భాగ్యశాలి - వనజ తాతినేని
నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వారి పట్ల
నా తిరస్కరణ బలంగా వుంటుంది
అలాగే కాసింత సానుభూతి దయ కూడా వుంటుంది.
మనుషులు యెందుకిలా యాచిస్తారు అని.
పెళ్ళి భౌతిక అవసరం
ప్రేమ మానసిక అవసరం.
వారికి యే అవసరాలు చెలరేగుతాయో యేమో!
వారి ఊహల్లోనే వారిని జీవించనీ
కాదన్న నా పాపానికి నిష్కృతి లేదు
ప్రియతమా!
నా పాపంలో మూడొంతుల భాగం నీదే
నీ ఉదారం వల్ల నాకు భిక్షాటన తప్పింది
22/10/2026. 03:50 am
English Translation
*The Fortunate One*
My rejection is strong
towards those who say they love me,
and yet, there is a little sympathy, a little mercy too -
Why do people beg like this?
Marriage is a physical need,
Love is a mental need.
What needs flare up in them, who knows!
Let them live in their own imaginations.
There is no atonement for my sin of saying 'no'.
My dearest!
Three-fourths of my sin is yours -
Because of your generosity,
I was spared from begging for love.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి