కొత్తగా ఏదైనా చదవడం తెలుసుకోవడం నాకిష్టం. ఒక కవితా సమీక్ష లో మోటిఫ్ అనే పదం చదివాను. అంటే ఏమిటి అని వెతికాను. వివరణ చదివిన తరువాత మోటిఫ్ ప్రక్రియలో నేను ఒక కథ కొన్ని కవితలు రాసినట్లు స్ఫురణకు వచ్చింది.
మోటిఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది?
అసలు మోటిఫ్ అంటే ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా?
మోటిఫ్ అంటే కేంబ్రిడ్జ్ నిఘంటువు ప్రకారం నమూనా అని అర్ధం . మోటిఫ్, థీమ్ , ప్యాటర్న్ , టాపిక్ , డిజైన్ పదాలకు ఇటీవలి పర్యాయపదాల ఉదాహరణలు
ఒక నిర్దిష్ట కథలో పదేపదే కనిపించే చిత్రం, ధ్వని, పదం లేదా చిహ్నం వంటి పునరావృత నమూనానే మూలాంశం అంటారు. అదే మోటిఫ్.
రచయితలు, కవులు ఈ విషయాన్ని తెలుసుకుని వుండాలి.
థీమ్ ని బలోపేతం చేస్తుంది. కథ యొక్క మూల సందేశాన్ని పాఠకులకు గుర్తు చేస్తూ దాన్ని మరింత లోతుగా వివరిస్తుంది. కథలోని వివిధ సంఘటనలను పాత్రలనూ ఒకదానితో ఒకటి ముడిపెడుతుంది. కథలో ఒక నిర్దిష్టమైన మూడ్ లేదా భావోద్వేగాన్ని కలుగజేస్తుంది.
థీమ్ ని వివరించడానికి కథ పొడుగునా మళ్ళీ మళ్ళీ వచ్చే అంశం. కథ ప్రతి కీలక మలుపులోనూ ఇది కనిపిస్తుంది.
ఉదాహరణకు.. నేను రాసిన “కుబుసం” కథలో ఇది కనబడుతుంది. నీలంపు పువ్వు అనే కవితలో కనబడుతుంది.
కథ చదవండి. ఎక్కడెక్కడ మోటిఫ్ కనబడుతుందో చెప్పండి ధన్యవాదాలు 🙏
కథ ఈ లింక్ లో చదవండీ .. “కుబుసం”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి