీ బ్రతికి ఉండగలుగుతాడు. ఎవడో రాస్కెల్‌ దొంగతనంగా వీటిని వీడియో తీసి అల్లరి చేద్దామనుకున్నాడు. అది వాడికి జరిగే అవమానమే తప్ప నీకు కాదు. లే, లేచి మొహం కడుక్కుని తయారవు. నీ అదృష్టం బావుంది.ఈ రోజు యూనివర్శిటీ ఫైనార్ట్స్‌ ఫేకల్టీలో ఎగ్జిబిషన్‌ నడుస్తోంది. బరోడాలో ఉన్న ఈ ఫేకల్టీ దేశం మొత్తంలో అతి పెద్ద ప్రసిద్ధ ఆర్ట్‌ ఫేకల్టీ అన్నది నీకు తెలుసుగా? అక్కడ ప్రస్తుతం ప్రదర్శనకి పెట్టిన కళాఖండాలు, నువ్వు చూసి తీరాలి.”


”ఎందుకు? ఏముందక్కడ?”


”అక్కడికెళ్ళాక నువ్వే చూస్తావుగా, పద”.


హాల్లో అడుగు పెట్టగానే నేను అవాక్కయి రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండిపోయాను. ఆర్ట్‌ స్టూడెంట్‌, ఇరవయ్యేళ్ళ అమ్మాయి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో రకరకాల భంగిమల్లో తయారుచేసిన తెల్లని రొమ్ముల శిల్పాలు ప్రదర్శనకి పెట్టింది. నేను సిగ్గుపడుతూ రహస్యంగా ”ఇలాంటి శిల్పాలు చేసేందుకు ఆ అమ్మాయికి సిగ్గనిపించలేదా?” అని అడిగాను అమ్మని.


”ఎందుకు సిగ్గుపడాలి? ఈ శరీర భాగాల వల్ల అమ్మాయిలూ, ఆడవాళ్ళూ ఎంత హింస అనుభవిస్తున్నారు? రద్దీలో ఉన్నప్పుడు అయ్యే అనుభవాలు వాళ్ళకే తెలుసు. ప్రకృతి ప్రసాదించిన అవయవాలని చూసి సిగ్గుపడడం దేనికి రూహీ? వీటిని అశ్లీలంగా చూపించడం మాత్రం తప్పే. యుక్తవయసు కుర్రాళ్ళు ఈ ప్రదర్శనని చూసేందుకు సిగ్గుపడుతున్నారని చెపితే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారేమో.”


నేను చుట్టూ ఒకసారి చూశాను. వయసు మళ్ళిన మగవాళ్ళు, అమ్మాయిలూ, ఆడవాళ్ళూ మాత్రమే ఒక్కొక్క శిల్పం దగ్గరా ఆగి చూస్తున్నారు. ఆ శిల్పాలు చాలా అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. అది చూసి నాకు పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ పుంజుకున్నట్టనిపించింది. సిగ్గుపడడం మానేసి తలెత్తి ఆ శిల్పాలని చూడటం మొదలుపెట్టాను. వాటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పువ్వులూ, జలపాతాలూ, కొండల్లాగే సృష్టికర్త వీటిని కూడా సృష్టించాడు. వీటి గురించి సిగ్గుపడాల్సిన అవసరమేముంది? అనుకున్నాను.


”నువ్వు సాపూతారాకి వెళ్ళినపుడు అక్కడ పూర్ణిమగారు తీసుకొచ్చిన మార్పు చూశావు కదా! ఈ ప్రదర్శన కూడా మనుషుల్లో, వాళ్ళ దృష్టిలో మార్పు తీసుకురావడానికే ఈ అమ్మాయి ప్రయత్నించింది” అంది అమ్మ.


”రెంటికీ పోలికేముందమ్మా?” అన్నాను అర్థం కాక.


”చెబుతా విను. అక్కడ నల్లమందు మత్తులో మునిగితేలే అమ్మాయిలని కావాలనే అలా వ్యక్తిత్వం అనేది లేకుండా చేస్తూ వచ్చారు కొందరు స్వార్థపరులు. అలాగే ఆడవాళ్ళని వాళ్ళ అవయవాల గురించి భయపెట్టి, వాటిని తిట్లుగా తయారుచేసి, వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఆడవాళ్ళ సగం శక్తిని ఈ భయమే మింగేస్తుంది. ఏం చేస్తే ఏం తప్పో అని ఆలోచించటంలోనే సగం సమయం వృథా అయిపోతుంది. ఈ అమ్మాయి ఎంతో ధైర్యంగా అలాంటి జడత్వాన్ని మట్టుపెట్టే ప్రయత్నమే చేసింది. ఎప్పుడైనా తనని నీకు పరిచయం చేస్తాను”


”ఇప్పుడే చేయొచ్చుగా?”


”తను ఏదో ముఖ్యమైన క్లాసు అటెండ్‌ అయ్యేందుకు వెళ్ళిందని రిసెప్షనిస్ట్‌ ఎవరితోనో అంటుంటే విన్నాను. ఈ అమ్మాయే కాదు చాలామంది ఆడవాళ్ళు, కొందరు మగవాళ్ళూ స్త్రీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ నిద్ర లేపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే సమాజం భరించలేదు. వాళ్ళ జీవితాలను నరకం చేసేందుకు ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తుంది”


”సమాజం అంటే జనమే కదా? వాళ్ళేం చేస్తారు”


”కాస్త ముందడుగు వేసి కొత్త ప్రయత్నమేదైనా చెయ్యబోతే, ‘ఆ! వీళ్ళ మొహం, వీళ్ళవల్ల ఏమవుతుంది? వెనక మొగుడో, అన్నదమ్ములో ఎవరో ఉండి ఉంటారు అనో, పైకి రావడానికి ప్రతిభే ఉండాలా ఏంటి, వెధవ్వేషాలు వేస్తే చాలు ఎవరైనా పడిపోతారు అనో, వెకిలిగా మాట్లాడతారు.” అంది అమ్మ.


ఇంటికి వచ్చేలోపల నా భయం, సంకోచం పూర్తిగా తగ్గిపోయాయి. మొబైల్‌ ఆన్‌ చేసి అరవిందకీ, త్రిషకీ, మీనల్‌కీ అంతా చెప్పేశాను. ఇది నా పోరాటమనీ, నేనే దీనికి పరిష్కారం జరిగేలా చూస్తాననీ, వాళ్ళను జోక్యం చేసుకోద్దనీ కూడా చెప్పాను. స్నేహితురాళ్ళిద్దరూ ఆవేశపడిపోతూ, ”పద ఆ మెసేజ్‌ పోలీసులకు చూపించి నీరవ్‌ మీద రిపోర్టిద్దాం” అన్నారు.


”ప్రతివాళ్ళకూ పోలీసులు ఎంతకని సాయం చేస్తారు?” అన్నాను.


మర్నాడు కాలేజి గేటు దగ్గరే నీరవ్‌ కనిపించి వంకరగా నవ్వుతూ, ”ఏమిటి నాతో వస్తున్నట్టేగా?” అన్నాడు.


”ఎక్కడికి? ఎందుకు రావటం?” అన్నాను.


”నువ్వేమైనా అభం శుభం తెలియని చిన్నపిల్లవా? ఒకబ్బాయి ఒకమ్మాయిని ఏకాంతంగా కలుసుకోవడమంటే అదెందుకో నీకు తెలీదా?”


నేను రెండు చేతులూ కట్టుకుని నిటారుగా నిలబడ్డాను. ”నీ వెంట నేనెక్కడికీ రాదల్చుకోలేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో” అన్నాను నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ.


నీరవ్‌ ఖంగుతిన్నట్టు దొంగచూపులు చూడసాగాడు. నేను క్లాస్‌వైపు నడిచాను.


క్లాసులో అందరూ ఉన్నారు. సర్‌ ఇంకా రాలేదు. కొందరు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు చేతిలో మొబైల్‌ ఫోన్లు పట్టుకుని రహస్యంగా ఏదో అంటూ నవ్వుకుంటున్నారు. నేను క్లాసులోకి రాగానే కొందరు కుర్రాళ్ళు నా వైపు అల్లరిగా చూస్తూ ఏవో సైగలు చేయడం మొదలుపెట్టారు. నేను చప్పట్లు చరిచి గట్టిగా, ”ప్లీజ్‌ లిజన్‌ గైస్‌” అన్నాను.


నా గొంతు విని మిగిలినవాళ్ళు కూడా నావైపు చూశారు. ”మాలో కొందరు సాపూతారాకి సర్వే చేసేందుకు వెళ్ళిన సంగతి మీకందరికీ తెలిసే ఉంటుంది. హోటల్‌లో నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో ఒకణ్ణని చెప్పుకునే ఈ నీరవ్‌ నాకు తెలీకుండా నా వీడియో తీశాడు. అంతేకాదు, దాన్ని మీ అందరికీ పంపాడు. ఇంతవరకూ చూడని వాళ్ళెవరైనా ఉంటే చూసేయండి” అన్నాను గొంతులో ఏ భావమూ పలికించకుండా.


నీరవ్‌ వైపు చూశాను. తలొంచుకుని మూగవాడిలా నేలచూపులు చూస్తున్నాడు. మొబైల్‌లో వీడియో చూస్తున్న కొందరు


కుర్రాళ్ళు సిగ్గుపడి మొబైల్స్‌ ఆఫ్‌ చేసేశారు. కొందరు మాత్రం, ”యూ! నీరవ్‌… షేమ్‌ ఆన్‌ యూ!” అని కోపంగా అరిచారు.


ఒక అబ్బాయి తన చెప్పు తీసి నీరవ్‌ మీదికి విసిరేశాడు. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు వాణ్ణి చుట్టుముట్టి అందిన చోటల్లా కొట్టడం మొదలుపెట్టారు. నేను అందర్నీ ఆగమన్నాను. ”నీరవ్‌కి శిక్ష పడింది. నేను తల్చుకుంటే వీసీ దగ్గరకెళ్ళి వీణ్ణి రస్టికేట్‌ చేయించగలను, లేదా పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వగలను. కానీ అలా చేస్తే వీడి లైఫ్‌ పాడవుతుంది. ఇప్పుడు తన తోటివాళ్ళే వేసిన ఈ శిక్షవల్ల వీడు ఇక జన్మలో ఏ ఆడపిల్లనీ ఇలా అవమానపరచడు. ఆడపిల్లల్ని గౌరవించటం మొదలెడతాడు. దీంతో గుణపాఠం నేర్చుకున్నాడనే అనుకుంటున్నాను” అన్నాను.


”రూహీ… ప్లీజ్‌… నన్ను క్షమించు… ప్లీజ్‌ క్షమించానను రూహీ…” అంటూ వలవలా ఏడవడం మొదలుపెట్టాడు నీరవ్‌.

14, సెప్టెంబర్ 2024, శనివారం

ఓ అమ్మ కథ

 కథ చాలా బాగుంది...... తల్లి ... బిడ్డల మీద ప్రేమతో... నాటిన మొక్కలలో బిడ్డలను చూసుకుంటుంది . రైల్వే లైన్ కోసం జరుపుతున్న భూసేకరణలో కొంత స్థలము ఆ మొక్కలు పోతాయని తెలిసి దిగులు పడుతుంది. పెళ్ళై అత్తవారింటివెళ్లిన కూతురు రాలేదు . అలాగే తతిమ్మా ఇద్దరు కొడుకులు రాలేరు. బిడ్డలా కోసం ఎదురుచూస్తున్న ఆమెకు నిరాశే మిగులుతుంది. ఆఖరికి బిడ్డల్లాగా భావించే చెట్లు నేల  కూలిపోతే ఆ తల్లి వేదనకు అంతు  ఏది ? వలస వెళ్లిన బిడ్డలు ఎప్పుడో ఒకప్పుడు తిరిగివస్తారనే ఆశ గా చూసే తల్లికి వాళ్ళు రారని తెలిసినప్పుడు ..జీవశ్చవమే కదా ! గుండెలని పిండేసే బరువైన కథ.  రెక్కలు వచ్చాక అంతే ... అందుకేనేమో ..పక్షలు రెక్కలొచ్చాక పిల్ల పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి

కథ వినండీ.. 




​⁠ 

7, సెప్టెంబర్ 2024, శనివారం

దేవుడా కాపాడు

 దేవుడా కాపాడు -శశాంక్ సీతారాం

కొంకణీ మూలం:అనువాదం:శిష్టా జగన్నాథరావు. 

మహేశ్ పాఠశాల విద్యార్ధి. ఆ పసి మనసులో  ఓ కోరిక. ఎొందుకు ఆ పిల్లవాడు అలాంటి కోరిక కోరాడు!? దేవుడా.. కాపాడు అని పదే పదే ప్రార్ధించాడు? 

కథ వినండీ.. 



23, జులై 2024, మంగళవారం

శబ్దాలు -కాంతులు



శబ్దాలు-కాంతులు/జయంత్ ఖత్రీ/ వేశ్యావాటిక రాత్రి నేపధ్యాన్ని హృదయవిదారక దుస్థితిని చెప్పిన గుజరాతీ కథ. తప్పక వినండీ.. 







22, జులై 2024, సోమవారం

డేగ (వేట కథ)



మనుషులు డేగ ను పెంచుతారు. వేటకు వొదులుతారు. వేట సహజత్వాన్ని కోల్ఫోయి మానవ క్రౌర్యాన్ని అద్దుకుంటే ఎలా వుంటుంది?ఆ పైశాచిక ఆనందాన్ని మనుషులు

ఎలా ఆస్వాదిస్తారు ? అన్నది ఈ కథలో కనబడుతుంది. అరుదైన కథ తప్పక వినండీ.

డేగ - పెర్ హాల్ స్ట్రోమ్  మూల రచన, స్వీడన్ రచయిత. 
 అనువాదం: పురిపండా అప్పలస్వామి .




13, జులై 2024, శనివారం

కమలాదాస్ కథ వొకటి

 Padmavathi the horlte - Kamala Das

ఈ కథ చదవగానే.. నేను ఫక్కున నవ్వాను. నవ్వుతూనే వున్నాను. ఎంత బాగా రాసారు రచయిత అని ముచ్చటపడ్డాను. ఏమి కథ ఏమి కథ అని అబ్బురపడ్డాను. కథంటే శైలి రాసిన విధానం కూర్పు చూసిన తర్వాతనే ఇతివృత్తం చూస్తాను నేను. కథాంశం అయితే ఆకట్టుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. భక్తుల మనోభావాలు గాయపడితే పడొచ్చుగాక.. నేనూ దేవుడిని విశ్వసిస్తాను తిరుమల కూడా వెళతాను. కానీ కథా రచయిత ఆలోచన వుంది చూడండి.. దేవుడు కూడా సగటు మగవాడే.. అందులో ప్రత్యేకత ఏమీ లేదు అంటుంది. మరి ప్రత్యేకత వుంటే.. భక్తులు ఆయనతో  బేరసారాలు ఏమిటి? కోర్కెలు కోరుకుంటాం మొక్కులు మొక్కడం కోర్కెలు తీరాక ఆ మొక్కులు చెల్లించడం. భగవంతుడికి భక్తుడికి మధ్య చెల్లింపులు ఏమిటీ. భక్తుల నుండి నిష్కల్మషమైన భక్తి తప్ప మరేది కోరుకోడు దేవుడు అని కొందరి భావన. దేవుని చూడటానికి వస్తూ ఫలం పుష్పం తేలేకపోయాను అంటుంది. తర్వాత శరీరమైనా ఇచ్చివుందును కానీ నా శరీరం పాపపంకిలం అయిపోయింది అన్నా కూడా ఆమెలో స్త్రీ నే చూసాడు దేవుడు. ఆఖరిలో ఆ అల్లరిమూక ఆమెని ఎందుకు గౌరవించి భక్తితో నమస్కరించి పక్క కు తొలగారు అంటే.. ఆమె దేవుడి మనిషి అని. ఆమె పవిత్రురాలై పోయింది అని. సాధారణ మానవులతో కూడి ఆమె ఆర్థిక అవసరాల కోసం వేశ్య అయింది (ముద్రింపబడింది) అనుకుంటే మనిషి కాని దేవుడితో కూడటం వల్ల పద్మావతి పవిత్రురాలైపోయింది. 

రచయిత నాస్తికురాలు కాదు. కృష్ణ భక్తురాలు. కానీ  విభిన్నమైన కథలు రాయటంలో  ప్రసిద్దురాలు. కథలో కల్పన పాలు ఎక్కువ. దేవుడు కూడా సాధారణ మానవుడి లాంటివాడే అని ఆలోచించి ఈ కథ రాయడమే గొప్ప సృజన. 

“పద్మావతి ద హార్లెట్” కథ ఇంగ్లీషు నుండి

తెలుగులోకి అనువదించిన వారు: S కాత్యాయని గారూ.. కథను వినండీ.. 

Padmavathi the horlte - Kamala Das

అనువాదం : S కాత్యాయని 

స్వరం: వనజ తాతినేని. 



11, జులై 2024, గురువారం

మాంసాహారం తినే మొక్కలను చూసారా..లేదా విన్నారా!?

 The Hungry Septopus  -Satyajit Ray 

మాంసాహారం తినే మొక్కలను చూసారా..లేదా విన్నారా!? ఈ కథ వినండీ. 

ఆకలిగొన్న సప్తపాశం - సత్యజిత్ రే 

నెపంస్థిస్, వీవస్ ప్లైవల లాంటి మొక్కలు బొద్దింకలు సీతాకోకచిలుకలు గొంగళి పురుగులు లాంటివి తింటాయి. సన్ డ్యూ లాంటి మొక్క మాంసాహారాన్ని తింటుంది. ఇలాంటి కోవ లోవే బట్టర్ వర్ట్, బ్లాడర్ వర్ట్ కూడా! 

అవి కాకుండా సెప్టోపస్ అనే మొక్క కూడా మాంసాహారాన్ని తింటుంది. నికారగువా అనే ప్రాంతంలో గౌటెమాలా దాటిన తర్వాత ఈ చెట్టును చూసాను. అక్కడ ప్రజలు దీన్ని దయ్యపు చెట్టు అని పిలుస్తారు. ఇంకా ఈ చెట్టు గురించి చెప్పాలంటే పూర్తి కథ వినండీ. కథ ఫిక్షన్ కావచ్చేమో కానీ ఈ దెయ్యం చెట్లు వుండటం అబద్దం కాకపోవచ్చు. 

మాంసాహార మొక్కలు/చెట్లు గురించి తెలుసుకోవాలంటే septopus plant గురించి google search చేయండి. అనేక ఆశ్చర్యకరమైన భీతి కల్గించే విషయాలు తెలుస్తాయి. 




8, జులై 2024, సోమవారం

లవ్ ఈజ్ సిల్లీ..

 ప్రతి రాత్రి ప్రేమ గీతాలు పాడేదాన్ని కానీ నిజమైన ప్రేమికుణ్ణి చూడలేదు. ప్రతి రాత్రి నిజమైన ప్రేమ కథలను నక్షత్రాలకు వినిపించేదాన్ని. కానీ ఈనాటికి నిజ ప్రేమికుణ్ణి చూడలేకపోయాను. ఇప్పుడు చూసాను అతనికి సాయం చేయాలి అనుకుంది ఆ నైటింగేల్. కానీ ఆ పక్షి త్యాగం విలువ లేనిదీ గానే ఎందుకు మిగిలింది.!?

ఆస్కారం వైల్డ్  “The Nightingale and the Rose” కథ అనువాదం ఆడియో బుక్ లో… 





25, మే 2024, శనివారం

నిర్జీవం నుండి నిద్రాణం లోకి

 తొలగిన సంకెళ్ళ నుండి స్వేచ్ఛ లభించినా తమ జీవితాల్లో మార్పు రాని మనుషులు కొందరు. అందుకు కారణం వ్వవస్థ వొకటే కారణం కాదు వ్యక్తి వైఫల్యం కూడా! తమను తాము నిర్మించుకోలేని ఏ వ్యక్తైనా సమాజాన్ని తప్పుపడతాడు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్య ఫలాలు మనిషిని కార్యోన్ముఖుడిని చేయకపోగా అదఃపాతాళానికి తొక్కేసే రాజకీయ వ్యవస్థ పై ఆరోపణ చేస్తున్న ఒక పలాయనవాది కథ ఇది. ఈ కథలో కనబడినవి వాస్తవాలే అధికం. వినండీ..




24, మే 2024, శుక్రవారం

నాయనమ్మ

మా నాయనమ్మ అందరి నాయనమ్మ ల లానే ఒక ముసలావిడ.  నాకు తను తెలిసిన ఇరవయ్యేళ్ళుగా ఆమె ముడుతలు పడిన చర్మంతో వృద్ధురాలి గానే వుండేది. తెలిసినవారు ఆమె వయసులో చాలా అందంగా ఉండేదనీ, ఆమె కు  భర్త కూడా వుండేవాడనీ అంటూంటారు. కానీ అది ఇపుడు నమ్మడం కష్టం.  మా తాత గారి ఫోటో పెద్ద చెక్క ఫ్రేము లో కట్టివుండేది.అది, మా ఇంటి చావిట్లో వేలాడుతూండేది.  ఆయన పెద్ద తల పాగా, వొదులుగా వుండే బట్టలూ వేసుకుని ఉంటాడందులో.  ఆయన పొడవైన తెల్లని గడ్డం, అతని చాతీని దాదాపూ కప్పేసి, ఓ వందేళ్ళ వృద్ధుడిలాగా కనిపిస్తారు ఆ ఫోటో లో. ఆయన్ని చూస్తే భార్యా పిల్లలూ  ఉండే తరహా మనిషి లా కనిపించరు. కేవలం బోలెడు మంది మనవలే ఉన్న వాడిలా కనిపిస్తారు.  మా నాయనమ్మ ఒకప్పుడు యవ్వనంగా, అందంగా ఉండేది అన్న ఆలోచనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.  ఆమె తాను చిన్నప్పుడు ఆడిన ఆటల గురించీ కూడా ఎప్పుడూ చెప్తూండేది.  వాటిని మేము నాయనమ్మ చెప్పే మిగిలిన ప్రవక్తల కధల్లానే వినేవాళ్ళం. 

ఆమె  పొట్టిగా, లావుగా, ఎప్పుడూ,కొంచెం ముందుకి వొంగి ఉండేది. ఆమె ముఖం నిండా ముడుతలూ, గీతలూ చెదురు ముదురుగా గీసినట్టుండేవి. తను ఎప్పుడూ చూడడానికి ఇలానే ఉండేదని మా మనసుల్లో ఒక స్థిర చిత్రం ముద్రించుకుపోయింది.    ఆవిడని ఇంకో విధంగా ఊహించుకోగలిగే ఆలోచనే మాకు లేదు.   తను ఎప్పుడూ ఇలానే వృద్ధురాలి లానే వుండేది. ఎంత వృద్ధురాలంటే ఇరవయ్యేళ్ళు గా ఆమె అంతే, వృద్ధురాలి లా ఉండటమే మాకు తెలుసు. ఆమె లో చక్కదనం కన్నా అందం ఎక్కువ.   తను బాలెన్స్ కోసం వొంగిన తన నడుము మీద ఒక చెయ్యి వేసుకుని, తెల్లని బట్టల్లో, ఇల్లంతా కుంటుతూ నడుస్తూ ఉండేది.  ఇంకో చెయ్యి ఎప్పుడూ జప మాల ని పట్టుకుని, ఒక్కో పూసనీ తిప్పుతూ ఉండేది.  తన వెండి జుత్తు, తన మొహాన్నంతటినీ అలల్లా తాకుతూ ఎగురుతూ ఉండేది. తన పెదవులు ఎప్పుడూ ఏదో వినబడని ప్రార్ధనని పలుకుతూ ఉండేవి. అవును తను అందమైన మనిషి.  చలి కాలంలో తెల్లగా పర్వతాల మీద పరచుకున్న మంచులా దిగంతాల వరకూ విస్తరించుకున్న ప్రశాంత లహరి లా ఒక శ్వాసించే శాంతి, తృప్తీ మా నాయనమ్మ. 

నాయనమ్మా, నేనూ మంచి స్నేహితులం.  చిన్నతనంలో నన్ను మా తల్లిదండృలు ఆమె దగ్గర విడిచిపెట్టి నగరంలో ఉన్నన్నాళ్ళూ మేము ఒకర్నొకరం అంటిపెట్టుకునే వుండేవాళ్ళం.  తను నన్ను పొద్దున్నే నిద్ర లేపి, తయారు చేసి స్కూల్ కి పంపేది.  తన ప్రభాత  కీర్తనల్ని ఒకే రాగంలో పాడుతూ నా స్నానపానాదులు ముగించేది. అలా ఆమె ముఖతః కీర్తనల్ని నేర్చుకుంటానేమో అని తన ఆశ !  కానీ  ఆమె గొంతు నాకు నచ్చినా, ఆ కీర్తనల ని నేర్చుకునే  సదుద్దేశ్యం నాకుండేది కాదు. 

అప్పుడు తను అప్పుడే కడిగిన పలకా, పచ్చని బలపం, మట్టి తో చేసిన సిరా బుడ్డీ, ఒక వెదురు పెన్నూ సిద్ధం చేసి ఒక కట్ట గా కట్టి, నా చేతికి ఇచ్చేది.  ఒక మందమయిన నిల్వపెట్టిన చపాతీ నిండా వెన్నా, చక్కెరా కలిపి రాసిస్తే అది తిని, స్కూల్ కి బయలుదేరేవాళ్ళం.  ఆమె తనతో ఒక కట్ట గా కొన్ని చపాతీలని ఊరిలో వీధి కుక్కల కోసం తెచ్చేది.  

నాయనమ్మ ఎప్పుడూ నాతో పాటూ స్కూల్ కి వచ్చేది. ఎందుకంటే స్కూల్ ఒక ప్రార్ధనాలయానికి అనుబంధంగా వుండేది. పూజారి రోజూ నాకు అక్షరాలూ, ప్రభాత కీర్తనా నేర్పించేవారు. పిల్లలందరూ వరండా అంచులెమ్మడి, చతురస్రాకారంలో కూర్చుని కీర్తన, అక్షరమాలా వల్లె వేస్తూంటే, నాయనమ్మ మాత్రం ఆలయంలో కూర్చుని గ్రంధ పఠనం చేసేది. మా ఇద్దరి చదువూ ముగిసాకా, ఇద్దరం ఇంటిబాట పట్టేవాళ్ళం. అప్పుడు మాకు తోడుగా వీధి కుక్కలూ వచ్చేవి. వాటి కోసం మేము తెచ్చి వేసే చపాతీల కోసం,  వాటిల్లో అవి అరచుకుంటూ, గొణుక్కుంటూ, మా వెంటే ఇంటి దాకా వచ్చేవి. 

మా తల్లిదండ్రులు నగరంలో సుఖంగా స్థిరపడ్డాకా, మేమూ నగరానికి వెళ్ళాం.  నాయనమ్మ కీ నాకూ ఉన్న స్నేహం లో ఇదో పెద్ద మలుపు.  మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నప్పటికీ, నాయనమ్మ ఇక్కడ నాతో స్కూలికి వచ్చేది కాదు. నేను ఇంగ్లీషు స్కూల్ లో చేరాను. బస్ లో వెళ్ళేవాడిని. వీధుల్లో కుక్కలు ఊరి లో అన్ని వుండేవి కావు కాబట్టి, నాయనమ్మ ఇంటి ఆవరణ లో  వాలే పక్షులకీ, పిచ్చుకలకీ ఆహారం పెట్టడానికే తనను పరిమితం చేసుకుంది.  

ఏళ్ళు గడిచే కొద్దీ మేమిద్దరం ఒకరినొకరు చూసుకునేదే తగ్గిపోయింది.  కొన్నాళ్ళ వరకూ ఆమె నన్ను పొద్దున్నే లేపి స్కూల్ కి తయారు చేసేది. నేను స్కూల్ నుండీ వచ్చాకా ఆరోజు టీచర్ స్కూల్ లో ఏమి చెప్పారో ఎంతో ఆసక్తి గా అడిగేది. నేనూ ఆమె కు ఇంగ్లీష్ పదాలూ, కొత్త కొత్త సంగతులూ, గురుత్వాకర్షణ శక్తీ, ఆర్కెమెడీస్ సూత్రాలు లేదా చుట్టుపక్కల ప్రపంచం గురించి చెప్పే వాణ్ణి. ఇదంతా విని ఆమె చాలా సంతోషించేది. కానీ ఇంగ్లీష్ స్కూల్లో చెప్పే ఈ విషయాలన్నీ నిజమని మాత్రం నమ్మేది కాదు.  ఈ స్కూల్లో దేవుడి గురించీ, ధార్మికత గురించీ ఏమీ చెప్పట్లేదని బాధపడేది.  ఒక రోజు నేను సంగీత పాఠాల్లో చేరబోతున్నట్టు చెప్పాను నాయనమ్మ కు. అది విని తను చాలా బాధపడింది.  ఆవిడ దృష్టి లో సంగీతానికీ అశ్లీల స్నేహాలకూ సంబంధం వుంది. అది కేవలం బిచ్చగాళ్ళకూ, వేశ్యలకూ సంబంధించిన విద్య అని ఆమె ఉద్దేశ్యం.   మర్యాదస్తులకు సంగీతం ఏమిటన్నది ఆమె అభ్యంతరం.  ఇలా నా సంగీత పాఠాల అనంతరం, నాతో మాటలు బాగా తగ్గించేసింది నాయనమ్మ. 

నేను కాలేజీ కి వెళ్ళాకా, నాదీ అంటూ వేరే ఒక గది దొరికింది ఇంట్లో. అంతటితో  నాకూ నాయనమ్మ కూ  ఉన్న బంధం కూడా తెగిపోయినట్లైంది.   తన ఒంటరితనంతో నాయనమ్మ వెంటనే రాజీ పడిపోయింది.  చాలా అరుదుగా తన రాట్నాన్ని విడిచిపెట్టి , ఎవరితోనైనా మాట్లాడేది. పొద్దుట్నించీ పొద్దు పోయేదాకా ఆ రాట్నం వొడుకుతూ, పెదవులతో ఏవో ప్రార్ధనలు చేస్తూ ఒంటరిగానే కాలం గడిపేసేది.  ఒక్క మధ్యాహ్నాలు మాత్రం వరండాలో తీరిగ్గా కూచుని, ఆవరణలో వాలే పిచ్చుకలకు రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వెదజల్లుతూ గడిపేసేది. ఆ సమయంలో నాయనమ్మ చుట్టూ వాలే పక్షుల హడావిడీ, వాటి కిచ కిచలూ, గోలా చూసి తీరాల్సిందే! కొన్ని పిచ్చుకలు వచ్చి ఆవిడ కాళ్ళ మీదా, భుజాల మీదా వాలేవి.  కొన్ని తల మీద కూడా.  ఆవిడ నవ్వుతూ ఉండేది గానీ ఎప్పుడూ ఆ పక్షుల్ని అదిలించలేదు.  ఈ మధ్యాహ్నపు అరగంట సమయమూ.. చాలా సంతోషకరమైన సమయం నాయనమ్మకు. 

నేను విదేశాల్లో చదువుకుంటానని నిర్ణయించుకున్నాక, నాయనమ్మ చాలా బాధపడుతుందని ఖచ్చితంగా అనుకున్నాను.  నేను అయిదేళ్ళ పాటూ ఇంటికి దూరంగా ఉండబోతున్నాను. తన వయసు రీత్యా ఈ మధ్య కాలంలో నాయనమ్మ కాలం చెయ్యదని నమ్మకం లేదు.  కానీ నాయనమ్మ అస్సలు సెంటిమెంటల్ గా ప్రవర్తించలేదు. తను నన్ను సగర్వంగా సాగనంపింది. రైల్వే స్టేషన్ లో అందరితో పాటూ వచ్చి వీడ్కోలు ఇచ్చింది.  తన పెదవులు ఏవో ప్రార్ధన ని పలుకుతున్నాయి, చేతులు జప మాల ని తిప్పుతున్నాయి అప్పుడు ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద మౌనంగా పెట్టుకున్న ముద్దు - ఆ చెమ్మా, ఆ స్పర్శా, ఇదే ఆఖరుది, మళ్ళీ ఈ స్పర్శ దొరుకుతుందా అని చాలా భయపడ్డాను.   ఇదే మా ఇద్దరి మధ్యా ఆఖరి భౌతికమైన స్పర్శ అని అనిపించింది. 

కానీ అలాంటిదేమీ జరగలేదు. అయిదేళ్ళయ్యాకా, నేను విదేశాల నుండీ తిరిగొచ్చాకా నాయనమ్మ నన్ను స్టేషన్ లో నే కలుసుకుంది. నా  చేతిని తన చేతుల్లో అదుముకుని నా పక్కన కూర్చుందన్న మాటే గానీ నాతో కబుర్లు చెప్పే తీరిక తనకి లేదు. తన పెదవులు ఏవో కీర్తన ని జపిస్తున్నాయి.  నేను వొచ్చిన మొదటి రోజు కూడా  ఆ మధ్యాహ్నం పక్షుల భోజన సమయం మాత్రమే నాయనమ్మ ఆనందకరమైన సమయం.   ఆ పక్షుల భోజనాన్ని మాత్రం మరిచిపోలేదు తను.   వాటిని తీరిగ్గా, మురిపెంగా తిడుతూ, ప్రేమగా తిండి పెట్టింది నాయనమ్మ. అవే నాకు మిగిలిన అపురూప క్షణాలు.

ఆ రోజు సాయంత్రం నుండీ ఆమె లో మార్పు కనపడింది. ఆ పూట తను ఎటువంటి ప్రార్ధన, కీర్తనా అదీ చెయ్యలేదు.  ఇరుగు పొరుగు అమ్మలక్కలందరినీ  పిలిపించుకుని ఒక పాత ఢోలక్ తీయించి పాట పాడ్డం మొదలు పెట్టింది.  తన సాగిన సన్నని వేళ్ళతో  ఢోలక్ ని గంటల తరబడి వాయిస్తూ ఇంటికి తిరిగొచ్చిన వీరుల స్వాగత గీతాలు పాడింది.  అతి గా అలిసిపోతావు, వొద్దూ అని మేమెంత వారించినా, ఆపలేదు.  అదే ఆఖరు.  నేను నాయనమ్మ ప్రార్ధన అంటూ చెయ్యకుండా వుండడం చూడటం  అదే మెదటిసారి. 

మరుసటి రోజు పొద్దున్న కల్లా ఆమెకు సుస్తీ చేసింది.  చిన్న జ్వరం.   డాక్టరు అదే మెల్లగా తగ్గి పోతుందని చెప్పారు. అయితే  నాయనమ్మ కు మాత్రం అది తగ్గిపోతుందని నమ్మకం లేదు.  ఇక తనను   మృత్యువు సమీపించిందని మాతో అంది.   ఇక చావుకు కొద్ది గంటల సమయమే ఉంది కాబట్టి మాతో మాటలాడి సమయం వృధా చెయ్యకుండా ఉండేందుకు మేము ఎంత వారిస్తున్నా వినకుండా జప మాల తీసుకుని ప్రార్ధన మొదలుపెట్టింది.  కాసేపటికి మాకు అనుమానమే రాక మునుపే ఆమె పెదవుల కదలిక ఆగిపోయింది.   జీవం లేని వేళ్ళ నుండీ జప మాల జారిపోయింది.    మాకు ఆమె చనిపోయిందని తెలిసేటప్పటికీ,  ఆమె మొహం నిండా  ఎంతో ప్రశాంతత పరచుకుంది. 

ఆమెను శాస్త్ర  ప్రకారం మంచం మీద నుండీ దించి, నేల మీద పడుకోబెట్టి  ఒక ఎర్రని వస్త్రంతో కప్పాము.  కాసేపు ఏడుపులూ అవీ అయ్యాక తనని అలా ఒంటరిగా విడిచిపెట్టి అంతిమ సంస్కారపు ఏర్పాట్లలో మునిగిపోయాము. 

సాయంకాలం నాయనమ్మ గదిలోకి తన శరీరాన్ని అంతిమ సంస్కారం కోసం తీసుకెళ్ళేందుకు వచ్చాం.  అదో మరిచిపోలేని దృశ్యం.  అప్పటికి సూర్యాస్తమయం అవుతూంది. వరండా అంతా బంగారపు అగ్ని అంటుకున్నట్టు పల్చని వెలుతురు.  నాయనమ్మ గది లో ఆమె దేహం, ఆ ఎర్రని వస్త్రంలో చుట్టబడి నేల మీద వుంది.  గది లో నేల మీదా, వసారాలోనూ, ఆవరణ అంతటా వందలాది పిచ్చుకలూ, చిన్నా పెద్దా పక్షులూ - నిశ్శబ్దంగా - ఎటువంటి కువ కువలూ లేకుండా ఆమె చుట్టు పక్కలంతా వాలి ఉన్నాయి. మేము నడవడానికి ఖాళీ నే లేకుండా. 

ఆ పక్షుల ని చూసి మేమంతా జాలిపడ్డాం. మా అమ్మ వాటికోసం కొన్ని రొట్టెలు తెచ్చి, వాట్ని చిన్ని చిన్ని ముక్కలు గా తుంపి వేసారు. కానీ ఆ  పిచ్చుకలు వాటిని గమనించనే లేదు.  నాయనమ్మ శరీరాన్ని మేము తీసుకువెళ్ళిపోయేదాకా వుండి అవి మౌనంగా ఎగిరి వెళ్ళిపోయాయి.  మరుసటి రోజు పని వాడు వచ్చి ఆవరణ నిండా ఉన్న రొట్టె ముక్కల్ని తుడిచి శుభ్రం చేసాడు.

************************

కుష్వంత్ సింగ్..   భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు.ఇండో-ఆగ్లియన్ రచయితగా కుష్వంత్ సింగ్ విశిష్ట లౌకిక వాదిగా సుపరిచితులు. సిక్కుల చరిత్ర  సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు. యోగన పత్రికకు సంపాదకులుగానూ, "ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా", "ద నేషనల్ హెరాల్డ్",, "హిందూస్థాన్ టైమ్స్" పత్రికలకు సంపాదకత్వం వహించారు. ‘The Portrait of a Lady’ రచన వారి నాయనమ్మ గురించి రాసిన స్కెచ్ అనుకోవచ్చు.

ఇలాంటి కథలను పిల్లల చేత తప్పక చదివించాల్సింది వుంది. కుటుంబంలో పెద్దలకు పిన్నలకు మధ్య వుండే అనుబంధం, ప్రేమ మాత్రమే కాదు, వారి నుండి పిల్లలు నేర్చుకొనదగ్గ సంస్కృతి సంప్రదాయాలు ధార్మిక విషయాలు ఔన్నత్యం మొదలగునవి కూడా వుంటాయి. ఈ కథలో తమ భావోద్వేగాలను ప్రేమను మనుషులు మాత్రమే కాదు జంతువులు పక్షులు కూడా ఎలా అనుభవిస్తాయో ప్రతిభావంతంగా చెప్పగల్గారు.  ఈ కథ NCERT విద్యార్ధులకు 11వ తరగతి లో పాఠ్యాంశంగా వుంది.






22, మే 2024, బుధవారం

తల్లి-రుకైయ్యా రీహానా ఆడియో లో

 కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా! 

సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి. 

ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.

అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా. 

ఇటీవల కాలంలో  అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది. 

 చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!

మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో  దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష. 

ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా  ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను.. 

మీరూ  ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.

 రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి"  కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా పరిచయం చేస్తున్నాను వినండీ..

హృద్యమైన కథ… వినండీ.. 



15, జూన్ 2023, గురువారం

అణ్ణయ్య మానవ శాస్త్రం

 పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అంటారు. అలాగే దూరపు కొండలు నునుపు అంటారు. అదే రీతిగా.. దేశం వీడితే కానీ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు గుర్తుకు రానట్టు.. వుంటుంది. ఎక్కడైతే పరాయి భావన మనుషులను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో అక్కడ మనం మన ఉనికి మనవాళ్ళు అప్రయత్నంగా గుర్తుకు వస్తారు. అలాగే ఇతర దేశాల సంస్కృతి గురించి పరాయి వారికి ఆసక్తి ఎక్కువ. మన వాటిపై మనకు చిన్నచూపు అని కాదు కానీ.. అంత శ్రద్ధ ఆసక్తి వుండవు. ఎవరైనా మన దేశం గురించి మన గొప్పతనాన్ని గురించి చెప్పమంటే పట్టుమని పది వాక్యాలు చెప్పడానికి మాటలు తడుముకుంటాం. ఇతరములపై చూపిన శ్రద్ద మన వాటిపై వుండదు. 

మనకు సంబంధించిన వివరాలను సంపద రహస్యాలను పరాయి వారికి అందించేది కూడా మనవాళ్ళే అన్నది కూడా సత్యమే. ఈ కథ గొప్ప సెటైర్ గా తోచింది నాకు. 

ఈ కథలో ఒక పేద యువకుడు విదేశానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి అనారోగ్యంతో వుంటాడు. తల్లి 15 రోజులకు ఒకసారి క్షేమసమాచారంతో ఉత్తరం రాయిస్తుంది. అతనికి విదేశంలో లైబ్రరీకి వెళ్ళి మన దేశ ఆచారాలు వ్యవహారాలు గురించి చదువుతూ వుంటాడు. .. ఇక కథ నేను చెప్పడం బాగుండదు. ముగింపు చదివేటప్పటికి హృదయం మెలిపెట్టింది. ఏమైందో  మీరే కథ చదివి తెలుసుకోండి. 

ఏ కె రామానుజన్ రాసిన  కన్నడ కథ “ అణ్ణయ్య మానవ శాస్త్రం“ కు తెలుగు అనువాదం ఇది. 

అన్వర్ పోష్ట్ లో  ఈ కథ గురించి ప్రస్తావించడం జరిగింది. వెతికితే ఆంగ్లం లోనూ తరువాత తెలుగు అనువాదం లోనూ ఈ కథ దొరికింది. అనువాదం: శార్వాణి. 


అణ్ణయ్య మానవ శాస్త్రం

డా. ఎ.కె. రామానుజన్


అతనికి ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యంగా వుంది.

ఈ అమెరికా మానవశాస్త్రవేత్త ఈ ఫర్గూసన్ వున్నాడే, ఇతను మనుధర్మశాస్త్రం చదివాడు. ఇతనికి మన సూతకాల సంగతి ఎంత బాగా తెలుసు! తను బ్రాహ్మణుడై వుండి కూడా తనకివేమీ తెలియవు.

ఆత్మజ్ఞానం సంపాదించాలంటే అమెరికాకి రావాలన్నమాట. మహాత్ముడు జైల్లో కూర్చుని కటకటాలు లెక్కపెడుతూ ఆత్మచరిత్ర రాసినట్లుగా, నెహ్రూ ఇంగ్లండికి వెళ్ళి స్వదేశాన్ని గుర్తించినట్టుగా, దూరంగా వుంటేనే కొండ గొప్పదనం.

"మన దేహంలో పన్నెండు విసర్జక ద్రవ్యాలవల్ల మనకి మురికి-మైల. దేహంలోని జిడ్డు పదార్థాలు, వీర్యము, రక్తము, మెదడులోని మజ్జారసం, మూత్రం, మలం, చీమిడి, చెవిలోని గుల్మము, శ్లేష్మము, కన్నీరు, కంటి-పుసి, చమట.” మను(5.135)

చికాగోలో వున్నా లెక్క పెట్టడం కన్నడంలోనే లెక్కపెట్టాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు.... మొదటిసారి లెక్క పెట్టినప్పుడు పదకొండే మలాలు దొరికాయి. మళ్ళీ లెక్కపెట్టినప్పుడు పన్నెండు, సరిగ్గా పన్నెండు. ఈ పన్నెండింటిలో అతనికి తెలిసింది. ఉమ్మి, ఉచ్చ, దొడ్డి. చిన్నతనంలో చెప్పేవారు - ఎంగిలి చెయ్యకూడదు, దొడ్డి కెళితే శుభ్రంగా కడుక్కోవాలి. ఉచ్చపోస్తే కడుక్కోవాలి, అంటూ. వాళత్త కక్కసుకి వెళితే పిడికెడు మట్టి (మృత్తిక) కూడా తీసికెళ్ళేది. ఆవిడున్నంతకాలం పెరట్లో గొయ్యి ఒకటి వుండేదెప్పుడూ.

దక్షిణదేశంలో, నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసి ఊదే బూరా, నాగస్వరం, ఇవన్నీ ముట్టకూడని వస్తువులు. ఎంగిలి వస్తువులు అస్పృశ్యులు మాత్రమే ముట్టుకుని వాయించే వాయిద్యం. వీణ బ్రాహ్మణలకు ముఖవీణ మాదిగ జాతికి.

కుండకన్నా వెండి, పత్తికన్నా పట్టు, ఉత్తమం. ఎందుకంటే దానికి ఈ పన్నెండు మలాలు అంత సులువుగా అంటుకోవు. పట్టు, పట్టుపురుగు వొంటినుంచి వెలువడే విసర్జక ద్రవం, నిజమే. కాని అది మనుషులకి మడి. చూడండి ఎలా వుంటుందో!

ఈ అమెరికన్లకి ఎన్ని విషయాలు తెలుసు! ఏవేవో లైబ్రరీలకి వెళ్ళి చూశారు.

కాశీలోని పాతకాలపు పండితుల్ని పట్టుకుని, వాళ్ళకి తెలిసినదంతా సంగ్రహించి పాండిత్యపు సారాన్ని పిండుకున్నారు. ఎక్కడెక్కడి తాళ పత్రాలు వెతికి, దుమ్ము దులిపి సేకరించారు. మహా ఆశ్చర్యం ఇతనికి. భారతదేశపు విషయాలు తెలుసుకోవాలని వుంటే ఫిలడెల్ఫియా, బర్క్లీ, చికాగో - అలాంటి చోట్లకి వెళ్ళాలి. వీళ్ళకున్నంత ఆసక్తి మన కెక్కడుంది ? వివేకానందుడు చికాగోకి రాలేదూ? ఆయన మన ధర్మం మీద ఇచ్చిన మొదటి ఉపన్యాసం ఇక్కడే కదా.

సూతకం తెప్పించే మూడు క్రియలలో ముట్టవడం మొదటిది. పుట్టుక దాని కన్న ఓ డిగ్రీ ఎక్కువది. అన్నిటికన్న ఎక్కువ సూతకం అంటే చావు సూతకం. చావు మైల తగిలినా చాలు. సూతకం తెప్పిస్తుంది. కాలుతున్న పాడె నుంచి వచ్చిన పొగ తగిలినా చాలు బ్రాహ్మణుడు స్నానం చెయ్యాలి. మాదిగ వాళ్ళు తప్పించి మరొకరెవరూ చచ్చిన వాడు కట్టుకున్న గుడ్డలు కట్టుకోరు.

(మను 10.39) శుభంలో శుభ ప్రదమైన ఆవు చనిపోతే ఆ గోవు మాంసాన్ని తినేవాళ్ళు అందరికన్న తక్కువ జాతి వాళ్ళు. కాకి, గ్రద్ద కూడా ఈ కారణం చేతనే పక్షి జాతిలో నీచజాతిగా పరిగణింప బడతాయి. కొన్ని సార్లు చావుకి, అస్పృశ్యతకీ వున్న అంచు చాలా సూక్ష్మంగా అనిపిస్తుంది. బెంగాల్లో తెలివికలవాళ్ళలో రెండు శాఖలున్నాయి. నూనె అమ్మేవాళ్ళు ఉత్తమ జాతివారు. కాని గానుగ ఆడించి గింజల్ని నూనెగా చేసేవాళ్ళు తక్కువరకం జాతి. ఎందుకంటే వాళ్ళు విత్తనాల్ని చంపుతారు గాబట్టి చావు - మైల వున్నవాళ్ళు.

ఇవన్నీ అతనికి తెలియనే తెలీదు.

అతనేమీ చదువుకోని వాడు కాదు. మైసూరులో రోజూ యూనివర్శిటీకి, లైబ్రరీకి చెప్పులరిగేలా తిరిగిన వాడే. అక్కడున్న వాళ్ళలో ఐదారుగురు గుమాస్తాలతో పరిచయం వుంది. అందులో శెట్టి తనతో బాటే ఎకనమిక్స్ చదువుకుని పోయిన సంవత్సరం ఫెయిల్ కావడంతో లైబ్రరీలో పనిలో చేరాడు. అణ్ణయ్య వచ్చినపుడల్లా శెట్టి అతనికి లైబ్రరీ తాళం చెవులు గుత్తి నిచ్చేసి 'కావల్సిన పుస్తకం చూసుకుని తీసుకోండి' అనేవాడు.


బరువైన గుత్తి అది. బాగా వాడటం వల్ల చేతి నుంచి చేతికి మారి, అరిగి, నున్నగా మెరుస్తున్న ఇనుప తాళం చెవులు. వాటి మధ్య కలిసిపోయిన పసుపురంగు ఇత్తడి తాళం చెవులు. ఇత్తడి తాళానికి ఇత్తడి చెవులు, ఆడతాళానికి మగ తాళం చెవి, మగ తాళానికి ఆడతాళం చెవి. పెద్ద దానికి పెద్దది, చిన్నదానికి చిన్నది. కొన్ని మాత్రం పెద్ద తాళానికి చిన్న తాళం చెవి, చిన్న తాళానికి పెద్ద చెవి. ఇలా విపర్యాసం, పర్యాయం, అనులోమం ఈ పుస్తకంలో చెప్పిన మనువు చెప్పిన పెళ్ళిళ్ళలాగ. కొన్ని బీరువా కన్న తాళం పెద్దదిగా వున్నా, తాళం వెయ్యడానికే కుదిరేది కాదు. ముట్టుకుంటే విడిపోయేది. కొన్ని మహా బిగువు. పగలగొట్టే తియ్యాలి. దాని వెనకాలే కళ్ళకి కనిపిస్తూ, చేతికి దొరకని పుస్తకం. ఏ కథ వుందో, సమాజ శాస్త్రవు నగ్న చిత్రం వుందో ఏమో ఆ పుస్తకంలో.


మైసూర్లో ఇతను చదివినదంతా పాశ్చాత్యుల గురించి. ఇంగ్లీషు, కన్నడం చదువుకున్నా అన్నాకెరీనా అనువాదం. మూర్తిరావు, షేక్స్పియర్ మీద రాసిన పుస్తకం. అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు రాసిన స్థల పురాణాలు సముద్రపు అవతల నుంచి, అపూర్వ పశ్చిమం, అమెరికాలో నేను లాంటివి.

మల శుద్ధికి మనువు పదకొండు మార్గాలు చెప్పాడు. బ్రాహ్మణ్యపు విధులు, అగ్ని, ప్రసాదము, మట్టి, అంతఃకరణ సంయమము, నీరు, పేడ చేతిలో పట్టుకుని చేసే ప్రమాణం, గాలి, కర్మలు, సూర్యడు, కాలము దేహదారులని శుద్ధి చేసేవి. - ఇవి

(మను 5-105) ఈ తెల్లవాళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసిపోయాయి ? ఇంత దూరంలో, పదివేల మైళ్ళ దూరంలో, నీరు, సూర్యడు, గాలి, నేల, కాలాలని దాటివచ్చి ఇతను, ఈ గబ్బు కంపు కొట్టే చికాగోలో, అణ్ణయ్య - శ్రోత్రియుల జాతిలో మేకులా పుట్టిన అణ్ణయ్య, ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకోవల్సి వచ్చింది. ఈ చలిలో, ఈ తెల్ల మంచులో వుండి ఆ వేడి, ఆ ఎండల మధ్య బ్రతికే ఈ నల్లవాళ్ళ రహస్యాలన్నీ ఆ తెల్లవాళ్ళెలా తెలుసుకున్నారు? ఈ మంత్రం వీళ్ళ చెవుల్లో ఎవరు జపించారు? జర్మనీ మ్యాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకుని మోక్షముల్లా భట్టుగా మారి మాకే వేదాలు నేర్పుతున్నాడు కదా!

భారతదేశంలో అతను అమెరికా, ఇంగ్లండ్, యూరప్ అని జపించినట్లుగా ఇక్కడ ఈ అమెరికాలో అతను మళ్ళీ మళ్ళీ భారతదేశం గురించి చదివాడు, మాట్లాడాడు. కనపడ్డవాళ్ళందరికి కాఫీ ఇప్పించి, వాళ్ళిచ్చిన బీరు తాగి, తెల్ల పిల్లల చెయ్యి పట్టుకుని తనకి రాని హస్తసాముద్రికం చెప్పాడు.

ఇక్కడ అతనికి ఆంత్రపాలజీ గురించి జిజ్ఞాస. కామతురం లా, ఈ అత్మజ్ఞానాన్ని గురించిన ఆత్రం దీనిక్కూడా సిగ్గు, భయం, మొహమాటం లేవు. హిందూ సంప్రదాయం గురించి మానవశాస్త్రజ్ఞులు రాసినవి. దొరికినవన్నీ చదివాడు. రెండవ అటక (అర)లో ఆ పుస్తకాలు దొంతర్లుగా వున్నాయి. దాని నంబరు PK 321. నిచ్చెన ఎక్కి, కాలావధిలా చెక్కతో కట్టిన, చేతిపిడి వున్న అటక. ఈ పశ్చిమాన తూర్పు వచ్చి చేరుకుంది. దూరపు పచ్చదనం, ఇంటర్నేషనల్ హౌన్లో అలవాటైన తెల్ల అమ్మాయిలు.

"మీ దేశపు స్త్రీలు నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకుంటా రెందుకు? అని కుతూహలంతో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి సిద్ధంగా వుండాలి అన్న ఉద్దేశంతోనో ఏమో మైసూర్లో వున్నపుడు వాళ్ళ నాన్న ఎంత కోపగించుకున్నా చెయ్యని గీతాపారాయణం అమెరికాలో చేసి, వీరు, విస్కీ, గోమాంసం, దొడ్డికి వెళితే శాచానికి నీళ్ళు లేక కాగితంతో తుడుచుకునే చండాలత, ప్లేబాయ్ మ్యాగజైన్లో బూతు బొమ్మలు చూడ్డం, వీటి మధ్యనుంచి ఎకనమిక్స్ చదువు మధ్య నుంచీ ఖాళీ చేసుకుని అతను ఈ రెండేళ్ళూ హిందూ సంప్రదాయం చదివాడు. స్టాటిస్టిక్స్ సంఖ్యల మధ్య రామకృష్ణాశ్రమపు పుస్తకాల జాబితా. హిందూ సంస్కృతి తెలుసుకోవాలంటే అమెరికా రావాలి అనేవాడు. మా చికాగో లైబ్రరీలో ప్రజావాణి కూడా వస్తుంది సుమండీ - హిందూ సంస్కృతిని దాచిపెట్టి మూసిన తలుపులకి వేసిన తాళాలెన్నింటికో అమెరికాలో తాళం చెవులు దొరికాయి. తాళాల గుత్తే దొరికింది ఇప్పుడు.

అతను ఆ రోజు పుస్తకాల అలమార్ల మధ్యలో తిరుగుతున్నపుడు హఠాత్తుగా ఒక కొత్త పుస్తకం కనిపించింది. నీలిరంగు గుడ్డ అట్ట. చేతినిండుగా వున్న పుస్తకం, బంగారు రంగులో ఆ నీలం రంగు అట్టమీద, Hinduism: Custom and Ritual అని రాసుంది. స్టీవన్ ఫర్గూసన్ రాసినది. 1968లో అచ్చయిన కొత్త పుస్తకం. వేడి వేడి విషయాలు. సీమంతం, నామకరణం, పుట్టు వెంట్రుకలు . తీయించడం, అన్నప్రాశన, వడుగు, పెళ్ళి, సప్తపది, శోభనం రాత్రి ఇచ్చే పళ్ళు, బాదం పాలు....

"కొత్త పెళ్ళానికి ఏలకులు, బాదం పప్పు తినిపించి తనేమో తిన్నగా బాదంపాలు తాగేస్తాడురా ఈ రసికుడు" అంటూ హుణసూరులో ఎవరింట్లోనో శోభనం జరిగినపుడు బూతు జోక్ ఒకటి విన్నాడు.

భర్త భార్యకి చెప్పే సంస్కృత మైధున మంత్రం, షష్ఠ్యబ్ధి పూర్తి శాంతులు, ప్రాయశ్చిత్తాలు, దానాలు, ఉత్తర క్రియలు ఇలాంటి సంస్కారాలన్నిటినీ విడివిడిగా వివరంగా రాశారు.

బ్రాహ్మణుల ఉత్తర క్రియల వర్ణన, చిత్రాలతో సహా. ఎన్ని విషయాలు చెప్పాడు. 'ఈ ఫర్గూసన్ మహాశయుడు! మాటిమాటికి మనువు, పితృమేధ - సూత్రం అంటూ, సపిండం. ఎవరు నిజం, ఎవరు కాదు. సన్యాసికి, పళ్ళురాని పసిపాపకి సూతకం లేదు. వళ్ళు వచ్చాక బిడ్డ చనిపోతే ఒక రోజు మైల. బేల కర్మ (పుట్టు వెంట్రుకలు) జరిగి వుంటే మూడు రోజులు. శ్రాద్ధానికి ఏడుగురు కావాలి. కొడుకు, మనవడు, వాడి కొడుకు శ్రాద్ధం చేసేవాళ్ళు, తండ్రి, తాత, ముత్తాత చేయించుకునే వాళ్ళు. మూడు తరాలుపైన, మూడు తరాలు క్రింద మథ్యలో తను. ఏడు పిండాల మధ్యన వున్న పిండం. ఇలాంటి వివరాలెన్నో. దానికి తోడు ఏ యే వర్ణాలలో ఎవరెవరికి ఎన్నెన్ని రోజుల సూతకం అన్నదంతా వరుస క్రమంలో రానుంది. అంతేకాదు, పర దేశంలో సంబంధీకులు చచ్చిపోతే, సంగతి వినేవరకూ సూతకం లేదు. విషయం తెలిసిన వెంటనే సూతకం అంటుకుంటుంది. దానికి తగ్గట్టు రోజుల లెక్క, స్నానాల లెక్క అవ్వాలి. ఇతని శ్రద్ధ, కుతూహలం ఒక్కొక్క వాక్యానికి ఎక్కువ కాసాగింది.

పుస్తకాల మధ్యన అలాగే కూర్చుని చదివాను. శ్రాద్ధాలలో నాలుగు భాగాలనీ చెప్పింది పుస్తకం. అతను ఇంతవరకూ ఎవరి చావునీ చూసిన వాడు కాదు. మూడో వీధిలో చాకలి వాళ్ళు శవాన్ని అలంకరించి, వూరేగింపు తీసికెళుతుంటే రెండు సార్లు చూశాడు. పెద్దనాన్న చనిపోయినపుడు బొంబాయి వెళ్ళాడు. ఇంట్లో నాన్నకి మూత్రరోగం వున్నప్పటికీ, జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకుంటే ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి చెయ్యి పడిపోయింది. ముఖం ఎడం వేపు వంకర పోయింది. అయినా బాగానే వున్నారంటూ రెండు వారలకోసారి అమ్మ రాస్తూనే వుంది. నీరసమైన ఉత్తరాలు, దమయంతి పురుడు, అక్కడ ప్రతి శనివారం తలంటుకుని నీళ్ళు పోసుకో. లేకపోతే వేడి చేస్తుంది. సీకాయి పంపనా అంటూ వణికే అక్షరాలతో ఉత్తరం రాస్తుంది.

బ్రాహ్మణుడికి చావు దగ్గరయితే అతన్ని మంచం మీంచి కిందకి దింపేసి దర్భలు పరిచిన నేల మీద దక్షిణంగా కాళ్ళు పెట్టి పడుకోపెడతారు. దేహం నేలకి ఆకాశానికి మధ్య ఇబ్బందిగా మంచం మీదుండకుండా నిరాటంకంగా నేల దుండాలి. దర్భ ఎలాగూ భూసారాన్ని పీల్చుకున్న రసమయమైన గడ్డి నిప్పుకీ ప్రియమయినది. దక్షిణ దిక్కు యముడి స్వంతం. పితృ దేవతలకీ అదే దిక్కు.

ఆ తరువాత కుడి చెవిలో వేద స్వరం నోటిలో పంచ గవ్యం. చనిపోయిన మనిషి దేహం మైల. సజీవమైన అవు మలం పవిత్రం. చూడండెలా వుందో. దశ దానాలు - నువ్వులు, ఆవు, భూమి, నెయ్యి, బంగారం, వెండి, ఉప్పు, బట్టలు, ధాన్యం, పంచదార. మనిషి చనిపోగానే మగ పిల్లలంతా స్నానం చేసి, పెద్దకొడుకు జందెం ఎడం వేపు చంక కిందికి మార్చుకుంటాడు. అశుభానికి సూచనగా. దేహానికి స్నానం చేయించి, విభూది రాసి, భూమి తల్లికి శ్లోకం చెబుతారు.


పేజీ ప్రక్కనే నున్నటి కాగితం మీద ఒక బొమ్మ వుంది. మైసూరు ఇళ్ళల్లో మాదిరిగా వున్నట్టు ఇంటి ముందు వరండా, వెనుక గోడకి కటకటాల కిటికి, వరండా నేల మీద స్నానం చేయించి అలంకరించి పడుకోబెట్టిన శవం. చనిపోయిన వాడు దేవుడు. అతని దేహం విష్ణువు, స్త్రీ అయితే లక్ష్మీ. దేవుడికి చేసినట్టు దానికి ప్రదక్షిణ, హారతి అన్నీ జరుగుతాయి.

ఇప్పుడిక యముడికి అగ్ని నర్పించి నేతి హవిస్సు వేస్తారు. శవానికి, అగ్నికి సంబంధం కోసం ఒక నూలు పోగు వుంచుతారు. శవం బొటన వేళ్ళని దగ్గరికి చేర్చి కట్టి, దాని మీద నూలు గుడ్డ కప్పుతారు.

దీని చిత్రం కూడా వుందక్కడ. అదే మైసూరులో మాదిరి ఇల్లు. కటకటాల కిటికీ, కాని ఒకరిద్దరు విభూతి పట్టెలు పెట్టుకున్న బ్రాహ్మణులు చిత్రంలో వున్నారు. ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తోంది. ఇంత దూరంలో వుండి చూస్తే మైసూరు విభూతి బ్రాహ్మణులందరి మొహాలు ఒక్కలాగే వుంటాయి అనిపించింది.

నలుగురు శవం మోసేవాళ్ళు. పాడె కట్టి ఇంటికి విముఖంగా శవం ముఖాన్ని తిప్పి, ఆఖరి వూరేగింపు బయలుదేరుతుంది.

ఇక్కడ మరొక చిత్రం. మైసూరు వీధే అది. సందేహం లేదు. నాలుగైదు ఇళ్ళు చిరపరిచితంగా అనిపించాయి. మూడు ప్రదేశాలలో వూరేగింపు ఆపి పాడె దింపుతారు. దానికి ప్రదక్షిణ చేసి క్షుద్ర దేవతలకి బియ్యపు గింజలు విసురుతారు.

వల్లకాటికి వచ్చాక దక్షిణ ముఖంగా చితి మీద దేహాన్ని వుంచి, బొటన వేళ్ళ ముడి విప్పి, కప్పిన తెల్ల గుడ్డ తీసి, దాన్ని శ్మశానంలో చండాలుడికి దానం చేస్తారు. కొడుకు, సంబంధీకులు శవం నోట్లో నీళ్ళు చిలకరించిన అక్షింతలు వేస్తారు. బంగారు నాణెంతో దాని నోరు మూస్తారు. నడుము కింద చిన్న· అరటాకో, గుడ్డ పీలికో తప్ప పుట్టినప్పుడున్నట్టుగానే వుంటుంది అప్పుడూను. బంగారం, ఈ కాలంలో ఎక్కడ దొరికిందో తెలీదు. పద్నాలుగు కారెట్లయితే ఫరవాలేదా? వేదసమ్మతమేనా?

పెద్ద కొడుకు కొత్త కుండలో నీళ్ళు నింపి, దాని పక్కగా చిల్లు చేసి, భుజం మీద పెట్టుకుని, చితి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, నీళ్ళు నేలమీద పోస్తాడు. మూడు సార్లయ్యాక భుజం వెనుకగా దాన్ని విసిరేసి పగలకొడతాడు.

వల్లకాటి చిత్రం కూడా ఒకటుంది అందులో. దాన్ని చూసి ఇతని మనసు కలిచి వేసినట్లయింది. ఎందుకో అంతా చిరపరిచితంగా వుంది. మంచి కేమేరాతో తీసిన చిత్రం. చితి, దేహం, తల బాదామి ఆకారపు కావు మధ్యవయస్కుడి భుజం మీద కారుతున్న కుండ ఇతరులు.

దూరంగా చెట్లు అరె, ఈ మధ్య వయస్కుడి మొహం బాగా తెలిసినట్లుందే! దాయాది సుందర్రావు మొహమే. హుణసూరులో స్టూడియో వుందాయనకి. ఇక్కడెందు కుంది ఆయన ఫొటో? ఈ ఛండాలుడు ఇక్కడకెక్కడ్నుంచి వచ్చాడు? పక్క పేజీలో చితి మండుతున్న చిత్రం. దానికింద అగ్నికి చెప్పిన మంత్రాలు.

"అగ్ని దేవుడా ఇతని దేహాన్ని కాల్చకు, చర్మాన్ని కాల్చకు. ఇతన్ని పక్వం చేసి పితృ దేవతల దగ్గరికి చేర్చు. అగ్నిదేవుడా! నువ్వు ఈ యజమాని యజ్ఞంలో పుట్టావు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇతను పుట్టుగాక!

మంత్రం సగంలో ఆపేసి మళ్ళీ అతను వెనుక పేజీ తిప్పి దాయాది సుందర్రావుగారి మొహం ఓసారి చూశాడు. తెలిసిన మొహమే. కళ్ళజోడు తీసేశాడు. సగం నెరిసిన పూర్తి కాపు బదులుగా, కొద్దిగా శాస్త్రానికి తీయించిన బాదామి కాపు. కొత్తగా సర్వాంగ క్షవరం చేయించుకున్నాడు. రొమ్ము మీద వెంట్రుకలు కూడా లేవు. బొడ్డు కిందకి మేలుకోట మడి పంచె. ఇతడెందు కొచ్చాడిక్కడికి? ఈ పుస్తకంలోకి?

మున్నుడి చూశాడు. అందులో ఈ ఫెర్గూసన్ ఫోర్డ్ విద్యార్థి వేతనపు సాయంతో మైనూరికి 1966 68లో వెళ్ళినట్టుగా తెలిసింది. మైసూర్లో మ. సుందరరావుగారు, ఆయన కుటుంబము విషయ సంగ్రహణకి చాలా సహాయం చేసుకున్నట్లుగా వుంది. అందుకే మైసూరు ఇళ్ళు కనిపించాయన్న మాట! మళ్ళీ బొమ్మలన్నీ పరిశీలనగా చూశాడు. ఆ కటకటాల కిటికీ ఇల్లు ఆ పక్కిళ్ళు గోపీ ఇల్లు సంపంగి చెట్టున్న గంగమ్మ ఖాళీ ఇల్లు - తమ ఇంటి వీధి, ఆ వరండా తన ఇంటి వరండా శవం తండ్రిదయి వుండొచ్చు. మొహం సరిగ్గా కనిపించలేదు. వంకరబోయిన మొహం. పారే నీటిలో చూసే మొహంలా వుంది. వొంటి నిండా తెల్లటి గుడ్డ కప్పి వుంది. బ్రాహ్మణులూ తెలిసిన వారిలాగే వున్నారు.

మళ్ళీ మున్నుడి చదివాడు.

సుందర్రావుగారు చాలా సహాయం చేశారు. తమ సంబంధీకుల ఇంట్లో పెళ్ళి. ఒడుగు, సీమంతం, ఉత్తరక్రియలు అన్నిటికి తీసికెళ్ళి, ఫోటోలు తియ్యడానికి సాయం చేసి, ప్రశ్నలడిగి సమాధానాలు రాసుకోడానికి, మంత్రాలను టేన్లికార్డు చేసుకోడానికి వీలు కల్పించారు. ఇంట్లో భోజనం పెట్టారు. ఆయనకి ఈ మ్లేచ్చుడు చాలా కృతజ్ఞతలు వెలిబుచ్చాడు. మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు. మండుతోంది. దాని క్రింద అగ్నికి చెప్పే మాటలు. చెట్లు, చేమలు, మైసూరు శ్మశానంలో వున్నట్టే వుంది. క్రింద సన్నటి అక్షరాలతో కృతజ్ఞత : సుందర్రావుగారి స్టూడియో అని వ్రాసుంది. అతనే తీసిన చిత్రం.

అతని తండ్రి చనిపోవడంతో దాయీది సుందర్రావు కర్మ చేశాడు. కొడుకు పరదేశంలో వాళ్ళమ్మ తెలియజేయడానికి ఒప్పుకోలేదేమో. దూర దేశంలో వంటరిగా వున్నాడు. తండ్రి లేని నిస్సహాయుడు. దుర్వార్త తెలిపితే ఏమవుతాడో ఏమో. వెళ్ళిన పని పూర్తి చేసుకుని రానీలే అని వుండాలి. లేకపోతే, ఈ సుందర్రావే ఆ సలహా ఇచ్చి వుండాలి. అతని మాటంటే గురి అమ్మకి. పక్షవాతం వల్ల చెయ్యి స్వాధీనం లేక నాన్న వుత్తరాలు రాయడం లేదని సర్ది చెప్పింది అమ్మ రెండేళ్ళ క్రితం. ఇతను ఇక్కడి కొచ్చిన మూడు నెల్లకంతా జరిగిందన్నమాట. ఇక అమ్మనేం చేశారో! ఆచార వంతులంతా చేరి జుట్టు తీయించేశారా? సుందర్రావు మీద ఒళ్ళు మండుకొచ్చింది. నీచుడు, చండాలుడు మళ్ళీ మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు. కటకటాల కిటికి, ఆ శవం, సుందర్రావు బాదామి క్రాపు, బొడ్డు చూశాడు. వర్ణన చదివాడు.

వెనక, ముందు పేజీలు తిప్పాడు. కంగారులో పుస్తకం లైబ్రరీ నేల మీద పడింది. తలక్రిందులుగా ఆ పేజీలు కలిసిపోయాయి.

కంగారుగా పుస్తకం పైకి తీసి సరిచేసి తిరగేశాడు. మళ్ళీ తిరగేశాడు. అంతవరకూ ఏమీ మరింకే ధ్యాస లేని అతనికి కారిడార్ కొసలో వున్న అమెరికన్ కక్కసులో ఎవరో ఫ్లష్ చేసిన నీరు జలపాతపు చప్పుడులా భోరుమని పైకి లేచి దిగిపోయి ఇంకిపోవడం వినిపించింది.

పేజీ తిప్పాడు. సీమంతపు అధ్యాయంలో సీతలాగా వేషం వేసుకుని, తలకి కిరీటం పెట్టుకుని చాలామంది ముత్తైదువుల మధ్య కొద్దిగా మూతి వంకరగా పెట్టుకుని కూర్చుంది దాయాది సుందర్రావు కూతురు దమయంతి. తొలి చూలు. ఏడు నెలల పొట్ట కనిపిస్తోంది. ఈ సుందర్రావు ఎలానూ ఒక అమెరికన్ వచ్చాడు కదా, ఇదే మంచి సమయం ఫోటో తీయిద్దాంలే అని కూతురికి కడుపు రావడం కోసమే కాచుకుని సీమంతం చేయించి వుండాలి. ఉత్తర క్రియలు చూపిద్దామని కాచుకున్నాడేమో పెద్దనాన్న ఇంట్లో వీలు దొరికింది.

వాడుకున్నాడు. ఎంత డబ్బిచ్చాడో ఆ ఫెర్గూసన్ మానవుడు. ఆ ముత్తైదువల మధ్య అమ్మ మొహం కోసం వెతికాడు. కనబడలేదు.సంపంగి చెట్టు గంగమ్మ, అవతలి ఇంటి లచ్చమ్మ వున్నారు. అవే మొహాలు. ముక్కుపుడక, దుద్దులు, పైసా వెడల్పు బొట్టూనూ. ఆత్రంగా అనుక్రమణిక పేజీ తిప్పాడు. వకారం, వికారం, వుకారం దాటి,'వై' దాటి, వేదాలు వేష భూషణాలు దాటి, వైఖానస, వైదిక అనుక్రమణికలో వైధవ్యం దొరికింది. వైధవ్యం మీద మొత్తం ఒక అధ్యాయం వుంది. వుండదామరి. అందులో 233 వ పేజీ ఎదుట ఒక పొగసైన ఫోటో.

హిందూ విధవ. కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం తల మీద జుట్టు పూర్తిగా తీయబడి వుంది.అంటూ వున్నదున్నట్టు శీర్షిక. కృతజ్ఞత సుందర్రావుగారు, స్టూడియో : హుణసూరు. అమ్మ ఫొటో నా అది? తెలిసిన మొహమే. అయినా అపరిచితంగా వుంది. గుండు గీయించుకున్న తల. దాని మీద ముసుగు. అది నలుపు-తెలుపు చిత్రమే అయినా ఇతనికి తెలుసు అది ఎర్ర చీరని మాసిన చీరె.... సుందర్రావుగారు పసిఫిక్ సాగారానికి అవతల, 10,000 మైళ్ళ దూరంలో వున్న హుణసూరు బెలువాంబా అగ్రహారం వెనకాల సందులో నివసిస్తున్నందువల్ల ఆ రోజు బ్రతికిపోయారు


**************0****************


నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు ప్రచురించిన కథా భారతి కన్నడ కథానికలు పుస్తకం నుండి సేకరించబడింది.



రచయిత పరిచయం: డా.. ఎ.కె. రామానుజన్ జననం 1929, మైసూరు. మైసూరు విశ్వవిద్యాలయం, పూనా డెక్కన్ కాలేజీలలో విద్యాభ్యాసం. ఇండియానా విశ్వవిద్యాలయం వారి పిహెచ్.డి పట్టా 1963. ఇప్పుడు చికాగో విశ్వవిద్యాలయంలో ద్రావిడ భాషాధ్యయనంలో ప్రాధ్యాపకులు. హెూక్కుళల్లి హూవిల్ల (కవితా సంకలనం), హళదిమీను (అనువాద నవల) సామెతలు - కన్నడ గ్రంధాలు, The strides, Relation(కవితా సంకలనాలు), Speaking of Shiva, The Interior Landscape మరికొన్ని - ఇంగ్లీష్ రచనలు.